సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, September 20, 2014

‎శ్రీసాయి‬ శివ స్తోత్రం

 ‎శ్రీసాయి‬ శివ స్తోత్రం
‎శ్రీసాయి‬ శివ స్తోత్రం..
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః
సదాశివం భజామ్యహం సకల లోక నాయకం
సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం
సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (1)
నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం
సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం
త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (2)
జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం
విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం
చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (3)
నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం
స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం
యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (4)
రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం
సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం
సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః (5)

శ్రీసాయినాథ‬ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం

శ్రీసాయినాథ‬ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం

‎శ్రీసాయినాథ‬ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం..
అత్రిసుపుత్ర - శ్రీ సాయినాథ
ఆశ్రితరక్షక - శ్రీ సాయినాథ
ఇందీవరాక్ష - శ్రీ సాయినాథ
ఈశితవ్య - శ్రీ సాయినాథ
ఉదాత్తహృదయ - శ్రీ సాయినాథ
ఊర్జితనామ - శ్రీ సాయినాథ
ఋణవిమోచక - శ్రీ సాయినాథ
ఎడరువినాశక - శ్రీ సాయినాథ
ఏకధర్మబోదిత - శ్రీ సాయినాథ
ఐక్యమత్యప్రియ - శ్రీ సాయినాథ -
ఒమ్మతబోధిత - శ్రీ సాయినాథ
ఓంకారరూప - శ్రీ సాయినాథ
ఔదుబరవాసి - శ్రీ సాయినాథ
అంబరీశ - శ్రీ సాయినాథ
ఆఃశతృవినాశక - శ్రీ సాయినాథ
కరుణామూర్తి - శ్రీ సాయినాథ
ఖండోభానిజ - శ్రీ సాయినాథ
గణిత ప్రవీణ - శ్రీ సాయినాథ
ఘనశ్యామ సుందర - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శివ - శ్రీ సాయినాథ -
చతుర్ముఖ బ్రహ్మ - శ్రీ సాయినాథ
చందస్సు స్ఫూర్తి - శ్రీ సాయినాథ
జగత్రయ బడయ - శ్రీ సాయినాథ
ఝగమగ ప్రకాశ - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శ్రీ - శ్రీ సాయినాథ
టంకకదాని - శ్రీ సాయినాథ
ఠంకశాహి - శ్రీ సాయినాథ
డంబవిరోది - శ్రీ సాయినాథ
ఢక్కానాధప్రియ - శ్రీ సాయినాథ
ణతపరిపాలితను - శ్రీ సాయినాథ -
తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
ధళదళిపనణి - శ్రీ సాయినాథ
దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
ధర్మరక్షక - శ్రీ సాయినాథ
నక్షత్రనామ - శ్రీ సాయినాథ
పరంజ్యోతి శ్రీ - శ్రీ సాయినాథ
ఫకీర రూపి - శ్రీ సాయినాథ
బలరామసహోదర - శ్రీ సాయినాథ
భక్తి ప్రదాయక - శ్రీ సాయినాథ
మశీదువాసి - శ్రీ సాయినాథ -
యజ్ఞపురుష - శ్రీ సాయినాథ
రఘువంశజ - శ్రీ సాయినాథ
లక్షణాగ్రజ - శ్రీ సాయినాథ
వనవిహారి - శ్రీ సాయినాథ
శమీవృక్షప్రియ - శ్రీ సాయినాథ
షట్కరీవిజ - శ్రీ సాయినాథ
సచ్చిదానంద - శ్రీ సాయినాథ
హఠయోగి - శ్రీ సాయినాథ
శబీజాక్షర - శ్రీ సాయినాథ
క్షమాశీలశ్రీ - శ్రీ సాయినాథ

సబ్ కా ‪‎మాలిక్‬ ఎక్.

''సబ్ కా మాలిక్ ఎక్!!
'సబ్ కా ‪‎మాలిక్‬ ఎక్!!
అందరి ప్రభువు ఒక్కడే!
అనంత కొటి బ్రహ్మండ నాయక, రాజాధి రాజ యోగి రాజ,
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్ కీ జై!!
‪‎సాయిబాబా‬ బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబావారి బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.#సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు.
‪భగవంతుడు‬ అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. బాబావారి ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే ‪మోక్షమే‬ శాశ్వతమనీ చెప్పాడు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పాడు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పాడు.#సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు.సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవాడు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ‪‎ఋణాలను‬ చెల్లించడానికి దోహదం చేస్తాడని అతని అనుయాయులు అనేవారు.దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో‪ సంబంధం‬ లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవాడు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవాడు. “దప్పిక గొన్నవారికి ‪‎నీరు‬, ఆకలిగొన్నవారికి ‪అన్నము‬, నగ్నంగా ఉన్నవారికి ‪‎దుస్తులు‬ ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే ‪‎శ్రీహరి‬ తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే ‪మర్యాదగా‬ నిరాకరించు గాని వారియెడల ‪కుక్కలాగా‬ మొరగవద్దు” అని చెప్పాడు.

