దేవుడు ఒక్కడే..
భక్తుల కోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరూ ఏ పేరుతోపిలిచినా పలుకుతూ వారిని ఆదుకుంటూ వుంటాడు.సృష్టిలోని సమస్త జీవులకూ దైవత్వాన్ని కల్పించి అర్చించిన, ఆరాధించిన గొప్ప సంస్కృతి మనది. మన దృష్టిలో నేల, నింగి, గాలి, నిప్పు, నీరు, చెట్లు, పర్వతాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు- ఒకటేమిటి? అది కాదు, ఇది ఔను అని లేకుండా అన్నీ భగవత్ స్వరూపాలే!
దేవుడు ఉన్నాడని కొందరు దేవుడు లేడని కొందరు ఇది ఎవ్వరికీ తెలియని విషయము.
నమ్మకమనేది రెంటిలోను ఉన్నది దేవుడు నమ్మిన దానిలోను, నమ్మని దానిలోనూ ఉన్నాడు. నమ్మకమంటే మనకు తెలియనిదాని గురించి ఊహించుకోవడం. నమ్మకమనే దేవుడు జీవికి, జీవగమనానికి ఆదారము. ప్రతి జీవి రేపు ఉందనే నమ్మకం తోనే ఈ వేళ బ్రతుకుతున్నది. రేపు సుఖం గాను విజయవంతం గాను ఒడిదుడుకు లేకుండా సజావుగాను సక్రమము గాను జరగాలని మనసులో నమ్మకాన్ని పెంచుకోవడం. ఆ మార్గము లో పయనించడమే, ఆ ప్రయాణానికి అవసమయ్యే శక్తి యే ఈ ప్రార్ధన. ప్రార్ధన మార్గాలు ఎన్నో మనిషి మనిషికీ మనసు మనసుకీ ఒక్కొక్కటి మాటలతో ప్ర్రార్ధన, పాటలతో ప్ర్రార్ధన, చేతలతో ప్రార్ధన, మౌనము తో ప్రార్ధన ఇలా ఎన్నోవిధాలు గా ప్రార్ధనా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ జీవుల మనిషిలోని ఈ నమ్మకం ఎంతో శక్తివంతమైనది. ఈ నమ్మకము ఎన్నడు మూడనమ్మకము కాకూడదు. ప్రతి వస్తువులోను జీవం ఉంటుంది. ప్రతి జీవిలోను శక్తి ఉంటుంది. ఆ శక్తి అనంతమైనది, అనిర్వచనీయమైనది, అభేద్యమైనది.ఆ శక్తి నే నమ్ము!అదే దేవుడు, దైవము, దేవత, మిత్రువు, శత్రువు.
''జీవికి జీవే దైవము జీవికి జీవే దైవము
జీవికి జీవే మిత్రువు జీవికి జీవే శత్రువు!!
శక్తి న్ని వేళల అన్ని చోట్ల అన్ని జీవులలోనూ ఉంది.
ఇందుగలదు అందులేదని సందేహము వలదు
ఎందెందు వెదకిచూస్తున్నా అందందే గలదు శక్తి విశ్వాసము ఉంటే{నమ్మకము వుంటే}!!
ఏ భాష నందైనా ఏ జాతి నందైనా
ఏ మతము నందైనా ఏ దేశమందైనా
ఏ లోకమందైనా దేవుడు ఒక్కడే!దైవము ఒక్కటే!!
~~~~~!!జై సద్గురువు సాయినాధ్ మహారాజ్ కీ జై!!~~~~~

No comments:
Post a Comment