సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 23, 2014

రాముల‬ భజనకు రారేమయా

రాముల‬ భజనకు రారేమయా
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా,
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
వేద శాస్త్ర పురానామ్త చదివి , గోప్ప పండితులని విర్ర వీగేరయ
పెద్ద పండితులని విర్ర వీగేరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , వేదాలు, శాస్త్రాలు ఏమవునయా.. --రామ రామ--
MA ,BA లు చదివి ఇంగ్లీషు bహాష లోన, గోప్ప పండితులని విర్ర వీగేరయ ,
పెద్ద పండితులని విర్ర వీగెరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , MA, BAలు ఏమవునయా..
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా....
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ!!

పల్లవి - నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా... 
ప్రభో , నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
జయ జయ నమో రామదూతా...                         ||నమోఆంజనేయా||
                                            
చరణం :-1       రామ రామ యని రయమున పాడుచు 
రామ స్మరణము, చేసెడి వారికి
రామ లక్ష్మణుల, భారము నాదని
పేరు ప్రఖ్యాతులు, గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-2        పండ్లు ఫలంబులు పనస తొనలను
సీతా రాముల, భుజియింపగను
కన్నబిడ్డ వలె, కనికరించుచు 
కన్నుల పండుగ , గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-3        భక్తుల నెల్లను , బ్రోచే వాడా
ముక్తి సంపదల, నొసగే వాడా 
ఆంజనేయుడవు, నీవే కావా
ఓ రామ భక్తా, శ్రీ ఆంజనేయా ...                           ||నమోఆంజనేయా||

చరణం :- 4       రామ లక్ష్మణుల , నిరతము గాంచిన 
వానర మూర్తివి , నీవే కావా 
ఎల్లప్పుడు , నీ నామమె గతియని 
స్మరించి , భజించి , తరింతు దేవా ...                     ||నమోఆంజనేయా||


హంస ధ్వని రాగం  :: ఆది తాళం                                శ్రీ రాముని పాట 
పల్లవి –
శ్రీ రఘు రామ్, జయ రఘు రామ్
సీతా మనోభి రామ్ .... జయ జయ              || శ్రీ రఘు రామ్ ||

 చరణం :-1 
అన్నదమ్ములా ఆదర్శమైనా
ఆలూ మగలా అన్యోన్యమైనా 
తండ్రి మాట నూ, నిలుపుట కైనా 
ధరలో  మీరే దశరధ రామ్                      || శ్రీ రఘు రామ్ ||

చరణం :-2 
వెలయు నే ఎడ, నీ దివ్య మూర్తీ 
వెలిగే మాయెడ, ఆనంద జ్యోతీ 
వెలసి మా గృహం, శాంతి నివాసం 
సలుపవె శుభగుణ, శోభిత రామ్                || శ్రీ రఘు రామ్ ||

చరణం :-3
శ్రీ రామ చంద్రః, శ్రిత పారి జాతః 
సమస్త కళ్యాణ గుణాభి రామ 
సీతా ముఖాంబోరు హచం చరీక
నిరంతర మంగళ మాత నోతూ                   || శ్రీ రఘు రామ్ ||

శ్రీ రామ జయ రామ పాట                             శ్రీ రాముని పాట
పల్లవి :–
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 
ఓ రామ ఓ రామ ఓం కార రామ                      || శ్రీ రామ ||

చరణం :-1 
చారు సుందర రామ జానకి రామ 
పాలించరా తండ్రి పావన రామ                            || శ్రీ రామ ||

చరణం :-2
కోరితి రా నిన్నే కోదండ రామ 
దయ చూడరా మమ్ము దశరధ రామ                      || శ్రీ రామ ||

చరణం :-3
కరుణించు మమ్మేలు కళ్యాణ రామ 
అడిగితి రా నిన్నే అయోధ్య రామ                               | శ్రీ రామ ||

మధ్య మావతి రాగం :: ఆది తాళం                           శ్రీ రాముని పాట 

పల్లవి –
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ       

 చరణం :-1 
చూచు వారలకు, చూడ ముచ్చట ట
పుణ్య పురుషులకు ధన్య భాగ్య మట
భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట.. ఆ.. ఆ.. ఆ.. .. ఆ

భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట
సురులును మునులును , చూడ వచ్చి రట || కళ్యాణము ||

చరణం :-2 
దుర్జన కోటి ని , దర్ప మడంచగ 
సజ్జన కోటి ని , సంర క్షిం పగ 
ధారుణి శాంతిని , స్థాపన చేయగా .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ

 ధారుణి శాంతిని , స్థాపన చేయగ
నరుడై పుట్టిన , పురుషోత్తముని                      || కళ్యాణము ||