‎శ్రీసాయిబాబా‬ భక్తి ముక్తిదాయక స్వరూపుడు.

‎శ్రీసాయిబాబా‬ భక్తి ముక్తిదాయక స్వరూపుడు..
''‪మంచితనం‬ ఎక్కడ ఉంటుందో దైవం అక్కడే ఉంటుంది!''నేను ఇవ్వదలచుకున్నవి భక్తులు కోరటం ప్రారంభిస్తారనే ముందుగా నా భక్తులకు వారు కోరుకున్నవి అందిస్తాను” ఇది షిర్డీ సాయినాథుని ‪ప్రవచన‬. భగవదవతారాలలో శ్రీ సాయి అవతారం మహోత్కృష్టమైనది. బాబా భక్తులకు చేసిన వాగ్దానాలలో ఈ వాగ్దానం ‪‎సర్వోత్కృష్టమైనది‬. సాధారణంగా కోరికలు వదులుకోనిదే మోక్షం కలగదని మన వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మరి, శ్రీ సాయి తన వద్దకు వచ్చే వారిని కోరికలతోనే రమ్మంటున్నారేమిటి? అనే సందేహం కలుగవచ్చు. దీనికి బాబా ఇలా సమాధానం చెప్పారు.
“‪నిత్యం‬ నన్నే స్మరించి, ధ్యానించి, పూజించే భక్తుల కోరికలు తీరుస్తాను, కష్టాలు ఎడబాపుతాను. మనిషి జీవితంలో కష్టాలు, చింతలు, కలతలు తీరిపోతే మనసు ప్రశాంతమవుతుంది. అప్పుడు‪ మనిషి‬ తన దృష్టి భగవంతుని పైకి సారిస్తాడు. కోరికలతో ‪‎భగవంతునిపై‬ దృష్టి పెట్టడానికి, కోర్కెలు తీరిన తర్వాత దృష్టి సారించడానికి ఎంతో తేడా ఉంది. కోరికలు, వ్యామోహాలు తీరిపోయిన మనిషి జ్ఞానం కోసం భగవంతునిపై మనసు లగ్నం చేస్తాడు. ‪తానెవరో‬ తెలుసుకుంటాడు. తనను తాను ‪ఆత్మజ్ఞానంతో‬ తెలుసుకున్న మనిషి ఏదైనా సాధిస్తాడు”
భక్తుల శ్రేయస్సు కోసం తాపత్రయపడే దైవం ‪‎బాబా‬. కోరికలు తీర్చే చేత్తోనే ‪‎జ్ఞానాన్ని‬ ప్రసాదించే భక్తిముక్తిదాయక స్వరూపం షిర్డీ ‪‎సాయినాథుడు‬. అందుకే బాబా భక్తసులభుడయ్యాడు. కోరికలు తీర్చే కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. అడిగినవన్నీ ఇచ్చే కామధేనువు. షిర్డీ‪ ‎సాయినాథుని‬ దయవల్ల మన కోరికలన్నీ తీరుతున్నాయి. సంకల్పాలన్నీ నేరవేరుతున్నాయి. మనసు ఏకాగ్రమూ, ప్రశాంత చిత్తమూ అవుతోంది. ఇక ఇప్పుడు మనం బాబాను కోరుకోవలసింది‪ జ్ఞానమే‬. బాబా ఉపదేశాల్లోని సారాన్ని గ్రహిద్దాం. సాయి తత్త్వాన్ని ఒంటపట్టించుకుందాం. బాబా లీలల్లోని అంతరార్థం అవగతం చేసుకుందాం. బాబా ఏం చెబుతున్నారో విందాం. “నేను ఏం చెబుతున్నానో గ్రహించేవారు ఒక్కరూ లేరు. నా ఖజానాలో ‪ఆధ్యాత్మిక‬ జ్ఞానమనే ధనం నిండుగా ఉంది. ఎవరికి కావలసింది వారు బండ్ల కొద్ది తీసుకుపోవచ్చు” అని బాబా ఆహ్వానిస్తున్నారు.
‪సాయి‬ నామమే ఈ విశ్వంలో దివ్యధామం
‘సా’ అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం.
‘యి’ అంటే ఇలపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్యౌషధం.
‘సాయి’ ‪నామంలో‬ సర్వశక్తులూ ఇమిడి ఉన్నాయి. సాయి బోధనల్ని స్ఫూర్తిగా తీసుకుంటే అనంతమైన శక్తి సామర్ద్యాలు సొంతమవుతాయి. సాయి ‪‎తత్త్వాన్ని‬ ఒంటపట్టించుకుంటే అద్భుతమైన వికాసం పురివిప్పుతుంది. సాయి పథం ఆదర్శ సంఘ జీవనానికి, వ్యక్తిత్వ వికాస సంపన్నతకు బాటలు వేస్తుంది. బాబా చెప్పినట్టు ‪‎స్వార్థంతో‬ తన కోసమే తాను చేసుకునే ప్రార్థనకు ఫలితం ఉండదు. అది తనతోనే అంతమైపోతుంది. ఇతరులకోసం చేసేది ‪శాశ్వతంగా‬నిలిచిపోతుంది. మనందరి యోగక్షేమాలను కాపాడే సర్వ శ్రేయోదాయి ‪శ్రీసాయి‬ చెంతనుండగా మనకు స్వార్థం, అహం ఎందుకు? సాయి ‪బంధువులమైన‬ మనం అందరికోసం అడుగువేద్దాం. అదే సాయి పథం.

