సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 17, 2014

శ్రీరామ‬ భక్తుడు శ్రీఅంజనేయుడు

‪‪శ్రీరామ‬ జయరామ జయజయరామ!
శ్రీరామ శరణం మమ. శుభం భూయాత్!!
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ !!శ్రీరామ‬ భక్తుడు శ్రీఅంజనేయుడు....
#శ్రీరామ
 జయ హనుమాన్
శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]

కపి శ్రేష్టాయ శూరాయ – సుగ్రీవ ప్రియమంత్రిణే
 జానకీశోక నాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

మనోవేగాయ ఉగ్రాయ – కాలనేమి విదారణే
 లక్ష్మణ ప్రాణదాతాయ – ఆంజనేయాయ మంగళమ్||

మహాబలాయ శాంతాయ – దుర్దండీ బంధమోచనే
 మైరావణ వినాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

పర్వతాయుధ హస్తాయ – రక్షఃకుల వినాశినే
 శ్రీరామ పాద భక్తాయ – ఆంజనేయాయ మంగళమ్||

దీర్ఘ వాలాయ వాలాయ – లంకాపుర విదారణే
 లంకిణీ దర్పనాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

నమస్తే బ్రహ్మచర్యాయ – నమస్తే వాయుసూనవే
 నమస్తే గానలోలాయ – ఆంజనేయాయ మంగళమ్||

ప్రభావాయ సురేశాయ – శుభదాయ శుభాత్మనే
 వాయుపుత్రాయ ధీరాయ – ఆంజనేయాయ మంగళమ్||

—- మంగళమ్ —-ఏ అవతారమయినా లోకరక్షణార్ధమే....
ఏలోకంలోనైనా భక్తి తత్వం విశిష్టమైనది. అది లేకుండా ఎవ్వరూ పునీతులుకారు. ఈ భక్తితత్వం అలవాటుగా వచ్చేది కూడా కాదు. పురాకృత పుణ్యవిశేషం వల్ల, మహనీయుల సందర్శనం వల్ల, సత్సాంగత్యం వల్ల భక్తి తత్వం పరిపుష్టమవుతుంది. మనోవాక్కాయ కర్మల్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే అదే సత్యమవుతుంది. ఆ సత్యస్వరూపమే భగవంతుడు. భగవంతుని దర్శించడానికి భక్తితత్వమే ప్రాతిపదిక. స్థిరమైన భక్తికున్న శక్తి భగవత్శక్తిని మించినదనడంలో అతిశయోక్తి లేదు. మోహం నశిస్తేనే గానీ, భక్తి అబ్బదు.
లోకంలో జన్మించిన మహనీయులెందరో నిశ్చల భక్తితో భగవన్నామ స్మరణయందే తమ సంపూర్ణ కాలము వెచ్చించి, మహామహితాత్ములై ప్రసిద్ధి చెందారు. అట్టివారిలో మొట్టమొదట చెప్పుకోదగినవారు, రామభక్తి సామ్రాజ్యంలో నిరంతరం శ్రీరామనామోచ్ఛారణతో ఆయన పాదాల వద్ద తన జీవిత సర్వస్వం పునీతం చేసుకున్నవాడు శ్రీఆంజనేయస్వామి వారు.

జయ హనుమాన్
శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]
కపి శ్రేష్టాయ శూరాయ – సుగ్రీవ ప్రియమంత్రిణే
జానకీశోక నాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
మనోవేగాయ ఉగ్రాయ – కాలనేమి విదారణే
లక్ష్మణ ప్రాణదాతాయ – ఆంజనేయాయ మంగళమ్||
మహాబలాయ శాంతాయ – దుర్దండీ బంధమోచనే
మైరావణ వినాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
పర్వతాయుధ హస్తాయ – రక్షఃకుల వినాశినే
శ్రీరామ పాద భక్తాయ – ఆంజనేయాయ మంగళమ్||
దీర్ఘ వాలాయ వాలాయ – లంకాపుర విదారణే
లంకిణీ దర్పనాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
నమస్తే బ్రహ్మచర్యాయ – నమస్తే వాయుసూనవే
నమస్తే గానలోలాయ – ఆంజనేయాయ మంగళమ్||
ప్రభావాయ సురేశాయ – శుభదాయ శుభాత్మనే
వాయుపుత్రాయ ధీరాయ – ఆంజనేయాయ మంగళమ్||
—- మంగళమ్ —-

రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!
రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా
ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా
వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!

