సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 22, 2014

సాయినాథుని‬ లీలలు

సాయినాధుని లీలలు
సాయినాథుని‬ లీలలు
దేవుడు‬ ఎక్కడో ఉన్నాడని వెతుకుతాం, నీలోనూ, సర్వంలోనూ నేనే ఉన్నాను.నాకోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పోనవసరం లేదు. మీలో సకల జీవులలో ఉండే ‪చైతన్యమే‬ నేను. ఇది గుర్తించగలిగితే, తెలుసుకోగలిగితే మీలోనే నన్ను దర్శించుకోగలరు. అప్పుడే మీరు నాలో‪ ‎తన్మయం‬ కాగలుగుతారు. 
మనలో భక్తికి కొదువుండదు. కానీ ఏ మూలో సందేహం కూడా పీడిస్తుంది. సందేహం ఉన్న చోట‪ విశ్వాసానికి‬ చోటులేదు. కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా దేవుని ఎదుట చిత్తం నిలవలేం. దృష్టి దేవుడిపై, మనసు మరెక్కోడో ఉంటుంది.‪బాబా‬ సర్వాంతర్యామి. షిర్డీ‪ సాయినాథుని‬ లీలా వినోదాలు మనకు అర్ధం కావు. భక్తి శ్రద్ధ, విశ్వాసంతో వాటిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.అప్పుడే నిశ్చలమైన ప్రశాంతతను పొందగలము.
#బాబా పదకొండు హామీలు..
1. ఎవరైనా షిరిడి నేల పైన కాలు పెడితే, వళ్ళ బాధలు ముగిసిపోతాయి.
2. హ్రుదయం ముక్కలైన వారు మరియు బాధలో ఉన్నవారు ద్వారకామయి మెట్లు ఎక్కగానే సము్రద్ధి మరియు ఆనందం లో ఎదుగుతారు.
3. ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నేను ఇంతే చురుకుగా ఇంక శక్తివంతంగా ఉంటాను.
4. నా సమాధి నా భక్తులను దీవించి వాళ్ళ అవసరాలను చూసుకుంటుంది.
5. నా సమాధి నుంచి కూడా నేను ఇంతే చురుకుగా ఇంక శక్తివంతంగ ఉంటాను.
6. నా అనిత్య అవసేషాలు సమాధి నుండి ప్రసంగిస్తాయి.
7. నా కోసం వచ్చేవారికి, నాకు విరమించే వారికి, నాలో ఆశ్రయం వెతికే వారికి నేను ఎప్పుడూ సహాయంగా, దారి చూపే వాడిగా ఉంటాను.
8. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను.
9. నీ భారం నాకు ఇస్తే, నేను తప్పకుండా అది భరిస్తాను.
10. నువ్వు నా సలహా మరియు సహాయం కోరితే, అది నీకు వెంటనే లభిస్తుంది.
11. నా భక్తుల ఇంట్లొ కొరత అనేది ఉండదు.
~~~~~~~~~~!!జై సాయిరామ్!!~~~~~~~~~~~~

భక్తికి‬ నామమే ఆధారం

భక్తికి నామమే ఆధారం
భక్తికి‬ నామమే ఆధారం..
కొటి జీవులలొ నేనొక జీవినై నా అంతరాత్మలొ ఓ ఆఖిలాండకొటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మస్వరూపమైన ఓ ‪సాయిబాబా‬ ఆత్మగా నిన్నె చూసాను.నిన్నె తలచాను జగతిలొ ప్రేమపుష్పమై వికసించావు.నిత్యదీపమై సర్వాంతర్యామిగా సకల జీవులలొ నిరంతరమై విశ్వమంత సత్యమై ‪‎సాయిలీలలు‬ చాటిచేప్పినావు మధురమైన నీ నామమునె గానముగా చేసినావు.నిన్ను నమ్మినవారిని సఖల భాగ్యములతొ ‪ఆశీర్వదించినావు‬.అనంతమైన విశ్వం లొ స్వచ్చమైన సంపూర్ణమైన నీ ‪‎ప్రేమ‬ ప్రతి జీవిని ఆదుకుని కాపాడునని నా మనసా వాచా ఓ శిరిడి‪ సాయినాధ‬ నీకై సమర్పిస్తున్నాను.

నామమే ‪‎భగవత్‌స్వరూపము‬. ఎవరైతే నామమును జపిస్తారో వారు తరిస్తారు.భగవదనుగ్రహాన్ని శ్రద్ధతో, సాధనతో ‪స్వప్రయత్నంతోనే‬ పొందగలుగుతాడు సాధకుడు. తద్వారా జ్ఞానాన్ని, శీలాన్ని, ధర్మాన్ని పొందుతాడు. అసాధ్యమైన సత్యాన్ని గ్రహిస్తాడు.మనిషి ‪సృష్టికి‬ శిరోమణి. జీవితం ఎంతో విలువైనది. కాలము శ్రేష్ఠమైనది. అమూల్యమైనది. ప్రాణము కొనలేనిది. కొలువలేనిది. కర్మతో జన్మనెత్తి వచ్చిన మనము మరల కర్మల వలయంలో చిక్కుబడి హీనజన్మలకు దిగజారుతున్నాము.‪అంత‬:కరణాన్ని శుద్ధం చేసేది ‪‎సత్సంగమే‬. ఒంటరిగా కూడా సాధన చేయడం మంచిది. కర్మలలో శ్రేష్ఠమైనది భగవత్కార్యము.

‪భగవత్కార్యము‬ కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున ‪నామముల‬ వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది ‪భగవన్నామస్మరణ‬. దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడమె నామ జపము.చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు. ‪భక్తి‬, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం(నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది. అంత:కరణాన్ని శుద్ధిచేసేది, శరీరాన్ని, మనసును కూడా ఉత్తేజపరచి నిర్మలంగా చేసేది సత్సంగమే. ఉత్తమ గతి పొందాలంటే పావనమైన మార్గం నామజపం. దీంతో శీఘ్రంగా సత్ఫలితాలను పొందగలుగుతాము.
~~~~~~~~~~~~!!శిరిడి సాయినాథ్ మహరాజ్ కి జైహో!!~~~~~~~~~~~~

