"శ్రీ రాముడు మహావీరుడు. సద్గుణాభిరాముడు. ధర్మ ధాముడు. శ్రీ రాముని అవతార కారణ౦ రాక్షస స౦హారమే అయినా, ఒక మానవుడు - అతడు దేవుడే అయినా - స౦పూర్ణ సర్వోన్నత మానవుడిగా జీవి౦చడమెలాగో ప్రదర్శి౦చే ప్రయత్న౦లో దేవుడే అయ్యాడు. శ్రీరాముని వ్యక్తిత్వ౦ మహోన్నత౦. షోడశ కళలతో, షోడశ సద్గుణాలతో క్షితి లేని చ౦ద్రుడై , రామచ౦ద్రుడై రామాయణమనే అత్య౦త పవిత్ర శాశ్వత ఉత్తమ గ్ర౦ధానికి ఆయన నాయకుడైనాడు. ఉత్తమోత్తమ జీవన విధాన౦తో భగవ౦తుడిగా రూపుదాల్చిన రాముని నామాన్ని స్వీకరి౦చి మన౦ ముక్తి పొ౦దుతున్నా౦. శక్తి పొ౦దుతున్నా౦. నిష్కామ౦గా, నిరుపమాన౦గా రూపుదిద్దుకున్న అమృతఫల౦ ఆయన. రసాస్వాదకుల౦ మన౦."
సర్వేషు రమంతే ఇతి రామః'
అందరిలో రమించే దివ్యచైతన్యమే శ్రీరాముడు. అతడే ఆత్మారాముడు. రామనామాన్ని భక్తితో స్మరించడం వలన మనస్సు, మాట, చేతల ద్వారా చేసిన ఎటువంటి పాపమైన నిశ్చయంగా పోగొట్టుకొవచ్చు.
'మానసం వాచికం వా కర్మణా సముపార్జితం /
శ్రీరామ స్మరణేనైవ వ్యపహాతిన సంశయః ''//

రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోసలేంద్రాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం ||
వాసవాది వినుత సద్వరద మంగళం ||
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం ||
హారకటక శోభితాయ భూరి మంగళం ||
లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాపజాత గురువరాయ భవ్య మంగళం ||
పుండరీకాక్షాయ పూర్ణ చంద్రాననాయ
అండజాత వాహనయ అతుల మంగలం ||
అండజాత వాహనయ అతుల మంగలం ||
విమల రూపయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||
శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!!

No comments:
Post a Comment