చరణం :-3
దశరధ రాజు , సుతుడై వెలసి 
కౌశిక యాగము , రక్షణ జేసి 
జనకుని సభలో , హరు విల్లు విరచి .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

జనకుని సభలో , హరు విల్లు విరచి
జానకి మనసును గెలచిన రాముని                        || కళ్యాణము ||

చరణం :-4
సిరి కళ్యాణపు , బొట్టును బెట్టి                     
మణి బాసికమును , నుదుటను కట్టి 
పారాణి ని పాదాలకు బెట్టి  .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

పారాణి ని పాదాలకు బెట్టి  
పెండ్లి కూతురై వెలసిన సీతా                                            || కళ్యాణము ||



చరణం :-5 
సంపగ నూనె, కురులకు దువ్వి 
సొంపుగ కస్తూరి నామము దీర్చి 
చంప జవాజి చుక్కను బెట్టి  .. ఆ.. ఆ.. ఆ.. ..ఆ

చంప జవాజి చుక్కను బెట్టి  
పెండ్లీ కొడుకై  వెలసిన రాముని                             || కళ్యాణము ||

చరణం :-5 
జానకి దోసిట , కెంపుల ప్రోవై 
రాముని దోసిట , నీలపు రాలై
ఆణి ముత్యములు , తలంబ్రాలుగా .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

ఆణి ముత్యములు , తలంబ్రాలుగా 
శిరమున మెరసిన , సీతా రాముల                                   || కళ్యాణము ||

 ------------------- రాగం  :: ఆది తాళం                             శ్రీరాముని పాట 

పల్లవి –
జగదభి రామా , రఘుకుల సోమా

అను పల్లవి :-  
శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....                      || జగదభి రామా || 

 చరణం :-1 
కౌశిక యాగము , కాచితి వయ్యా 
రాతిని నాతిగ చేసితి వయ్యా 
హరు విల్లు విరచి ,మురిపించి సీతను 
పరిణయ మాడిన , కళ్యాణ రామా 

శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....                      || జగదభి రామా || 

చరణం :-2 
ఒకటే బాణం , ఒకటే మాట 
ఒకటే సతి యని , చాటితి వయ్యా 
కు జనుల నణచి , సు జనుల బ్రోచిన 
ఆదర్శ మూర్తివి , నీ వే నయ్యా 

జయ జయ రామ్ , జానకి రామ్
పావన నామా , మేఘ శ్యామా ....               || జగదభి రామా || 


శ్రీ రాముని పాట
  1. పల్లవి :–
భజ మన రాం, భజ మన రాం 
పాండు రంగ, శ్రీ రంగ భజ మన రాం                      || భజ మన రాం ||

చరణం :-1 
భజ మన రాఘవ, భజ మన యాదవ
భజ మన కేశవ, భజ మన రాం 
|| భజ మన రాం ||

చరణం :-2 
భజ మన రఘువర, భజ మన యదువర
భజ మన మురహర, భజ మన రాం
|| భజ మన రాం ||

చరణం :-3
భజ మన ఆనంద, భజ మన గోవింద 
భజ మన ముకుంద, భజ మన రాం  
|| భజ మన రాం ||

------------------ రాగం  :: ఆది తాళం                        శ్రీ రాముని పాట 

పల్లవి –
అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం 

అను పల్లవి :--  
అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ -- 
// అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ //
  || రామ రామ రామ సీతా ||  రామ రామ రామ సీతా ||

 చరణం :-1 
సోమ సూర్యులును, సురలును తారలు
ఆ మహాంబుధులు, అవవి జగంబులు      
|| రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||  

అ౦డా౦ డ౦బులు, పిండాం డంబులు
బ్రహ్మండంబులు, బ్రహ్మలు మొదలుగ                 ||  అంతా రామ మయం ||

చరణం :-2 
నదులు వనంబులు, నానా మృగములు 
వివిధ కర్మములు, వేద శాస్త్రములు        

 || రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||  

అష్ట దిక్కులును, ఆది శేషుడును 
అష్ట వసువులు, అరిషడ్ వర్గము                     ||  అంతా రామ మయం ||

చరణం :-3
ధీరుడు భద్రాచల రామ దాసు నీ 
కోరికlll లొసగెడి తారక నామము                    ||  అంతా రామ మయం ||




మోక్షపధం‬ - రామ దర్శనం

మోక్షపధం‬ - రామ దర్శనం
#మోక్షపధం - రామ దర్శనం 

మనోజవం మారుతతుల్యవేగమ్ 
                                       జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
                                       వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
                                       శ్రీరామ దూతం శరణం ప్రపద్యే// 
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై  శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను. 
                              శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
                              శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి 
                              శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.మనోజవం మారుతతుల్యవేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే//
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను.
శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.



