సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, August 7, 2014

శివానందలహరి1 to11

Jms-Animated Moonlight
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను.
ఓం నమఃశివాయ
శివశక్తే నమస్తుభ్యం
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥

శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.

గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥

శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!

మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥

చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు.  ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.

శివానందలహరి 2

ఏకైక ఫలప్రదాత

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః
సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్।
హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం
చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥

పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను దయజూడు. నీవు ఒక్కడవే శాశ్వతుడవు. నిన్నువేడుకుంటున్నాను. జీవన్ముక్తిని  ప్రసాదించు.

పశువు
స్మృతౌ శాస్త్రేవైద్యే శకున కవితాగాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్వ చతురః।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృతయా పాలయవిభో॥

సర్వజ్ఞా! సర్వేశ్వరా! పరమశివా! పశుపతీ! నేను నిజంగా పశువునే. ఏమీ నేర్చుకోలేదు. ధర్మశాస్త్రాలను ఎరుగను. భాషావైదుష్యాలు లేవు. వైద్యవిద్య రాదు. శాస్త్రపాండిత్యమూ, సంగీతసాహిత్యాలు, పురాణాలు, మంత్రాలు ఏవీ తెలియవు. హాస్య శృంగారరస ప్రసంగాలు చేయటం చేతకాని పని. నీవు అన్నీ తెలిసినవాడవు. ధీనబాంధవుడవు. అనాథనాథుడవు. పశుతుల్యుండనైన నన్ను నీవేరక్షించాలి. నీవుకాదన్న వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ.

శుష్కతర్కాలు
ఘటోవా మృత్పిండో౭ప్యరుణురపిచ ధూమోగ్నిరచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్।
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంబోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజసుధీః॥

ఓపండితులారా! ధీరాగ్రగణ్యులారా! హేతువాద తర్కాలు కేవలం కంఠశోషను ఫలంగా మిగులుస్తాయి. అవి మృత్యువును జయించేవికావు.ఆయుఃకాలం వ్యర్థంచేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయస్వామి పాదపద్మాలను ఆరాధించండి. ఆఈశ్వరనామ స్మరణమే నీకు మేలుచేయునది.

శివానందలహరి 3

ఇంద్రియాలు 
మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ।
తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥

పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి.
నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు నానా మహిమాన్వితాలైన నీకథామృత ఫలాలు నిండుగా పట్టుకొని నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. మహాదేవ! నామనస్సు సహస్రారవిందంలో సాంబమూర్తివై వెలుగొందే నిన్ను ధ్యానిస్తూండాలి. కామ్యదా! నా కన్నులలోని చూపు భ్రూమధ్యంలో నిలిచి నీఅనంతరూప వైభవాన్ని దర్శిస్తూండాలి

మోహజాలము
 
యథాబుద్ధి శ్ముక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాను సలిలం।
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ సమత్వా పశుపతే॥

గిరిజామనోహరా! శంకరా! మానవులు పెక్కుభ్రమలలోపడి నిజవస్తుతత్వం తెలుసుకోలేక మాయావస్తువుల వెంబడి నశించిపోతున్నారు. మద మోహ మాత్సర్య మాయాగ్రస్తులైన మందమతులు భ్రమలోపడి సత్యం తెలుసుకోలేక పోతున్నారు. భోగలాలసులై క్షుద్రదేవతలను ఉపాసించి ముక్తిప్రదావతవైన నిన్నుమరచి అల్పసుఖాలకై అల్పులను ఆశ్రయిస్తున్నారు. అదేశాశ్వతం అనుకుని మురిసిపోతున్నారు. శివా! నిన్ను భజించినవారు నిరుపమాన నిర్మలానందం పొందుతారు.

ఆత్మపుష్పాలు
గభీరే కాపారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః।
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖే నావస్థాతం జన ఇహ న జానాతి కిమహో॥

ఉమానాథా! సాయీశ్వరా! సత్యశివసుందర మహేశ్వరా! నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్దులు బాహ్యపూజకై ఎంత ఆడంబరం చేస్తున్నారు. నీకు సహస్ర సారసార్చన చేయాలని, లోతైన సరోవరాల్లో దిగి, తీగలు తెంచి ఎన్నో తామరపూలు తెంచుకుని వస్తున్నారు. లక్షబిల్వార్చనకని అడవులలోకి వెళ్ళి లేతలేత మారేడుకొమ్మలను తెచ్చి గుట్టలు పోస్తున్నారు. క్షీరాభిషేకాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బానలకొద్దీ పిందుకవస్తున్నారు. పాపం! వారికి నీవు భావప్రియుడవనీ, ఆత్మారాధన అంటే ఇష్టమనీ తెలియదు.చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన నాలుగు చిన్నిగుణాలనే పూలు నీకు సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు.

శివానందలహరి 4

పరమానందలహరి 

నరత్వం దేవత్వం నగవస మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్।
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాస్తకం చేద్ధృదయ మిహకిం తేన వపుషా॥

పార్వతీశా! సర్వలోకాధీశా! సాయీశా! నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదిమ్చినా ప్రభుపాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభూ! స్వామీ నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పరవాలేదు. మృగధరా! మేరుధరా! శశిధరా! శివా! నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను. శ్రీకాళహస్తీశ్వరా నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను. దేహం ఏదైనా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చేయి స్వామీ!

ఆశ్రమాలు 

వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో
నరోవా యః కశ్చిద్భవతుభవ కిం తేన భవతి।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయ స్త్వం శంభో భవసి భవభారం చ వహసి॥

విశ్వేశ్వరా! శంకరా! మానవుడు నిష్టతో బ్రహ్మచర్యాశ్రమంలోని ఎన్నో శ్రమలకోర్చి నియమాలు పాటించి, విద్యావినయశీల సంపన్నుడైనా, సర్వేశ్వరా! గృహస్థాశ్రమంలో అనేక కర్మలు కర్తవ్యాలు యజ్ఞయాగాలు దానాలు ధర్మాలుచేసినా, కైలాసవాసా!  వానప్రస్థుడై పరమనిష్ఠాగరిష్ఠుడై కేవల కైవల్య కాంక్షియైనా, త్రినేత్రా! సన్యాసియై అనేకయోగ విద్యారహస్యాదులు ఎరిగిన పండితుడైనా, మహాదేవా! మనః పద్మం నీకు సమర్పించి శరణాగతి కోరుకోగల భక్తిగలవాడైతేనే ముక్తికి యోగ్యుడౌతాడు. 

వివిధయోగాలు 

గుహాయాం ఘేవా బహిరపి వనే వాద్రిశిఖరే
జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్।
సదా యస్యై వాంతఃకరణ మపి శాంభో తవ పదే
స్థితే చేద్యోగో౭సౌ సచ పరమయోగె సచ సుఖీ॥

పరమేశ్వరా! యోగసాధకులు నానాశ్రమలుపడి శరీరాన్ని శుష్కింపజేసి అవస్థలుపడేవారే ఎక్కువగానీ మనోనిశ్చలత కలిగి మనస్సమర్పణ చేసేవారు అరుదుగా ఉన్నారు. శివా! కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసంచేసి ఉత్తీర్ణులౌతున్నారు. గంగాధరా! మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి ఘోరంగా తపస్సుచేస్తున్నారు. మారహరా! ఇంకాకొందరు గ్రీష్మంలో పంచాగ్నిమద్యలో ఒంటికాలుమీదనిలిచి ఘోరతపస్సు చేస్తున్నారు. వామదేవా! నెత్తురు గడ్దకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తున్నారు. వారు తమచిత్త సరోజాన్ని పరమేశ్వరార్పణ చేయాలి అనేది మరచిపోతే వారిశ్రమ అంతా వ్యర్థంకదా. మనఃకమలం మహదేవార్పణం చేసి నిశ్చలమైన భక్తిని ఉపాసించాలి.

శివానందలహరి 5

Animated sea
                                                      దీనరక్షకుడు                                                                                     

అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితమ్।
మదన్యః కో దీన స్తవ కృపణ రక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే॥

పశుపతీ! సర్వభూతాధిపతీ! శంకరా! నేను నీకథాశ్రవణం చేయలేదు. నీసంకీర్తన వినిపించుకోలేదు. నీనామం స్మరించలేదు. నీపాదపద్మాలకు అభివందనం చేయలేదు. నటరాజా! నీ పరిచర్య చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీదాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రిచేయాలనికూడా అనుకోలేదు. నీకు ఆత్మనివేదనం చేయాలనే సంగతే తెలియదు. సాయీశ్వరా! సర్వేశా! సారహీనమైన సంసారచక్రంలో పడి నలిగి నశించిపోతున్నాను. ఎక్కడా గతిలేదని తెలుసుకున్నాను. చిట్టచివరకు నీపాదాలేగతి అని తెలుసుకున్నాను. నీ సన్నిధికి చేరుకున్నాను. నన్ను నీవే చేర్చుకోవాలి. ఇంతహీనాతిహీనుణ్ణి ఎవరు రక్షింపసమర్థులు? సయాసముద్రుడివి, అనాథనాధుడివి, దీనవత్సలుడివి, అర్తరక్షాదక్షా!స్వామీ నీవే శరణం.

