సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి..
1.ఆధ్యాత్మికపరమైన విషయాలు వినేటప్పుడు ప్రాపంచిక‬ విషయాలు గురించి ఆలోచించరాదు. అట్లా ఆలోచించినవాడు తన్ను తాను మోసముచేసుకోవటమే.
2.నీగత జీవితములోని సంఘటనలను గుర్తుచేసుకో‬. నీజీవితము అనేకమంది నీబంధువుల జీవితముకంటే సుఖముగా గడచినది కదా - దానికి భగవంతునికి‬ కృతజ్ఞతలు తెలియచేసుకో.
3.పరస్త్రీలను పొగడటము, నీపేరు ప్రఖ్యాతుల‬ కోసము వారిని వాడుకోవడము మహాపాపము.
4.ఈజీవిత నాటక రంగములో నీవు ‪‎ఒకనటుడివి‬. ఈవిషయాన్ని తెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని మోసము‬ చేయ్యదలచుకొకు.
5.అడ్డదారులు ‪‎త్రొక్కుతు‬ ధనసంపాదన చేస్తున్న స్త్రీ, పురుషులనుండి దూరంగా ‪‎జీవించు‬.
6.నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన చెడు అనే మురికిని "#సాయి" అనే పటికతో శుభ్రము చేసుకొని మంచిమార్గములో పయనించు.
7.భగవంతుని గుడిలో ‪‎పూజలు‬, గుడి చుట్టు ప్రదక్షిణలు నీఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒకవేళ నీవు అనారోగ్యముతో ఉన్న సమయములో భగవన్‬ నామస్మరణ ఒక్కటే నీలో మానాసిక పరివర్తన కలిగించి నీ ‪‎అనారోగ్యానికి‬ మూలకారణము చూపించి నిన్ను వాటినుండి దూరముగా ఉంచుతుంది.
8.యితరులు నాసేవ చేసుకొని పేరు ప్రఖ్యాతులు‬ పొందుతున్నారు అనే భావన, వారి సేవలోని దోషాలను చూడటము మానివేయి. భక్తిలో‬ ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరి భక్తి వారిది. నీకు ఉన్న పరిధిలో నీవే ‪‎నాసేవ‬ చేసుకొని తృప్తిపొందు.
9.సంసారము అనే సముద్రములో‬ కష్ఠాలు కలిగించే పాములు ఉన్నాయి. మరియు ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయి. నీవు #భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు దూరంగా యుంటు ‪‎ఆముత్యపు‬ చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలి. జీవితాన్ని‪‎సార్ధకము‬ చేసుకోవాలి.
10.నీవు ‪‎జీవించినంతకాలము‬ నీజీవితాన్ని గంగానదిలాగ‬ పదిమందికి ఉపయోగపడని. యమునా నదిలాగ ‪‎భక్తితో‬ భగవంతుని పాదాలను కడగని, అపుడు నీవు సరస్వతీ నదిలో (కింటికి కనిపించని నది) ‪‎మోక్షాన్ని‬ పొందగలవు. అటువంటి జీవితముగడపినవాని పార్ధివ శరీరము బూడిద అయిన తర్వాత ఆబూడిదను ఏనదిలో కలిపిన ‪‎త్రివేణి‬ సంగమము (గంగా - యమున - సరస్వతి) నీటిలో కలిపినదానికంటే ఎక్కువ పవిత్రత‬ సంపాదించుకొంటుంది.
!!భగవదవతారమును, ‪‎పరబ్రహ్మస్వరూపుడును‬, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడు శ్రీ‪ ‎సాయినాధ్‬ మహారాజ్ కి జై హో!!

No comments:

Post a Comment