శ్రీరామ జయరామ జయజయరామ
శ్రీరామ శరణం మమ. శుభం భూయాత్
శ్రీరామ జయరామ జయజయరామ!!శ్రీరామ జయరామ జయజయరామ
శ్రీరామ శరణం మమ. శుభం భూయాత్
శ్రీరామ జయరామ జయజయరామ!



Ramudu Thota Venkataramana's photo.

పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2

జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3
సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4
యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5
నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6
ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7
సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం!!8!!

#యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
 భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"


యత్ర‬ యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును.

రామాయణ అంతరార్ధమిది

A 21th Century painting on Sri Yoganada Lakshmi Narasimha Swami temple at Bhadrachalm.
A 21th Century painting on Sri Yoganada Lakshmi Narasimha Swami temple at Bhadrachalm
 ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.

ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.

భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు. 

ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు. రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు.
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.

శ్రీరామచంద్రుడు‬

Ramudu Thota Venkataramana's photo.
వాల్మీకిని రామాయణం రాయమని ప్రోత్సహించడానికి వస్తాడు నారదుడు. అలా వచ్చిన నారదుడిని, "గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?" అని పదహారు ప్రశ్నలు వేస్తాడు వాల్మీకి. నారదుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. బాల్యంలోనే శ్రీరాముడు గుహుడు లాంటి (నీచ) జాతి వారితో సహవాసం చేయడంతో, ఆయన "గుణవంతుడు" అయ్యాడు. తాటకాది రాక్షసులను చంపి "వీర్యవంతుడు" అయ్యాడు. గురువాజ్ఞ మీరక పోవడం-జనకాజ్ఞ జవదాటక పోవడం-పరశురాముడిని చంపక పోవడం లాంటివి ఆయన "ధర్మజ్ఞుడు" అని తెలుపుతాయి. అయోధ్య కాండ వృత్తాంతమంతా శ్రీరాముడిని సత్యవాదిగా-దృఢవ్రతుడిగా-సచ్చరిత్రుడుగా తెలుపుతుంది. విద్వాంసుడు-సమర్థుడు అనే విషయాలను కిష్కింధ కాండలో హనుమంతుడితో జరిపిన సంభాషణ-వాలి వధల ద్వారా అర్థమవుతుంది. కాకాసుర రక్షణ శ్రీరాముడి సచ్చరిత్రను-సర్వ భూత హితాన్ని అరణ్య కాండ ద్వారా తెలుపుతుంది. సుందర కాండలో హనుమంతుడి రామ సౌందర్య వర్ణన ఆయనెంత ప్రియ దర్శనుడనేది తెలుపుతుంది. విభీషణ శరణాగతి ద్వారా రాముడి ఆత్మవంతుడి లక్షణాన్ని బయటపెడుతుంది. ఇంద్రజిత్తుపై కోపించక పోవడం, చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, రాముడి జితక్రోధత్వాన్ని తెలుపుతుంది. విరోధైన రావణుడిని మెచ్చుకోవడమంటే రాముడికి అసూయ లేదనే కదా. ఇలానే రాముడు కాంతియుక్తుడనీ-భయంకరుడనీ పలు సందర్భాల్లో అర్థమవుతుంది.
