సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 7, 2016

శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట…

ఆ ఆలయంలో ఉన్న శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతుందట… అక్కడ పూజలు చేస్తే కోర్కెలన్నీ తీరుతాయట…
మన దేశంలోని చారిత్రాత్మక హిందూ దేవాలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉందని ముందే చెప్పుకున్నాం కదా! ఆ, అవును. సరిగ్గా ఆ కోవకే చెందే మరో ఆలయం గురించే ఇప్పుడు చెప్పబోయేది. అదే రాజస్థాన్ ధోల్‌పూర్‌లోని శివాలయం. దాదాపు వేయి సంవత్సరాల కిందట నిర్మాణమైనట్టుగా చెప్పబడుతున్న ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ శివాలయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా భక్తుల విశ్వాసాన్ని చూరగొంది. అక్కడి శివున్ని అచలేశ్వర్ మహాదేవ్‌గా పిలుస్తారు.

ఈ శివాలయంలో ఉన్న శివలింగం నిత్యం 3 రకాల రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం పూట ఎరుపు రంగులో, మధ్యాహ్నం కుంకుమ పువ్వు రంగులో, రాత్రికి నలుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. కాగా కొంత మంది సైంటిస్టులు ఆ ఆలయంలోకి ప్రవేశించే సూర్యకాంతి వల్లే అలా ఆ శివలింగం రంగులు మారుతుందని చెప్పారు. కానీ వారు దాన్ని సైంటిఫిక్‌గా నిరూపించలేకపోయారు. దీంతో ఈ రంగులు మారడమనేది అత్యంత మిస్టరీగా మారింది.

అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులు రోజంతా అక్కడే ఉండి శివలింగం మారే అన్ని రంగులను చూసి వెళ్తారట. ఎందుకంటే అలా చూడడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.

సాధారణంగా ఏ శివాలయంలో ఉన్న లింగమైనా ఎంతో కొంత ఎత్తు, పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. అయితే ధోల్‌పూర్ శివాలయంలోని లింగం మాత్రం చాలా పొడవైందని చెబుతారు. అయితే అది పైకి కనిపించదు. చూసేందుకు మామూలు శివలింగంగానే ఉంటుంది. కాకపోతే కింది వైపుకు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే భూమి లోపల లెక్కకు మించిన అడుగుల లోతు వరకు ఆ శివలింగం ఉంటుందని అంచనా. కొంత మంది భక్తులు ఆ శివలింగం పొడవు తెలుసుకునేందుకు దేవాలయం చుట్టూ భూమి లోపలికి సొరంగంలా తవ్వారట. అయినా ఆ శివలింగం చివరి భాగం మాత్రం ఎవరికీ కనిపించలేదట.

పెళ్లి కాని యువతీ యువకులు ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజలు చేస్తే వారికి వెంటనే వివాహం జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయంలో అధిక శాతం మంది యువతీ యువకులు కనిపిస్తారు.

సాక్షాత్తూ పరమశివుడు ఇక్కడ పాదం మోపాడని ఆయన అలా పాదం మోపిన ప్రదేశంలోనే శివలింగం ఏర్పడిందని, అక్కడే ఆలయం కూడా నిర్మించారని ఆ ఆలయానికి చెందిన పురాణ గాథలు చెబుతున్నాయి. కొంత మంది భూమికి మధ్య భాగం ఈ ఆలయంలోనే ఉందని విశ్వసిస్తారు.

ధోల్‌పూర్ శివాలయంలో స్వామికి ఎదురుగా కొలువై ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని 5 విభిన్న రకాల లోహాలతో తయారు చేశారట. ఒకానొక సమయంలో కొంత మంది దుండగులు ఈ ఆలయంలోకి చొరబడితే అక్కడి నందీశ్వరుడే వారిని పెద్ద పెద్ద ఈగలతో బయటికి తరిమికొట్టాడని చెబుతారు.

కాలసర్పదోషం కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం!!

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం!!

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు..