అనాథనాథ
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః।
త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః
ప్రయత్నా త్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః॥

శివా! అంబా మనోహరా! త్ర్యంబకేశ్వరా! నీవు దీనజనబాంధవుడవు. చంద్రకళాధరా! జంగమేశ్వరా! అనాథనాథుడవు. దీనరక్షకా! విజ్ఞానవరదాయకా! కొండకోనలలో బతికే అడవిజాతులవారైన పతితులను పావనంచేసేవాడా! పతితపావనా! పరమేశా! కరుణాసముద్రా! నీవు పాపులైన భూతప్రేతగణాలనూ ఉద్ధరిస్తావు.
ఇంతదయామయుడు దేవతాపరిపాలకులలో మరొకడులేడు. పాతకులలో నావంటి ఘోరపాతకుడు లేడు. ఇటువంటివాణ్ణి ఎవడూ రక్షించలేడు. నీవే కాపాడగల సమర్ధుడవు. మా బంధుడవు. దగ్గరున్నవాడిని ఏడిపించి దూరంగా ఉన్నవారిని కాపాడడమనేది ఏమిధర్మం. స్వామీ! శరణాగతులకు రక్షించటం నీకు సహజగుణం. భక్తుల నీకునీవే సాటి.

బ్రహ్మగీతతుడు
 

ఉపేక్షా నోచే త్కింనహరపి భవద్ధ్యానవిముఖాం
దురాశా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్।
శిర స్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్॥

శివా! శిష్ట జనావనా! ఆర్యాదేవీప్రియా! నిన్ను ధ్యానించడానికి బుద్ధి నిలవటంలేదు. అపవర్గం అందించే అమృతవరదాతా మంచిపనులు చేయటానికి నామనస్సు మారాము చేస్తున్నది. మదనవైరీ! సర్వాంతర్యామీ! నీకు తెలియనిదేమున్నది. చెడ్డకామం ఎంతప్రయత్నించినా నశించటంలేదు. ఐశ్వర్యప్రదా! విశ్వకళ్యాణగుణా! నాకు అర్థమోహం దూరంకావటంలేదు.

శివానందలహరి 6

విధి 

విరించిర్ధీర్ధాయ ర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్షం సఖలు భువిదైస్యం లిఖితవాన్।
విచారః కోవా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపిచ దీనావనపరః॥

సాయీ!సాంబా! కారుణ్యసాగరా! నన్నిలా సృజించిన బ్రహ్మదేవుణ్ణి నాల్గుకాలాలపాటు బ్రతకనీ. కష్టాలన్నీ మాకేరాయనీ. ఘోరారణ్యాలలో బ్రతకమని వ్రాసినా వ్రాయనీ. మందభాగ్యులు ధీనులు హీనులు అని వ్రాసినా వ్రాయనీ. అవికూడా మామంచికే. అవి ఉంటేనే మేము నిన్ను ఆశ్రయించేది. నీ భజనచేసేది. నీవు ఔదార్యం చూపి రక్షించేది. కష్టాలే లేకపోతే నీసాంగత్యం నీభక్తిమాధుర్యం లభించేదికాదేమో.
ఆయన వ్రాతలు మమ్మేమి చేస్తాయి. మావెంట దంట కంటకనిపెట్టి నీవుండగా నీవిభూతి మాకురక్ష. నీవు మృత్యుంజయుడవు. నీకృప అపారం. నిర్హేతుకం. నీవు కాలాంతకుడవు. అచ్యుతుడు ప్రసన్నుడైతేదుఃఖాలు మాయమవుతాయి. సూర్యుడికి అభిముఖంగా నడిచేవాడికి చీకటి ఎక్కడిది?

నా అదృష్టము
ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేపి స్వామిన్ భవ దమల పాదాబ్జయుగళమ్।
కథం పశ్యేయం మాం స్థగయతి సమస్సంభ్రమజుషాం
నిలిపానాం శ్రేణి ర్నిజకనకమాణిక్య మకుటై॥

స్వామీ! జగత్రయప్రభో! నీప్రాభవం ఏమని వర్ణించను? శివా! దేవా! మహావిష్ణువు, మహేంద్రుడు, మహామహుడైన పితామహుడు ఆదిదేవతామన్యులు నీపాదారవిందాలపై మణీకిరీటాలి మోపి నమస్కరిస్తున్నారు.
రెందువైపులా రేరాజు దినరాజులున్నారు. ముందువైపున వృషభరాజు మోర పైకెత్తి మోకరిల్లుతున్నారు. దేవతాకోటికోటీర మణిమయకాంతుల వలయాలలోనీశ్రీపాద పద్మద్వయం తేజరిల్లిపోతున్నది. ఇంకా మిగిలిన దేవతాబృందాలు వివిధ దేశాధినాథులు భటులబెత్తముల దెబ్బలు భరించి పంక్తులలో నిలువుకాళ్లపై నిలిచియున్నారు.
ఇంతపెద్ద మహాసభలోకి ప్రవేశం నీపాద సందర్శనభాగ్యం నాకుకలగటం నీకృపాకటాక్ష విశేషమేగానీ అదిలేకున్న ఇదిసాధ్యమా? స్వామీ! నేను అల్పుణ్ణి. దౌర్భాగ్యుణ్ణి. దీనుణ్ణి. నన్ను సదా కరుణించు కారుణ్యసింధూ!

లొకైకప్రదాత 
త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
మహంత స్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః।
కియ ద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతీ
కదావా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా॥

పరిశుద్ధ స్వరూపా! పరమేశ్వరా! పరమాత్మా! నీవు లోకైక ప్రభుడవు. పరంధాముడవు. పరమపద ఫలప్రదాతవు. శోకనాశకుడవు. మృత్యుంజయుడవు. ఆనందదాతవు. నీకు శతవందనాలు. దేవేంద్రులంతటి గొప్పవారు పెద్దపెద్ద పదవులుపొంది పరమపదం కావలసివచ్చేసరికి నీదగ్గరకువచ్చి నిన్నే వేడుకుంటారు. వారికెన్నో వరాలు ఇస్తుంటావు. నీఔదార్యం అపారం. కామ్యాలు తీర్చటంలో నీయంతటి కారుణ్యమూర్తి మరొకరులేరు. దీనజన కామధేనువుడివి నీవు. నేను దీనాతిదీనుణ్ణి. నీవేతప్ప మరొకదిక్కులేదు నాకు. నాకోరిక చాలాచిన్నది. ఇది తీర్చుట నీకెంత? నాకు నీసేవాభాగ్యం కల్పించి నన్ను ఇక్కడే ఉంచుకో.

శివానందలహరి 7

Day of sunshine and joy
                                           నీభక్తుడను
దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే।
మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥

ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి.
ప్రభూ! ఇందులో కూలిపోతున్నాను. విధి నన్నిలా చేశాడు. ఆవిథి నీకు భక్తుడని వానిమాటలు సాగిపోయేలా చేస్తున్నావు. న్రహ్మపై ప్రీతిచే నామొర వినికూడా ఉపేక్షవహిస్తున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే. బ్రహ్మ చేష్టలు, విన్నపాలు ఆలకించినవాడవు ఇవాళకాకపోయినా రేపయినా నాకోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశవలన దుఃఖం, దుఃఖం వలన పాపం, పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక శివా! నాకు దురాశాలేకుండా చేయి.

మానసమర్కటం
సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ
నట త్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరమభితః।
కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో॥

ఆదిభిక్షూ! శంకరా! నామనస్సు చాలా చపలపమైనది. అదికోతి వంటిది. దానిని నీవే సరైనమార్గంలో పెట్టాలి. ఈ నామానసమర్కటం మోహకారణమైన చెరకుతోటలవంటి భోగాలవైపులు పరుగులు తీస్తుంది. కామగుణవర్థకాలైన కామీనీ కుచాద్రులపై తైతక్కలాడుతానంటుంది. ద్వేషరోషలోభాదులనే వృక్షశాఖాగ్రాలపైకి ఎగబ్రాకి కోతికొమ్మచ్చు లాడుతుంటుంది. శృంగారరస ప్రవాహాలలోని సుడిగుండాలలోదూకి మునిగి తేలుతుంటుంది.
ఇది చాలా చపలస్వభావ. దీనిని నాదగ్గర ఉంచుకోలేను. దీనితో వేగటం చాలాకష్టం. మంచిమాట ఒక్కటీ వినదు. నీమాటయితే వింటుంది. నీభిక్షుకవేషానికి తగినట్లుగా బాగా ఉంటుంది. భక్తి అనే తాడుతో బంధించి నీకు ఇస్తాను. తీసుకుపో. నాకష్టాలు తీర్చినవాడవవుతావు.

