సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, January 10, 2014

గౌరీపతి{నటరాజు}శివతాండవం,మంకణ మహర్షి కథ-శ్రీ శివ మహాపురాణము,అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు{పాణిని మహర్షి}

 గౌరీపతి{నటరాజు}

శివతాండవం

ఏమానందము భుమీతలమున !
శివతాండవమట ! శివలాస్యంబట !
అలలై , బంగారు
కలలై ,పగడపు( బులు(గులవలె మ
బులు విరిసినయవి
శివతాండవమట ! శివలాస్యంబట !
వచ్చిరొయేమొ! వి
యచ్చర కాంతలు
జలదాంగనలై విలోకించుటకు
శివలాస్యంబట !
యేమానందము భుమీతలమున !
పలికెడునవె ప
క్షులు ప్రా(బలుకులొ !
కల హైమావతీ
విలసన్నూపుర
నినాదములకు
న్నునుకరణంబులొ !
కొమ్మల కానం
దొత్సాహమ్ములు
మమ్మరముగ మన
ముల(గదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు
రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును !
హైమావతీ కుసు
మాలంకారము లందున ( దానొక
టౌదు నటించునొ !
లలితా మృదు మం
జులమగు కాయము
పూవుల తాకుల
తో వసివాడెదో ! భారతియుట పా
ర్వతికి నలంకా
రము(దీర్చెడునది!
రమణీయాస్మిత ముల( గావించెనొ
యలరులు మృదువులు !
చతురానును(డే
సవదరించునట శర్వనకుత్తమ
సర్పవిభూషులు !
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులు గా( ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీరి తాబ్జు(డగు
శివునకు సేవలు
జెల్లించుటకై

తకఝుం తకఝుం
తకదిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ వెల(బడి
నృత్యమాడు నెడ
లయానుగతి(గ
మ్రమ్ముగా శ్రుతి(బ
టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు
ఈ సెలకన్నెల కెవ్వరు జెప్పిరొ!
యా సర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళ్లులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్లాడ(గ
నసమున (బరుగిడు
ఓ హో హో హో !
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున !
సంధ్యాసతి ! యీ
సంభ్రమ మేమిటె !
నవకుసుంభరా
గవసనమేమిటె !
ఆకుంచిత తి
ర్యక్రపసారి ల
జ్జామధుర కటా
క్షపాతమేమిటె !
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి ! నీ
వునువలెనే చిఱు
పలుకని మేఖిల
వాలక మేమిటె !
యెవ్వరికోసర మీబిబ్బోకము !
శివపూజకో ! యో
చెలువా ! యీ కధ
లెవ్వరు జెప్పిరె ?
యిలాతలంబే
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరు(
డో దినమణి !నిలు
రా ! దినమింతయు(
బడమటీ దేశపు
వారలకీ కధ
నెఱిగించుటకై
పరుగెత్తెదవో !
అల మృగములు క
న్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు !
విశ్వేశ్వరునకు
అడుగులుగడుగుట
కై పాద్యంబో !!!
గుసగుసమని యీ
కిసలయములు స
మందపూరముగా
మాటలాదునెదొ!!!
యేమున్నది! లో కేశ్వరునాత్యమే
ఓ హో హో హో
ఊహాతీతం
బీయానందం
బిలాతలంబున!!!
  1. నటరాజు నామవాచకం. వ్యుత్పత్తి. నాట్యములో రాజు-- శివుడు
నటరాజు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి.కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది. ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి. ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది.

శివాలయాలలో "వ్యాకరణ దాన మండప మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :

 నటరాజు

                                       "నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం"
"అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. 
నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది.
నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్యమాడుతూన్నంతసేపూ ఆ జడలు కూడ తిరుగుతూంటాయి. నర్తనమాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు.
నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండేవాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ""ననాదఢక్కాం అన్న మాటకిదే అర్థం.
వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి.
చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ""చోపు అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (""నృత్తావసానే) చోపు ధ్వని వినబడింది.
నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థా్యన్ని ""దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు వన్నారు.
సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది బుుషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనత్‌ కుమార,సనత్సుజాతులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ బుుషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ""శివభక్తి సూత్రాలంటారు. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.
నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ""అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ""అష్టాధ్యాయి  అంటారు.
అ పధ్నాలుగు సూత్రాలనీ ""మహేశ్వర సూత్రాలు అంటారు.
    సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

 శివ మహాపురాణము

శౌనకాది మహర్షులు కోరికమేరకు, శివుడు నటరాజు మూర్తిగా మారుటకు ప్రేరకుడైన మంకణ మహర్షిలవారి కథ చెప్పాడు సూత పౌరాణికుడు.

"ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్తసారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే, శివజ్ఞానం తపస్సిద్ధిగా కలుగుతుంది. అది తెలుసుకున్న పరమశివభక్తుడు మంకణ మహాముని మహర్షుల ఉపదేశానుసారం, అతీర్థాన్ని చేరి, స్నానమాచరించి, ఆవొడ్డునే తపోనిష్ఠలో మునిగి పోయాడు. పంచాక్షరీజపం (ఓం నమశ్శివాయః)తో అతని శరీరం సూర్యసమాన తేజోవిరాజితం కాసాగింది. క్రమంగా భక్తిపారవశ్యంలో తాండవంచేయ సాగాడా మహర్షి. అంతటి భక్తికి మెచ్చి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ - మంకణుడు తాండవం ఆపడే!? శివుడు ఆమహర్షిని ఆపడానికి ప్రయత్నించి, ప్రశ్నలవర్షం కురిపించాడు ఎవరికోసం నీతపం? ఈ తాండవం ఏమిటి? నీ కోరిక లేమిటి? దేనికీ జవాబు చెప్పడాయె ముని. తాండవం ఆపడు.

దాంతో శివుడు ఉగ్రుడై - సహస్రశిర, కర, చరణ, సహస్రనేత్రాది విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతో బాటూ ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దాంతో అతడికి జ్ఞానోదయం కలిగి "మహా నటరాజమూర్తి! శరణు! శరణు!" అంటూ సాష్టాంగ దండప్రణామం ఆచరించాడు. అంతట శివుడు శాంతించి, విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీమూర్తి కూడా అంతర్హితురాలైంది.

మంకణుడు ఆయనకు నమస్కరించి, "దేవాధిదేవా! మహాశివా! ఈ మహాతాండవమేమిటి? ఇంతవరకు మీ పక్కన నిలిచిన ఆ దేవీమూర్తి ఎవరు?" అని ప్రార్ధించగా "ఇది పరమేశ్వరుని దివ్యరూపం ! ఆ దివ్య మూర్తిని నేనే! నాతో ఉన్న దేవి ప్రకృతిరూపిణి. బ్రహ్మరూపుడనై నేను సకల చరాచరాలను పంచవింశతి (ఇరవైఐదు) తత్త్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణుల యందూ నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈతత్త్వం గ్రహించి, భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుజ్యంపొందు" అని ఆనతిచ్చాడు పరమశివుడు.