‎ఓంసాయిరాం‬ జైసాయిరాం

‎ఓంసాయిరాం‬ జైసాయిరాం
ఓంసాయిరాం‬ జైసాయిరాం..
సమస్త ప్రపంచం తన ‪‎స్వరూపంగా‬ భావించేవారికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహ్యం, రాగం ఉండవు.అశాశ్వతమైన జీవితం కోసం కర్మలు చేసేవారు గాఢాంధకారంలో, సామాన్యమైన జ్ఞానంతోనే తృప్తిపడేవారు అంతకంటే చీకటిలో మగ్గిపోతారు.
అజ్ఞానంవలన మన కళ్ళు మూసుకుపోతున్నాయి.‪‎జ్ఞానప్రపంచంమంతట‬అందకారమైపొతున్నాది.మన కళ్ళు ‪‎దేవుడిని‬ తప్ప మిగిలిన అన్నింటినీ చూస్తుంటాయి.
‪ఆత్మ‬ దేవుడిని తప్ప మరేదీ చూడదు.జ్గ్ణానప్రపంచములొ అందకారముండదు, చైతన్యవంతమైన‪ ఆత్మను‬ మేల్కొలిపితె మనం ఆ దేవున్ని ప్రతి ‪పువ్వులొను‬ చూడగలము,నవ్వుతుంటాడు. ఒక్కొక్క సూర్యకిరణంతో వచ్చి ‘క్షేమమేగా’ అని పలకరిస్తుంటాడు. రాత్రి పూట నక్షత్రాలనే అక్షరాలుగా చేసుకుని ఉత్తరం కూడా రాస్తుంటాడు. మెరుపుతో సంతకం చేస్తాడు. కోకిల అతని‪ ‎వేణువై‬ ఉంది. కానీ మనమే అతనిని చూడలేకపోతున్నాం. వినలేకపోతున్నాం. ఇక్కడ అజ్ఞానమనె ‪‎మాయ‬ ఆత్మను కప్పబడి వున్నది. ఈ మాయవలె కప్పడిన ఆత్మజ్గ్ణానము ఆ భగవంతుని ‪‎స్వరూపము‬.
నిజానికి ఈ ‪మాయా‬ అనగ ఏమిటి? మాయా ఎల్లప్పుడు జీవియోక్క స్వభావమును పరిక్షించును,{మంచికి ముందు ఒక చెడు కాచుకుని వుండును''ఆశ్వాధించుకొనును''}అది జ్గ్ణానమును విప్పి పిప్పిచేయును,జీవియోక్క ‪సంజీవియైన‬ ఆత్మనుండి వేరు చేయును. ఇచ్చట వచ్చే ‪అహం‬ ధర్మముయోక్క నీతిని ధారి తప్పించును.