సాయిబాబా‬ అందరిని కాపాడుగాక

సాయిబాబా‬ అందరిని కాపాడుగాక
సర్వస్వ షిరిడీసుని నామ సంకీర్తన !!సాయిసా షిరిడీ సాయీశా!!
సర్వస పర్తీశుని నామ సంకీర్తన !!పర్తీశ షిరిడీ సాయీశా!!
నాగఃబియంటారు బాలసాయంటారు !!సాయీశా షిరిడీ సాయీశా!!
దత్తసాయంటారు పర్తిసాయంటారు !!సాయీశా షిరిడీ సాయీశా!!
సత్యసాయంటారు పాప సాయంటారు !!సాయీశా షిరిడీ సాయీశా!!
అన్నిదిశలలోనా హారతులు అందేవు !!సాయీశా షిరిడీ సాయీశా!!
ఓంకార రూపుడా శ్రీకార రూపుడా !!సాయీశా షిరిడీ సాయీశా!!
‪శ్రీసాయి‬ కష్ట నివారణ స్తోత్రం
ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ నమః
ప్రథమం సాయినాథాయ నమః ద్వితీయ ద్వాఆజాయ రకామాయినే
తృతీయం తీర్థ రాజాయ చతుర్థం భాక్తవత్సలే
పంచమం పరమార్థాయ షష్టించ షిర్డీ వాసనే
సప్తమం సద్గురు నాధాయ అష్టమం అనాథ నాధనే
నవమం నిరాడంబరాయ దశమం దత్తావతారమే
యతాని దవమానాని త్రిసంధ్యపదే నిత్యం
సర్వకష్ట భయోన్ముక్తో సాయినతగురు కృపా
(ఈ సాయినాథ కష్టనివారణ స్తోత్రం రోజుకు 3 సార్లు 10 పర్యాయములు ఎవరు పాఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలుగును)
---------------ఓం శ్రీ సాయి రాం---------------

సాయి‬ రాగసుధను నేను

#సాయి రాగసుధను నేను..
సద్గురువును తెలుసుకునుట మన #కర్తవ్యం,అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం.ఆత్మజ్ఞానానికి ధ్యానమెంతో అవసరం ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం #సుస్థిరం. అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం,! నువ్వు నేను వేరను భావం విడువు అనన్యమయిన #భక్తితో సద్గురువును కొలువుతననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును.! అజ్ఞానపు చీకటులను తొలగించుటకై జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకైఈ భువిలో జన్మించెను ఒక దివ్య #తేజము అది షిరిడీలొ వెలిసిన #సాయి రూపము!!

#సాయి రాగసుధను నేను 
సాయి గానామృతసారన్ని నేను
సాయి రాగసుధను నేను

సాయి కనులలో కురిసే అమృత వర్షిణి నేను
సాయి గళములో విరిసే జ్ఞానవాహిని నేను

సాయి దివ్య స్పర్శలో అనుభూతిని నేను
సాయి దయా హృదయములో ఆశీస్సును నేను

సాయి పదకమలంలో త్రివేణి సంగమం నేను
సాయి రాగసుధను నేను
సాయి గానమృతసారాన్ని నేను
సాయి రాగసుధను నేను!!
సాయి‬ రాగసుధను నేను..
సద్గురువును తెలుసుకునుట మన ‪‎కర్తవ్యం‬,అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం.ఆత్మజ్ఞానానికి ధ్యానమెంతో అవసరం ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం ‪సుస్థిరం‬. అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం,! నువ్వు నేను వేరను భావం విడువు అనన్యమయిన ‪‎భక్తితో‬ సద్గురువును కొలువుతననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును.! అజ్ఞానపు చీకటులను తొలగించుటకై జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకైఈ భువిలో జన్మించెను ఒక దివ్య ‪తేజము‬ అది షిరిడీలొ వెలిసిన #సాయి రూపము!!
#సాయి రాగసుధను నేను
సాయి గానామృతసారన్ని నేను
సాయి రాగసుధను నేను
సాయి కనులలో కురిసే అమృత వర్షిణి నేను
సాయి గళములో విరిసే జ్ఞానవాహిని నేను
సాయి దివ్య స్పర్శలో అనుభూతిని నేను
సాయి దయా హృదయములో ఆశీస్సును నేను
సాయి పదకమలంలో త్రివేణి సంగమం నేను
సాయి రాగసుధను నేను
సాయి గానమృతసారాన్ని నేను
సాయి రాగసుధను నేను!!

