
సాయి స్మరణం
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
నీ శిశువును దీవించుము సాయి !
నా మెఱలను వినుము
నాలో భక్తిని స్థిరపరుచుము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
నీ శిశువును దీవించుము సాయి !
నా మెఱలను వినుము
నాలో భక్తిని స్థిరపరుచుము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
నా బాధలు తీర్చుము సాయి
ఆనందము నాలో చిలుకుము
నా పాపల ప్రార్ధన వినుము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
ఆనందము నాలో చిలుకుము
నా పాపల ప్రార్ధన వినుము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయినామమే జీవనము సాయి స్మరణమే ప్రార్ధనము
సాయి ఆరాధనలే ఆనందము సాయి పలుకులే కీర్తనము
సాయి దర్శనమే భాగ్యము సాయి లోకమే స్వర్గము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయి ఆరాధనలే ఆనందము సాయి పలుకులే కీర్తనము
సాయి దర్శనమే భాగ్యము సాయి లోకమే స్వర్గము సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయినామమను పలకరించుటే తృప్తి
సాయి మార్గమును ఆచరించుటే మనఃశాంతి
సాయిరూపమే భగవంతుని అవతారము
సాయిరామే అoతము సాయిరామే విశ్వము
సాయిరామే కరుణమూర్తి,సాయి రామే వివేక స్పూర్తి సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయి మార్గమును ఆచరించుటే మనఃశాంతి
సాయిరూపమే భగవంతుని అవతారము
సాయిరామే అoతము సాయిరామే విశ్వము
సాయిరామే కరుణమూర్తి,సాయి రామే వివేక స్పూర్తి సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయియే సత్పవర్తన సాయియే మోక్షమార్గము
సాయియే కర్తవ్యము సాయియే పరమ సత్యము
సాయియే ఏసుక్రీస్తు సాయియే హిందుమనుజుడు
సాయియే ఇస్లాం దేవుడు సాయియే అoతరాత్ముడు సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయియే కర్తవ్యము సాయియే పరమ సత్యము
సాయియే ఏసుక్రీస్తు సాయియే హిందుమనుజుడు
సాయియే ఇస్లాం దేవుడు సాయియే అoతరాత్ముడు సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!
సాయియే బ్రహ్మ,విష్ణు మహేశ్వరుడు
సాయియే నిరాడంబరుడు,సాయియే మాతా పీతా గురు దేవుడు
సాయియే ప్రాణ జీవుడు,సాయియే ఆత్మారాముడు సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!!
సాయియే బ్రహ్మ,విష్ణు మహేశ్వరుడు
సాయియే నిరాడంబరుడు,సాయియే మాతా పీతా గురు దేవుడు
సాయియే ప్రాణ జీవుడు,సాయియే ఆత్మారాముడు సాయీ
నను దీవించు సాయి ! నను దీవించు సాయి!!
No comments:
Post a Comment