మానస పటకుటీరముధృతి స్తంభాదారాం దృఢగుణనిబద్దాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం।
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రావ్య విశదా
జయస్వామిన్ శక్త్యాసహ శివగణైస్సేవిత విభో॥

ఈశ్వరా! సాయీశ్వరా! దీనబాంధవా! నామానసం ఒకపటకుటీరంగా దిద్ది తీర్చాను. ఇందు నీవు ప్రమధగణంతో, పార్వతీదేవితో వచ్చి నివాసం చేయవచ్చు. రా! స్వామీ! రా! ఆహ్వానిస్తున్నాను. ధైర్యం అనే స్తంభాలు గట్టిగా నిలబెట్టాను. గుణాలు అనే తాళ్ళతో గట్టిగా బిగించికట్టాను. గుడారం ఏర్పాటు చేశాను. దానిలో ద్వాదశపద్మాలతో అలంకృతమైన తెరలలో గదులు ఏర్పరచాను. కుటీరాన్ని ప్రతిదినం నిర్మలగంగాతీరభూములలో వికసించిన మందారాలుతెచ్చి అలంకరిస్తున్నాను. భక్తి అనేదూది ఏకించి మెత్తమెత్తని ఆసనాలు, శయ్యలు ఏర్పాటు చేశాను. ఇది అన్నివిధాలా అర్హతగలది. దృఢమైనది. నీకుయోగ్యమైనది. నీవు వచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయవలసినది.

మన స్తస్కరుడు 
ప్రలోభాద్యై రర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతిబహుదా తస్కరపతే।
ఇమం చేతోశ్చోరం కథ మిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వామయి నిరపరాథే కురు కృపామ్॥

పరమేశ్వరా! పాపహరా! శంకరా! నామనస్సు వట్టి దొంగబుద్ధి కలది. ఈదొంగ గొల్ల‌ఇండ్లలో వెన్నలు తినివస్తుంది. చిత్తహరా! ఈదొంగ మానినీమణుల మాణిక్యహారాలు కాజేస్తుంటుంది. గుణహరా! ఈదొంగ ధనవంతులెంత జాగ్రత్తగా ఉన్నా వారికన్నుగప్పి మోసంచేసి ప్రతివస్తువునూ దోచేస్తుంటుంది. దేవరా! ఈదొంగ ఎదురుపడి పలకరించినవారిని నిలువుదోపిడీ చేస్తుంటుంది. ఈఖలబుద్ధిని నీవేమార్చాలి. మంచిమార్గంలో పెట్టాలి. ఈదొంగబుద్ధులను దారిలోపెట్టే సమర్థుడవు నీవుతప్ప మరెవ్వడూలేడు. వీడు నాస్వాధీనంలో ఉండటంలేదు. నీవు తస్కరాధిపతివి. వారిని అదిలించి మంచిమార్గంలో పెట్టే సమర్థుడవు. నామొరవిని మర్యాద కాపాడు ప్రభూ! నీకాళ్ళు పట్టుకుంటాను.

శివానందలహరి 8

జీవన్ముక్తి

కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో

విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి।

పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా

మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥


ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను.
నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ. ఆగొప్పలు నాకెందుకులేగానీ ఇసుమంత జీవన్ముక్తి ఇమ్ముచాలు. నాకు దురాశలులేవు.

శివవైభవం
 కదా వా కైలాసే కనకమణి సహగణై
ర్వసన్ శంభో రగ్రే స్పుటఘటితమూర్థాంజలి పుటః।
విభోసాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥

మహాదేవా! నీమహావైభవం మహైశ్వర్యం నాకనులారా చూడాలని ఉంది స్వామీ! ఆమథురక్షణం ఎప్పుడు అనుగ్రహిస్తావోకదా! ఆపరిశుద్ధ పరిశుభ్ర ధవళ ధగద్ధగల కైలాసాద్రి, ఆఆద్రిపై మధురమంజుల మందారపుష్పవాటిక, ఆవాటికమద్యంలో మణిమయ మహామాణిక్య రత్నమందిరం. ఆమందిరప్రాంగణంలో మెరిసిపోయే సహస్రస్తంభమంటపం. ఆమంటపంలో దేవగాంధర్వ ఆనందమంగళధ్వని.
పార్వతీపతీ! పాహిపరమేశ్వరా! అనే నారదాదుల నందిస్తోత్రస్రవంతి. మధుర మహిత లలిత కీర్తనలు. దేవకోటి సస్తవం. వీటితో నిండిన నీసంస్థాన మహావైభవంచూస్తూ నీసభలో సభ్యుడిగాఉండి యుగయుగాలనూ క్షణాలుగా గడపాలని మహాకాంక్షప్రభూ! కటాక్షించు కళ్యాణగుణధామా!

శివవిభూతి
స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం
గణానాం కేళీభి ర్మదకలమహూక్షస్య కకుది।
స్థితం నీలగ్రీవం త్రినయన ముమా శ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్॥

సాయీశా! మహేశా! నీవైభవ శివమూర్తిని దర్శించాలని ఉన్నది.  బ్రహ్మాది దేవతా సమూహాలు బారులుతీరి నిలువబడి 'జయజయ‌' ద్వానాలు చేస్తుండగా, నీభూతప్రేత ప్రమథగణాలు శివంకరముగా నాట్యంచేస్తుండగా, నందీశ్వరుడు మోరపైకెత్తి బ్రహ్మాండం మారుమ్రోగేలా రంకెలు వేస్తుండగా, ఈమహాసంరంభం చూచి గౌరీదేవి సంభ్రమించి నిన్ను కౌగిలించుచుండగా, నీకంఠముపై మెరిసే హరినీల కాంతిసౌందర్యం చిందుతుండగా, నీకన్నులు వింతసోయగాలు వెలయిస్తుండగా, నీవుమహదానందంగా  


శివానందలహరి9

శివానందలహరి9..
ఇంద్రియసిథ్థి 
కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్।
నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ
నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥
శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే ఎప్పుడు నిలుపుకుంటుందో?

కానుక
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనవతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే।
శిరస్స్థే శీతాంశౌ చరణయుగళస్థే౭ఖిలశుభే
కమర్థం దాస్యే౭హం భవతు భవదర్థం మమమనః॥
శివా! నీకు ఏదైనా విలక్షణమైన సరిక్రొత్త కానుక ఇవ్వాలని మనస్సు మారాంచేస్తున్నది. ఏమియ్యగలను.ధనువు ఇచ్చుకుందామంటే నీచేతిలో బంగారుకొడ మేరువు ధనువై ప్రకాశిస్తున్నది. పోనీ వెండిబంగారాలు ఇద్దామంటే కుబేరుడు నిత్యం పంపిస్తున్నవేకదా! నీకు చల్లగా ఉండే ఏపుష్పరసాలు సమర్పిద్దామన్నా శిరస్సుపై చంద్రుడు పండువెన్నెలలు కుమ్మరిస్తున్నాడాయె. నీకు సేవలుచేయడానికి నాకుమారీమణిని ఇద్దామంటే సర్వవిథాలా సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది. ఫలాలు ఇద్దాము అంటే భవనం ముందువెనకా అన్నీ కల్పవృక్షాలే. పాలిద్దామంటే పెరటినిండా కామధేనువులే. శంకరా! కొత్తది ఏమి ఇయ్యగలను? అన్నీ నీవిదివరకు అనుభవించినవే. మనస్సు అనే విచిత్రవస్తువు ఉన్నది. అది అర్పిస్తాను స్వీకరించు ప్రభూ!

ముక్తిదాత
సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిదుర్యజనతా సాంగత్యసంభాషణే।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్దమత్రభవతి స్వామిన్ కృతార్థోన్మ్యహమ్॥
సాయీశ్వరా! ముక్తిదాతవంటే నీవేదేవా! నాల్గు ముక్తులూ ఒకేసారి ప్రసాదించగలవు స్వామీ! దయాళూ! నీక్షేత్రానికి వచ్చి నీభక్తులతో స్నేహంచేసుకున్నంత మాత్రాన సాలోక్యముక్తిని ప్రసాదిస్తావు. శివా! మహాదేవా! సాయీశ్వరా! తాండవమూర్తీ! నటరాజా! అని నోరారా పిలిచినంతమాత్రాన సామీప్యానికి జేర్చుకుని సామీప్యముక్తిని అనుగ్రహిస్తావు. నీరూపంచూస్తూ నీకభిషేకం చేస్తూ నిన్ను పరికిస్తున్నమాత్రాన సంతోషించి సారూప్యముక్తిని చేకూరుస్తావు. నిన్ను మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్టించుకుంటేచాలు సాయుజ్యముక్తిని అందిస్తావు.


శివానందలహరి 10

దర్శనం 
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥

దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.

ఏమి అర్పింతు
వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా
గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।
పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥

పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.

పరమోపకారి
 నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥

పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.

శివానందలహరి 11
Cascade & Rainbow
                                           శ్రీకంఠ                                                          
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥

శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.

భక్తసులభ
 నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః
పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।
స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥

స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.

వీరమణి 
కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ
ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥

శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.


గణేశాయనమః సర్వ శుభప్రదాత

 గణేశాయనమః సర్వ శుభప్రదాత


గణేశాయనమః సర్వ శుభప్రదాత..
విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబుడు. సర్వలోక రక్షకుడు కనుక లంబోదరుడు. పూర్ణజ్ఞానాన్ని ప్రసాదించి, రక్షిస్తాడు కాబట్టి శూర్పకర్ణుడు. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం గణనాధుడు. 
దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి తరువాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తోంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. రుగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలోముందుగా పూజింపదగినవాడని తెలియచేసింది. సృష్టి మొత్తాన్ని ముప్ఫై మూడు కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి.

అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, సగణ, రగణ, తగణ, యగణములనే అష్ట గణములకు అధిష్ఠాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని 'ప్రణవశ్చందసామివ' అని కాళిదాసు చెప్పినట్లుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మ­ృతి చెప్పింది.
గణపతి సర్వవిద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడై, శబ్దబ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.
''జ్ఞానార్థవాచకోగశ్చ, ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్!!
'గ' అనే అక్షరం జ్ఞానార్థ వాచకమై, 'ణ' అనే అక్షరం నిర్వాణవాచకమై 'గణ' అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. దీనిద్వారా వాగధిపతి గణపతియే అని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ అనే సంస్కృత పదమునకు ప్రారంభం అని అర్థము. అందుకే వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. గణ్యంతే బుధ్యంతే తే గణాః అన్నట్లు సమస్త దృశ్యమాన పదార్థాలు, గణాలు అన్నింటికీ అధిష్ఠానదేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు.

సమస్త విఘ్నాలను రూపుమాపి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. గణనాథుడు ఓంకార స్వరూపుడని గణపత్యధ్వర శీర్షం వర్ణించింది. స్వయంభువు అయిన మూలవిరాట్టు ఉద్భవించిన తరువాత ఆయన నుంచే ముక్కోటి దేవతలూ ఆవిర్భవించారు. దేవతా గణములు ఉద్భవించి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడుగా గణపతి పూజలందుకుంటున్నట్లు గణేశపురాణం తెలియజే స్తోంది. గణేశుడువిష్ణుస్వరూపుడని 'శుక్లాంబరధర విష్ణుం' అన్న శ్లోకం సూచిస్తుంది.

సర్వసిద్ధి ప్రదుడు, సర్వమంత్ర దేవతారూపి, విఘ్నహరుడు, ప్రణవ స్వరూపుడుఅయిన గణపతికి అనేక రూపాలున్నాయి. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంతో పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలి వాహనంతో మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై, సంపద బొజ్జతో ఉన్న గజాననుణ్ణిఆరాధిస్తున్నాం.

Wednesday, August 6, 2014

బ్రహ్మము + మాయ = ఈశ్వరుడు


Photo: నామ రూపాత్మకమైన జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు. మార్పు చెందే దేనికైనను మార్పు చెందని, స్థిరమైన, శాశ్వతమైన ఆధారము ఒకటి ఉండాలి. 

నామ రూపాత్మకమైన జగత్తు, సృష్టికి పూర్వము బ్రహ్మము నందు అవ్యక్తముగా ఉన్నది. అది సృష్టిగా వ్యక్తమైనది. తిరిగి ప్రళయమందు తనకు ఆధారమైన బ్రహ్మ మందు తన సృష్టికి పూర్వ స్థితిని పొందుచున్నది. 

బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది. సృష్టిగా ఉన్నప్పుడు ఉన్నది. సృష్టి లయమైన పిదప ఉన్నది. బ్రహ్మము సృష్టికి ఆధారముగా ఉన్నది. కనుక బ్రహ్మము  సత్యము. సృష్టికి  స్వతంత్రమైన ఉనికి లేదు. కుండ యొక్క ఉనికి మట్టికి వేరుగా లేనట్లే, సృష్టి యొక్క ఉనికి బ్రహ్మమునకు వేరుగా లేదు.   స్వతంత్రమైన ఉనికి లేనిదానిని మిథ్య అంటారు. కనుక బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య.  

#బ్రహ్మము  + మాయ  = ఈశ్వరుడు 
బ్రహ్మము దేనికి (సృష్టికి) కారణము కాదు. కేవలము ఆధారము. బ్రహ్మము, మాయ శక్తిని కలపి ఈశ్వరుడు అంటారు.మాయా  శభలిత బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికి మాయ శక్తి స్వాధీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారా ఈశ్వరుడు ఈ సృష్టిని సృజించాడు.  

సృష్టికి పూర్వము నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము నందు, విత్తనమందు మహావృక్షము అవ్యక్తముగా ఉన్నట్లు, అవ్యక్తముగా ఉన్నది. బ్రహ్మమునందు అవ్యక్తముగా వేరుచేయుటకు వీలుకానిదిగా ఉన్న నామరూపాత్మకమైన జగత్తును మాయ అంటారు. 
మరియొక కోణమున చూచిన అవ్యక్తముగా ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు. 

#జ్ఞానశక్తి  - క్రియా శక్తి  - ద్రవ్య శక్తి 
అవ్యక్త స్థితియందు ఉన్న ఈ మూడు శక్తులే సత్వ, రజో, తమో గుణములు (మూడు గుణములు) గా వ్యక్త మవుచున్నవి. 
అవ్యక్త స్థితియందు ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
వ్యక్త స్థితి యందు , మూడు గుణములే మాయ. (మాయ త్రిగుణాత్మకము).
నామ రూపాత్మకమైన జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు. మార్పు చెందే దేనికైనను మార్పు చెందని, స్థిరమైన, శాశ్వతమైన ఆధారము ఒకటి ఉండాలి. 

నామ రూపాత్మకమైన జగత్తు, సృష్టికి పూర్వము బ్రహ్మము నందు అవ్యక్తముగా ఉన్నది. అది సృష్టిగా వ్యక్తమైనది. తిరిగి ప్రళయమందు తనకు ఆధారమైన బ్రహ్మ మందు తన సృష్టికి పూర్వ స్థితిని పొందుచున్నది.

బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది. సృష్టిగా ఉన్నప్పుడు ఉన్నది. సృష్టి లయమైన పిదప ఉన్నది. బ్రహ్మము సృష్టికి ఆధారముగా ఉన్నది. కనుక బ్రహ్మము సత్యము. సృష్టికి స్వతంత్రమైన ఉనికి లేదు. కుండ యొక్క ఉనికి మట్టికి వేరుగా లేనట్లే, సృష్టి యొక్క ఉనికి బ్రహ్మమునకు వేరుగా లేదు. స్వతంత్రమైన ఉనికి లేనిదానిని మిథ్య అంటారు. కనుక బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య.

#బ్రహ్మము + మాయ = ఈశ్వరుడు
బ్రహ్మము దేనికి (సృష్టికి) కారణము కాదు. కేవలము ఆధారము. బ్రహ్మము, మాయ శక్తిని కలపి ఈశ్వరుడు అంటారు.మాయా శభలిత బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికి మాయ శక్తి స్వాధీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారా ఈశ్వరుడు ఈ సృష్టిని సృజించాడు.

సృష్టికి పూర్వము నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము నందు, విత్తనమందు మహావృక్షము అవ్యక్తముగా ఉన్నట్లు, అవ్యక్తముగా ఉన్నది. బ్రహ్మమునందు అవ్యక్తముగా వేరుచేయుటకు వీలుకానిదిగా ఉన్న నామరూపాత్మకమైన జగత్తును మాయ అంటారు.
మరియొక కోణమున చూచిన అవ్యక్తముగా ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.

#జ్ఞానశక్తి - క్రియా శక్తి - ద్రవ్య శక్తి
అవ్యక్త స్థితియందు ఉన్న ఈ మూడు శక్తులే సత్వ, రజో, తమో గుణములు (మూడు గుణములు) గా వ్యక్త మవుచున్నవి.
అవ్యక్త స్థితియందు ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
వ్యక్త స్థితి యందు , మూడు గుణములే మాయ. (మాయ త్రిగుణాత్మకము).

శ్రీ తులసి వైభవము

Photo: #శ్రీ తులసి వైభవము 
భగవత్ స్వరూపమైన వృక్షాలు రెండు. ఒకటి తులసి,రెండు బిల్వ వృక్షాలు.హిందూవన్నవారు ముఖంగా దక్షిణాదివారు తులసి మొక్కలేని ఇల్లు ఇల్లే కాదంటారు.కులాల కతీతంగా తులసిని పుజిస్తారు. మహా లక్ష్మి అంశగా భావిస్తారు.ఆయుర్వేదంలోతులసిని  ప్రాణ శక్తినిచ్చే  శల్య కరణి అని వ్యవహరిస్తారు. తులసిలో ముఖ్యంగా  #అష్టాదశ (18 ) రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఏడు .లక్ష్మి తులసి,రామ తులసి,కృష్ణ తులసి ,రుద్రజడ తులసి,నెల తులసి,మరువక తులసి ,అడవి తులసి .వివిధ ప్రాంతాలలో వివిధ  పేర్లతో పిలిచినా తులసి చేసే మేలు ఒకటే.లక్ష్మితులసిని తెల్ల తులసి అని, కృష్ణ తులసిని నల్ల తులసి  అని,అలాగే శోంఠి తులసి అని,కర్పూర తులసి అని పిలుస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో అన్ని మొక్కలకు  ఏదో ఒక విలువ ఉంటుంది.కాని తులసికి మాత్రం సమానమైన మొక్క లేదు.తులసి అంటేనే సాటి లేనిది  అని అర్ధం. చర్మం ,రక్తం,మాంసం,ఎముకలలో ఎంత మహా రోగం  వచ్చినా తెల్ల తులసితో నయం చేయవచ్చు.  కుష్టు రోగంతో  వికార మైన శరీరాన్ని కృష్ణ తులసితో సహజ సిద్ద రూపం  పొందవచ్చు .అందుకే పూర్వం మునులు ఋషులు తులసిని అధ్బుత మొక్కగా వర్ణించారు.వివిధ పురాణాలలో తులసి జన్మ గాధలు ఒక్కోరకంగా ఉన్నాయి.