‎శ్రీసద్గురు‬ సాయిబాబా ఉపదేశము

‪శ్రీసద్గురు సాయిబబా ఉపదేశము
‎శ్రీసద్గురు‬ సాయిబాబా ఉపదేశము..
ఈ దిగువన చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ ‪‎అమూల్యాలు‬. వాటిని మనస్సులో వుంచుకుని అలాగే చేస్తే అవి మనకు మేలు చేస్తాయి. "ఏదైనా ‪సంబంధం‬ వుండనిదే ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా అలాంటి జంతువుగాని నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకు. దాన్ని సాదరంగా చోడు. దాహం కలవారికి నీరిస్తే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే, బట్టలు లేనివారికి బట్టిలిచ్చినట్లయితే, నీ ఇంటి వసారా యితరులు కూర్చోడానికి, ‪విశ్రాంతి‬ తీసుకోవడానికి ఉపయోగించినట్లయితే నిశ్చయంగా భగవంతుడు అమితంగా ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ దగ్గరికి వచ్చినట్లైతే, నీకు ఇవ్వటం యిష్టం లేకపోయినా నీవు ఇవ్వనవసరం లేదు. కాని వాడిపై కుక్కలా మొరగొద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినా, నీవు కఠినంగా జవాబు ఇవ్వకు. అలాంటి వాణ్ణి నీవు ఎల్లప్పుడూ ‪‎ఒర్చుకొంటే‬ నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది. ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నీవు చలించకు. నీవు ఉన్న చోటనే స్థైర్యంగా నిలబడి, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్నా ‪‎నాటకాన్ని‬ చూస్తూ ఉండు. నీకు నాకు మధ్యగల ‪గోడను‬ నిర్మూలించు. అప్పుడు మనమిద్దరం కలిసే ‪మార్గం‬ ఏర్పడుతుంది. నాకు నీకు భేదము ఉన్నదన్నదే భక్తుని గురువుకు దూరంగా వుంచుతుంది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. '‪‎అల్లా‬మాలిక్!' భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడే వారు కాదు. ‪భగవంతుని‬మార్గం అసామాన్యం, అత్యంత విలువైనది, కనుక్కోవటం వీలుకానిది. వారి యిచ్చానుసారమే మనం నడుస్తాము. మన కోరికలను వారి నెరవేరుస్తారు. మనకు దారి చూపెడతారు.‪ఋణానుబంధంతో‬ మనమందరమూ కలిశాము. ఒకరికొకరు తోడ్పడి, ‪ప్రేమించి‬ సుఖంగాను, సంతోషంగానూ ఉందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందుతారో వారు‪ అమరులై‬ సుఖంగా ఉండెదరు. తక్కినవారందరూ పేరుకే ఊపిరి సలిపే వరకు మాత్రమే బ్రతుకుతారు.
~~~~~~~~~~!!జై సాయిబాబా అందరిని కాపాడుగాక!!~~~~~~~~

సాయితత్వం

‎సాయితత్వాన్ని‬ నిత్య జీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. జీవితం ధన్యమౌతుంది. సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. షిర్డీ సాయిబాబా ఈ యుగావతారం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు '‪శ్రీసాయి‬ సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది. ఎవరు ఏ సమస్యతో వెతికితే ఆ సమస్యకు తగిన సమాధానం దొరుకుతుంది. సాయి బోధనలు, చదివి, విని ఊరుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరిస్తేనే ఫలం, ఫలితం. బాబా అడుగు జాడల్లో నడవడానికి మనం ఏదైనా ‪‎ప్రయత్నం‬ చేసి ఒకడుగు వేస్తె బాబా మనవైపు పదడుగులు వేస్తారు. సాయి తత్వాన్ని ఆచరిస్తే మన బుద్ధి, మనసు, జ్ఞానం, ‪‎వ్యక్తిత్వం‬ వికసించి సుసంపన్నం అవుతాయి. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు. స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు.
‪‎ఓంసాయి‬ శ్రీసాయి జయ జయ సాయి
ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి || ఓంసాయి ||
ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి || ఓంసాయి ||
విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి || ఓంసాయి ||
మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి || ఓంసాయి ||

దేవుడు‬ ఒక్కడే

‪దేవుడు ఒక్కడే
దేవుడు‬ ఒక్కడే..
భక్తుల కోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరూ ఏ పేరుతోపిలిచినా పలుకుతూ వారిని ఆదుకుంటూ వుంటాడు.‪సృష్టిలోని‬ సమస్త జీవులకూ దైవత్వాన్ని కల్పించి అర్చించిన, ఆరాధించిన గొప్ప ‪సంస్కృతి‬ మనది. మన దృష్టిలో నేల, నింగి, గాలి, నిప్పు, నీరు, చెట్లు, పర్వతాలు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు- ఒకటేమిటి? అది కాదు, ఇది ఔను అని లేకుండా అన్నీ భగవత్‌ ‪స్వరూపాలే‬!
దేవుడు ఉన్నాడని కొందరు దేవుడు లేడని కొందరు ఇది ఎవ్వరికీ తెలియని విషయము.
నమ్మకమనేది రెంటిలోను ఉన్నది దేవుడు నమ్మిన దానిలోను, నమ్మని దానిలోనూ ఉన్నాడు. నమ్మకమంటే మనకు తెలియనిదాని గురించి ఊహించుకోవడం. ‪‎నమ్మకమనే‬ దేవుడు జీవికి, జీవగమనానికి ఆదారము. ప్రతి జీవి రేపు ఉందనే నమ్మకం తోనే ఈ వేళ బ్రతుకుతున్నది. రేపు సుఖం గాను విజయవంతం గాను ఒడిదుడుకు లేకుండా సజావుగాను సక్రమము గాను జరగాలని మనసులో ‪నమ్మకాన్ని‬ పెంచుకోవడం. ఆ మార్గము లో పయనించడమే, ఆ ప్రయాణానికి అవసమయ్యే శక్తి యే ఈ ప్రార్ధన. ప్రార్ధన మార్గాలు ఎన్నో మనిషి మనిషికీ మనసు మనసుకీ ఒక్కొక్కటి మాటలతో ప్ర్రార్ధన, పాటలతో ప్ర్రార్ధన, చేతలతో ప్రార్ధన, మౌనము తో ప్రార్ధన ఇలా ఎన్నోవిధాలు గా ‪‎ప్రార్ధనా‬ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ జీవుల మనిషిలోని ఈ నమ్మకం ఎంతో శక్తివంతమైనది. ఈ నమ్మకము ఎన్నడు మూడనమ్మకము కాకూడదు. ప్రతి వస్తువులోను జీవం ఉంటుంది. ప్రతి జీవిలోను శక్తి ఉంటుంది. ఆ శక్తి అనంతమైనది, అనిర్వచనీయమైనది, అభేద్యమైనది.ఆ శక్తి నే నమ్ము!అదే దేవుడు, దైవము, దేవత, మిత్రువు, శత్రువు.
''‪‎జీవికి‬ జీవే దైవము జీవికి జీవే దైవము
జీవికి జీవే మిత్రువు జీవికి జీవే శత్రువు!!
శక్తి న్ని వేళల అన్ని చోట్ల అన్ని జీవులలోనూ ఉంది.
‪ఇందుగలదు‬ అందులేదని సందేహము వలదు
ఎందెందు వెదకిచూస్తున్నా అందందే గలదు శక్తి విశ్వాసము ఉంటే{నమ్మకము వుంటే}!!
ఏ భాష నందైనా ఏ జాతి నందైనా
ఏ మతము నందైనా ఏ దేశమందైనా
ఏ లోకమందైనా దేవుడు ఒక్కడే!దైవము ఒక్కటే!!
~~~~~!!జై సద్గురువు సాయినాధ్ మహారాజ్ కీ జై!!~~~~~