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?
గాయత్రీ మంత్రంలో 24 అరాలున్నాయి. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి, ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదటి శ్లోకంలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు సంపుటీకరించి, రామాయణాన్ని పవిత్రం చేశాడు. గాయత్రీ మొదటి అక్షరం 'త' శ్రీరామాయణ ప్రారంభ శ్లోకం'తపస్వాధ్యాయ నిరతం' అని శ్లోకం ప్రథమాక్షరంగా ఉంది. అలాగే పట్టాభిషేక సర్గలో, చివరశ్లోకం, చివరి అక్షరం 'త'గా ఉంది.

ఇదే ఫలశ్రుతి శ్లోకం. పఠన్‌ద్విజో వాగృషభత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వమీయాత్ పణిగ్జనః పుణ్యఫలత్వమీయాత్ జనశ్చశూద్రోపి మహత్వమీయాత్ ఇలా, 'త' అనే అక్షరంలో శ్రీరామాయణం పరిసమాప్తమైంది. గాయత్రీ మంత్రంలో 'థియోయోనః ప్రచోదయాత్' అని 'త్' కడపటి అక్షరంగా ఉంది. అందువల్ల శ్రీరామాయణం శ్రీ గాయత్రీమంత్రార్థ ప్రతిపాదకం. గాయత్రీమంత్రద్రష్ట అయినందువల్లే విశ్వామిత్రుడికి శ్రీరాముడి పూర్తి రక్షణ లభించింది.

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి?

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి?
మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నను, ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి పై శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లోకములు చెప్పు కోరాదు.
ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం . మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు.
ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించడం ముఖ్యం. హనుమంతునికి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షణాలు చేయాలో తెలుసుకుందాం..

హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు చెప్పుకోవల్సిన శ్లోకము''
ఆంజనేయం మహావీరం ! బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం ! రామదూతం నమామ్యహం !'

రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి.
పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం ‘‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్''

శ్లో|| ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం

శ్లో ||మర్కటే శ మహోత్సహా -సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో ||

అని చదువు కుంటూ ప్రదక్షిణాుల చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
‘‘యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ ణై | శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్యం, శరిస్నానం , నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తొలగిపోవున్నట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి.

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం, వారం నిత్యమూ చేయగలగం మరీ మంచిది.

మంగళవార సేవ : మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివేదించడం చేయాలి.

శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేధించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

పంచ సంఖ్య : హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి 5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం..

శివునికి ఏవిధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం!!

శివునికి ఏవిధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం!!

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాలపాటు సకల శుభాలతో అలరారుతుంటాయి.

మనం చాలా సందర్భాలలో శివుడికి అభిషేకం చేస్తుంటాం. మరి మీరు ఏవిధంగా చేస్తున్నారో మీకు తెలుసా? మీరు ఏవిధంగా చేస్తే మీకు ఏ పుణ్యం ఉంటుందో ఒక్కసారి తెలుసుకొండి.

ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించునుఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగునుమారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించునుగరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైనా దానం తిరిగి పొందగలరు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు. పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు. చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగునుపుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు. కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి పెరుగునుపసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు

శుక్రవారం గుడికి వెళ్ళే వారు పాటించాల్సిన నియమాలు....!

శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేకం. అలాగే ముత్తైదువులు, మహిళలకు ప్రత్యేకం. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల కలకలకాలం ముత్తైదు తనం ప్రాప్తిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు.

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి...

అమావాస్య రోజు ఏం చేయాలి ? ఎలాంటి పూజలు నిర్వహించాలి ?

మహాలయ అమావాస్య 


అమావాస్య రోజు ఏం చేయాలి ? 

 
                                   

ఎలాంటి పూజలు నిర్వహించాలి ?

ఈ సెప్టెంబర్ ౩౦ న వచ్చే అమావాస్యను బహుళ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య భాద్రపదమాసం కృష్ణపక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ పర్వదినాన శివుడిని భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. ఈ అమావాస్య రెండు రోజులు ఉంటుంది. ఈ మహాలయ అమావాస్య రోజును శివుడిని పూజించడం వలన కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయని నమ్మకం. పూర్తీ నమ్మకంతో భక్తితో శనిదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శనివారం:
శనివారం అమావాస్య వచ్చిందంటే ఆ రోజును చాలా పవిత్ర దినంగా భావించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ రోజున శని దేవుడిని పూజించడంవలన సకల పాపాలు తొలగి ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం సంపద శ్రేయస్సు కలుగుతుంది.

