ప్రళశ్లో: చతుర్ముఖాంభోజ వరహంసవధూ: మమ
మానసే రమతాం నిత్యం సర్వ శుక్లా సరస్వతీ
బంగారము వంటి ప్రశస్తమైన ఙ్ఞానము కలవాడు బ్రహ్మ, వేదనిధి, సృష్టికర్త.సరస్వతీదేవి విద్యాప్రదాయిని,వాగ్దేవత.
యకాలంలో విశ్వమంతా జలమయమైపోయంది. ఎక్కడచూసినా నీరు కనిపించేది. అలాంటి సమయంలో శ్రీమన్నారాయణుడు అంగ భూతమైన శేషతల్పాన పరమానంద స్వరూపముతో యోగ నిద్రలో పడుకొన్నాడు. అలా వేయి మహాయుగములు గడిచిపోయాయ. కాల శక్తి బ్రహ్మరాత్రి (కృతాది నాలుగు యుగాలను ఒ మహాయుగంగా)గా గడచిన తర్వాత స్వామిని మేల్కొలిపింది.
శేషతల్పంపై పడుకొని యున్న స్వామి యొక్క నాభి రంధ్రం నుండి అర్థవికసితమైన ఒక దివ్య పద్మం ఉదయించింది. దానిలో స్వామిలో విలీనమైన సమస్త పదార్థాలు అతి సూక్ష్మ రూపాన నిక్షిప్తమైయ్యాయ. జగత్తు జలమై కనిపించింది. స్వామి నాభియందు అంకురించిన తామరమొగ్గ వికసించింది. దానికాంతి నాలుగు దిక్కులకు వ్యాపించింది.దాని వల్ల జగత్తు ప్రకాశం అయంది. ఈ కమలంలో బ్రహ్మదేవుని ఆవిర్భావం జరిగింది.దీనితో బ్రహ్మ కల్పం ప్రారంభమైంది. చరాచర సృష్టి చేయుటకు వీలైంది. ఈ విధంగా అంతర్ మహిమలతో శ్రీ అనంత పద్మనాభుడు శేష తల్పముపై పవళించాడు. శ్రీహరి నాభి నుండి జన్మించిన బ్రహ్మ తన జన్మ రహస్యం తెలియక జన్మించిన పద్మం ఏ విధంగా జన్మించినది, దాని నుండి నా జన్మ ఏమి అని విచారిస్తూ అగాథం విశాలమైన ఈ సముద్రంలో ఏ విధంగా జన్మించినదో తెలుసుకోవడానికి నాలుగు దిక్కుల చూసాడు. దీనితో బ్రహ్మకు నాలుగుతలలు గలవాడుగా, చతుర్ముఖుడుగా ప్రసిద్ధుడయాడు. కాని బ్రహ్మకు పద్మం యొక్క జన్మ స్థానాన్ని తెలుసుకోవడానికి పద్మపు కాడ అంతర్భాగంలో వెతికాడు. విసుగు చెంది నూరు దివ్య సంవత్సరములు తపమాచరించాడు. అపుడు బ్రహ్మకు సంపూర్ణ జ్ఞానము సిద్ధించింది. తాను చూసేది అత్యంత అద్భుతమైనదిగా అర్థం చేసుకొన్నాడు. ఆదిశేషుని పడగలను ఆధారం చేసుకొని పవళించిన శ్రీహరిని గమనించాడు. తన్మయుడయ్యాడు. స్వామి శిరమున కిరీట మకుటాలు, మణిబంధమునందు కంకణములు, వక్షస్థలమున ముత్యాల హారములు, బాహులయందు భుజకీర్తులు, నడుమున మణులు కూర్చి కఠికాభరణములు, పట్టు పీతాంబరమును కంఠమున కంఠహారమును కౌస్యుభమణి, తనువు నల్లని కలువల కాంతులతో దేదీప్యమానంగా శోభిల్లుతుండడం చూసి పారవశ్యం చెందాడు. అంత విశ్వసుందరుడైన పరమాత్మ దర్శనంతో తన జన్మ సార్థకమమైనదని పరమేశ్వరునకు నమస్కరించాడు. నన్ను అనుగ్రహించి, నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యానికి ఉపయోగపడునట్లుగా చేయుమని ప్రార్థించాడు. అకుంటితమైన నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు. తపస్సునకు శ్రీహరి కరుణించాడు. బ్రహ్మకోరికను తెలుసుకొన్నాడు. జగత్ సృష్టికి ఆజ్ఞాపించాడు.
అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. స్థిరముగా నుండు వృక్షములు అడ్డముగా నడిచే పశువులు, ఆకాశాన పయనించు పక్షులు, మానవులు, సిద్ధులు, చారుణులను, దేవతలను ఇలా రకరకాలైన సృష్టి జరిగింది. అదియేకాక అపార విజ్ఞాన భాండాగారమైన నాలుగు వేదాలు పొందాడు. స్వామి అనుగ్రహముతో పూర్వపు జన్మరహస్య రీతిగనే మరల సృష్టి ప్రారంభించాడు.
ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ మూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం ..