వాల్మీకి శ్లాఘించిన గుణాలు అసమానమైనవి. ఒక్కో గుణంలో అంతర్లీనంగా ఇంకొన్ని వుండడంతో అవి అనేకమయ్యాయి. మనుష్యమాత్రులందు ఇవి కనపడవు. ఇట్టి సుగుణ సంపత్తికలవాడు, ఇక్ష్వాకుల మహారాజు వంశంలో, ’రామా రామా రామా’, అని లోకులు పొగిడే రామచంద్రమూర్తి అనే పేరుగలాయన మాత్రమే. అతివీర్యవంతుడాయన. అసమానమైన-వివిధమైన-విచిత్రమైన శక్తిగలవాడు. స్వయంగా ప్రకాశించగలడు. అతిశయం లేని ఆనందంగలవాడు. ఇంద్రియాలను-సకల భూతాలను వశపర్చుకున్నాడు. సర్వం తెలిసినవాడు. నీతే ప్రధానం ఆయనకు. పరులకు హితమైన, ప్రియమైన మాటలు చెప్తాడు. శ్రీమంతుడు. ఎవరిపై శత్రు భావం లేకపోయినా, తనను ఆశ్రయించిన వారిని ద్వేషిస్తే, వారిని నాశనం చేసే వాడు. ఎత్తైన మూపురాలున్నవాడు. బలిసిన చెక్కిళ్లవాడు.
శంఖంలాగా మూడు రేఖలున్న కంఠముందాయనకు. విశాలమైన వక్షస్థలమున్నవాడు. గొప్పదైన విల్లు ధరిస్తాడు. ఆశ్రిత పాపాలనే శత్రు సమూహాలకు ప్రళయకాల యముడిలాంటి వాడు. యుద్ధంలో భయంకరుడు. శ్రీరామచంద్రమూర్తి చేతులు మోకాళ్లకు తగిలేంత పొడుగ్గా వుంటాయి. అందమైన వక్షం, అసమాన సౌందర్యమున్న నొసలు, చూసేవారిని మైమరిపించే నడక గలవాడు. అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలున్నాయి. ప్రకాశించే దేహ కాంతి, భయంకరమైన శత్రువులకు సహించలేని ప్రతాపం, మనోహరమై-బలిసిన మంచి వక్షం వున్నవాడు. కీర్తించదగిన నిడివి, వెడల్పాటి కళ్లు, ఎదుటివారు మెచ్చుకునే వేషం, శ్లాఘ్యమైన శుభ చిహ్నాలు, శుభం కలిగించే ఆకారం, మంచి గుణాల మనోహరుడాయన. కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన.
ఆశ్రితులు అనుభవించేందుకు అనువైన-యోగ్యమైన దివ్య మంగళ విగ్రహానికి తోడు, ఆశ్రితులను రక్షించేందుకు అనువైన గుణాలు కూడా వున్నాయి. శ్రీరామచంద్రుడు ప్రశస్తమైన ధర్మజ్ఞానంగలవాడు. క్షత్రియులకు ప్రశస్త ధర్మమైన శరణాగత రక్షణను ముఖ్య వ్రతంగా ఆచరించేవాడు. చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడు. సమస్త భూ జనులకు మేలైన కార్యాలనే చేసేందుకు ఆసక్తి చూపేవాడు. దానధర్మాలు, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడు. సర్వ విషయాలు తెలిసినవాడు. బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు. మిక్కిలి పరిశుద్ధుడు. ఋజుస్వభావం గలవాడు. ఆశ్రిత రక్షకుడు. ఆత్మతత్వం ఎరిగినవాడు. ఆశ్రితులకు, మాత, పిత, ఆచార్యులకు, వృద్ధులకు వశ పడినవాడు. విష్ణువుతో సమానుడు. శ్రీమంతుడు. లోకాలను పాలించ సమర్థుడు. ఆశ్రిత శత్రువులను, తన శత్రువులనూ అణచగలిగినవాడు. ఎల్ల ప్రాణికోటిని రక్షించాలన్న కోరికున్నవాడు. ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడు. స్వధర్మ పరిపాలకుడు. స్వజనరక్షకుడు. వేద వేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడు. కోదండ దీక్షాపరుడు. సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరి. జ్ఞాపకశక్తిగలవాడు. విశేషప్రతిభగలవాడు. సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడు. సాధువు. గంభీర ప్రకృతిగలవాడు. అన్ని విషయాలను చక్కగా బోధించగలవాడు. నదులన్నీ సముద్రానికి పారినట్లే ఎల్లప్పుడూ ఆర్యుల పొందుగోరేవాడు. అందరిమీద సమానంగా వారి, వారి యోగ్యత కొద్దీ ప్రవర్తించేవాడు. గొప్పగుణాలున్నవాడు. ఎప్పుడూ, ఏకవిధంగా, మనోహరంగా దర్శనమిచ్చేవాడు. సమస్తభూతకోటికి పూజ్యుడు. అన్నింటా గుణ శ్రేష్ఠుడు. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడు. గాంభీర్యంలో సముద్రుడంతటివాడు. ధైర్యంలో హిమవత్పర్వత సమానుడు. వీర్యాధిక్యంలో విష్ణు సమానుడు. చంద్రుడిలా చూసేందుకు ప్రియమైన వాడు. కోపంలో ప్రళయకాలాగ్ని. ఓర్పులో భూదేవంతటివాడు. దానంలో కుబేరుడు. అసమాన సత్యసంధుడు. ధర్మానికి మారుపేరు. ఇటువంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య రాజని తలచడం సరైంది కాదు.
అందుకే-ఇందుకే రాముడు దేవుడయ్యాడు. !!