సాయిరామ‬ స్తోత్రం


‪సాయిరామ‬ స్తోత్రం..
సాయిరామ‬ స్తోత్రంశివం నిత్యమేకం విభుం తారకాభం శుభకార మకార సూన్యం సు మాన్యం
మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే
విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణధార మాధార హీనం వరేణ్యం
మహాంతం నిభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం సాయిరామం ప్రపద్యే||
నిజే మానస మందిరే సన్నీదేహి ప్రసీద ప్రసీద ప్రభో సాయినాధ
త్వ మే వాసి దైవం పరం యే యదేకం సుచైతన్య మేతత్త్వ ధన్యం నమస్తే||
నమః సచ్చిదానంద రూపాయ తస్మై నమోదేవ దేవాయ రామాయ తుభ్యం
నమో భక్తి యుక్తాను రుక్తాయ తుభ్యం నమః పుణ్య పుంజైకలఖ్యాయ తుభ్యం||
నమో వేద వేద్యాయ చాద్యాయ పుంసే నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం
నమో విశ్వకర్రే నమో విశ్వహర్రే నమో విశ్వ భోక్తే నమో విశ్వ ధాత్రే||
నమో విశ్వ నేత్రే నమో విశ్వ జైత్రే నమో విశ్వ పిత్రే నమో విశ్వ తాతా
నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రమోద ప్రభోద ప్రమాణ ప్రవీణ||
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరం త్వన్వహం సాయిరామ
భవంతం భావాతం భరత్యోభజంతో లభంతే సదానంద మానంద రూపం||
సపుణ్యః సగణ్యః శరణ్యో మయాయం నరో వేద యోదేవ చూడామణిం త్వాం
సదాకారమేకం చిదానంద రూపం మనోతోవాగతం పరం సాయినాథ||
సదా సాయి రామేతి నామామృతం తే సదా సాయి మానంద నిష్యంద కందం
పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమాంత మందర్భజే తం నితాంతం
శరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం దానం సత్య భృత్ర్యం భువంచ
సమస్తత్వమేవ నమో సాయి దేవ ప్రసీద ప్రసీద శ్రీయ శ్రేయ సాత్వం
ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రంచడారికాల
ప్రసీద ప్రసీద ప్రసన్ననుకంపన్ ప్రసీద ప్రసీద ప్రభో సాయిరామ||
~~~~~!!ఓం శ్రీ సాయి రాం!!~~~~~~

‎సాయి‬ జపం

‎సాయి‬ జపం
‎సాయి‬ జపం ప్రతి గురువారం..
"‪ఓం‬ గం గ్లౌం శ్రీం బ్లూం హ్రీం క్లీం సాయినాథాయనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురువారం సూర్యోదయానికి ముందే లేచి, ‪శుచిగా‬స్నానమాచరించి సాయిబాబా పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.
సూర్యోదయం జరిగిన తర్వాత కొద్ది నిమిషాల్లో పై ‪‎మంత్రాన్ని‬ 108 సార్లు జపిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. శ్రీ సాయి మీద మనస్సు లగ్నం చేసి, ప్రతినిత్యం సూర్యోదయానికి తర్వాత పై మంత్రాన్ని 40 రోజుల పాటు ‪ఉచ్చరించడం‬ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేగాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, సకల సంపదలు చేకూరడం జరుగుతాయి. ఇంకా ‪గురువారం‬ పూట ‪‎సాయిబాబా‬ ఆలయానికి వెళ్లి ఆయన దర్బారు శుభ్రం చేయడం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. దీంతో పాటు సాయిబాబా ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ముందు ఎవరికైనా కాసింత ‪‎దానం‬ చేయండి. ఇలా 40 రోజులు సాయిబాబా మంటపాన్ని శుభ్రం చేస్తూ అక్కడ ఇచ్చే ‪ప్రసాదాన్ని‬ ఉన్నంతలో కాసింత దానం చేసి తాను తింటే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు ‪‎పరిష్కారమవుతాయి‬.

బాబా‬ హరతి పాట


Glitter Photos
‎బాబా‬ హరతి పాట..
ఓం జై జగదీశ హరె స్వామి శిరిడి సాయి హరె
భక్త జన సంరక్షక భక్త జన సంరక్షక
శిరిడి మహేశ్వర
ఓం జై జగదీశ హరె
శశివదన శ్రీకర
సర్వ ప్రాణ పతే స్వామి సర్వ ప్రాణ పతే
ఆశ్రిత కల్ప లతిక ఆశ్రిత కల్ప లతిక
ఆపద్బాందవ
ఓం జై జగదీశ హరె
మాత పిత గురు దైవము
మరియంతయు నీవే స్వామి మరియంతయు నీవే
నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ
నాగీంద్ర శయన
ఓం జై జగదీశ హరె
ఓంకార రూప హరె
శివ సాయి మహ దేవ శిరిది సాయి మహ దేవ
మంగళ హరతి అందుకో మంగళ హరతి అందుకో
మందర గిరి థారి
ఓం జై జగదీశ హరె
నారాయన నారాయన ఓం సత్య
నారాయన నారాయన ఓం
నారాయన నారాయన ఓం సత్య
నారాయన నారాయన ఓం సత్య
నారాయన నారాయన ఓం
ఓం జై సద్గురు దేవా!!3x!!
ఓం శాంతి శాంతి శాంతిః
లోకా సమస్తా సుఖినో భవంతు!!3x!!
ఓం శాంతి శాంతి శాంతిః
ఆఖిలాండ కోటి బ్రహండ నాయక
రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ
సచ్చిదానంద సమర్థ సత్ గురు
శ్రీ భగవాన్ శిరిడి సాయి నాథ్ మహరాజ్ కి జై
ఆఖిలాండ కోటి బ్రహండ నాయక
రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ
సచ్చిదానంద సమర్థ సత్ గురు
శ్రీ భగవాన్ సత్య సాయి మహరాజ్ కి జై
ఆఖిలాండ కోటి బ్రహండ నాయక
రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ
సచ్చిదానంద సమర్థ సత్ గురు
శ్రీ భగవాన్ శ్రీ సాయి కాళేశ్వర స్వామి మహరాజ్ కి జై
పరమమ్ పవిత్రం బాబా విభూతిం
పరమమ్ విచిత్రం లీలా విభూతిం
పరమార్థ ఇషార్థ మోక్ష ప్రదాతం
బాబా విభుతిం ఇదం ఆశ్రయామి
సాయి బాబా విభుతిం సతతం స్మరామి
శిరిడి సాయి విభుతిం మనసా స్మరామి
ఓం ఓం ఓం
ఆసతోమా సద్గమయ
తమసోమా జోతిర్గమయ