‪యత్ర‬ యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"
#యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
 భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"

‪‎శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦

‪‎ఓ౦శ్రీసాయీశ్వరాయ‬ నమో నమ
''శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.
అణువు కన్నా అతి సూక్ష్మము, తానే ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దడo
#ఓ౦శ్రీసాయీశ్వరాయ నమో నమ
''శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.

అణువు కన్నా అతి సూక్ష్మము, తానే  ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దడo.''

‪‎శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
ధ్యాన౦: - శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦ జ్ఞానమూర్తి౦
ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦ 
ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
’'ఆశీర్వది౦చవయ్యా! సాయి మమ్మాశీర్వది౦చవయ్యా ! 
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా!!
"ప్రాప౦చిక వ్యవహారాల్లో గానీ, ఆధ్యాత్మిక విషయాల్లో గానీ సఫల౦ కావాల౦టే శ్రద్ధ, ఏకాగ్రత, వా౦చారాహిత్య౦, అహ౦కార రాహిత్య౦ మొదలైన లక్షణాలను మన౦ పె౦పొ౦ది౦చుకోవాలి." 
.............................సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు...................................

‪‎శ్రీహనుమంతుని‬ ప్రదక్షిణాలు

Ramudu Thota Venkataramana's photo.
‪‎శ్రీహనుమంతుని‬ ప్రదక్షిణాలు
శ్రీరస్తు
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ న మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కొనాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్ట కి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొంద న వారెంద రో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చతువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం,
శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కల్గినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వార తోలగునట్లు చేయాలి. హనుమత్పు దక్షిణ ధ్యానం శీలాఫలకం పై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల్పాలి.
‪అభి‬ షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త భిషేకంచే పర మానంద భరితుదౌతాడు. కోరికలి తీ రుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెల్పి ప్రతి పర్వది నానా దాతల ద్వారా అభిషేకం జారి పింపజేయాలి.
‪‎మంగళ‬ వార సేవ
మంగళ వారంనాడు హనుమంతునకు శరీరం పై సింధూరం పుయుట చాల ఇష్టం. అంతా కుదుర నివారు మూతిక యినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన
విశేషగాధ ఉంది. (చూ. హనుమద్విషయ సర్వస్వం)
‪‎శనివార‬ సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్ట మైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కల్గించాలి.
‪‎పంచ‬ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, న మస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతి కరం.
‪‎హనుమజ్జ‬ మంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగో ళాది సకల ప్రమాణాలతో యో, కల్పంతర గాధల బట్టి ఎవరో చేప్పార నియో భిన్న భిన్న తిథులలో హనుమజ్జ మంతి కొందరు జరుపుచున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీ నిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చన లు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారే డుద ళం, సింధూరం మల్లె పూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వానితో జరిపించాలి. విభో గంగా జరపాలి.

రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్

.......రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్......
‪హనుమాన్‬ ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
“‪స్వామి‬ లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు. అప్పుడు రాముడు “నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

హనుమంతుని ప్రార్థన

హనుమంతుని ప్రార్థన
ప్రార్థన
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.

గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా
రత్నం వందే నిలాత్మజమ్.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్.
హనుమాన్ చాలీసా
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర | |

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా | |
మహవీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతికే సంగీ | |

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా | |
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై |
కాంధే మూంజ జనేవూసాజై | |

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన | |
విద్యావాన గుణీ అతి చాతుర |
రామకాజ కరివేకో ఆతుర | |

ప్రభు చరిత్ర సునివేకో రసియా |
రామ లఖన సీతా మన బసియా | |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా |
వికట రూప ధరి లంక జరావా | |

భీమ రూప ధరి అసుర సంహారే |
రామచంద్రకే కాజ సఁవారే | |
లాయ సజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే | |

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ | |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మది మునీశా |
నారదా శారద సహిత అహీశా | |
యమ కుబేరా దిగపాల జహాఁతే |
కవి కోవిద కహి సకే కహాఁతే | |

తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా | |
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా | |

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో త్యాహి మధుర ఫల జానూ | |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ | |

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | |
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే | |

సబ సుఖులహై తుమ్హారీ శరనా |
తుమ రక్షక కాహూకో డరనా | |
ఆపన తేజ సమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంకతే కాంపై | |

భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై | |
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా | |

సంకట తేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై | |
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా | |

ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై | |
చారోఁ యుగ పరతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా | |

సాధు సంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే | |
అష్టసిద్ది నౌనిధి కే దాతా |
అస వర దీనహి జానకీ మాతా | |

రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతికే దాసా | |
తుమ్హారే భజన రామకోపావై |
జన్మ జన్మకే దుఃఖ బిసరావై | |

అంతకాల రఘువరపుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ | |
ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | |

సంకట హటై మిటై సబ పీరా |
జోసుమిరై హనుమత బలవీరా | |
జైజైజై హనుమాన్ గోసాయీఁ |
కృపాకరో గురుదేవకీ నాయీ | |

యహ శతవార పాఠకర్ కోయీ |
ఛూటహిబంది మహా సుఖహోయీ | |
జో యహ పడై హనుమాన్ చాలీసా|
హోయ సిద్ది సాఖీ గౌరీసా||

తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా||
దోహ: పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము
హనుమాన్‌జీకీ హారతి
ఆరతికీజై హనుమాన్ లలాకీ
దుష్టదలన రఘునాధ కలాకీ

జాకే బలసే గిరివర కాంపై
రోగదోష జాకే నికట నఝూంపై
అంజని పుత్ర మహాబలదాయీఁ
సంతనకే ప్రభు సదా సహాయీ

దేబీరా రఘునాధ పఠాయే
లంకా జారి సీయ సుధిలాయే
లంకా సోకోట్ సముద్రసీ ఖాయీ
జాత పవనసుత బారన లాయీ

లంకా జారీ అసుర సంహారే
సియా రామజీకే కాజ సవారే
లక్ష్మణ మూర్చిత పడే సకారె
ఆని సజీవన ప్రాణ ఉబారే

పైఠిపతాల తోరి జమ కారే
అహిరావనకీ భుజా ఉఖారే
బాయే భుజా అసుర దల మారే
దహినే భుజా సంతజన తారే

సుర నర ముని సంతజన ఉతారే
జైజైజై హనుమాన ఉచారే
కంచన ధార కపూర లౌ ఛాయీ
ఆరతి కరత అంజనా మాయీ

జోహనుమాన(జీ)కి ఆరతి గావై
బసి వైకుంఠ పరమపద పావై
హనుమంతుని గుణగానము
రామపుజారి పర ఉపకారి - మహావీర బజరంగబలీ
సద్దర్మచారి సద్బ్రహ్మచారి - మహావీర బజరంగబలీ
జ్ఞాన గుణసాగర రూప ఉజాగర - మహావీర బజరంగబలీ
శంకరసువన సంకటమోచన - మహావీర బజరంగబలీ
కేసరినందన కలిమల భంజన - మహావీర బజరంగబలీ
రాఘవదూత జయహనుమంత - మహావీర బజరంగబలీ
అంజనినందన అసురనికందన - మహావీర బజరంగబలీ
మంగళమూరతి మారుతినందన - మహావీర బజరంగబలీ
జయ రణధీర జయ రణరోర - మహావీర బజరంగబలీ
జయ బలభీమ జయ బలధామ - మహావీర బజరంగబలీ!!