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం ..
వ్యాసం , ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా
కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా
యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ .యా …యా …
బ్రహ్మ కపాలం'[అవతార రహస్యాలు]
పూర్వం తన ఆద్యంతాలు తెలుసుకోవలసిందిగా బ్రహ్మ - విష్ణులతో శివుడు చెప్పాడు. తల భాగం కనుక్కునే దిశగా వెళ్లిన బ్రహ్మకి, అది అసాధ్యమని తెలిసి వెనుదిరిగి వచ్చి తాను కనుక్కున్నట్టు శివుడితో చెబుతాడు. ఆయన అబద్ధం చెప్పడంతో కోపించిన శివుడు, అసత్య దోషానికి ఫలితం అనుభవించమంటూ భైరవుడిని సృష్టిస్తాడు. బ్రహ్మ తన పంచ ముఖాలలో ఏ ముఖంతో అయితే అసత్యమాడాడో, ఆ ముఖాన్ని తీసివేయవలసిందిగా ఆదేశిస్తాడు.
పూర్వం తన ఆద్యంతాలు తెలుసుకోవలసిందిగా బ్రహ్మ - విష్ణులతో శివుడు చెప్పాడు. తల భాగం కనుక్కునే దిశగా వెళ్లిన బ్రహ్మకి, అది అసాధ్యమని తెలిసి వెనుదిరిగి వచ్చి తాను కనుక్కున్నట్టు శివుడితో చెబుతాడు. ఆయన అబద్ధం చెప్పడంతో కోపించిన శివుడు, అసత్య దోషానికి ఫలితం అనుభవించమంటూ భైరవుడిని సృష్టిస్తాడు. బ్రహ్మ తన పంచ ముఖాలలో ఏ ముఖంతో అయితే అసత్యమాడాడో, ఆ ముఖాన్ని తీసివేయవలసిందిగా ఆదేశిస్తాడు.
రుద్రుడి ఆదేశాన్ని అక్షరాలా అమలుపరిచిన భైరవుడు, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే మార్గాన్ని సూచించమని శివుడిని కోరతాడు. బ్రహ్మ తల ఎక్కడైతే పడిందో ... ఆ ప్రదేశాన్ని దర్శించడం వలన ఆ పాపం తొలగిపోతుందని చెబుతాడు శివుడు. అలా బ్రహ్మ తల పడిన ప్రదేశమే 'బ్రహ్మకపాలం'గా ప్రసిద్ధిచెందింది. ఆ తరువాత బ్రహ్మ దేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా, ఆయన తల పడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు
ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలను పుణ్య లోకాలకు తరలించడమే కాకుండా, ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపజేస్తుందని స్థలపురాణం చెబుతోంది.
బదరీ వెళ్లిన వారు 'బ్రహ్మ కపాలం' అనే ప్రదేశంలో పితృకార్యాలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడ పితృ కార్యాలు జరపడం వలన, వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తూ, వారికి పుణ్య లోకాలు కలిగేలా చేస్తుంటారు. అయితే ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి ... దీనికి ఈ పేరు రావడానికి సంబంధమైన వెనుక పురాణ కథ ఇది.
ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ వస్తున్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలను పుణ్య లోకాలకు తరలించడమే కాకుండా, ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలను కూడా నశింపజేస్తుందని స్థలపురాణం చెబుతోంది.
బదరీ వెళ్లిన వారు 'బ్రహ్మ కపాలం' అనే ప్రదేశంలో పితృకార్యాలు నిర్వహిస్తూ వుంటారు. ఇక్కడ పితృ కార్యాలు జరపడం వలన, వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో పితృకార్యాలు నిర్వహిస్తూ, వారికి పుణ్య లోకాలు కలిగేలా చేస్తుంటారు. అయితే ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి ... దీనికి ఈ పేరు రావడానికి సంబంధమైన వెనుక పురాణ కథ ఇది.
భగవాన్ వేదవ్యాసునిచే రచించబడిన ప్రస్థానత్రయంలో ఒకటైన ఈ బ్రహ్మసూత్రాలు తత్త్వ విచారణకు పరమావధి. ఈ మహర్షి మహోన్నత జ్ఞానశిఖరాన్ని అధిష్టించి, ఈ తత్త్వాన్ని మానవాళికి అందచేసారు. సామాన్యులకు ఈ శిఖరారోహణం కష్టసాధ్యం. అందుకే జగద్గురు శంకరాచార్యులు తమ భాష్యంచే ఈ జ్ఞాన శిఖరారోహణానికి సులువైన మార్గాన్ని ఏర్పరిచారు. పరబ్రహ్మాన్ని గురించి చెప్తాయి కాబట్టి బ్రహ్మసూత్రాలు, సర్వసంగపరిత్యాగి అయిన సన్యాసిచే అద్యయనం చెయ్యవసినవి కాబట్టి భిక్షుసూత్రాలని, శరీరంలో ఉన్న జీవుడ్ని గురించి తెలిపేవి కాబట్టి శారీరిక శాస్త్రమని, బదరీ వృక్ష ఛాయలో నివసించే వ్యాసునిచే రచించబడ్డాయి కాబట్టి బాదరాయణ సూత్రాలనీ వీటిని వ్యవహరిస్తారు. ఈ సూత్రాలు తన బుద్ధికి తోచినట్టు రాసినవి కావు. శ్రుతి, స్మృతి సమ్మతంగా వెలయించబడ్డాయి.
