సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 16, 2014

‪‎అంజని‬ పుత్రుడు

‪‎అంజని‬ పుత్రుడు
‪‎అంజని‬ పుత్రుడు..
‪‎శ్లో‬:అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాశ్చ విభీషణ|
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః||
పై శ్లోకంలో ఏడుగురుని చిరంజీవులుగా పేర్కొన్నారు. వారిలో హనుమ ఒకరు. కృతయుగం నుండి కలియుగం వరకు హనుమలీలావిలాసాలు సదా స్మరణీయాలు.
శ్లో: బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోకతా|
అజాగ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భవేతే||
అను నిత్యం హనుమంతుని స్మరిస్తే ఈ శ్లోకం చెప్పినవన్ని మనకి లభిస్తాయి. ‪‎దాసత్వానికి‬, భక్తికి, వీరత్వానికి పరాకాష్ట హనుమచ్చరిత్ర. అంజనీసుతుడు కనుక ఆంజనేయుడిగా, వాయుపుత్రుడిగా మారుతిగా ఇంద్రుని వజ్రాయుధానికి హనువులు (దవడలు) సడలినందున హనుమంతునిగా ప్రసిద్ధి చెందిన హనుమకి '‪‎సుందరకపిః‬' అన్న పేరు కూడా కలదు. సుందరాకాండ గొప్పతనాన్ని తెల్పుతూ 'సుందరీ సుందరకపిః' అని వర్ణించేరు. హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా తెల్పబడీంది. ఆ గాధలని తెలుసుకొని తరిద్దాం.
రామాయణంలో‬ రావణ నాశనానికి ముగ్గురు స్త్రీలు కారకులు. వారు పుంజకస్థల, వేదవతి, సీత. వీరిలో పుంజకష్తల రావణుని చేత అవమానింపబడి తనువు చాలించి, అంజనగా జన్మిస్తుంది. ప్రభాస తీర్థమందున్న వానరులను ఏనుగులు బాధించగా,వానరవీరుడొకడు వాటిని సంహరించి, వానరులను కాపాడుతాడు. ‪‎సింహం‬ వలే ఏనుగుల పోరాడినందున అతనికి 'కేసరి ' అని పేరు పెడతారు అక్కడి ఋషులు. ఆ కేసరిని వివాహమాడుతుంది అంజన. రావణసంహార కార్యక్రమంలో కేశవునికి సహాయపడదలచిన శివుడు 'తన తేజస్సుని వాయువు ద్వారా అంజన గర్భంలో ప్రవేశపెడతాడు '. ఆ ‪‎శివతేజమే‬ హనుమగా అవతరిస్తాడు. శివస్వరూపమే హనుమ కనుక ఎన్నో సాహసకృత్యాలను అవలీలగా నిర్వహిస్తాడు. పుంజకస్థల అంజనగా జన్మించి, శివుని ప్రార్థించి, పుత్రునిగా‬ వడసి రావణ సంహారానికి కారణమౌతుంది.
రావణసుగ్రీవ‬ మైత్రి, సీతాన్వేషణ, లంకాదహనం, రాక్షససమ్హారం, సేతుబంధనం, రామలక్ష్మణుల రక్షణ వంటి అనేక ముఖ్య కార్యాలలో పాల్గొని తన రామభక్తిని నిరూపించుకొంటాడు హనుమ. సీత అనే జీవాత్మని, రాముడినే పరమాత్మతో కలిపిన ధన్యాజీవి హనుమ. కనుకనే 'రామాయణ‬ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపబడతాడు. ఇచ్చట వాల్మీకి ప్రతిభను పరిశిలిద్దాం. 'రామాయణ మహామాలకి రత్నంవంటివాడు హనుమ ' అని కదా అన్నారు! రత్నం మాల మధ్యలో ఉండి ప్రకాశిస్తుంది కదా! 'ఉత్తరకాండ కలిపితే రామాయణం ఏడుకొండలు. హనుమ కిష్కింధకాండలో తొలిసారిగా అగుపడుతాడు. 3కిష్కింధ నాల్గవకాండ. దీనికి ముందు బాల, అయోధ్య, అరణ్యకాండలు. తర్వాత సుందర, యుద్ధ, ఉత్తరకాండలున్నాయి. కిష్కింధ మధ్యలో ఉన్నందున హనుమ రామాయణ మహామాలలో రత్నం వంటివాడు అనడం అద్భుతంగా‬ గోచరిస్తుంది. వాల్మీకి రచనా చమత్కారానికి ఇదొక మచ్చు తునక.
