సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 25, 2014

‎తిరుమలలో‬ కొప్పెర.

తిరుమలలో‬ కొప్పెర..
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ ‪‎హుండీ‬ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి‬ ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది. పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు‬ ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెరవాళ్ళని, వాళ్ళు నివశించే పల్లెకు "‪‎కొప్పెరవాండ్ల‬ పల్లి'' అనే పేరు వచ్చిందంటారు. శ్రీనివాసా మంగాపురం వెళ్ళేదారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది.
హుండీలో భక్తులు‬ వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును "పరకామణి'' అంటారు.ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని "తోకముల్లె‬'' అని అంటారు. కొప్పెరలో మనడబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని #శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.

తిరుమల పదం విశేశములు

తిరుమల పదం విశేశములు

తిరుమల పదం విశేశములు


తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు’ (పవిత్ర), ‘మల’ (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం’ అని అనువదించబడింది.
1.తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.
2. కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆ భక్తుడు తయారు చెసిన పాదరక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి. ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించుకోవాలి. అక్కడ రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు. దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే [అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి. భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో తమ చెడుఖర్మలు నశించటమేకాదు, తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది. దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవం అర్ధమవుతుంది.
3.ఆ తరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ. ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము, ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటం లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం. దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆ వికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆ శిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది. ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది. [గుండు చేయించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి, ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది.
4.అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆ కొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆ తన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్ర సఫలమవుతుంది. ఆ తరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి. ఇలా వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.
5. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను, ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే. కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు. భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు. అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని, అక్కడ అసౌకర్యాల పట్ల గమనికే వుండదు. కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా అని వెతుకుతుంటాము.

శ్రీవేంకటేశ్వరుని‬ సందేశము

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
దివ్యమంగళకరం శ్రీవేంకటేశ్వరుని రూపం - ఆత్మజ్ఞానప్రబోధకరం.
ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం.
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు.
మానవశరీరంలో జగన్మాత కుండలినీరూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి. ఈ పారమార్ధిక అంతరార్ధతత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది. ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధారపద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం.
ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే.

శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం

శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం
క్షేత్ర వైభవం

శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి,అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర .
వరాహపురాణాంతర్గత శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామం
ధ్యానం
1) శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ||
2) శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం ||
శ్రీతచేతనమందారం శ్రీనివాసమహంభజే .
ధ్యానం
1) శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం |
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ||
2) శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం |
శ్రీతచేతనమందారం శ్రీనివాసమహంభజే ||

స్తోత్రం
1) ఓం నమో వేంకటేశాయ శేషాద్రినిలయాయ చ |
వృషదృగ్గోచరాయ అథ విష్ణవే సతతం నమః ||
2) సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః |
మేరుపుత్రగిరీశాయ సరస్స్వామితటీజుషే ||
3) కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ |
సువర్చలాసుతన్యస్తసేనాపత్యభరాయ చ ||
4) రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ |
త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే ||
5) హరిచందనగోత్రేంద్రస్వామినే సతతం నమః |
శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమోనమః ||
6) వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః |
అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే వేంకటాయ చ ||
7) సనకాదిమహాయోగిపూజితాయ నమోనమః |
దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే ||
8) శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ చ |
శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ చ ||
9) సానుస్థాపితతార్క్ష్యాయ తార్క్ష్యాచలనివాసినే |
మాయాగూఢవిమానాయ గరుడస్కంధవాసినే ||
10) అనంతశిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః |
అనంతచరణాయ అథ శ్రీశైలనిలయాయ చ ||
11) దామోదరాయ తే నిత్యం నీలమేఘనిభాయ చ |
బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ తే నమః ||
12) వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ చ |
అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ చ ||
13) వాసుదేవాయ హరయే తీర్థపంచకవాసినే |
వామదేవప్రియాయ అథ జనకేష్టప్రదాయ చ ||
14) మార్కండేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ చ |
వాక్పతిబ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే ||
15) నారాయణనగేశాయ బ్రహ్మక్లుప్తోత్సవాయ చ |
శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ||
16) ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమోనమః |
కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే ||
17) అర్థితార్థప్రదాత్రే చ విశ్వతీర్థాఘహారిణే |
తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే ||
18) కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ చ |
జామదగ్నసముద్భూతపోత్రిణే కూర్మమూర్తయే ||
19) కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే విభవే నమః |
వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమోనమః ||
20) సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ |
సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమోనమః ||
21) కుముదాక్షగణశ్రేష్ఠసైనాపత్యప్రదాయ చ |
దుర్మేధఃప్రాణహర్త్రే చ శ్రీధరాయ నమోనమః ||
22) క్షత్రియాంతకరామాయ మత్స్యరూపాయ తే నమః |
పాండవారిప్రహర్త్రే చ శ్రీకరాయ నమోనమః ||
23) ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యాతమూర్తయే |
రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే ||
24) లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే |
శాలగ్రామనివాసాయ శుకదృగ్గోచరాయ చ ||
25) నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ చ |
మృగయారసికాయ అథ వృషభాసురహారిణే ||
26) అంజనాగోత్రపతయే వృషభాచలవాసినే |
అంజనాసుతదాత్రే మాధవీయాఘహారిణే ||
27) ప్రియంగుప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ |
నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ చ ||
28) శంకరప్రియమిత్రాయ చోళపుత్రప్రియాయ చ |
సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే మధుఘాతినే ||
29) కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ చ |
వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః ||
30) త్రివిక్రమాయ మహతే హృషీకేశాయ తే నమః |
అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ ||
31) నమః క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే |
ముకుందాయ నమో నిత్యం అనంతాయ నమోనమః ||
32) విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ తే నమః |
సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టప్రదాయినే ||
33) హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే |
గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః ||
ఇతి వరాహపురాణాంతర్గత శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామ స్తోత్రం సంపూర్ణం ||

‪అందరివాడు‬ ఆపదమొక్కులవాడు

అందరివాడు‬ ఆపదమొక్కులవాడు గోవిందుడు అందరివాడు!!
తిరుమల గిరులలో వెలసిన కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
“  వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన ! 
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!  ”
తిరుమల గిరులలో వెలసిన కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన ! 
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !! ”

భగవంతుడే సర్వానికీ యజమాని, అందుకు వేదాలే ప్రమాణమం అందరినీ ‪‎రక్షించువాడు‬ ఆ పరమాత్ముడే, ఆపద సమయంలో అందరికీ ముందుగా ‪‎వేంకటేశ్వరస్వామి‬ పేరే గుర్తుకు వస్తుంది. అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు. ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు.‪‎గోవింద‬ నామ స్మరణం సర్వపాపహరణం.భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పాఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.‪‎పూర్వజన్మ‬ పుణ్యఫలమే తప్ప, మరేమీ కాదు. ఏడు కొండల వాడు భక్త పరాధీనుడు కావున తన భక్తులను ఆదుకోవడానికి భక్తులు ఎక్కడికి ఏ రూపం లో రమ్మని అడిగితే అక్కడ ఆ రూపంలో వెలిసే భక్తానుకంపుడు ఆ శ్రీనివాసుడు.