కనుక - లింగరూపుడైనా, అర్థనారీశ్వరుడయినా, నటరాజు అయినా అంతా శివమయమే!" అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు.

బ్రహ్మ, తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరితుడై తన దేహాన్ని అర్థనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా (మధనం లోంచి) స్వాయం భువ మనువు పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంధానం గావించాడు బ్రహ్మ. వీరివల్ల వరుసగా వారికి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు సంతానమై జన్మించారు. వీరిలో మూడవస్త్రీ సంతానమైన ప్రసూతిని దక్షప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. 'సతీ'దేవిగా - జ్యేష్ఠురాలిగా పార్వతి జన్మించింది - ఈ దక్షునికే. అయితే ఈయన మరొకభార్య అయిన వీరిణి (అసిక్నీ) యందు సతీదేవిగా పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది.


మన్మధుణ్ణి ప్రేరేపించి, రెండుసార్లు తపోనిష్ఠా గరిష్ఠుడై వున్న శివునిమీదికి దండయాత్ర చేయించి పరాభూతుడైవున్న బ్రహ్మ, ఏం చెయ్యాలాఅని చతుర్ముఖాలతోనూ ఎన్నెన్నో చతురోపాయాలు వెతికాడు. ఏవీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక, నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచినదే తడువుగా ప్రత్యక్షమై "కుమారా! ఏమిటి నీకొచ్చిన కష్టం?" అని అరాతీశాడు - ఎంతో వాత్సల్యంగా.

జరిగిందంతా వివరంగా చెప్పి "ఏది ఏమైనా సరే! అ కాలకంఠుని కాంతాదాసునిగా చెయ్యాలి. కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి" అని వేడుకున్నాడు.

"ఇంతేకదా! ఇదేమంత గొప్పసంగతి? గతంలో ఓసారి రుద్రుడు తన పుర్ణావతారం అనీ, తనతోపాటు చరించే మాయను 'సతీ' భావంతో గ్రహించి రుద్రాణిని చేస్తానని అన్నాడు కదా! ఇదంతా మన సంకల్పం కాదు! ఆ పరమమాహేశుని సంకల్పమే! నువ్వు ఆ పరాంబికను వేడుకుని, సతిగా అవతరించమని కోరు. అలాగే - దక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు!" అంటూ ఉపదేశించి అంతర్థానమయ్యాడు శ్రీహరి.


దక్షుడిని రప్పించాడు పరమేష్టి. "జగన్మాతయైనట్టి మహామాయ గూర్చి తపస్సు చేసి, నీ కుమార్తెగా అవతరించమని కోరుకో!" అని అదేశించి, తానుకూడా ఆ జగజ్జననిని ప్రార్థించాడు - ప్రజాపతి.

అమ్మవారు ప్రత్యక్షమై, శివసంకల్పాన్ని ఆకళింపు చేసుకుని బ్రహ్మ కోరిన విధంగా - శివదీక్షకు మంగళాంతం చెప్పించి, తాను అతని పత్నిగా అవతరించ నిర్ణయించుకుంది సర్వమంగళ. బ్రహ్మకు అభయ ప్రదానం చేసి, అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందనీ - అదే తనకు మహాభాగ్యమనీ బ్రహ్మాదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తథాస్తు! అని ఆమె అంతర్హితురలైంది.

యక్ష రాక్షస గరుడ దంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాలూ ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అని శరణువేడుతాయో, ఆ మహాదేవి పాపగా అవతరించి, దక్షునికిచ్చిన వరం ప్రకారం, 'ఉమ' అనే నామధేయంతో పెరగసాగింది.

ఆమెకు యుక్తవయస్స రాగా, బ్రహ్మాదులందరూ, ఇక శివునిచేత గృహస్థాశ్రమం స్వీకరింపజేసే తరుణం వచ్చిందని తలపోసి - ఉమను శివపంచాక్షరీ మంత్రస్మరణ ద్వారా, సర్వకాల సర్వావస్థల యందూ శివాయత్త చిత్తతతో ఉండమని వేడుకుని, శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు.

దేవతలంతా తమ మానసాన్ని అ పరమశివుని ఎదుటపరిచి, పరిపరి విధాల ప్రార్థించగా, ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారందరూ.

కానీ, శివుడు ఒక షరతు విధించాడు -

తాను నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాననీ; తనను వరించబోయే లలనామణి, ఏనాడూ తన సాధనకు అడ్డుకారాదనీ; తాను కాముకుడిగా సంచరించువేళ మాత్రమే ఆమె కాముకి కావాలనీ; తనకు సానుకూలంగా వర్తిల్లగలిగే పిల్లనే పెళ్లాడగలననీ పరమశివుని వాక్యసారాంశం. సరే నన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయణి విషయాన్ని, శివుని చెవిన వేసి - ఔననిపించుకున్నాక గాని, వారి హృదయాలు తేలికపడలేదు.
 అష్టాధ్యాయి

3.అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు

అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అనెదరు. ఆ గ్రంధమున ఎనిమిది (8)అధ్యాయములు కలవు. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు కలవు.

 4.పాణిని మహర్షి:

సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు            
పాణిని అనే మహర్షి వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణం గ్రంథం. ఈయన క్రీ.పూ. 7వ శతాబ్దికి చెందినవాడు. మాహుర్ అనే పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతమిది పాకిస్థాన్లో ఉంది. ఇతడు పుట్టుకతోనే తెలివైన వాడు కాదట. మందమతిగా ఉండేవాడు. తండ్రి ఇతనిని విద్యాభ్యాస నిమిత్తం గురుకులంలో చేర్పించాడు. మందమతి కావడం వల్ల చదువొచ్చేది కాదు. అతనిని భరించలేక, అతడి వల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతారని గురువుగారు అతడిని ఆశ్రమం నుండి పంపిచేశారు. అతడు బాధతో ఇంటికి వెళ్ళక హిమాలయాలకు పోయి శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శివ దర్శనం అయి ఆయన 14సార్లు మ్రోగించిన ఢమరుక నాదము అతడికి 14 సూత్రాలుగా వినిపించాయి. దానితో అతడు కావ్య రచన చేశాడు. అలా అతడు వ్రాసినదే అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణ గ్రంథం. 

Thursday, January 9, 2014

గంగాధరుడు

 గంగాధరుడు

గంగను ధరించిన వాడు..... శివుడు.
గంగ + ధరుడు=గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.
గంగాదేవి హిమవంతుని పెద్దకూతురు. (చిన్న కూతురు - పార్వతి). భగీరథుడు గంగను భువికి తరలించే ప్రయత్నంలో శివుని జటలలో చిక్కుకొనుటవలన, శివున్ని గంగాధరుడు అంటారు. కొందరు కవులు, గంగా-శంకరుల సమాగముగా వర్ణిస్తారు. ఈవిధంగా గంగ, శివుని రెండవ ఇల్లాలు అని ఒక భావం.