మృత్యోర్మ ఆమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః
సహ నానవతొ
సహ నైభు నక్తు
సహవీరైం కరవావహై
తేజస్వినా వథీతమస్తు
మా విద్విషావాహై!!
~~!!ఓం శంతి శాంతి శాంతిః!!~~

‎శ్రీసాయి‬ మధ్యాహ్న మంగళ హారతి

శ్రీసాయిబాబా‬ మధ్యాహ్న హారతి..
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
చేకొనుమా పంచారతి సాయి బాబా నీకే హారతి
ఈయగ హారతి రారే సాయి బాబాకే హారతి
భక్తులార రారండి కలసి ఇవ్వగ సాయికి హారతి
సాయిరామాథవ స్వామి నీకే హారతి
నిశ్చలమున మనసుంచి మదిని ధ్యానించే మంత్రమ్
సాయిరాముని స్మరణమ్ సర్వజీవాధారమె మంత్రమ్
కృష్ణనాథ దత్తసాయి మా చిత్తము నీదోయి
స్వామి సాయినాథ స్వామి మా సర్వము నీవోయి
హారతి సాయిబాబా
సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
కామక్రోధమొదిలించు సత్యమేదో వచించు
ముముక్ష మానవుల వసియించేవు రంగ నీవే శ్రీరంగ
హారతి సాయిబాబా
భావన ఏదైతే అదే అనుగ్రహించె దయాధనా సాయి
ఇది ఏమి మాయ ఇది నీ మాయ
హారతి సాయిబాబా
స్వామి సాయి నామమే సుఖః సంతోష తీరమ్
అనాధ జీవులకే అదె ఆశ్రయసదనమ్ ఆనంద సదనమ్
హారతి సాయిబాబా
కలియుగ అవతార పరబ్రహ్మావతార అవధరించినావయ్య
ఇల దత్తస్వరూప సాయి స్వరూప
హారతి సాయిబాబా
ప్రియమాయె గురువారమ్ పర్వదినమాయె భక్తుల ప్రభుపదసేవలలో
భవభయములు బాపగ నీవే బాసట
హారతి సాయిబాబా
కోరము ఏ వరమూ నీ పదసేవ తప్ప
ఆ అభయముమీద స్వామి సాయిస్వరూప ప్రేమస్వరూప
హారతి సాయిబాబా
దీనుల మము దయతో పాలింపుము దేవ
ఆశ్రిత వదనుడవై ఆలింపుము దేవ మమ్ముల బ్రోవ
హారతి సాయిబాబా
సౌఖ్యదాత మా దేవ శరణమయ్యా స్వామి
భక్త దాసా వికాసా దేవా లోకేశ
హారతి సాయిబాబా
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ ధర్మము నిలకావగనే అవతారము దాల్చి
నాస్తికులను సైతము తన ఆస్తికులుగ జేసె
నీలీలు సాగె ఎన్నెన్నో రూపాలై దీనులను కాచేనిక సంకటములు బాపి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ యవన రూపమున మాకు దర్శనమే ఇచ్చి
సంశయముల పిడదీసి సాగిల పడవేసి
మూఢులను కరుణించి తరియింపగజేసి
మోవిన వంశీ జన్ముడ లోకము పాలించె
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ భేధములెంచక హిందు ముస్లీమ్ ఒకటంటు
నరులంత ఒకటేయని పరభేధము వలదంటు
పలువురిని ఒకపరినే చూసేవుగ స్వామి
పరమాత్మవు నీవై సర్వమ్ముకు సాయి
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ దేవా సాయీనాథ వందనము స్వామి
మాయామోహమునుండి మరలించుము మమ్ము
సంకటములనెల్ల నీ కృపతో తొలగించి
సేవించే భాగ్యమ్మును శక్తిని మాకిమ్మ
జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత
శిరమొంచి పదమంటెదమయ్యా నీ చెంత
జయదేవ జయదేవ శిరిడి మా పండరీపురమ్ సాయిబాబా రమావరుడు
బాబా రమావరుడు సాయిబాబా రమావరుడు
శుధ్ధభక్తియె చంద్రభాగ భావరూపుడే పుండరీకుడు
పుండరీకునీ భాగ నా భావరూపమె కాగ
రండు రండి భక్తుల్లార చేయగ సాయికి వందనమ్
సాయికి వందనమనరె స్వామి సాయికి వందనమనరె
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
పరుగునచేరి కావుము తండ్రి పతిత జనులను బ్రోవుము తండ్రి
సాయికి సాష్టాంగ వందనము పావనమూర్తికి వందనము
పండరినాథ వందనము జయ జయ సాయికి వందనము
త్వమేవమాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్య సఖత్వమేవ
త్వమేవవిద్యా దర్యంత్వమేవ త్వమేవ సర్వమ్ మమదేవ దేవ
సాయేనవాచ మనసేంద్రియైవ ఉద్యాత్మనావ ప్రకృతి స్వభావ
తరీనియద్యత్ సకలమ్ పరస్మయ్ నారాయణాయైచి సమర్పయామి
అచ్యుతమ్ కేశవమ్ రామనారాయణమ్ కృష్ణ దామోదరమ్ వాసుదేవంభని
శ్రీధరమ్ మాధవమ్ గోపికా వల్లభమ్ జానకీ నాయకమ్ రామచంద్రమ్ భజే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరిహి ఓం గురుదేవదత్త హరిహి ఓం!!

‎శ్రీసాయి‬ మంగళ హారతి..

‎శ్రీసాయి‬ మంగళ హారతి..
షిరిడీ క్షేత్ర వాసుడైన, లోకనాథుడైన, ‪‎బ్రహ్మ‬ స్వరూపుడు, భక్తులచే, నాగ లోక వాసులచే కొలవ బడిన, ముక్తి మార్గ బోధకుడు అయిన శ్రీ సాయి నాథుని మన అభీష్టాలని తీర్చేందుకు నమస్కరిస్తూ ఇచ్చే ఈ మంగళ హారతి పాట '‪#‎రామ‬ చంద్రాయ జనక రాజజా మనోహరాయ' ట్యూన్ లో పాడవలెను.
‪‎స్వామి‬ సాయినాథాయ షిరిడి క్షేత్ర వాసాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్ || స్వామి ||
లోక నాథాయ భక్తలోక సంరక్షకాయ
నాగలోక స్తుత్యాయ నవ్య మంగళమ్ || స్వామి ||
భక్త బృంద వందితాయ బ్రహ్మ స్వరూపాయ
ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళమ్ || స్వామి ||
సత్య తత్వ బోధకాయ సాధు వేషాయతే
నిత్య మంగళదాయకాయ నిత్య మంగళమ్ || స్వామి ||
మహిత మంగళమ్! మహిత మంగళమ్!
మహిత మంగళమ్! మహిత మంగళమ్!!

Sunday, September 21, 2014

విన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబా


విన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబావిన్నపాలు‬ విన్నవించ వచ్చినాము బాబా..
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా ||విన్న||
మురిపెము తో నువు తిరిపెము నెత్తి మురిసినావు బాబా