పుణ్యక్షేత్రాలు:
భాద్రపద అమావాస్య అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే రోజు. అందుకే ఆ రోజున పుణ్యక్షేత్రాలు దర్శించి పవిత్ర స్నానాలు చేసి, యాగాలు చేసి,ఉపవాసం ఉండడం వలన పాపాల నుంచి విముక్తి పొందుతారు.

విష్ణు:
ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మానసిక ప్రశాంతత,శారీరక ఆరోగ్యం, ఆర్ధికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.

Thursday, September 15, 2016

కాలభైరవుడు

కాలభైరవుడు

ఈ సాధన ఉపాసన చేయాలని కాలభైరవ తంత్రం సిద్దించుకోవాలని అవిశ్రాంతంగా కాళ్ళు అరిగేలా చాలామంది గురువుల కోసం తిరుగుతుంటారు.. కానీ ఇది సిద్దించుకోవాలంటే గురూపదేశం,, విధివిధానాలు తెలిస్తే సరిపోదు శివా,, కాలభైరవుని గురించి ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నాయో కూడా తెలిసుండాలి...
సిద్ధించుకున్నవారికి వారికి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి,,సమస్యలు గురించి కాలభైరవుడు ముందుగానే తెలియజేస్తుంటాడు..కాలభైరవుడు ప్రత్యక్షంగా కానీ,పరోక్షంగా కానీ సాధకుని వెంటే ఉండి అన్నివేళలా కాపాడుతుంటాడు.. తాంత్రిక సిద్దులు కాలభైరవుడిని శక్తి ఆలయాలకు రక్షణగా ఉంచేవారు.. ఆయన శక్తి అమోఘం..
రేపటినుంచి అవతారాల వివరాలు,,కాలభైరవుడు రహస్య ఉపాసన వివరాలు తెలియజేయగలం శివా..శివోహం..
నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారు ఇక్కడ ఇస్తున్న కాలభైరవగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటల తరువాత కాలభైరవుని పటం ముందు శుచీభూతులై కూర్చుని 108సార్లు పఠించండి శివా.. మీకు కాలభైరవుడి అనుగ్రహం వల్ల సమస్యలు పటాపంచలైపోతాయి..శివోహం
ఇది మీ మిత్రులందరికీ షేర్ చేసి తెలియజేయండి శివా..

||||ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహీ తన్నో కాలభైరవ ప్రఛోధయాత్||||

లలితా త్రిశతి శ్రీయంత్రం

"లలితా త్రిశతి శ్రీయంత్రం,,ప్రతీ గృహంలో పూజగదిలో ఉంచుకున్నా వారికి చాలామంచి జరుగుతుంది..

ఇది చాలా అద్భుతమైన మహిమగల యంత్రం,, అమ్మవారు మీరు చేసే పూజలను బట్టి మీ ఇంట నివసిస్తుంది ఈ యంత్రంలో,, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే శివా,, 

మానవుడు నిజమైనమానవుడు కావాలంటే ఎం చెయ్యాలి??

మానవుడు నిజమైనమానవుడు కావాలంటే ఎం చెయ్యాలి??

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁదలఁపఁడేనిఁ
గలుగనేటికిఁ దల్లులకడుపుఁజేటు.
భావము:
మానవుడు నిజమైనమానవుడు కావాలంటే కొన్ని విశిష్టలక్షణాలను పెంపొందించు కోవాలి. అలాకాకపోతే వాడు పుట్టుకకు ఒకప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. వాడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆవిశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తనపుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తతరంగా రూపుదిద్దుకొనే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.
నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయి నామాలు చదువు కుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆశ్రమను తట్టుకోలేక అభిషేకా నికో, పూజకో మొరాయిస్తాయి. దీక్షకలవాడు ఆమొరాయింపునకు లొంగిపో కూడదు. చేతులను శిక్షించి అయినా పూజను తుదియుట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజిం చటం అంటే అది. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమగుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లికడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది.
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి.. 

