సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

సబ్ కా ‪‎మాలిక్‬ ఎక్.

''సబ్ కా మాలిక్ ఎక్!!
'సబ్ కా ‪‎మాలిక్‬ ఎక్!!
అందరి ప్రభువు ఒక్కడే!
అనంత కొటి బ్రహ్మండ నాయక, రాజాధి రాజ యోగి రాజ,
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ కీ జై!!
‪‎సాయిబాబా‬ బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబావారి బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.#సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు.
భగవంతుడు‬ అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. బాబావారి ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే‬ శాశ్వతమనీ చెప్పాడు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పాడు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పాడు.#సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు.సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవాడు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ‪‎ఋణాలను‬ చెల్లించడానికి దోహదం చేస్తాడని అతని అనుయాయులు అనేవారు.దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో‪ సంబంధం‬ లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవాడు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవాడు. “దప్పిక గొన్నవారికి ‪‎నీరు‬, ఆకలిగొన్నవారికి అన్నము‬, నగ్నంగా ఉన్నవారికి ‪‎దుస్తులు‬ ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే ‪‎శ్రీహరి‬ తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా‬ నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా‬ మొరగవద్దు” అని చెప్పాడు.

No comments:

Post a Comment