సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, August 15, 2014

దివ్య సురక్షా శివమంత్రం..

http://tvramudu.blogspot.com/పంచామృతo
దివ్య సురక్షా శివమంత్రం..
''ఓం నమో భగవతే శ్రీ వ్యాదేశ్వరాయ భూతనాథాయ భూత భాధాం నాశయ నాశయ కష్టం చూరయ చూరయ మనోవాంచితం పూరయ పూరయ ఓం హ్రీం శ్రీం శ్రీం వ్యాదేశ్వరాయ నమః"!!
 

ఓంకారం

http://tvramudu.blogspot.com/పంచామృతo

ఓంకారం ఒకే ఒక్క సత్యపదార్థo ప్రధమబిందువూ దాని నుండీ బహిర్గతమైనది ఈ సృష్టి.
సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం, బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీలేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం. దాని ధ్వనితరంగాలు క్రమంగా వ్యాపించి దిక్కులు ఏర్పడ్డాయి. ఆయా దిక్కుల నుండి భిన్న ఛందస్సులు, వేదాలు క్రమంగా దాని ఆధారంతో సృష్టి ఏర్పడింది. సృష్ట్యారంభంలో ఒక అవ్యక్త నాదం ఏర్పడిన విషయం అన్యమతాలూ అంగీకరిస్తున్నాయి. అదే మన ఓంకారమనే యదార్థ విషయం అంగీకరిస్తే తమ మత వ్యాప్తికి భంగమని దానిని చెప్పరు. మాండూక్యకారికలలో..

"సర్వస్య ప్రణవోహ్యాదిః మధ్యమన్త స్తథైవచ!
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా-వ్యశ్నుతే తదనంతరమ్"!!
అని చెప్పబడింది. అది ప్రపంచమంతకూ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని, దానిని తెలిసికొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడని చెప్తోంది.

"ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం!
సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి''!!
అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహింపగల్గితే ఇకవానికి శోకం అనేది ఉండదు.

నల్లని మందమైన "ఓం"కార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెప్తారు.ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం మూడు నుండి పదకొండు సార్లు దాకా ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి. ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మనుజునిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను వెలుగులోకి తేగలదు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. ఓంకారం నిత్యం ఆరంభిస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం.అదే అక్షర పరబ్రహ్మం. అక్షర నిర్మాణానికి మౌలికంగా ఎనిమిది అంశాలుంటాయి. అడ్డగీత, నిలువుగీత, వృత్తరేఖ, చుక్క, అథోరేఖ, ఊర్ధ్వరేఖ, ఎడమకు గీత, గాడికి గీత అనేవి. ఈ ఎనిమిది అంశాల సమ్మిశ్రితం ఓంకారం. స్థూలం నుండి సూక్ష్మాంశకు పురోగమించటమే లక్ష్యం. అదే వ్యక్తియందలి జీవాంశ ప్రాధాన్యతకు, పదార్థమునందలి పరమాణు ప్రాధాన్యతకు సూచకము. అట్లే ఓంకారం స్థూలాంశతో ఆరంభమయి సూక్ష్మాంశ అయిన చుక్కతో ముగుస్తుంది. ఓంకార లేఖన నియమాలు ముఖ్యంగా అనేదానికే అన్వయించాలి. ఇతర అక్షరాలలా ఇది కలిపి వ్రాయదగినది కాదు. నాల్గంచెలలో క్రమంగా స్థూలం నుండి సూక్ష్మాంశకు నడుస్తాము.
స్థూల సూక్ష్మ కారణావస్థలు మూడూ #భ్రాంతివలన ఏర్పడినవే తప్ప నిజంగా అవి లేవు. ఉన్నది పరబ్రహ్మమొక్కటే. ఆ మూడు అవస్థలూ అసత్యాలు అనే విషయం ప్రణవంలోని అకార ఉకార మకారాల ద్వారా గ్రహించి తానే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది అఖండ ఆనందమయుడైనిల్చునట్లు ఆ ప్రణవం చేస్తుంది. అదే జీవన్ముక్తి, కైవల్య మోక్షము, జీవ బ్రహ్మైక్యము, పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాని కోరవలసింది ఆ అవస్థే. కలకంటూ అది యధార్థమనుకొన్నట్లు అజ్ఞానికి ఈ లోకమే శాశ్వతం. అలా అనుకొంటూనే కలకరిగి పోయినట్లు తాను, తనలా లోకంలో సమస్తమూ తొలగిపోతూ ఉండటం ఆలోచించలేడు. జ్ఞానికే సరియైన ఆ జ్ఞానం కలుగుతుంది. అందుకు తోడ్పడేదే ఓంకారం

శివ షడక్షరీ స్తుతిః..

http://tvramudu.blogspot.com/పంచామృతo

శివ షడక్షరీ స్తుతిః..
ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మై “ఓం”కారాయ నమో నమః

న నమస్తే దేవదేవేశ నమస్తే మహా పాతక నాశనం
నమస్తే వృషభారూఢ “న”కారాయ నమో నమః 

మ మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం
మహా పాప హరం వందే “మ”కారాయ నమో నమః

శి శివం శాంతం జగన్నాధం లోకానుగ్రహ కారకం
శిమేకంపరం దేవం “శి”కారాయ నమో నమః

వా వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వా”కారాయ నమో నమః

య యత్రయత్ర స్థితోః దేవ సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగ పూజయేన్నిత్యం “య”కారాయ నమో నమః

ఓం నమఃశివాయ
షడాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే

శ్రీశివాయ గురవేనమః..

http://tvramudu.blogspot.com/పంచామృతo

శ్రీశివాయ గురవేనమః..
శివుని ఆకారంలోనే ఎంతో అర్థం వుంది. ఆయన #అర్థనారీశ్వరతత్త్వము ప్రకృతి పురుషుల సమాహారమైన ఈ సృష్టికి సంకేతము. ఆయన త్రినేత్రాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీకలు. ఆయన ధరించే భస్మం, చితాభస్మం. "చివరకు సర్వం కలిసేది నాలోనే'' అనే వేదాంత సారానికి చిహ్నం భస్మం. శివుని చేతిలో ఒక లేడి వుంటుంది. సారంగమంటే లేడి. చంచలమైన మనసుకి అది ప్రతీక. ఇంద్రియనిగ్రహముతో ఆ మనసును అదుపులో పెట్టేవాడు కనుక శివుని "సారంగపాణి'' అంటారు. ఆయన చేతిలోని డమరుకం నుంచే శబ్దశక్తి ఉద్భవించింది. అదే సంగీతానికి వేదం. అందుకే శివుని "నాదలోలుడు'' అన్నారు. ఆయన పదవిన్యాసం నుంచి జనిన్చిందే "నాట్యశాస్త్రం''. ఆయన చేతిలోని రుద్రాక్షమాల, ఆకారం నుండి క్షకారం వరకూ వున అక్షరామాలకు ప్రతీక. అందుకే ఆయన "జగద్గురువు''. కుండలి అంటే నాగము ప్రాణుల దేహములందున్న సప్తచక్రాలలో కుండలి రూపంలో చరించే ప్రానదాతువు ఆయనే. అందుకే ఆయనను నాగాభారణుడు అన్నారు.

"ఈశ ఐశ్వర్యే'' - అష్టైశ్వర్యప్రదాత కనుక, ఆయన "ఈశ్వరుడు''.
"శివ ప్రదత్వాత్ శివః'' - శుభములను ఇచ్చువాడు కనుక ... ఆయన "శివుడు''
"శం సుఖం కరోతీత శంకరః' - సుఖములను ఒసగువాడు కనుక, "శంకరుడు''
"మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవః'' - శ్రేష్ఠుడైన దేవదేవుడు కనుక, "మహాదేవుడు''
"భుక్తానాం ఆర్తిం హారతి ఇతి హరః'' - భక్తుల బాధలు హరించువాడు కనుక, "మహాదేవుడు
"భవతి భావతేవా సర్వమితి భవః'' - అంతా తనే అయివుంటాడు కనుక, "భద్రుడు
"ప్రళయే అపి తిష్టితీతి స్థాణు:'' - ప్రళయ కాలమందు కూడా స్థిరముగా ఉండేవాడు కనుక "స్థాణువు''
"రుద్రం రోదనం ద్రావయతేతి రుద్రః'' - దుఃఖములను పోగొట్టువాడు కనుక, "రుద్రుడు''
"శృణాతిహినస్తి సర్వమన్తకాలే ఇతి శర్యః'' - ప్రళయకాలమందు సమస్తమును దాహించువాడు కనుక "శర్వుడు''ఇలా ఆయన ప్రతిపేరిలోనూ మహత్తరమైన అర్థం ఉంది. శివునకు "పశుపతి'' అని మరో పేరుంది. అంటే పశువులకు భర్త అని అర్థం కాదు.
"బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతా: పశవః పరికీర్తితాః
తేషాం హాయ్ నాయకో యస్మాత్ శివః పశుపతి: స్మృతాః''
బ్రహ్మ మొదలుగా స్థావర జంగామాత్మకమైన ఈ సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి. ఈ పశువులన్నింటినీ శివుడు నాయకుడు కనుక, ఆయన "పశుపతి'' అయినాడు. అందుకే -
"నం భావాయచ రుద్రాయచ నమశ్శార్వాయచ పశుపతయేచ్''

గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..

 గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..

గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..
శ్రీ గణేశాయ నమః |
గౌర్యువాచ |
గజానన జ్ఞానవిహారకారిన్న మాం చ జానాసి పరావమర్షామ్|
గణేశ రక్షస్వ న చేచ్ఛరీరం త్యజామి సద్యస్త్వయి భక్తియుక్తా||1||
విఘ్నేశ హేరమ్బ మహోదర ప్రియ లమ్బోదర ప్రేమవివర్ధనాచ్యుత|
విఘ్నస్య హర్తాఽసురసఙ్ఘహర్తా మాం రక్ష దైత్యాత్వయి భక్తియుక్తామ్||2||
కిం సిద్ధిబుద్ధిప్రసరేణ మోహయుక్తోఽసి కిం వా నిశి నిద్రితోఽసి|
కిం లక్షలాభార్థవిచారయుక్తః కిం మాం చ విస్మృత్య సుసంస్థితోఽసి||3||
కిం భక్తసఙ్గేన చ దేవదేవ నానోపచారైశ్చ సుయన్త్రితోఽసి |
కిం మోదకార్థే గణపాద్ధృతోఽసి నానావిహారేషు చ వక్రతుణ్డ||4||
స్వానన్దభోగేషు పరిహృతోఽసి దాసీం చ విస్మృత్య మహానుభావ|
ఆనన్త్యలీలాసు చ లాలసోఽసి కిం భక్తరక్షార్థసుసఙ్కటస్థః||5||
అహో గణేశామృతపానదక్షామరైస్తథా వాఽసురపైః స్మృతోఽసి|
తదర్థనానావిధిసంయుతోఽసి విసృజ్య మాం దాసీమనన్యభావామ్||6||
రక్షస్వ మాం దీనతమాం పరేశ సర్వత్ర చిత్తేషు చ సంస్థితస్త్వమ్|
ప్రభో విలమ్బేన వినాయకోఽసి బ్రహ్మేశ కిం దేవ నమో నమస్తే||7||
భక్తాభిమానీతి చ నామ ముఖ్యం వేదే త్వభావాన్ నహి చేన్మహాత్మన్|
ఆగత్య హత్వాఽదితిజం సురేశ మాం రక్ష దాసీం హృది పాదనిష్ఠామ్||8||
అహో న దూరం తవ కిఞ్చిదేవ కథం న బుద్ధీశ సమాగతోఽసి|
సుచిన్త్యదేవ ప్రజహామి దేహం యశః కరిష్యే విపరీతమేవమ్||9||
రక్ష రక్ష దయాసిన్ధోఽపరాధాన్మే క్షమస్వ చ|
క్షణే క్షణే త్వహం దాసీ రక్షితవ్యా విశేషతః||10||
స్తువత్యామేవ పార్వత్యాం శఙ్కరో బోధసంయుతః|
బభూవ గణపానాం వై శ్రుత్వా హాహారవం విధేః||11||
గణేశం మనసా స్మృత్వా వృషారూఢః సమాయయౌ|
క్షణేన దైత్యరాజం తం దృష్ట్వా డమరుణాహనత్||12||
తతః సోఽపి శివం వీక్ష్యాలిఙ్గితుం ధవితోఽఅభవత్|
శివస్య శూలికాదీని శస్త్రాణి కుణ్ఠితాని వై||13||
తం దృష్ట్వా పరమాశ్చర్యం భయభీతో మహేశ్వరః|
సస్మార గణపం సోఽపి నిర్విఘ్నార్థం ప్రజాపతే||14||
పార్వత్యాః స్తవనం శ్రుత్వా గజాననః సమాయయౌ|
~~!!ఇతి ముద్గలపురాణోక్తం హేరమ్బస్తోత్రం సమ్పూర్ణమ్!!~~

తులసీదాసకృత శ్రీ గణేశ స్తుతి..

 గణేశపఞ్చచామరస్తోత్రమ్

తులసీదాసకృత శ్రీ గణేశ స్తుతి..
గాయియే గణపతి జగబందన 
శంకర సువన భవానీ నందన 

సిద్ధి సదన గజవదన వినాయక 
కృపాసిందు సుందర సబ్ లాయక 

మోదకప్రియ ముద మంగళ దాతా
విద్యా వారిధి బుద్ది విధాతా

మాంగత తులసీదాస కర జొరే
బసకి రామ షియా మానస మోరే!!


గణేశ మానస పూజా..

గణేశ మానస పూజా

గణేశ మానస పూజా..
గణేశ మానస పూజా శ్రీ గణేశాయ నమః గృత్సమద ఉవాచ||
విఘ్నేశవీర్యాణి విచిత్రకాణి బందీజనైర్మాగధకైః స్మృతాని|
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ||1||

ఏవం మయా ప్రార్థితో విఘ్నరాజశ్చిత్తేన చోత్థాయ బహిర్గణేశః|
తం నిర్గతం వీక్ష్య నమన్తి దేవాః శంభ్వాదయో యోగిముఖాస్తథాఽహమ్||2||

శౌచాదికం తే పరికల్పయామి హేరమ్బ వై దన్తవిశుద్ధిమేవమ్|
వస్త్రేణ సంప్రోక్ష్య ముఖారవిన్దం దేవం సభాయాం వినివేశయామి||3||

ద్విజాదిసర్వేరభివన్దితం చ శుకాదిభిర్మోదసుమోదకాద్యైః|
సంభాష్య చాలోక్య సముత్థితం తం సుమణ్డపం కల్ప్య నివేశయామి||4||

రత్నైః సుదీప్తైః ప్రతిబిమ్బితం తం పశ్యామి చిత్తేన వినాయకం చ|
తత్రాసనం రత్నసువర్ణయుక్తం సంకల్ప్య దేవం వినివేశయామి||5||

సిద్ధ్యా చ బుద్ధ్యా సహ విఘ్నరాజ! పాద్యం కురు ప్రేమభరేణ సర్వైః|
సువాసితం నీరమథో గృహాణ చిత్తేన దత్తం చ సుఖోష్ణభావమ్||6||

తతః సువస్త్రేణ గణేశమాదౌ సంప్రోక్ష్య దూర్వాదిభిరర్చయమి|
చిత్తేన భావప్రియ దీనబన్ధో మనో విలీనం కురు తే పదాబ్జే ||7||

కర్పూరకైలాదిసువాసితం తు సుకల్పితం తోయమథో గృహాణ |
ఆచమ్య తేనైవ గజానన! త్వం కృపాకటాక్షేణ విలోకయాశు||8||

ప్రవాలముక్తాఫలహారకాద్యైః సుసంస్కృతం హ్యన్తరభావకేన|
అనర్ఘ్యమర్ఘ్యం సఫలం కురుష్వ మయా ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే||9||

సౌగంధ్యయుక్తం మధుపర్కమాద్యం సంకల్పితం భావయుతం గృహాణ|
పునస్తథాఽఽచమ్య వినాయక త్వం భక్తాంశ్చ భక్తేశ సురక్షయాశు||10||

సువాసితం చంపక జాతికాద్యైస్తైలం మయా కల్పితమేవ ఢుణ్ఢ|
గృహాణ తేన ప్రవిమర్దయామి సర్వాంగమేవం తవ సేవనాయ||11||

తతః సుఖోష్ణేన జలేన చాహమనేకతీర్థాహృతకేన ఢుణ్ఢే|చిత్తేన శుద్ధేన చ స్నాపయామి స్నానం మయా దత్తమథో గృహాణ||12||

తతః పయఃస్నానమచిన్త్యభావ గృహాణ తోయస్య తథా గణేశ|పునర్దధిస్నానమనామయత్వం చిత్తేన దత్తం చ జలస్య చైవ||13||

తతో ఘృతస్నానమపారవన్ద్య సుతీర్థజం విఘ్నహర ప్రసీ |
గృహాణ చిత్తేన సుకల్పితం తు తతో మధుస్నానమథో జలస్య||14||

సుశర్కరాయుక్తమథో గృహాణ స్నానం మయా కల్పితమేవ ఢుణ్ఢే|
తతో జలస్నానమఘాపహంతృ విఘ్నేశ మాయాభ్రమం హినివారయాశు||15||

సుయక్షపంకం స్తమథో గృహాణ స్నానం పరేశాధిపతే తతశ్చ|
కౌమణ్డలీసంభవజం కురుష్వ విశుద్ధమేవం పరికల్పితం తు||16||

తతస్తు సూక్తైర్మనసా గణేశం సంపూజ్య దూర్వాదిభిరల్పభావైః|
అపారకైర్మణ్డలభూతబ్రహ్మణస్పత్యాదికైస్తం హ్యభిషేచయామి||17||

తతః సువస్త్రేణ తు ప్రోంఛనం వై గృహాణ చిత్తేన మయా సుకల్పితమ్|
తతో విశుద్ధేన జలేన ఢుణ్ఢే హ్యాచాన్తమేవం కురు విఘ్నరాజ||18||

అగ్నౌ విశుద్ధే తు గృహాణ వస్త్రే హ్యనర్ఘ్యమౌల్యే మనసా మయా తే|
దత్తే పరిచ్ఛాద్య నిజాత్మదేహం తాభ్యాం మయూరేశ జనాంశ్చ పాలయ||19||

ఆచమ్య విఘ్నేశ పునస్తథైవ చిత్తేన దత్తం సుఖముత్తరీయమ్|
గృహాణ భక్తప్రతిపాలక త్వం నమోఽథ తారకసంయుతం తు||20||

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాథభూతమ్|
భావేన దత్తం గణనాథ తత్వం గృహాణ భక్తోద్ధృతికారణాయ||21||

ఆచాన్తమేవం మనసా ప్రదత్తం కురుష్వ శుద్ధేన జలేన ఢుణ్ఢే|పునశ్చ కౌమణ్డలకేన పాహి విశ్వం ప్రభో ఖేలకరం సదా తే||22||

ఉద్యద్దినేశాభమథో గృహాణ సిన్దూరకం తే మనసా ప్రదత్తమ్|
సర్వాంగసంలేపనమాదరాద్వై కురుష్వ హేరమ్బ చ తేన పూర్ణమ్||23||

సహస్రశీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటం తు సువర్ణజం వై|
అనేకరత్నైః ఖచితం గృహాణ బ్రహ్మేశ తే మస్తకశోభనాయ||24||

విచిత్రరత్నైః కనకేన ఢుణ్ఢే యుతాని చిత్తేన మయా పరేశ|
దత్తాని నానాపదకుణ్డలాని గృహాణ శూర్పశ్రుతిభూషణాయ||25||

శుణ్డావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహా |
రత్నైశ్చ యుక్తం మనసా మయా, యద్దత్తం ప్రభో తత్సఫలంకురుష్వ||26||

సువర్ణరత్నైశ్చ యుతాని ఢుణ్ఢే సదైకదన్తాభరణాని కల్ప్య|
గృహాణ చూడాకృతయే పరేశ దత్తాని దన్తస్య చ శోభనార్థమ్||27||

రత్నైః సువర్ణేన కృతాని తాని గృహాణ చత్వారి మయా ప్రకల్ప్య|
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు హ్యజ విఘ్నహారిన ||28||

విచిత్రరత్నైః ఖచితం సువర్ణసంభూతకం గృహ్య మయా ప్రదత్తమ్|
తథాంగులీష్వాంగులికం గణేశ చిత్తేన్ సంశోభయ తత్పరేశ||29||