శ్రీ‬ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్

శ్రీ‬ లక్ష్మీ నృసింహ స్తోత్రమ్
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
శ్లో|| శ్రీమత్ప యోనిధి నికేతన చక్రపాణే! భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే !
యోగీ శ శాశ్వత శరణ్య! భవాబ్ది పోత! లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||
తాత్పర్యం: పాలసముద్రము నివాసముగాగల ఓ దేవా! హస్తమున చక్రమును ధరించినవాడా ! ఆది శేషుని పడగలయందలి రత్నములచే ప్రకాశించు దివ్య దేహము కలవాడా! యోగులకు ప్రభువైన వాడా! శాశ్వతుడా! సంసార సాగరమునకు నావ యగువాడా! లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.
శ్లో || బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క కిరీటకోటి - సంఘటి తాఘ్రి కమలామల కాంతికాంత
లక్ష్మీ ల సత్కుచ న రో రు హరాజహంస - లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలమ్బమ్ ||
‪#‎తాత్పర్యం‬: బ్రహ్మ, దేవేంద్రుడు, శివుడు, వాయుదేవుడు, సూర్యుడు అను దేవతల కిరీటముల అంచులచే తాకబడిన పాదపద్మముల కాంతిచే ప్రకాశించు వాడా! లక్ష్మీ దేవి యొక్క అందమైన స్తనములనెడి తామర మొగ్గలకు రాజహంస యైన వాడా! ఓ లక్ష్మీ నృసింహాదేవా! నాకు చీయూత నొసగుము.
శ్లో || సంసార సాగర విశాలాక రాళ కాల - నక్ర గ్ర హగ్ర సన నిగ్ర హ విగ్ర హాస్య |
వ్యగ్ర స్య రాగర సనో ర్మి నిపీడిత స్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగ బడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టి నాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.
శ్లో || సంసార ఘోర గహనే చరతో మురారే ! మారో గ్రభీ కర మృగ ప్రచురార్ధి తస్య |
ఆర్తస్య మత్సర నిదాఘుణి పీడితస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను. అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండువేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు రావలంబన మిచ్చి కాపాడుము.
శ్లో|| సంసార కూప మటి ఘోర మగాధ మూలం - సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య ,
దీన స్య దేవ కృపాయా పద మాగాతస్య - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగు పాడునుయ్యి . నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా! దీనుడనైన నాకు చేయూతనిచ్చి యుద్ధరింపుము.
శ్లో|| సంసార భీకర కరీన్ద్ర కరాభి ఘూత - నిష్పిష్ట మర్మవ వపుషః సకలార్తి నాశః
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: దుఃఖములన్నింటిని నశింపజేయునట్టి దేవా! నేను సంసారమనెడి భయంకరమగు ఏనుగునకు చిక్కితిని. అది తొండముతో కొట్టి నా శరీరమును మిక్కిలి పీడించుచున్నది. ప్రాణములు పోవునేమో యను భయముతో మిక్కిలి తల్లడిల్లుచున్నాను. ఓ లక్ష్మీ నరసింహస్వామీ కరావలంబన మొసగి, ఈ సంసార గజబాద నుండి తప్పించుము.
శ్లో || సంసార సర్ప ఘనవక్త్ర భాయోగ్ర తీవ్ర - దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారి వాహన! సుదాబ్ది నివాస! శౌరే ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: గరుడవాహనుడవు, పాలకడలి నివాసముగా కలవాడవు, అగు ఓ శౌరీ, సంసారము క్రూరమై, కోరలయందు విషము నిండి యున్న సర్పమువంటిది. దాని కాటువలన విషము శరీరము వ్యాపించి ప్రాణము పోవుచున్నది. నీవు నా ప్రాణములు కాపాడి నన్నుద్దరింపుము.
శ్లో|| సంసార జాలపతిత స్య జగన్నివాస - సర్వేంద్రి యార్ధ బడి శాగ్ర ఝుషోపమస్య |
ప్రోత్ఖండిత ప్రాచుర తాలిక మస్తకస్య - లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: సర్వలోకములు నివాసముగా కల ఓ ప్రభూ! నేను సంసారమనెడు వలలో పడితిని. ఇంద్రియార్ధములనెడు గాలమునకు చిక్కిన చేపవంటివాడును. గాలమున చిక్కిన చేప దవడలు విచ్చి తలపై కెగసి యుండునట్లు - నేనునూ బయటకు రాలేక తపించుచున్నాను. నన్నీ సంసార బాధ నుండి తొలగించి యుద్ధరింపుము.
శ్లో|| సంసార వృక్ష మఘబీజ మనంత కర్మ- శాఖాయుతం కరణ పత్ర మనజ్గ పుష్పమ్ ||
ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు. దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము.
శ్లో || సంసార దావద హనాతురభి కరోరు - జ్వాలావలీ భి రాతి దగ్ధ తనూరు హాస్య,
త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య - లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
తాత్పర్యం: సంసారమనెడి కారుచిచ్చు భయంకరములగు గొప్ప జ్వాలలతో నిండి పోయినది. నేను దాని నడుమ చిక్కుకొంటిని. ఆ మంటలు నా శరీర మందలి రోమములను కాల్చి వేయుచున్నవి. ఇక నా శరీరము కూడా దహింపబడును. కాన నిన్ను శరణు జొచ్చితిని. నీ పాద పద్మములనెడి సరస్సు తప్ప తాపము నేదియు చల్లార్చజాలదు. ఓ నృసింహ దేవా! కరుణించి చేయూత నొసగి, ఆ దావాగ్ని నుండి రక్షింపుము.
శ్లో|| సంసార సాగర నిమజ్జన ముహ్య మానం దీనం విలోకయ విభో! కరుణానిదే! మామ్|