‎శ్రీసీతారాముల‬ కళ్యాణం

సీతా రాములు
యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి |
నిందితస్స జనో లోకే స్వాఽఽత్మాప్యేనం విగర్హతే ||
#శ్రీసీతారాముల కళ్యాణం
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ...! 
చూచువారికి చూడముచ్చటట....
సీతారాముల కళ్యాణం చూతము రారండీ !
ఎన్నిసార్లు చూసినా అదొక కమనీయమైన వేడుక సీతారాముల కళ్యాణం
ఎన్నిసార్లు చేసినా అదొక ప్రజా సంక్షేమం కోరే లోక కళ్యాణం ..
శ్రీసీతారాముల‬ కళ్యాణం
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ...! 
చూచువారికి చూడముచ్చటట....
సీతారాముల కళ్యాణం చూతము రారండీ !
ఎన్నిసార్లు చూసినా అదొక కమనీయమైన వేడుక సీతారాముల కళ్యాణం
ఎన్నిసార్లు చేసినా అదొక ప్రజా సంక్షేమం కోరే లోక కళ్యాణం ..

Ramudu Thota Venkataramana's photo.
''ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయే వానుగతా సదా ||
ఈ శ్లోకం, జనకుడు రాముని చేతిలో మంత్రజలం విడుస్తూ చెప్పింది. 
పై శ్లోకమునకు అర్ధం -
'ఇయం సీత' ఇదిగో సీత. నా పుత్రిక. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీ ధర్మపత్ని. ఈమె పతివ్రతయై, ఎల్లవేళలా సహధర్మచారిణిలా నిన్ను అనుసరిస్తుంది.
రామా! ఈమె ఎవరో కాదు, 'ఇయం సీత' ఈమె సీత, నీ భార్యయే, నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో, ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించినది. ఈమెను నీవిప్పుడు స్వీకరిస్తేనే తప్ప, లోకానికి మంచి జరగదు. కావున నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు, నీ ధర్మాచరణలో నీ నీడవలె అనువర్తిస్తుంది.

పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు మరియు పరివారం సమేతంగా
 
దేవనాగరి राम 
సంప్రదాయభావం విష్ణువుఅవతారము 
ఆవాసం అయోధ్య 
ఆయుధం ధనుస్సు (కోదండ రాముడు) 
భార్య సీత

పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు మరియు పరివారం సమేతంగా
దేవనాగరి राम
సంప్రదాయభావం విష్ణువుఅవతారము
ఆవాసం అయోధ్య 
ఆయుధం ధనుస్సు (కోదండ రాముడు)
భార్య సీత!!


రామం  లక్ష్మణ  పూర్వజం  రఘువరం  సీతాపతిం  సుందరమ్
కాకుత్థ్సం  కరుణార్ణవం  గుణనిధిం  విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం  సత్యసంధం  దశరథతనయం  శ్యామలమ్  శాంత మూర్తిమ్
వందే  లోకాభిరామం  రఘుకుల  తిలకం రాఘవం  రావణారిమ్

 రామాయ  రామభద్రాయ  రామచంద్రాయ  వేథసే
రఘునాథాయ  నాథాయ  సీతాయా:  పతయే  నమ:
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంత మూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

‪‎హరిహర‬ తత్త్వం

‪‎హరిహర‬ తత్త్వం 
#హరిహర తత్త్వం 
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!

‪‎రామనామ‬ మహిమ అనిర్వచనీయం

‪‎రామనామ‬ మహిమ అనిర్వచనీయం{రామాయణప్రవచనసందర్భంగా}
#రామనామ మహిమ: {రామాయణప్రవచనసందర్భంగా}
శ్రవణ౦ కీర్తన౦ విష్ణోః స్మరణ౦ పాదసేవనమ్!
అర్చన౦ వ౦దన౦ ధ్యాన౦ సఖ్యమాత్మ నివేదనమ్!!

రామ అనే శబ్దాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువ౦టి పలుకుల్లో భాగ౦గా పలికినా అవి జీడి పప్పు పలుకులై ముక్తి సుగ౦ధాన్ని మనకి అ౦దిస్తాయట. ఒకానొక అరణ్య౦లో వేటాడుతున్న కిరాతకులను ఎవరు ప్రశ్ని౦చినా వారు వారి దినచర్యను ఈవిధ౦గా వివరిస్తున్నారట.

వనేచ’రామః’ వసుచాహ’రామః’ నదీస్త’రామః’ నభయ౦ స్మ’రామః’
ఇతీరయ౦తో కిరాతాః ముక్తి౦ గతా రామ పదానుష౦గాః!!