-విచిత్రరామాయణంలో ‪‎హనుమను‬ గూర్చి ఎలా వర్ణించారో తెలుసుకొందాం. 'అహల్య గౌతముల పుత్రిక అంజన '. అహల్యకి ఇంద్ర, సూర్యుల వలన ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. గౌతముడు వారిని కూడా తన ‪‎పుత్రులుగానే‬ భావించి పెంచుతుంటాడు. ఈ రహస్యం తెలిసిన అంజన తండ్రికి తెల్పుతుంది. అప్పుడు గౌతముడు "వారు నా పుత్రులు కానిచో వానరముఖులగుదురు గాక ' అని శపించి సముద్రమున పడవేయును. ఆ పుత్రులు వానరముఖాలతో బయటకు వస్తారు. వారే వాలిసుగ్రీవలు. తన గుట్టు రట్టు చేసిన అంజనను అహల్య "నీకు అంధత్వము ప్రాప్తించి, వానరపుత్రునిగా‬ జన్మించుగాక " అని శపించి అడవులకు పంపివేయును. ఆ అంజనా సుతుడే ఆంజనేయుడు. ఈ కథ కల్పితమని పెద్దల అభిప్రాయము.
‪#‎ఉత్తరరామాయణమున‬ వాలిసుగ్రీవిల కథ వేరుగానున్నది. "ఋక్షవిరజుడు అను వానరుడు పార్వతి వలన శపమము పొంది ఒక కొలనులో స్నానమాచరించి స్త్రీ‬ రూపము పొందును. ఆ సమయములో ఆమెను వరించిన ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు జన్మింతురు. స్త్రీ రూపము పోయిన పిదప ఋక్షవిరజుడు ఆ పుత్రులను తీసుకొని కిష్కింధకు పోవును. ఈ కథలో ‪‎అంజనాదేవి‬ ప్రసక్తి లేదు. వేరొక రామాయణమున రావణ సంహారమునకు కేశవునకు, శివునికి కూడా సహాయపడమని దేవతలు వేడుకొనగా శివుడు తన తేజమును వాయువునందింపగా వాయువే కేసరి రూపము దాల్చి అంజనను వివాహమాడి శివ తేజమును ఆమె గర్భమందుంచెను‬. అతదే అతులిత బలధాముడు,‪‎ఆంజనేయుడు‬.
అన్నింటికి మూలమైన రామాయణమునందు రావణసభలో‬ హనుమ తాను వాయుపుత్రుడనని తెల్పును. 'అహంతీ‬ హనుమన్నామ మారుతస్య ఔరసపుత్రః' నేను వాయుదేవుని ఔరసపుత్రుడను అని ప్రకటిస్తాడు. ఔరసపుత్రుడనగా నిజభార్యయందు కలిగిన కుమారుడు అని అర్థము. అట్లే ‪‎పుంజకస్థల‬ కథ రామాయణమునందిట్లు తెల్పబడినది. రావణునితో మంత్రి అయిన మహాపార్శ్వుడు సీతను బలవంతముగా ఆనుభవించమని చెపుతాడు. అపుడు రావణుడు పూర్వం తాను పుంజకస్థల అనే అప్సరసను బలవంతముగా అనుభవించగా బ్రహందేవుడు‬ కోపించి "ఇకపై బలవంతముగా ఏ స్త్రీనైనా అనుభవించదలంచినచో నీ శిరస్సు వేయిముక్కలు కాగలదని శపించెనని తెల్పును". "‪‎పితామహస్య‬ భవనంగచ్చంతీ పుంజకస్థలా" అని ప్రారంభించి "అద్యపృచ్చతి యామాన్యా బలవన్నా రీగమిష్యసీ, తదాదే శతధా మూర్ఖా ఫలిష్యతి నసంశయః" అని వివరిస్తాడు. ఈ కథ సరి అయినదని పెద్దల అభిప్రాయాము. రామాయణమున, పరాశరసమ్హితనందు చెప్పిన హనుమగాధలు అత్యద్భుతములు. శివకేశవులకు భేదము లేనందున వారిరువురు హనుమంతునిగా, రామునిగా‬ జన్మించి దైవకార్యము నిర్వర్తించిరి.