 శివుని జటాజూటములలో చిక్కుబడినపిమ్మట, భగీరథుని ప్రార్థనమేరకు గంగను బిందు సరోవరంలోనికి విడుస్తాడు. అక్కడనుంచి గంగ 7 అంశలతో (పాయలతో) ప్రవహిస్తుంది. హ్లాదిని, పావని, నళిని (బ్రహ్మపుత్ర) పాయలు తూర్పు ముఖముగా; సుచక్షు, సీత, సింధు పశ్చిమాభిముఖముగా; ఏడవపాయ భగీరథున్ని అనుసరిస్తాయి. భగీరథున్ని అనుసరించిన సప్తమి మార్గమధ్యమున జహ్నుమహర్షి యఙ్ఞశాలను ముంచేస్తుంది. కృద్ధుడైన మహర్షి భాగీరథీ జలమంతటినీ మ్రింగేస్తాడు. భగిరథుని, దేవతల ప్రార్థన మేరకు చెవుల ద్వారా గంగని విడుస్తాడు. ఈ విధంగా గంగ, జాహ్నవిగా సరికొత్త అవతారము ఎత్తినది.

ఈ విధంగా భూమ్మీద నదీ జలాలన్నీ గంగా దేవి స్వరూపాలే.

1.మేన-హిమవంతుల జ్యేష్ట పుత్రిక - శివుని రెండవ ఇల్లాలు.
2.బిందుసరోవరమున పుట్టిన ఏడుగురు అక్కచెల్లెళ్ళు: హ్లాదిని, పావని, నళిని, సుచక్షు, సీత, సింధు, సప్తమి.
3.భగీరథుని పుత్రిక - భాగీరథి (సప్తమి).
4.జహ్ను మహర్షి పుత్రిక - జాహ్నవి.

మహాభారతమున ప్రతీపుని కోడలు, శంతనుని భార్య అయిన గంగ జాహ్నవి. అష్టవసువులను భూమ్మీద జన్మించమని వశిష్టమహర్షి శపించగా, వారు హిమవంతుని పుత్రిక అయిన గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగాపుత్రులుగా జన్మించిన వెనువెంటనే దేహవిముక్తిని కోరతారు. ఎనిమిదవ వసువు ప్రభాసుడు -శాపానికి మూలకారణమైనవాడు కావున, గంగా పుత్రునిగా చిరకాలం జీవిస్తాడు. గంగ జాహ్నవిగా అవతరించిన పిమ్మట, అష్ట వసువులు జాహ్నవీ-శంతనుల పుత్రులుగా జన్మిస్తారు. ప్రభాసుడు దేవవ్రతునిగా (భీష్ముడు) పెరుగుతాడు.

విశ్వనాథాష్టకం - తాత్పర్యం


  గంగాధరుడు
ఆది శంకరులు నుతించిన కాశీ విశ్వనాథుని అష్టకం
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

తాత్పర్యం: ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.  

శ్రీ రుద్ర నమకమ్

శ్రీ రుద్ర నమకమ్

ఓం శారతి శ్శాంతి శ్శాంతిః || 
రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి - లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ఇలా. ఆ నమక చమకాల్లోని నమకం, దాని తాత్పర్యము మీకోసం.
 శ్రీ రుద్ర నమకమ్
శ్రీ రుద్రప్రశ్నః నమకమ్

అథ ప్రథమోఽనువాకః
          
ఓం నమో భగవతే రుద్రాయ

ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః

యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయా

యా తే రుద్ర శివా తనూరఘోరాపాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి

యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్‍ంసీః పురుషం జగత్

శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్‍ం సుమనా అసత్

అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీగ్‍ంశ్చ సర్వాం జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః

అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగలః
యే చేమాగ్‍ం రుద్రా అభితో దిక్షు
శ్రితాః సహస్రశోవైషాగ్‍ం హేడ ఈమహే

అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః

నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః

ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం
యాశ్చ తే హస్త ఇషవః
పరా తా భగవో వప

అవతత్య ధనుస్త్వగ్‍ం సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ

విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్‍ం ఉత
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషన్గథిః

యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః
తయాఽస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ

నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే

పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తం

హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్‍ంశతిశ్చ

ఇతి ప్రథమోఽనువాకః

నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓమ్

అథ ద్వితీయోనువాకః

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో నమో
హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహంత్యాయ వనానాం పతయే నమో

నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః

వనానాం పతయే నమో నమ ఏకాన్నత్రిగ్‍ంశచ్చ

ఇతి ద్వితీయోనువాకః
అథ తృతీయోనువాకః

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః
సృకావిభ్యో జిఘాసద్భ్యో ముష్ణతాం పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తం చరధ్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో
నమః ఇషుమధ్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛధ్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్ధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమ స్తిష్ఠధ్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః

కులు ఞ్చానాం పతయే నమో నమోశ్వపతిభ్య స్త్రీణి చ

ఇతి తృతియోఽనువాకః
అథ చతుర్థోఽనువాకః

నమ ఆవ్యధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృగ్‍ంహతీభ్యశ్చ వో నమో నమో
గృత్సేభ్యో గ్రుత్సపతిభ్యశ్చ వో నమో నమో
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో
గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో
మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
రథిభ్యోరథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యః

రథపతిభ్యశ్చ వో నమో నమః
సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః
క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమ
స్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః
పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ
ఇషుకృద్భ్యో ధన్వకృధ్భ్యశ్చ వో నమో నమో
మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో నమః
శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః

రథేభ్యః శ్వపతిభ్యశ్చ ద్వేచ

ఇతి చతుర్థోఽనువాకః
అథ పంచమోఽనువాకః  

నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్ధ్వనే చ

నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ్ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ

సంవృద్ధ్వనే చ పంచవిగ్‍ం శతిశ్చ

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వజాయ చాపరజాయ చ
నమో మధ్యమాయ చాపగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చావసాన్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ

నమ ఆశుషేణాయ చాశురథాయ చ
నమః శూరాయ చావభిన్దతే చ
నమో వర్మిణే చ వరూథినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ  శ్రుతసేనాయ చ

ప్రతిశ్రవాయ చ పంచవిగ్‍ంతిశ్చ

ఇతి షష్ఠోఽనువాకః
అథ సప్తమోఽనువాకః 

నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశన్తాయ చ

నమః కూప్యాయ చావట్యాయ చ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఈఘ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ

వైశన్తాయ చ త్రిగ్‍ం శచ్చ

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ నమః శంభవె చ మయోభవె చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ  చ శివతరాయ చ

నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చావార్యాయ చ
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమ ఆతార్యాయ చాలాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః
సికత్యాయ చ ప్రవాహ్యాయ చ

శివతరాయ చ త్రిగ్‍ంశచ్చ

ఇతి అష్టమోఽనువాకః
అథ నవమోఽనువాకః

నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్‍ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్‍ంసవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ

నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్‍ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః

ఉలప్యాయ చ త్రయస్త్రిగ్‍ంశచ్చ

ఇతి నవమోఽనువాకః
అథ దశమోఽనువాకః

ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కిన్చనామమథ్

యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే

ఇమాగ్‍ంరుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం
యథా నః శమసధ్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే ఆస్మిన్ననాతురం

మృడా నో రుద్రోతనో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ తే
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ

మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షంత ముత మా న ఉక్షితం
మా నో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్ర రీరిషః

మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః
వీరాన్మా నో రుద్ర భామితోఅవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే

ఆరాత్తే గోఘ్న ఉత్త పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మే తే అస్తు
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నః శర్మ యచ్ఛ ద్విబర్హాః

స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం
మ్రుడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః

పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ

మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం విభ్రదాగహి

వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః
యాస్తే సహస్రగ్‍ం హేతయోఽన్యమస్మన్నివపన్తు తాః

సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హ్తయః
తాసామీశానో భగవః పరాచీనానా ముఖా కృధి

అస్మిగ్గ్‍ం స్తనువ స్తుహి పినాక మేకాన్న త్రిగ్‍ం శచ్చ

ఇతి దశమోఽనువాకః
అథ ఏకాదశోఽనువాకః

సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యాం
తేషాగ్‍ంసహస్రయోజనేఽధన్వాని తన్మసి

అస్మిన్ మహత్యర్ణవేఽంతరిక్షే భవా అధి
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్‍ం రుద్రా ఉపశ్రితాః
యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషంగిణః
య ఏతావంతశ్చ భూయాగ్‍ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే
తేషాగ్‍ంసహస్రయోజనే  అవధన్వాని తన్మసి
నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేఽంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో
నమస్తే నో మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి
తం వో జంభే దధామి

తీర్థాని యశ్చ షట్చ

ఇతి ఏకాదశోఽనువాకః

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్

యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనాఽఽవివేశ
తస్మై రుద్రాయ నమో అస్తు

తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నభోభి ర్దేవమసురం దువస్య

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
అయం మే విశ్వాభేషజోఽయం శివాభిమర్శనః

యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ
నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి

!!ఓం శాంతిః శాంతిః శాంతిః!!

ఇతి శ్రీకృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
తాత్పర్యము:

మొదటి అనువాకము: 

భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక.

రెండవ అనువాకము:

జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు. స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము:

శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

నాలుగవ అనువాకము:

దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

అయిదవ అనువాకము:

సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.

ఆరవ అనువాకము:

అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

ఏడవ అనువాకము:

పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.

ఎనిమిదవ అనువాకము:

ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు

తొమ్మిదవ  అనువాకము:

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.  

పదవ అనువాకము:

పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.

పదకొండవ అనువాకము: 

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
!!ఓం శాంతిః శాంతిః శాంతిః!!

రుద్రుడు

రుద్రుడు :  రుద్ర తెలుగు భాషలో రుద్రుడు (Rudra ; దేవనాగరి: रुद्र) ఈయన గాలి లేదా గాలివాన,వేట తో సంబంధం కలిగిఉన్న ఋగ్వేద కాలపు దేవుడు.
ఈ పేరుని "ది రోరర్",లేదా "ది హౌవ్లర్"గా అనువదించవచ్చు.
రుద్రకి మారుపేరుగా శివ అనే సిద్ధాంతపదం ఉత్పత్తయ్యింది, శివ "దయ" అనే విశేషణం అలాగే మారుపేరు ఘోరా "భయానకం" ని కూడా ధ్వనించే ఋగ్వేదంలోని దేవుడికి సభ్యోక్తిగా వాడబడుతుంది.వేదిక-యుగపు తరువాతి కాలంలో మారుపేరు ఉపయోగం నిజ సిద్ధాంతపదాన్ని మించిపోయింది (సంస్కృత ఇతిహాసాలలో), రుద్ర అన్న పేరు శివ భగవానుడికి పర్యాయపదంగా తీసుకోబడి ఈ రెండు పేర్లు వినిమయంగా ఉపయోగించబడుతున్నాయి.
 రుద్రుడు :

భయంకర  లేదా భయపెట్టెతనానికి మారుపేర్లు 

ఋగ్వేదంలో రుద్రుని పాత్ర భయానక దేవునిగా అతనిని ఘోరా ("భయానక"), లేదా ఉత్త ఆశవు దేవం ("ఆ దేవుడు") అన్న సూచననలలో చూపించడం కనిపిస్తుంది.అతను "భయంకర క్రూర జంతువువలె ఉగ్రత్వం కల" చక్రవర్తి రుద్ర అన్న భావనని ఈ క్రిందివిధంగా క్లుప్తీకరించాడు:
Rudra is thus regarded with a kind of cringing fear, as a deity whose wrath is to be deprecated and whose favor curried.
రుద్రున్ని దయకోసం ప్రార్థించడం, ఇక్కడ ఇతను "సర్వశక్తి రుద్ర, జడతో ఉన్న దేవుడు"గా సూచించబడ్డాడు.
లో రుద్ర విల్లుతోను, వేగంగా వెళ్ళే బాణాలతోనూ విశదికరించబడ్డాడు. ఆర్.జి. భండార్కర్ చెప్పినట్లు ఈ శ్లోకం రుద్ర "స్వర్గానికి, భూమికి మధ్య తిరిగే తెలివైన బాణాలను" వదులుతాడు. ఇది మెరుపుయొక్క నాశనపు శక్తిని సూచిస్తుంది.
రుద్ర వ్యాధులని కలిగించేవాడిగా నమ్మబడతాడు, ప్రజలు వాటినుంచి కోలుకున్నప్పుడు లేదా వాటినుంచి స్వేచ్చ పొందినపుడు అది కూడా రుద్రుని శక్తిగా కొలవబడుతుంది.పిల్లలని వ్యాధులతో భాధించవద్దని మరియు ఊర్లని రోగాలకి దూరంగా ఉంచమని అడగబడతాడు. అతనివద్ద నివారణోపాయాలు కలవని, వైద్యులకే వైద్యుడని, వేలకొద్దీ ఔషధాలనీ కలిగిఉన్నాడని  చెప్పబడింది. ఇది శివుని ప్రత్యామ్నాయ పేరు వైద్యనాథ ని విశదీకరిస్తుంది (నివారణల దేవుడు). 
     "రుద్రాక్ష" అన్న పదం (సంస్కృతం:rudrākşa =రుద్ర +akşa "కన్ను") లేదా "రుద్రుని కన్ను" రుద్రాక్ష చెట్టు ఫలానికి మరియు ఆ విత్తనాలనుంచి తయారుచేసే ప్రార్థన పూసల దండకి రెండింటికీ ఉపయోగిస్తారు

ఋఊగ్వెదశ్లొకాలు రుద్ర గురించిన తొలిమాటలు ఋగ్వేదంలో లభిస్తాయి, ఇందులో పూర్తిగా మూడు శ్లోకాలు ఇతనికి అంకితమివ్వబడ్డాయి. ఋగ్వేదంలో మొత్తం రుద్రకి సంబంధించి డెబ్భయ్-ఐదు సూచనలు కనిపిస్తాయి.