విచిత్రరత్నైః ఖచితాని ఢుణ్ఢే కేయూరకాణి హ్యథ కల్పితాని|
సువర్ణజాని ప్రథమాధినాథ గృహాణ దత్తాని తు బాహుషు త్వమ్||30||

ప్రవాలముక్తాఫలరత్నజైస్త్వం సువర్ణసూత్రైశ్చ గృహాణ కణ్ఠే|
చిత్తేన దత్తా వివిధాశ్చ మాలా ఊరూదరే సోభయ విఘ్నరాజ||31||

చన్ద్రం లలాటే గణనాథ పూర్ణం వృద్ధిక్షయాభ్యాం తు విహీనమాద్యమ్|
సంశోభయ త్వం వరసంయుతం తే భక్తిప్రియత్వం ప్రకటీకురుష్వ||32||

చింతామణిం చింతితదం పరేశ హృద్దేశగం జ్యోతిర్మయం కురుష్వ|
మణిం సదానన్దసుఖప్రదం చ విఘ్నేశ దీనార్థద పాలయస్వ||33||

నాభౌ ఫణీశం చ సహస్రశీర్షం సంవేష్టనేనైవ గణాధినాథ|
భక్తం సుభూషం కురు భూషణేన వరప్రదానం సఫలం పరేశ||34||

కటీతటే రత్నసువర్ణయుక్తాం కాంచీం సుచిత్తేన చ ధారయామి|
విఘ్నేశ జ్యోతిర్గణదీపనీం తే ప్రసీద భక్తం కురు మాం దయాబ్ధే||35||

హేరమ్బ తే రత్నసువర్ణయుక్తే సునూపురే మంజిరకే తథైవ|
సుకింకిణీనాదయుతే సుబుద్ధ్యా సుపాదయోః శోభయ మే ప్రదత్తే||36||

ఇత్యాదినానావిధభూషణాని తవేచ్ఛయా మానసకల్పితాని|
సమ్భూషయామ్యేవ త్వదంకేషు విచిత్రధాతుప్రభవాణి ఢుణ్ఢే||37||

సుచన్దనం రక్తమమోఘవీర్యం సుఘర్షితం హ్యష్టకగన్ధముఖ్యైః|
యుక్తం మయా కల్పితమేకదన్త గృహాణ తే త్వంగవిలేపనార్థమ్||38||

లిప్తేషు వైచిత్ర్యమథాష్టగన్ధైరంగేషు తేఽహం ప్రకరోమి చిత్రమ్|
ప్రసీద చిత్తేన వినాయక త్వం తతః సురక్తం రవిమేవ భాలే||39||

ఘృతేన వై కుంకుమకేన రక్తాన్ సుతండులాంస్తే పరికల్పయామి|
భాలే గణాధ్యక్ష గృహాణ పాహి భక్తాన్ సుభక్తిప్రియ దీనబన్ధో||40||

గృహాణ భో చమ్పకమాలతీని జలపంకజాని స్థలపంకజాని|
చిత్తేన దత్తాని చ మల్లికాది పుష్పాణి నానావిధవృక్షజాని||41||

పుష్పోపరి త్వం మనసా గృహాణ హేరమ్బ మన్దారశమీదలాని|
మయా సుచిత్తేన చ కల్పితాని హ్యపారకాణి ప్రణవాకృతే తు||42||

దూర్వాంకురాన్ వై మనసా ప్రదత్తాంస్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన|
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాశ్చ సర్వోపరి వక్రతుణ్డ||43||

దశాంగభూతం మనసా మయా తే ధూపం ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే|
గృహాణ సౌరభ్యకరం పరేశ సిద్ధ్యా చ బుద్ధ్యా సహ భక్తపాల||44||

దీపం సువర్త్యా యుతమాదరాత్తే దత్తం మయా మానసకం గణేశ|
గృహాణ నానావిధజం ఘృతాదితైలాదిసంభూతమమోఘదృష్టే||45||

భోజ్యం చ లేహ్యం గణరాజ పేయం చోష్యం చ నానావిధషడ్రసాఢ్యమ్|
గృహాణ నైవేద్యమథో మయా తే సుకల్పితం పుష్టిపతే మహాత్మన్||46||

సువాసితం భోజనమధ్యభాగే జలం మయా దత్తమథో గృహాణ|
కమణ్డలుస్థం మనసా గణేశ పిబస్వ విశ్వాదికతృప్తికారిన్||47||

తతః కరోద్వర్తనకం గృహాణ సౌగన్ధ్యుక్తం ముఖమార్జనాయ|
సువాసితేనైవ సుతీర్థజేన సుకల్పితం నాథ గృహాణ ఢుణ్ఢే||48||

పునస్తథాచమ్య సువాసితం చ దత్తం మయా తీర్థజలం పిబస్వ|
ప్రకల్ప్య విఘ్నేశ తతః పరం తే సంప్రోంఛనం హస్తముఖేకరోమి||49||

ద్రాక్షాదిరమ్భాఫలచూతకాని ఖార్జూరకార్కన్ధుకదాడిమాని|
సుస్వాదయుక్తాని మయా ప్రకల్ప్య గృహాణ దత్తాని ఫలాని ఢుణ్ఢే||50||

పునర్జలేనైవ కరాదికం తే సంక్షాలయేఽహం మనసా గణేశ|
సువాసితం తోయమథో పిబస్వ మయా ప్రదత్తం మనసా పరేశ||51||

అష్టాంగయుక్తం గణనాథ దత్తం తామ్బూలకం తే మనసా మయా వై|
గృహాణ విఘ్నేశ్వర భావయుక్తం సదాసకృత్తుణ్డవిశోధనార్థమ్||52||

తతో మయా కల్పితకే గణేశ మహాసనే రత్నసువర్ణయుక్తే|
మన్దారకూర్పాసకయుక్తవస్త్రైరనర్ఘ్యసంఛాదితకే ప్రసీద ||53||

తతస్త్వదీయావరణం పరేశ సంపూజయేఽహం మనసా యథావత్|
నానోపచారైః పరమప్రియైస్తు త్వత్ప్రీతికామార్థమనాథబన్ధో||54||

గృహాణ లమ్బోదర దక్షిణాం తే హ్యసంఖ్యభూతాం మనసా ప్రదత్తామ్|
సౌవర్ణముద్రాదికముఖ్యభావాం, పాహి ప్రభో విశ్వమిదం గణేశ||55||

రాజోపచారాన్ వివిధాన్ గృహాణ హస్త్యశ్వఛత్రాదికమాదరాద్వై|
చిత్తేన దత్తాన్ గణనాథ ఢుణ్ఢే హ్యపారసఖ్యాన్ స్థిరజంగమాంస్తే||56||

దానాయ నానావిధరూపకాంస్తే గృహాణ దత్తాన్ మనసా మయా వై|
పదార్థభూతాన్ స్థిరజంగమాంశ్చ హేరమ్బ మాం తారయ మోహభావాత్||57||

మన్దారపుష్పాణి శమీదలాని దూర్వాంకురాంస్తే మనసా దదామి|
హేరమ్బ లమ్బోదర దీనపాల గృహాణ భక్తం కురు మాం పదే తే||58||

తతో హరిద్రామబిరం గులాలం సిందూరకం తే పరికల్పయామి|
సువాసితం వస్తుసువాసభూతైర్గృహాణ బ్రహ్మేశ్వరశోభనార్థమ్||59||

తతః శుకాద్యాః శివవిష్ణుముఖ్యా ఇన్ద్రాదయః శేషముఖాస్తథాఽన్యే|
మునీన్ద్రకాః సేవకభావయుక్తాః సభాసనస్థం ప్రణమన్తి ఢుణ్ఢిమ్||60||

వామాంగకే శక్తియుతా గణేశం సిద్ధిస్తు నానావిధసిద్ధి భిస్తమ్|
అత్యన్తభావేన సుసేవతే తు మాయాస్వరూపా పరమార్థభూతా||61||

గణేశ్వర దక్షిణభాగసంస్థా బుద్ధిః కలాభిశ్చ సుబోధికాభిః|
విద్యాభిరేవం భజతే పరేశా మాయాసు సాంఖ్యప్రదచిత్తరూపా||62||

ప్రమోదమోదాదయః పృష్ఠభాగే గణేశ్వరం భావయుతా భజన్తే|
భక్తేశ్వరా ముద్గలశమ్భుముఖ్యాః శుకాదయస్తం స్మ పురో భజన్తే||63||

గన్ధర్వముఖ్యా మధురం జగుశ్చ గణేశగీతం వివిధస్వరూపమ్|
నృత్యంకలాయుక్తమథో పురస్తాచ్చక్రుస్తథా హ్యసరసో విచిత్రమ్||64||

ఇత్యాదినానావిధభావయుక్తైః సంసేవితం విఘ్నపతిం భజామి|
చిత్తేన ధ్యాత్వా తు నిరంజనం వై కరోమి నానావిధదీపయుక్తమ్||65||

చతుర్భుజం పాశధరం గణేశం తథాంకుశం దన్తయుతం తమేవమ్|
త్రినేత్రయుక్తం త్వభయంకరం తం మహోదరం చైకరదం గజాస్యమ్||66||

సర్పోపవీతం గజకర్ణధారం విభూతిభిః సేవితపాదపద్యమ్|
ధ్యాయే గణేశం వివిధప్రకారైః సుపూజితం శక్తియుతం పరేశమ్||67||

తతో జపం వై మనసా కరోమి స్వమూలమన్త్రస్య విధానయుక్తమ్|
అసంఖ్యభూతం గణరాజహస్తే సమర్పయామ్యేవ గృహాణ ఢుణ్ఢే||68||

ఆరార్తికా కర్పురకాదిభూతామపారదీపాం ప్రకరోమి పూర్ణామ్|
చిత్తేన లమ్బోదర తాం గృహాణ హ్యజ్ఞానధ్వాన్తౌఘహరాం నిజానామ్||69||

వేదేషు వైఘ్నైశ్వరకైః సుమన్త్రైః సుమన్త్రితం పుష్పదలం ప్రభూతమ్|
గృహాణ చిత్తీన మయా ప్రదత్తమపారవృత్త్యా త్వథ మన్త్రపుష్పమ్||70||