‪‎సాయిరూపం‬

‪‎సాయిరూపం‬

సాయిరూపం‬..
సకల సుగుణాల సమ్మోహన ‪‎స్వరూపం‬ శ్రీ సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిధి. బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు, మనః చాంచల్యాలు పాటాపంచలైపోతాయి.
‪‎సాయి‬ తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, ఋజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థంకాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు.
సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు తొలగిపోతాయి. అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి సాయి. ప్రేమ తత్త్వమే సాయి తత్త్వం. బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి ‪జ్ఞాన‬ దీపాలు వెలిగించడానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి, జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవరూపంలో అవతరించిన ‪‎దైవం‬ సాయిబాబా.
‪పరిపూర్ణ‬ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పేటలా అలముకున్న సాయి తత్త్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది. బాబా తన చక్కని, సరళమైన భోధనలతో ఆదర్శ ‪‎జీవనానికి‬ బాటలు వేశారు. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్దరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి? ఏది మంచి? ఏది చెడు? అనేది వివేచించుకునే ‪జ్ఞానాన్ని‬ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా.
బాబా తన భోధనల ద్వారా ‪మనుషుల్ని‬ సాధన మార్గంలో ఒక్కొక మెట్టు పైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపించారు. మహిమలతో కాదు ‪మానవత్వంతో‬ బతకాలని చాటిచూపారు. సాధారణ జీవితం గడిపి మన జీవితాల్ని ధన్యం చేసిన బాబా తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడనని చెప్పుకున్న నినయ ‪భూషణుడు‬.
బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం! బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన! బాబా లీలలు దుష్ట బుద్దులు, ఆవ లక్షణాలను ‪రూపుమాపుతాయి‬. బాబా మహిమలు మనో వికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్పూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్త్వంలోని #జ్ఞాన వికాసాన్ని ‪మానవత్వాన్ని‬ వంటపట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. జీవితం ధన్యమవుతుంది.
నేడు ‪మనిషి‬ ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం ‪‎సాయితత్వమే‬. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. బాబా చూపింది ‪‎సత్యమార్గం‬. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తే బతుకులు‪ ‎తీయ్యనవుతాయి‬.
‪యోగీశ్వరులు‬ ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికి సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే ‪షిర్డీ‬ సాయి స్వరూపమై వెలుగొందుతోంది

‎సాయి‬ బాబా దినచర్య..