కరములతో శ్రీకరముగ మమ్ము బ్రోచినావు బాబా ||మురి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
కరి మొరలే విని మకరిని ద్రుంచిన వాడవు కావా బాబా
మా మొరలే వినరావా బాబా ఓ సాయిబాబా ||కరి||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
రావణంతకా ఇనకుల తిలకా రామ సాయిబాబా
దశరథ పుత్ర కోమల గాత్రా పరమ పవిత్రా బాబా ||రావ||
కృష్ణ సాయిబాబా రామ సాయిబాబా
పదములు వీడను దీన బంధో సాయిబాబా ||విన్న||
విన్నపాలు విన్నవించ వచ్చినాము బాబా
కన్న తల్లి తండ్రి నీవే సాయిబాబా
మా సాయిబాబా మా సాయిబాబా

‎సాయిబాబా‬ హారతి అర్థాలతో


#సాయిబాబా హారతి అర్థాలతో..
''#ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా||1||
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.

జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా||2||
కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,ఆరతి సాయి బాబా||3||
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)

తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ, ఆరతి సాయి బాబా||4||
నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా 
అవతీర్ణ  ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర, ఆరతి సాయి బాబా||5||
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి  మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)   

ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద  పహావాయా భవభయ నివారీ, ఆరతి సాయి బాబా||6||
ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము. 

మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా, ఆరతి సాయి బాబా||7||
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక ఆరతి సాయి బాబా||8|| 
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
సాయిబాబా‬ హారతి అర్థాలతో..
''‪ఆరతి‬ సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా||1||
బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.
జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా||2||
కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,ఆరతి సాయి బాబా||3||
ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)
తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ, ఆరతి సాయి బాబా||4||
నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర, ఆరతి సాయి బాబా||5||
ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)
ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ, ఆరతి సాయి బాబా||6||
ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా, ఆరతి సాయి బాబా||7||
నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.
ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక ఆరతి సాయి బాబా||8||
చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

‎మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్

మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్
‎మెరె‬ ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
జబ్ ఆరతి హో తేరీ, ముఝే ఘంటీ సునాఈ దే (2)
ముఝే రోజ్ సవారె సాయినాథ్ తెరి సూరత్ దిఖాఈ దే (2)
జబ్ భజన్ కరె మిల్కర్ బస్ కానోం మేం గుల్జాయీ (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే (2)
ఆతే జాతే బాబా తుమ్ కో మైం ప్రణామ్ కరూం (2)
జో మేరే లాయక్ హొ కుఛ్ ఐసా కామ్ కరూం (2)
తెరీ సేవా కర్ నే సే మేరీ కిస్మత్ ఖుల్ జాయే (2)
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే (2)
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెర మందిర్ బన్ జాయే
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
నజ్ దీక్ రహేంగే తో ఆనా జానా హోగా (2)
హమ్ భక్తోం కా బాబా మిల్నా జుల్నా హోగా (2)
కబ్ సాథ్ రహే బాబా జల్దీ వో దిన్ ఆయే (2)
కబ్ సాథ్ రహే బాబా జల్దీ వో దిన్ ఆయే (2)
జబ్ ఖిడికీ ఖోలూం తో తెరా దర్శన్ హో జాయే
మెరె ఘర్ కె ఆగే సాయినాథ్ తెరా మందిర్ బన్ జాయే
~ ~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~

‎సాయి‬ బాబా దినచర్య..

‎సాయి‬ బాబా దినచర్య..
సాయిబాబా ‪సాధు‬ జీవితం ఎంతో పరిశుద్ధమైనది. అందులోని పవిత్రతే ఎందరో భక్తులను ఎక్కడెక్కడి నుంచో షిరిడీకి లాక్కొచ్చేది. బాబా దినచర్యను గమనించినవారికి ఆయన జీవితం ఎంత ‪‎పవిత్రమైనదో‬ తేలికగా అర్థమవుతుంది.
