ఆంజనేయునికి హనుమన్నామము – దేవతల వరములు

వాయుదేవుడు బాలుని ఎత్తుకుని గుహలోకి వెళ్ళిపోయేను. ఇంద్రునిపై తీవ్ర కోపము కలిగెను. వెంటనే అతడు తన గతిని బంధిచేను. వాయుప్రసారము లేకపోవుటతో ప్రపచంమంతటా కల్లోలము బయలుదేరును. ముల్లోకములలోనూ ఏదిను కదలుట లేదు. అందరి శ్వాస కార్యములనూ బంధింపబడిపోయ్యాయి. దేవతలు భయపడిపోయారు. మహేంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. బ్రహ్మదేవుని సమీపించి విషయములను వివరించారు. దేవతా ప్రముఖులను వెంటపెట్టుకొని ఆ పర్వత గుహలోకి వచ్చి, బాలుని స్పర్శించుసరికి అతడు ఆనందముతో లేచినిలబడ్డాడు. దానితో వాయు దేవుడు పరమానంద సంభరితుడయ్యెను. వెంటనే జగత్తు అంతయు ప్రాణవాయు సంచరించింది. బ్రహ్మదేవుడు అమరులనుద్దేశించి”ఈ బాలుడు సాధారణుడుకాదు. దేవతాకార్యసిద్ధ్యర్ద అతరించినాడు. కనుక దేవలందరూ ఇతనికి వరములను ఇవ్వాలి అనెను. అంతలో మహేంద్రుడు ఆనందపారవశ్యమున “నా వజ్రముల వలన ఇతని హనువు భగ్నమైనది కనుక నేటిను౦డి ఇతడు హనుమంతుడని పిలవబడగలడు. నా వజ్రము వలన ఇతనికి ఎన్నడునూ ఏ అపాయము కలగదు అనెను. “నా శతాంశతేజమును ఇతనికి ఇచ్చుచున్నాను. నాశక్తితో ఇతడు తన రూపమును అభిష్టప్రకారము మార్చుకొనగలడు. ఇతనికి శాస్త్రాధ్యయనేచ్చ కలుగనని నేను అతనిచే సమస్త శాస్త్రములనూ అధ్యయనము చేయించెదను. ఇతడు మహావాజ్మియుడు అవును అని సూర్యభగవానుడు పలికాడు. అదే విధముగా వరుణ, కుబేర విశ్వకర్మాది దేవతలందరూ బాలహనుమంతునకు వరములను ప్రసాదించిరి. బ్రహ్మదేవుడు వరములను ఇస్తూ ఈ బాలుడు బ్రహ్మజ్ఞానియై, బ్రహ్మస్త్ర బ్రహ్మపాశవిముక్తుడైయు౦డుగాక!” అని ఆశీర్వదించి, వాయుదేవుని ఉద్దేశించి “నీ కుమారుడు మహా వీరుడై, స్వేచ్చా రుపధారణా సమర్ధుడై, అప్రతిహత గతికలవాడై, అమరకీర్తితో ప్రఖ్యాతి చెందును. రాబోవు రామరావణ సంగ్రామ రంగములో ఇతడు రామసహాయకుడై ఆ మహాత్మునకు అత్యంత ప్రేమపాత్రుడు కాగలడు” అని తెలిపి స్వస్తానమునకు వెళ్ళిపోయిరి. ఈ రీతిగా హనుమంతునకు వరములను ఇచ్చి దేవతలు తమ తమ నెలవులకు వెళ్ళిపోయిరి.

![[పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది . తలనుండి కాలి బొటనవేలివరకూ సమానము గా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ , ఆడ రూపాలు ఒకటిగా ఉండడము . అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది . తల ఆలోచనకి , పాదము ఆచరణికి సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట .
లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా సెరిగగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది .
పరమేశ్వరుని , అంబికను ఏకభావముతో , భక్తితో సేవించాలి . అప్పుడే అధిక శుభము కలుగుతుంది . ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి.]
#అర్ధనారీశ్వరుడు లయకారుడు
శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ) గా పండితులు చెబుతారు.
ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.
#ఆది దంపతులు - జగత్పితరులు
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు.
ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.](https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-xap1/v/t1.0-9/s851x315/1452144_672206152823958_1975221553_n.jpg?oh=412686a242e2b11b1af8aea69e4d809c&oe=54F2E8A7&__gda__=1421628910_e9062a65c33cfee4eaf024a0bfcd2c16)