మానవుడు నిజమైనమానవుడు కావాలంటే ఎం చెయ్యాలి??
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁదలఁపఁడేనిఁ
గలుగనేటికిఁ దల్లులకడుపుఁజేటు.
భావము:
మానవుడు నిజమైనమానవుడు కావాలంటే కొన్ని విశిష్టలక్షణాలను పెంపొందించు కోవాలి. అలాకాకపోతే వాడు పుట్టుకకు ఒకప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. వాడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆవిశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తనపుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తతరంగా రూపుదిద్దుకొనే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.
నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయి నామాలు చదువు కుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆశ్రమను తట్టుకోలేక అభిషేకా నికో, పూజకో మొరాయిస్తాయి. దీక్షకలవాడు ఆమొరాయింపునకు లొంగిపో కూడదు. చేతులను శిక్షించి అయినా పూజను తుదియుట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజిం చటం అంటే అది. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమగుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లికడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది.
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి..

No comments:
Post a Comment