సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, August 17, 2014

శివసిద్ధి

శివసిద్ధి

శివసిద్ధి!!
ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది.మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణంఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే-శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడేధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే '#శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడుభక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన పరమపదం

శివ మానస పూజ

http://tvramudu.blogspot.com/పంచామృతo
శివ మానస పూజ
దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము అని మనకు ఒక కవి[#బసవణ్ణ]శంకరుల సందేశాన్ని చెప్పారు కూడా. మానసిక సంకల్పము, మానసిక శుద్ధి ఉంటే చాలండి. దాని కోసమే కదా ఈ బాహ్య శుద్ధి (ఆచారము, నియమము, ఉపచారములు, నిష్ఠ లాంటివి)?. మనము తప్పు చేస్తున్నామో లేదా సరైన మార్గంలో ఉన్నామో మన మనస్సుకు తప్పకుండా తెలుస్తుంది. దానిని మీరు బయటికి చెప్పకర్లేదు. మీ పనులలో చూపిస్తే చాలు. చరాచరమైన ప్రతి వస్తువు, ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. అద్వైత సిద్ధాంత సారమిదే. 'స్థావర జంగమ రూప' అని వాగ్గేయకారులు ఆ రాముని స్తుతించినా, 'ఆత్మా త్వం' అని శంకరులు కింది విధిన శివుని పూజించినా అన్ని ఆ నిరాకర, నిరామయ, నిరంజనునికే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవః ప్రతి గచ్ఛతి'' ఆకాశాన్నుంచి కింద పడిన ప్రతి నీటి బిందువు వాగు, వంక, సెలయేరు, నది ద్వారా సాగరంలో కలుస్తుంది. అలాగే ప్రతి దేవతకు చేసే నమస్కారము ఆ కేశవునికే.

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం
తాత్పర్యం: ఓ దయానిధి! పశుపతి! రత్నాలతో కూడిన ఆసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, ఎన్నో రకాల రత్నాలతో అలంకరించి, చందనం పూసి, సుగంధ జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతో అలంకరించి, ధూపం, దీపం అన్ని మానసికం గా సమర్పించాను, స్వీకరించు.

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురూ
#తాత్పర్యం: ఓ ప్రభూ! నవరత్నాలతో అలంకరిచిన బంగారు పాత్రలో నెయ్యి వేసిన తీయని పాయసం, భక్ష్యాది ఐదు రకాల వంటకాలతో, పాలు, పెరుగు, అరటి పండు, పానకము, ఫల రసాలు, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరం కలిపిన తీయని నీరు, తాంబూలం - ఇవన్ని మానసికంగా భక్తితో సమర్పిస్తున్నాను, స్వీకరించు.

ఛత్రాచామరయోర్యుగం వ్యజనకం చా దర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో
#తాత్పర్యం: ఓ ప్రభూ! ఛత్రము (గొడుగు), రెండు చామరాలు, చల్లనిగాలికోసం వింజామర, శుద్ధమైన అద్దం, వీణా వాదన, మృదంగాది ఇతర వాద్య ఘోషలు, పాట, నృత్యం మరియు సాష్టాంగ నమస్కారముతో కూడిన ఎన్నో రకాల స్తుతులు - ఇవన్ని సంకల్పము ద్వారా మానసికంగా సమర్పిస్తున్నాను స్వీకరించు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
#తాత్పర్యం: ఓ శంభో! నా ఆత్మయే నీవు; పార్వతి దేవియే నా బుద్ధి; నీ సహచరులు నా ప్రాణాలు; నా దేహమే నీ దేవాలయం; ప్రాపంచిక సుఖాలు, భోగాలు అన్నీ నీ పూజలు; నా నిద్రే సమాధి స్థితి; నా కదలికలు అన్నీ నీకు ప్రదక్షిణాలు; నా మాటలన్నీ నీ స్తోత్రాలు; నేను చేసే కర్మలన్నీ నీ ఆరాధనయే.

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
#తాత్పర్యం: ఓ మహాదేవ! శంబో! కరుణానిధీ! నా చేతులు, పాదములు, మాటలు, కర్మలు, చెవులు, కళ్లు, మనసు ద్వారా తెలిసీ, తెలియక చేసిన అపరాధాలు అన్ని క్షమించు. నీకు జయము జయము.


నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!