బాబా తెల్లవారు జామునే నిద్రలేచేవారు. ‪ధుని‬ దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిల్చుని విచిత్రమైన భంగిమలను ప్రదర్శించేవారు. నెమ్మదిగా '‪యాదేహక్‬'(దైవాన్ని ఎప్పుడూ స్మరించాలి) వంటీ అరబ్బీ పదాలు పలికేవారు. ఆ సమయంలో తమ వద్దకు ఎవరినీ రానిచ్చేవారు కారు. ఆ లోగా‪ ‎మాధవ్‬ ఫస్లే అనే సేవకుడు మసీదును చక్కగా ఊడ్చి, బకెట్లతో నీటిని సిద్ధం చేసేవాడు. #సాయి ఆ నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలించి, ముఖం, కాళ్లు చేతుల్ని ఎంతో నాజుకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. మధ్యలో ధునిలోని కట్టెల్ని సవరిస్తూ, ‪భక్తులతో‬ ఆ ముందటి రాత్రి తామెక్కడికి వెళ్లిందీ, ఎవరినెలా కాపాడిందీ, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తానెలా తీసుకెళ్లిందీ వివరించేవారు. ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు కలిగిన అనుభవాలను అక్కడ ‪‎కలబోసుకునేవారు‬.
అనంతరం ‪కుష్ఠురోగ‬ భక్తుడు భాగోజీ షిండే బాబా చేతి(ఆ చేతిని ధునిలో పెట్టే బాబా ఎక్కడో దూరంగా ఉన్న ఒక కుమ్మరి బిడ్డను కాపాడారు. అప్పుడు ఆ చేతికి కాలిన గాయమైంది)కి‪ శ్రద్ధగా‬ కట్టు కట్టేవాడు. నిజానికి బాబాకు అతని సేవతో పని లేకపోయినా అతన్ని ఆనందపరిచేందుకే ఆ అవకాశం ఇచ్చేవారు. అప్పటికి ‪ ‎ఉదయం‬ ఏడున్నర అయ్యేది. షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఈ సమయంలోనే బావి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మేవారు. తర్వాత కొంత కాలానికి భక్తులు ‪‎బాబా‬ కోసం రెండు పెద్ద రాగి పాత్రలలో వేడి నీళ్లు, రెండు బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. బాబా వేడి, చన్నీళ్లు కలుపుకుని సుమారు గంటసేపు స్నానం చేసేవారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో #బాబా భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకుని కుడిచేతిలో రేకు డబ్బా పట్టుకుని ‪‎షిరిడీలోని‬అయిదిళ్లకు భిక్షకు వెళ్లేవారు.
‪భిక్ష‬ తీసుకుని తిరిగి మసీదుకు చేరిన వెంటనే ఒక రొట్టె, కొద్దిగా అన్నం ధునికి ఆహుతిగా వేసేవారు. ఆ తరువాత మిగిలినవన్నీ ఒక మట్టి పాత్రలో వేసి మూత పెట్టకుండా ఉంచేవారు. ఎవరికి కావాల్సినవి వారు అందులోంచి తీసుకెళ్లేవారు. కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు,‪సేవకులు‬ ఎవరెంత తీసుకున్నా బాబా ఏమీ అనేవారు కారు. అందరూ తీసుకోగా మిగిలిన పదార్థాలన్నిటినీ కలుపుకుని #బాబా తినేవారు. పగలెన్నడూ వెన్ను వాల్చేవారు కారు. గోడకు జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించే వారు. ‪‎భిక్షాన్నం‬ మాత్రమే తినేవారు.
భిక్షకు వెళ్లి వచ్చిన తరువాత బాబా పాదరక్షలు ధరించి లెండీ వనానికి బయలుదేరేవారు. భక్తులు దారి పొడవునా బాబాకు గొడుగు పట్టేవారు. తిరిగి పదిన్నర ప్రాంతంలో బాబా మసీదుకు చేరుకునేవారు. గాయకులు, నర్తకీ నర్తకులు, గారడీ వాళ్లు... ఇలా ఎవరో ఒకరు కొద్దిసేపు బాబా ఎదుట తమ కళలను ‪ప్రదర్శించేవారు‬. అటువంటి ప్రదర్శనలు లేకపోతే బాబానే మధ్యాహ్నం వరకు భక్తులకు హితోపదేశాలు, ‪‎నీతి‬ బోధకమైన కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు. అనంతరం భక్తులందరితో కలిసి బాబా మధ్యాహ్న భోజనం చేసేవారు. భోజనాలయ్యాక సగుణమేరు ‪నాయక్‬ మసీదును శుభ్రం చేసేవాడు. సాయి యథాస్థానంలో కూర్చున్నాక తాంబూలం, తర్వాత గ్లాసెడు మంచినీళ్లు, రెండు రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. కొంతసేపు సాయి ఏకాంతంగా గడిపేవారు. ‪సాయంత్రం‬ అయిదు గంటల సమయంలో బాబా మళ్లీ లెండీ వనానికి వెళ్లి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ఎదుట సన్నాయి వాయించేవాడు. ఎందుకో #బాబా అతనిపై ఆవేశంగా ఎగిరిపడేవారు.
తరువాత కొద్దిసేపు ‪మసీదు‬ చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత ఆరు గంటలకు హారతి కార్యక్రమం పూర్తయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. ఆ తరువాత తనకు దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్నంతా బాబా అందరినీ పిలిచి పంచేసేవారు. రాత్రి భక్తులందరూ భోజనాలకు తమ ఇళ్లకు వెళ్లినప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో ‪తాత్యా‬ కొన్ని రొట్టెలు తెచ్చి బాబాకు ఇచ్చేవాడు. #బాబా వాటిని తీసుకుని అతనికి ముప్ఫయ్ అయిదు రూపాయలు ఇచ్చేవారు. బాబాకు తాంబూలం అంటే మహా ‪ఇష్టం‬. రాత్రీ పగలూ వాటిని తరుచుగా తీసుకునేవారు. అవి తిన్నాక బాగా నీళ్లు తాగేవారు. అనంతరం పవళింపు(శేజారతి) హారతి జరిగేది. ‪‎హారతి‬ పూర్తవగానే బాబా నిద్రకు ఉపక్రమించేవారు.

ఎంతెంత‬ దయనీది ఓ సాయి

#ఎంతెంత దయనీది ఓ సాయి..
                          ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను 
                          ఏమని పొగడను సర్వాంతర్యామి                  || ఎంతెంత ||
                          ఎంతెంత దయనీది ఓ సాయి

                          తొలగించినావు వ్యాధులు ఊదితో
                          వెలిగించినావు దివ్వెలు నీటితో                    |  తొలగించి  |
                          నుడులకు అందవు నుతులకు పొంగవు         | నుడులకు |
                          పాపాలు కడిగేసే పావన గంగవు                  || ఎంతెంత ||

                          భక్త కబీరే నీ మతమన్నావు 
                          భగవానుడే నీ కులమన్నావు                    | భక్త కబీరే |