ఏకాదశ రుద్రులు

 రుద్రుడు
ఆయన రుద్రుడు. ఆమె రుద్రాణి. ఆయన శివుడు. ఆమె శివా. ఇద్దరు సమాన ధర్మములు గలవారు. శివ అనగా ముక్తి స్వరూపుడని, మంగళ స్వరూపుడని భావన.
ఈశ్వరునకు రెండు శరీరములు. ఒకటి ఘోర శరీరము. రెండవది శివా శరీరము. ఘోర శరీరము గలవాడు రుద్రుడు.
రుద్ర శబ్దము అనేక విధములుగా నిర్వచించబడినది. ‘‘రుజాం ద్రావణతోరుద్రః’’ సకల రోగహరుడు. భక్తులనుండి జ్ఞాన ప్రతిబంధకము మోహకమగు శక్తిని తొలగించువాడు. శబ్దమును ఇచ్చునట్టి ప్రాణమే రుద్రుడు. చివరకు శుత్య్రనుసారము అగ్నియు, రుద్రుడు ఒక్కటే. ఆ శ్రుతియే ప్రళయకాలమందు సంహారముచె అంతయు రోదనము చేయువాడు గనుక రుద్రుడని నామమని పేర్కొన్నది.
రుద్రుడు మహాదేవుడు. అగ్ని మండలాధిపతి. శివమహాస్తోత్రమునందు ఎనిమిది శ్లోకములలో రుద్రనామ విశదీకరణ చెప్పబడ్డది. ‘విశ్వాధికో రుద్రో మహర్షి’ విశ్వముకన్న మించినవాడు.
శివపూజలయందు నమకము, చమకము రెండు సూక్తములు తప్పక వినియోగించెదరు. రుద్రుని ఘోర శరీరము క్రోధ ప్రధానమైనది. ప్రసన్నత కొరకు నమ శబ్దముతో ‘నమస్తే రుద్ర మన్యవ ఊతోత ఇషవే నమః’’ అని నమకము ప్రారంభమవుతుంది. ప్రథమానం వాకముచే రుద్రుని ప్రసన్నునిగా చేసి, అతని ధనుర్భాణాది సాధనములను కూడ ఉపసంహరింపచేసి, ఎనిమిది అనువాకములచే రుద్రుని విశ్వరూపత్వముచే స్తుతించి నమస్కరించుట. ఈ అనువాకములు నమస్కార మంత్రమలు.
 రుద్రుడు

నమకమందు గల మంత్రములు జప, హోమ అర్చనాదులయందు వినియోగించి, రుద్రత్వమును విడిపించుకుని, శివునిగా మార్చిన పిమ్మట చమకము ‘వాజుశ్చమే’ ప్రారంభింపబడిన పదకొండు అనువాకములు గల మంత్రములు అభీష్ట ఫలము పొందుటకు వినియోగించెదరు. ఏతా వాతా శివార్చనాదుల యందు నమక, చమకములు వినియోగ ప్రాముఖ్యమును, యిందువలన కలుగు ఫలితములను శ్రుతులు బోధిస్తున్నాయి.
నమక చమకములను పూర్తిగా జపాభిషేకములందు చెప్పుట రుద్రమందురు. నమకము పూర్తిగా చెప్పి చమకము ఒక్కొక్క అనువాకము వంతున పదకొండు మారులు చెప్పిన రుద్ర ఏకాదశి అని అందురు.

మొత్తం విశ్వంలో పదకొండు మంది (11) ఏకాదశ రుద్రులు ఉన్నారు. వారు:
  1. మహాదేవ
  2. శివ
  3. మహారుద్ర
  4. శంకర
  5. నీలలోహిత
  6. ఈషణరుద్ర
  7. విజయరుద్ర
  8. భీమరుద్ర
  9. దేవదేవ
  10. భావోద్భవ
  11. ఏకాదశ రుద్రులు
ఈ 11 రుద్రుల యొక్క 11 మంది భార్యలు వీరు:-1 . ధీ దేవి, 2. ధ్రిత్తి దేవి, 3. ఉష్ణ (రసాల) దేవి, 4. ఉమా దేవి, 5. నీయుత్ దేవి, 5. సర్పి దేవి, 7. ఐలా దేవి, 8. అంబికా దేవి, 9. ఐరావతి దేవి, 10. సుధా దేవి మరియు 11. దీక్షా దేవి వరుసగా.

Saturday, January 4, 2014

పరమశివుడు {5పంచభూత స్థలాలు}

పరమశివుడు అనంత రూపుడు అనంతనాముడు. ఈ రూపమునే మహారుద్రు లుగా కొలుచుచున్నారు. అభిషేకనందలి పంచబ్రహ్మ మంత్రములందలి వామదేవుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలుడు, కలవికరణుడు, జలవికరణుడు, బలుడు, బలప్రమథనుడు, సర్వభూతదమనుడు, మనోన్మనుడు ఏకాదశ రుద్రులే . 
చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

                                    " అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 
                                     అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా"!! 
 తిరువణ్ణామలై
 తిరువణ్ణామలై తిరువణ్ణామలై  లో పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు గా వెలిసాడు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ అగ్ని లింగం రూపం లో దర్శనమిస్తాడు


 లింగం రూపం
అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
                                    " అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 
                                     అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా"!! 
శ్రీ కాలాహస్తిపూర్వము సర్వేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మను పిలిచి కైలాసమును సృష్టించమని ఆజ్ఞాపించగా బ్రహ్మ కైలాసమును సృష్టించు సమయమున తత్తరపాటు చెందిన కారణాంగా కైలాసములోని కొంత భాగము భూమిపై పడినదట. ఆ భాగమే దక్షణకైలాసముగా పిలవబడుచున్న శ్రీకాళహస్తి క్షేత్రమైనది.
చారిత్మాక ప్రాశస్త్యం..
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను  శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు.
 శ్రీకాలాహస్తి
శ్రీకాళహస్తి పట్టణం చిత్తూర్ జిల్లలో ఆంధ్ర ప్రదేశ్ రాస్త్ర్హం లోనిది.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు కేవలం 40 కిలోమీటర్లు దూరంలో వెలసినది.పట్టణమునకు మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ రేణిగుంట గూడూర్ మార్గం కలదు. ఈ క్షేత్రంను చేరుకొనుటకు దేశంలోని అన్ని వైపుల నుండి బస్సు,రైలు ,విమాన సౌకర్యాలు గలవు.
భారతదేశము నందలి అనేక పుణ్యక్షేత్రములలో శ్రీకాళహస్తి మహాక్షేత్రము పరమపవిత్రమైన ప్రసిద్ద శివక్షేత్రము. ఇది దక్షిణ కైలాసముగాను సత్యవ్రత మహా భాస్కరక్షేత్రముగాను, సద్యోముక్తి క్షేత్రముగాను, శివానందైకనిలయంగాను అనేక నామాంతరములతో ప్రసిద్ది చెందినది. పంచభూత క్షేత్రములలో శ్రీకాళహస్తి వాయుక్షేత్రము. జంబుకేశ్వరములో జలలింగం, తిరువణ్నామలైలో తేజోలింగం , శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో అకాశలింగం, కంచిలో పృద్వీలింగంగా వెలసియున్నవి.పంచభూత లింగాలుగా చెప్పబడ్డాయి. ఈ పంచభూత లింగాలు ఎంతో విశిష్టమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి.
 స్వర్ణముఖీనది బ్రహ్మదేవుని వరప్రాసాదముచే అగస్త్యముని తపప్రభావము వలన దక్షిణ కైలాసం అనెె కొండల్లో నుండి ఉత్తర వాహినిగా ఇచ్చట ప్రవహించుచున్నది.
లింగరూపముwww.tvramudu.blogspot.com
సాధారణంగా ఏ దేవాలయంలోను గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. ఆగమ శాస్త్రం మేరకు గర్భగుడి నిర్మాణాన్ని అలాగే చేస్తారు. అందువల్లనే శ్రీ కాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలోకి కూడా ఏ మాత్రం గాలి రాదు.

