ఈ రాధకు నీవే రా ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధ హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం ఈ రాధకు నీవే రా ప్రాణం ఈ రాధకు నీవే రా ప్రాణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధ హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం ఈ రాధకు నీవే రా ప్రాణం ఈ రాధకు నీవే రా ప్రాణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం నీ శుభ చరణం ఈ రాధకు శరణం
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవరాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం యమునా తీరం రాగాల సారం!!
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవరాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం యమునా తీరం రాగాల సారం!!
రాధమ్మ తల్లికి శ్రీకృష్ణుడంటే అంతులేని అనురాగం.అందుకే నిత్యము చిరునవ్వులు చిందిస్తూ అందరి డెందములకు ఆనందమును పంచే నలన్నయ్య మోమును వికసించిన పద్మము అంది.తన దరహాసం ద్వారా అందరి హృదయాలలో ప్రేమను నింపి ఉల్లసపరుస్తూ వుంటాడు కాబట్టి వెన్నెల కిరణం అంది.తన ప్రేమతో మదికి శాంతినిచ్చి,మన మనస్సులలో ప్రేమ,కరుణను నింపే కన్నయ్య పాదాలే నాకు శర్ణమని శరణాగతురాలైనది.తన లాగా మనము కూడా కృష్ణయ్యపై నిస్వార్ధమైన ప్రేమను పెంచుకుని నువ్వే నాకు దిక్కు అని ప్రతిఫలాపేక్ష లేకుండా సంపూర్ణ శరణాగతులమైతే మనము మాధవుని ప్రేమను పొందవచ్చు అని తన చేతల ద్వార మనకు పాఠం చెప్పింది.
నీవు ఇక్కడ ఉన్నవు అందుకనే బృందావనము అందాన్ని సంతరించుకుని మరింత శోభతో అలరారుతున్నది.నీవు సృష్టిక్రియకే నాధుడవు.నువ్వు ఆట పాటలతో,రాసలీలలతో గడిపావు కనుకనే యమునా తీరం కృష్ణ ప్రేమమయమైనది.రాగాల సారమైంది.
No comments:
Post a Comment