ప్రహ్లాద భేద పరిహార పరావతారః లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: దయానిధి వైన ఓ ప్రభూ! ప్రహ్లాదుని దుఃఖము పోగొట్టుటకు నరహరి రూపమును ధరించిన దేవా! నేను సంసార సముద్రమున పడి, మునిగి పోయి, ఉక్కిరి బిక్కిరి యగుచున్నాను. దీనావస్థలో నున్న నన్నుద్ధరింపుము.
శ్లో|| సంసార యూద గజ సంహతి సింహదంష్ట్రా - భీత స్య దుష్ట మతి దైత్య భయంకరేణ |
ప్రాణ ప్రయాణ భవభీ తినివారణే న లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ నృసింహ మూర్తీ! నీ స్వరూపము దుష్ట బుద్ధులగు రాక్షసులకు మిగుల భయము కల్గించుచున్నది. సంసార సమూహములనెడి భయమును పోగొట్టునది. అట్టి రూపము ధరించి నాప్రాణములు కాపాడుమ
శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.
శ్లో|| బద్ద్వాగళే యమ భటా హుతర్జయన్తః కర్షంతి యత్ర భవపాశశ తైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో | లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: దయాళువైన ఓ పభూ! యమ భటులు పెక్కు పాశములతో నా మెడను బంధించి, బెదరించుచూ, ఏదారిలోనో నన్నీడ్చుకొని పోవుదురు. అపుడు పరులకు లొంగి, ఒంటరినై, దిగులుపడుచుండు నాకు దిక్కెవ్వరు? నీవే నాకు చేయూత నిచ్చి రక్షింపవలయును.
శ్లో|| అన్దస్యమే హృత వివేక మహాధన స్య చొ రైర్మ హ బలిభి రిన్ద్రియ నామ దే యై:
మోహన్ద కారకుహరే వినిపాతిత స్య లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ నరసింహ ప్రభూ! మహాబలవంతులగు ఇంద్రియములనెడి దొంగలు నా వివేక ధనమును దొంగిలించుకొని, అజ్ఞానమును అంధకారపు గుహలో త్రోసివేసిరి. కన్నులు కాన రాకున్నవి. నాకు చేయూత నిచ్చి, ఆ గుహ నుండి బయటకు తీసి నన్నుద్ధరింపుము.
శ్లో|| లక్ష్మీ పతే! కమలనాభ! సురేశ! విష్ణో ! యజ్ఞేశ ! యజ్ఞ! మధు సూదన! విశ్వరూప
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ! లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ లక్ష్మీ పతీ ! నీవు పద్మమును నాభి యందు కలవాడవు. దేవతలకు నాయకుడవు. సర్వవ్యాపకుడవు. యజ్ఞములకు అధిపతివి. యజ్ఞ రూపుడవు. మధువను రాక్షసుని శిక్షించినవాడవు. విశ్వరూపుడవు. బ్రాహ్మణ ప్రియుడవు. బ్రహ్మ, రుద్రుల అంశలు కలవాడవు. జన్మము లేకుండ చేయువాడవు. వసుదేవునకు పుత్రుడవై అవతరించినవాడవు. ఓ నృసింహదేవా! నాకు చేయూత నిమ్ము.
శ్లో || ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసాది భాగవత పుంగవ వృన్నివాస|
భక్తా సురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ! మమ దేహి కరవలమ్బమ్ ||
తాత్పర్యం: ఓ దేవా ! నీవు ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, అనువారి హృదయములందు నివసించుచుందువు. భక్తులను, నీపై ప్రేమ కలవారిని కాపాడుటలో కల్పవృక్షము వంటివాడవు. ఓ నరసింహస్వామీ, నాకు చేయూత నొసగి కాపాడుము.
శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడు చేతితో అభయము నిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము.
శ్లో|| ఆద్యన్త శూన్య మజమవ్యయ మప్రమేయ - షూదిత్య రుద్రా నిగమాది నుత ప్రభావమ్|
త్వామ్భోది జాన్య మధులోలుప మత్త భ్రుజ్గం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
తాత్పర్యం: ఓ దేవా! నీవు మొదలు, తుది లేనివాడవు, పుటకయు, నాశనమును లేనివాడవు ఇంతవాడని ఊహింప సాధ్యము సనివాడవు. వేదములు, సూర్యుడు, రుద్రుడు, మున్నగువారు నీ ప్రభావమును కీరించుచుందురు. నీవు లక్ష్మీ దేవి ముఖ పద్మము నందలి మధువు నందు ఆసక్తి గల కొదమ తుమ్మెదవు. నరసింహ స్వరూపుడవగు నీవు నాకు చేయూత నొసగి రక్షింపుము.
శ్లో|| వారాహరామ నరసింహమాది కాన్తా - క్రీడా విలోల శూలి ప్రవన్ద్య
హంసాత్మకం పత్పరమ హంస విహార లీలం - లక్ష్మి నృసింహ! మమ దేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ దేవా! నీవు వరాహ, వామన, నృసింహావ తారముల నెత్తినవాడవు. లక్ష్మీదేవి మున్నగు కాంతలతో క్రీడించుట యందు ఆసక్తి కలవాడవు. బ్రహ్మ, రుద్రాది దేవతలు నీ కేప్పుడునూ నమస్క రించుచుందురు. నీవు పరమహంస రూపుడవు. ఉత్తములగు యోగుల హృదయములందు విహరించుచుందువు. ఓ లక్ష్మీ నృసింహస్వామీ! నాకు చేయూత నిమ్ము.
శ్లో|| ప్రహ్లాద మానస సరో జవిహార భ్రుజ్గ - గాజ్గ తర జ్గ ధవళాజ్గ రామా స్థితాజ్గ |
శ్రుజ్గర సజ్గర సకిరీట ల సద్వరాజ్గ - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ నరసింహదేవా! నీవు ప్రహ్లాదుని మనస్సనెడు కమలమున విహరించు తుమ్మెదయైన వాడవు. గంగాతరంగములవలె తెల్లని దేహము కలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షః స్థలము కలవాడవు. శ్రుంగారము కలవాడవు. మేలైన కిరీటముతో ప్రకాశించు శిరస్శు కలవాడవు. నీవు నాకు చేయూత నిమ్ము.
శ్లో|| మాతా నృశింహశ్చ పితా నృసింహః - భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహః - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||
#తాత్పర్యం: నాకు నృసింహుడే తల్లి, నృసింహుడే తండ్రి, నృసింహుడే సోదరుడు, నృసింహుడే మిత్రుడు, నృసింహుడే విద్య, నృసింహుడే ధనము, నృసింహుడే ప్రభువు నాకు సమస్తమును ఆ నృసింహుడే !
