సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, August 27, 2014

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం
మంత్ర సిద్ది-ప్రతి నిత్యం 108 సార్లు జపించవలెయును.

"ఓం నమో హనుమతే మమ మదన క్షోభం సంహార సంహార ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ ఫట్ స్వాహ''!!

కామ వికారములు తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం లభించును

వందే శివం శంకరమ్

వందే శివం శంకరమ్
వందే శివం శంకరమ్..
''వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!

''మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"శివ'' పదాన్ని ద్వివచనముగా చేసి, ద్వంద్వ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, పరమేశ్వరులని అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర సంజనితమే. అందుకే వారిరువురు ఈ జగత్తుకు తల్లిదండ్రులైనారు. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.

"శివం'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు మంగళప్రదాత. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే
"సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''!!
అని కీర్తిస్తాం. "వందేశివం'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు."శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "జడుడు'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే సర్వం వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే;;. ఆయన కదలడు. ఈ సృష్టినంతటినీ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం''

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకంపార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం..
1.నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం |
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

2.సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

3.శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం |
పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ||

4.ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం |
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

5.శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం |
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

6.ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం |
అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

7.మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం |
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

8.సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం |
సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
#ఫలం-ఇష్టకామ్యార్ధ సిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం..
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

నరసింహావతారము

Photo: #వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||

వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||


http://tvramudu.blogspot.com/పంచామృతo
నరసింహావతారము..
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్|
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||
ప్రార్ధన శ్లోకం:
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||


Ramudu Thota Venkataramana's photo.
శ్రీ‬ లక్ష్మి నరసింహా స్వామి
నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము
నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము
పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము!!

108 సంఖ్య ప్రాముఖ్యత

 108 సంఖ్య ప్రాముఖ్యత

పురాణాలలో 108 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి ? , What is the importance of 108 in Hindu epics? 
భారతావని లో ఆద్యాత్మికం ఎక్కువ . 120 కోట్ల జనాభా లో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్య ఉన్నది . అదేమిటోచదవండి ....
•ఉపనిషత్తులు 108 ,
•అష్టోత్తర నామావళి 108 ,
•జపమాలలో పూసలు 108 ,
•చంద్రునికీ , భూమికి మధ్య వున్న దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి .,
•ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది ,
•శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి ... మొత్తం 108 ,

•దేవభాషలో అక్షరాలు 108 ,

•భరతుడి నాట్యశాస్త్రమ్లో తెలుపబడిన నాట్యభంగిమలు 108 ,

•దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.,
•108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం ,

•108 సార్లు హనుమాన్‌ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ,

•ఆంద్రప్రదేశ్ లో 108 ఫోన్‌ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది .ఆపత్భాందవి ... రోగులను సరియైన ఆసుపత్రికి తీసుకెల్తుంది .