సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 19, 2014

‪వందే‬ శివం శంకరమ్..

Ramudu Thota Venkataramana's photo.
వందే‬ శివం శంకరమ్..
Ramudu Thota Venkataramana's photo.
''వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!
''మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"‪‎శివ‬'' పదాన్ని ద్వివచనముగా చేసి, ‪‎ద్వంద్వ‬ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, ‪‎పరమేశ్వరులని‬ అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర ‪‎సంజనితమే‬. అందుకే వారిరువురు ఈ జగత్తుకు ‪‎తల్లిదండ్రులైనారు‬. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.
"శివం‬'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు ‪‎మంగళప్రదాత‬. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే
"‪‎సర్వమంగళమాంగల్యే‬ శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''!!
అని కీర్తిస్తాం. "‪‎వందేశివం‬'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు."శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "జడుడు‬'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే సర్వం‬ వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే‬;;. ఆయన కదలడు. ఈ ‪‎సృష్టినంతటినీ‬ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం సృష్టి‬. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే ‪‎లయ‬. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం‬''

No comments:

Post a Comment