Thursday, October 16, 2014

ఆంజనేయ‬ స్వామికి...సిందూర వర్ణం

‎ఆంజనేయ‬ స్వామికి...సిందూర వర్ణంRamudu Thota Venkataramana's photo.
దెైవానికి మనలాగ కొన్ని రంగులంటే ఇష్టమనీ, మరికొన్ని రంగులంటే అయిష్టమనీ ఉండదు.
అయితే దెైవాన్ని ఉపాసన చేసిన ఋషులు ‪‎దేవుని‬ యొక్క నిజరూపాన్ని దర్శించి, ఆయన ఏయే వర్ణాలతో ఉన్నాడో తెలి పారు. పసుపురంగు విష్ణువుకు సంకేతం. అందువల్లనే ఆయనను ‘పీతాంబరుడు’ అన్నారు.ఎరుపు రంగు శంకరునికి సంకేతం. అందుకే ఆయనను ‘నీలగ్రీవో విలోహిత’ అన్నారు. నీలిరంగుమెడా, ఎరగ్రా ఉండే రూపమే శంకరునిది.
పసుపు రంగూ చిక్కని ఎరుపురంగూ కలి స్తే మరో రంగుగా మారుతుంది. దానినే సిందూరవర్ణం అన్నారు. శివకేశవుల రంగు కలిసి సిందూరవర్ణం అన్నారు. ఈ రంగు ఆంజనేయునిది. అంటే, విష్ణువు యొక్క మేధాశక్తి, శివుని యొక్క తప్పశ్శక్తి కలిగి ఉన్నవాడు ఆంజనేయుడు. ‪గుడిలో‬ప్రతిదెైవానికీ ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా! ఆ ధ్వజస్తంభానికి కింద మరో దెైవరూపం ఉంటుంది. అది గుడిలో ఉన్న ‪‎మూలదెైవానికి‬ నమస్కరిస్తున్నట్లు ఉంటంది.విష్ణువు మూలవిరాట్టుకు ఎదురుగా ధ్వజస్తంభం కింద ఎవరున్నారో చాలా మంది పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ విష్ణు దేవునికీ, శివ దేవునికీ ఎదురుగా ఉండే ఒకే ఒక దెైవం ఆంజనేయస్వామి. విష్ణువు దృష్టిని ఎవరెైనా భరించగలరు గానీ, రుద్రుడి తీక్షణ దృష్టిని తట్టుకోగల శక్తి ఏ దేవతకూ లేదు. ఆ ‪శక్తి‬ ఒక్క ఆంజ నేయస్వామికి మాత్రమే ఉంది. ఎందుకం టే రుద్రుని అంశంతో పుట్టిన వాడు ఆంజనేయుడు కనుక.ఈ విషయాన్ని తెలుపడానికే ‪శివ‬ కేశవులిద్దరి రూపవర్ణ మిశ్రమము కలిగిన ఆంజనేయుడు అని వివరణ చెప్పబడింది. అందువల్లనే శివకేశవుల రంగులు కలిసిన సిందూర వర్ణం ఆంజనేయుడికి ఇష్టం.

