ఆదిలోక పరమాత్ముడు విఘ్నేశ్వరుడు..
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!!"
మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.
వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.
భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు

ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వరస్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. #వక్రతుండ: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.

విఘ్నేశ్వరుడు - గుంజీలు
ఏ కార్యం తలపెట్టినా మనం విఘ్నేశ్వరుని ముందు తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే, అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆదిదైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణాపత్యులని అంటారు.
వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం సంస్కృతంలో దానిని ’దోర్బి"కర్ణమని అంటారు. దోర్బి అంటే చేతులు. కర్ణమంటే చెవులు. దోర్బి కర్ణమంటే చేతులతో చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీయటం. ఒకప్పుడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహావిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. ఈవిచిత్ర చర్యకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. చిన్నబిడ్డ కదా! సుదర్శన చక్రం విషయం మరచిపోయాడు! అంతటితో అమ్మయ్యా అని చక్రంతోబాటు విష్ణువు బయటపడ్డాడు.
ఏకార్యమైనా అవిఘ్నంగా జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. అందుకే ఆయనకు ’యం నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.
శ్రీ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే ||
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||