దేవి భాగవతంలో #శ్రీ కృష్ణునితో గోపికలు  ప్రేమగా అడుకునుచుండా అందు ఒక గోపిక కృష్ణునితో  సరస సల్లాపాలు జరుపుతుండగా రాధ చూచి అసూయా చెంది శ్రీ కృష్ణుని,గోపికను భూలోకం లో పుట్టమని శపిస్తుంది.గోపిక బాధపడుతూ శాప విమోచన కోరగా బ్రహ్మ వరంతో శ్రీ హరి అంశకు చేరుతావని శాపవిమోచన చెప్పింది.భూలోకంలో ధర్మ ధ్వజుడను  రాజుకు కార్తిక పున్నమి రోజున గోపిక కుమార్తెగా జన్మించింది.రాజు ఆమెకు తులసి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. చిన్నతనం నుండి శ్రీహరే తన భర్త అని తలుచుకోసాగింది.బ్రహ్మగురుంచి  తపస్సు చేసింది.బ్రహ్మ ప్రత్యేక్షమై శ్రీ హరి అంశతో శంఖచూడుడు అను దాన వుడు జన్మించాడు.అతనిని వివాహం చేసుకొని కాలక్రమేణా గొప్ప వృక్షరాజానివై  దేవతలచేత,మానవులచేత,రాక్షసులచేత పూజ లందు కుంటావని వరం ప్రసాదించాడు.శంఖచూడుడు కూడా బ్రహ్మ వరప్రసాదంతో తులసిని వివాహం చేసుకుని ముల్లోకాలను జయించి దానవ రాజై దేవతలను ఋషులను వేధించసాగాడు.దేవతలు శ్రీహరిని వేడుకోగా శ్రీ హరి శివునితో ఆలోచన చేసాడు.తులసి ప్రాతివత్యమే శంఖ చుడుడిని కాపాడుతున్నదని ఆమె ప్రతివత్యాన్ని చెడగోడితే  అతనిని సంహరించడం సాధ్య మవుతుందని చెబుతాడు. శివుడు శంఖ చుడునికి మాయ మాటలు చెప్పి దూరంగా తిసుకబోగా శ్రీహరి  తులసి భర్తరూపంలో వచ్చి ఆమెను చేరదియగా తులసి ఆ విషయం గ్రహించి  నివు వంచనతో నన్ను పొందావు కనుక శిలవై పోదువు గాక అని శపించింది. అప్పుడు విష్ణు మూర్తి ప్రత్యేక్షమై నివు ఎప్పడికైనా నన్ను చేరవలసిన దానవే అనిచెబుతూ శంఖచూడుడు  కూడా నా అంశ వాడే  అనిచెప్పి అయినా నీ శాపం వృధా పోదు అని నీ శరిరం గండకి నదిగాను,నీ కేశములు తులసి వృక్షముగాను నేను  సాల గ్రామశిలగాను  శంఖచూడుడు శంఖముగాను మారి పోతాము.శంఖము,తులసి సాలగ్రామశిల మూడింటిని  కలపి పూజించినవారు  నాకు అత్యంత పితిపాత్రులై వైకుంఠ  వాసులవుతారు.అనిచెప్పాడు. పద్మ పురాణంలోకూడా దాదాపు ఇదే కధ వున్నా  తులసి జలంధరునికి భార్యగాను ఉండి చివరకు జలంధరుడు అత్తిపత్తి మొక్కగా మారతాడు.అందుకని తులసిని అత్తిపత్తి మొక్కను కలసిపెంచి పూజించడం శ్రేష్టదాయకం అనిఉంది.బృహన్నరదియంలో పూర్వం ధర్మదేవుడనే బ్రాహ్మణునికి తులసి బృంద అనే నామంతో భార్యగా ఉండేది.బృంద పతియే ప్రత్యేక్షదైవంగా భావించేది.ధర్మదేవుడు ఋషులను ,మునులను పూజిస్తూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజు ధర్మదేవుడు దైవ ప్రార్ధన చేస్తూ మధ్యాన్న బోజన కాలమైనా ఇంటికి రాలేదు.అతిధులు బోజనానికి వేచి ఉన్నారు. అందుకని బృంద అతిధులను పూజించి వారికి ఆతిధ్యం  ఇచ్చి బాగా దాహం అవుతుండటంతో జల పానం(నీరు త్రాగటం)  చేసి భర్త రాకకై ఎదురు చూడ సాగింది. కొంతసేపటి  తరువాత భర్త ఇంటికి వచ్చి క్షణికావేశంలో జల పానం చేసిన భార్యను రాక్షసివి కమ్మని శపించాడు. బృంద దుఃఖముతో  శాపవిమోచన కోరగాఒకవారం దినములు ఆహారంతిసుకోనకుండా ఉంటె శాప విమోచన జరుగు తుందని చెబుతాడు. బృంద రాక్షసిగామారి రాక్షస్వభావంతో మనుషులను,జంతువులను చంపి ఆహారంగా తింటూ ఉంటుంది.కానీ పూర్వజన్మ సృతివల్ల గోవులను హరి భక్తులను ,బ్రాహ్మణుల జోలికి పోకుండా వారిని గౌర విస్తు ఉంటుంది.అలాచాలారోజులు జరిగాక తిరుగుతూ తిరుగుతూ కైలాసం వస్తుంది.
అక్కడ అంతా హరిహర భక్తులే.చెట్లు,జంతువులుకుడా హరినామం జపిస్తూ ఉంటాయి.అక్కడ ఏమి తినలేక వారంరోజులు పస్తు ఉంటుంది.శాపనియమానుసారం ఒకవనంలో దేహం చాలిస్తుంది. శివుడు పార్వతి ఒక సంవత్సరం తరువాత ఆ వనమునకు  పోగా అక్కడ బృంద శరీరము  వింత కాంతులు  వెలయిస్తూ ఉంటుంది.అప్పుడు శివుడు పార్వతితో "ఈ దేహంలో  ద్వాదశాక్షరి అణువణువునా కనిపిస్తున్నది.కావున ఈ దేహం వృధా పోరాదు .భూలోకంలో గొప్ప  వృక్షరాజంగా వెలసి విష్ణుమూర్తికి ప్రియమైనదిగా పూజలందు కుంటుందని వరం ఇచ్చాడు.ధర్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రార్ధించగా తులసి చెట్టు వేరుగా ఉండమని వరం ఇచ్చాడు. శివకేశవులు తులసి ఆవిర్భావాన్ని భూలోకంలో చూచారు. అప్పుడు విష్ణు మూర్తి తులసితో ఒతులసి!నివు స్త్రీలలో ఉత్తమురాలివి సూర్య,చంద్రులు ఉన్నంతవరకు నివు నిలిచేఉంటావు. నాపుజకు నీ దళాలే శ్రేష్టమయినవి.నీకు ప్రదక్షిణం చేస్తే భుప్రదక్షిణం చేసినట్లే.కార్తిక మాసంలో కాని మాఖ మాసంలో కానినిపత్రాలతోనన్నుపూజిస్తేసహస్రగోదానఫలితదక్కుతుంది. శ్రీ తులసి వైభవము
శ్రీ తులసి వైభవము 
భగవత్ స్వరూపమైన వృక్షాలు రెండు. ఒకటి తులసి,రెండు బిల్వ వృక్షాలు.హిందూవన్నవారు ముఖంగా దక్షిణాదివారు తులసి మొక్కలేని ఇల్లు ఇల్లే కాదంటారు.కులాల కతీతంగా తులసిని పుజిస్తారు. మహా లక్ష్మి అంశగా భావిస్తారు.ఆయుర్వేదంలోతులసిని ప్రాణ శక్తినిచ్చే శల్య కరణి అని వ్యవహరిస్తారు. తులసిలో ముఖ్యంగా #అష్టాదశ (18 ) రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఏడు .లక్ష్మి తులసి,రామ తులసి,కృష్ణ తులసి ,రుద్రజడ తులసి,నెల తులసి,మరువక తులసి ,అడవి తులసి .వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచినా తులసి చేసే మేలు ఒకటే.లక్ష్మితులసిని తెల్ల తులసి అని, కృష్ణ తులసిని నల్ల తులసి అని,అలాగే శోంఠి తులసి అని,కర్పూర తులసి అని పిలుస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో అన్ని మొక్కలకు ఏదో ఒక విలువ ఉంటుంది.కాని తులసికి మాత్రం సమానమైన మొక్క లేదు.తులసి అంటేనే సాటి లేనిది అని అర్ధం. చర్మం ,రక్తం,మాంసం,ఎముకలలో ఎంత మహా రోగం వచ్చినా తెల్ల తులసితో నయం చేయవచ్చు. కుష్టు రోగంతో వికార మైన శరీరాన్ని కృష్ణ తులసితో సహజ సిద్ద రూపం పొందవచ్చు .అందుకే పూర్వం మునులు ఋషులు తులసిని అధ్బుత మొక్కగా వర్ణించారు.వివిధ పురాణాలలో తులసి జన్మ గాధలు ఒక్కోరకంగా ఉన్నాయి.