అపారవృత్యా స్తుతిమేకదన్తం గృహాణ చిత్తేన కృతాం గణేశ|
యుక్తాం శ్రుతిస్మార్తభవైః పురాణైః సర్వైః పరేశాధిపతే మయా తే||71||

ప్రదక్షిణా మానసకల్పితాస్తా గృహాణ లమ్బోదర భావయుక్తాః|
సంఖ్యావిహీనా వివిధస్వరూపా భక్తాన్ సదా రక్ష భవార్ణవాద్వై||72||

నతిం తతో విఘ్నపతే గృహాణ సాష్టాంగకాద్యాం వివిధస్వరూపామ్|
సంఖ్యావిహీనాం మనసా కృతాం తే సిద్ధ్యా చ బుద్ధ్యా పరిపాలయాశు||73||

న్యూనాతిరిక్తం తు మయా కృతం చేత్తదర్థమన్తే మనసా గృహాణ|
దూర్వాంకురాన విఘ్నపతే ప్రదత్తాన్ సంపూర్ణమేవం కురు పూజనం మే||74||

క్షమస్వ విఘ్నాధిపతే మదీయాన్ సదాపరాధాన్ వివిధస్వరూపాన్|
భక్తిం మదీయాం సఫలాం కురుష్వ సంప్రార్థయేఽహం మనసా గణేశ||75||

తతః ప్రసన్నేన గజానేన దత్తం ప్రసాదం శిరసాఽభివన్ద్య|
స్వమస్తకే తం పరిధారయామి చిత్తేన విఘ్నేశ్వరమానతోఽస్మి||76||

ఉత్థాయ విఘ్నేశ్వర ఏవ తస్మాద్గతస్తతస్త్వన్తరధానశక్త్యా|
శివాదయస్తం ప్రణిపత్య సర్వే గతాః సుచిత్తేన చ చిన్తయామి||77||

సర్వాన్నమస్కృత్య తతోఽహమేవ భజామి చిత్తేన గణాధిపం తమ్|
స్వస్థానమాగత్య మహానుభావైర్భక్తైర్గణేశస్య చ ఖేలయామి||78||

ఏవం త్రికాలేషు గణాధిపం తం చిత్తేన నిత్యం పరిపూజయామి|
తేనైవ తుష్టః ప్రదదాతు భావం విఘ్నేశ్వరో భక్తిమయం తు మహ్యమ్||79||

గణేశపాదోదకపానకం చ ఉచ్ఛిష్టగంధస్య సులేపన తు|
నిర్మాల్యసన్ధారణకం సుభోజ్యం లమ్బోదరస్యాస్తు హి భుక్తశేమ్||80||

యం యం కరోమ్యేవ తదేవ దీక్షా గణేశ్వరస్యాస్తు సదా గణేశ|
ప్రసీద నిత్యం తవపాదభక్తం కురుష్వ మాం బ్రహ్మపతే దయాలో||81||

తతస్తు శయ్యాం పరికల్పయామి మన్దారకూర్పాసకవస్త్రయుక్తామ |
సువాసపుష్పాదిభిరర్చితాం తే గృహాణ నిద్రాం కురు విఘ్నరాజ||82||

సిద్ధ్యా చ బుద్ధ్యా సహితం గణేశ సునిద్రితం వీక్ష్య తథాఽహమేవ|
గత్వా స్వవాసం చ కరోమి నిద్రాం ధ్యాత్వా హృది బ్రహ్మపతిం తదీయః||83||

ఏతాదృశం సౌఖ్యమమోఘశక్తే దేహి ప్రభో మానసజం గణేశ|
మహ్యం చ తేనైవ కృతార్థరూపో భవామి భక్త్యమృతలాలసోఽహమ్||84||

#గార్గ్య ఉవాచ..
ఏవం నిత్యం మహారాజ గృత్సమాదో మహాయశాః|
చకార మానసీం పూజాం యోగీన్ద్రాణాం గురుః స్వయమ్||85||

య ఏతాం మానసీం పూజాం కరిష్యతి నరోత్తమః|
పఠిష్యతి సదా సోఽపి గాణపత్యో భవిష్యతి||86||

శ్రావయిష్యతి యో మర్త్యః శ్రోష్యతే భావసంయుతః|
స క్రమేణ మహీపాల బ్రహ్మభూతో భవిష్యతి||87||

యద్యదిచ్ఛతి తత్తద్వై సఫలం తస్య జాయతే|
అన్తే స్వానన్దగః సోఽపి యోగివన్ద్యో భవిష్యతి||88||
~~!!ఇతి శ్రీమదాన్త్యే ముద్గలపురాణే గణేశమానసపూజా సమాప్తా||~~|

గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్..

http://tvramudu.blogspot.com/పంచామృతo

గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్..
గకారరూపో గంబీజో గణేశో గణవందితః|
గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః||1|| 

గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః|
గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః||2||

గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః|
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః||3||

గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః|
గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః||4||

గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః|
గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః||5||

గతాగతఙ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః|
గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః||6||

గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః|
గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః||7||

గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ|
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః||8||

గర్భాధారో గర్భవాసి శిశుఙ్ఞాన ప్రదాయకః|
గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః||9||

గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః|
గదాధరావతారీచ గంధర్వనగరార్చితః||10||

గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః|
గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః||11||

గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్|
గర్హితాచార దూరశ్చ గరుడోపలభూషితః||12||

గజారి విక్రమో గంధమూషవాజీ గతశ్రమః|
గవేషణీయో గమనో గహనస్థ మునిస్తుతః||13||

గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః|
గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః||14||

గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షోగణార్చితః|
గణికానర్తనప్రీతోగచ్ఛన్ గంధఫలీ ప్రియః||15||

గంధకాది రసాధీశో గణకానందదాయకః|
గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః||16||

గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః|
గవాక్షవత్సౌధవాసీగర్భితో గర్భిణీనుతః||17||

గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః|
గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః||18||

గజేశాయ గరీయసే గద్యేడ్యోగతభీర్గదితాగమః|
గర్హణీయ గుణాభావో గంగాదిక శుచిప్రదః||19||

గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః|
ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్||20||

పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్|
పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్||21||

యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి|
దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్||22||

ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది|
తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి||23|\

Thursday, August 7, 2014

శివానందలహరి1 to11

Jms-Animated Moonlight
శ్రీసత్యసాయిబాబా కరుణాకటాక్షాలతో 'శాంతిశ్రీ' జంద్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శివానందలహరికి తెలుగులో అర్థాన్ని తెలుపుతూ గ్రంధం వెలువరించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ కొన్నిశ్లోకాలను ప్రచురించ సంకల్పించాను.
ఓం నమఃశివాయ
శివశక్తే నమస్తుభ్యం
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే।
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపున
ర్భవాభ్యాం ఆనంద స్పురదనుభవాభ్యాం నతిరియమ్॥

శివపార్వతులు సర్వకళా స్థానీయులు. శ్రీచక్ర విరాజితులు. వేదసాహితీ మూర్తులు. చంద్రుని కళలు శిరసులపై అలంకరించుకున్నారు. ఒకరి తపఃఫలాలను మరొకరు అందుకొనుచున్నారు. శబ్ధార్ధములవలె కలిసియున్నారు. భక్తుల భక్తికి తగినఫలాలు అనుగ్రహిస్తున్నారు. సర్వప్రాణికోటి ఆత్మపీఠాలపై శివశంకరులై ప్రకాశిస్తున్నారు. వారుసర్వసృష్టికి మంగళస్వరూపులు. ఆత్మవిద్యకు జ్యోతులు. అద్యాత్మభక్తులకు అనుభవానందము ప్రసాదించేవారు. అఖిలజగతికి జననీజనకులైన ఉమామహేశ్వరులకు నమస్సులు.

గాధాప్రవాహం
గళంతీశంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్।
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ॥

శంభో! మహాదేవా! జగత్పతీ! మేఘాలు జడలుగాగల శివా! భక్తుల ఆర్తి హరించేవాడా! పాపహరా! మహైశ్వర్యధుర్యా! విశ్వాత్మా సౌందర్యమూర్తీ! దేవప్రియా! భక్తజన కల్పకమా! నీచరితం అమృతప్రవాహం.పరమపావనం. శివానందలహరీ! ఇది నీహృదయక్షేత్రాన్ని పండించుకాక!

మహదేవుడు
త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్।
మహాదేవం దేవం మయి సదనభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే॥

చిదాలంబా! సాంబా! నీఘనత వేదాలవల్లనే తెలుస్తుంది. నీరూపం మనోహరం. రాక్షసమాయాశక్తులకు నిలయాలైన త్రిపురాలను జయించావు. దానితో దేహభ్రాంతిని దూరంచేసిన వాడవైనావు. సృష్టికి పూర్వమే ఉన్నావు. సూర్యచంద్రాగ్నులు అనే మూడుమూల తేజస్సులను కన్నులుగా చేసుకున్నావు. ఆకాశమే నీకుజడలు.  ఆజడలే నీకు కిరీటాలు. ఔదార్యమునకు నీది ఆచార్యపీఠం. ఫణిరాజులు మణిహారాలై నిన్నుసేవిస్తుంటాయి. అందమైన హరిణబాల చెలువం చిందిస్తుంటుంది. నీవు మహదేవుడవు. అమరులందరికీ అధిపతివి. నన్ను అత్యంత వాత్సల్యంతో చూచే దయామయుడవు. అనవరతం ఆనందం ప్రసాదించేవాడవు. పార్వతీపతివి. పశుపతివి. పరమపతివి. జ్ఞానమూర్తివి.శివుడవు. కళ్యాణమూర్తివి. నిన్ను సదా నాహృదయచంక్రంలో నిలిపి ఆరాధిస్తూ శివానందలహరిలో ఓలలాడుతుంటాను.