మేము అడవుల్లో తిరుగుతూ ఉ౦టా౦, జ౦తువులను వేటాడుతూ ఉ౦టా౦, నదులను సులువుగా దాటేస్తూ ఉ౦టా౦, భయ౦ మా మనస్సులోకి రాదు అ౦టూ ఉ౦టే అనుకోకు౦డా ఆమాటల్లో రామః రామః అని పలుమార్లు రావడ౦ వలన రామ స౦కీర్తన చేసిన ఫల౦ లభి౦చి వారు మోక్ష౦ పొ౦దగలిగారట.
శ్రవణ౦ కీర్తన౦ విష్ణోః స్మరణ౦ పాదసేవనమ్!
అర్చన౦ వ౦దన౦ ధ్యాన౦ సఖ్యమాత్మ నివేదనమ్!!వణ౦ కీర్తన౦ విష్ణోః స్మరణ౦ పాదసేవనమ్!
అర్చన౦ వ౦దన౦ ధ్యాన౦ సఖ్యమాత్మ నివేదనమ్!!
రామ అనే శబ్దాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా ఎటువ౦టి పలుకుల్లో భాగ౦గా పలికినా అవి జీడి పప్పు పలుకులై ముక్తి సుగ౦ధాన్ని మనకి అ౦దిస్తాయట. ఒకానొక అరణ్య౦లో వేటాడుతున్న కిరాతకులను ఎవరు ప్రశ్ని౦చినా వారు వారి దినచర్యను ఈవిధ౦గా వివరిస్తున్నారట.
వనేచ’రామః’ వసుచాహ’రామః’ నదీస్త’రామః’ నభయ౦ స్మ’రామః’
ఇతీరయ౦తో కిరాతాః ముక్తి౦ గతా రామ పదానుష౦గాః!!
మేము అడవుల్లో తిరుగుతూ ఉ౦టా౦, జ౦తువులను వేటాడుతూ ఉ౦టా౦, నదులను సులువుగా దాటేస్తూ ఉ౦టా౦, భయ౦ మా మనస్సులోకి రాదు అ౦టూ ఉ౦టే అనుకోకు౦డా ఆమాటల్లో రామః రామః అని పలుమార్లు రావడ౦ వలన రామ స౦కీర్తన చేసిన ఫల౦ లభి౦చి వారు మోక్ష౦ పొ౦దగలిగారట.

"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి // (ఉమాసంహిత)
('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును)
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః // (ఉమాసంహిత)
(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు)

రామానుగ్రహం‬

"#రామానుగ్రహం" ... 
''తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //
భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు. 
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో  నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును. 
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును. 
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది. 
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు. 
                                                    'సర్వేషు రమన్తే ఇతిరామః '
                                    'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి' 
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము."‪‎రామానుగ్రహం‬" ... 
''తీర్త్వా మోహార్ణవం హత్వా
రాగాద్వేషాది రాక్షసాన్ /
యోగీ శాంతి సమాయుక్తః
ఆత్మా రామో విరాజతే //
భావం: ఆత్మజ్ఞాని మోహ సాగరమును దాటి, రాగాద్వేషాది రాక్షసులను సంహరించి, అటు పిమ్మట శాంతిని పొంది ఆత్మారాముడై వెల్గొందుచున్నాడు.
ఈ శ్లోకమునకు స్వామి సుందర చైతన్యనంద వారి వ్యాఖ్యానం -
ఆత్మయైన తాను జీవుడని భ్రమ చెందుటయే మోహము. మనస్సులో మోహముదయించగనే ప్రశాంతత అనుభవించు చుండిన అంతఃకరణ అశాంతికి నిలయమగును. మోహపూరితమగు వాని మనస్సు రాగద్వేషములతో నిండియుండును. ఇవి సుఖదుఃఖములనెడి ద్వంద్వములను కల్పించి అనంత దుఃఖమును, అసంఖ్యాకమైన జన్మలను అందించును.
మోహము సాగరము వంటిది. అందుచే మోహార్ణవమని శ్రీ శంకరులువారు తెలియజేశారు. ఈ మోహము సాగరమువలె అనంతము, అగాధము అని భావం. రాగద్వేషాదులు రాక్షసుల వంటివి. రాక్షసుల ముందు జీవించువానికి ప్రాణభయం తప్పదు. రాగద్వేషాల మధ్య కొనసాగువానికి ప్రతిక్షణమూ మరణమే., ప్రతిక్షణమూ జననమే. విచారణ ద్వారా మోహసాగరమును దాటి, రాగద్వేషాది రాక్షసులను హతమార్చిన వానికి శాంతి లభించును. శాంతస్వరూపుడైనవాడు ఆత్మవిదుడై, ఆత్మారాముడై వెల్గొందును.
ఈ శ్లోకమును చదువగానే దీని అంతరార్ధం - రామాయణ వైభవము అని అర్ధమౌతుంది.
రామునికి దూరమై సీత లంకలో వున్నది. సీతలేని రాముడు శాంతిలేని జీవుడు. రాముడు దాటినా సాగరమే జీవుడు దాటవలసిన మోహమహార్ణవము. రామునిచేత వధించబడిన రావణ కుంభకర్ణాది రాక్షసులే, జీవునిచేత వధించబడవలసిన రాగద్వేషాదులు. సీత రామున్ని చేరినట్లు, శాంతి జీవున్ని సమీపించాలి. పట్టాభిషిక్తుడైన రాముడు అయోద్యరాముడు. సాక్షాత్కారము నొందిన జీవుడు ఆత్మారాముడు.
'సర్వేషు రమన్తే ఇతిరామః '
'అందరిలో రమించు దివ్య చైతన్యమే శ్రీరామచంద్రమూర్తి'
ప్రతి ఒక్కరూ ఆత్మారాములై తరించాలన్నదే వేదాంతాశయము.

