సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 23, 2014

రాముల‬ భజనకు రారేమయా

రాముల‬ భజనకు రారేమయా
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా,
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
వేద శాస్త్ర పురానామ్త చదివి , గోప్ప పండితులని విర్ర వీగేరయ
పెద్ద పండితులని విర్ర వీగేరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , వేదాలు, శాస్త్రాలు ఏమవునయా.. --రామ రామ--
MA ,BA లు చదివి ఇంగ్లీషు bహాష లోన, గోప్ప పండితులని విర్ర వీగేరయ ,
పెద్ద పండితులని విర్ర వీగెరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , MA, BAలు ఏమవునయా..
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా....
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ!!

పల్లవి - నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా... 
ప్రభో , నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
జయ జయ నమో రామదూతా...                         ||నమోఆంజనేయా||
                                            
చరణం :-1       రామ రామ యని రయమున పాడుచు 
రామ స్మరణము, చేసెడి వారికి
రామ లక్ష్మణుల, భారము నాదని
పేరు ప్రఖ్యాతులు, గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-2        పండ్లు ఫలంబులు పనస తొనలను
సీతా రాముల, భుజియింపగను
కన్నబిడ్డ వలె, కనికరించుచు 
కన్నుల పండుగ , గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-3        భక్తుల నెల్లను , బ్రోచే వాడా
ముక్తి సంపదల, నొసగే వాడా 
ఆంజనేయుడవు, నీవే కావా
ఓ రామ భక్తా, శ్రీ ఆంజనేయా ...                           ||నమోఆంజనేయా||

చరణం :- 4       రామ లక్ష్మణుల , నిరతము గాంచిన 
వానర మూర్తివి , నీవే కావా 
ఎల్లప్పుడు , నీ నామమె గతియని 
స్మరించి , భజించి , తరింతు దేవా ...                     ||నమోఆంజనేయా||


హంస ధ్వని రాగం  :: ఆది తాళం                                శ్రీ రాముని పాట 
పల్లవి –
శ్రీ రఘు రామ్, జయ రఘు రామ్
సీతా మనోభి రామ్ .... జయ జయ              || శ్రీ రఘు రామ్ ||

 చరణం :-1 
అన్నదమ్ములా ఆదర్శమైనా
ఆలూ మగలా అన్యోన్యమైనా 
తండ్రి మాట నూ, నిలుపుట కైనా 
ధరలో  మీరే దశరధ రామ్                      || శ్రీ రఘు రామ్ ||

చరణం :-2 
వెలయు నే ఎడ, నీ దివ్య మూర్తీ 
వెలిగే మాయెడ, ఆనంద జ్యోతీ 
వెలసి మా గృహం, శాంతి నివాసం 
సలుపవె శుభగుణ, శోభిత రామ్                || శ్రీ రఘు రామ్ ||

చరణం :-3
శ్రీ రామ చంద్రః, శ్రిత పారి జాతః 
సమస్త కళ్యాణ గుణాభి రామ 
సీతా ముఖాంబోరు హచం చరీక
నిరంతర మంగళ మాత నోతూ                   || శ్రీ రఘు రామ్ ||

శ్రీ రామ జయ రామ పాట                             శ్రీ రాముని పాట
పల్లవి :–
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 
ఓ రామ ఓ రామ ఓం కార రామ                      || శ్రీ రామ ||

చరణం :-1 
చారు సుందర రామ జానకి రామ 
పాలించరా తండ్రి పావన రామ                            || శ్రీ రామ ||

చరణం :-2
కోరితి రా నిన్నే కోదండ రామ 
దయ చూడరా మమ్ము దశరధ రామ                      || శ్రీ రామ ||

చరణం :-3
కరుణించు మమ్మేలు కళ్యాణ రామ 
అడిగితి రా నిన్నే అయోధ్య రామ                               | శ్రీ రామ ||

మధ్య మావతి రాగం :: ఆది తాళం                           శ్రీ రాముని పాట 

పల్లవి –
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ       

 చరణం :-1 
చూచు వారలకు, చూడ ముచ్చట ట
పుణ్య పురుషులకు ధన్య భాగ్య మట
భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట.. ఆ.. ఆ.. ఆ.. .. ఆ

భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట
సురులును మునులును , చూడ వచ్చి రట || కళ్యాణము ||

చరణం :-2 
దుర్జన కోటి ని , దర్ప మడంచగ 
సజ్జన కోటి ని , సంర క్షిం పగ 
ధారుణి శాంతిని , స్థాపన చేయగా .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ

 ధారుణి శాంతిని , స్థాపన చేయగ
నరుడై పుట్టిన , పురుషోత్తముని                      || కళ్యాణము ||

చరణం :-3
దశరధ రాజు , సుతుడై వెలసి 
కౌశిక యాగము , రక్షణ జేసి 
జనకుని సభలో , హరు విల్లు విరచి .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

జనకుని సభలో , హరు విల్లు విరచి
జానకి మనసును గెలచిన రాముని                        || కళ్యాణము ||

చరణం :-4
సిరి కళ్యాణపు , బొట్టును బెట్టి                     
మణి బాసికమును , నుదుటను కట్టి 
పారాణి ని పాదాలకు బెట్టి  .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

పారాణి ని పాదాలకు బెట్టి  
పెండ్లి కూతురై వెలసిన సీతా                                            || కళ్యాణము ||



చరణం :-5 
సంపగ నూనె, కురులకు దువ్వి 
సొంపుగ కస్తూరి నామము దీర్చి 
చంప జవాజి చుక్కను బెట్టి  .. ఆ.. ఆ.. ఆ.. ..ఆ

చంప జవాజి చుక్కను బెట్టి  
పెండ్లీ కొడుకై  వెలసిన రాముని                             || కళ్యాణము ||

చరణం :-5 
జానకి దోసిట , కెంపుల ప్రోవై 
రాముని దోసిట , నీలపు రాలై
ఆణి ముత్యములు , తలంబ్రాలుగా .. ఆ.. ఆ.. ఆ.. .. ఆ 

ఆణి ముత్యములు , తలంబ్రాలుగా 
శిరమున మెరసిన , సీతా రాముల                                   || కళ్యాణము ||

 ------------------- రాగం  :: ఆది తాళం                             శ్రీరాముని పాట 

పల్లవి –
జగదభి రామా , రఘుకుల సోమా

అను పల్లవి :-  
శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....                      || జగదభి రామా || 

 చరణం :-1 
కౌశిక యాగము , కాచితి వయ్యా 
రాతిని నాతిగ చేసితి వయ్యా 
హరు విల్లు విరచి ,మురిపించి సీతను 
పరిణయ మాడిన , కళ్యాణ రామా 

శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. ప వయా ....                      || జగదభి రామా || 

చరణం :-2 
ఒకటే బాణం , ఒకటే మాట 
ఒకటే సతి యని , చాటితి వయ్యా 
కు జనుల నణచి , సు జనుల బ్రోచిన 
ఆదర్శ మూర్తివి , నీ వే నయ్యా 

జయ జయ రామ్ , జానకి రామ్
పావన నామా , మేఘ శ్యామా ....               || జగదభి రామా || 


శ్రీ రాముని పాట
  1. పల్లవి :–
భజ మన రాం, భజ మన రాం 
పాండు రంగ, శ్రీ రంగ భజ మన రాం                      || భజ మన రాం ||

చరణం :-1 
భజ మన రాఘవ, భజ మన యాదవ
భజ మన కేశవ, భజ మన రాం 
|| భజ మన రాం ||

చరణం :-2 
భజ మన రఘువర, భజ మన యదువర
భజ మన మురహర, భజ మన రాం
|| భజ మన రాం ||

చరణం :-3
భజ మన ఆనంద, భజ మన గోవింద 
భజ మన ముకుంద, భజ మన రాం  
|| భజ మన రాం ||

------------------ రాగం  :: ఆది తాళం                        శ్రీ రాముని పాట 

పల్లవి –
అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం 

అను పల్లవి :--  
అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ -- 
// అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ //
  || రామ రామ రామ సీతా ||  రామ రామ రామ సీతా ||

 చరణం :-1 
సోమ సూర్యులును, సురలును తారలు
ఆ మహాంబుధులు, అవవి జగంబులు      
|| రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||  

అ౦డా౦ డ౦బులు, పిండాం డంబులు
బ్రహ్మండంబులు, బ్రహ్మలు మొదలుగ                 ||  అంతా రామ మయం ||

చరణం :-2 
నదులు వనంబులు, నానా మృగములు 
వివిధ కర్మములు, వేద శాస్త్రములు        

 || రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా ||  

అష్ట దిక్కులును, ఆది శేషుడును 
అష్ట వసువులు, అరిషడ్ వర్గము                     ||  అంతా రామ మయం ||

చరణం :-3
ధీరుడు భద్రాచల రామ దాసు నీ 
కోరికlll లొసగెడి తారక నామము                    ||  అంతా రామ మయం ||




No comments:

Post a Comment