సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, October 20, 2014

ఆత్మానం‬ మానుషం మనే్య

ఆత్మానం‬ మానుషం మనే్య.
Ramudu Thota Venkataramana's photo.
సర్వ మానవాళికి, మూర్తీభవించిన ధర్మమైన శ్రీరాముడు‬ జన్మించిన 'శ్రీరామ నవమి' శుభాకాంక్షలు.
శ్రీరామ నవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది, రామరసం,భెల్లం,ఏలకుల పొడి,మిరియాలపొడి వేసి కలిపిన పానకం!తీపి ఘాటు కలయికతో చక్కని రుచి వస్తుంది.దీనిని నివేదన చేస్తారు!!
‪‎పివరే‬ రామరసం
రసమే పివరే రామరసం''!!
శ్రీహరి‬ దశావతారాల్లో పూర్ణావతారం శ్రీరాముడు. ‘'#ఆత్మానం మానుషం మనే్య’'!అని స్వయంగా తన్ను మానవునిగా దాశరథిగా ప్రకటించుకున్నవాడు శ్రీరాముడు. శ్రీరామావతారం కంటే ‪‎రామనామం‬ ప్రాచీనమైనది. అది కేవల భౌతిక రూపాన్ని సూచించేది కాదు, చిదానందరూపం. సచ్చిదానంద స్వరూపమగు ఏ పరబ్రహ్మను‬ నిరంతరమూ భావిస్తూ మునీంద్రులు ఆనందముననుభవిస్తారో అట్టి పరతత్వమే ‪‎రాముడు‬. ఆ పరతత్వమే తరువాతి కాలంలో దాశరథిగా అవతరించడం జరిగింది. ఆ తత్వాన్ని తెలియబరచే వేదం రామాయణంగా రూపొందింది. శ్రీరామ ‪‎నామంలోని‬ ‘ర’ వర్ణం ‪‎ఈశ్వర‬ చైతన్యం; ‘మ’ వర్ణం జీవ‬ చైతన్యం ఈ రెంటిని సంయోజనపరచుటయే ‘‪‎రామ‬’నామం. ‘ర’ వర్ణం-తత్ వాచకం ‘మ ’ వర్ణం-త్వం వాచకం. తత్వమసి‬ అనే మహావాక్యార్థమే రామనామం. నామ జపానికి ఏ వస్తువులు అవసరం లేదు. సమయా సమయాలు లేవు. కుల మత జాతి రంగ వివక్ష లేక సమస్త జనులు సులభంగా చేయగల అనుష్ఠానం నామధ్యానం‬. అటువంటి నామాన్ని ధ్యానం చేస్తే కోటి జన్మల పుణ్యము పలిస్తుంది.
రాముడు సకల గుణాబి రాముడు,ఒకే మాట,ఒకే బాణం, ఒకే పత్నీ అదే శ్రీరామ ఆదర్శం!
రామ రాజ్యం ఆదర్శ రాజ్యం.సర్వ జనులకు ఆదర్శ ప్రాయుడు, #రాముడు తలితండ్రుల మాటకు విలువిచ్చిన తనయుడు.సోదరప్రేమాతత్పరుడు,గొప్ప స్నేహితుడు,జంతుజాలము పట్ల కూడా అపారమైన ప్రేమను చూపిన కరుణా ‪‎సముద్రుడు‬.ఎన్నియుగాలు గడిచినా రామ చరితం ఆ చంద్రతారార్కం ఆచరణీయం అబినందనీయం ‪‎ఆరాధ్యనీయం‬.
‪‎రాయినైనా‬ కాకపోతిని
రామ పాదము సోకగా
బోయనైనా కాకపోతిని
పుణ్యచరితము వ్రాయగా
కడలి గట్టున ఉడుతనైతే
బుడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని
వేలి గురుతులు మోయగా...
మనిషినై జన్మించినానే మత్సరాలే నింపగా మదమత్సరాలే నింపగా!!
శ్లో||రామాయ‬ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:||
శుభకరుడు, ప్రకాశ స్వరూపుడు, జగత్కారణుడు‬, రఘువంశ ప్రభువు, సర్వ లోకేశ్వరుడు, సీతాపతి అయిన శ్రీ రామునకు ప్రణామములు‬.ధర్మబద్దమైన జీవనాన్ని ఆవిష్కరింప జేసేది వివాహం. ధర్మ‬ జీవనాన్ని ప్రతిఫలింప జేసే ఆదర్శ దంపతులు ‪‎సీతారాములు‬. మనసనే సీత, రాముడనే పరమాత్మతో, అయోధ్య అనే యుద్ధం లేని ప్రశాంత హృదయంలో‬ ఐక్యం కావడమే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణంలో గల తాత్విక భోధ‪ ‎జీవబ్రహ్మైక్యమే‬.ధర్మం అనేది లక్షణం. దానికి రూపం లేదు. బుద్దిలో భాసిస్తుంది. రూపం లేని ధర్మం, రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే ఏమి చెప్పగలం? 'శ్రీ రాముడిలా ఉంటుంది' అని అనగలం అంతే.
Ramudu Thota Venkataramana's photo.
రామ కథను వినరయ్యా
రామ కథను వినరయ్యా
ఇహపర సుఖములనోసగే సీతా ||రామ కథను వినరయ్యా||
అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్యా...సుమిత్రా...కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు..ఉ
రామ లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు..ఆ..ఆ ||రామ కథను వినరయ్యా||
ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భుజాని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యామునీ..
తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి ||రామ కథను వినరయ్యా||
మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ... ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల విరిసినది ||రామ కథను వినరయ్యా||
హరుని విల్లు రఘునాధుడు చేగొని ఎక్కిడ ఫెళఫెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కన్నులు కరములు కలిసినవి!! ||రామ కథను వినరయ్యా||

No comments:

Post a Comment