సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, October 22, 2014

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!!

ఓం‬ నమో శ్రీ సాయినాథాయ నమః!శాంతిః శాంతిః శాంతిః!!
Ramudu Thota Venkataramana's photo.
‪‎ధైవానికి‬ వివిధ లక్షణాలున్నా ముఖ్యంగా వుండతగినవి (1) కీర్తి, (2) ధనం (3) అభిమాన రహితం (4) జ్ఞానం (5) మహిమ (6) ఔదార్యం.
పైలక్షణాలన్నీ సాయిబాబాలో వుండివుండే.. తన భక్తుల కొరకు ధైవమే సాయిబాబాగా శరీరరూపంగా అవతారమెత్త్తే.
భగవంతుడే‬ సర్వాధికారి ఆ భగవంతుడు తప్ప మనలను ఇంకెవ్వరు కాపాడే వారు లేరు. వారి ఇచ్చానుసారము మనము నడుద్దాము. వారు మన కోరికలు నెరవేరుస్తారు.
మనకు ఒక దారి చూపుతారు."
#ఓం పరబ్రహ్మ మూర్తి సాయిబాబా నమస్కారములు నమస్కారములు''
( ఈ నామమును ఇప్పుడే 19 సార్లకు తక్కువ కాకుండా స్మరించండి)
బాబా హేమడ్పంతుతో అహంకారాని పక్కనపెట్టమని అప్పు డు తానె అతనిలో ప్రవేశించి
తన చరిత్రను తానె వ్రాసు కుంటాను అన్నారు. అంటే మనలోని అహంకారాన్ని ఎంతమటుకు మనము తగ్గించుకుంటామో అంతమేరకు మనలో సాయి దివ్య శక్తి ప్రవేశిస్తుంది.అప్పుడు మనము శాంతి ఆరోగ్యము పొందగలము.
సాయిబాబా దయాదాక్షిణ్యములు, భక్తులను తనవద్దకు రప్పించే వైఖరి వింతైనవి. సాయిబాబా ఒకనాడు ఇట్లనేను "‪‎బానిసలలో‬ బానిసనగు నేను మీకు ఋణపడివున్నాను. మీ దర్శనంచే నేను తృప్తి చెందితి. మీ పాదాలను దర్శించుట నా భాగ్యము. మీ అశుద్దంలో నేనొక పురుగును. అట్లగుటవలన నేను ధన్యుడను."
ఏమి వారి అణకువ! దీనిని ప్రచురించి సాయిబాబాను కించపరిచితినని ఎవరైన అంటే వారిని క్షమాపణ కోరుచుంటిని. అందుకు పరిహారముగా సాయిబాబా నామ జపం చేసేదను.
సాయిబాబా‬ మాటలు క్లుప్తముగా, భావగర్భితముగా, శక్తివంతంగా సమతూకంతోను వుండే. సాయిబాబా ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా వుండే. సాయిబాబా ఇట్లనేను "నేను ఫకీరయినప్పటికి, ఇల్లుగాని, భార్యగాని లేనప్పటికి, ఏ చీకు చింతలు లేనప్పటికి, ఒకేచోట నివసించుటచే తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరు సంగతి ఎంతా? ఎవరయితే భగవంతుని ఆశ్రయించుదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి బారినుండి తప్పించుకొందురు. సాయిబాబా తన భక్తుల మేలుకొరకు యిట్లనే "ఎవరు అదృష్టవంతులో, యెవరి పాపాలు క్షీణించునో, వారు నా పూజ చేస్తారు. ఎల్లప్పుడు సాయి సాయని జపించినచో వారిని సప్తసముద్రాలు దాటిస్తా. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందగలవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారాలు గాని, అష్టాంగయోగాలు గాని నాకు అవసరం లేదు. భక్తి యున్నచోటనే నా నివాసము." సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి.
''సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!శుభం భవతు!!

No comments:

Post a Comment