శివానందలహరి 2

ఏకైక ఫలప్రదాత

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః
సమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్।
హరిబ్రహ్మాదీనాం అపి నికటభాజా మసులభం
చిరంయాచే శంభో శివ తవపదాంభోజ భజనమ్॥

పరమశివా! దయాసముద్రా! అక్షయ వరప్రదాతా! భక్త చింతామణీ! కామధేనూ! నీపాదారాధన విడిచి అల్పఫలాలు ఇచ్చే క్షుద్రదేవతల పాదాలుపట్టి అర్థించలేను. భ్రమలోపడి మణులను వీడి గాజుపెంకులవెంట పరిగెత్తలేను. పాలు ఇచ్చే కామధేనువును కాదని గొడ్డుటావువెంట కుండగొని పోవలేను. హరిబ్రహ్మాదులకే లభ్యములుకాని నీపవిత్ర పాదపద్మాలు నాహృదయచక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసుకొంటాను. మహాదేవ! నన్ను దయజూడు. నీవు ఒక్కడవే శాశ్వతుడవు. నిన్నువేడుకుంటున్నాను. జీవన్ముక్తిని  ప్రసాదించు.

పశువు
స్మృతౌ శాస్త్రేవైద్యే శకున కవితాగాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే ష్వ చతురః।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రధిత కృతయా పాలయవిభో॥

సర్వజ్ఞా! సర్వేశ్వరా! పరమశివా! పశుపతీ! నేను నిజంగా పశువునే. ఏమీ నేర్చుకోలేదు. ధర్మశాస్త్రాలను ఎరుగను. భాషావైదుష్యాలు లేవు. వైద్యవిద్య రాదు. శాస్త్రపాండిత్యమూ, సంగీతసాహిత్యాలు, పురాణాలు, మంత్రాలు ఏవీ తెలియవు. హాస్య శృంగారరస ప్రసంగాలు చేయటం చేతకాని పని. నీవు అన్నీ తెలిసినవాడవు. ధీనబాంధవుడవు. అనాథనాథుడవు. పశుతుల్యుండనైన నన్ను నీవేరక్షించాలి. నీవుకాదన్న వేరేదిక్కులేదు. అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ.

శుష్కతర్కాలు
ఘటోవా మృత్పిండో౭ప్యరుణురపిచ ధూమోగ్నిరచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్।
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంబోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజసుధీః॥

ఓపండితులారా! ధీరాగ్రగణ్యులారా! హేతువాద తర్కాలు కేవలం కంఠశోషను ఫలంగా మిగులుస్తాయి. అవి మృత్యువును జయించేవికావు.ఆయుఃకాలం వ్యర్థంచేయకుండా తనువులో బలం ఉన్నప్పుడే మృత్యుంజయస్వామి పాదపద్మాలను ఆరాధించండి. ఆఈశ్వరనామ స్మరణమే నీకు మేలుచేయునది.

శివానందలహరి 3

ఇంద్రియాలు 
మనప్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
కర శ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ।
తవధ్యానే బుద్ధి ర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంధైః కిం వా పరమ శివ జానే పరమతః॥

పరమశివా! సాయిదేవా! జ్ఞానస్వరూపా! నిర్థూతపాపా! నామనస్సు ఒకతుమ్మదయై నీపాదపద్మం వ్రాలి కర్ణికపై నిలిచి భక్తిమకరందాన్ని పానం చేస్తుండాలి. వాత్సల్యమూర్తీ! నావాక్కులు సుధాధారలై మధురభావల జాలులో ప్రవహించి నీపవిత్రస్తోత్ర సముద్రంలో లీనమై చరితార్థాలు కావాలి. మహైశ్వర్య ప్రదా! నాహస్తపద్మాలు నీ సమస్తోపచారాలతో పరిమళించి బాగుగా వికసించాలి.
నాగేంద్రభూషణా! నా కర్ణపుటాలు నానా మహిమాన్వితాలైన నీకథామృత ఫలాలు నిండుగా పట్టుకొని నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి. మహాదేవ! నామనస్సు సహస్రారవిందంలో సాంబమూర్తివై వెలుగొందే నిన్ను ధ్యానిస్తూండాలి. కామ్యదా! నా కన్నులలోని చూపు భ్రూమధ్యంలో నిలిచి నీఅనంతరూప వైభవాన్ని దర్శిస్తూండాలి

మోహజాలము
 
యథాబుద్ధి శ్ముక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాను సలిలం।
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ సమత్వా పశుపతే॥

గిరిజామనోహరా! శంకరా! మానవులు పెక్కుభ్రమలలోపడి నిజవస్తుతత్వం తెలుసుకోలేక మాయావస్తువుల వెంబడి నశించిపోతున్నారు. మద మోహ మాత్సర్య మాయాగ్రస్తులైన మందమతులు భ్రమలోపడి సత్యం తెలుసుకోలేక పోతున్నారు. భోగలాలసులై క్షుద్రదేవతలను ఉపాసించి ముక్తిప్రదావతవైన నిన్నుమరచి అల్పసుఖాలకై అల్పులను ఆశ్రయిస్తున్నారు. అదేశాశ్వతం అనుకుని మురిసిపోతున్నారు. శివా! నిన్ను భజించినవారు నిరుపమాన నిర్మలానందం పొందుతారు.

ఆత్మపుష్పాలు
గభీరే కాపారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః।
సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే
సుఖే నావస్థాతం జన ఇహ న జానాతి కిమహో॥

ఉమానాథా! సాయీశ్వరా! సత్యశివసుందర మహేశ్వరా! నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్దులు బాహ్యపూజకై ఎంత ఆడంబరం చేస్తున్నారు. నీకు సహస్ర సారసార్చన చేయాలని, లోతైన సరోవరాల్లో దిగి, తీగలు తెంచి ఎన్నో తామరపూలు తెంచుకుని వస్తున్నారు. లక్షబిల్వార్చనకని అడవులలోకి వెళ్ళి లేతలేత మారేడుకొమ్మలను తెచ్చి గుట్టలు పోస్తున్నారు. క్షీరాభిషేకాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బానలకొద్దీ పిందుకవస్తున్నారు. పాపం! వారికి నీవు భావప్రియుడవనీ, ఆత్మారాధన అంటే ఇష్టమనీ తెలియదు.చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన నాలుగు చిన్నిగుణాలనే పూలు నీకు సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు.

శివానందలహరి 4

పరమానందలహరి 

నరత్వం దేవత్వం నగవస మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్।
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాస్తకం చేద్ధృదయ మిహకిం తేన వపుషా॥

పార్వతీశా! సర్వలోకాధీశా! సాయీశా! నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదిమ్చినా ప్రభుపాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు ప్రభూ! స్వామీ నన్ను నరునిగా, వానరునిగా, రాక్షసునిగా ఎలా పుట్టించినా పరవాలేదు. మృగధరా! మేరుధరా! శశిధరా! శివా! నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను. శ్రీకాళహస్తీశ్వరా నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను. దేహం ఏదైనా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చేయి స్వామీ!

ఆశ్రమాలు 

వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో
నరోవా యః కశ్చిద్భవతుభవ కిం తేన భవతి।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయ స్త్వం శంభో భవసి భవభారం చ వహసి॥

విశ్వేశ్వరా! శంకరా! మానవుడు నిష్టతో బ్రహ్మచర్యాశ్రమంలోని ఎన్నో శ్రమలకోర్చి నియమాలు పాటించి, విద్యావినయశీల సంపన్నుడైనా, సర్వేశ్వరా! గృహస్థాశ్రమంలో అనేక కర్మలు కర్తవ్యాలు యజ్ఞయాగాలు దానాలు ధర్మాలుచేసినా, కైలాసవాసా!  వానప్రస్థుడై పరమనిష్ఠాగరిష్ఠుడై కేవల కైవల్య కాంక్షియైనా, త్రినేత్రా! సన్యాసియై అనేకయోగ విద్యారహస్యాదులు ఎరిగిన పండితుడైనా, మహాదేవా! మనః పద్మం నీకు సమర్పించి శరణాగతి కోరుకోగల భక్తిగలవాడైతేనే ముక్తికి యోగ్యుడౌతాడు. 

వివిధయోగాలు 

గుహాయాం ఘేవా బహిరపి వనే వాద్రిశిఖరే
జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్।
సదా యస్యై వాంతఃకరణ మపి శాంభో తవ పదే
స్థితే చేద్యోగో౭సౌ సచ పరమయోగె సచ సుఖీ॥

పరమేశ్వరా! యోగసాధకులు నానాశ్రమలుపడి శరీరాన్ని శుష్కింపజేసి అవస్థలుపడేవారే ఎక్కువగానీ మనోనిశ్చలత కలిగి మనస్సమర్పణ చేసేవారు అరుదుగా ఉన్నారు. శివా! కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసంచేసి ఉత్తీర్ణులౌతున్నారు. గంగాధరా! మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి ఘోరంగా తపస్సుచేస్తున్నారు. మారహరా! ఇంకాకొందరు గ్రీష్మంలో పంచాగ్నిమద్యలో ఒంటికాలుమీదనిలిచి ఘోరతపస్సు చేస్తున్నారు. వామదేవా! నెత్తురు గడ్దకట్టుకుపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తున్నారు. వారు తమచిత్త సరోజాన్ని పరమేశ్వరార్పణ చేయాలి అనేది మరచిపోతే వారిశ్రమ అంతా వ్యర్థంకదా. మనఃకమలం మహదేవార్పణం చేసి నిశ్చలమైన భక్తిని ఉపాసించాలి.

శివానందలహరి 5

Animated sea
                                                      దీనరక్షకుడు                                                                                     

అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమంతం మా మందం పరమకృపయా పాతుముచితమ్।
మదన్యః కో దీన స్తవ కృపణ రక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే॥

పశుపతీ! సర్వభూతాధిపతీ! శంకరా! నేను నీకథాశ్రవణం చేయలేదు. నీసంకీర్తన వినిపించుకోలేదు. నీనామం స్మరించలేదు. నీపాదపద్మాలకు అభివందనం చేయలేదు. నటరాజా! నీ పరిచర్య చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీదాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రిచేయాలనికూడా అనుకోలేదు. నీకు ఆత్మనివేదనం చేయాలనే సంగతే తెలియదు. సాయీశ్వరా! సర్వేశా! సారహీనమైన సంసారచక్రంలో పడి నలిగి నశించిపోతున్నాను. ఎక్కడా గతిలేదని తెలుసుకున్నాను. చిట్టచివరకు నీపాదాలేగతి అని తెలుసుకున్నాను. నీ సన్నిధికి చేరుకున్నాను. నన్ను నీవే చేర్చుకోవాలి. ఇంతహీనాతిహీనుణ్ణి ఎవరు రక్షింపసమర్థులు? సయాసముద్రుడివి, అనాథనాధుడివి, దీనవత్సలుడివి, అర్తరక్షాదక్షా!స్వామీ నీవే శరణం.