అయితే స్వామి వారికి ఇరువైపులా వున్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ వుంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దాంతో స్వామి వారి శ్వాస కారణంగానే అలా జరుగుతుందనే విషయం స్పష్టమైంది. అందువలన ఇక్కడి శివలింగం వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని దర్శిస్తే పరమశివుడిని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
 లింగరూపము
 శ్రీకాళహస్తి అను నామాంతరము ఈ క్షేత్రము మూడు మూగ జీవుల భక్తి, అరాధనల ఫలితంగా ఏర్పడినది. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా సర్పము, హస్తి అనగా గజరాజు, పూర్వజన్మమున సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నందున బ్రహ్మదేవుని శాపమునకు గురియై ఊర్ణనాభుడనబడే శిల్పి భూలోకమున సాలీడుగా జన్మించి మారేడు పత్రముల మధ్య జీవిస్తూ ఉండెను. అ వృక్షం క్రింద మరి యెక ఇతి వృత్తములో శాపవశమున శివుని మెడలోని కాళము భూలోకములో దక్షిణ కైలాసమున అడవిలో జన్మించి అచట బిల్వ వృక్షము క్రింద వెలసిన శివలింగమున అర్పించుచుండెను. హస్తి అనే శివకింకరుడు తానోనర్చిన అపరాధ ఫలితంగా భూలోకములో శివుని శాపవశమున గజరాజుగా జన్మించి, అదే బిల్వ వనమున నివసించుచూ, కాళము పూజించుచున్న శివలింగమునెె తానుకూడా పూజించు చుండెను. కాళమొనర్చిన అలంకరణలు తొలిగించి, తొండముతో సువర్ణముఖినదీ జలమును తెచ్చి అభిషేకించుచూ అర్పించుట అరంభించినది. ఇందుకు కోపించిన కాళము ఒకనాడు శివలింగ సమీపమున వేచియుండి అభిషేకము చేయుచున్న గజరాజు తొండములో దూరి కుంభస్దలమున అలజడి కలిగించగా ఆ బాధ భరించలేని గజరాజు తన తలను ఒక బండకు మోదుకొని మరణించెను. గజరాజుతో పాటు కుంభస్దలము లోపల వున్న కాళము (సర్పము) కూడా మృతిచెందెను. ఆ క్షణమున శివుడు ప్రత్యక్షమై వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతము తెలియపరిచి, వారిని అనుగ్రహించి శివైక్యము గావించెను. అప్పటి నుండి దక్షిణకైలాసము అని పిలవబడుతున్న ఈ క్షేత్రమునకు శ్రీకాళహస్తి అను నామధేయము ఏర్పడినది.

కన్నప్పకి మోక్షమొసగిన శివుడు
మహభక్తుడు అయిన తిన్నడు(కన్నప్ప) శివసాయుజ్యం పొందినది కూడా ఈ పుణ్యక్షేత్రములోనే అంటారు. అటవిక రాజైన తిన్నడు పూర్వజన్మమున పాండవ మధ్యముడైన అర్జునుడు. అతనిని పరీక్షించు నెపమున శివుడు పార్వతీ సమేతంగా బోయరూపమున వచ్చి పరీక్షించగా అందు అర్జునుడు విజయమొందెను. శివుడు సంతసించి ఒసగిన వరఫలితంగా అర్జునుడు మరు జన్మమున తిన్నడుగా జన్మించెను. జంతువులను వేటాడుచూ తిరుగుతున్న తిన్నడికి బిల్వ వనమున వెలసియున్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనమైంది. లింగ రూపుడైన పరమేశ్వరునికి ప్రతి దినమూ తాను వేటాడిన మాంసఖండములను నైవేద్యముగా సమర్పించెడివాడట. అచ్చోటనే శివలింగంను అర్పించుచున్న బ్రాహ్మణుడు ఖిన్నుడై ఇదేమి అపవిత్రమని శివుని ప్రార్దంచగా శివుడు అశరీరవాణిగా తిన్నని వృత్తాంతమును ఆ బ్రాహ్మణునికి తెలియజేసెను. అంతటి మహాభక్తుని దర్శించవలెనని బ్రాహ్మణునుడు అ సమీపంలోనే రహస్యంగా దాగియుండెను. మాంసమునర్పింప వచ్చిన తిన్నని పరీక్షించుటకై శివుడు తన శివలింగములో ఏర్పడిన కనుల నుండి ధారగా రక్తం కారుతున్న దృశ్యమును గాంచెను. అందుకు ఖిన్నుడైన తిన్నడు తన కన్నులను పెకలించి శివలింగమునకు అమర్చెను. అతని భక్తి శ్రద్దలకు ముగ్దుడైన శివుడు తిన్ననికి శివసాన్నిధ్యమును ప్రసాదించెను. ఇదంతయూ దర్శించిన బ్రాహ్మణునికి శివసాన్నిధ్యము లబించెను. ఇట్టి మహత్యం కలిగిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ శ్రీకాళహస్త్తి. మొదట బ్రహ్మోత్సవాలు కూడా కన్నప్ప ధ్వజారోహణంతోనే ప్రారంభమైనాయి.
             
3. కాంచీపురం కాంచి అంటే సంస్కృతం లో వఢ్యాణము అని అర్థము.
కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది.
 కాంచీపురo

ఏకాంబరేశ్వర ఆలయం

కంచిలోని ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. నేటికీ ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు వచ్చింది. 
మహాశివుడి లీలలను గురించి తెలుసుకోవడానికి మానవుడి జీవితకాలం సరిపోదు. అనురాగపూరితమైన ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి మరుజన్మలు సైతం చాలవు. అలాంటి ఆదిదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తూ వుంటారు. కైలాసనాథుడిని కనులారా తిలకించడం కన్నా అసలైన అదృష్టం ఏవుంటుందనే అనుకుంటూ వుంటారు.

అలా సదాశివుడి క్షేత్రాలను దర్శించినప్పుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ వుంటుంది. వివిధ క్షేత్రాలలో శివలింగాలకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే, రూపంలోనూ ... పరిమాణంలోను విభిన్నమైన ఆకృతులు కలిగినవి కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మట్టితో ... ఇసుకతో ... చెట్టు మొదలుతో ... రాళ్లతో ప్రతిష్ఠించబడిన శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి.

