కర్మ-జన్మ-చక్రం..

ఈ జగత్ అంతా ఓ నిరంతర నాటకం . ఆడించేది దైవ శక్తి .ఆడే వారు కూడ ఆత్మ లుగా మారిన దైవమే! ఆత్మ స్వరూపులైన మనుషులు నిజం (స్వ స్వరూపం ) మరిచి , ద్వంద భావాలతో కొట్టు మిట్టాడ ట మే మాయ అని అద్వైతులంటారు. నేటి జన్మ లో ఉన్న సహజాత లక్షణాలు, ఆలోచనా సరళి,వ్యక్తిత్వం,శరీర నిర్మాణం అన్నీ మన పూర్వ జన్మల నుండి మోసుకొని వస్తూనే ఉంటాం.సంచిత కర్మ వెన్నంటే వుండే నీడలాంటిది. ప్రారబ్ద కర్మ ప్రస్తుత జన్మ లో అనుభవించవలసినది ఈ జీవము. ఆగామి కర్మ ప్రస్తుత జన్మలో కొత్తగా కూడ బెట్టు కొనే కర్మ.ప్రతి విషయమూ,సంఘటన,రాగ ద్వేషాలు బంధాలు-అన్నీ మనం జన్మించక మునుపేనిర్ణయింప బడి ఉంటాయి .అదే విధి!!కానీ,ఎవరైతే జ్ఞాన సంపద తో వివేక వైరాగ్య విచక్షణలతో తన ఆలోచనా కర్మలను ద్వంద భావ రహితంగా, సాక్షీ భావముతో అనుభవిస్తారో వారిపై కర్మ యోక్క భారము, విధి పనిచేయవు. మనిషికి ఆ స్వాతంత్రం సాధించే శక్తి వెసులుబాటు ఉంది.శరణాగతి, ధ్యానం, కర్మఫల సన్యాసం వీటన్నింటి ద్వారా ఆత్మ జ్ఞానం తద్వారా''కర్మ-జన్మ-చక్రం''నుండి విముక్తి పొందగలరు.

No comments:
Post a Comment