"ఖిలా వరంగల్" ("శంభు లింగేశ్వర స్వామి ఆలయం" )

 "ఖిలా వరంగల్"

ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని ఇంకెక్కడైనా చూశారా ??
ఇది వరంగల్ జిల్లా "ఖిలా వరంగల్" లో కాకతీయ రాజులు నిర్మించిన "శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం" లో గర్భాలయానికి బయట ఉంది..!!
ఈ ఆలయం చిన్నదే. శిల్పసంపద మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది.

క్రీ .శ  1162  లో రెండవ ప్రోల రాజు ,హనుమకొండను రాజధానిగా చేసుకొని  రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి .అప్పుడు దేశం సుభిక్షంగా ఉంది .పచ్చని పైరుపంటలతోకళకళలాడుతూ ఉంది.ఒకానొక రోజు   రైతులు పంటను కోసి బండ్లపైకి  ఎత్తించి ,ఇంటికి తిసుకువస్తుండగా  ఒక బండి చక్రం భూమి లోపలికి కూరుకుపోయింది. రైతులంతా చాల ప్రయత్నించారు కానీ లాభం లేకపోగా ఊరులోని వారు కూడా వచ్చి సాయం చేయగా చివరికి ఆ చక్రాన్ని పికి తీసారు.భూమినుండి బయటికి వచ్చిన ఆ చక్రం బంగారు కాంతులతో మెరుస్తూ వచ్చింది. దానితో ఆ రైతుల మనసులు మురిసిపొయ్యాయి.ఆ తర్వాత అసలెందుకు అల అయ్యిందో ఎవరికీ ఎంత ఆలోచించినా అర్థంకాక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు .

కొన్ని రోజులకి అందరు అనుకోవడంవల్ల ఆ విషయం  రాజుకి తెలిసింది .దాంతో ఆ రాజు ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించాడు. ఆ ప్రాంతం అంతా బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉండటంతో ,ఆ రాజు నమస్కారం చేసి పంచాక్షరి మంత్రమయిన “ఓం నమ:శివాయ” అని పదే పదే జపించాడు.దాంతో ఆ ప్రాంతంలో స్వయంభూలింగం దర్శనమిచ్చింది .దాంతో ఆ రాజు ఆ లింగాన్ని తనరాజదానిలో ప్రతిష్టించాలని తలంచి ,శివలింగాన్ని తీయించబోయి విపలమయ్యాడు.

అప్పుడు ఆ ప్రోలరాజు గురువర్యులైన  శ్రీ పాదులను ప్రశ్నించాడు .దానితో వారు దివ్య దృష్టితో దర్శించి ,ఆ స్వయంభూ లింగం ఇనుమును కూడా బంగారం చేయగల గొప్ప మహిమలు కలదని తెలియచేసి ,అచ్చటనే దేవాలయ నిర్మాణం చేయమని ఆదేశించారు .అంతటితో ఆ రాజు అచ్చటనే దేవాలయాన్ని నిర్మించి ,చుట్టూ ఏడుకోటలు కట్టించి ఒక పెద్ద నగరాన్ని నెలకొల్పాడు .అదే కాకతీయుల రాజధాని అయిన  అప్పటి ఓరుగల్లు యిప్పటి వరంగల్.ఈ ఆలయంలో మహిషాసురమర్తిని సహిత శంభులింగేశ్వర స్వామి కొలువైవున్నాడు.

!!సర్వం శివమయం జగత్ !!

!!సర్వం శివమయం జగత్ !!
దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

తాత్పర్యం
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

ఆట కదరా శివ ఆట కద కేశవ!!

ఆట కదరా శివ
        ఆట కద కేశవ!!