శ్లో|| శ్రీ శజ్కరార్యర చితం సతతం మనుష్యః - స్సోత్రం పటేది హతు సర్వగుణ ప్రసన్నమ్ |
సద్యో విముక్త కలుషో మునివర్య గన్యో - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరవలమ్బమ్ ||
#తాత్పర్యం: సమస్త గుణములతో కూడి, శంకర భాగవత్పాదులచే రచింపబడిన యీ స్తోత్రమును ఎ మనుష్యుడు ఎల్లప్పుడునూ పటించుచుండునో అతడు వెంటనే పాపములు నశించి పరిశుద్ధుడై, మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంటమును పొందును.
శ్లో|| యన్మాయార్జిత భవ ప్రచుర ప్రవాహా - మగ్నార్త మర్త్యనివ హేషు కరావలమ్బమ్,
లక్ష్మీ నృసింహ చరనాబ్జ మధువ్రతేనా - లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: మాయా ప్రభావమున అజ్ఞానమునందు పడి, పెక్కు జన్మములను పొందుచూ, బాధల ననుభవించుచూ మనుష్యులకు ఈ స్తోత్రము తరించుటకు చేయూత అయినది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు తుమ్మెద వంటి వారగు శ్రీ శంకరాచార్యులు రచించిరి.
శ్లో|| శ్రీమాన్న్రుసింహ విభవే గరుడ ధ్వజాయ - తాపత్ర యో పశామనాయ భావౌషదాయ |
త్రుష్ణారి వృశ్చిక జలాగ్నిభుజ జ్గరోగ - లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలమ్బమ్ ||
#తాత్పర్యం: ఓ లక్ష్మీ నరసింహస్వామీ ! నీవు సమస్త లోకములకు ప్రభువువు. గరుడధ్వజుడవు. తాపత్రయమును నశింపజేయువాడవు. సంసారములనెడి రోగములకు ఓషదము వంటివాడవు. ఆకలి దప్పులు, తేళ్ళు, అగ్ని, జలము, పాములు, రోగములు మున్నగు వానివలన కలుగు బాధలను నశింపజేయువాడవు. పాపములు హరించు వాడవు. గురువైన వాడవు. అట్టి నీకివే మా నమస్కారములు.
~~~~~~~~!!ఇతి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్!!~~~~~

‬శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రమ్

‬శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రమ్
Ramudu Thota Venkataramana's photo.
షడాధార పంకేరు హాందర్విరాజ
త్సుషుమ్నాంత రాలే తితే జోల సంతీమ్ |
సుధా మండలం ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తి మీడే చిదానంద రూపామ్. |1|
జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగీం
సులావణ్య శృంగార శోభాభి రామామ్ |
మహాపద్మ కింజల్క మధ్యే విరాజ -
త్త్కరుకోణే నిషన్నాం భజే శ్రీభవానీమ్. |2|
క్వణత్కింకిణీ నూపురోద్భా సిరత్న -
ప్రభాలీఢ లాక్షార్ద్ర పాదాజ్జ యుగ్మమ్ |
అజేశాచ్యుతాద్యై: సురైః సేవ్యమానం
మహాదేవి! మన్మూర్ద్నతే భావయామి. |3|
సుశోణాంబ రాబద్ద నీవీ విరాజ -
న్మ హరత్న కాంచీ కలాపం నితంబమ్ |
స్ఫురద్ద క్షిణావర్త నాభించ తిస్రో
వలీ రంబ ! తేరోమరాజింభజేహమ్. |4|
లసద్వ్రత్త ముత్తుంగ మాణిక్యకుంభో -
పమశ్రీస్తన ద్వంద్వ మంబాంబుజాక్షి !
భజే దుగ్ద పూర్ణాభిరామం తవేదం
మహాహార దీప్తం సదా ప్రస్నుతాస్యమ్. |5|
శిరిష ప్రసూనోల్ల సద్బా హూదండై -
ర్జ్వలద్బాణకోదండ పాశాంకు శైశ్చ |
చలత్కంకణో దారకేయూర భూషో -
జ్జ్వలద్భిర్ల సంతీం భజే శ్రీభవానీమ్. |6|
శరత్పూర్ణ చంద్ర ప్రభా పూర్ణ బింబా -
ధరస్మేర వక్త్రార విందాం సుశాంతమ్ |
సరత్నావళీ హారతాటంక శోభం
మహా సుప్రసన్నాం భజే శ్రీ భవానీమ్. |7|
సునాసాపుటం సుందర భ్రూలలాటం
తవౌష్ట శ్రియం దానదక్షం కటాక్షమ్ |
లలాటోల్ల సద్గంధ కస్తూరి భూషం
స్ఫరచ్చ్ర ముఖాంభోజ మీడే హమంబ. |8|
చలత్కుంత లాంతర్భ్రమద్ భ్రుంగ బృన్దం
ఘనస్నిగ్ద ధమ్మిల్ల భూషోజ్జ్వలంతే |
స్ఫురన్మౌళి మాణిక్య బద్దెందు రేఖా-
విలాసోల్ల సద్దవ్య మూర్దాన మీడే. |9|
ఇతి శ్రీభవాని ! స్వరూపంతవేదం
ప్రపంచాత్వరం చాతి సూక్ష్మం ప్రసన్నమ్ |
స్ఫుర త్వంబ ! డింభస్యమే హృత్సరోజే
సదావాజ్మయం సర్వతే జోమయంచ. |10|
గనేశాణి మాద్యాఖిలైః శక్తిబృందై -
ర్వ్రతాం వైస్ఫు రచ్చక్ర రాజోల్లం సంతీమ్ |
పరాం రాజ రాజేశ్వరి ! త్రైపురి ! త్వాం
శివాంకో పరిస్థాం శివాం భావ యామి. |11|
త్వమర్క స్త్వమిందు స్త్వమగ్నిస్త్వ - మాప
స్త్వమాకాశ భూవాయవస్త్వం మహత్త్వమ్ |
త్వదన్యోన కశ్చిత్ప్ర పంచేస్తి సర్వం
త్వమానంద సంవిత్స్వ రూపాం భజేహమ్. |12|
శ్రుతీనామగమ్యే సువేదాగ మజ్ఞా
మహిమ్నోన జానంతి పారంత వాంబ |
స్తుతిం కర్తు మిచ్చామితే; త్వం భవాని
క్షమ స్వేద మత్ర ప్రముగ్ద: కిరాహమ్. |13|
ఇతీమాం మహచ్చ్రీ భవానీ భుజంగ -
స్తుతింయః పటేచ్చక్తి యుక్తశ్చతస్మై |
స్వరీంయం పదం శాశ్వతం వేద సారం
శ్రియం చాష్ట సిద్ధం భవానీ దదాతి. |14|
భవానీ భవానీ భవానీ త్రివారం
హ్యుదారం ముదా సర్వదాయే జపన్తి |
నశోకో నమోహొన పాపం నభీతిః
కదాచిత్కధంచిత్కు తశ్చిజ్జ నానామ్. |15|
గురుస్త్వం శివస్త్వంచ శక్తి స్త్వమేవ
త్వమే వాసి మాతా పితాచత్వ మేవ
త్వమే వాసి విద్యా త్వమే వాసి బంధు-
ర్గతిర్మే మతిర్దేవి ! సర్వం త్వమేవ. |16|
వరేణ్యే! శరణ్యే ! సుకారుణ్య మూర్తే !
హిరణ్యో దరాద్యై రగణ్యే ! సుపుణ్యే !
భవారణ్యభీ తేశ్చమాం పాహిభద్రే !
నమస్తే నమేస్తే నమేస్తే భవాని!!|17|
~~~ఇతి శ్రీమచ్చంకర భగవత్పా దకృతం భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం సంపూర్ణమ్~~~

