సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, June 17, 2016

లక్ష్మీదేవి క్షేత్రం కొల్హాపూర్‌

సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. వైకుంఠంలో వున్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెను దర్శించుకొని పునీతులవుతుంటారు. శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్‌కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది.
వైకుంఠపురి నుంచి.. శ్రీమహావిష్ణువు వైకుంఠంలో వుండగా భృగుమహర్షి వచ్చాడు. అయితే రుషి రాకను విష్ణువు గమనించలేదు. దీంతో ఆగ్రహం చెందిన భృగువు స్వామివారి ఎదపై కాలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్లి కొల్హాపూర్‌ సమీపంలో తపస్సులో మునిగిపోయింది.
భృగువు పాదంలో కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు రుషి గర్వాన్ని అణచివేశాడు. అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.
ప్రళయంలోనూ చెక్కుచెదరదు.. ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.
అరుదైన శిలపై అమ్మవారి రూపం
శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.
కిరణోత్సవం.. సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు. నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్‌ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది.
ఎలా చేరుకోవాలి
* దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ.
* పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్‌కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.

Wednesday, June 15, 2016

శ్రీ మహాలక్ష్మి సువర్ణాలయం


బంగారం... స్తంభాలు బంగారం... వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం... అన్నీ బంగారంతో చేసినవే. అంటే స్వర్ణదేవాలయం! అమృత్‌సర్‌ స్వర్ణదేవాయంలో కూడా మంటపాలూ, గోపురాలూ ఇవన్నీ ఉండవే అనుకుంటున్నారా... మీ సందేహం నిజమే, ఇది అమృత్‌సర్‌ గురుద్వారా కాదు, తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం!
వంద ఎకరాల విస్తీర్ణం... 1500 కిలోల బంగారం... 400 మంది శిల్పులు... ఆరేళ్ల నిరంతర శ్రమ... అద్భుతమైన శిల్ప చాతుర్యం... సుమారు 600 కోట్ల రూపాయలు... వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం.
ఇప్పటివరకూ స్వర్ణదేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్‌సర్‌. కానీ, ఇప్పుడా ఖ్యాతిని శ్రీపురమూ దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తరవాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి, శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్‌తోనే రూపొందించి, బంగారు తొడుగుతో అలంకరించారు.
చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ధి. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాలి. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్‌, బైబిలులోని ప్రవచనాలను రాశారు. వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞానసుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తిఅమ్మ ఉద్దేశం.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు.
మూలస్థానంలో...
వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది.
అంతా ఒక్కటే!
మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. భద్రత దృష్ట్యా ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమేరాలు, తినుబండారాలను అనుమతించరు.
ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చే సరికి... అమ్మవారి దివ్యమంగళ స్వరూపం, గోడలపై కనిపించే మతగ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. వారిని సదా ఆధ్మాత్మిక మార్గంలో నడిపిస్తాయి... అని శక్తిఅమ్మ చెబుతుంటారు.
దర్శనం కోసం..
వేలూరు నుంచి దక్షిణాన వూసూర్‌ ఆనైకట్లు వెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీపురం నెలకొంది. ప్రతిరోజూ ఉదయం 5.00 గంటల నుంచి 7.30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, అలంకారం, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు.
ఎవరీ శక్తిఅమ్మ
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్‌. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్‌ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్‌. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం... ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.
ప్రతిదీ ప్రత్యేకమే!
శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కన్నా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ.
* నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు. రిజర్వ్‌బ్యాంకు అనుమతి పొంది మినరల్స్‌ అండ్‌ మెటల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ బంగారాన్ని కొనుగోలు చేశారు.
* కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది.
* 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
* ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయానికి మల్లే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్‌ పూర్తిగా బంగారంతో చేసిందే.
* ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు.
* ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
* ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు.
* ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది.
* ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి.
ఇలా చేరుకోవాలి
* చిత్తూరు నుంచి 49 కి.మీ.దూరంలో వుంది.
* తిరుపతి నుంచి 134 కి.మీ.దూరంలో వుంది.
* రైలులో కాట్పాడి రైల్వేస్టేషన్‌లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు.
* చెన్నై విమానాశ్రయం నుంచి 145 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది.
* తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని సందర్శించుకోవచ్చు..

కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి

భక్తుల పాలిట పెన్నిధి కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి
భక్తుల పాలిట పెన్నిధి కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి
మే 31న హనుమజ్జయంతి

శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

రెండో ప్రతాపరుద్రునికి దర్శనం..
క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు వెళుతాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్లీ పులి గాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు. అప్పుడు కూడా ఎలాంటి జంతువు కనిపించలేదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం లభ్యమైంది. పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్లిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి అనుజ్ఞ ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు.
స్వామివారే హెచ్చరించారు..
17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్‌ పాలకుడు ఔరంగజేబ్‌ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే స్వామి దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్‌ స్వయంగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో 'మందిర్‌ తోడ్‌నా హైతో పహలె తుమ్‌ కరో మన్‌ఘట్‌'(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్‌ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. కరో మన్‌ఘట్‌ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.
నిత్యపూజలు
స్వామివారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతుంటాయి. రోజూ వందలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్‌ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతుంది.
ఇలా చేరుకోవచ్చు
* హైదరాబాద్‌ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఆలయం వుంది.
* దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ల నుంచి చేరుకోవచ్చు.
* మీర్‌పేట్‌, జిల్లెల్లగూడ, నాదర్‌గుల్‌, ఆర్‌.ఎన్‌.రెడ్డినగర్‌...తదితర శివారు ప్రాంతాలకు వెళ్లే సిటీ సర్వీసులు కర్మన్‌ఘాట్‌ మీదుగానే వెళుతాయి.