       శివయ్యా  ఈ శరీరం నీది
       శివయ్యా  ఈ ప్రాణాలు నీవి
       శివయ్యా  ఈ మనస్సు నీది
   శివయ్యా ఈ మనస్సును ఆఙ్ఞాపించే బుద్ధి
          కూడ    నీదేనయ్యో !!
      శివా ఇవన్ని నీవైనప్పుడు నా శరీరం
        నా ప్రాణ నామనోబుద్ధులనే
          ఈ నేను ఏవర్నయ్యా???????
   ను చెప్పకుంటే  నీ అంశారూపమైన        మాగురు చెప్పిండులే!!! ఏం చెప్పిండు ర నీకు అంటావ! ఆ నేను, నాది అనేవాడు కూడ నీవేనని చెప్పిండు. నువ్వేమో మాకు నేను(అహం) నాది(మమం)   అనే రెండు కళ్ళను ఇచ్చి ఆ మూడో కన్నుకు(ఙ్ఞానం) నువ్వు కానరానీకుండ బూడిదను పూసి మాచేతనే మమ్మల్ని     ఆటాడిస్తూ  తమాషా చూస్తుంటావంటగా!!!    భగీ:-18/61

 ఓ శివయ్యో..
             ఆడించిన ఇక బస్ ఇక మేము ఆడలేమ్ ఏంతో మంది పద్మాష్ గాళ్ళకి కూడ యెన్నెన్నో వరాలిస్తావని విన్న. ఎన్నెన్నో జన్మజన్మలనుండి నాకు ఈ మన్మధుడి బేజారు ఎక్కువైంది జర నీ మూడో కన్ను ఇటిస్తే ఈ పద్మాష్ మన్మధున్ని శుభ్భరంగ భస్మం(కర్మలు మాఫి) చేసి వాడి బూడిద పూస్కోని(నిర్గుణుడినై) అంగరంగ వైభవంగ నీ   కైలాసమొచ్చి నీ కాళ్మొకుతా!!!
     
భగీ:- 18/66 -సర్వధర్మాన్పరితజ్య మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వ పాపేభ్యో మొక్షయిష్యామి మాశుచః ||

నేను అంటే అపద్ధం నువ్వు అంటే అఙ్ఞానం


  జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

Wednesday, August 24, 2016

కృష్ణాష్టమి పూజా విధానం!! పాఠించాల్సిన మంత్రాలు!!

అందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!
కృష్ణాష్టమి పూజా విధానం!! పాఠించాల్సిన మంత్రాలు!!
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. ఆగస్టు 25న శ్రీకృష్ణామి. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.

చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మల, శ్రీ కృష్ణుడి  చిత్రపటం  లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.

ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.

కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.

చివరగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధం గా "నీ కర్తవ్యాన్ని నీవు చిత్త శుద్ధి తో నిర్వహించు పలితాన్ని నాకు వదిలేయి"..ఆనే మాటను ఆచరణ లో పెడితే మనమందరం సుఖంగా జీవించవచ్చు.

Sunday, August 14, 2016

కుక్కె సుబ్రమణ్య

కుక్కె సుబ్రమణ్య
జగన్మాత పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.
ప్రకృతి ఒడిలో...
పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర
సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.
నాగులకు రక్షకుడు:
నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.
ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు..
ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి... తదితర పూజలను నిర్వహిస్తారు.
కుమారధారలో పవిత్రస్నానం..
శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
ఎలా చేరుకోవచ్చు..
మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.మంగళూరు రైల్వేస్టేషన్‌ , బస్‌స్టాండ్‌ నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు సుబ్రమణ్య మీదుగా వెళుతాయి.

స్వామివారి "పెళ్లి పిలుపు"

స్వామివారి 'పెళ్లి పిలుపు!'
లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!
పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అహోబిలం పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారు. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల అంగళ్లే! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.