ఇందులో రెండు సిద్ధాంతాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఒకటి - మానవుడు ఆపేక్షించవలసినది స్వర్గం కాదు; మోక్షం; అంటే జనన మరణాల నుండి విడివడడం. రెండు – జీవునికి, పరబ్రహ్మానికి బేధం లేదు. ఇద్దరూ ఒక్కటే. అందుకని స్థూలంగా ఇందులో పరబ్రహ్మ నిర్వచనం, జీవుని పరలోక యాత్ర, మోక్ష పలితం తెలియచేయబడ్డాయి. ఈ వివరణ చూసి ఈ తరం వారు ఇది వేదాంతవిషయమనీ, మతపరమనీ, తమకి అవసరం లేదనీ విముఖత చూపుతున్నారు. ఈ పొరపాటుని పెద్దలందరూ సరిదిద్దాలి.
ఒక విధంగా చూస్తే భారాతీయతత్త్వశాస్త్రానికి, అది ఆస్తికదర్శనరూపంలో ఉన్నా, నాస్తికదర్శనరూపంలో ఉన్నా, ఉపనిషత్తులు మూలకందం అన్నట్టు కనబడుతుంది. ఆస్తికదర్శనాలన్నీ ఉపనిషత్తుల ప్రామాణ్యాన్ని ప్రత్యక్షంగానే అంగీకరిస్తాయి. వేదాలకి ప్రామాణ్యం అంగీకరించని నాస్తికదర్శనాలు కూడా ఎన్నో ఔపనిషదసిద్ధాంతాలని తమలో ఇముడ్చుకున్నాయి. దర్శనాలు ఆస్తికదర్శనాలనీ, నాస్తికదర్శనాలనీ విభజించబడ్డాయి. వేదప్రామాణ్యాన్ని అంగీకరించే న్యాయ – వైశేషిక – సాంఖ్య – యోగ - పూర్వోత్తరమీమాంసాదర్శనాలు ఆస్తికదర్శనాలనీ, లోకాయతిక – జైన – యోగాచార – సౌత్రాంతిక – వైభాషిక – మాధ్యమిక దర్శనాలు నాస్తికదర్శనాలనీ వ్యవహారం. ఈనాడు దర్శనాలన్నింటిలోకి ఉత్తమదర్శనంగా పరిగణింపబడుతున్న ఉత్తరమీమాంసాదర్శనం ఈ దర్శనాలలో పేర్కొనకపోవడం ఆశ్చర్యజనకం. ఆ విధంగా దర్శనాల లిస్టులోకే ఎక్కని ఈ దర్శనానికి అత్యుత్తమమైన స్థానం సంపాదించిన ఘనత శ్రీశంకరభగవద్పాదులకి మాత్రమే దక్కింది. బ్రహ్మసూత్రాలకి ముందు ఏవేవో ఒకటి రెండు వృత్తులు, చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఉండేవేమో కానీ వాటి ద్వారా ఈ దర్శనానికి ఒక స్వతంత్రప్రతిపత్తి లభించలేదు.
ఈనాడు ఆరు ఆస్తికదర్శనాలు, ఆరు నాస్తికదర్శనాలు అనేవి ప్రచారంలో ఉన్నాయని గమనించాం. శ్రీ శంకరభగవద్పాదులు తమ సిద్ధాంతాన్ని స్థిరంగా నిలబెట్టడం కోసం అంతకు పూర్వం ఉన్న దర్శనాలలోని కొన్ని అంశాలను బాదరాయణ సూచిత మార్గంలో ఖండించారు. అందుచేత ఆ దర్శనాల స్వరూపం కూడా సంక్షిప్తంగా తెలుసుకోవడం అవసరం. వాటి సంక్షిప్త స్వరూపం ఇదీ:
సాధన చతుష్టయ సంపత్తి సాధించిన పిదప అనగా బ్రహ్మ జిజ్ఞాసకు అర్హత పొందిన తర్వాత

బ్రహ్మ సూత్రాలు-1
అభ్యుపగమేప్యర్దాబావాత్!
సాంఖ్య మతావలంబకుల ఆలోచన మేరకు పురుషుడు అసంగుడై, చైతన్యమాత్రుడై, నిష్క్రియుడై, నిర్వికారుడై, ఉదాసీనుడై, నిర్మలుడై, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము గలవాడై కేవలము ప్రకృతి దర్శన రూపభోగములనుభవించి వాటి నుంచి విముక్తుడై మోక్షమును పొందవలెను. వాస్తవానికి ఈ రెండింటి అవసరం లేదు. వారాశించిన ప్రయోజనము వ్యర్థమైయున్నది.
పురుషాన్మవదితి చెత్తథాపి!