Monday, June 13, 2016

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

శ్రీ మారుతి స్తోత్రం


శ్రీ మారుతి స్తోత్రం


మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత

ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ  సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా  భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..

2) ఆంజనేయస్వామిని పూజిస్తే కలిగే ఫలితాలు.....!!!
స్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియం. సహస్ర నామార్చన, అష్టోత్తరములతో తమలపాకులు సమర్పించిన శుభం కలుగుతుంది. తమలపాకులు పూజకు ఉపయోగించుట మంగళకరం.
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. ఒకసారి సీతమ్మవారి పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడతాడని తెలుసుకొని తన ఒంటినిండా సింధూరం పూసుకొన్న రామభక్తుడాయన. అందుకే స్వామికి సింధూరం అత్యంత ఇష్టమైనదిగా చెప్తారు.
హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి.
హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం.

శ్రీ రామరక్షా స్తోత్రం



ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః
ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్
స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం
శ్రీరామ జయరామ జయజయరామ!!

 అంజనా నందనం వీరం
జానకీ శోక నాశనం
కపీశ మక్ష హంతారం
వందే లంకా భయంకరం....
అంజని నందన వీరాంజనేయ వినతిని వినుమో గురువరరాయ...
ఒంటి తల రావణాసురులు అడుగడుగునా ఉన్నారు స్వామీ....వారి బారి నుండి నువ్వే కాపాడాలి...అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ....తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఆంజనేయ!!



సర్వాంగ పూజ అంటే ఏమిటో మీకు తెలుసా

సర్వాంగ పూజ అంటే ఏమిటో మీకు తెలుసా..........?

సర్వాంగ పూజ ఎందుకు.....!
భగవంతునికి ధన,వస్తువులను ఇవ్వలేము, మాట సహాయమూ చేయలేము. అయితే, ఆయన మనకు శరీరాన్ని, అందులో ఎంతో అమూల్యమైన అంగాలను సృజించి ఇచ్చాడుకదా!
ఆయా అంగాలతో, చేయవలసిన కర్మలను ధర్మపరంగా చేయటమే ఆయనకు మనంచేసే ప్రత్యుపకారం. దానితోనే ఆయన సంతోష పడతాడు అని పెద్దలు నిర్ధారించుకొని, ఒక 'పూజా' విధానాన్ని సూచించారు. దానినే ''సర్వాంగ పూజ లేదా అధాంగ పూజ'' అని అంటారు.
ఈ పూజావిధానం ఈ క్రింది విధంగా వుంటుంది. ఇది చాలామందికి తెలిసే వుంటుంది. అయితే, చాలామంది ఈ పూజను యధాలాపంగా చేసేస్తుంటారు. అలాకాకుండా, తత్త్వాన్ని తెలుసుకొని, అనుభవిస్తూ పూజ చేయాలి.

పాదౌ పూజయామి (పాదాలు) ........
ఏదైనా సాధించాలంటే ముందుకు ఒక అడుగు వెయ్యాలికదా. ఆ అడుగు వెయ్యాలంటే పాదాలు వుండితీరాలి. చీకటిలోకూడా ముందుకు పోవటానికి పాదాలకి కళ్ళుంటాయి(స్పర్శ)! షిరిడి సాయిబాబా అంటారు !
"నీవు నావైపుకు ఒక అడుగు వెయ్యి, నేను నీవైపు నాలుగు అడుగులు వేస్తానని".

రేడియో తరంగాలను పొందటానికి ‘యాంటినా’ ఎట్లా ఉపయోగపడుతుందో, మన శరీరానికి కావాలిసిన శక్తిని;
ఆ శక్తిని నియమబద్ధం చేయటానికి అరికాళ్ళు, అరిచేతులు పనిచేస్తాయి. మన శరీరంలోని నాడీమండల వ్యవస్థలో ప్రతి అంగానికి సంబంధించిన నాడులయొక్క ఒకవైపు కొనలు అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వ్యాపించివుంటాయి. ఆక్యుప్రెజర్ వైద్య విధానంలో అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వున్న అన్ని నాడులను ప్రత్యేకంగా నొక్కటంద్వారా మనలోని శక్తి క్రమబద్ధీకరించబడుతుంది. సహజంగా ఈ ప్రక్రియ మనం రోజూ నడవటంద్వారా జరుగుతుంది. పాదాలకి ఇంత ప్రాముఖ్యత వున్నది కాబట్టే, అలాంటి పాదాలను మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో భగవంతుడి పాదాలను పూజించాలి.

గుల్ఫౌ పూజయామి (చీలమండల బుడుపెలు)........
పాదాలను పిక్కలతో అనుసంధానం చేయటానికి ఇవి తోడ్పడతాయి. పాదాలలోకి వచ్చే అన్ని నాడులకు ఇవి రక్షణ కల్పిస్తాయి; పాదాలు కదలటానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకనే వీటిని పూజిస్తాము.

జంఘే పూజయామి (పిక్కలు)......
మోకాలుకి పాదాలకి అనుసంధానమై వుంటాయి. పాదాలకి కావలసిన శక్తిని కొవ్వురూపంలో నిల్వచేసుకుంటాయి. అందుకే పిక్కబలం బాగా వుండాలి అని అంటుంటారు. ఇక్కడ వుండే రెండు ముఖ్యమైన ఎముకలే మనిషిని నిటారుగా నిలబెడతాయి. కాబట్టి వీటికి పూజ చేస్తాము.

జానునీ పూజయామి (మోకాళ్ళు)......
ఇవి తొడలని, పిక్కలనీ అనుసంధానం చేస్తాయి. తిరుపతిలో మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కాలన్నా, హిమాలయ పర్వతాలని ఎక్కాలన్నా మోకాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎంతో మనకి తెలిసిందే. అందుకే వాటికి పూజచేస్తాము.