ఉత్సవ చరిత్ర
'పరి' అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్నే పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. 'గ్రామ గ్రామానికీ నన్ను తీసుకెళ్లండి. నా పాదపద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి' అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల క్షేత్ర మహత్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. ఆరువందల సంవత్సరాల క్రితం, ప్రథమ పీఠాధిపతి శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచీ నేటి వరకూ పార్వేటోత్సవాలు 45 రోజుల పాటూ 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆతర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో (మార్చి 17) వేడుకలు పూర్తవుతాయి.
స్థానిక ఐతిహ్యం...
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. 'పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను' అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.
పారువేటోత్సవాలు...
స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో 'తెలుపు'లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే 'తెలుపు.. ఎరుపు' రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.
దర్శన భాగ్యం ఇలా...
పారువేటోత్సవాల్లో భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవతంతు ముగుస్తుంది. ఆ 45 రోజులూ ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ వూరికి వచ్చాడంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే వేయి దుకాణాలు వెలుస్తాయి. రోజూ కనీసం రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 'ఆరువందల ఏళ్లుగా... ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే' అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌. అహోబిలం.. నంద్యాల నుంచి అరవై కిలోమీటర్లూ, కర్నూలు నుంచి దాదాపు నూటనలభై కిలోమీటర్లు.

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?

వేంకటేశ్వరస్వామి ఏ రూపం?
విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?
తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ''ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు'' (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్‌ ఆళ్వార్‌ నోరారా కీర్తించాడు. ''స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః'' అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది. సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన
సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ''హరి అవతారములే అఖిలదేవతలు'' అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!

ఎంత గొప్పవాడండి రాముడు

ఎంత గొప్పవాడండి రాముడు

రావణాసుడు సీతాదేవిని తీసుకు వెల్లినపుడు సమస్త ప్రానలు చూశాయ్. కాని రాముడు అడిగినప్పుడు ఏ ఓక్క చెట్టు గాని ,అడవి గాని,ప్రాని గాని చెప్పలేదు .ఎందుకో తెలుసా చెప్తె రావణాసురుడు ఎక్కడ చంపేస్తాడో అని.
కోపం ఆపుకోలేక రాముడు లక్ష్మణుడితో నేను రామ బాణం వేస్తాను ఈ సమస్త ప్రాణులను , ఆకరికి దేవుళ్ళను  కూడ బంథీ చేస్తానని కోపంతో ఊగిపోతుంటాడు.తమ్ముని మాట విని ఆగిపోతడు.
" క్షణకాలం కోపంతో ఎంతో  గోప్ప పేరున్న రాముడు పాతాలానికి వెళ్ళేవాడు. ఆ కోపాన్ని జయంచటం వల్లే రాముడు దేవుడయ్యాడు."

రుద్రేశ్వరాలయం

రుద్రేశ్వరాలయం
పంచాక్షరీ మంత్రం మారుమోగినచోట శతాబ్దాలపాటూ శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. నరపతులూ గజపతులూ కొలిచిన శివలింగం శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. ఆ పరిస్థితుల్లో... కొండపాక ప్రజలు కొండంత చారిత్రక స్పృహతో వ్యవహరించారు. రుద్రేశ్వరాలయాన్ని పునర్నిర్మించుకున్నారు.
కతీయ నిర్మాణశైలి... అలనాటి శిల్పకళా ప్రతిభకు తార్కాణం! అందమైన స్తంభాలూ, అంతెత్తు ద్వారాలూ, గర్జించే సింహాలూ, పురాణ గాథలూ - ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. రాతితో మలచిన రమణీయ కావ్యాలవి! మెదక్‌జిల్లా కొండపాకలోని రుద్రేశ్వరాలయమూ ఆ శిల్పకళారీతికి ప్రతీకే. సుమారు 820 సంవత్సరాల నాటి ఈ క్షేత్రం అనేకానేక కారణాలతో శిథిలావస్థకు చేరుకుంది. తాతముత్తాతలు కథలుకథలుగా చెప్పిన ఓ మహాలయ వైభవం మట్టికొట్టుకుపోతుంటే కొండపాక గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఆ వారసత్వ సంపదను కాపాడుకోవాలని తీర్మానించారు. వ్యయప్రయాసలకోర్చి పూర్వ రూపాన్ని తీసుకొచ్చారు.

