సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

సాయితత్వం

సాయితత్వాన్ని‬ నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు 'శ్రీసాయి‬ సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది. సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ‪‎ప్రయత్నం‬ చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, ‪‎వ్యక్తిత్వం‬ వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు.
‪‎ఓంసాయి‬ శ్రీసాయి జయ జయ సాయి
ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి || ఓంసాయి ||
ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి || ఓంసాయి ||
విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి || ఓంసాయి ||
మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి || ఓంసాయి ||

No comments:

Post a Comment