ఊరుః పూజయామి (తొడలు)...........
ఇవి పై భాగమైన నడుముకు అనుసంధానించబడి వుంటాయి. వీటికి చాలా ప్రాధాన్యంవుంది. వీటిల్లో కొవ్వు ఎక్కువగావుండి మెత్తగావుంటాయి. మనం కూర్చున్నప్పుడు పరుపులాగా పనిచేస్తాయి. వీటిల్లో కొవ్వు ఎక్కువుగా వుండి, మెత్తగావుండి మన మర్మాంగాలకు దెబ్బతగలకుండా కాపాడుతాయి. వెన్నుపూసలోని ఆఖరి పూసకు కూడా దెబ్బతగలకుండా కాపాడతాయి. ఇంత ముఖ్యమైనవికాబట్టే వీటికి పూజ చేస్తాము.

కటిం పూజయామి (నడుము)...........
మన శరీరం మొత్తానికి మధ్యభాగం. పై శరీర భాగంయొక్క మొత్తం బరువు దీనిపై ఆధారపడివుంటుంది.

ఉదరం పూజయామి.....................
మనిషి ఆహార రసంనుండి పుడుతున్నాడు. అలంటి ఆహారాన్ని జీర్ణంచేసి, ఆహారరసాన్ని తయారుచేసి శరీరానికి అందచేసే ఒక మహాద్భుత రసాయన కర్మాగారం ఇది అనటంలో అతిశయోక్తి లేదు. తల్లి తన ప్రతిరూపానికి ప్రాణంపోసి, నిలుపుకుని, నవమాసాలు మోసే ప్రధాన అంగం ఇదే. అమ్మ కడుపు చల్లన అనే నానుడి ఎంతో గొప్పది.

 విషాన్ని అయినా హరించే శక్తి ఈ ఉదరానికి వుంది. వాడి కడుపునిండా ఆలోచనలే అంటుంటాం, కారణం ఆహారం లేకపోతే మెదడుకూడా పనిచేయదు. "కడుపు ఆకలితో వున్నవాడికి దేవుడి గురించి చెప్పొద్దు'' అని శ్రీ వివేకానందుడు అంటాడు, కారణం ఆకలితో అలమటించినప్పుడు ఏ మాటా రుచించదు, తలకెక్కదు కూడా. ఇంతటి ముఖ్యమైన అంగం కాబట్టే, దీనికి పూజ చేస్తాము.

నాభిం పూజయామి...........
 త్రిమూర్తులలో బ్రహ్మ పుట్టుకకు, భూమిమీద ప్రాణుల్లో మనుషులకు ఆధారమైనది నాభి. నవమాసాలు అమ్మ పొట్టలో పుట్టి, పెరిగే ప్రాణికి తల్లినుంచి అందే ఆహారం, రక్తం, గాలి అన్నీ బొడ్డుతాడు ద్వారానే కడుపులోవున్న బిడ్డకి అందుతాయి అందుకే దీనికి పూజ.

హృదయం పూజయామి...........
ఉదరం ఆహార రసాన్ని తయారుచేసినా, దానిని శరీరంలోని ప్రతి కణానికి అందచేయాలంటే, రక్తప్రసరణ ద్వారా హృదయమే కదా చేసేది! 'అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న క్షణంనుంచి, చనిపోయే క్షణంవరకూ అవిశ్రాంతంగా పనిచేసేదే ఈ హృదయం! అందుకే పూజ.

బాహూమ్ పూజయామి (బుజాలు).......
 చేతులను శరీరభాగానికి కలిపివుంచే భాగమే భుజస్కంధాలు. ఎంత బరువునైనా ఇవి మోయగలవు. కేవలం భుజబలంతో ప్రపంచాన్నే గెలిచిన మహాధీరులు ఎంతోమంది వున్నారు చరిత్రలో. అంత శక్తి కలవి కాబట్టి వీటికి పూజ చేస్తాము.

హస్తౌ పూజయామి............
ఇంతకుముందే చెప్పుకున్నాం అరచేతుల్లోకూడా నాడీ కొనలువ్యాపించివుంటాయి అని. అతి చిన్న పనినుంచి అతి పెద్ద పనులు చేయాలంటే చేతులయొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో మనకి తెలుసు. కంటిలో నలుసును తీయాలన్నా, పిల్లల్ని ఎత్తుకోవాలన్నా చేతులయొక్క అవసరం ఎంతో వుంది. ఏ పని చెయ్యాలన్నా మన శరీరంలో ఎక్కువగా వాడబడేవి చేతులే.
ఆఖరికి భగవంతుడికి నమస్కారం చేయాలన్నా చేతుల్నే వాడతాం. దానం చేసినా-తీసుకున్నా, ఒక ప్రాణిని పెంచినా-చంపినా; రాజదండాన్ని ధరించినా, ముసలితనంలో చేతికర్రను పట్టుకున్నా, తినాలన్నా, మరొకరికి పెట్టాలన్నా, అనుభూతిని స్పర్శద్వారా తెలిపినా, అభయం ఇచ్చి ఆదుకున్నా అన్నింటికీ ఈ చేతులే! అందుకే వీటికి పూజ.

కంఠం పూజయామి..............
 మెదడునుంచి మన శరీరంలోని అన్ని అంగాలను అనుసంధానిస్తూ సాగే 'నాడు'లన్నీ కంఠం నుంచే వెళ్తాయి. ఇక గాలి, ఆహారం ఇవి రెండూ కలిసిపోకుండా చూసే ప్రక్రియకూడా కంఠంలోనే జరుగుతుంది. మంచి మాట మాట్లాడాలన్నా, మంచి పాట పాడాలన్నా కంఠం సహకరించాల్సిందే. చెవు, ముక్కు, కళ్ళు, నోరు వీటన్నిటి అంతర్భాగాల సంధానం కంఠంలోనే జరుగుతుంది. ఒక వ్యక్తిని గౌరవిస్తూ పూలదండ వేయాలన్నా, స్త్రీ తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవటానికి నగలు ధరించాలన్నా కంఠం ఒక్కటే ఆధారం. ఇంత ముఖ్యమైనది కాబట్టే, కంఠాన్ని పూజిస్తాం.

