సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, October 21, 2014

ఉపనిషత్తులు వేదాంతము‬

ఉపనిషత్తులు వేదాంతము‬..
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo. 
అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. ఈ 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.
దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.వేదములవలె‬ ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి.ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.‪‎ఉపనిషత్తులలో‬ జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ మరియు పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును ‪‎శంకరాచార్యుడు‬, ద్వైతమును మధ్వాచార్యుడు‬ తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు.అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు‬ తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.
ముఖ్య ఉపనిషత్తులు
మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ‪‎ఉపనిషత్తులను‬ దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు)
2. కేనోపనిషత్తు
3. కఠోపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరేయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
11. శ్వేతాశ్వతరోపనిషత్తు
12. కౌశీతకి ఉపనిషత్తు
13. మైత్రాయణి ఉపనిషత్తు
14. బ్రహ్మోపనిషత్తు
15. కైవల్యోపనిషత్తు
16. జాబలోపనిషత్తు
17. హంసోపనిషత్తు
18. ఆరుణికోపనిషత్తు
19. గర్భోపనిషత్తు
20. నారాయణోపనిషత్తు
21. పరమహంసోపనిషత్తు
22. అమృతబిందూపనిషత్తు
23. అమృతనాదోపనిషత్తు
24. అథర్వశిరోపనిషత్తు
25. అథర్వాశిఖోపనిషత్తు
26. బృహజ్జాబాలోపనిషత్తు
27. నృసింహతాపిన్యుపనిషత్తు
28. కళాగ్నిరుద్రోపనిషత్తు
29. మైత్రేయోపనిషత్తు
30. సుబాలోపనిషత్తు
31. క్షురికోపనిషత్తు
32. మంత్రికోపనిషత్తు
33. సర్వసారోపనిషత్తు
34. నిరలాంబోపనిషత్తు
35. శుకరహాస్యోపనిషత్తు
36. వజ్రసూచ్యుపనిషత్తు
37. తేజోబిందూపనిషత్తు
38. నృసిందబిందూపనిషత్తు
39. ధ్యానబిందూపనిషత్తు
40. బ్రహ్మవిద్యోపనిషత్తు
41. యోగతత్వోపనిషత్తు
42. ఆత్మబోధోపనిషత్తు
43. నారదపరివ్రాజకోపనిషత్తు
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు
45. సీతోపనిషత్తు
46. యోగచూడామణ్యుపనిషత్తు
47. నిర్వాణోపనిషత్తు
48. మండల బ్రాహ్మణోపనిషత్తు
49. దక్షిణామూర్త్యుపనిషత్తు
50. శరభోపనిషత్తు
51. స్కందోపనిషత్తు
52 మహానారాయణోపనిషత్తు
53. అద్వయతారకోపనిషత్తు
54. రామరహస్యోపనిషత్తు
55. రామతాపిన్యుపనిషత్తు
56. వాసుదేవోపనిషత్తు
57. ముద్గలోపనిషత్తు
58. శాండిల్యోపనిషత్తు
59. పైంగలోపనిషత్తు
60. భిక్షుకోపనిషత్తు
61. మహోపనిషత్తు
62. శారీరకోపనిషత్తు
63. యోగశిఖోపనిషత్తు
64. తురియాతీతోపనిషత్తు
65. సన్యాసోపనిషత్తు
66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు
67. అక్షమాలికోపనిషత్తు
68. అవ్యక్తోపనిషత్తు
69. ఏకాక్షరోపనిషత్తు
70. అన్నపూర్ణోపనిషత్తు
71. సూర్యోపనిషత్తు
72. అక్ష్యుపనిషత్తు
73. అధ్యాత్మోపనిషత్తు
74. కుండికోపనిషత్తు
75. సావిత్ర్యుపనిషత్తు
76. ఆత్మోపనిషత్తు
77. పశుపతబ్రహ్మోపనిషత్తు
78. పరబ్రహ్మోపనిషత్తు
79. అవధూతోపనిషత్తు
80. త్రిపురతాపిన్యుపనిషత్తు
81. శ్రీదేవ్యుపనిషత్తు
82. త్రిపురోపనిషత్తు
83. కఠరుద్రోపనిషత్తు
84. భావనోపనిషత్తు
85. రుద్రహృదయోపనిషత్తు
86. యోగకుండల్యుపనిషత్తు
87. భస్మజాబలోపనిషత్తు
88. రుద్రాక్షజాబలోపనిషత్తు
89. గణపత్యుపనిషత్తు
90. దర్శనోపనిషత్తు
91. తారాసారోపనిషత్తు
92. మహావాక్యోపనిషత్తు
93. పంచబ్రహ్మోపనిషత్తు
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
95. గోపాలతాపిన్యుపనిషత్తు
96. కృష్ణోపనిషత్తు
97. యాజ్ఞవల్క్యోపనిషత్తు
98. వరాహోపనిషత్తు
99. శాట్యానీయోపనిషత్తు
100. హయగ్రీవోపనిషత్తు
101. దత్తాత్రేయోపనిషత్తు
102. గరుడోపనిషత్తు
103. కలిసంతారణోపనిషత్తు
104. బాల్యుపనిషత్తు
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు
106. సరస్వతీ రహస్యోపనిషత్తు
107. భహ్వృచోపనిషత్తు
108. ముక్తికోపనిషత్తు
‪‎దశోపనిషత్తులను‬ చెప్పే ప్రామాణిక శ్లోకం:
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా

No comments:

Post a Comment