సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

‎శ్రీసద్గురు‬ సాయిబాబా ఉపదేశము

శ్రీసద్గురు సాయిబబా ఉపదేశము
శ్రీసద్గురు‬ సాయిబాబా ఉపదేశము..
ఈ దిగువన చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ ‪‎అమూల్యాలు‬. వాటిని మనస్సులో వుంచుకుని అలాగే చేస్తే అవి మనకు మేలు చేస్తాయి. "ఏదైనా సంబంధం‬ వుండనిదే ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా అలాంటి జంతువుగాని నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకు. దాన్ని సాదరంగా చోడు. దాహం కలవారికి నీరిస్తే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే, బట్టలు లేనివారికి బట్టిలిచ్చినట్లయితే, నీ ఇంటి వసారా యితరులు కూర్చోడానికి, విశ్రాంతి‬ తీసుకోవడానికి ఉపయోగించినట్లయితే నిశ్చయంగా భగవంతుడు అమితంగా ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ దగ్గరికి వచ్చినట్లైతే, నీకు ఇవ్వటం యిష్టం లేకపోయినా నీవు ఇవ్వనవసరం లేదు. కాని వాడిపై కుక్కలా మొరగొద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినా, నీవు కఠినంగా జవాబు ఇవ్వకు. అలాంటి వాణ్ణి నీవు ఎల్లప్పుడూ ‪‎ఒర్చుకొంటే‬ నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది. ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నీవు చలించకు. నీవు ఉన్న చోటనే స్థైర్యంగా నిలబడి, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్నా ‪‎నాటకాన్ని‬ చూస్తూ ఉండు. నీకు నాకు మధ్యగల గోడను‬ నిర్మూలించు. అప్పుడు మనమిద్దరం కలిసే మార్గం‬ ఏర్పడుతుంది. నాకు నీకు భేదము ఉన్నదన్నదే భక్తుని గురువుకు దూరంగా వుంచుతుంది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. '‪‎అల్లా‬మాలిక్!' భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడే వారు కాదు. భగవంతుని‬మార్గం అసామాన్యం, అత్యంత విలువైనది, కనుక్కోవటం వీలుకానిది. వారి యిచ్చానుసారమే మనం నడుస్తాము. మన కోరికలను వారి నెరవేరుస్తారు. మనకు దారి చూపెడతారు.ఋణానుబంధంతో‬ మనమందరమూ కలిశాము. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి‬ సుఖంగాను, సంతోషంగానూ ఉందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందుతారో వారు‪ అమరులై‬ సుఖంగా ఉండెదరు. తక్కినవారందరూ పేరుకే ఊపిరి సలిపే వరకు మాత్రమే బ్రతుకుతారు.
~~~~~~~~~~!!జై సాయిబాబా అందరిని కాపాడుగాక!!~~~~~~~~

No comments:

Post a Comment