దంతం పూజయామి.............
ఏ ఆహారాన్ని అయినా కొరకాలన్నా, నమిలి తినాలన్నా, స్వరపేటికనుండి వచ్చే శబ్దాలను నియంత్రిస్తూ ఉఛ్చారణను స్పష్టపరచాలన్నా దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే వీటికి పూజ.

వక్త్రం (నోరు) పూజయామి..........
దంతాలను, నాలుకను తన అధీనంలో వుంచుకున్నదే నోరు. చిన్ని కృష్ణుడు యశోదమ్మకు తన నోటిలోనే సమస్త భువనభాండాలనీ చూపించాడు. కనుకనే దీనికి పూజ.

నాసికాం పూజయామి......
 ప్రాణవాయువుని క్రమబద్ధంగా ఊపిరితిత్తులకు పంపాలన్నా, ప్రాణయామంచేస్తూ, నాసికాబంధనం చేస్తూ శరీరంలో ప్రవహించే పంచప్రాణాలను నియంత్రిస్తూ మహా ఋషులు కావాలన్నా ఆధారం నాసికే! అందుకే దీనికి పూజ.

నేత్రాణి పూజయామి.........
ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచాన్ని చూడాలన్నా; మన మనస్సులో అలోచనలు కలిగించి, వస్తు, విషయ జ్ఞానాన్ని పొందాలన్నా నేత్రాలదే ప్రధమ స్థానం. మనలోని నవరసాలను ప్రతిబింబించేది నేత్రాలద్వారానే. అన్ని దానాలలో కెల్లా నేత్రదానమే అతి గొప్పది అని పెద్దలు చెప్పటంలో అతిశయోక్తి లేదు. కనుకనే దీనికి పూజ.

లలాటం పూజయామి.........
మనిషి మెదడులోని కొంత ముఖ్య భాగం లలాటం అనబడే ముందుభాగం లోపల వుంటుంది. ధ్యానం చేసేటప్పుడు లలాట భాగంలోని మెదడు ( frontal lobo) నియంత్రించబడుతుంది. యోగభాషలో 'ఆజ్ఞా చక్రం' అని అంటారు. అంటే, మన శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలను ఇది ఆజ్ఞాపిస్తుంది. కనుకనే దీనికి పూజ.

కర్ణౌ పూజయామి..........
 ఒక మనిషి ఎంత గొప్ప పండితుడైనా, అతను చెప్పేది వినాలంటే మనకి చెవులుంటేకదా సార్ధకత! చెవులు కేవలం వినటమనే పనికాకుండా మరొక ముఖ్యమైన పనినికూడా చేస్తాయి: ఒక చేత్తో బరువులు మోసేటప్పుడు, జారుడుగా వుండే నేలమీద నడిచేటప్పుడు మన శరీరం తూలి క్రింద పడిపోకుండా వుండటానికి చెవులులోని ద్రవం సహాయం చేస్తుంది మనకు తెలియకుండానే!! అందుకనే వీటికి పూజ.

శిరం పూజయామి............
 మన శరీరం మొత్తానికి ఆధిపత్యం వహించేది శిరమే! ఇందులోని మెదడు లేనిదే అసలు ఈ శరీరమేలేదు. మనిషిలోని మానవత్వం, జాలి, కరుణ, కోపం, ప్రేమ, ద్వేషం, అనురాగం, ఆత్మీయత, తెలివి ఒకటేమిటి ప్రతిదీ ఈ శిరస్సులోంచి వచ్చేదే. భగవాన్, ఇన్ని అమూల్యమైన అంగాలను నాకిచ్చావయ్యా అని చెప్పే తెలివిని కలిగివుండేదికూడా ఈ శిరస్సే. కనుకనే ఈ శిరం పూజ.

ఉపసంహారం.......
 ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏ పూజ చేసినా 'త్రికరణ శుద్ధి'గా చేయాలని పెద్దలు చెబుతారు. త్రికరణ శుద్ధిగా అంటే, మనసా, వాచా, కర్మణా అని అర్ధం. భగవంతుడు మనిషికి సంకల్పించటానికి మనసు, మనసులోని సంకల్పాన్ని బయటకు చెప్పటానికి మాట, ఆ మాటను కార్యరూపంలోకి మార్చటానికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. ఫలితాలను ఆశించినా, ఆశించికపోయినా త్రికరణ శుద్ధిగా చేసిన ఏ కర్మలకైనా సిద్ధించే ఫలితం ఉత్తమమైనదిగా వుంటుంది.