దేవి భాగవతంలో #శ్రీ కృష్ణునితో గోపికలు ప్రేమగా అడుకునుచుండా అందు ఒక గోపిక కృష్ణునితో సరస సల్లాపాలు జరుపుతుండగా రాధ చూచి అసూయా చెంది శ్రీ కృష్ణుని,గోపికను భూలోకం లో పుట్టమని శపిస్తుంది.గోపిక బాధపడుతూ శాప విమోచన కోరగా బ్రహ్మ వరంతో శ్రీ హరి అంశకు చేరుతావని శాపవిమోచన చెప్పింది.భూలోకంలో ధర్మ ధ్వజుడను రాజుకు కార్తిక పున్నమి రోజున గోపిక కుమార్తెగా జన్మించింది.రాజు ఆమెకు తులసి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. చిన్నతనం నుండి శ్రీహరే తన భర్త అని తలుచుకోసాగింది.బ్రహ్మగురుంచి తపస్సు చేసింది.బ్రహ్మ ప్రత్యేక్షమై శ్రీ హరి అంశతో శంఖచూడుడు అను దాన వుడు జన్మించాడు.అతనిని వివాహం చేసుకొని కాలక్రమేణా గొప్ప వృక్షరాజానివై దేవతలచేత,మానవులచేత,రాక్షసులచేత పూజ లందు కుంటావని వరం ప్రసాదించాడు.శంఖచూడుడు కూడా బ్రహ్మ వరప్రసాదంతో తులసిని వివాహం చేసుకుని ముల్లోకాలను జయించి దానవ రాజై దేవతలను ఋషులను వేధించసాగాడు.దేవతలు శ్రీహరిని వేడుకోగా శ్రీ హరి శివునితో ఆలోచన చేసాడు.తులసి ప్రాతివత్యమే శంఖ చుడుడిని కాపాడుతున్నదని ఆమె ప్రతివత్యాన్ని చెడగోడితే అతనిని సంహరించడం సాధ్య మవుతుందని చెబుతాడు. శివుడు శంఖ చుడునికి మాయ మాటలు చెప్పి దూరంగా తిసుకబోగా శ్రీహరి తులసి భర్తరూపంలో వచ్చి ఆమెను చేరదియగా తులసి ఆ విషయం గ్రహించి నివు వంచనతో నన్ను పొందావు కనుక శిలవై పోదువు గాక అని శపించింది. అప్పుడు విష్ణు మూర్తి ప్రత్యేక్షమై నివు ఎప్పడికైనా నన్ను చేరవలసిన దానవే అనిచెబుతూ శంఖచూడుడు కూడా నా అంశ వాడే అనిచెప్పి అయినా నీ శాపం వృధా పోదు అని నీ శరిరం గండకి నదిగాను,నీ కేశములు తులసి వృక్షముగాను నేను సాల గ్రామశిలగాను శంఖచూడుడు శంఖముగాను మారి పోతాము.శంఖము,తులసి సాలగ్రామశిల మూడింటిని కలపి పూజించినవారు నాకు అత్యంత పితిపాత్రులై వైకుంఠ వాసులవుతారు.అనిచెప్పాడు. పద్మ పురాణంలోకూడా దాదాపు ఇదే కధ వున్నా తులసి జలంధరునికి భార్యగాను ఉండి చివరకు జలంధరుడు అత్తిపత్తి మొక్కగా మారతాడు.అందుకని తులసిని అత్తిపత్తి మొక్కను కలసిపెంచి పూజించడం శ్రేష్టదాయకం అనిఉంది.బృహన్నరదియంలో పూర్వం ధర్మదేవుడనే బ్రాహ్మణునికి తులసి బృంద అనే నామంతో భార్యగా ఉండేది.బృంద పతియే ప్రత్యేక్షదైవంగా భావించేది.ధర్మదేవుడు ఋషులను ,మునులను పూజిస్తూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజు ధర్మదేవుడు దైవ ప్రార్ధన చేస్తూ మధ్యాన్న బోజన కాలమైనా ఇంటికి రాలేదు.అతిధులు బోజనానికి వేచి ఉన్నారు. అందుకని బృంద అతిధులను పూజించి వారికి ఆతిధ్యం ఇచ్చి బాగా దాహం అవుతుండటంతో జల పానం(నీరు త్రాగటం) చేసి భర్త రాకకై ఎదురు చూడ సాగింది. కొంతసేపటి తరువాత భర్త ఇంటికి వచ్చి క్షణికావేశంలో జల పానం చేసిన భార్యను రాక్షసివి కమ్మని శపించాడు. బృంద దుఃఖముతో శాపవిమోచన కోరగాఒకవారం దినములు ఆహారంతిసుకోనకుండా ఉంటె శాప విమోచన జరుగు తుందని చెబుతాడు. బృంద రాక్షసిగామారి రాక్షస్వభావంతో మనుషులను,జంతువులను చంపి ఆహారంగా తింటూ ఉంటుంది.కానీ పూర్వజన్మ సృతివల్ల గోవులను హరి భక్తులను ,బ్రాహ్మణుల జోలికి పోకుండా వారిని గౌర విస్తు ఉంటుంది.అలాచాలారోజులు జరిగాక తిరుగుతూ తిరుగుతూ కైలాసం వస్తుంది.
అక్కడ అంతా హరిహర భక్తులే.చెట్లు,జంతువులుకుడా హరినామం జపిస్తూ ఉంటాయి.అక్కడ ఏమి తినలేక వారంరోజులు పస్తు ఉంటుంది.శాపనియమానుసారం ఒకవనంలో దేహం చాలిస్తుంది. శివుడు పార్వతి ఒక సంవత్సరం తరువాత ఆ వనమునకు పోగా అక్కడ బృంద శరీరము వింత కాంతులు వెలయిస్తూ ఉంటుంది.అప్పుడు శివుడు పార్వతితో "ఈ దేహంలో ద్వాదశాక్షరి అణువణువునా కనిపిస్తున్నది.కావున ఈ దేహం వృధా పోరాదు .భూలోకంలో గొప్ప వృక్షరాజంగా వెలసి విష్ణుమూర్తికి ప్రియమైనదిగా పూజలందు కుంటుందని వరం ఇచ్చాడు.ధర్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రార్ధించగా తులసి చెట్టు వేరుగా ఉండమని వరం ఇచ్చాడు. శివకేశవులు తులసి ఆవిర్భావాన్ని భూలోకంలో చూచారు. అప్పుడు విష్ణు మూర్తి తులసితో ఒతులసి!నివు స్త్రీలలో ఉత్తమురాలివి సూర్య,చంద్రులు ఉన్నంతవరకు నివు నిలిచేఉంటావు. నాపుజకు నీ దళాలే శ్రేష్టమయినవి.నీకు ప్రదక్షిణం చేస్తే భుప్రదక్షిణం చేసినట్లే.కార్తిక మాసంలో కాని మాఖ మాసంలో కానినిపత్రాలతోనన్నుపూజిస్తేసహస్రగోదానఫలితదక్కుతుంది.

దారిద్ర్యాన్ని దహనం చేసే స్తోత్రం

Mounting created Bloggif

1. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ
శశిశేఖర ధారణాయకర్పూరకాన్తి ధవళాయ
జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

 2. గౌరిప్రియాయ రజనీశ కళాధరాయకాలాన్తకాయ
భుజగాధిప కంకణాయగంగాధరాయ
గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

3. భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ
దుఃఖ భవసాగర తారణాయజ్యోతిర్మయాయ
గుణనామ సునృత్యకాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

4. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయఫాలేక్షణాయ
మణికుండల మండితాయమంజీరపాదయుగళాయ
జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

5. పంచాననాయ ఫణిరాజ విభూషణాయహేమాంకుశాయ
భువన త్రయమండితాయఆనంద భూమి వరదాయ
తమోపయాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

 6. భానుప్రియాయ భవసాగర తారణాయకాలాన్తకాయ
కమలాసన పూజితాయనేత్రత్రయాయ
శుభలక్షణ లక్షితాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

7. రామప్రియాయ రఘునాథ వరప్రదాయనాగప్రియాయ
నరకార్ణవ తారణాయపుణ్యాయ పుణ్యభరితాయ
సురార్చితాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ

 8. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయగీతప్రియాయ
వృషభేశ్వర వాహనాయమాతంగచర్మ వసనాయ
మహేశ్వరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ.

