సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 16, 2014

పంచముఖ‬ ఆంజనేయస్వామి



పంచముఖ‬ ఆంజనేయస్వామి..
శ్రీవిష్ణుమూర్తి‬ అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు.
ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి‬ బొమ్మను ఉంచాలంటే..?
తూర్పుముఖముగా హనుమంతుడు-పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర‬ నరసింహ స్వామి- శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, ‪‎జయాన్ని‬, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ‬ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం‬" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

No comments:

Post a Comment