శ్రీరామమంగళాశాసనమ్‬

శ్రీరామమంగళాశాసనమ్‬

#శ్రీరామమంగళాశాసనమ్
మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.            1

వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,
పుంసాం మొహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్.    2

విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేం,
భాగ్యానాం పరిపాకాయ భావ్యరూపాయ మంగళమ్.         3

పితృభక్తాయ సతతం భ్రాతృభి:, సహా సీతయా,
నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్.              4 

త్వ క్తసాకేతచాసాయ చిత్రకూటవిహారణే,
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్.          5

సౌమిత్రణా చ జానక్యా చావబాణాసిధారిణే,
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్.         6

దండకారణ్యచాసాయ ఖరదూషణశత్రవే,
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయస్తు మంగళమ్.        7

సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే,
సౌలభ్య పరిపూర్ణాయ సత్త్వోద్రిక్తాయ మంగళమ్.                 8

హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే,
వాలి ప్రమధనాయా ...స్తు మహాధీరాయ మంగళమ్.            9

శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే,
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్.                        10

విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే,
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్.                    11 

అగత్యనగరీం దివ్యామభిషిక్తాయ మంగళమ్,
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్.                    12 

బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే,
జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళమ్.                  13 

శ్రీ సౌమ్యజామాత్ హ్బుమనే: కృపయాస్మానుపేయుషే,
మహాతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్.             14 

అమంగళాశాసన1పరైర్మదాచార్య పురోగమై:,
సర్వైశ్చ పూర్త్వైరాచార్త్వై: సత్కృతాయాస్తూ మంగళమ్.           15 

రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్,
త్రైలోక్యాధిపతి: శ్రీమాన్ కరోతు మంగళం సదా.                      16
~~~~ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీరామమంగళాశాసనం సంపూర్ణం~~~~
మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్. 1
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,
పుంసాం మొహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్. 2
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేం,
భాగ్యానాం పరిపాకాయ భావ్యరూపాయ మంగళమ్. 3
పితృభక్తాయ సతతం భ్రాతృభి:, సహా సీతయా,
నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్. 4
త్వ క్తసాకేతచాసాయ చిత్రకూటవిహారణే,
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్. 5
సౌమిత్రణా చ జానక్యా చావబాణాసిధారిణే,
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్. 6
దండకారణ్యచాసాయ ఖరదూషణశత్రవే,
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయస్తు మంగళమ్. 7
సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే,
సౌలభ్య పరిపూర్ణాయ సత్త్వోద్రిక్తాయ మంగళమ్. 8
హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే,
వాలి ప్రమధనాయా ...స్తు మహాధీరాయ మంగళమ్. 9
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే,
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్. 10
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే,
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్. 11
అగత్యనగరీం దివ్యామభిషిక్తాయ మంగళమ్,
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్. 12
బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే,
జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళమ్. 13
శ్రీ సౌమ్యజామాత్ హ్బుమనే: కృపయాస్మానుపేయుషే,
మహాతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్. 14
అమంగళాశాసన1పరైర్మదాచార్య పురోగమై:,
సర్వైశ్చ పూర్త్వైరాచార్త్వై: సత్కృతాయాస్తూ మంగళమ్. 15
రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్,
త్రైలోక్యాధిపతి: శ్రీమాన్ కరోతు మంగళం సదా. 16
~~~~ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీరామమంగళాశాసనం సంపూర్ణం~~~~

శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం

శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం
#శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం
మార్కండేయ ఉవాచ

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
 ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

 సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
 ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

 ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
 దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

 సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
 పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

 య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
 సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
~~~~~~~~!!ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం!!~~~~~~~
మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
~~~~~~~~!!ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం!!~~~~~~~