అమ్మా‬ ! దుర్గమ్మ తల్లీ !

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
అమ్మా‬ ! దుర్గమ్మ తల్లీ ! .....
మంచేదో తెలుసు
అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు
చెడేదో తెలుసు 
అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు
మోస మనీ తెలుసు
అయినా నివారించడానికి తగిన నిబధ్ధత లేదు
స్వార్థ మనీ తెలుసు
అయినా విడనాడడానికి తగిన మానసిక సంసిధ్ధత లేదు
బ్రమ యనీ తెలుసు
అయినా బైట పడడానికి తగిన ధైర్యం లేదు
హింస అనీ తెలుసు
అయినా పరిహరించడానికి తగిన సౌమనస్యం లేదు
అన్యాయమనీ తెలుసు
అయినా ఎదిరించడానికి తగిన న్యాయ శీలత లేదు
దుర్మార్గ మనీ తెలుసు
అయినా వదిలి పెట్టడానికి తగిన సౌశీల్యం లేదు
అజ్ఞాన మనీ తెలుసు
అయినా జ్ఞానం వైపు పయనించడానికి తగిన సంస్కారం అలవడడం లేదు
తర తరాల మానవ మేథస్సు పండించిన
వేదాలు , ఉపనిషత్తులు, పురాణాలు , ఇతిహాసాలు , శాస్త్రాలు –
తదితర విజ్ఞాన భాండాగార మంతా
మంచేదో – చెడేదో తెలుసు కోడానికేనా ?
ఆచరించడానికి కాదా ?
మంచీ – చెడూ తేడా తెలుసు కున్న మేము చెడు వైపే మొగ్గు తున్నా మెందుకని
అమ్మా ! దుర్గమ్మ తల్లీ !
‘ విజయ దుర్గ ‘ వైన నిన్ను
తర తరాలుగా కొలుస్తున్న మా ‘ బుధ్ధి ‘ కి
‘ చెడుపై గెలిచి ,
మంచిని ఆచరించ గల ‘ ‘ పటిమను ‘ ప్రసాదించు !!

దుర్గ అన్న నామమే పరమపవిత్రం.

దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం. దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.

దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,
'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.

అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.

పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.

ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్తబ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుస్కునే పని ఉండడో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.

ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఓం దుర్గాయై నమః,ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః


‎శ్రీ‬ రామ రామ రామేతి రమే రామె మనోరమే

శ్రీ‬ రామ రామ రామేతి రమే రామె మనోరమే,
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే
రామ నమ వరనన ఒం నమ ఇతి “
అంటూ విశ్వనాధుడైన పరమశివుడే రామ నామము యొక్క విశిష్టతను మనకు తెలిపి,ఆయన పాద పద్మములే మన అందరికి శరణము అని ఉపదేశించినారు.
“రామ కోదండ రామ కల్యాణరామ
రామ సీతాపతి రామ నీవే గతి “
అంటూ రామ నామ మహత్యమును తెలిపి శరణాగతి మార్గమును మనకు అందించారు త్యాగరాజ స్వామి.
“శ్రీరామ చరణమే పల్లవై సాగింది ఆనాడూ..
పాటగా మిగిలిందీ ఈనాడు..”
శ్రీ రామ రక్ష ని మించినది ఏది లేదు.
మానవులకు ‘రామనామ స్మరణ’ జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ‘రామ’ యనగా రమించుట అని అర్ధం

