బ్రహ్మం సృష్టీ..

జీవకోటికి ఆనందమే ధ్యేయం. మూలస్వరూపం. అదే బ్రహ్మం. ఆత్మస్వరూపం. ఆనందం నుండే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది. ఆనందం చేతనే జీవిస్తుంది. ఆనందంలోనే లయమవుతుందని చెప్పడమే తైత్తిరీయ ఉపనిషత్తు సారం.
మనకు ఏదైనా చెడు జరిగితేనో లేదా దక్కవలసినది దక్కకపోతేనో ‘‘ఏం చేస్తాం నా కర్మ’’ అని సరిపెట్టుకుంటాం. ఇంతకూ కర్మ అంటే ఏమిటి? కర్మ అనే సంస్కృతపదం ‘కృ’ అనే ధాతువు నుంచి పుట్టింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ చేసినది అని అర్థం. పూర్తయిన పనిని కర్మ అని, పూర్తి కాకుండా ఇంకా జరుగుతుంటే దానిని ‘క్రియ’ అనీ అంటాం. కర్మ మంచి పని కావచ్చు, చెడ్డపని కావచ్చు లేదా మంచిచెడుల మిశ్రమం కావచ్చు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కర్మకు, జన్మకు అవినాభావ సంబంధం ఉంది.
ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది.‘ఈ ప్రపంచంలో ప్రతి జీవీ జన్మించడానికి కారణం, ఆ జీవి అంతకు మునుపు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకు ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవీ జన్మనితీసుకుంటుంది’.
ఉదాహరణకు ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతోమందిని హత్య చేసి ఉండవచ్చు లేదా ఎందరి మరణానికికో కారణం అయి ఉండవచ్చు లేదా ఆలయాలు కట్టించి ఉండవచ్చు. ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు.ఈ రెండు కర్మల ఫలితాలను అనుభవించడానికి సరిపడే కాలం లేదా ఆయుష్షు అతనికి ఈ జీవితంలో మిగలలేదు. దాంతో అతను అనుసరించిన ఈ కర్మలను అనుభవించడానికి తప్పకుండా మరో జన్మ పొందాల్సి ఉందనేది సత్యం. మంచి, చెడు కర్మల ఫలితాలను అనుభవించేది వాటిని చేసేవాడే కనుక, దుష్టకర్మలు చే సేవాడు తనకు తనే శత్రువు, సుకర్మలు చేసేవాడు తనకి తనే మిత్రుడు.
ఇతర మతాల్లో కర్మ సిద్ధాంతం_ప్రతిమనిషీ చేసిన పనులు అతని మెడకి కట్టబడి ఉంటాయని ఇంచుమించు అన్ని మతాలూ అంగీకరిస్తున్నాయి. #కర్మ గురించి భారతంలో వ్యాసుడు ఏం చెప్పాడో, బైబిల్‌లో జీసస్ సరిగ్గా అదే చెప్పడం విశేషం. ఉదాహరణకి రైతు పొలంలో నాటిన విత్తనాలను అనుసరించి ఫలం లభిస్తుంది. అలాగే మనిషి పుణ్యం, పాపం అనే ఏ కర్మని చేస్తే దాన్ని అనుసరించే ఫలం లభిస్తుందని మనం చేసే ప్రతి పనీ మనల్ని వెనక్కి వచ్చి తాకుతుందని బైబిల్‌లో, ఖురాన్‌లో అనేక సందర్భాల్లో చెప్పబడింది.
నువ్వు చేసే మంచిపనికి పదింతలుగా లాభం లభిస్తుంది. చెడ్డ పనులకి చెడ్డతనంతోనే బదులు ఇవ్వబడుతుంది. -ఖురాన్ సూరా (6:160)నువ్వు ఏం నాటితే తిరిగి అదే కోసుకుంటావు. పాపపు స్వభావాన్ని నాటితే ఆ స్వభావం నుంచే వినాశనం వచ్చిపడుతుంది. ఆత్మనిసంతోషపెట్టే విత్తనం నాటితే ఆ ఆత్మ నుంచి శాశ్వత జీవితం లభిస్తుంది. (గలతి 6:78)
బౌద్ధమతంలో తృష్ణయే కర్మకి కారణం అని, కోరికని, వ్యామోహాన్ని తొలగించేవి సుకర్మలని, దుఃఖఫలితాలని ఇచ్చేవి దుష్కర్మలని బుద్ధుడు చెబితే, కర్మ ద్రవ్యరూపంలో ఉంటుందన్నది జైనమత సిద్ధాంతం.
బౌద్ధమతంలో తృష్ణయే కర్మకి కారణం అని, కోరికని, వ్యామోహాన్ని తొలగించేవి సుకర్మలని, దుఃఖఫలితాలని ఇచ్చేవి దుష్కర్మలని బుద్ధుడు చెబితే, కర్మ ద్రవ్యరూపంలో ఉంటుందన్నది జైనమత సిద్ధాంతం.
మానవులకి సుఖదుఃఖాలని కలిగించే కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మ లని మూడు రకాలు.సంచిత కర్మ_ఒక జీవి అనేక జన్మల్లో చేసిన కర్మలన్నీ పోగయిన నిధిని సంచిత కర్మ అంటారు. సంచిత కర్మంటే అంబుల పొదిలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న బాణంలాంటిది.
ఆగామి కర్మ_వర్తమానకాలంలో మన జీవనయానంలో తప్పనిసరిగా చేయవలసిన కర్మలన్నమాట. అంటే ఈ జన్మలో చేసే కొత్త కర్మలన్నింటినీ ఆగామి కర్మలంటారు.
ఆగామి కర్మ_వర్తమానకాలంలో మన జీవనయానంలో తప్పనిసరిగా చేయవలసిన కర్మలన్నమాట. అంటే ఈ జన్మలో చేసే కొత్త కర్మలన్నింటినీ ఆగామి కర్మలంటారు.
ప్రారబ్ధ కర్మ_పరిపక్వానికి అంటే ఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలోని కర్మలని ఆగామి కర్మలంటారు. దీనిని వింటి నుంచి వదిలిన బాణంతో సమానంగా యోగశాస్త్రం చెప్పింది. ఉదాహరణకి పోలీసులకి చిక్కి, శిక్ష అనుభవిస్తున్న నేరం చేసిన దొంగ.
మనం చేసే కర్మ చెడుదా? మంచిదా? అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది.
మనం చేసే కర్మ చెడుదా? మంచిదా? అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది.
ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే అది తెలియజేయకుండా పాఠం.
No comments:
Post a Comment