‎సాయి‬ బాబా దినచర్య

‎సాయి‬ బాబా దినచర్య..
సాయిబాబా ‪సాధు‬ జీవితం ఎంతో పరిశుద్ధమైనది. అందులోని పవిత్రతే ఎందరో భక్తులను ఎక్కడెక్కడి నుంచో షిరిడీకి లాక్కొచ్చేది. బాబా దినచర్యను గమనించినవారికి ఆయన జీవితం ఎంత ‪పవిత్రమైనదో‬ తేలికగా అర్థమవుతుంది.
బాబా తెల్లవారు జామునే నిద్రలేచేవారు. ‪ధుని‬ దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిల్చుని విచిత్రమైన భంగిమలను ప్రదర్శించేవారు. నెమ్మదిగా '‪యాదేహక్‬'(దైవాన్ని ఎప్పుడూ స్మరించాలి) వంటీ అరబ్బీ పదాలు పలికేవారు. ఆ సమయంలో తమ వద్దకు ఎవరినీ రానిచ్చేవారు కారు. ఆ లోగా‪ మాధవ్‬ ఫస్లే అనే సేవకుడు మసీదును చక్కగా ఊడ్చి, బకెట్లతో నీటిని సిద్ధం చేసేవాడు. #సాయి ఆ నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలించి, ముఖం, కాళ్లు చేతుల్ని ఎంతో నాజుకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. మధ్యలో ధునిలోని కట్టెల్ని సవరిస్తూ, ‪‎భక్తులతో‬ ఆ ముందటి రాత్రి తామెక్కడికి వెళ్లిందీ, ఎవరినెలా కాపాడిందీ, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తానెలా తీసుకెళ్లిందీ వివరించేవారు. ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు కలిగిన అనుభవాలను అక్కడ ‪కలబోసుకునేవారు‬.
అనంతరం ‪‎కుష్ఠురోగ‬ భక్తుడు భాగోజీ షిండే బాబా చేతి(ఆ చేతిని ధునిలో పెట్టే బాబా ఎక్కడో దూరంగా ఉన్న ఒక కుమ్మరి బిడ్డను కాపాడారు. అప్పుడు ఆ చేతికి కాలిన గాయమైంది)కి‪ శ్రద్ధగా‬ కట్టు కట్టేవాడు. నిజానికి బాబాకు అతని సేవతో పని లేకపోయినా అతన్ని ఆనందపరిచేందుకే ఆ అవకాశం ఇచ్చేవారు. అప్పటికి ‪‎ఉదయం‬ ఏడున్నర అయ్యేది. షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఈ సమయంలోనే బావి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మేవారు. తర్వాత కొంత కాలానికి భక్తులు ‪బాబా‬ కోసం రెండు పెద్ద రాగి పాత్రలలో వేడి నీళ్లు, రెండు బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. బాబా వేడి, చన్నీళ్లు కలుపుకుని సుమారు గంటసేపు స్నానం చేసేవారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో #బాబా భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకుని కుడిచేతిలో రేకు డబ్బా పట్టుకుని ‪‎షిరిడీలోని‬అయిదిళ్లకు భిక్షకు వెళ్లేవారు.
‪భిక్ష‬ తీసుకుని తిరిగి మసీదుకు చేరిన వెంటనే ఒక రొట్టె, కొద్దిగా అన్నం ధునికి ఆహుతిగా వేసేవారు. ఆ తరువాత మిగిలినవన్నీ ఒక మట్టి పాత్రలో వేసి మూత పెట్టకుండా ఉంచేవారు. ఎవరికి కావాల్సినవి వారు అందులోంచి తీసుకెళ్లేవారు. కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు,‪సేవకులు‬ ఎవరెంత తీసుకున్నా బాబా ఏమీ అనేవారు కారు. అందరూ తీసుకోగా మిగిలిన పదార్థాలన్నిటినీ కలుపుకుని #బాబా తినేవారు. పగలెన్నడూ వెన్ను వాల్చేవారు కారు. గోడకు జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించే వారు. ‪‎భిక్షాన్నం‬ మాత్రమే తినేవారు.
భిక్షకు వెళ్లి వచ్చిన తరువాత బాబా పాదరక్షలు ధరించి లెండీ వనానికి బయలుదేరేవారు. భక్తులు దారి పొడవునా బాబాకు గొడుగు పట్టేవారు. తిరిగి పదిన్నర ప్రాంతంలో బాబా మసీదుకు చేరుకునేవారు. గాయకులు, నర్తకీ నర్తకులు, గారడీ వాళ్లు... ఇలా ఎవరో ఒకరు కొద్దిసేపు బాబా ఎదుట తమ కళలను ‪‎ప్రదర్శించేవారు‬. అటువంటి ప్రదర్శనలు లేకపోతే బాబానే మధ్యాహ్నం వరకు భక్తులకు హితోపదేశాలు, ‪నీతి‬ బోధకమైన కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. అనంతరం భక్తులందరితో కలిసి బాబా మధ్యాహ్న భోజనం చేసేవారు. భోజనాలయ్యాక సగుణమేరు ‪‎నాయక్‬ మసీదును శుభ్రం చేసేవాడు. సాయి యథాస్థానంలో కూర్చున్నాక తాంబూలం, తర్వాత గ్లాసెడు మంచినీళ్లు, రెండు రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. కొంతసేపు సాయి ఏకాంతంగా గడిపేవారు. ‪సాయంత్రం‬ అయిదు గంటల సమయంలో బాబా మళ్లీ లెండీ వనానికి వెళ్లి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ఎదుట సన్నాయి వాయించేవాడు. ఎందుకో #బాబా అతనిపై ఆవేశంగా ఎగిరిపడేవారు.
తరువాత కొద్దిసేపు ‪‎మసీదు‬ చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత ఆరు గంటలకు హారతి కార్యక్రమం పూర్తయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. ఆ తరువాత తనకు దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్నంతా బాబా అందరినీ పిలిచి పంచేసేవారు. రాత్రి భక్తులందరూ భోజనాలకు తమ ఇళ్లకు వెళ్లినప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో ‪తాత్యా‬ కొన్ని రొట్టెలు తెచ్చి బాబాకు ఇచ్చేవాడు. #బాబా వాటిని తీసుకుని అతనికి ముప్ఫయ్ అయిదు రూపాయలు ఇచ్చేవారు. బాబాకు తాంబూలం అంటే మహా ‪ఇష్టం‬. రాత్రీ పగలూ వాటిని తరుచుగా తీసుకునేవారు. అవి తిన్నాక బాగా నీళ్లు తాగేవారు. అనంతరం పవళింపు(శేజారతి) హారతి జరిగేది. ‪హారతి‬ పూర్తవగానే బాబా నిద్రకు ఉపక్రమించేవారు.