శివుని సహస్రనామాలు

Mounting created Bloggif


1    స్థిరః = సర్వకాలాలలో నిలకడగా వుండేవాడు,
2    స్థాణుః = ప్రళయకాలములలో ఉండేవాడు,
3    ప్రభుః = సమస్తమునకు అధిపతి,
4    భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
5    ప్రవరః = సర్వశ్రేష్టుడు,
6    వరదః = వరాలనిచ్చువాడు,
7    సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
8    సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
9    సర్వః = సమస్తము తానేఅయినవాడు,
10    సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
11    భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
12    జటీ = జడలు ధరించినవాడు,
13    చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
14    శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
15    సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
16    సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
17    హరః = సమస్త పాపములను హరించువాడు,
18    హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
19    సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
20    ప్రభుః = అధిపతి,
21    ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
22    నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
23    నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
24    శాశ్వతః = నిత్యమైనవాడు
25    ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
26    శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
27    భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
28    ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
29    అగోచరః = కంటికి కనిపించనివాడు,
30    అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
31    అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
32    మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
33    తపస్వీ = తపస్సుచేయువాడు,
34    భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
35    ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
36    సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
37    మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
38    మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
39    వృష రూపః = పుణ్య స్వరూపుడు,
40    మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
41    మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
42    సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
43    శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
44    మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
45    లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
46    అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
47    ప్రసాదః = అనుగ్రహించువాడు,
48    నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
49    పవిత్రం = పరిశుద్ధమైన,
50    మహాన్ = గొప్పవాడు,

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం

 బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం
Ramudu Thota Venkataramana's photo.

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం
1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్
 2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైఃతవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ 
3. సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్
 4. నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ 
5. అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
 6. త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్ 
7. త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్
 8. గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్ 9. 
శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్
 10. సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్ 
11. శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్హిరణ్యబాహుం సేనాన్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ 
12. అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవమ్జ్యేష్టం కనిష్ఠం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్
 13. హరికేశం సనన్దీశమ్ ఉచ్ఛైర్ఘోషం సనాతనమ్అఘోరరూపకం కుంభమ్ ఏక బిల్వం శివార్పణమ్
 14. పూర్వజావరజం యామ్యం సూక్ష్మ తస్కరనాయకమ్నీలకంఠం జఘంన్యంచ ఏక బిల్వం శివార్పణమ్
 15. సురాశ్రయం విషహరం వర్మిణం చ వరూధినమ్మహాసేనం మహావీరమ్ ఏక బిల్వం శివార్పణమ్
16. కుమారం కుశలం కూప్యం వదాన్యఞ్చ మహారధమ్తౌర్యాతౌర్యం చ దేవ్యం చ ఏక బిల్వం శివార్పణమ్
 17. దశకర్ణం లలాటాక్షం పఞ్చవక్త్రం సదాశివమ్అశేషపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్

నీలకంఠం జగద్వంద్వం దీననాథం మహేశ్వరo
మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం 18
చూడామణీకృత విధుల వలయీకృత వాసుకిం
కైలాస నిలయం భీమం ఏకబిల్వం శివార్పణం 19
కర్పూర కుంద ధవళం నరకార్ణవ తారకం
కరుణామృత సింధుం చ ఏకబిల్వం శివార్పణం 20
మహాదేవం మహాత్మానం భుజంగాధిప కంకణం
మహాపాప హరం దేవం ఏకబిల్వం శివార్పణం 21
భూతేశం ఖండ పరశుం వామదేవం పినాకినం
వామే శక్తిధరం శ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం 22
ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం
నీలలోహిత ఖట్వాంగం ఏకబిల్వం శివార్పణం 23
కైలాస వాసినం భీమం కఠోరం త్రిపురాంతకం
వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం 24
సామప్రియం సర్వమయం భస్మోద్ధూళిత విగ్రహం
మృత్యుంజయం లోకనాథం ఏకబిల్వం శివార్పణం 25
దారిద్య్ర దు:ఖ హరణం రవిచంద్రానలేక్షణం
మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం 26
సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం
నిర్మలం నిర్గుణాకారం ఏకబిల్వం శివార్పణం 27
సర్వతత్త్వాత్మకం సాంబం సర్వ తత్త్వ విదూరకం
సర్వతత్త్వ స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం 28
సర్వలోక గురుం స్థాణుం సర్వలోక వరప్రదం
సర్వలోకైక నేత్రం చ ఏకబిల్వం శివార్పణం 29
మన్మథోద్ధరణం శైవం భవం భర్గం పరాత్మకం
కమలాప్రియ పూజ్యాం చ ఏకబిల్వం శివార్పణం 30
తెజోమయం మహా భీమం ఉమేశం భస్మలేపనం
భవరోగ వినాశం చ ఏకబిల్వం శివార్పణం 31
స్వర్గాపవర్గ ఫలదం రఘునాథ వరప్రదం
నగరాజ సుపాక్రాంతం ఏకబిల్వం శివార్పణం 32
మంంజీర పాదయుగళం కుంభలక్షణ లక్షితం
ఫణిరాజ విరాజం చ ఏకబిల్వం శివార్పణం 33
నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం
తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివార్పణం 34
సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరం
సర్వ లోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణం 35
చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం
నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం 36
రత్నకంచుక రత్నేశం రత్నకుండలమండితం
నవరత్న కిరీటం చ ఏకబిల్వం శివార్పణం 37
దివ్య రత్నాంగుళీ కర్ణ కంఠాభరణ భూషితం
నానారత్నం మణిమయం ఏకబిల్వం శివార్పణం 38
రత్నాంగుళీయ విలసత్‌ కరశాఖ నఖప్రభం
భక్త మానస గేయం చ ఏకబిల్వం శివార్పణం 39
వామాంగభాగ విలసత్‌ అంబికావీక్షణ ప్రియం
పుండరీక నిభాక్షం చ ఏకబిల్వం శివార్పణం 40
సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేష్ట ఫలకారణం
సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం 41
నానాశాస్త్ర గుణోపేతం శుభమంగళ విగ్రహం
విద్యావిభేద రహితం ఏకబిల్వం శివార్పణం 42
అప్రమేయ గుణార్రం వేదకృద్రూప విగ్రహం
ధర్మాధర్మ ప్రవృత్తం చ ఏకబిల్వం శివార్పణం 43
గౌరీ విలాసం సదనం జీవ జీవ పితామహా
కల్పాంత భైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం 44
సుఖదం సుఖనాశం చ దు:ఖదం దు:ఖనాశనం
దు:ఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం 45
సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదం
అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం 46
సర్వపక్షి మృగాకారం సర్వ పక్షి మృగాధిపం
సర్వపక్షి మృగాధారం ఏకబిల్వం శివార్పణం 47
జీవాధ్యక్షం జీవం వంద్యం జీవం జీవనం రక్షకం
జీవకృజ్జీవ హరణం ఏకబిల్వం శివార్పణం 48
విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మా వజ్రహస్తకo
వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం 49
గణాధిపం గణాధ్యక్షం ప్రళయానల నాశకం
జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం 50
త్య్రయంబకం హృతం శూరం అరిషడ్వర్గ నాశకం
దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం 51
కుందేందు శంఖ ధవళం భగనేత్ర బిదుజ్జ్వలం
కాలాగ్ని రుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం 52
కంబుగ్రీవం కంబుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకం
శార్దూల చర్మవసనం ఏకబిల్వం శివార్పణం 53
జగదుత్పత్తి హేతుం చ జగత్‌ ప్రళయ కారణం
పూర్ణానంద స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం 54
సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణ కీర్తనం
బ్రహ్మాండ నాయకం తారం ఏకబిల్వం శివార్పణం 55
మందార మూల నిలయం మందారకుసుమ ప్రియం
బృందారక ప్రియతరం ఏకబిల్వం శివార్పణం 56
మహేంద్రియం మహాబాహుం విశ్వాస పరిపూరకం
సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణం 57
బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం 58
యుగాకారం యుగాధీశం యుగకృద్యుగ నాశకం
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం 59
ధూర్జటిం పింగళజటం జటామండల మందిరం
కర్పూర గౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం 60
సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవం
యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం 61
ఉత్తమానుత్తమం తత్త్వం అంధకాసుర సూదనం
భక్త కల్పద్రుమ స్తోమం ఏకబిల్వం శివార్పణం 62
విచిత్ర మూల్య వసనం దివ్యచందన చర్చితం
విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏకబిల్వం శివార్పణం 63
కుమారం పితరం దేవం సితచంద్ర కలానిధిం
బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం 64
లావణ్య మధురాకారం కరుణారస వారిధిం
భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణం 65
జటాధరం పావకాక్షం ఋక్షేశం భూమినాయకం
కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణం 66
శివం శాంతం ఉమానాథం మహాధ్యాన పరాయణం
జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం 67
వాసుక్యురగహారం చ లోకానుగ్రహ కారణం
జ్ఞానప్రదం కృత్తివాసం చ ఏకబిల్వం శివార్పణం 68
శశాంకధారిణం భర్గం సర్వలోకైక శంకరం
శుద్ధం చ శాశ్వతం చ నిత్యం ఏకబిల్వం శివార్పణం 69
శరణాగత దీనార్తి పరిత్రాణ పరాయణం
గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణం 70
భోక్తారం భోజనం బోజ్యం జేతారం జితమానసం
కరణం కారణం జిష్ణు ఏకబిల్వం శివార్పణం 71
క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనం
వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం 72
భవఘ్నం తరుణోపేతం క్షోధిష్ఠం యమనాశకం
హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం 73
దక్షం చాముండ జనకం మోక్షదం మోక్షకాయం
హిరణ్యగర్భం హేమరూపం ఏకబిల్వం శివార్పణం 74
మహాశ్మశాన నిలయం ప్రచ్ఛన్న స్ఫటిక ప్రభం
వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం 75
స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యంచాశ్రయం విభుం
జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం 76
రుద్రాక్షమాలా భరణం రుద్రాక్ష ప్రియవత్సలం
రుద్రాక్ష భక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం 77
ఫణీంద్ర విలసత్‌ కంఠం భుజంగాభరణ ప్రియం
దక్షాధ్వర వినాశం చ ఏకబిల్వం శివార్పణం 78
నాగేంద్ర విలనిత్‌ కర్ణం అహీంద్ర వలయావృతం
మునివంద్యం మునిశ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం 79
భోక్తారం భోజనం బోజ్యం జేతారం జితమానసం
కరణం కారణం జిష్ణు ఏకబిల్వం శివార్పణం 71
క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనం
వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం 72
భవఘ్నం తరుణోపేతం క్షోధిష్ఠం యమనాశకం
హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం 73
దక్షం చాముండ జనకం మోక్షదం మోక్షకాయం
హిరణ్యగర్భం హేమరూపం ఏకబిల్వం శివార్పణం 74
మహాశ్మశాన నిలయం ప్రచ్ఛన్న స్ఫటిక ప్రభం
వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం 75
స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యంచాశ్రయం విభుం
జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం 76
రుద్రాక్షమాలా భరణం రుద్రాక్ష ప్రియవత్సలం
రుద్రాక్ష భక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం 77
ఫణీంద్ర విలసత్‌ కంఠం భుజంగాభరణ ప్రియం
దక్షాధ్వర వినాశం చ ఏకబిల్వం శివార్పణం 78
నాగేంద్ర విలనిత్‌ కర్ణం అహీంద్ర వలయావృతం
మునివంద్యం మునిశ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం 79
మృగేంద్ర చర్మ వసనం మునీనా మేక జీవనం
సర్వ దేవాది పూజ్యం చ ఏకబిల్వం శివార్పణం 80
నిధనేశం ధనాదీశం అపమృత్యు వినాశనం
లింగమూర్తి మలింగాత్మం ఏకబిల్వం శివార్పణం 81
భక్త కల్యాణదం వ్యస్తం వేదవేదాంత సంస్తుతం
కల్పకృత్‌ కల్పపాశ చ ఏకబిల్వం శివార్పణం 82
ఘోర పాతక దావాగ్నిం జన్మ కర్మ వివర్జితం
కపాల మాలా భరణం ఏకబిల్వం శివార్పణం 83
మాతంగ చర్మ వసనం విరాడ్రూప విదారకం
విష్ణుక్రాంత మనంతం చ ఏకబిల్వం శివార్పణం 84
యజ్ఞకర్మ ఫలాధ్యక్ష యజ్ఞ విఘ్న వినాశనం
యజ్ఞేశం యజ్ఞ భోక్తారం ఏకబిల్వం శివార్పణం 85
కాలాధీశం త్రీకాలజ్ఞం దుష్టం నిగ్రహ కారకం
యోగి మానస సంపూజ్యం ఏకబిల్వం శివార్పణం 86
మహోన్నతం మహాకాయం మహోదర మహాభుజం
మహావక్త్రం మహా వృద్ధం ఏకబిల్వం శివార్పణం 87
సునేత్రం సులలాటంచ సర్వ భీమ పరాక్రమం
మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణం 88
సమస్త జగదాధారం సమస్త గుణ సాగరం
సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం 89
మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురో:
దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం 90
తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే
ప్రదోష కాలే పూజాయం ఏకబిల్వం శివార్పణం 91
తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం 92
దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం 93
తులసీ- బిల్వ- నిర్గుండీ - జంబీ రామలకం తథా
పంచబిల్వ మితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం 94
అఖండ బిల్వ ప్రత్రైశ్చ పూజయే
ముచ్యతే సర్వపాపేభ్య: ఏకబిల్వం శివార్పణం 95