అలా మట్టితో చేసిన శివలింగం 'కాంచీపురం'లో కొలువై 'ఏకామ్రేశ్వరుడు' పేరుతో పూజలందుకుంటోంది. అయితే కేవలం మట్టితో చేయబడిన శివలింగమైతే ఇంత ప్రాధాన్యత వుండేది కాదు. ఆ శివలింగంపై పార్వతీదేవి ఆభరణాల ముద్రలు వుండటం ఇక్కడి ప్రధాన విశేషం. అమ్మవారు కాత్యాయనిగా వున్నప్పుడు మట్టితో శివలింగం చేసి శివుడి గురించి కఠోర తపస్సు చేస్తుంది. పరమశివుడి ఆదేశం మేరకు గంగాదేవి ఆమె భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది.

 కంచీపురముhttp://www.tvramudu.blogspot.comఅనుకున్నదే తడవుగా ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చి ఆ మట్టి శివలింగాన్ని ముంచేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకుంటూ అమ్మవారు శివలింగాన్ని హృదయానికి గట్టిగా హత్తుకుని కూర్చుంటుంది. ఆ సమయంలో జరిగిన ఒత్తిడి కారణంగా, ఆమె ఆభరణాలు శివలింగానికి వత్తుకుపోయి దానిపై గుర్తులు ఏర్పడ్డాయి. అమ్మవారి ఆభరణాల గుర్తులనే స్వామి అలంకారాలుగా చేసుకోవడం వలన, ఇప్పటికీ ఈ మట్టి శివలింగం చెక్కుచెదరకపోవడం వలన ఇది మరింత మహిమాన్వితమైనదని చెబుతుంటారు.కంచి క్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మితమై వుంది. దీని మధ్యగా, బిందుస్థానీయంగా సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీ కామాక్షి దేవి ప్రతిష్టితులై ఉన్నారు. 

అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనం ఇస్తున్నది.

కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై వుంది. ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా వుంది.

 కంచికామాక్షి
పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్ లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, మరియు తామర పుష్పాన్ని మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు. 

 మధుర మీనాక్షిమూగవానిచే కవిత్వం చెప్పించిన కంచి కామాక్షి. కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశివిశాలాక్షి అనేది వాడుకలోనున్న, ప్రశస్తి. కంచి కామకోటి పీఠంగా ప్రసిద్ధి చెందిన, శ్రీకామక్షి దేవాలయం, 51 శక్తిపీఠాలలో ప్రశస్తమైనది. ఇరువదినాల్గు స్తంభాలు, ఇరువై నాలుగు గాయత్రి అక్షరములని, ఆ మంటప గర్భ గృహంలో, పద్మా సనాసీనురాలై, చతుర్భుజములు కల్గి అంకుశము, పుష్పము, బాణము, చెరకు విల్లు ధరించి కనుచూపుతో భక్తుల అభీష్టము తీర్చునట్లు అనుగ్రహమూర్తిగా, వెలసి యున్న జగన్మాత కామాక్షీ దేవి.

అమ్మ ఆదిశంకరులచే ప్రతిష్టించబడిన ఆలయంలో త్రికాలములందు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాలో అమ్మవారికి అభిషేకాలు జరుగుచుండును. పరాంబికయే, కామాక్షి అమ్మవారుగా పురాధీశ్వరిగా, వెలసినది. పంచభూత క్షేత్రములలో, (పృధ్వి) భూమి స్థలముగా, వెలసినది. 18 పురాణాలలో వర్ణించ బడి నదీ క్షేత్రం. దుష్టులను శిక్షించడానికి దైవశక్తి ఒక రూపంలో, అవతరించి, పాప భీతిని, కల్గించి, భక్తి భావాలను, ముక్తి కాంక్షను, పెంచి మానవుని మహోన్నత పథంవైపు, నడిపిస్తుంది. ఈ జగత్తు సర్వం ధర్మాధర్మాలమిశ్రమం. అక్రమ మార్గాన్ని వదలి, సక్రమ మార్గంలో పయనించుటవల్ల, మనసు, నిర్మలంగా ఉంటుంది. ఆ స్థితిలో మాలిన్యం, అంటే చీకటితొలగి, జ్ఞానోదయం అవుతుంది. వెలుగు, మార్గం కనబడుతుంది. ఆ వెలుగు అఖండ ఆనంద సౌందర్య రసస్వరూపంగా మనకు గోచరమవుతుంది. విశ్వంలోని ప్రతివస్తువులో ఆ వెలుగును చూడగల్గుతాం.
శ్లో|| వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపక్తయే'' అని ఏ శుభ సమయాన శ్లోకార్చన చేశారో, తదనంతర కవులెందరో అమ్మవారికి అక్షరాభిషేకం చేశారు. ఏ కవులస్తుతులలో దేదీప్య మానంగా దేవీస్వరూపాన్ని ప్రస్తుతించారో, ఆ దేవీ స్వరూపం త్రిమూర్త్యాత్మికమైయ్యింది. అట్టి త్రిమూర్త్యిత్మిక స్వరూపమే 'కామాక్షీ' అమ్మవారు.
శ్రీకాంచీ పురంలో మూగ పిల్లవాడు ఉండేవాడు. అతడు తన మూగ వల్ల అందరితో ఛీత్కరింపబడి, తిరస్కృతుడయ్యాడు. చివరకు కన్నతల్లి దండ్రులు గూడ అతనిని సరిగా ఆదరింపకున్నారు. అతడు మరణించుటకుపక్రమించి, కామాక్షీ చరణారవిందాలను ఆశ్రయించాడు. భక్తితో ఆర్తితో ఆర్ద్రతతో, అమ్మవారి పాదాలచెంత, నమ్రతతో ఆమె పాదాల చెంత దు:ఖించసాగాడు. అమ్మవారికటాక్ష వీక్షణాలు ఆ బాలునిపై ప్రసరించాయి. అమ్మ అతని ఆవేదన ఆలకించింది. ఆ సమయం ప్రసన్నమై, రమణీయమైన సమయం. అమ్మవారు తాంబూలం సేవిస్తూ, లీలావిలాసంగా, కూర్చొన్న తరుణం. అమ్మవారి అనుగ్రహం తాంబూలమై ప్రసరించింది. అమ్మవారి అనుగ్రహానికి చిహ్నంగాతాను నములుతున్న, తాంబూలలేహ్యము ఆ మూగపిల్లవాని నాలుక పై నుంచింది. ఆకాశం నుండి నేలపైకి వెన్నెల ప్రవాహం ఏ విధంగా ప్రవహిస్తుందో అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ మూగపిల్లవానికి, సంప్రాప్తించింది. ఆ మూగ పిల్లవానికి మాటలువచ్చాయి. మాటలు రావడమంటే మామూలు మాటలు కాదు గంగా ప్రవాహంవలే వచ్చాయి. ఆ మాటలే కవిత్వంగా పరిణమించి ఏక ధాటిగా ఐదువందల శ్లోకాలు చెప్పాడు.
ఆ కవిత్వమే 'మూకపంచవింశతి'. సంస్కృత ప్రవాహమై ప్రసరించింది. ఆరా శతకం-అమ్మవారి దివ్యలీలా విలాసం సంవర్ణించేది. మరొకటి పాదారవింద శతకం-అమ్మవారి పాదపద్మాల గురించి చెప్పినమాట చెప్పకుండా భక్తి ప్రవా హంగా మారింది. జగన్మాత పాదపద్మాల దర్శనం అనుభవించి, భక్తి ప్రవా హంగా చెప్పిన శతకం. తరోత కటాక్ష శతకం అమ్మవారి చూపులు ఎలా ఉంటాయో మనోజ్ఞంగా వర్ణించింది. లౌకిక విద్యలయందు నేర్పరియగు నొక యువకుడు ఎట్లు లౌకిక సంపదలు బడయునో, అట్లే పూర్వకృపస్తుతికి పస్తుతికి ఫలితంగా, భక్తుడు, అమ్మవారి కటాక్ష శతకంనందు సూచించెను.
దేవి అనుగ్రహ పాత్రుడై ఆ తల్లి మందస్మిత చంద్రకాయుతుడౖైె ఆనంద చంద్రునివలే, అలౌకిక నిరతిశయానంద, భవ్యస్వరూపుడై ప్రకాశించునని, మందస్మిత శతకమును ఆవిష్కరించెను. ఒక్కొక్క శతకాన్ని ఒక్కొక్క రకంగా వర్ణించాడు. అమ్మవారి శతకం అమ్మవారి, దివ్యలీలా విలాసంగా నిలిచాయి. సప్త మోక్ష పురాలలో కాంచీపురం ఒకటిగా నిలిచింది. కంచికామాక్షి మధురమీనాక్షి, కాశీ విశాలాక్షి అనేది వాడుకలో ప్రశస్తి.
 చిదంబర రహస్యం
చిదంబరం,..నటరాజస్వామి ఆనందతాండవం చేసేఈ ఆలయానికి కోయిల్ అనే పేరుకూడా వుంది,..అలాగే మరొక నామం తిల్లయ్ అని కూడా పిలుస్తారు..