అనాథనాథ
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః।
త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః
ప్రయత్నా త్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః॥

శివా! అంబా మనోహరా! త్ర్యంబకేశ్వరా! నీవు దీనజనబాంధవుడవు. చంద్రకళాధరా! జంగమేశ్వరా! అనాథనాథుడవు. దీనరక్షకా! విజ్ఞానవరదాయకా! కొండకోనలలో బతికే అడవిజాతులవారైన పతితులను పావనంచేసేవాడా! పతితపావనా! పరమేశా! కరుణాసముద్రా! నీవు పాపులైన భూతప్రేతగణాలనూ ఉద్ధరిస్తావు.
ఇంతదయామయుడు దేవతాపరిపాలకులలో మరొకడులేడు. పాతకులలో నావంటి ఘోరపాతకుడు లేడు. ఇటువంటివాణ్ణి ఎవడూ రక్షించలేడు. నీవే కాపాడగల సమర్ధుడవు. మా బంధుడవు. దగ్గరున్నవాడిని ఏడిపించి దూరంగా ఉన్నవారిని కాపాడడమనేది ఏమిధర్మం. స్వామీ! శరణాగతులకు రక్షించటం నీకు సహజగుణం. భక్తుల నీకునీవే సాటి.

బ్రహ్మగీతతుడు
 

ఉపేక్షా నోచే త్కింనహరపి భవద్ధ్యానవిముఖాం
దురాశా భూయిష్టాం విధిలిపి మశక్తో యది భవాన్।
శిర స్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్॥

శివా! శిష్ట జనావనా! ఆర్యాదేవీప్రియా! నిన్ను ధ్యానించడానికి బుద్ధి నిలవటంలేదు. అపవర్గం అందించే అమృతవరదాతా మంచిపనులు చేయటానికి నామనస్సు మారాము చేస్తున్నది. మదనవైరీ! సర్వాంతర్యామీ! నీకు తెలియనిదేమున్నది. చెడ్డకామం ఎంతప్రయత్నించినా నశించటంలేదు. ఐశ్వర్యప్రదా! విశ్వకళ్యాణగుణా! నాకు అర్థమోహం దూరంకావటంలేదు.

శివానందలహరి 6

విధి 

విరించిర్ధీర్ధాయ ర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్షం సఖలు భువిదైస్యం లిఖితవాన్।
విచారః కోవా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపిచ దీనావనపరః॥

సాయీ!సాంబా! కారుణ్యసాగరా! నన్నిలా సృజించిన బ్రహ్మదేవుణ్ణి నాల్గుకాలాలపాటు బ్రతకనీ. కష్టాలన్నీ మాకేరాయనీ. ఘోరారణ్యాలలో బ్రతకమని వ్రాసినా వ్రాయనీ. మందభాగ్యులు ధీనులు హీనులు అని వ్రాసినా వ్రాయనీ. అవికూడా మామంచికే. అవి ఉంటేనే మేము నిన్ను ఆశ్రయించేది. నీ భజనచేసేది. నీవు ఔదార్యం చూపి రక్షించేది. కష్టాలే లేకపోతే నీసాంగత్యం నీభక్తిమాధుర్యం లభించేదికాదేమో.
ఆయన వ్రాతలు మమ్మేమి చేస్తాయి. మావెంట దంట కంటకనిపెట్టి నీవుండగా నీవిభూతి మాకురక్ష. నీవు మృత్యుంజయుడవు. నీకృప అపారం. నిర్హేతుకం. నీవు కాలాంతకుడవు. అచ్యుతుడు ప్రసన్నుడైతేదుఃఖాలు మాయమవుతాయి. సూర్యుడికి అభిముఖంగా నడిచేవాడికి చీకటి ఎక్కడిది?

నా అదృష్టము
ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేపి స్వామిన్ భవ దమల పాదాబ్జయుగళమ్।
కథం పశ్యేయం మాం స్థగయతి సమస్సంభ్రమజుషాం
నిలిపానాం శ్రేణి ర్నిజకనకమాణిక్య మకుటై॥

స్వామీ! జగత్రయప్రభో! నీప్రాభవం ఏమని వర్ణించను? శివా! దేవా! మహావిష్ణువు, మహేంద్రుడు, మహామహుడైన పితామహుడు ఆదిదేవతామన్యులు నీపాదారవిందాలపై మణీకిరీటాలి మోపి నమస్కరిస్తున్నారు.
రెందువైపులా రేరాజు దినరాజులున్నారు. ముందువైపున వృషభరాజు మోర పైకెత్తి మోకరిల్లుతున్నారు. దేవతాకోటికోటీర మణిమయకాంతుల వలయాలలోనీశ్రీపాద పద్మద్వయం తేజరిల్లిపోతున్నది. ఇంకా మిగిలిన దేవతాబృందాలు వివిధ దేశాధినాథులు భటులబెత్తముల దెబ్బలు భరించి పంక్తులలో నిలువుకాళ్లపై నిలిచియున్నారు.
ఇంతపెద్ద మహాసభలోకి ప్రవేశం నీపాద సందర్శనభాగ్యం నాకుకలగటం నీకృపాకటాక్ష విశేషమేగానీ అదిలేకున్న ఇదిసాధ్యమా? స్వామీ! నేను అల్పుణ్ణి. దౌర్భాగ్యుణ్ణి. దీనుణ్ణి. నన్ను సదా కరుణించు కారుణ్యసింధూ!

లొకైకప్రదాత 
త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
మహంత స్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః।
కియ ద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతీ
కదావా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా॥

పరిశుద్ధ స్వరూపా! పరమేశ్వరా! పరమాత్మా! నీవు లోకైక ప్రభుడవు. పరంధాముడవు. పరమపద ఫలప్రదాతవు. శోకనాశకుడవు. మృత్యుంజయుడవు. ఆనందదాతవు. నీకు శతవందనాలు. దేవేంద్రులంతటి గొప్పవారు పెద్దపెద్ద పదవులుపొంది పరమపదం కావలసివచ్చేసరికి నీదగ్గరకువచ్చి నిన్నే వేడుకుంటారు. వారికెన్నో వరాలు ఇస్తుంటావు. నీఔదార్యం అపారం. కామ్యాలు తీర్చటంలో నీయంతటి కారుణ్యమూర్తి మరొకరులేరు. దీనజన కామధేనువుడివి నీవు. నేను దీనాతిదీనుణ్ణి. నీవేతప్ప మరొకదిక్కులేదు నాకు. నాకోరిక చాలాచిన్నది. ఇది తీర్చుట నీకెంత? నాకు నీసేవాభాగ్యం కల్పించి నన్ను ఇక్కడే ఉంచుకో.

శివానందలహరి 7

Day of sunshine and joy
                                           నీభక్తుడను
దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే।
మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు పయమ్॥

ఓశివా! భక్తవత్సలా! దీననాథ! నేను ఈభవసాగరంలో పడిపోయాను. ఈ జంబాలకూపంలో దుర్జనులతోడి దుర్మార్గాలు, దురాశాలతలు నన్ను పాశబద్దుణ్ణి చేస్తున్నాయి. దుష్ట దుర్మదాధికారుల గృహాలు, గృహాలయందు యాచనా విహారాలు, చింతలు పంతలు నన్ను బాధిస్తున్నాయి. సారహీన సంసార సాగర తరంగాలు భయంకరంగాలేచి నన్ను భీతిల్లజేస్తున్నాయి. పాపవాగుర దుఃఖాలతో ఆచ్చాదితములైన ఊబిప్రవాహాలు నన్ని లోనికి లాక్కుపోతున్నాయి.
ప్రభూ! ఇందులో కూలిపోతున్నాను. విధి నన్నిలా చేశాడు. ఆవిథి నీకు భక్తుడని వానిమాటలు సాగిపోయేలా చేస్తున్నావు. న్రహ్మపై ప్రీతిచే నామొర వినికూడా ఉపేక్షవహిస్తున్నావు. భక్తులందరిపైన నీకు వాత్సల్యమే. బ్రహ్మ చేష్టలు, విన్నపాలు ఆలకించినవాడవు ఇవాళకాకపోయినా రేపయినా నాకోరికలు మన్నిస్తావని నాకు నమ్మకం కలుగుతోంది. దురాశవలన దుఃఖం, దుఃఖం వలన పాపం, పాపం వలన పతనం కలుగుతున్నాయి. కనుక శివా! నాకు దురాశాలేకుండా చేయి.

మానసమర్కటం
సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ
నట త్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరమభితః।
కపాలిన్ భిక్షోమే హృదయ కపి మత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో॥

ఆదిభిక్షూ! శంకరా! నామనస్సు చాలా చపలపమైనది. అదికోతి వంటిది. దానిని నీవే సరైనమార్గంలో పెట్టాలి. ఈ నామానసమర్కటం మోహకారణమైన చెరకుతోటలవంటి భోగాలవైపులు పరుగులు తీస్తుంది. కామగుణవర్థకాలైన కామీనీ కుచాద్రులపై తైతక్కలాడుతానంటుంది. ద్వేషరోషలోభాదులనే వృక్షశాఖాగ్రాలపైకి ఎగబ్రాకి కోతికొమ్మచ్చు లాడుతుంటుంది. శృంగారరస ప్రవాహాలలోని సుడిగుండాలలోదూకి మునిగి తేలుతుంటుంది.
ఇది చాలా చపలస్వభావ. దీనిని నాదగ్గర ఉంచుకోలేను. దీనితో వేగటం చాలాకష్టం. మంచిమాట ఒక్కటీ వినదు. నీమాటయితే వింటుంది. నీభిక్షుకవేషానికి తగినట్లుగా బాగా ఉంటుంది. భక్తి అనే తాడుతో బంధించి నీకు ఇస్తాను. తీసుకుపో. నాకష్టాలు తీర్చినవాడవవుతావు.

