సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

కమలేకమలాలయే

కమలేకమలాలయే
ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా.ఉదాహరణకి ఈ లక్ష్మి మంత్రాన్ని చూడండి. ఎంతో అపురూపమైన ఈ మంత్రాన్ని ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు సిద్ధిని, లబ్దిని, దివ్యానుభూతిని పొందవచ్చు. 

కమలేకమలాలయే ! ప్రసీద !ప్రసీద ! శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా !!
ఈ మంత్ర స్వరూపాన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకుందాం.మంత్రాలలో సర్వ సాధరణంగా వుండేది 'ఓం'. ఓంకారానికి అనేక అర్ధాలున్నాయి. అందులో ఒకటి, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే Hello to Divine Plane. ఎప్పుడు కొత్త Software నేర్పినా మొదట "Hello World!" అనే program తో మొదలవుతుంది. అలాగే మంత్రం కూడా ఓంకారంతో మొదలవుతుంది. "ఓం" అనగానే దేవతామండలానికి సంకేతం వెడుతుంది. "శ్రీం" అనగానే అది లక్ష్మికి సంబంధించిన తలానికి చేరుతుంది. "హ్రీం" అనగానే జగత్తంతా సర్వవ్యాపకంగా వున్న ఆ పరాశక్తి, "భువనేశ్వరి" శక్తిని మన మంత్రం ప్రచోదనం చేస్తుంది. ఆ విధంగా మంత్రంలో వున్న అక్షరాలు ఒక IP Address లా, ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఫోన్ నంబర్ లా ఆయా తలాలలోకి ప్రయాణిస్తాయి. బీజాక్షర ప్రభావం మహాశక్తిని అనంత సృష్టిలోనూ, మనో శక్తిని అంతర్లీనంగా సాధకునిలోనూ ప్రేరేపించి మనిషిని మనీషిగా తీర్చి దిద్దుతుంది.మంత్ర ఉపాసకుడైన వ్యక్తి ఆవిధంగా Internet తో connect అయిన computer లా విశ్వంతో అనుసంధానం కాగలడు. ఉపాసన సిద్ధించినపుడు దార్శినికుడై,'నేను ' అనే తన చిన్న పరిధిని దాటి మహావిశ్వరహస్యాలనర్ధం చేసుకోగలడు ఏ కొత్త విషయాన్నైన వెంటనే గ్రహించగలడు. అట్టి యోగి అనంతప్రకృతి ప్రణాళికలో భాగం కనుక Google లో వెతికి కనుక్కున్నట్టు విశ్వ జ్ఞానభండారంలోంచి విషయాలని తెలుసుకోగలడు. ఒకటి Internet ఇంకోటి Innernet. లలితా సహస్రనామంలో అందుకే ఈ రహస్యాన్ని చెపుతారు - ''అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా'' అని. మనిషిలో అంతర్లీనంగా వున్న ఆ అమ్మని గుర్తించి ఆరాధిస్తేనే ఆమె దొరుకుతుంది, మరే బాహ్య అట్టహాసాలకి ఆ జగజ్జనని పట్టుబడదు అని అర్ధం.

No comments:

Post a Comment