                          అణువున నిండిన బ్రహ్మాండంలా 
                          అందరిలో నీవే కొలువున్నావు                    || ఎంతెంత ||

                          ప్రభవించినావు మానవమూర్తివై 
                          ప్రసరించినావు ఆరని జ్యోతివై                     | ప్రభవించి |
                          మారుతి నీవే గణపతి నీవే 
                          సర్వ దేవతల నవ్యాకృతి నీవే                     || ఎంతెంత ||
                          బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
                          బాబా ఆఆఆఅ షిరిడి బాబా!!
~~~~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~~~
ఎంతెంత‬ దయనీది ఓ సాయి..
ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను
ఏమని పొగడను సర్వాంతర్యామి || ఎంతెంత ||
ఎంతెంత దయనీది ఓ సాయి
తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో | తొలగించి |
నుడులకు అందవు నుతులకు పొంగవు | నుడులకు |
పాపాలు కడిగేసే పావన గంగవు || ఎంతెంత ||
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు | భక్త కబీరే |
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు || ఎంతెంత ||
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై | ప్రభవించి |
మారుతి నీవే గణపతి నీవే
సర్వ దేవతల నవ్యాకృతి నీవే || ఎంతెంత ||
బాబా సాయిబాబా, బాబా సాయిబాబా
బాబా ఆఆఆఅ షిరిడి బాబా!!
~~~~~~!!శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!~~~~~~

ఓం సాయి నమాయ


ఓంసాయి‬ నమాయ
ఓంసాయి‬ నమాయ ఓం సాయి నమాయ..
హర హర బోలే సాయి నమాయ
ఓం సాయి నమాయ ఓం సాయి నమాయ
హర హర బోలే సాయి నమాయ
అనంత కోటి బ్రహ్మాండ నాయక
రాజాధి రాజ యోగి రాజ
పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద
సద్గురు సాయి నాథ నమాయ "ఓం సాయి"
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు
గురుర్ దేవో మహేశ్వరాయ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమాయ "ఓం సాయి"
శ్రీమద్ పరబ్రహ్మ గురు స్మరామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు నమామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు యజామి
శ్రీమద్ పరబ్రహ్మ గురు భజామి "ఓం సాయి"
ఓం శ్రీ సాయి నాథాయ నమః
లక్ష్మీ నారాయణాయ నమః
ఓం కృష్ణరామ్ శివ మారుత్యాది రూపాయ
ఓం శేష సాయినే నమో నమాయ "ఓం సాయి"
ఓం గోదావరీతట శీలధివాసినే
భక్త హృదాలయాయ నమో నమాయ
యోగేశ్వరాయ నమో నమాయ
ఓం భగవతే నమో నమాయ "ఓం సాయి"
ఓం తీర్థాయ నమో నమాయ
వాసుదేవాయ నమో నమాయ
ఓం కాలతీతాయ కాలాయ నమః
కాల కాలాయ నమో నమాయ "ఓం సాయి"
ఓం ప్రీతి వర్ధనాయ ప్రియాయ నమః
ఓం అంతర్యామినే నమో నమాయ
ఓం సచ్చిదాత్మనే నిత్యానందాయ 
పరమ సుఖదాయ నమో నమాయ "ఓం సాయి"

శ్రీసాయి‬ పల్లకి

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కదిలింది ‪‎శ్రీసాయి‬ పల్లకి నూటొక్క సంవత్సరాల క్రిందట..
షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ ‪‎సాయి‬ ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ‪ పల్లకి‬ ఉత్సవం లో పాల్గొనేవారు.
అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు ‪భక్తులంతా‬ బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు‪ ‎ద్వారకామాయిలోను‬, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909 లో జరిగింది. అంటే ప్రస్తుతానికి దాదాపు 101 ఏళ్ళముందు జరిగిందన్నమాట. ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "‪‎చావడి‬ ఉత్సవం" గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివుని లా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా ‪‎పాదుకలను‬పల్లకీలో ఉంచుతారు. బాబా కు బహూకరించిన గుర్రం "‪‎శ్యామకర్ణ‬" ను అలంకరించి తెచ్చేవారు.‪‎తాత్యా‬, ‪‎మహల్సాపతి‬, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు.
ఇప్పటికీ షిరిడీలో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు. ‪‎సాయిబాబావారి‬ ఆశ్శీస్సులు అందరికి పదికాలాపాటు కలకాలం చల్లగా చూడాలి.
~~~~~!!శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై హో!!~~~~~~
ప. కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభ కారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. సాయి పాదుకలు ఎదపై నిలిపి (2)
సాగెను పల్లకి నేడు
పల్లకి వెంటా చల్లగా కదిలెను
బాబా పదములు చూడు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. ద్వారక దాటి తరలిన పల్లకి (2)
చేరెను చావడి ముందు
ప్రమథుల నడుమా పరమ శివునిలా
బాబా వేసెను చిందు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చ. అటు తాళాలు, యిటు మేళాలు
ఆడే భక్త గణాలు (2)
పల్లకి ఉత్సవం చూసిన చాలు
కరుగును పాషాణాలు (2) ||కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !

-సబ్ కా మాలిక్ ఏక్ హై


శిరిడిసాయి‬-సబ్ కా మాలిక్ ఏక్ హై...
సబ్ కా మాలిక్ ఏక్ హై
భక్తులైన అందరిలో ఉండ వలసినది ఆ భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధ, చక్కటి అవయవ సౌష్టవంతో ఆయన దేహాన్ని మనకు సంప్రాప్తింప జేసినందుకు ఆయనకు వెల్లండిం చాల్సింది మన ‪‎కృతజ్ఞత‬మాత్రమే. ఏ ఒక్కరి ఆలోచనల ప్రకారం ఆయన ‪‎నామధేయం‬ ఏదయినప్పటికీ, ఆయన భావ‪ ‎స్వరూపాలు‬ ఏవైనప్పటి కీ వాస్తవానికి ఆయన ఒక్కడే. మన ఆలోచనలు మాత్రమే వేరు. మన దృక్పథాలు మాత్రమే వేరు. మన దృష్టి వేరు. ఉన్న వ్యత్యాసమంతా మనలోనే ఉంది కానీ ఆ యనలో ఎలాంటివ్యత్యా సం లేదు.
"‪సబ్‬ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు...
రాముడే దేవుడని కొలిచింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు!!
కాషాయ ధ్వజమునెత్తి
ప్రణవ గంగ గలగలలను
హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను
ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే
పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా!!
॥చరాచర॥
రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ
పసిడి మేడనీ పూరి గుడిసనీ
బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరునీ కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల
కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా!!
॥చరాచర॥

ఓటమి‬ నుండి ఓంకారమునకు 
#ఓటమి నుండి ఓంకారమునకు :

నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు.
నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు.