భావయామి పవమాన నందనం

============================
అశ్వర్ధామా బలీర్వ్యాసో
హనుమశ్చ విభీషణం
కృపఃపరుశురామశ్చ
సపె్తైతే చిరంజీవినః
చిరంజీవులుగా పై ఏడుగురిని మనం చెప్పుకొంటాము. వీరిలో ప్రసిద్ధులైన రామభక్తులు ఆంజనేయస్వామి, ఆంజనేయులు రామబంటు. విభీషణుడు కూడా రామ‘బంటు’లాంటి వాడే! ఇద్దరు కిష్కిందలోనే స్వామివారికి సన్నిహితులైనారు. ఆంజనేయులవారు తన స్వామి సుగ్రీవుని కొరకు స్వామి అండన చేరితే విభీషణుడు అన్నగారికి మంచి చెప్పబోయి విఫలుడై స్వామి పంచన చేరాడు.ఆంజనేయుల భక్తి ప్రపత్తుల విషయంలో అందరిదీ ఒకే మాట, ఒకే భావన..
No comments:
Post a Comment