సాంఖ్య మతావలంబకుల కథనము మేరకు పురుషుని సామీప్యము చేతనే ప్రకృతి జగత్తును ఉత్పత్తి చేయగలదు ఈ వ్యాఖ్య సరియైనది కాదు. ఎందుకంటే ఒక కుంటివాడు. ఒక గ్రుడ్డివాడు ఇద్దరు సఖ్యతతో కుంటివాడు, గ్రుడ్డివాని భుజములపై కూర్చొని దారి చూపెడ్తూ నడిపించగలడు. ఇద్దరు కూడా చైతన్య స్వరూపులు. కావున సంభవమైంది. కాని జడ ప్రకృతి, పురుషుని సామీప్యము వలన సృష్టి చేయలేదు.
అంగిత్యానుపపతేశ్చ!
సత్త, రజో తమో గుణములతో ఉన్న సామ్యావస్థకు ప్రధాన్ అని పేరు పెట్టబడింది. ఈ గుణములలో విషమత లేదు. కావున అంగాంగీభావము సిద్ధంచదు. వృద్ధిని అంగీ అని తగ్గుదలను అంగ అని అందుము. ఎప్పుడైతే ఈ గుణములను స్వాభావికమైనవిగా గుర్తించుతున్నామో అప్పుడు జగత్తు సృష్టి క్రమము నడుస్తూనే యుంటుంది. ప్రళయము ఎప్పటికి రాదు. కావున సాంఖ్యుల మతము అసంగతమైనది.
అన్యధానుమితౌ చ జ్ఞశక్తి వియోగాత్!
ప్రధానునిలో జ్ఞానశక్తి లేదు. కావున బుద్ధి పూర్వక రచన ఏదీ కొనసాగదు.సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సనాతనుడైన పరమాత్మ మాత్రమే ఈ జగత్తు రచన చేయగలడు. జడ ప్రకృతి జగత్తుకు కారణమని అనుకోవటం యుక్తి సంగతమైన విషయము కాదు.
విప్రతిషేధాచ్చా సమంజసమ్!
సాంఖ్య దర్శనములో అనేకమైన పరస్పర విరుద్ధ విషయాల వర్ణన వచ్చింది. పురుషుడు అసంగుడని, నిష్క్రియుడని చెప్పటం మళ్లీ ప్రకృతి ద్రష్ట అని, భోక్త అని, ప్రకృతిలో సంయోగమని, పురుషుని కొరకు ప్రకృతి భోగవస్తువని, మోక్షమని చెప్పటం అసంగతముగా ఉన్నవి. అందుకని సాంఖ్యదర్శనము నిర్దోషమైనది కాదు.
నిత్యమేవచ భావాత్!
పరమాణువాదులు పరమాణువులను నిత్యములందురు.వాటిలో ప్రవృత్తి మూలక స్వభా వము ఉన్నదనుకొనిన యెడల ఎల్లప్పుడు సృష్టి జరుగుచూనే యుండును. ఒకవేళ వాటిలో యున్న నివృత్తి మూలక స్వభావము ఉన్నదనుకొనిన యెడల ప్రళయము రానే రాదు. కావున ఈ వాదము అయుక్తమైనది.
మహద్దీర్ఘ వద్వాహ్ర స్వపరిమండలాభ్యాం!
పరమాణు కారణవాదులైన వైశేషికుల అభిప్రాయముననుసరించి అణువులు నిత్యములు. ఈ జగత్తు అణువుల నుంచి ఆర్భవించింది. భిన్నమైన అణువుల సమ్మేళనము వలన ఈ ప్రపంచము ప్రభవించింది. ప్రళయకాలమందు జగమంతయు ఒకే ఒక్క అణువులో నిబిడీకృతమై యుండును. సాధారణముగా ద్వ్యణుకములు కలిపి త్య్రణకమేర్పడును. వాటి నుంచి చతుర్గుణకములు అలాగే బహుసంఖ్యాక అణు ద్రవ్యములు ఏర్పడును. వాటి నుంచి చెట్లు, పుట్టలు, గుట్టలు, మిట్టలు, గిరినదీ సముద్రాది ప్రపంచమంతయు ఉద్భవించింది. పరమాణువు నందుండు పరిమాణము పారిమాండల్యమనబడును అనగా సూకా్ష్మతిసూక్ష్మమని అర్థము వచ్చుచున్నది. పరమాణువు కారణ శ్రీకాగల ద్వణుకమునకు పారిమాండల్య పరిమాణము ద్వణుకము కారణముగా గత్య్రణుకమునకు హ్రస్వత్తము కాక మహత్త దీర్ఘత్వ పరిమాణము నందు కలుగునని వైశేషికులు చెప్పుచున్నారు. ఇది సూత్ర విరోధమైయున్నది. వారి నియమము వారే ఉల్లంఘించిరి.