గోవింద‬ నామాలు

గోవింద‬ నామాలు..
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
శ్రీనివాస‬ గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1||
నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా, పురాణపురుష గోవిందా, పుండరికాక్ష గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||2||
నందనందన గోవిందా, నవనీత చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||3||
శిష్టపాలక గోవిందా, కష్టనివారణ గోవిందా, దుష్టసంహార గోవిందా, దురిత నివారణ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||4||
వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా, గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||5||
దశరధనందన గోవిందా, దశముఖ మర్దన గోవిందా, గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||6||
మత్స్యకూర్మా గోవిందా,మధుసూదనహరి గోవిందా, వరాహ నృసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా;|
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||7||
బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా, వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8||
సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా, ఆద్ర పోషక గోవిందా, ఆది పురుష గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||9||
అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా, శరణాగత నిదే గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||10||
కమలదళాక్ష గోవిందా, కామిత ఫలదా గోవిందా; పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||11||
శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీ వత్సాంకిత గోవిందా; ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||12||
పద్మావతిప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా, అభయమూర్తి గోవిందా, ఆశ్రిత వరద గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||13||
శంఖచక్రధర గోవిందా, శాoగగదాధర గోవిందా, విరజాతీరస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||14||
సాలగ్రామ గోవిందా, సహస్రనామా గోవిందా, లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||15||
కస్తూరితిలక గోవిందా, కాంచనాంబర గోవిందా, గరుడవాహన గోవిందా; గానలోల గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||16||
వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా; అన్న దాన ప్రియ గోవిందా, అన్నమయ్య వినుత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||17||
ఆశ్రిత రక్ష గోవిందా, అనంత వినుత గోవిందా, వేదాంత నిలయ గోవిందా, వేంకట రమణ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||18||
ధర్మ స్థాపక గోవిందా, ధన లక్ష్మి ప్రియ గోవిందా, స్త్రీ పుం రూప గోవిందా, శర్వాణీ నుత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||19||
ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా, వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||
వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా, వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||21||
బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా, బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||22||
నిత్య కళ్యాణ గోవిందా, నీర జనాభా గోవిందా, హతీ రామ ప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||23||
జనార్థన మూర్తి గోవిందా, జగత్ పతీ హరి గోవిందా, అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||24||
రత్న కిరీట గోవిందా, రామానుజనుత గోవిందా, స్వయం ప్రకాశ గోవిందా, సర్వ కారణ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||25||
నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||
ఇహ పర దాయక గోవిందా, ఇభ రాజ రక్షక గోవిందా, పరమ దయాలో గోవిందా, పద్మనాభ హరి గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||27||
గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా, అన్జనాద్రీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||
తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా, శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా, |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||
శాంతాకారా గోవిందా, వైకుంఠ వాసా గోవిందా, బ్రుగుముణి పూజిత గోవిందా, రమాది రహిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||30||
బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
నందక ధారి గోవిందా, ఇరు నామ ధారి గోవిందా, భాగ్య శీతల గోవిందా, భక్త వత్సల గోవిందా; |
;గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||
పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా, ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32||
నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||
దివ్య సుదేహ గోవిందా, శ్రీ రమా లోల గోవిందా, శ్రీ స్మిత వదన గోవిందా, శ్రీ నిర్మలా కార గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||34||
మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, మహలక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||
శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా, నిర్గుణ రూప గోవిందా, తిరుమల వాస గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||36||
శ్రీ వరద రూప గోవిందా, అభయ ప్రదాయ గోవిందా, యోగీంద్ర వన్య గోవిందా, తిరు వెంకటాద్రీస గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||37||
కృపాసాగర గోవిందా, శరణ సుందర గోవిందా, పుణ్య స్వరూప గోవిందా, శ్రీ పురుషోత్తమ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||38||
గోకుల కృష్ణ గోవిందా, గరుడ వాహన గోవిందా, శ్రీ గాన లోల గోవిందా, శ్రీ చంద్ర హాస గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||39||
నారాయణాచ్యుత గోవిందా, గోవింద నామా గోవిందా, శ్రీ విష్ణు దేవా గోవిందా, శ్రీ దామోదర గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||40||
శ్రీ నారసింహ గోవిందా, శ్రీ రామచంద్ర గోవిందా, శ్రీ కృష్ణ మూర్తీ గోవిందా, శ్రీ వెంకటేశా గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||41||
శ్రీ రాగ రంజిత గోవిందా, కళ్యాణ మూర్తి గోవిందా, మలయప్ప రూపా గోవిందా, సర్వ మత సమ్మత గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||42||
వేద రక్షకా గోవిందా, వేద స్వరూపా గోవిందా, వేదోద్ధారా గోవిందా, వేద పురుష గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||43||
శ్రీ కమలా ప్రియ గోవిందా, కళ్యాణ ప్రియ గోవిందా, కమనీయ వదన గోవిందా, రమణీయ నామ గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||44||
అంజనాద్రీస గోవిందా, గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా;
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా;
వడ్డీకాసులవాడా వెంకటరమణా గోవిందా గోవిందా, ఆపద మొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా;
ఆపద మొక్కులవాడా అడుగడుగు దండాలవాడా గోవిందా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||45||

శ్రీ‬ వేంకటేశ సహస్ర నామావళి

శ్రీ‬ వేంకటేశ సహస్ర నామావళి..
#శ్రీ వేంకటేశ సహస్ర నామావళి..
ఓం శ్రీ వేంకటేశాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం విశ్వేశాయ నమ:
ఓం విశ్వభావనాయ నమ:
ఓం విశ్వసృజే నమ:
ఓం విశ్వసంహర్ర్తే నమ:
ఓం విశ్వప్రాణాయ నమ:
ఓం విరాడ్వపు షే నమ:
ఓం శేషాద్రినిలయాయ నమ:
ఓం అశేషభక్త దు:ఖ ప్రణాశనాయ నమ: 
ఓం శేషస్తుత్యాయ నమ:
ఓం శేషశాయినే నమ:
ఓం విశేషజ్ఞాయ నమ:
ఓం విభవే నమ:
ఓం స్వభువే నమ:
ఓం విష్ణవే నమ:
ఓం జిష్ణవే నమ:
ఓం ఉత్సహిష్ణవే నమ:
ఓం సహిష్ణుకాయ నమ:
ఓం భ్రాజిష్టవే నమ: 
ఓం గ్రసిష్ణవే నమ:
ఓం వర్తిష్ణవే నమ:
ఓం భరిష్ణకాయ నమ:
ఓం కాలయంత్రే నమ:
ఓం కాలగోప్త్రే నమ:
ఓం కాలాయ నమ:
ఓం కాలాన్తకాయ నమ:
ఓం అఖిలా నమ:
ఓం కాలగమ్యాయ నమ:
ఓం కాలకమ్ఠవంద్యాయ నమ: 
ఓం కాలకలేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం స్వయంభువే నమ:
ఓం అంభోజనాభాయ నమ:
ఓం స్తంభితవారిధయే నమ:
ఓం అంభోధినందినీజానయే నమ:
ఓం శోణాంభోజపదప్రభాయ నమ:
ఓం కంబుగ్రీవాయ నమ:
ఓం శంబరారిరూపాయ నమ:
ఓం శంబరజేక్షణాయ నమ: 
ఓం బింబాధరాయ నమ:
ఓం బింబరూపిణే నమ:
ఓం ప్రతిబింబక్రియాతిగాయ నమ:
ఓం గుణవతే నమ:
ఓం గుణగమ్యాయ నమ:
ఓం గుణాతీతాయ నమ:
ఓం గుణప్రియాయ నమ:
ఓం దుర్గుణధ్వంసకృతే నమ:
ఓం సర్వ సుగుణాయ నమ:
ఓం గుణభాసకాయ నమ: 
ఓం పరేశాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం పరస్మైజ్యోతిషే నమ:
ఓం పరాగతయే నమ:
ఓం పరస్మైపరాయ నమ:
ఓం వియద్వాససే నమ:
ఓం పారంపర్యశుభప్రదాయ నమ:
ఓం బ్రంహ్మాండగర్భాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రహ్మసృజే నమ: 
ఓం బ్రహ్మబోధితాయ నమ:
ఓం బ్రహ్మస్తుత్యాయ నమ:
ఓం బ్రహ్మవాదినే నమ;
ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమ:
ఓం సత్యవ్రతార్ధసంతుష్టాయ నమ:
ఓం సత్యరూపిణే నమ:
ఓం ఝుషాంగవతే నమ:
ఓం సోమకప్రాణహారిణే నమ:
ఓం ఆనీతామ్నయాయ నమ:
ఓం అబ్దిసంచరాయ నమ: 
ఓం దేవాసురవరస్తుత్యాయ నమ:
ఓం పతన్మందరధారకాయ నమ:
ఓం ధన్వంతరయే నమ;
ఓం కచ్చపాంగాయ నమ;
ఓం పయోనిధినిమంథకాయ నమ:
ఓం అమరామృతసంధాత్రే నమ:
ఓం ధృతసమ్మోహినీవపుషే నమ:
ఓం హరమోహకమాయావినే నమ:
ఓం రక్షస్సందోహభంజనాయ నమ:
ఓం హిరణ్యాక్షవిదారిణే నమ: 
ఓం యజ్ఞాయ నమ:
ఓం యజ్ఞవిభావనాయ నమ:
ఓం యజ్ఞీయోర్వీసముద్దర్ర్తే నమ:
ఓం లీలాక్రోడాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం దండకాసురవిధ్వంసినే నమ:
ఓం వక్రదంష్ట్రాయ నమ:
ఓం క్షమాధరాయ నమ:
ఓం గంధర్వశాపహరణాయ నమ:
ఓం పుణ్యగంధాయ నమ: 
ఓం విచక్షణాయ నమ:
ఓం కరాళవక్ర్తాయ నమ:
ఓం సోమార్కనేత్రాయ నమ:
ఓం షడ్గుణవైభవాయ నమ:
ఓం శ్వేతఘెణినే నమ:
ఓం ఘార్ణితభ్రువే నమ:
ఓం ఘుర్ఝురధ్వనివిభ్రమాయ నమ:
ఓం ద్రాఘీయసే నమ:
ఓం నీలకేశినే నమ:
ఓం జాగ్రదంబుజలోచనాయ నమ: 
ఓం ఘృణావతే నమ:
ఓం ఘృణిసమ్మోహాయ నమ:
ఓం మహాకాలాగ్నిదీధితయే నమ:
ఓం జ్వాలాకరాళవదనాయ నమ:
ఓం మహోల్కకులవీక్షణాయ నమ:
ఓం సటానిర్బిణ్ణమేఘాయ నమ:
ఓం దంష్ట్రారగ్వ్యప్తదిక్తటాయ నమ:
ఓం ఉచ్చ్వాసాకృష్టభూతేశాయ నమ:
ఓం నిశ్శ్వాసత్యక్తవిశ్వసృజే నమ:
ఓం అంతర్ర్బమజ్జగద్గర్భాయ నమ:

ఓం శ్రీ వేంకటేశాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం విశ్వేశాయ నమ:
ఓం విశ్వభావనాయ నమ:
ఓం విశ్వసృజే నమ:
ఓం విశ్వసంహర్ర్తే నమ:
ఓం విశ్వప్రాణాయ నమ:
ఓం విరాడ్వపు షే నమ:
ఓం శేషాద్రినిలయాయ నమ:
ఓం అశేషభక్త దు:ఖ ప్రణాశనాయ నమ:
ఓం శేషస్తుత్యాయ నమ:
ఓం శేషశాయినే నమ:
ఓం విశేషజ్ఞాయ నమ:
ఓం విభవే నమ:
ఓం స్వభువే నమ:
ఓం విష్ణవే నమ:
ఓం జిష్ణవే నమ:
ఓం ఉత్సహిష్ణవే నమ:
ఓం సహిష్ణుకాయ నమ:
ఓం భ్రాజిష్టవే నమ:
ఓం గ్రసిష్ణవే నమ:
ఓం వర్తిష్ణవే నమ:
ఓం భరిష్ణకాయ నమ:
ఓం కాలయంత్రే నమ:
ఓం కాలగోప్త్రే నమ:
ఓం కాలాయ నమ:
ఓం కాలాన్తకాయ నమ:
ఓం అఖిలా నమ:
ఓం కాలగమ్యాయ నమ:
ఓం కాలకమ్ఠవంద్యాయ నమ:
ఓం కాలకలేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం స్వయంభువే నమ:
ఓం అంభోజనాభాయ నమ:
ఓం స్తంభితవారిధయే నమ:
ఓం అంభోధినందినీజానయే నమ:
ఓం శోణాంభోజపదప్రభాయ నమ:
ఓం కంబుగ్రీవాయ నమ:
ఓం శంబరారిరూపాయ నమ:
ఓం శంబరజేక్షణాయ నమ:
ఓం బింబాధరాయ నమ:
ఓం బింబరూపిణే నమ:
ఓం ప్రతిబింబక్రియాతిగాయ నమ:
ఓం గుణవతే నమ:
ఓం గుణగమ్యాయ నమ:
ఓం గుణాతీతాయ నమ:
ఓం గుణప్రియాయ నమ:
ఓం దుర్గుణధ్వంసకృతే నమ:
ఓం సర్వ సుగుణాయ నమ:
ఓం గుణభాసకాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం పరస్మైజ్యోతిషే నమ:
ఓం పరాగతయే నమ:
ఓం పరస్మైపరాయ నమ:
ఓం వియద్వాససే నమ:
ఓం పారంపర్యశుభప్రదాయ నమ:
ఓం బ్రంహ్మాండగర్భాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయ నమ:
ఓం బ్రహ్మసృజే నమ:
ఓం బ్రహ్మబోధితాయ నమ:
ఓం బ్రహ్మస్తుత్యాయ నమ:
ఓం బ్రహ్మవాదినే నమ;
ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమ:
ఓం సత్యవ్రతార్ధసంతుష్టాయ నమ:
ఓం సత్యరూపిణే నమ:
ఓం ఝుషాంగవతే నమ:
ఓం సోమకప్రాణహారిణే నమ:
ఓం ఆనీతామ్నయాయ నమ:
ఓం అబ్దిసంచరాయ నమ:
ఓం దేవాసురవరస్తుత్యాయ నమ:
ఓం పతన్మందరధారకాయ నమ:
ఓం ధన్వంతరయే నమ;
ఓం కచ్చపాంగాయ నమ;
ఓం పయోనిధినిమంథకాయ నమ:
ఓం అమరామృతసంధాత్రే నమ:
ఓం ధృతసమ్మోహినీవపుషే నమ:
ఓం హరమోహకమాయావినే నమ:
ఓం రక్షస్సందోహభంజనాయ నమ:
ఓం హిరణ్యాక్షవిదారిణే నమ:
ఓం యజ్ఞాయ నమ:
ఓం యజ్ఞవిభావనాయ నమ:
ఓం యజ్ఞీయోర్వీసముద్దర్ర్తే నమ:
ఓం లీలాక్రోడాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం దండకాసురవిధ్వంసినే నమ:
ఓం వక్రదంష్ట్రాయ నమ:
ఓం క్షమాధరాయ నమ:
ఓం గంధర్వశాపహరణాయ నమ:
ఓం పుణ్యగంధాయ నమ:
ఓం విచక్షణాయ నమ:
ఓం కరాళవక్ర్తాయ నమ:
ఓం సోమార్కనేత్రాయ నమ:
ఓం షడ్గుణవైభవాయ నమ:
ఓం శ్వేతఘెణినే నమ:
ఓం ఘార్ణితభ్రువే నమ:
ఓం ఘుర్ఝురధ్వనివిభ్రమాయ నమ:
ఓం ద్రాఘీయసే నమ:
ఓం నీలకేశినే నమ:
ఓం జాగ్రదంబుజలోచనాయ నమ:
ఓం ఘృణావతే నమ:
ఓం ఘృణిసమ్మోహాయ నమ:
ఓం మహాకాలాగ్నిదీధితయే నమ:
ఓం జ్వాలాకరాళవదనాయ నమ:
ఓం మహోల్కకులవీక్షణాయ నమ:
ఓం సటానిర్బిణ్ణమేఘాయ నమ:
ఓం దంష్ట్రారగ్వ్యప్తదిక్తటాయ నమ:
ఓం ఉచ్చ్వాసాకృష్టభూతేశాయ నమ:
ఓం నిశ్శ్వాసత్యక్తవిశ్వసృజే నమ:
ఓం అంతర్ర్బమజ్జగద్గర్భాయ నమ

‎అలమేలుమంగపతికి‬ అన్నమయ్య ఆరగింపు సేవ

అలమేలుమంగపతికి‬ అన్నమయ్య ఆరగింపు సేవ..
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు దాళింపు
గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ!!
భర్తకు ఇష్టమైన వంటకాలు తయారుచేసి అతనికి కొసరి కొసరి వడ్డించడం ప్రతీ ఇల్లాలికి ప్రియమైన పని. అతను తృప్తిగా భోజనం చేస్తే సంతోషిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుడికి ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి వడ్డిస్తున్న దృశ్యం చూసిన అన్నమయ్య మా ఇందిరాదేవి ప్రేమతో వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామి అంటున్నాడు. ఆ స్వామికి వడ్డించిన వంటకాలు ఏంటయ్యా అంటే నేతి పాయసాలు, అప్పాలు, వడలు, చక్కెర రాసులు, మిరియపు తాళింపు పెట్టిన కమ్మని కూరలు, పచ్చళ్లు, పిండివంటలు, పాలు , పెరుగు మొదలైనవి. అంటే ఆ కాలంలో స్వామివారికి ఈ వంటకాలు నిత్యం నివేదించేవారేమో.
పంకజాక్షులు సొలసిపలికి నగగా-
నింకా నారగించు మిట్లనే అయ్యా
కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు
పలుదెరగులైన అప్పములగములు
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా
పెక్కువగునై దంపుపిండివంటలమీద
పిక్కిటిలు మెర్కుగుబొడి బెల్లమును
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా
కడుమధురమైన మీగడపెరుగులను ముంచు -
అడియాల వూరుగాయల రుచులతో
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా!!
ఇక్కడ అమ్మావార్లు స్వామివారికి ప్రీతికరమైన వంటకాలు వడ్డించి, మధురమైన మాటలు తమ నవ్వులతో జతచేసి పతికి విందు చేస్తున్నారు. మనం పప్పు +ఆవకాయ, పప్పన్నం + అప్పడం .. ఇలా రెండు మూడు వంటకాలు కలిపి తింటుంటాం కదా. అలాగే అన్నమయ్యా శ్రీనివాసుడిని కూడా పిండివంటలను పొడిబెల్లంతో కలిపి, మీగడపెరుగు ఆవకాయ కలిపి ఆరగించవయ్యా వేంకటగిరివాసా అని నివేదన చేస్తున్నాడు.

శివ‬ షడక్షరీ స్తుతిః

శివ‬ షడక్షరీ స్తుతిః..
#శివ షడక్షరీ స్తుతిః..
ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మై “ఓం”కారాయ నమో నమః

న నమస్తే దేవదేవేశ నమస్తే మహా పాతక నాశనం
నమస్తే వృషభారూఢ “న”కారాయ నమో నమః 

మ మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం
మహా పాప హరం వందే “మ”కారాయ నమో నమః

శి శివం శాంతం జగన్నాధం లోకానుగ్రహ కారకం
శిమేకంపరం దేవం “శి”కారాయ నమో నమః

వా వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వా”కారాయ నమో నమః

య యత్రయత్ర స్థితోః దేవ సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగ పూజయేన్నిత్యం “య”కారాయ నమో నమః

ఓం నమఃశివాయ
షడాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే
ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మై “ఓం”కారాయ నమో నమః
న నమస్తే దేవదేవేశ నమస్తే మహా పాతక నాశనం
నమస్తే వృషభారూఢ “న”కారాయ నమో నమః
మ మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం
మహా పాప హరం వందే “మ”కారాయ నమో నమః
శి శివం శాంతం జగన్నాధం లోకానుగ్రహ కారకం
శిమేకంపరం దేవం “శి”కారాయ నమో నమః
వా వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వా”కారాయ నమో నమః
య యత్రయత్ర స్థితోః దేవ సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగ పూజయేన్నిత్యం “య”కారాయ నమో నమః
ఓం నమఃశివాయ
షడాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే!!

శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

‪‎శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

శ్రీవేంకటేశ్వరస్వామికి‬సహస్ర కలశాభిషేకం..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం శనివారం జరగనుంది. భోగ శ్రీనివాసమూర్తికి పల్లవరాణి కడవన్‌ సామవాయిగా క్రీ.శ. 614లో శ్రీవారి ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని బహుకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఉత్సవమూర్తికి ఆభరణాలను కూడా వితరణ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. బహూకరణకు గుర్తుగా ఏటా జ్యేష్టమాసంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రసిద్ధి చెందిన కడవన్‌ పెరుందేవి వెండి ప్రతిమ బహూకరణకు గుర్తుగా సహస్ర కలశాభిషేకం సేవను నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని శ్రీనివాసమూర్తికి ఆగమోక్తంగా ఆలయ అర్చకులు జరపనున్నారు. శంఖుచక్రధారియైున ఈ చతుర్భుజమూర్తిని స్వామివారి మూలవిరాట్టుకు ప్రతిరూపంగా కొలుస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం ఈ మూర్తికే కౌతుకమూర్తి, పురుషబేరం అనే పేరు కూడా ఉంది.
ఈ మూర్తి స్వామివారి పాదాలచెంత పద్మపీఠానికి అనుకుని ఉన్నారు. నిత్యం రాత్రి ఏకాంతసేవ ఈ స్వామికే జరుగుతుంది. ధనుర్మాసంలో మాత్రమే శ్రీకృష్ణస్వామికి జరుగుతుంది. సాధారణంగా సహస్ర కలశాభిషేకం ప్రతి బుధవారం ఉదయం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ప్రత్యేక ఉత్సవ నేపథ్యంలో ఏడాదిలో జ్యేష్ఠమాసంలోని శనివారం 18 అంగుళాల ఎత్తుగల ఈ రజితమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకోత్సవాన్ని తితిదే 2006 నుంచి వరుసగా ప్రతి ఏటా నిర్వహిస్తోంది. శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.