''త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!!
రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!!
ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.


నీలాపనిందలు కాసినవాడు
ఆలుమందలను కాచినవాడు
వెన్నదొంగిలించే నెమలీకధరుడు
నింగినీలమంత విశాలహ్రుదయుడు
కోకలెత్తుకెళ్ళిన కొంటెప్రియుడు
వెదురుతోనే వుల్లమునలరించేవాడు
దుస్తులిచ్చిన ద్రౌపదిమానరక్షకుడు
గీత చెప్పి జీవితగీతల్ని మార్చినవాడు
ప్రేమకు ప్రేమను నేర్పినవాడు
దరిద్రుల దాతల ధర్మపక్షకుడు
జగమేలువాడు జగానికొక్కడు
కొండంతదేవుడు శ్రీక్రిష్ణుడు.


నీలాపనిందలు కాసినవాడు
ఆలుమందలను కాచినవాడు
వెన్నదొంగిలించే నెమలీకధరుడు
నింగినీలమంత విశాలహ్రుదయుడు
కోకలెత్తుకెళ్ళిన కొంటెప్రియుడు
వెదురుతోనే వుల్లమునలరించేవాడు
దుస్తులిచ్చిన ద్రౌపదిమానరక్షకుడు
గీత చెప్పి జీవితగీతల్ని మార్చినవాడు
ప్రేమకు ప్రేమను నేర్పినవాడు
దరిద్రుల దాతల ధర్మపక్షకుడు
జగమేలువాడు జగానికొక్కడు
కొండంతదేవుడు శ్రీక్రిష్ణుడు.
No comments:
Post a Comment