పరమాణువాదుల కథనము ప్రకారము సృష్టికి పూర్వము పరమాణువులు నిశ్చలముగా యుండును. వాటిలో కర్మ ఉత్పన్నమై పరమాణువుల సంయోగము జరుగును. దానితో జగత్తు ఉత్పత్తి జరుగును ఈ కథనము అసంగతముగా యున్నది. ఏ నిమిత్తము లేకుండా పరమాణువుల సంచారము సంభవము కాదు. జీవుల అదృష్టము వారి కర్మ సంస్కారములతో పరమాణువులలో కర్మ సంచారము జరుగును. ఇది అసంబద్ధమైన విషయము. జీవుల అదృష్టము వారితోనే యుండును కాని పరమాణువులతో కాదు. ఈ రకముగా పైన ఉదహరించిన రెండు అంశములలో కూడా పరమాణువులలో కర్మ సిద్ధించుట జరుగును. కావున పరమాణువుల సంయోగముతో జగత్తు ఉత్పత్తి జరుగదు.
వైశేషికుల కథనము ప్రకారము యుత సిద్ధి అనియు అయుత సిద్ధి అనియు రెండు సిద్ధాంతములు కలవు. త్రాడు, కుండ వేర్వేరు వస్తువులయినను, ఇవి యుత సిద్ధి వస్తువులు, వీటికి సంయోగ సంబంధము స్థాపితమగును. అలాగే దారము, వస్త్రము అయుత సిద్ధి వస్తువులు, వీటికి ఎప్పుడును సమవాయ సంబంధము స్థాపితమగును. ఈ రకముగా సమవాయములో భిన్నత ఉంటూ కూడా సమానమవుతుంది. దీనివలన అనవస్థా దోషము వచ్చును.
పరమాణువులు నిత్యములనే వైశేషికులు వాటికి రూప రసాది గుణములు అంటగట్టుట వాటి నిత్యతతకు దోషము వచ్చుచున్నది. రూపాది గుణములతో కూడి యున్న వాటిని నిత్యమైనవనుటకు వీలులేదు. రూపాది గుణము గల ఘటాదులు క్రమంగా తమ రూపాన్ని కోల్పోవుటను ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ రకముగా పరమాణువాదము వీగిపోవుచున్నది.
ఉభయథా చ దోషాత్!
సహజముగా గంధరస రూపస్పర్శలు గలది భూమి, రసరూప స్పర్శలు గలవి నీరు, రూపస్పర్శలు గల గుణములు గల తేజస్సు, కేవలము స్పర్శ గుణము కలది వాయువు. కాని పరమాణువుల యందు అధిక గుణములు యున్నవనుట దోషముయై యున్నది.
అపరిగ్రహా చ్చాత్యంత మనపేక్షా!
ప్రధాన కారణవాదమును మనువు. మున్నగు శిష్టులు ఒప్పుకొని యున్నారు. కాని ఈ పరమాణు కారణవాదమును ఏ శ్రేష్ఠ పురుషులు కూడా స్వీకరించలేదు. కావున ఇది సర్వథా ఉపేక్షణీయమైనది.
సముదాయ ఉభయహేతు కేషి తదప్రాప్తిః!
బౌద్ధమతము అనుయాయులు పరస్పరము స్వల్ప మతబేధములచే నాలుగు శ్రేణులలో విభజింపబడినారు. వారు వరుసగా వైభాషికులనియు, సౌత్రాంతికులనియు, యోగాచారులనియు, మాధ్యమికులై యున్నారు. ఇందులో వైభాషికులు, సౌత్రాంత్రికులు బాహ్య పదార్థముల శక్తిని మాత్రమే స్వీకరిస్తారు. ఇద్దరిలో యున్న వ్యత్యాసమేమంటే వైభాషికులు బాహ్య పదార్థములను ప్రధానంగా తీసుకుంటే సౌత్రాంతికులు అది రూపొందించడానికి అవసరమైన వైజ్ఞానిక పద్ధతిని పరిగణనలోకి తీసికుంటారు. యోగాచారులు నిరాలంబ/ నిరాధార విజ్ఞానము ను పరిగణనలోకి తీసికొని, ఈ బాహ్య వస్తు సముదాయమంతయు సప్నములో అగుపించిన వాటి వలె మిథ్య అని విశ్వసిస్తారు. మాధ్యమికులు అంతా శూన్యమే అని నమ్ముతారు.
వారి ధారణ ప్రకారము సంస్కారయుక్త విజ్ఞాన ప్రవాహము, దీపశిఖ వలె బాహ్య పదార్థ బాహ్య పదార్థ రూపములో అగుపిస్తుంది. దీపశిఖ రెపరెపలాడుతూ ఆరిపోవుచున్న భ్రాంతి కలిగించినా ఆ జ్యోతి పుంజం అలాగే ఉంటుంది. బాహ్య పదార్థాలు కూడా ప్రతి క్షణము నష్టపోవచునే ఉంటాయి. దీపములో చమురు అయిపోయినాక శిఖ ఆరిపోవునట్లు సంస్కారం సమసిపోవుగానే విజ్ఞానధార శాంతిస్తుంది. ఈ రకముగా శూన్యములోకి ప్రవేశించుటయే ముక్తి అనబడును. ఏది ఏమైనప్పటికిని వీరెల్లరి వాదనలు యోగ్యమైనవి కావు.