‪‎ఆంజనేయస్వామి‬ జననo

‎ఆంజనేయస్వామి‬ జననo {బుద్ధి, బలం, కీర్తి ప్రదాతుడు}
ఒకసారి హనుమంతుడు శ్రీరామచంద్రునితో
''‪దేమదృష్ట్యాతు‬ దాసోహం
జీవదృష్ట్యాతు దంశకః
వస్తుతస్తు త్వమేవాహ
మితి నిశ్చయతే మతిః| '' ''రామా!'' దేహ దృష్ట్యా నేను దాసుడను. నేను ‪‎జీవరూపంలో‬ మీ అంశను. కానీ పరమార్థ దృష్టిలో చూడగా నేనూ మీరూ ఒక్కటే'' అని హనుమంతుడు‪ ‎శ్రీరామునితో‬ పలికాడు. కనుక ఆంజనేయుడు శ్రీరాము నితో సమానము.
''వైశాఖే మాసికృష్ణాయాః దశిమీ మంద సంయుతా పూర్వ ప్రోష్ఠ పదాయుక్తా అధనైదృత సంయుతా తస్యాం మధ్యాహ్నవేళాయాః జనయా మానవైసుతమ్‌' వైశాఖ మాస, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో నైదృతీనామ యోగం, గ్రహాలన్నీ శుభ స్థానాలలో సంచరిస్తున్న మధ్యాహ్న సమయంలో కేసరి ‪‎ఆంజనాదేవి‬గర్భయుక్త ఫల ఆంజనేయస్వామి జన్మించాడు. ఆ పరమ శివుడే ఆంజనాదేవి గర్భాన జన్మించాడని తెలిసి, ఆ రుద్రావతారుని చూడడానికి వెళ్లిన ‪సప్తబుుషులు‬ వానర కుమారుని చూసి ఆంజనీగర్భాన ఉదయించిన ఈ బాలుడు 'ఆంజనేయు'డని పిలువ బడుతాడని సెలవిచ్చాడు.సాక్షాత్తు ‪‎ఈశ్వరాంశ‬ సంభూతుడైన ఆంజనేయుడు త్రేతా, ద్వాపర యుగాలు గడిచి కలియుగంలో నేటికి తన లీలలు చూపుతూ చిరంజీవిగా విలసిల్లుతున్నాడు.‪‎బాలాంజనేయుడు‬ ఒకనాడు ఆకలిగా ఉన్నదని తల్లినికోరగా, ఫలముల కొరకు ఆంజనవనమున కేగిన సమయాన ఉదయించుచున్న సూర్యుని చూచి ఫలమని భ్రమించి సూర్య మండలానికి ఎగసి ‪సూర్యుని‬ గ్రహించబోగా, అది గ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో చీల్చబడిన 'హనుమ (దౌడలు) కారణంగాగా నాటి నుండి ''ఆంజనేయుడు'' ''‪‎హనుమంతుడు‬'గా ప్రసిద్ధి చెందాడు.
‪శ్రీరాముని‬ కరుణా సాగరంలో పునీతుడైనవాడు హనుమంతుడు. శ్రీరామచంద్రుని మహిమను లోకానికి చాటుటకై రామసేవకై జన్మించిన కారణ జన్ముడు. హనుమ శ్రీరామచంద్రుని సర్వోత్తమ దాసభక్తుడు. ‪‎రామనామ‬ సాధనం హను మంతుని జీవనం. హనుమంతుడు వేదాధ్యయన శీలుడు, వ్యాకరణాధ్యయన సంపన్నుడు. సంస్కార క్రమ సంప న్నుడు. శాస్త్రబద్ద వాగుచ్ఛారణుడైన హనుమ నోట వెలువడిన ‪‎వాక్కు‬ వేద వాక్కువలే కల్యాణి రూపిణిగా శ్రీరామునికి తోచింది.
''‪‎అధ‬ సంస్కార సంపన్నో, హనుమాన్‌ సచివోత్తమః ఉవాచ వచనం శ్లక్ష్ణ మర్ధవన్మధురం లఘ'' సంస్కార సంపన్నుడైన సచివోత్తముడుగా వాల్మీకి చెప్పినాడు.
శ్రీరాముని హనుమ ఒక వరమడిగాడు ''రామాయణం లోకంలోగానం చేయబడినంత కాలం నేను జీవించాలి' అని, శ్రీరాముడు అందుకు ఆంగీకరించగా
'‪యత్ర‬ యత్ర రఘనాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్‌
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతి సమతా రాక్షసాంతకమ్‌''అని హనుమతుండే స్వయంగా ‪‎రామభక్తి‬ పరాయణతను వ్యక్తం చేసాడు. తదాదిగా దేశంలో ఎక్కడ చూసినా ప్రతిచోట ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయాలు వెలసి, హనుమ ‪రణముచే‬ సకల భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాదల నుండి ఆశ్రితులను సర్వకాల సర్వావస్థల నుండి రక్షించుచున్నాడు. హనుమ స్మరణ వల్ల మానవులకు బుద్ది, బలం, యశము, ధైర్యం, నిర్భయత్వము, ‪ఆరోగ్యము‬, వివేకము, వాక్పటుత్వము గుణములు సిద్దిస్తాయి.
నవగ్రహాలలో ‪శనిగ్రహం‬ కష్టాలు కలిగించేదిగా అందరూ భావిస్తారు. అయితే రావణాసురుని చెరలో నవగ్రహాలు ఉన్నప్పుడు శనని ఆంజనేయుడు తప్పించి, రక్షించినందుకు కృతజ్ఞతా పూర్వకంగా #ఆంజనేయస్వామి భక్తుల జోలికి తాను వెళ్లనని శని మాట ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
జన్మలగ్నాత్తు శని మహార్థశ జరుగుతున్నవారు అర్థాష్టమ, మరియు అష్టమశని, ఏలినాటిశని, జాతకాల్లో ప్రతీవారికి ఏదో విధంగా ప్రవేశించినప్పుడు వచ్చే విపత్తుల బారినుండి రక్షణ పొందటానికి శనివారం నాడు ఆంజనేయుని పూజ చేస్తే ‪‎శనిదోష‬ సాంద్రత తగ్గుతుంది. అంతేకాక అంగారక దోషం వల్ల కుటుంబంలో ఏర్పడ్డ కలతలు పోయి అనుకూల దాంపత్యాన్ని‪‎శ్రీస్వామివారికి‬ పూజ, ప్రదక్షిణ చేయడం వల్ల వెంటనే ఫలితం లభిస్తుంది.
''‪‎మనోజవం‬ మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్‌|
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
‪శ్రీరామ‬ దూతం శిరసా నమామి!! 'ఆంజనేయస్వామి మనసుకున్నంత వేగం, ఇంద్రియ నిగ్రహం, శ్రేష్ఠమైన బుద్ధి ఉన్నాయని చెప్పడం మనసును గురించి చెబుతున్నట్లే అనిపిస్తుంది. మనసుకు స్థిరమైన సంకల్పాలను, ఆదర్శ జీవనం, నియమాలు తదితరములైనవి సక్రమంగా అవి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయని, అవి కొరవడితే మనసు చంచలమై పోతుందని,''‪బుద్ధిర్భలం‬ యశోధైర్యం నిర్భయత్వ మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా ద్భవేత్‌'‪ ‎ఆంజనేయుని‬ ప్రార్థిస్తే బుద్ది, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకపోవడం,‪వాక్కులో‬ స్పష్టత, రోగం లేకపోవడం మొదలైనవన్నీ వస్తాయి. మనో వాక్కాయములచే ఎవరు హనుమంతుని ధ్యానింతురో వారిని అతడు సమస్త బాదల నుండి విముక్తుల్ని చేస్తాడు.
''‪న‬ కాలస్యన శక్రస్య న విష్ణో ర్విత్త పస్యచ| కర్మాని తాని శ్రూయంతేయాని యత్తే హనుమతః'' శ్రద్దా భక్తితో ఆరా ధించిన వారికి అష్టసిద్దులతోపాటు ఆత్మోద్ధరణము జరుగును. హనుమంతుని వలె పరాక్రమ శాలియై నిష్కాముడైన వాడే ధర్మాన్ని రక్షించగలడు.

