పారద(పాదరస) లింగం
శ్లో!! వైద్యాయ రసలింగం యో భక్తియుక్తస్సమర్పయేత్!
జగత్రయేపి లింగానాం పూజాఫలమవాప్నుయాత్!!
పారదలింగమనగా పాదరస లింగము. దీనిని యింకా రసలింగమనియు, తేజోలింగమనియు చెప్పుదురు. వేదపరముగా పాదరసము శివుని బీజమునుండి వచ్చినదని చెప్పబడినది. ఈలింగము చాలా స్వచ్ఛమైనది, శుభకరమైనది. బ్రహ్మపురాణమునందు "పాదరసలింగమును సేవించిన - ప్రపంచ పరమార్థములనొందుటయే గాక, ముక్తిని పొందుదురని చెప్పబడినది. బ్రహ్మహత్యాపాతకము కూడా నశించును. దీనిని ’పారస్ మణి" అని కూడా అంటారు. దీనిని పూజా గృహమునందు ఎర్రని వస్త్రుపై నుంచి పూజించవలెను. పాదరసమును ఆయుర్వేద శాస్త్రరీత్యా ఘనీభవింపజేసి లింగరూపముగా చేయుదురు. ఆధునిక శాస్త్రములో పాదరసమును Mercury అని అందురు. ఐదు Metalic Elements లో ఇది ఒకటి. దీనిని రజతము (Silver), సీసము (Lead)ల మిశ్రమముతో ఘనీభవింపజేస్తారు. పారదలింగ దేవాలయములు మహారాష్ట్రలో - ’పర్భని’నందు, సింహగఢ్ పట్టణమునందు, మధ్యప్రదేశ్ లో ’ఉజ్జయిని’నందు, తమిళనాడులో ’కోయంబత్తూరు’ నందు కలవు.

శివలింగo రూపము యొక్క భావార్ధము..
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - అన్నామలై
2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం:
4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - కంచి:
5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - శ్రీకాళహస్తి:
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడలో అమర్చిన అస్వాద్ అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు

చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా!
శ్రీపార్వతీశా! మహా పాప నాశా! ప్రభాపూర్ణ విశ్వేశ! దివ్య ప్రకాశా! నినుంగూర్చి యాలించి, మమ్ముం గృపం బ్రోచు నీ రూపమే చూచి, నీ పూజలన్ జూచి, నీ కోసమే వేచి, నీ దివ్య రూపంబు చిత్తంబునం జేర్చి, నీ పాద పద్మాల సంసేవలం జేయు భక్తుండు యోగ్యుండు.నీ దివ్య ధామంబునందుండి, నిన్నుం సదా చూచు భాగ్యుండు.సుజ్ఞాన తేజుండు, దివ్య ప్రభావుండు, శశ్వన్ మహా జ్ఞాన దేదీప్యమానుండు, దివ్య ప్రకాశుండు, భక్తాగ్రగణ్యుండు కాడే!

మహా భక్తుడౌ వాని శ్రీ పాద పద్మాల ధూళిన్ శిరంబందు దాల్చేటి భాగ్యంబు పుణ్యంబుచేఁ గల్గు, నీ వెల్గులం గాంచు గల్గున్ మనో నేత్ర భాగ్యుల్, ప్రభా పూర్ణ యోగ్యుల్, నినుం గాంచు యోగుల్, లసత్ పుణ్య భాగుల్, సు నిష్కామ భోగుల్, భవానిన్ సదా గొల్చు భక్తాళి భక్తిన్ త్వదీయాంఘ్రి సంసేవనా చిత్తులై, భక్తినున్మత్తులై, ప్రభా పూర్ణ చిత్తంబుతో నీ మహత్వంబునే యెంచుచున్ భక్తితోగొల్చుచున్, లోక సంచారులై భక్తి మైకంబు నిండార శంభో మహాదేవ! భక్తాళినే కావ నీకన్న దిక్కెవ్వరంచున్ నివేదించు చుండున్గదా! దేవ! రక్షింప రావా!
మముంగావ లేవా! మంబుం బ్రోవ గారాదొకో? దేవ దేవా! నమో చంచలాక్షా! నమో ఫాల నేత్రా! నమో చంద్ర మౌళీ! నమో భస్మ తేజా! నమో చంద్ర మౌళీ! నమో పాప నాశా! నినున్ భక్తితోఁ గొల్చు నాంధ్రామృతానంత పాన ప్రబుద్ధ ప్రభా దివ్య తేజుల్ మదిన్ నిల్పి నిన్నున్. త్వదీయాంఘ్రి సంసేవనాసక్త భక్తాళినే బ్రోచి, కాపాడుమా దేవ! అనంత ప్రభావా!!

No comments:
Post a Comment