బౌద్ధ శాస్త్రములో అవిద్య, సంస్కారం, విజ్ఞానము, నామము, రూపము, స్పర్శ, వేదన, తృష్ణ, ఉపాదానము, జాతి, ముసలితనము, మరణము, శోకము, దుఃఖము, ఉద్వేగము మున్నగునవి కలదనియు అవి పరస్పర కారణరూపముగా, కార్యరూపముగా యుండునని చెప్పబడెను. అవిద్యాది పదార్థములు యంత్రముల వలె నిరంతరము ఆవృత్తములగుచుండుట చేత సముదాయము సిద్ధము కాగలదని బౌద్ధులందురు. ఇది సరియైన వ్యాఖ్యానము కాదు. ఎందుకనగా సముదాయమును ఉత్పత్తి చేయవలసిన కారణమేదియు లేదు.
ఉత్తరోత్పాదే చ పూర్వ నిరోధాత్!
ఘటము, వస్త్రము మున్నగునవి చూసినప్పుడు అవగతమగునదేమనగా కారణభూత మృతిక, తంతువులు మున్నగునవి తమ కార్యములో విద్యమానమై యుండుటను గమనించెదము. అప్పుడే వాటిలో కార్యకారణ భావము సిద్ధి ఏర్పడుతుంది. కాని బౌద్ధ మతములో, సమస్త పదార్థముల నాశనము ప్రత్యేక క్షణములో చూపబడింది. అందుకని వారి ఆలోచన మేరకు కార్యములో కారణము స్థితమవటం సిద్ధించుట లేదు.
అసతి ప్రతిజ్ఞోపరోధో యౌగపద్యమన్యథా!
బౌద్ధ మతములో నాలుగు హేతువులతో విజ్ఞానము కలుగునని చెప్పబడింది. అధిపతి ప్రత్యయము, సహకారి ప్రత్యయము, సమానాంతర ప్రత్యయము, ఆలంబన ప్రత్యయము, ఇవి క్రమముగా ఇంద్రియ, ప్రకాశ, మనోయోగ, విషయములకు పర్యాయ పదములు. వీటిలో హేతుబద్ధత లేదు.
ప్రతి సంఖ్యా ప్రతి సంఖ్యా నిరోధా ప్రాప్తి రవిచ్ఛేదాత్!
బౌద్ధమతము ననుసరించి బుద్ధి పూర్వక వినాశనమునకు ప్రతి సంఖ్యా నిరోధమని పేరు. ఇది పూర్వ జ్ఞానముతో జరుగు ప్రళయ వాచకమై యున్నది. రెండవ దానిలో స్వభావ సిద్ధముగా జరుగు వినాశనము, దీనిని అప్రతిసంఖ్యా నిరోధమందుము. దీనిని స్వాభావిక ప్రళయమందుము. ఈ పరంపర ఇలాగే సాగుతుంటుంది. కావున ప్రయోజనమేమియును లేదు.
ఉభయథా చ దోషాత్!
భ్రాంతిరూపమైన అవిద్య పూర్వజ్ఞానము వలన నశించుచున్న ది. భ్రాంతి రూపమైన అవిద్య పూర్వజ్ఞానము లేక తనకుతానే నష్టమగుచున్నది. వారు చెప్పు అవిద్యానాశనము కుదురుట లేదు. వారు చెప్పునది అసంబద్ధముగా యున్నది.
ఆకాశే చా విశేషాత్!
భూమి, జలము మున్నగునవి కాకుండా ఎన్ని భావరూప పదార్థాలు చూస్తున్నామో వాటి వలెనే ఆకాశము కూడా భావరూపమే. ఆకాశము సత్తా అందరికి తెలియును. భూమి గంధమునకు, జలము రసమునకు, తేజస్సు రూపమునకు వాయువు స్పర్శకు ఆశ్రయమై యున్నవి. అలాగే శబ్దమునకు కూడా ఏదైనా ఆశ్రయము ఉండాలి. ఆకాశమే దాని ఆశ్రయమై యున్నది. ఆకాశము నుండియే శబ్దము ధ్వనిని వినగలుగుతున్నాము. ఒకవేళ ఆకాశము లేని పక్షములో శబ్దము శ్రవణము చేయలేకపోదుము. ప్రత్యేక వస్తువుకు ఒక ఆధారము, స్థానము ఉండాలి. ఆకాశమే మిగతా నాలుగు భూతములకు ఆధారమై, అంతేకాకుండా సంపూర్ణ జగత్తుకు స్థానమిచ్చునదైయున్నది. ఏది ఏమైనను వారు ఆకాశము అభావరూపత్వాన్ని ఆవిష్కరించలేకపోయారు.
అనుస్మృతేశ్చ!