ఏకైక ఆదర్శం-#హనుమంతుడు..
''#ధర్మ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన #పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
#ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని #రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'#రామో విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది #ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ #చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.
ఏకైక ఆదర్శం-‪హనుమంతుడు‬..
''‪ధర్మ‬ ఏవ హతో హన్తి’! అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన ‪‎పరిష్కారం‬ ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.
‪ధర్మం‬ అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. #ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం #హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని‪ ‎రామసేవకుడని‬ చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘'‪రామో‬ విగ్రహవాన్ ధర్మః’అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ‪ధర్మసేవే‬. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ ‪చిరంజీవి‬ ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.





శ్రీ‬ ఆంజనేయ సుప్రభాతమ్

శ్రీ‬ ఆంజనేయ సుప్రభాతమ్
శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో!
సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో!
లోకైక వీర! పురపాల! గదాప్తపాణే!
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్
ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం
దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్!!








రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!
రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా
ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా
వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!..ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్..

‎అన్నపూర్ణ‬

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు. ‎అన్నపూర్ణ‬ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు.‪సర్వమంగళకారిణి‬, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత ‪‎అన్నపూర్ణాదేవి‬, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.
శ‌ర‌న్నవ‌రాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా ద‌ర్శన‌మిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ ‪త‌ల్లిగా‬ కుటుంబంలో మ‌హిళ‌కు ఉండే పాత్రను చాటిచెప్పే అవ‌తారం.. అన్నపూర్ణ‌.. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము…అమ్మవారు మన‌కు ఇస్తుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది. అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘‪భిక్షాం‬ దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.
సకల ప్రాణులలో చైతన్య ‪‎స్వరూపిణి‬ అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. ‪‎భూమియే‬- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును ‪‎సూర్యరశ్మి‬ ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద ‪బ్రహ్మవర్చస్సు‬ కలిగి కీర్తిమంతుడవుతాడు.
‪అన్నం‬ ఎలా పుడుతుందనే విషయాన్నికూడా ‪#‎వేదం‬ వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ‎ఆకాశము‬ ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు)‪ ఓషధులనుండి‬ అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా‪ పరబ్రహ్మతత్త్వము‬. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి #అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ‪ఆరాధన‬ అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి ‪స్వరూపం‬- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన ‪‎పుష్టివంతులగా‬ నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘‪‎బిక్షాందేహి‬ కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘‪పూర్ణ‬ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘‪పూర్ణమే‬’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.