‎శ్రీరామభుజంగప్రయాత‬ స్తోత్రం

‎శ్రీరామభుజంగప్రయాత‬ స్తోత్రం
విశుద్ధం పరం సచ్చిదానందరూపం - గుణాధారమాధారహీనం వరేణ్యమ్ |
మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం - సుఖాంతం స్వయం ధామ రామం ప్రవద్యే || ౧ ||
శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం - సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ |
మహేశం కలేశం సురేశం పరేశం - నరేశం నిరీశం మహీశం ప్రవద్యే || ౨ ||
యదావర్ణయత్కర్ణమూలేzంతకాలే - శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ |
తదేకం పరం తారకబ్రహ్మరూపం - భజేzహం భజేzహం భజేzహం భజేzహమ్ || ౩ ||
మహారత్నపీఠే శుభే కల్పమూలే - సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |
సదా జానకీలక్ష్మణోపేతమేకం - సదా రామచంద్రం భజేzహం భజేzహమ్ || ౪ ||
క్వణద్రత్నమంజీరపాదారవిందం - లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ |
మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం - నదచ్చంచరీమంజరీలోలమాలమ్ || ౫ ||
లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం - సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |
నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న - స్ఫురత్కాంతినీరాజనారాధితాంఘ్రిమ్ || ౬ ||
పురః ప్రాంజలీనాంజనేయాదిభక్తా-న్స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతమ్ |
భజేzహం భజేzహం సదా రామచంద్రం - త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే || ౭ ||
యదా మత్సమీపం కృతాంతః సమేత్య - ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ |
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం - సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ || ౮ ||
నిజే మానసే మందిరే సన్నిధేహి - ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర |
ససౌమిత్రిణా కైకయీనందనేన - స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || ౯ ||
స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-రనీకైరనేకైశ్చ రామ ప్రసీద |
నమస్తే నమోzస్త్వీశ రామ ప్రసీద - ప్రశాధి ప్రశాధి ప్రకాశ ప్రభో మామ్ || ౧౦ ||
త్వమేవాసి దేవం పరం మే యదేకం - సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే |
యతోzభూదమేయం వియద్వాయుతేజో - జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ || ౧౧ ||
నమః సచ్చిదానందరూపాయ తస్మై - నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |
నమో జానకీజీవితేశాయ తుభ్యం - నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ || ౧౨ ||
నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం - నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ |
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే - నమః సుందరాయేందిరావల్లభాయ || ౧౩ ||
నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే - నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే |
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే - నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే || ౧౪ ||
నమస్తే నమస్తే సమస్తప్రపంచ - ప్రభోగప్రయోగప్రమాణప్రవీణ |
మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం - విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యై || ౧౫ ||
శిలాపి త్వదంఘ్రిక్షమాసంగిరేణు - ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ |
నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా-త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర || ౧౬ ||
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం - నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర |
భవంతం భవాంతం భరంతం భజంతో - లభంతే కృతాంతం న పశ్యన్త్యతోzన్తే || ౧౭ ||
స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం - నరో వేద యో దేవచూడామణిం త్వామ్ |
సదాకారమేకం చిదానందరూపం - మనోవాగగమ్యం పరం ధామ రామ || ౧౮ ||
ప్రచండప్రతాపప్రభావాభిభూత - ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |
బలం తే కథం వర్ణ్యతేzతీవ బాల్యే - యతోzఖండి చండీశకోదండదండమ్ || ౧౯ ||
దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం - సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ |
భవన్తం వినా రామ వీరో నరో వా - సురో వామరో వా జయేత్కస్త్రిలోక్యామ్ || ౨౦ ||
సదా రామ రామేతి నామామృతం తే - సదారామమానందనిష్యందకందమ్ |
పిబంతం సమంతం సుదంతం హసంతం - హనూమంతమంతర్భజే తం నితాంతమ్ || ౨౧ ||
సదా రామ రామేతి రామామృతం తే - సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ || ౨౨ ||
అసీతాసమేతైరకోదండభూషై-రసౌమిత్రివంద్యైరచండప్రతాపైః |
అలంకేశకాలైరసుగ్రీవమిత్రై-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౩ ||
అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై-రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః |
అమందారమూలైరమందారమూలై-రరామాభిధేయైరలం దైవతై ర్నః || ౨౪ ||
అసింధుప్రకోపైరవంధ్యప్రతాపై-రబంధుప్రయాణైరమందస్మితాఢ్యైః |
అదండప్రవాసైరఖండప్రబోధై-రరామాభిధేయైరలం దేవతై ర్నః || ౨౫ ||
హరే రామ సీతాపతే రావణారే - ఖరారే మురారేzసురారే పరేతి |
లపంతం నయంతం సదాకాలమేవం - సమాలోకయాలోకయాశేషబంధో || ౨౬ ||
నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య - నమస్తే సదా కైకయీనందనేడ్య
నమస్తే సదా వానరాధీశవంద్య - నమస్తే నమస్తే సదా రామచంద్ర || ౨౭ ||
ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప - ప్రసీద ప్రసీద ప్రచండారికాల |
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్ - ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర || ౨౮ ||
భుజంగప్రయాతం పరం వేదసారం - ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యమ్
పఠన్సంతతం చింతయన్స్వాంతరంగే - స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః || ౨౯ ||