మానవులెల్లరికి తమ పూర్వపు అనుభవాలు గుర్తు వస్తుంటాయి. నేను ఫలానా గ్రామములో ఫలానా వస్తువును చూసియున్నాను. నేను బాల్యదశలో ఫలానా ఆట ఆడేవాడిని. నేను ఇరువది సంవత్సరములకు పూర్వము చూసిన వ్యక్తి అతడే ఇతడు మున్నగునవి. ఈ రకముగా పూర్వానుభవాలను ఎవరైతే పదే పదే గుర్తు చేసికుంటారో దానిని అనుస్మృతి అందుము. ఇది అప్పుడే సంభవమవుతుంది. ఎప్పుడైతే ఆత్మను నిత్యమనుకున్నప్పుడు దానిని క్షణికమనుకునిన్నప్పుడు అది స్మరణకు ఉండబోదు. కావున బౌద్ధుల క్షణిక వాదము నిర్హేతుకమైనది.
నాసతోదృష్టత్వాత్!
కుందేటి కొమ్మును, ఆకాశ పుషాన్ని, వంధాపుత్రున్ని మొదలగునవి నోటితో చెప్పుకోవటమేకాని ఆవి వాస్తవముగా లేవు. ఒకవేళ మట్టి, నీరు అను వాటిని పేర్కొనినప్పుడు, మట్టి నుండి కుండ తయారవటమును, మంచుగడ్డ కట్టటమును ప్రత్యక్షంగా చూస్తున్నాము. కేవలము నోటితో చెప్పుకున్న వాటితో కార్యోత్పత్తి జరుగదు. కావున జగత్తునకు కావలసినది సత్ పదార్థము, బౌద్ధుల వాదము అసంగతమై యున్నది.
ఉదాసీనానామసి చైవ సిద్దిః!
కేవలము ఉదాసీనముగా, నిర్లిప్తంగా, పట్టనట్లుగా యుండి కార్యాలు సిద్ధించాలనుకుంటే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికావు. తదనుగుణమైన శ్రమ తీసికున్న పక్షములోనే పనులు పరిపూర్తి కాగలవు.
నా భావ్ ఉపలబ్ధేః!
కళ్లకు అగుపించి కార్యరూపములో పరిణమించేది విద్యకాదు. దానివలన మనకు ఉపలబ్ధి ఒనగూరును. స్వప్నగత పదార్థాలను, ఆకాశ పుష్పాలను మిథ్య అందుము, వాటి వలన ప్రయోజనము చేకూరదు.
వైధమ్‌ర్యాచ్చ న స్వప్నాదివత్!
స్వప్నావస్థలో దర్శనమిచ్చిన వస్తువులు మనకు లభించవు గారడివాడు తమాషాగా చూపి మాయం చేసినట్లు స్వప్నములోని వస్తువులు దొరుకవు. మరుభూమిలో జలమున్నదని భ్రమపడటం,అద్దంలో అగుపించే చంద్రుడు మున్నగునవి మనకు అందుబాటులోకి రావు. సత్పదార్థాలకు, స్వాప్నిక పదార్థాలకు వ్యత్యాసము విపరీతంగా ఉంటుంది.
న భావోనుపలబ్ధేః!ః ఏ వస్తువు మొదట ఉపలబ్ధమగుచున్నదో దాని సంస్కారమే బుద్ధియందు ప్రవేశించుచున్నది. దాని తాలూకు భావాలు కోరికల రూపములో వెల్లడవుతూ ఉంటాయి.
న వియదశ్రుతేః!
ఛాందోగ్యోపనిషత్తులో జగత్తు ఉత్పత్తి వర్ణన వచ్చింది. మొదట తేజస్సు రచన జరిగినట్టు చెప్పబడింది. తేజస్సు, జలము, అన్నము (భూమి) ఈ మూడింటి సమ్మేళనంతో జగత్తు వర్ణన వచ్చింది. ఇచ్చట ఆకాశము ప్రసక్తి రాలేదు. భగవద్గీతననుసరించి ఆకాశము వ్యాపకమైనది. కావున అది నిత్యమైనది. ఉత్పన్నమయ్యేది కాదు.
గౌణ్య సంభవాత్!
అవయవ రహితము, వ్యాపక కారణముగా ఆకాశము ఉత్పత్తి జరగదు. కాని తైత్తరీయోపనిషత్తులో ఆకాశము ఉత్పత్తి చెప్పబడింది. అది అంత గంభీరమైన విషయము కాదు. ఇతర అభిప్రాయముతో మాత్రమే ఆకాశము ఉత్పత్తి గురించి చెప్పియుంటారు. కాబోలు.
అస్తి తు!
బ్రహ్మం సత్యమని జ్ఞాన స్వరూపుడని, అనంతుడని లక్షణములు పేర్కొంటూ బ్రహ్మం నుంచి ఆకాశము ఉత్పన్నమైనట్లు చెప్పబడింది. కాని వేదములో మాత్రము ఆకాశ ము ఉత్పత్తి వర్ణన లేదు.
శబ్దాశ్చ
బృహదారణ్యకోపనిషత్తులో పేర్కొన్న దాని ప్రకారము వాయువు, అంతరిక్షము అమృతమయమైనవి. ఏవైతె అమృతమయమై ఉంటవో వాటి ఉత్పత్తి జరగదు. ఏ రకముగా ఆకాశము అనంతమై ఉన్నదో అదే రకముగా ఆత్మ కూడా అనంతమైనది. బ్రహ్మం శరీరమే ఆకాశమైయున్నది. శ్రుతి వాక్యములతో ఆకాశము అనంతత్తము సిద్ధిస్తున్నది. కావున ఆకాశము ఉత్పత్తి జరుగదు.