Saturday, June 11, 2016

హనుమoతుడు వాయుపుత్రుడు


 హనుమoతుడు వాయుపుత్రుడు,
 శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు......!!
పూర్వకాలం లో పుంజికస్తల అనే అప్సరస ఒకసారి భూలోకానికి వచ్చి తిరుగుతుండగా ఒక కోతి ధ్యానమగ్నమై ఉండగా చూసి అతని తపస్సు కు భంగం కలిగే విధంగా ప్రవర్తించినది(పెద్దగా నవ్వుతూ అతని మీద రాళ్ళు వేసినది). అప్పుడు తపస్సు నుండి లేచిన ఆ తపస్వి ఆమెను మరు జన్మలో వానరo గా పుట్టమని శపించాడు. ఆమె చేసిన తప్పును గ్రహించి శాపవిమోచనం చెప్పమనగా ఇది దైవకార్య నిమిత్తమై ఆ పరమాత్మ తనతో ఈ విధమైన శాపాన్ని ఆమెకు వచ్చేలా చేసాడు అని, ఆమె వానరం గా ఉన్నపుడు అతివీరభయంకరమైన బలం కలిగిన పుత్రుడిని శివ అంశగా పొందుతావు అని ఉరడిoచాడు.
ఈ విషాదం తో స్వర్గానికి చేరిన ఆమెను తనను సంతోషింప చేయవలసినది అని ఇంద్రుడు కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు కనుక ఆమెను భూలోకం లో జన్మించమని శపించాడు.
ఆమె కుంజ అనే ఒక వానర యోదునికి కుమార్తె గా జన్మించింది. ఆమెకు అంజన అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత ఆమెను కేసరి వివాహం చేసుకున్నాడు. ఒకనాడు కేసరి దక్షిణ సముద్రం ఒడ్డున తపస్సు లో ఉండగా వారి ఇంటికి అగస్త్య మహర్షి వచ్చారు. అప్పుడు అంజన ఆ మహర్షికి సర్వ ఉపచారములు చేసింది. ఆమె అతిధి సత్కారానికి సంతోషించిన అగస్త్యుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంజన తనకు అతి బలవంతుడైన, బుధివంతుడైన పుత్రుడు, సర్వ లోకముల కు శాంతి చేకూర్చే వాడు కావలి అని కోరుకుంది. అగస్త్యుడు మహాముని కనుక తధాస్తు అని దీవించి, ఆమెకు సాక్షాత్తు ఆ మహాదేవుని అంశతో పుత్రుడు కలుగబోతున్నాడు కనుక ఆమెను అందుకు సిధం చేయాలి అని తలచి ఆమెను వృషభాద్రి పై అకాశగంగ ప్రక్కన ధ్యానం చేయవలసినది గా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పిన విధం గానే అక్కడ ధ్యానం చెస్తూ ఉంది.
ఒకరోజు ధ్యానం చేస్తున్న ఆమెను చూసి వాయుదేవుడు ఆమెను చేరాడు. ఆ సంఘటనకు ఆమె ధ్యానభంగం అయినది. అప్పుడు ఆమె "ఎవడురా దుర్మార్గుడు! నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నాడు" అని కోపించింది. అప్పుడు వాయువు అన్నాడు "అంజనా! బ్రహ్మగారు మా సర్వ దేవతల తేజస్సులను వానర స్త్రీలందు ప్రవేశపెట్టి వానారాలని సృస్టించామన్నాడు. అందువాల్ల నేను నీ పాతివ్రత్యాన్ని భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానం గా దూకగల వాడు, ఎగరగలవాడైన పుత్రుడు కేవలం నిన్ను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపు నందు జన్మిస్తాడు" అన్నాడు.
అలాగే తీర్ధయాత్రలు చెస్తూ ఉన్న కేసరి గోకర్ణం మీదుగా వెళుతున్నపుడు అక్కడ శంబసదనుడు అనే రక్షసుడి గురించి, అతను పెడుతున్న భాదలగురించి అక్కడి ఋషుల,మునుల ద్వారా విని అతనిని ఎదుర్కొన్నాడు. భీకరమైన యుధం తర్వాత అతనిని మట్టుపెట్టాడు. అతని విజయాన్ని చుసిన ఋషులు మునులు అతనికి ఒక ప్రయోజకుడిన పుత్రుడు, లోకంలో ఏ విధమైన అవినీతిని ఒప్పుకోనివాడు జన్మించాలి అని దీవించి, కేసరికి మహాదేవుని యొక్క అతి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాని కేసరి జపిస్తూ ఉండుటవల్ల అతని శరీరం దివ్య కాంతిని పొందింది.
కేసరి తీర్ధయాత్రల నుండి ఇంటికి వచ్చే సమయానికి అంజన వృషబాద్రి నుండి ఇంటికి వచ్చి ఉంది. వీరిద్దరికీ కలిగిన వరముల ప్రభావం వల్ల అంజని కొంతకాలానికి గర్భవతి అయింది. అప్పుడు ఆమెకు అతి బలవంతుడు, శివ అంశ, వాయుపుత్రుడు ఐన హనుమంతుడు జన్మించాడు.

Friday, June 10, 2016

హనుమంతుడి జన్మరహస్యాలు

హనుమంతుడి జన్మరహస్యాలు

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.

రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:)  శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం(20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం(20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది.   అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం(66-16, 18,19) . సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం(66-24).

అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

విష్ణు కథ - 16

విష్ణు కథ - 16

కృత, త్రేతా యుగాల తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి, భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టింది.

విష్ణువు, ‘‘దేవీ! కృష్ణావతారం ఎత్తి, నీ ఆర్తి తొలగిస్తాను!’’ అని అభయమిచ్చాడు.

ఆదికాలం నుంచీ విష్ణువుకు ప్రబల శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి, మధురానగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడనిపించుకున్నాడు.

దేవాసుర యుద్ధంలో, దానవ నాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడిన విప్రచిత్తి, మగథ రాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి, రాజులను తెచ్చి భైరవుడికి బలులిచ్చి అతి శ్రద్ధగా దీక్షతో అర్చిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు.

ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి, యదువంశ రాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూండగా, ఆకాశవాణి - దేవకి ఎనిమిదో సంతానంవల్ల కంసుడు చంపబడతాడు - అని పలికింది.

కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి, ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా, ఆరుగుర్ని అప్పగించాడు.

దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్యయైన రోహిణి గర్భాన చేర్చి, పిమ్మట నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగ మాయాదేవిని విష్ణువు ఆదేశించాడు.


దేవకి ఏడవగర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే, దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు.

అది శ్రావణ మాసం. కృష్ణపక్షం. అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణీ నక్షత్రంతో   ఉన్నాడు. నడి రాత్రి. కావలి భటులకు చావునిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి.

విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డడిని యమునానదిని దాటించి, అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయనిద్ర ఆవహించగా, ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి, ప్రాణం లేనట్లున్న పిల్లను సంగ్రహించుకొని తిరిగి వెళ్ళాడు.

చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగ ఆ శిశువు క్యారుమని గగ్గోలు చేసింది.

కంసుడు శిశువును వధ్యశిల పైకొట్టి చంపబోగా పైకెగసి, పకపక నవ్వుతూ, ‘‘ఓరి, కంసా! నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే!’’ అని చెపుతూ, దుర్గాదేవిగా కనిపించి అంతర్థానమైంది.

కంసుడు భయంతో, ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్నీ తెగటార్చాడు.

గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.

నారదుడు కంసుడి దగ్గిరికి వచ్చి, ‘‘కంసా! నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కావు; కాలనేమివి! నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి గదా? నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు!’’ అని హెచ్చరించి వెళ్ళాడు.

ఉగ్రసేనుడితో వివాహమై, విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణివద్దకు ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళినప్పుడు, కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడుగా పుట్టాడు.
కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు.
పసివాళ్ళను చంపమని పూతన రక్కసిని పంపాడు. ఊరూరా పసిపాపల్ని చంపుతూ, మానవకాంత రూపంతో వెళ్ళి పాలీయ వచ్చిన దాని ప్రాణాలు పీల్చి చంపాడు కృష్ణుడు.

యవనమ్లేచ్ఛులకు రాజైన కాలుయవన రాక్షసుడిని జరాసంధుడు కృష్ణుడి మీదకు ఉసిగొల్పాడు.

కృష్ణుడు కాలుయవనుడికి దొరక్కుండా పరుగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో జొరబడి దాక్కున్నాడు.

ముచికుందుడు ఇక్ష్వాకుల నాటి మాంధాత కుమారుడైన గొప్ప రాజు. యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరాడు. ద్వాపరయుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను, నిద్రాభంగం చేసినవారు తను చూడగానే భస్మం కావలెనని కోరుకున్నాడు.

కాలయవనుడు ముచికుందుణ్ణి కృష్ణుడనుకొని తన్నాడు. నిద్రాభంగమై ముచికుందుడు తీక్ష్ణంగా చూసేసరికి కాలువనుడు బూడిద అయ్యాడు.

కృష్ణుడు ముచికుందుడికి దర్శనమిచ్చి, బదరికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు. జయ, విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా పుట్టారు.
చేదిదేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో, మూడు కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను, రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాణ్ణి ఎత్తుకోమని ఇస్తుండేది.

కృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది. తన పిల్లవాణ్ణి వారికీ ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడ్యూడు.

శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచి పుచ్చమని సాత్వతి అర్థించింది. కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు.

శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలూ, అపరాధాలూ చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్త్రుడు తోడైనాడు.

జరాసంధుడు మాటిమాటికీ మధురా నగరంపై దాడి చేస్తూంటే కృష్ణుడు పలు మార్లు ఓడించి, తరిమికొట్టి, దుర్మార్గులైన రాజులెందర్నో కడతేర్చాడు.

కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్ర మధ్యంలో విశ్వకర్మచేత సురక్షతమైన ద్వారకానగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తనవారినందరినీ ద్వారకకు తరలించాడు.

జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, సాళ్వుడు మొదలైన తన అనుయాయులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు.

అంతకుముందే యాదవుల్నీ, మధురా ప్రజనూ, ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు.

జరాసంధాదులు ప్రవర్షణ గిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చారు. కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షతంగా చేరుకున్నారు.

జరాసంధుడూ, శిశుపాలుడూ కృష్ణ బలరాములు దగ్థమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే, ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లముఖాలతో ఒకర్నొకరు చూసుకున్నారు.

శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి. జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణ చూస్తూండగా, ‘‘తాతా!’’ అన్న కృష్ణుడి పిలుపు, పకపక నవ్వు వినిపించి సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీదనిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు.

‘‘జరాసంధా! ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు. నీ సమబలుడైన వాడిచేత చస్తావు. కొంతకాలం గతించాక మళ్లీ పునర్దర్శనం, వెళ్ళు!’’ అన్నాడు కృష్ణుడు.

విదర్భ రాజైన భీష్మకుడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. బాలప్రాయం నుంచీ కృష్ణుడే తన నాథుడని చెప్పుకొనేది. అటువంటి రుక్మిణిని, రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి సర్వసన్నాహాలు చేశాడు.

ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షంచమని రుక్మిణి కృష్ణుడికి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది.

పెళ్ళికి ముందు రుక్మిణి దుర్గను పూజించి, ఆలయం నుంచి వస్తూండగా, కృష్ణుడు రుక్మిణి చేయిపట్టి నాలుగు గుర్రాలు పూన్చిన తన రథం మీదకు ఎక్కించుకొన్నాడు. రుక్మి, శిశుపాల జరాసంధాదులు ఎదుర్కొన్నారు.
బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు.

కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికొట్టాడు. బలరాముడు జరాసంధుడినీ ఓడించి తరిమాడు. శత్రు రాజులందర్నీ కృష్ణ బలరాములు చిందర వందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టూ, మీసమూ గొరిగి పరాభవించి విడిచి పెట్టాడు. రుక్మి మరెప్పుడూ కృష్ణుడి జోలికి పోలేదు.

క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణీ కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది.

తరువాత కృష్ణుడు నీలాపనింద తొల గించుకోడానికి అరణ్యం పట్టి, గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి, శ్యమంతక మణిని తెచ్చి, సత్రాజిత్తుకి ఇచ్చి, భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకొన్నాడు. తరువాత జాంబవతి, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితిలను వివాహం చేసుకొని అష్ట మహిషులతో అష్ట సిద్ధులుగల యోగపురుషుడిలాగ, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ, ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతున్నాడు.