మానస పటకుటీరముధృతి స్తంభాదారాం దృఢగుణనిబద్దాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం।
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రావ్య విశదా
జయస్వామిన్ శక్త్యాసహ శివగణైస్సేవిత విభో॥

ఈశ్వరా! సాయీశ్వరా! దీనబాంధవా! నామానసం ఒకపటకుటీరంగా దిద్ది తీర్చాను. ఇందు నీవు ప్రమధగణంతో, పార్వతీదేవితో వచ్చి నివాసం చేయవచ్చు. రా! స్వామీ! రా! ఆహ్వానిస్తున్నాను. ధైర్యం అనే స్తంభాలు గట్టిగా నిలబెట్టాను. గుణాలు అనే తాళ్ళతో గట్టిగా బిగించికట్టాను. గుడారం ఏర్పాటు చేశాను. దానిలో ద్వాదశపద్మాలతో అలంకృతమైన తెరలలో గదులు ఏర్పరచాను. కుటీరాన్ని ప్రతిదినం నిర్మలగంగాతీరభూములలో వికసించిన మందారాలుతెచ్చి అలంకరిస్తున్నాను. భక్తి అనేదూది ఏకించి మెత్తమెత్తని ఆసనాలు, శయ్యలు ఏర్పాటు చేశాను. ఇది అన్నివిధాలా అర్హతగలది. దృఢమైనది. నీకుయోగ్యమైనది. నీవు వచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయవలసినది.

మన స్తస్కరుడు 
ప్రలోభాద్యై రర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతిబహుదా తస్కరపతే।
ఇమం చేతోశ్చోరం కథ మిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వామయి నిరపరాథే కురు కృపామ్॥

పరమేశ్వరా! పాపహరా! శంకరా! నామనస్సు వట్టి దొంగబుద్ధి కలది. ఈదొంగ గొల్ల‌ఇండ్లలో వెన్నలు తినివస్తుంది. చిత్తహరా! ఈదొంగ మానినీమణుల మాణిక్యహారాలు కాజేస్తుంటుంది. గుణహరా! ఈదొంగ ధనవంతులెంత జాగ్రత్తగా ఉన్నా వారికన్నుగప్పి మోసంచేసి ప్రతివస్తువునూ దోచేస్తుంటుంది. దేవరా! ఈదొంగ ఎదురుపడి పలకరించినవారిని నిలువుదోపిడీ చేస్తుంటుంది. ఈఖలబుద్ధిని నీవేమార్చాలి. మంచిమార్గంలో పెట్టాలి. ఈదొంగబుద్ధులను దారిలోపెట్టే సమర్థుడవు నీవుతప్ప మరెవ్వడూలేడు. వీడు నాస్వాధీనంలో ఉండటంలేదు. నీవు తస్కరాధిపతివి. వారిని అదిలించి మంచిమార్గంలో పెట్టే సమర్థుడవు. నామొరవిని మర్యాద కాపాడు ప్రభూ! నీకాళ్ళు పట్టుకుంటాను.

శివానందలహరి 8

జీవన్ముక్తి

కరోమి త్వత్పూజాం సపది సుఖయో మే భవ విభో

విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి।

పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా

మదృష్ట్వా తత్ధేదం కథమిహ సహే శంకరవిబో॥


ఓసాయీశ్వరా! భక్తకల్పతరువా! నీదయ అపారం. అడిగినదానికంటె అధికంగా ఇస్తావు. ఎంతపెద్దవరం అయినా వేగమే ఇయ్యగలవు. వీడు నన్నుగూర్చి బాగాభజించాడు అని విష్ణుపదవి ఇచ్చావనుకో నేను వరాహమునై నీపాదపద్మములు వెతకలేను. వీడు బాగా ధ్యానం చేశాడు బ్రహ్మపదవి ఇచ్చావనుకో హంసనై నీశిరోజాగ్రం ఆకాశమంతా వెతికిపట్టుకోలేను.
నీకేమి నీవేవైనా ఇస్తావు. కానీ నేను దక్కించుకోవద్దూ. ఆగొప్పలు నాకెందుకులేగానీ ఇసుమంత జీవన్ముక్తి ఇమ్ముచాలు. నాకు దురాశలులేవు.

శివవైభవం
 కదా వా కైలాసే కనకమణి సహగణై
ర్వసన్ శంభో రగ్రే స్పుటఘటితమూర్థాంజలి పుటః।
విభోసాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥

మహాదేవా! నీమహావైభవం మహైశ్వర్యం నాకనులారా చూడాలని ఉంది స్వామీ! ఆమథురక్షణం ఎప్పుడు అనుగ్రహిస్తావోకదా! ఆపరిశుద్ధ పరిశుభ్ర ధవళ ధగద్ధగల కైలాసాద్రి, ఆఆద్రిపై మధురమంజుల మందారపుష్పవాటిక, ఆవాటికమద్యంలో మణిమయ మహామాణిక్య రత్నమందిరం. ఆమందిరప్రాంగణంలో మెరిసిపోయే సహస్రస్తంభమంటపం. ఆమంటపంలో దేవగాంధర్వ ఆనందమంగళధ్వని.
పార్వతీపతీ! పాహిపరమేశ్వరా! అనే నారదాదుల నందిస్తోత్రస్రవంతి. మధుర మహిత లలిత కీర్తనలు. దేవకోటి సస్తవం. వీటితో నిండిన నీసంస్థాన మహావైభవంచూస్తూ నీసభలో సభ్యుడిగాఉండి యుగయుగాలనూ క్షణాలుగా గడపాలని మహాకాంక్షప్రభూ! కటాక్షించు కళ్యాణగుణధామా!

శివవిభూతి
స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభి ర్నియమినాం
గణానాం కేళీభి ర్మదకలమహూక్షస్య కకుది।
స్థితం నీలగ్రీవం త్రినయన ముమా శ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్॥

సాయీశా! మహేశా! నీవైభవ శివమూర్తిని దర్శించాలని ఉన్నది.  బ్రహ్మాది దేవతా సమూహాలు బారులుతీరి నిలువబడి 'జయజయ‌' ద్వానాలు చేస్తుండగా, నీభూతప్రేత ప్రమథగణాలు శివంకరముగా నాట్యంచేస్తుండగా, నందీశ్వరుడు మోరపైకెత్తి బ్రహ్మాండం మారుమ్రోగేలా రంకెలు వేస్తుండగా, ఈమహాసంరంభం చూచి గౌరీదేవి సంభ్రమించి నిన్ను కౌగిలించుచుండగా, నీకంఠముపై మెరిసే హరినీల కాంతిసౌందర్యం చిందుతుండగా, నీకన్నులు వింతసోయగాలు వెలయిస్తుండగా, నీవుమహదానందంగా  


శివానందలహరి9

శివానందలహరి9..
ఇంద్రియసిథ్థి 
కదా నా త్వాం దృష్ట్వా గిరిశ తవ భహ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్।
నమాశ్లిష్యాఘ్రాయ స్పుట జలజగంధాన్ పరిమళౌ
నలభ్యాం బ్రహ్మాద్యై ర్ముదమనుభవిష్యామి హృదయే॥
శివసుందర సాయీశా! మహేశా! నాఇంద్రియాలు నీసేవ ముదమార ఎప్పుడు చేస్తాయోకదా? నాహస్తాలు సంతోషంతో పొంగిపోయి ఎప్పుడు నీచరణారవింద సంవాహన చేస్తాయో? నాశిరస్సు ఎప్పుడు నీపాదపద్మాల మ్రోలవ్రాలి పవిత్ర పాదధూళిని స్పృశిస్తుందో? నానేత్రాలు ఏనాడు నీపాదపద్మ సౌందర్యం కనులారా తిలకిస్తాయో? నామనస్సు చిదాకాశంలో నీపరమపద సౌవర్ణశిఖరం దర్శించి ఆదృష్టిని అలానే ఎప్పుడు నిలుపుకుంటుందో?

కానుక
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనవతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే।
శిరస్స్థే శీతాంశౌ చరణయుగళస్థే౭ఖిలశుభే
కమర్థం దాస్యే౭హం భవతు భవదర్థం మమమనః॥
శివా! నీకు ఏదైనా విలక్షణమైన సరిక్రొత్త కానుక ఇవ్వాలని మనస్సు మారాంచేస్తున్నది. ఏమియ్యగలను.ధనువు ఇచ్చుకుందామంటే నీచేతిలో బంగారుకొడ మేరువు ధనువై ప్రకాశిస్తున్నది. పోనీ వెండిబంగారాలు ఇద్దామంటే కుబేరుడు నిత్యం పంపిస్తున్నవేకదా! నీకు చల్లగా ఉండే ఏపుష్పరసాలు సమర్పిద్దామన్నా శిరస్సుపై చంద్రుడు పండువెన్నెలలు కుమ్మరిస్తున్నాడాయె. నీకు సేవలుచేయడానికి నాకుమారీమణిని ఇద్దామంటే సర్వవిథాలా సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది. ఫలాలు ఇద్దాము అంటే భవనం ముందువెనకా అన్నీ కల్పవృక్షాలే. పాలిద్దామంటే పెరటినిండా కామధేనువులే. శంకరా! కొత్తది ఏమి ఇయ్యగలను? అన్నీ నీవిదివరకు అనుభవించినవే. మనస్సు అనే విచిత్రవస్తువు ఉన్నది. అది అర్పిస్తాను స్వీకరించు ప్రభూ!

ముక్తిదాత
సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిదుర్యజనతా సాంగత్యసంభాషణే।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిద్దమత్రభవతి స్వామిన్ కృతార్థోన్మ్యహమ్॥
సాయీశ్వరా! ముక్తిదాతవంటే నీవేదేవా! నాల్గు ముక్తులూ ఒకేసారి ప్రసాదించగలవు స్వామీ! దయాళూ! నీక్షేత్రానికి వచ్చి నీభక్తులతో స్నేహంచేసుకున్నంత మాత్రాన సాలోక్యముక్తిని ప్రసాదిస్తావు. శివా! మహాదేవా! సాయీశ్వరా! తాండవమూర్తీ! నటరాజా! అని నోరారా పిలిచినంతమాత్రాన సామీప్యానికి జేర్చుకుని సామీప్యముక్తిని అనుగ్రహిస్తావు. నీరూపంచూస్తూ నీకభిషేకం చేస్తూ నిన్ను పరికిస్తున్నమాత్రాన సంతోషించి సారూప్యముక్తిని చేకూరుస్తావు. నిన్ను మనసారా ధ్యానిస్తూ ఆత్మపీఠంపై ప్రతిష్టించుకుంటేచాలు సాయుజ్యముక్తిని అందిస్తావు.