Wednesday, September 17, 2014

‪శ్రీ‬ బాల గణపతి ధ్యానం

http://tvramudu.blogspot.com/పంచామృతo
శ్రీ‬ బాల గణపతి ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 1 ||
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

‪శ్రీ‬ హేమాద్రినాధుడు

.శ్రీ‬ హేమాద్రినాధుడుhttp://tvramudu.blogspot.com/పంచామృతohttp://tvramudu.blogspot.com/పంచామృతo
అడవిలో కొలువైన భక్త వరదుడు... ‪శ్రీ‬ హేమాద్రినాధుడు
‪‎శ్లోకం‬: ఉగ్రవీరం నారసింహం దారిద్య్రి దుఃఖ దృష్ట గ్రహా పీడానివారణం
శంఖచక్రారాయుధ ధరం శ్రీ హేమాద్రి నాధ వరధాభయ ప్రధాత శరణం ప్రపద్యే!!
అర్ధచంద్రాకృతిలో మహ్మదీయ ఆరాధ్య చిహ్నాన్ని పోలిన గుట్టపై వెలసిన కొండంత దేవు డు, సర్వరోగ నివారిణి, సంతానప్రాప్తి కలి గించే స్వామి నరహరి విగ్రహానికి నిరంతరం కారే చెమటలు, ‪హరిపాదంలో‬ పుట్టిన చింత మాణి ధార నెలవైన 7 ఆంజనేయ ప్రతిమలు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేవదేవుడే శ్రీ హేమాద్రినాధుడు.
పిలిస్తే పలికే ఆపద్బంధువు, ఆర్తజన చింతామణి, అనే క విశిష్టతలు సంతరించు కున్న శ్రీ హేమాద్రి (బం గారు కొండ) లక్ష్మీ నర్సింహస్వామి క్షేత్రం మహిమాన్వితమైనది. అడవిలో ఎతైన కొండపై చల్లని ‪‎చింతామణి‬ ధారలతో ఆహ్లాదకర వాతా వరణంతో చారిత్రిక, పురాతన ప్రాధాన్యత సంతరించుకొని ప్రకృతి మాత ఓడిలో కొలువుదీరిన అతి సనాతనమై.. రెండవ యాదగిరిగా పిలువబడే ఈ ‪హేమాద్రి‬ పుణ్య క్షేత్రం నవ నారసింహా క్షేత్రాలలో ఒక్కటిగా ప్రఖ్యాతి పొందింది.పావన గోదావరి నది తీరాన వెలసిన ఈ మల్లూరు లక్ష్మీ నరసింహ క్షేత్రం వరంగల్‌ జిల్లా మంగపేట మండల పరిధి మల్లూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్నది. ‪‎హిందూముస్లిం‬ మతసామారస్యానికి ప్రతీక ఈ హేమాధ్రి అని అందులో వెలసిన స్వామి వారు ఇరు మతాల వారిచే పూజలందుకోవడం విశేషం.
‪అర్ధ‬ చంద్రాకృతిని పోలిన పర్వతం...
శ్రీవారు కొలువైన ఈ పర్వతం మహ్మదీయ ప్రవిత్ర ఆరాధ్య చిహ్నాన్ని పొలిన రీతిలో (అర్ధ చంద్రాకృతిలో), నక్షత్ర ఆకారంలో శ్రీహరి ఆలయం తలుకులీనుతుండగా ఈ ఆధారంతో వివిధ ప్రాంతాల నుండి ముస్లిం భక్తులు హాజ రై ‪అల్లా‬ రూపంలో అలరారే’ శ్రీ నారసింహున్ని సేవించి పరవశిస్తారు.
17వ శతాబ్ధంలో భారతదేశాన్ని పాలించిన మహ్మదీయ ‪‎చక్రవర్తి‬ గజనీ మహ్మద్‌ స్వామి వారి మహిమలు విని అర్ధ చంద్రాకృతిలో వా రి మత చిహ్నాన్ని పోలినట్టుగా ఉన్న ఈ గుట్ట ను చూసి ఆశ్చర్యంతో అల్లాకు, హరికి తేడా లేదని, ఈ దేవున్ని ఆయన కూడా ఆరాధించా డని ఆధారాలున్నాయి. అంతేకాక ‪‎నరసింహుని‬ మహిమలు ఆయనకు అనుభవం లోకి రావడంతో స్వామివారిని భక్తితో కొలచిన ఆయన.. నాడు కానుకగా ఇచ్చిన బిస్కెట్‌ బంగారం నేడు అమ్మగా వచ్చిన నిధిని నిర్వాహకులు మల్లూరు లోని గ్రామీణ బ్యాంకు లో ఫిక్స్‌డ్‌ చేశారు. ఎన్నో హిందు ఆలయాలను ధ్వం సం చేసిన ఆయన ఈ స్వామి విశిష్టతను తెలుసుకొని సర్వస్య ‪శరణాగతి‬ పొందాడు అందుకే ఈ ఆలయం రక్షించబ డింది. అంతే కాక 6వ శతాబ్ధానికి పూర్వం నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించి సేవించిన చోళ రాజులు హరికి సమర్పించిన బంగారు ఆభరణాలు ఇప్పటికి నగరంలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు లాకర్‌లో దేవాదాయ శాఖ ఆధీనంలో భద్రపర్చడం జరిగింది.