విష్ణు కథ -15

విష్ణు కథ -15

రాముడు పట్టాభిషిక్తుడై, లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూండగా, ప్రజలు అన్నివిధాలా ఆనందిస్తున్నారు.
ఒకనాడు పల్లెటూరి బ్రాహ్మణుడు ఒకడు తన అయిదేళ్ళ కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గిర నిలబడి ఏడవటం మొదలు పెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాలమరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు "రాజు సరిగా పాలిస్తే ఇలాటి అకాలమరణాలుండవనీ, ఇన్నాళ్ళకు ఇక్ష్వాకుల పరిపాలనలో, రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయింద"నీ అన్నాడు.

రాముడీ సంగతి తెలుసుకుని చాలా చింతించి, తన మంత్రులనూ, వసిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులనూ పిలిపించి, వారితో బ్రాహ్మణ బాలుడి అకాలమరణం గురించి చెప్పాడు. శంబూకుడనే ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడనీ, అది యుగధర్మానికి విరుద్ధమనీ, అందుకే ఆ బాలుడు చనిపోయాడనీ, నారదుడు రాముడితో అన్నాడు.

రాముడు లక్ష్మణుడితో, ‘‘నీవు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి, ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా వుంచు," అన్నాడు. తరవాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమరా, ఉత్తరమూ, తూర్పూ గాలించి, చివరకు దక్షణదిక్కున ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషి నొకణ్ణి చూశాడు.

రాముడు పుష్పకం దిగి, తన కత్తి దూసి శంబూకుడి తల నరికాడు. శంబూకుని తల కళ్ళు విప్పి ఆనందంగా రాముణ్ణి చూసి ‘‘రాఘవా! మరణమన్నది ఏదో ఒకలాగ తప్పనిది. నీవు నిమిత్తమాత్రుడివి.


వివిధవర్గాలతో కూడిన ప్రజలకు నీవు రాజువి; రాజు ప్రజాసేవకుడు, ఆ ధర్మాన్ని నిర్వర్తించావు. నీవు విచారించవలసిన పనిలేదు. నిన్నెటువంటి పాతకమూ అంటదు; నేను కులానికీ, వృత్తికీ అతీతుడైన యోగిని; విష్ణుసాయుజ్యాన్ని పొందుతున్నాను!’’ అని చెప్పి కళ్ళు మూసింది.

శంబూకుని భార్య కపిల రాముడితో, ‘‘సీతాపతీ! రాజధర్మ నిర్వహణలో మున్ముందు నీవు ఎదుర్కొనవలసి ఉన్న కఠోర పరీక్షకు ఇది నాంది! నేను నా భర్తతో సంతోషంగా వెళ్తున్నాను, దృఢచిత్తుడవై కర్తవ్యపాలన చెయ్యి!’’ అని చెప్పి భర్తతో చితిపై సహగమనం చేసింది.

రాముడు తిరిగి వస్తున్న దారిలో, ఒక గుడ్లగూబకు చెందిన చెట్టు తొరన్రు దురాక్రమణ చేసిన గ్రద్దను శిక్షస్తున్నట్లుగా దాని తలమీద చేత్తో తట్టాడు. ఆ వెంటనే గ్రద్ద రూపం పోయి బ్రహ్మదత్తుడనే రాజు శాపవిమోచనం పొంది వెళ్ళాడు. విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చి, తనను అవమానించిన శకుంతుడు అనే రాజును వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలుదేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది. హనుమంతుడు తల్లి మాట నిలపడానికి, రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది.

ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం  విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు.

ఒక అర్ధరాత్రి రాముడి శయన మందిరం ముందు ఒక కుక్క న్యా…యం కోసం ఆర్తనాదం చేసింది. రాముడు దిగ్గున వచ్చి రక్తం కారుతూన్న దాని గాయాన్ని అదిమిపట్టాడు.
కుక్క తాను కిందటిజన్మలో పూజారిగా ఉన్నందువల్లే కుక్కగా పుట్టాననీ, నిష్కారణంగా తన్ను కొట్టినవాడిని పూజారిగా నియమించవలసిందనీ, అదే తగిన శిక్ష అనీ చెప్పింది. దాని గా…యం మాయమై సుఖంగా వెళ్ళింది.

ఏ ప్రాణికీ నొప్పి కలగకుండా చక్కగా రాజ్యపాలన జరుగుతున్న రామరాజ్యంలో - ‘‘పరాయివాడి ఇంట ఉన్న భార్యను తెచ్చి పెట్టుకొనేలాంటి సిగ్గుచేటు పని చేయడానికి, రాజ్యమేలే రాముడిని కాను-!’’ అనే మాట ఒక అల్పుడి నోట వెలువడింది.

 సీతను అరణ్యంలో వదిలి రమ్మని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. లక్ష్మణుడు ఆక్రోశంతో ఆవేశపడుతూంటే, ‘‘లక్ష్మణా! ఒక అల్పుడు ఆడంబరంగా పలికిన మాట ఎంతోమంది మనస్సుల్లోనో దాగి ఉండవచ్చును గదా! రాజ్యమంటే నేలకాదు, మనుషులు! భిన్నవర్గాలతో నిండిన ఆ ప్రజల్ని పాలించడం అనేది కత్తి పదును మీద నడక! స్వార్థానికి ఏ మాత్రం తావు లేదు. జనవాక్యాన్ని కర్తవ్యంగా ఎంచి, గుండెను రాయి చేసుకొనవలసిన రాజును నేను!’’ అని రాముడు అన్నాడు.