          పాండిచ్చేరి నుండి బస్ లో రెండున్నర గంటలు పడుతుంది చిదంబరం చేరేసరికి, చాలా పెద్ద ఆలయం. తొలి ప్రాకారంలోంచి మందిరంలోకి ప్రవేశించగానే ఆనంద నటరాజస్వామి నాట్యంచేసే అద్బుత రూపం సాక్షాత్కరిస్తుందిమాటలలో చెప్పలేని అలౌకిక ఆనందాన్ని చూపరులకు కల్గిస్తుంది
చిత్’ అంటే చైతన్యం. ‘అంబరం’ అంటే నిర్మల ఆకాశం (ఈథర్). మరో అర్థం ప్రకారం, అంబరం అంటే వేదిక. ‘చిత్’ అంటే ఆనంద తాండవం. ‘చిదంబరం’ అంటే ‘ఆనంద తాండవ వేదిక’. అంటే, చిదంబరం అత్యంత ఆనందంతో, ఆత్మ జరిపే తాండవానికి వేదిక అన్నమాట. ఈ ఆత్మానంద తాండవానికి నటరాజ విగ్రహం ప్రతీక. పైగా శివుడు పంచభూత తత్వాలను తనలో ఉంచుకున్నవాడు. చిదంబరం’ ఆకాశ తత్వానికి ప్రతీక. ‘ఆకాశం’ అన్నది అనంతమైనది. ఆకాశం అంటే శూన్యం. ఆకాశం అన్నది భూమిపైనున్న వారికి వాతావరణం వల్ల ‘నీలి’ రంగులో కనిపిస్తుంది. నిజానికి అది ఆకాశం రంగు కాదు. ఇందులోనే ‘చిదంబర రహస్యం’ దాగుంది.ఆ ఓంకారుని నిర్మల చైతన్యమే చిదంబర రహస్యం.
ఈ రహస్యాన్ని సాధారణ మానవమాత్రులు ఛేదించలేరని అంటారు. తత్వాన్వేషణతో ఆత్మ-విచక్షణా ఙ్ఞానాన్ని పొందగలుగుతేనే అది సాధ్యం.
ఎవరైతే మనలో దాగివున్న ఆ పరమాత్ముడి దరిచేరగలుగుతారో వారికే తెరవెనుక నున్న ఆ ఆదికేశవుడి ఉనికీ, పరమార్ధం గోచరిస్తాయని ప్రతీతి.                         

 చిదంబర రహస్యం
ఆకాశం అనంతమైనది. అలాంటి అనంతమైన ఆకాశాన్ని వివరించటం, వర్ణించటం, అవగాహన చేసుకోవటం కుదరదు. కానీ ఆ భావనను అనుభవించగలం. భావించగలం. ఆ భావనను మనసు భావించి, అనుభవించి, అవగాహనకు తెచ్చుకుని అనంత ఆనందాన్ని పొంది, ఆనంద తాండవం చేయించగల మహాత్మ్యం చిదంబరం ఆలయానికి ఉంది. అయితే ఆ ఆనంద తాండవం భావనను కలిగించే దివ్యమంగళ మూర్తి, అర్ధ నారీశ్వరుడు మందిరంలో కొలువై ఉన్నాడు. కానీ అందరికీ కనిపించడు! ఆ దివ్యమూర్తి దర్శనానికి అడ్డుగా ఓ తెర ఉంటుంది. పూజారి పూజ పూర్తయిన తర్వాత, క్షణకాలం సేపు తెరను తొలగించి, వేచి ఉన్న భక్తులను దివ్య మంగళమూర్తి దర్శన భాగ్యం కలిగిస్తారు కానీ, లోపల ఉన్న మూర్తి అందరికీ కనబడదు. అందరి మనసుల్లో ఆనంద తాండవ మృదంగ ధ్వనులు మార్మోగుతున్నా, కొందరు పుణ్యాత్ములకు మాత్రమే లోపలి దివ్యమంగళ మూర్తి అసలు దర్శన భాగ్యం కలుగుతుంది.
 చిదంబర రహస్యం
‘తెర’ అన్న మాయను తొలగిస్తే కానీ, అనంత ఆనంద స్వరూపుడైన భగవంతుడి దర్శనం కాదని, మనసును కమ్మిన మాయ తెరలను తొలగించినవారికే దర్శనం అవుతుందని వివరిస్తారు కానీ, ఇంతకీ తెర మాటున నిజంగా దివ్యమంగళ మూర్తి ఉన్నాడా లేక శూన్యానికి ప్రతీకగా, అనంతానందంలోని అనంత శూన్యాన్ని ప్రతిబింబిస్తూ లోపల శూన్యంగా ఉందా అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. ఎందుకంటే లోపల ఏముందో చూడాలంటే కళ్లకున్న పొరలు కరగాలి. కానీ ఏమీ కనబడలేదంటే మాయ తెరలు తొలగలేదని ఒప్పుకోవాలి. అందుకే చిదంబరంలోని తెర మాటున ‘'చిదంబర రహస్యం’ ఇప్పటికీ పదిలంగా దాగి ఉన్నది. ఈ చిదంబర రహస్యమే కాదు, మరో విషయం కూడా మిస్టరీగానే మిగిలి ఉంది. {అందరికీ కనిపించే నటరాజ విగ్రహం ఆలయంలోని ఇంకో ప్రాంగణంలోనిది}.