ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి !!ఓంసాయి!!
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి !!ఓంసాయి!!
ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి !!ఓంసాయి !!
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి !!ఓంసాయి !!
విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి!!ఓంసాయి!!
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి!!ఓంసాయి!!
మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి!!ఓంసాయి !!
~~~~~~!!ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!~~~~~~
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి!!ఓంసాయి !!
~~~~~~!!ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!~~~~~~
No comments:
Post a Comment