శివానందలహరి 10

దర్శనం 
త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచేవిభో।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకర్ఉణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు॥

దేవేంద్రపూజితా! నీపాదపద్మాలు నిత్యం అర్చిస్తున్నాను. బ్రహ్మాది దేవసేవితా! నీదివ్యరూపం చిత్తంలో నిత్యం ధ్యానిస్తున్నాను. విష్ణుదేవవినుతా! నిర్మలమతితో నీకథాశ్రవణం నియతితో చేస్తున్నాను. కవీంద్ర సంసేవితా! నీచరణ నీరజాలు శరణాలని నిత్యం వేడుకుంటున్నాను.
సదుపదేశాలుచేసే జగద్గురూ! దేవముని సిద్ధ సాధ్యాదులు అర్థించే నీదర్శన స్పర్శన భాషణానుగ్రహాలు అందించి నన్ను కరుణించు కారుణ్యమూర్తీ! నీకు శతకోటి అభివందన నందన చందనాలు.

ఏమి అర్పింతు
వస్త్రోద్ధూతవిథౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణూతా
గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా।
పాత్రే కాంచన గర్భతాస్తిమయిచే ద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో॥

పశుపతీ! త్రిలోకైకపతీ! శివా! దిగంబరా! వ్యాఘ్రచర్మాంబరా! నీకు వస్త్రయుజ్ఙ్మం సమర్పించాలి అంటే వేయిచేతులు కావాలి. వేయిచేతులవేల్పు సూర్యుడే నీకు సమర్థుడు. చంద్రకళాధరా! కళార మనోహరా! నీకుపూజ చేయాలంటే సహస్రకమలాలు కావాలి. కమలలోచనుడైన విష్ణువే సంపాదింప సమర్థుడు. ఒకటి తక్కువైతే తనకంటినేఇచ్చి పూజ పరిపూర్తి చేసిన సమర్థుడు.
శ్రీకంధరా! నీకు పరిమళభరిత సుగంధరవ్యాలు సమర్పించాలి అంటే సదాగతిగల గంధవహుడైన వాయుదేవుడే సమర్థుడు. ప్రభూ! విషాహారా! నీకు సరసాన్నాలు నైవేద్యం హృద్యంగా పెట్టాలంటే అగ్నిదేవాదులకు అద్యక్షుడైన దేవేండ్రుడే సమర్థుడు. హవిర్భాగాలు అగ్నిద్వారా జలాదులు మేఘాలద్వారా సంపాదించి సమర్పింపగలరు. స్వామీ! బ్రహ్మాండసార్వభౌమా! నీకు అర్ఘ్యపాద్యాదులకు పాత్రలు సమర్పింప సర్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే సమర్థుడు. అతడు ఏదైనా సృష్టించి అర్పించగలడు.

పరమోపకారి
 నాలంవా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళేన గిశితం నోద్గీర్ణమేవ త్వయా॥

పరమశివా! పరమోపకారకా! లోకాలపై ఎంత జాలిగదయ్యా నీకు.
సముద్రమధనం జరుగుతుంటే మహాకాలకూటం నిప్పులుగ్రక్కుతూ పొంగిపొర్లివచ్చిందే. ఆభయంకర ఉద్ధృతదృశ్యం చూచి దేవతలందరూ ఇకప్రాణాలు నిలవవని భయపడూతుంటే ప్రాణాతురులైన వారిని రక్షించాలని ఈవిషం స్వీకరించావా! ఈవిషప్రభావం వలన లోపలిలోకాలు కాలిపోతాయని మింగలేదా! బయటిలోకాలు భస్మమైపోతాయని బయటికికక్కలేదా! లోకక్షేమంకోసం ఆవిషాన్ని క్రక్కలేక మ్రింగలేక పుక్కిటనే పట్టిఉంచావా దేవా! లోకాలకోసం ఎంతటికష్టాన్ని భరిస్తున్నావయ్యా! శంకరా! గరళకంఠా! సాయీశ్వరా! శతనమస్కారాలు.

శివానందలహరి 11
Cascade & Rainbow
                                           శ్రీకంఠ                                                          
జ్వాలో గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళఃకఠంవా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంభూఫలమ్।
జిహ్వాయాం నిహితశ్చసిద్ధఘటికా వా కంఠదేశే భృతః
కింతే నీలమణి ర్విభూషణమయం శంభోమహాత్మ న్వద॥

శ్రీకంఠా! శివా! సముద్రమధనవేళ ఉద్భవించిన విశ్వభయంకర విషజ్వాలలను నీసుకుమార నేత్రాలు ఎలావీక్షించగలిగాయి!  శంకరా! ఆవిషజ్వాలలను నీసుకుమార కరాలు ఎలా తాకి పట్టుకోగలిగాయి! చంద్రశేఖరా! దుర్భరమైన ఆకాలకూటవిషాన్ని నీనాలుక ఎలాసహించగలిగింది! అదేదో బెల్లపు‌ ఉండవలె, నేరేడుపండువలె, నోట్లోవేసుకుని చప్పరిస్తున్నావంటే అత్యాశ్చర్యకరం! నీమహిమ వర్ణనాతీతం.

భక్తసులభ
 నాలంవా సకృదేవ దేవ భవత స్సేవానతిర్వా నుతిః
పూజావాస్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్।
స్వామి న్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతిచే త్కిం ప్రార్థనీయం తదా॥

స్వామీ! నీవెంత దయామయుడివి తండ్రీ! నీనామమాహాత్మ్యం ఎంత అని ఎవరు గుర్తింపగలరు? ఒక్కసారి నీనామం ఉచ్చరించినంతమాత్రాన ఎట్టిపాపికైనా పాపాలన్నీ పోగొట్టి పరమపదం ప్రసాదిస్తావు. ఇందుకు అజామీళాదులు సాక్ష్యం.
నీకథలలో ఒక్కటి శ్రద్ధగా శ్రవణం చేసినా చాలు, ఎట్టిమూఢుడికైనా మోక్షం ఇస్తావు. ధృవుడు, తిన్నడు ఇది తెలియజేశారు. ఒక్కసారి అభిషేకం చేసినదానికే హస్తిరాజుకు అపవర్గం అందించావు.

వీరమణి 
కిం బ్రూమ స్తవసాహసం పశుపతే కస్యాస్తిశంభో భవ
ద్ధైర్యంచే దృశమాత్మనస్స్థితిరియం చాన్యైః కథంలభ్యతే।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్య న్నిర్భయ ఏకఏవ విహరత్యానంద సాంద్రోభవాన్॥

శివా! రుద్రా! నీవెంత ధైర్యశాలివి, వీరాధివీరుడవయ్యా! ప్రళయకాలంవచ్చి లోకాలు భస్మమయ్యే విస్ఫులింగ జ్వాలాకీలలురేగి, అందు దేవాదులుపడి మలమలమాడి మసైపోతుంటే, ఆవిలయజ్వాలలుచూచి మహాసంయమీంద్రులు సైతం ధైర్యంకోల్పోయి సమాధిస్థితివీడి గడగడ వణికిపోతుంటే, బ్రహ్మాండాలు భాండాలవలె దొర్లి భగభగమండి అగ్నిగోళాలై పఠేలున పగిలి విచ్చిపోతుంటే ఆప్రళయాగ్ని శిఖలలో విశ్వమంతా భస్మమైపోతుంటే, అమరాథినాథులు హడలిపోయి ప్రాణాలు చేతిలోపట్టుకుని పరుగుపెడుతుంటే
నీవు ఒక్కడివిమాత్రం మహాధైర్యంగా నిర్భయంగా వీరవిహారం చేయసాగావు. నీసాహసం, నీధైర్యం, నీస్థైర్యం, నీశౌర్యం ఎవరు ఎంత వర్ణించగలరు? నీకిదే నమోవాకాలు.


గణేశాయనమః సర్వ శుభప్రదాత

 గణేశాయనమః సర్వ శుభప్రదాత


గణేశాయనమః సర్వ శుభప్రదాత..
విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబుడు. సర్వలోక రక్షకుడు కనుక లంబోదరుడు. పూర్ణజ్ఞానాన్ని ప్రసాదించి, రక్షిస్తాడు కాబట్టి శూర్పకర్ణుడు. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం గణనాధుడు. 
దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి తరువాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తోంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. రుగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలోముందుగా పూజింపదగినవాడని తెలియచేసింది. సృష్టి మొత్తాన్ని ముప్ఫై మూడు కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి.

అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, సగణ, రగణ, తగణ, యగణములనే అష్ట గణములకు అధిష్ఠాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని 'ప్రణవశ్చందసామివ' అని కాళిదాసు చెప్పినట్లుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మ­ృతి చెప్పింది.
గణపతి సర్వవిద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడై, శబ్దబ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.
''జ్ఞానార్థవాచకోగశ్చ, ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్!!
'గ' అనే అక్షరం జ్ఞానార్థ వాచకమై, 'ణ' అనే అక్షరం నిర్వాణవాచకమై 'గణ' అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. దీనిద్వారా వాగధిపతి గణపతియే అని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ అనే సంస్కృత పదమునకు ప్రారంభం అని అర్థము. అందుకే వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. గణ్యంతే బుధ్యంతే తే గణాః అన్నట్లు సమస్త దృశ్యమాన పదార్థాలు, గణాలు అన్నింటికీ అధిష్ఠానదేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు.

సమస్త విఘ్నాలను రూపుమాపి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. గణనాథుడు ఓంకార స్వరూపుడని గణపత్యధ్వర శీర్షం వర్ణించింది. స్వయంభువు అయిన మూలవిరాట్టు ఉద్భవించిన తరువాత ఆయన నుంచే ముక్కోటి దేవతలూ ఆవిర్భవించారు. దేవతా గణములు ఉద్భవించి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడుగా గణపతి పూజలందుకుంటున్నట్లు గణేశపురాణం తెలియజే స్తోంది. గణేశుడువిష్ణుస్వరూపుడని 'శుక్లాంబరధర విష్ణుం' అన్న శ్లోకం సూచిస్తుంది.

సర్వసిద్ధి ప్రదుడు, సర్వమంత్ర దేవతారూపి, విఘ్నహరుడు, ప్రణవ స్వరూపుడుఅయిన గణపతికి అనేక రూపాలున్నాయి. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంతో పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలి వాహనంతో మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై, సంపద బొజ్జతో ఉన్న గజాననుణ్ణిఆరాధిస్తున్నాం.