సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, October 22, 2014

‎శ్రీరామజననం‬

Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
మధుమాసే సితే పక్షే నవమ్యాం కర్కటే శుభే /
పునర్వస్వ్రక్షసహితే క్షసహితే ఉచ్ఛస్థే గ్రహపంచకే //
‪‎దశరథుడు‬ బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి,చైత్రమాసం శుక్లపక్షమున నవమినాడు, ‪‎శుభకరమగు‬ కర్కాటక లగ్నమందు, పునర్వసు నక్షత్రమున ఐదుగ్రహములు ఉచ్ఛస్థానములో యుండగా, సూర్యుడు మేషరాశి యందుండగా మధ్యానకాలమందు సనాతనుడగు ‪‎పరమాత్మ‬ కౌసల్యకు ఆవిర్భవించెను.
‪‎యస్మిన్‬ రమంతే మునయో విద్యయా జ్ఞానవిప్లవే /
తం గురు: ప్రాహ రామేతి రమణాద్రామ ఇత్యపి //
జ్ఞానం ద్వారా అజ్ఞానం నశించిపోయిన తరువాత, మునులు ఎవరియందు రమింతురో, ఎవరు తన సౌందర్యంచే భక్తజనుల చిత్తములను ఆనందింపచేయునో అతనికి "రాముడ"ని గురువు వశిష్టుడు పేరు పెట్టెను.
‪‎భరణాద్భరతో‬ నామ లక్ష్మణం లక్షణాన్వితమ్ /
శత్రుఘ్నం శత్రుహన్తారమేవం గురురభాషత //
జగత్తును భరించినవాడు కావున రెండవ పుత్రునకు (కైకయి కి పుట్టినవానికి) "భరతుడ"ని, (ఇక సుమిత్రకు పుట్టిన ఇద్దరికి) సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి "లక్ష్మణుడ"ని, శత్రుహంత యగుటచే నాల్గవ వానికి "శత్రుఘ్ననుడ"ని వశిష్టులవారు పేర్లు పెట్టిరి.
‪‎కళ్యాణ‬ రామునికి కౌసల్య లాలి
రాముడుద్భవించినాడు రఘుకులంబున
తామసులను దునిమి దివిజ
సోమంబుల క్షేమముకై
కోమలి కౌసల్యకు |శ్రీ రాముడు|
పలువరుస ఆణిముత్యపు
సిరులోయన కిలకిలమని నవ్వుచు
దశరథుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయమారుతములు
దిశలెల్లను విశదములై
వసుమతి దుర్భరము బాప |రాముడు|
తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటకలగ్న
మరయగ సురవరులెలమిని
కురిపించిరి విరుల వాన |రాముడు|
ధరను గుడిమెళ్లంకపురము
నరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు
మొరలిడగను కరుణించియు వరమీయగ హరియై |రాముడు|

No comments:

Post a Comment