సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా

సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా
సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా..
బంగారు! అంతర్దర్శనంలో విశ్వాసముంచు,ఎందుకంటే అది మాత్రమే ‪ భగవంతుని‬ చూడటానికి ఏకైక మార్గము.నిశ్శబ్దంగా బాధను సహించటం ద్వారా అంతరంగంలో ఆ#ధ్యాత్మికత తనను తాను వ్యక్త పరుచుకుంటుంది.‪‎అంతరాత్మకు‬ అతిసన్నిహితంగా ఉన్నప్పుడే భగవంతుడు‬అతిసన్నిహితంగా ఉంటాడు.
''‪‎తల్లియు‬ నీవే తండ్రియు నీవే
నాకు సర్వము నీవే సర్వేశ్వరా
సఖుడవు నీవే గురు దేవుడవు నీవే
నాకు సమస్తము నీవే సాయీశ్వరా
తనువు నీదే మనసు నీదే
నా ప్రాణము నీదే పర్తీశ్వరా
తోడు నీడవు అండ దండవు నీవే
నా ఇష్ట దైవము నీవే సాయిదేవా
సృష్టి స్థితి లయ కారకుడివి నీవే
జగన్నాటక సూత్ర దారివి నీవే సాయి మహాదేవా
సత్యం శివం సుందరం నీవే
సచ్చిదానంద స్వరూపం నీవే సద్గురు దేవా
నీవే స్వామి నాకు అన్నియు నీవే
శరణం సాయి నీకు నా ఆత్మార్పణం!!
షిర్డీ‬ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క ‪ జ్ఞానాన్ని‬ ప్రసాదిస్తాడు. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. సద్గురు‬ షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. సాయిబాబా భక్తుల సంకల్పాలు నెరవేరుతాయి. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి.‪ ప్రశాంతత‬ చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం. సద్గురు షిర్డీ సాయిబాబా నామంతో చింతలకు తావు లేకుండా పోతుంది. సాయిబాబా మనకు అన్నీ సమకూర్చే కామధేనువు, కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. మనకు సరైన‪ మార్గాన్ని‬ చూపే దివ్యమణి. సాయిబాబా సర్వాన్నీ ప్రబోధించే విజ్ఞాన సర్వస్వం. సాయి సూక్తులు అమృత జల్లులు. సాయిబాబా మనకు సర్వవేళలా రక్షణగా నిలుస్తాడు. సాయిబాబా ‪‎నామం‬స్మరిస్తే చాలు ధైర్యంగా ఉంటుంది. ఎనలేని శక్తి సమకూరుతుంది. సాయిబాబా సూక్తులతో స్ఫూర్తి కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మనోనిబ్బరం కలుగుతుంది. మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించే షిర్డీ ‪‎సాయిబాబాను‬ సదా స్మరించుకుందాం. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకుందాం.

No comments:

Post a Comment