కృష్ణం వందే జగద్గురుం..

అతని పుట్టు కెటులొ, ఇతని దటులె!
చంపు ’కంసుం’డంచు – చంపు ’హీరొద’టంచు
అతని స్థలము మార్చి, రితని దటులె!
మాయ ముందుగ జెప్పె – మరి, దేవదూ తిట
అతని జన్మ రహస్య, మితని దటులె
అతడు గోవుల గాచె – ఇతడు గొర్రెల గాచె
అతని తత్త్వం బేదొ, ఇతని దటులె!
అతని జన్మ రహస్య, మితని దటులె
అతడు గోవుల గాచె – ఇతడు గొర్రెల గాచె
అతని తత్త్వం బేదొ, ఇతని దటులె!
శాంతి రాయబారి, శాంతి దూత యగుచు
గీత నతడు, మనుజ నీతి నితడు
బోధ జేసి, ఆత్మ ముక్తి మార్గము జూపె
కృష్ణుని మది తలచ క్రీస్తు మెదలు!!
బాల గోపాల కృష్ణ పాహి పాహి॥
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥
గీత నతడు, మనుజ నీతి నితడు
బోధ జేసి, ఆత్మ ముక్తి మార్గము జూపె
కృష్ణుని మది తలచ క్రీస్తు మెదలు!!
బాల గోపాల కృష్ణా..
బాల గోపాల కృష్ణ పాహి పాహి॥
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥
కలభ సుందర గమన కస్తూరి శోభితానన
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥
యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥
వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద॥
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద॥
కాలమేమి సేసీని కర్మమేమి సేసీని
యేలిన శ్రీరమణుడె యెదనుండగా
ఆలించిన ధృవుని అజామిళునిని
కాలమేమి సేసెనయ్య కర్మమేమి సేసెనయ్య
యేలిన శ్రీరమణుడె యెదనుండగా
ఆలించిన ధృవుని అజామిళునిని
కాలమేమి సేసెనయ్య కర్మమేమి సేసెనయ్య
పాపమేమి సేసీని పగ యేమి సేసీని
కాపాడె దేవుడె దగ్గర నుండగా
యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లాదుని
పాపమేమి సేసెనయ్య పగయేమిసేసెను
కాపాడె దేవుడె దగ్గర నుండగా
యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లాదుని
పాపమేమి సేసెనయ్య పగయేమిసేసెను
కులమేమి సేసీని గుణమేమి సేసీని
నలువైన శ్రీవేంకటనాథుడుండగా
అలరి వాల్మీకికి అలనాడహల్యకు
కులమేమి సేసెనయ్య గుణమేమి సేసెను!!
నలువైన శ్రీవేంకటనాథుడుండగా
అలరి వాల్మీకికి అలనాడహల్యకు
కులమేమి సేసెనయ్య గుణమేమి సేసెను!!
No comments:
Post a Comment