ప్రాముఖ్యత
‪భరద్వాజ‬ మహర్షి తన శిష్య బృందంతో నాసి కాత్రయంబకం నుండి బయలుదేరి పుణ్యక్షేత్రా లను దర్శిస్తూ ప్రవిత్ర గోదావరి నది ప్రాంతం లో పర్యటిస్తూ ఒకనాటి రాత్రి మల్లూరు పరిస రాలలో బస చేశాడని, ఆ రాత్రి ఆయనకు ‪శ్రీహరి‬ నరుని రూపంలో స్వప్న దర్శనం ఇచ్చి తాను ఈ హేమాద్రి గుట్టపై రాతి పొరల్లో అర్చారూపంలో నిక్షిప్తమై ఉన్నానని తెలిపాడ న్నాడు. పాపాల నుండి ప్రజలను రక్షించడాని కి తనకు విముక్తి కలిగించమని మహర్షిని ఆదేశించి అదృశ్యమయ్యాడని పురాణగాథలు తెలుపుతున్నాయి. మహర్షి శిష్య బృందంతో కీకారణ్యంలోని భయంకరమైన గుట్టపైకి వెళ్ళి స్వామి వారు చెప్పిన ప్రాంతంలో పెకలిస్తుండ గా గుణపం పోటు స్వామి వారి నాభిలో పడిందని, అంతలో కనులు మిరిమిట్లుగొలిపే దివ్య కాంతితో భయంకరంగా ఒక్కసారిగా చేసిన ‪\సింహగర్జన‬ ఆ గుట్ట ప్రతిధ్వనించగా వారు భయపడి గుణపాన్ని వెలికిలాగడం వల్ల దాం తో చిందిన పెద్ద రక్తపు ధారకు ప్రకృతి స్తంభిం చింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడం క్షణంలో జరిగింది.
దాంతో మహర్షి భయంతో స్వామిని వేడుకోగా గుణపం పోటు బాధకు ‪‎సింహముఖం‬ రీతిలో భయంకరంగా తెరచుకున్న పెద్ద నోరు, నరుని రూపంతో నాలుగు చేతులతో వెలసిన నిలవెత్తు స్వామి రూపం గోడపై వెలసింది. దెబ్బ తగిలిన నాభి వద్ద పసుపుతో కట్టు కట్టి శాంతి చేయగా అప్పటి నుండి చిన్నచిన్న చుక్కల రూపంలో స్రవించే రక్తం ఇప్పటికీ కారుతూనే ఉన్నది. నాభి వద్ద అద్దిన గంధంతో తడసిన ఆ రక్తపు చుక్కలను సేవిస్తే ధన్వంతరి వైద్యం వలే ‪సర్వరోగ‬నివారణతో పాటు సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకము.
హరిపాదన పుట్టావమ్మా గంగమ్మ #చింతామణి ధార
హరిపదాంభుజ పావని (శ్రీ మహావిష్ణు పాదన పుట్టిన గంగమ్మ వలే) ఆలయంలో వెలసిన శ్రీహరి ప్రతిరూపమైన స్వామి వారి ఎడమ పాదం నుండి మండుటెండల్లో సైతం నిరంతరం ప్రవహించే స్వచ్ఛమైన ఈ ధారకు #చింతామణి ధారగా పేరున్నది. సర్వపాపహరి ని అయిన ఈ జలధార చేరే కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే ‪‎ఆయురారోగ్యాలు‬ ప్ర సాదిస్తుందనేది నమ్మకం. గుట్టపై గల వివిధ రకాల ఔషధ చెట్ల వేళ్ళ మధ్య నుండి ప్రవ హించే ఈ జలధారతో పుణ్యస్నానాలు ఆచరిం చి, సేవిస్తే పిశాచ, గ్రహరోగ పిడితులు, దీర్ఘరో గులకు నయమవుతుందని అంటారు. ఈ నీరు గుట్ట కింద గోముఖకాన్ని పోలిన ప్రతిమ నుండి బయటికి వెళుతుంది.
‪స్వామివారికి‬ ఒల్లంతా చెమటే!
స్వామి వారి విగ్రహానికి నిరంతరం చెమట కారడమేకాకుండా మనిషి శరీరంపై నొక్కితే సొట్టలు పడినట్లుగా ఎక్కడాలేని విధంగా విగ్రహంపై సొట్టలుపడడం విశేషం. స్వామి వారికి సాధారణంగా జలక్షీరాభిషేకం చేస్తే ఇక్కడ మాత్రం ఉత్తర భారతంలోని హరిద్వార్‌ మాదిరిగానే నరసింహునికి తిలతైలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్నది.