తూర్పునకు అభిముఖంగా ఉన్న ఆలయంలోకి వెళ్లగానే...మధ్యలోని మంటపంలో శివలింగ స్వరూపంలో రుద్రేశ్వరుడు దర్శనమిస్తాడు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని ప్రాణవట్టం నమూనాలోనే ఇక్కడి ప్రాణవట్టం కూడా చతురస్రాకారంలో ఉంటుంది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడికి పేరు! ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో శివపంచాయతనంతోపాటూ కన్యకాపరమేశ్వరి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, మార్కండేయుడు, వీరభద్రుడు, త్రిమాతలు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి.
సైనికులే నిర్మించారు!
ఆలయ చరిత్రనంతా ఇక్కడున్న శాసనాల్లో నిక్షిప్తం చేశారు. రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో...కాకతీయుల కొలువులో పనిచేసిన ముప్ఫైమంది సైనికులు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆ ప్రకారంగా, రుద్రేశ్వరాలయ నిర్మాణం క్రీ.శ 1194లో జరిగింది. ప్రాంగణంలోనే త్రికూటేశ్వర (సూర్య-శివ-అంబిక) ఆలయమూ ఉండేదట. గణపతిదేవుడు పాలిస్తున్న కాలంలో... డెబ్భై గ్రామాలపై అధికారమున్న ఆదిత్య అమాత్యుడు త్రికూటేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ గుడి పూర్తిగా శిథిలమైపోయింది. సమష్ఠి కృషితో...రుద్రేశ్వరాలయానికి వైభవాన్ని తీసుకొచ్చిన గ్రామస్థులు, త్రికూటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికీ నడుంబిగించారు.
కోరికలు తీర్చే దేవుడు!
ఆలయంచుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేసి, శివుడి ఎదురుగా ఉండే నందికేశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా... జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు, రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. వందేళ్లక్రితం ఓసారి, ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్థులు సహస్ర ఘటాభిషేకం (వెయ్యి బిందెలతో గర్భాలయంలో నీళ్లు నింపడం) చేశారట. వెంటనే కుండపోత వర్షం కురిసి ... కరవు కనిపించకుండా పోయిందట! ఈ ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మించాలని మొదట సంకల్పించింది కొండపాక గ్రామానికి చెందిన మరుమాముల సీతారామశర్మ. సంకల్పించడమే కాదు, కొంత మొత్తాన్ని విరాళంగా కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తూ పనులు ప్రారంభించకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత ఓసారి... శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠాధిపతులు మాధవానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆలయ చరిత్ర గురించి విన్నారు. గ్రామస్థుల్ని సమావేశపరచి, పునః ప్రతిష్ఠాపనకు ప్రేరణ కలిగించారు. పల్లెజనమంతా కలిసి కోటి రూపాయలకుపైగా ఖర్చుచేసి, చారిత్రక ఆలయానికి జీవంపోశారు.
రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణం 2006 ఆగస్టులో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణ శైలికి ఏ భంగమూ వాటిల్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడు నుంచి నిపుణులైన శిల్పులను పిలిపించారు. ఆ కార్యక్రమానికి ఓ రూపం రావడానికి ఆరేళ్లు పట్టింది. 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు. లింగాన్ని కళావరోహణం చేశాక... మళ్లీ ప్రతిష్ఠించే వరకూ జలాధివాసంలోనే ఉంచారు. ఆ ఆరేళ్లూ అఖండదీపం వెలిగించారు. అప్పటి రాతి ధ్వజస్తంభం చెక్కుచెదరకుండా ఉండటంతో దాన్నే నిలబెట్టారు.
విశేష పూజలు...
రుద్రేశ్వరాలయంలో ప్రతి మాసశివరాత్రికీ మాస బ్రహ్మోత్సవాలూ మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం జరుగుతాయి. శివరాత్రికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామస్థులంతా ఎడ్ల బండ్లనూ వాహనాలనూ చక్కగా అలంకరించుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లే రాజీవ్‌ రహదారిపైనే కొండపాక ఉంది. కొమురవెల్లి, సిద్దిపేట కోటిలింగాల గుడి... సమీపంలోని దర్శనీయ స్థలాలు.