"తతో‬ హనుమానేకం స్వపాదం కృత్వోదయాచలే
అస్తాద్రావేక పాదంచ తిష్టన్నభి ముఖోరవే"
చిన్నతనమున హనుమ సూర్యుని‬ పండుగా భావించి మ్రింగబోవుట, ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగము, వాయుదేవుడు కోపించుట, బ్రహ్మాది దేవతలు మారుతికి వరములొసగి మహాబలవంతుని చేయుట, ‪‎ఉదయాద్రిని‬ ఒకకాలు, హస్తాద్రిని మరియొక పాదం ఉంచి సూర్యగమనానికి అంతరాయం లేకుండా సూర్యుని ద్వారా విద్యనభ్యసించుట.
‪‎సాంగోపనిషదోవేదాని‬ అవాప కపిపుంగవః" అని వివరింపబడింది. ఇవి బాలహనుమ సాహసకృత్యాలు. హనుమ సృఇరామభక్తి అమోఘం, నాన్యతోదర్శనీయం. కోటానుకోట్ల వానరులలో కేవలం హనుమ ఒక్కడే కార్యసాధకుడని నమ్మినాము. అంగుళీయకమునిచ్చుట, సముద్రలంఘనం, మైనాకపర్వతసాంత్వనం, సురసను జయించడం, సిం హికను సం హరించడం అనే నాల్గు దుష్కర కర్మలను అవలీలగా నిర్వహించిన హనుమ "గోష్పదీకృతవారాణాం మీశకీకృతరాక్షశాం" శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని గోవుపాదమంతగా భావించి దాటడం, అతి బలవంతులైన రాక్షసులను దోమలుగా భావించి నాశనం చేయడం" వంటి కృత్యాలు నిర్వహించిన హనుమ, జానకీ శోకవినాశనకారుడూ, రామగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించిన పవిత్రుడు, సదా పూజనీయుడు, #భవిష్యబ్రహ్మ అనుటలో సందేహము లేదు. హనుమ #శివస్వరూపుడు గాన ఆయనను సమ్రిస్తే భూతప్రేతాది బాధలు నివారింపబడతాయి. ఎందుకనగా శివుడు భూతనాధుడు కదా!
పరాశరసమ్హితలో సూర్యపుత్రి సువర్చలను వివాహమాడినట్లు తెల్పబడింది. శివుడు హనుమగా అవతరిస్తే, పార్వతి వాలాన్ని ఆవహించినట్లు అద్భుతరామాయణంలో తెల్పబడింది. అందుకనే ఆ తోకకి అంత బలం. #సీతారాములను హృదయమునందే నిలుపుకొన్న హనుమ ద్వాపరయుగంలో భీమార్జునుల గర్వభంగం చేసినట్లు, శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో గరుడ, సుదర్శన, సత్యల గర్వమణిచినట్లు, అర్జునుని రథ టెక్కము (జెండా)పై కొలువుండి రథాన్ని, అర్జునుని కాపాడినట్లు, గంధమాదనం పర్వతంపై ఇప్పటికీ చిరంజీవియై విరాజిల్లుతున్నట్లు అనేక జానపద గాధలు తెల్పుచున్నవి. #రామానుగ్రహపాత్రుడైన హనుమచరిత్ర నిత్యస్మరణీయం, #ముక్తిదాయకం. పఠించి తరింతురు గాక. స్వస్తి!

No comments:

Post a Comment