స్యాచ్చైకస్య బ్రమ్మ శబ్బవత్:
బ్రహ్మం విజ్ఞానమయ తపము చేత వృద్ధిని ప్రాప్తించుకొనును, దానితో అన్నము (భూమి) ఉత్పన్నమగును. ఏ సర్వజ్ఞుడయితే ఉన్నాడో, అందరిని తెలిసినవాడున్నడో, ఎవరి జ్ఞానమయ తపముందో, దానితో బ్రహ్మం, పేర్లు, రూపము అంతేకాకుండా అన్నము ఉత్పన్నమవుతుంది. ఇందులో మొదట వచ్చిన బ్రహ్మం అను శబ్దము ముఖ్యమైన అర్థములో ప్రయుక్తమైంది. పిదప వచ్చిన బ్రహ్మం అను శబ్దము గౌణ అర్థములో ఉపయోగింపబడింది.
ఒకవేళ ఆకాశమును బ్రహ్మం కార్యము కాదని అనుకున్న యెడల బ్రహ్మం నుండి వేరుగా అనుకున్న పక్షములో బ్రహ్మంను తెలుసుకున్నా కూడా ఆకాశమును గురించి తెలియని స్థితి ఉంటుంది. దీనివలన ప్రతిజ్ఞాహాని కలుగుతుంది. అంతయు బ్రహ్మమయమైయున్నది. నిస్సందేహముగా అంతయు బ్రహ్మమే. ఎందుకంటే ఉత్పత్తి, స్థితి, ప్రళయము అందులోనే ఉన్నవి. ఆకాశము కూడా బ్రహ్మం కార్యమని శ్రుతికార్యాలు రుజువు చేస్తున్నాయి.
యావతద్వికారం తు విభాగో లోకవత్!
వీరంతా ఫలాన దేవదత్తుని కుమారులు అని చెప్పినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. అలాకాక అందులో నుండి ఒకరిద్దరు కుమారుల పేర్లను పేర్కొంటూ చెప్పినప్పుడు కూడా మిగతా వారెల్లరు దేవదత్తుని కుమారులు కాకుండా పోరు గదా! అలాగే ఈ సమస్త వికారాత్మక జగత్తు కార్యం బ్రహ్మందని చెప్పినప్పుడు ఆకాశమును వేరుగా ఎలా చూస్తాము? వాయువును, ఆకాశమును అమృత తుల్యము అని చెప్పటంలో విశేషమేమంటే అవి దేవతల వలె చిరంజీవులను అర్థం వచ్చుచున్నది.
ఏతేన మాతరిశ్వా వ్యాఖ్యాతః!
ఏ యుక్తి ద్వారా ఆకాశమును బ్రహ్మం ద్వారా ఉత్పన్నమైనదని చెప్పి రుజువు చేశామో అదే యుక్తి ద్వారా వాయువును కూడా ఉత్పన్నము చేసిన విషయము మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు.
అసంభవస్తు సతోనుపపత్తే!
బ్రహ్మం కాకుండా ప్రపంచంలోని సమస్త వస్తు సముదాయం ఉత్పత్తిశీలమేయని గ్రహించవలెను. బుద్ధి, అహంకారము, కాలము గుణము, పరమాణువు అన్నీ ఉత్పత్తి శీలములేయని భావించవలెను. వేదములో పేర్కొన్న దాని ప్రకారము ప్రళయకాలమందు ప్రతి దాని అస్తిత్వము నశించును. కేవలం బ్రహ్మమే మిగులును.
తేజో తస్తథా హ్వావా!
తేజస్సు వాయుతత్తముతో ఉత్పన్నమైంది. శ్రుతులలో ఇలా చెప్పబడింది- బ్రహ్మం మొదట వాయువును, ఆకాశమును ఉత్పన్నము చేసి పిదప వాయువుతో తేజస్సును సృష్టించెను.
పృథివ్యధికారరూప శబ్దాంతరేభ్యః!
అన్నము అను శబ్దము పృథివికి భోధకమైయున్నది. ఈ ప్రకరము తత్తము ఉత్పత్తిని తెలుపుతుంది. అన్నము రూపము నలుపు అని తెలుపబడింది.కాని అది అన్నము రూపము కాదు. అది భూమి రూపము తైత్తీయోపనిషత్తులో జలము నుండి పృథివి ఉత్పత్తి జరిగినట్లు పేర్కొనబడింది.
తదభిధ్యానాదేవ తు తల్లింగాత్సః!
పరమాత్మ స్వయముగా ఉత్పన్నము చేసిన మొదటి తత్తముతో రెండవ తత్తమును ఉత్పన్నము చేయును. దీనివలన తెలియునదేమనగా అన్నింటి సృష్టి చేయువాడు పూర్ణబ్రహ్మ పరమేశ్వరుడే కాని వేరెవ్వరూ కాదు.
No comments:
Post a Comment