http://tvramudu.blogspot.com/పంచామృతo

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో " నాధా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమ"ని అడుగగా పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు
కాళ్ళ యందు - సమస్త పర్వతములు
భ్రూమధ్యమున - గంధర్వులు
దంతముల యందు - గణపతి
ముక్కున - శివుడు
ముఖమున - జ్యేష్ఠాదేవి
కళ్ళయందు - సూర్య చంద్రాదులు
చెవుల యందు - శంఖు చక్రములు
కంఠమునందు - విష్ణుమూర్తి
భుజమున - సరస్వతి
రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు
తోక యందు - చంద్రుడు
చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.

అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను , అష్టైశ్వర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది."

స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష !!

శ్రీపరమేశ్వర మాతృ కావర్ణ మాలా స్తోత్రం

శ్రీపరమేశ్వర మాతృ కావర్ణ మాలా స్తోత్రం

శ్రీపరమేశ్వర మాతృ కావర్ణ మాలా స్తోత్రం
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత పాద శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఉరగాది ప్రియ భూషణ శంకర, నరక వినాశ నటేశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఊర్జత దానవ నాశ పరాత్పర, ఆర్జత పాప వినాశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఋగ్వేద శ్రుతిమౌళీ విభూషణ రావిచంద్రాగ్ని త్రినేత్ర శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఋపమనాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్త్వశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

లింగ స్వరూప సర్వబుధ ప్రియ మంగళ మూర్తి మహేశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

అలుతాధశ్వర రూపప్రియశివ, వేదాంత త్రయ వేద్య శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఏకానేక స్వరూప విశ్వేశ్వ, యోగి హృది ప్రియావాసశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఐశ్వర్యశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంద మహేశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఔర సలాలిత అంత కనాశన గౌరి సమేత గిరీశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

అంబర వాస చిదంబర నాయక, తుంబుర నారద సేవ్యశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఆహార ప్రియ అది గిరీశ్వర, భోగాది ప్రియ పూర్ణశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఖడ్గ శూలమృగ డక్కాద్యాయుధ విషమరూప విశ్వేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఘాతక భంజన పాతక నాశన, గౌరీ సమేత శరీర శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

జ్ఞాపిత శ్రుతి రమౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

చండ వినాశన సకలజన ప్రియ మండలధశ మహేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఛత్ర కిరీట సుకుండల శోభిత పుత్ర ప్రియ భువనేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

జన్మ జరామృతినాశన కల్మషర హిత పాపవినాశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఝంకారాశ్రయ భ్రుంగిరిటి ప్రియ, ఓంకారేశ మహేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

జ్ఞానాజ్ఞానా వినాశక నిర్మదీనజన ప్రియదీప్త శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

టంకాదాగ యుధ ధారణ సత్వర హ్రీంకారాది సురేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

టంక స్వరూప సహకారోత్తమ యోగీశ్వర పరదేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

డంబ విదారణ డిండి మభూషణ, అంబర వాన చిదీశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

డం డం డమరుక ధరణీ నిశ్చల డుంటి వినాయక సేవ్యశివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

నళిన విలోచన నటన మనోహర అతులిత భూషణ అమృత శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

తత్త్వమసీతితి వాక్య స్వరూపక నిత్యానంద మహేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

స్థావర జంగమ భువన విలక్షణ భావుక మునివర సేవ్య శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

దుఃఖ వినాశన దళిత మనోన్మన చందన లేపిత చరణ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ధరణీ ధర శుభ ధవళ విభాస్వర ధనదాది జ్రీయదాన శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

నానాసుగుణ విభూషణ నిర్గుణ నటన జన ప్రియనాట్య శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

పన్నగ భూషణ పార్వతినాయక, పరమానంద పరేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ఫాలవిలోచన భానుకోటి ప్రభ హాలాహలధర అమృత శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

బంధ వినాశన బృందీ శామర స్కందాది ప్రియజనక శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

భస్మవిలే పన భవభయ నాశన, విస్మయరూప విశ్వేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

యతిజన హృదయ నివాసిత ఈశ్వర, విధ్వష్ణ్వాది సురేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

రామేశ్వర రమణీ యముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసిత శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

వరదాభయకర వాసుకి భూషణ వన మాలాది విభూష శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం
శాంత స్వరూప జగత్రయ చిన్మయ, కాంతిమతి ప్రియకనక శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

సంసారార్ణ వనాశన శాశ్వతః సాధుహృది ప్రియావాస శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

హర పురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

ళాళిత భక్త జనేశ నిజేశ్వర కాళివటేశర శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

క్షర రూపాది ప్రియాన్విత సుందర, సాక్షి జగత్త్రయ సాంబ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం!!
 

Tuesday, August 5, 2014

శివానందలహరి1..


 శివానందలహరి
శివానందలహరి1..
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. 

#ఓం నమఃశివాయ
శివశక్తే నమస్తుభ్యం
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥
శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.

గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥
శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!

మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥
చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు. ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.