సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 22, 2014

సాయినాథుని‬ లీలలు

సాయినాధుని లీలలు
సాయినాథుని‬ లీలలు
దేవుడు‬ ఎక్కడో ఉన్నాడని వెతుకుతాం, నీలోనూ, సర్వంలోనూ నేనే ఉన్నాను.నాకోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పోనవసరం లేదు. మీలో సకల జీవులలో ఉండే చైతన్యమే‬ నేను. ఇది గుర్తించగలిగితే, తెలుసుకోగలిగితే మీలోనే నన్ను దర్శించుకోగలరు. అప్పుడే మీరు నాలో‪ ‎తన్మయం‬ కాగలుగుతారు. 
మనలో భక్తికి కొదువుండదు. కానీ ఏ మూలో సందేహం కూడా పీడిస్తుంది. సందేహం ఉన్న చోట‪ విశ్వాసానికి‬ చోటులేదు. కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా దేవుని ఎదుట చిత్తం నిలవలేం. దృష్టి దేవుడిపై, మనసు మరెక్కోడో ఉంటుంది.బాబా‬ సర్వాంతర్యామి. షిర్డీ‪ సాయినాథుని‬ లీలా వినోదాలు మనకు అర్ధం కావు. భక్తి శ్రద్ధ, విశ్వాసంతో వాటిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.అప్పుడే నిశ్చలమైన ప్రశాంతతను పొందగలము.
#బాబా పదకొండు హామీలు..
1. ఎవరైనా షిరిడి నేల పైన కాలు పెడితే, వళ్ళ బాధలు ముగిసిపోతాయి.
2. హ్రుదయం ముక్కలైన వారు మరియు బాధలో ఉన్నవారు ద్వారకామయి మెట్లు ఎక్కగానే సము్రద్ధి మరియు ఆనందం లో ఎదుగుతారు.
3. ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నేను ఇంతే చురుకుగా ఇంక శక్తివంతంగా ఉంటాను.
4. నా సమాధి నా భక్తులను దీవించి వాళ్ళ అవసరాలను చూసుకుంటుంది.
5. నా సమాధి నుంచి కూడా నేను ఇంతే చురుకుగా ఇంక శక్తివంతంగ ఉంటాను.
6. నా అనిత్య అవసేషాలు సమాధి నుండి ప్రసంగిస్తాయి.
7. నా కోసం వచ్చేవారికి, నాకు విరమించే వారికి, నాలో ఆశ్రయం వెతికే వారికి నేను ఎప్పుడూ సహాయంగా, దారి చూపే వాడిగా ఉంటాను.
8. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను.
9. నీ భారం నాకు ఇస్తే, నేను తప్పకుండా అది భరిస్తాను.
10. నువ్వు నా సలహా మరియు సహాయం కోరితే, అది నీకు వెంటనే లభిస్తుంది.
11. నా భక్తుల ఇంట్లొ కొరత అనేది ఉండదు.
~~~~~~~~~~!!జై సాయిరామ్!!~~~~~~~~~~~~

No comments:

Post a Comment