హేరంబ గణపతి మంత్రం




’అభయ వర ముద్రః పాషా దండాక్షమాలా –శ్రిని పరశు దధానో ముద్గరం మోదకం చ
ఫలమది ఘట సింహః పంచ మాతంగ వక్త్రాః-గణపతి రతి గౌరః పాతు హేరంబ నామా!!
ఫలమది ఘట సింహః పంచ మాతంగ వక్త్రాః-గణపతి రతి గౌరః పాతు హేరంబ నామా!!
వినాయకుని కి ఉన్న 32 ముఖ్య రూ పాలలో హేరంబ గణపతి 11 వ రూపం .బలహీనుల పాలిటి రక్షకుడు గా హేరంబ గణపతి పిలువ బడుతున్నాడు .హేరంబ గణపతికి అయిదు ముఖాలు పది చేతులు ఉంటాయి .కుడి చేయి అభయ ముద్రలో ఉంది భక్తుల రక్షణ తన బాధ్యత అని తెలియ జేస్తుంది .ఎడమ చేయి వర ప్రసాద ముద్ర లో ఉంటుంది .మిగిలిన చేతులలో ముడి ,జపమాల ,గండ్ర గొడ్డలి ,ముద్గరం ,విరిగిన దంతం ఆయుధం గా ,పుష్పహారం,ఉండ్రాళ్ళు ,పండు ఉంటాయి .తెల్లని శరీరం తో సింహ వాహనుడు గా దర్శన మిస్తాడు . .హేరంబ గణపతికి ఆర్ద్రా నక్షత్రం మహా పవిత్రమైనది .#హేరంబ గణపతి ని కొలిచిన వారికి భయాలను పోగొట్టి ,తమ మీద తమకు నమ్మకం కలిగించి విజ్ఞానం కలిగించి కోరిన కోర్కెలను నేర వేరుస్తాడు హేరంబ గణపతి భక్తులకు భయం అంటూ ఉండదు.
#హేరంబ గణపతి రూపం చాలా అరుదైన రూపం .చాలా కొద్ది చోట్ల మాత్రమె ఉన్నాడు ముఖ్యం గా కాశీ #విశ్వేశ్వరాలయం లో హేరంబ గణ పతి కొలువై ఉన్నాడు .కర్నాటక లోని మైసూర్ జిల్లాలోని చామ రాజ నగరం లో ,నంజన్ గూడి లో #హేరంబ గణపతి దేవాలయాలున్నాయి . ఇక్కడే మనకు 32 రూపాల గణపతి విగ్రహాలను దర్శించ వచ్చు .
No comments:
Post a Comment