మునిపత్నులతో ఆశ్రమాల్లో ముచ్చటగా గడపాలన్న నిండు చూలాలైన సీత కోరిక చెల్లించే నెపంతో, లక్ష్మణుడు రథం మీద సీతను తీసుకెళ్ళి కీకారణ్యంలో దిగవిడిచి వచ్చి, ‘‘అయ్యో! ఆనాడు హనుమంతుడు  సంజీవిని తెచ్చి నన్ను బ్రతికించింది ఇందుకా!’’ అని గుండెలవిసేలాగ రోదించాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. సీత కుశుడు, లవుడు అనే అందమైన కవల కుమాళ్ళను కన్నది.

అయోధ్యా రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు సరిగ్గా కురవక భూమి బీటలు బారింది. సీతావియోగంతో కుమిలి పోతున్న రాముడితో అశ్వమేధయాగం చే…యమని పెద్దలు ఆదేశించారు. బంగారంతో సీత విగ్రహాన్ని చేయించి పక్క నుంచుకొని రాముడు యాగదీక్ష పట్టాడు. లవకుశులు వాల్మీకి రచించిన రామా…యణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు. ముని బాలకులమని చెప్పుకొన్న వారిని చూసి రాముడు ముచ్చటపడి కౌగలించుకొని కానుకలిచ్చి పంపాడు.

రఘు వంశీ…యులకు తప్ప అన్యులకు పట్ట శక్యం కాని అశ్వమేధయాగాశ్వాన్ని లవకుశులు పట్టి కట్టేశారు. యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన శత్రుఘ్న, భరత, లక్ష్మణులతో …యుద్ధం చేసి, వాళ్ళను మూర్ఛపోయేలా చేసిన లవకుశులను రాముడు ఎదుర్కొన్నాడు. లవకుశులు తల్లి మీద ఆనపెట్టి బాణాలు వదిలారు. రాముడు మూర్ఛపోగా సీత వచ్చి పాదాలుపట్టి మేల్కొలిపింది. రాముడితోబాటు అంతా మూర్ఛ నుండి లేచారు. వాల్మీకి రాముడికి కుమాళ్ళనూ, సీతనూ అప్పగించాడు.

రాముడు సీతతో సింహాసనంపై కూర్చొని లవకుశులను తొడలపై కూర్చుండబెట్టుకొని వారిని …యువరాజులుగా ప్రకటించాడు. తరువాత రాముడు సీత తన ఔచిత్యానికి తగ్గట్టుగా అయోధ్యా ప్రజలముందు శపథం చే…యవలసిందని చెప్పాడు.

సీత అయోధ్యానగర మధ్యంలో నిలబడి ఆకాశాన్ని చూసి, అయోధ్యా రాజ్యంపై వర్షం కురవాలని పలికింది. మరుక్షణంలో ఆకాశం మబ్బులతో నిండి అమృత జలధారలతో రాజ్యమంతటా వాన కురిసింది. ఆ తరువాత సీత నేలను చూస్తూ, ‘‘అమ్మా! రఘువంశదీపకులైన కుమాళ్లు తండ్రి అండ చేరుకున్నారు. నాకు కావలసిందింకేమీలేదు, కరుణతో నన్ను స్వీక రించు!’’ అన్నది.

భూమి కంపించింది. భూమి రెండు పాయలుగా చీలింది. దివ్యకాంతులు వెలువడ్డాయి. రత్నసింహాసనంపై భూదేవి మీదకువచ్చి సీతను తన ఒడిలోకి తీసుకొని భూమిలోకి వెళ్ళిపోయింది. పుష్పవృష్టి కురిసింది. భూమి వెంటనే మూసుకుంది. రాముడు భూమిని చీలుస్తానని విల్లెక్కు పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి, ‘‘రామా! భూదేవిపై ఆగ్రహించడం పాడి కాదు. సీత భూజాత. భూమిలోకి వెళ్ళి నిజనివాసం చేరింది!’’ అని పలికింది.

 రాముడు కుమాళ్ళను చూసుకొంటూ చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, దేవ రహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కాపుంచమనీ, ఎవరినైనా రానిచ్చితే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో అవతరించిన పని తీరిందనీ, వైకుంఠానికి విష్ణువుగా చేరవలసిందనీ చెప్పాడు.

అదే సమయంలో దుర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడటానికి వెళ్ళ నివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోనికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపో…యాడు.

రాముడు లవకుశులను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. అది శ్రావణమాసం. సర…యూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తూన్నది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణపర్వదినం. మంగళ తూర్యనాదాలు మ్రోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటి పెట్టుకొని నడుస్తూండగా, రాముడు సరయూనదికి బ…యలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు.

రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. సామ,దేవగాంధార, హిందోళ, సురట రాగాల మేళవింపుతో వీణాధ్వనులు దిక్కులు మారుమ్రోగుతూండగా వినిపించాయి.

అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తున్నది, పూలవాన కురుస్తున్నది; క్షీరసాగరంలాగ సర…యూనది పూల రాసులతో నిండిన ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగింది!
అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురుచూస్తున్నారు. భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుకాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మిపాదాలొత్తగా శేషతల్పం అలంకరించాడు.

మాయామానుష విగ్రహుడై ఉత్తమ మానవతామూర్తిగా పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడైన మానవ మాత్రుడిగా వానరులను కూడగట్టుకొని వారధినికట్టి, అజేయుడనని విరవ్రీగిన రావణుడినికొట్టి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రాముడి అవతారం విష్ణువు దశావతారాల్లో చాలా విశేష మైనదిగా కీర్తింపబడింది.

కీర్తింపబడింది. రామరాజ్యం ఆచంద్రార్కం పేర్కొన బడుతుంది-అని సూతమహర్షి రామావతారం ముగించి, కృష్ణావతారం గురించి చెప్పడం ప్రారంభించాడు: ఒకానొకప్పుడు శివుడు తన భక్తులైన దానవప్రముఖుల్ని అవలీలగా విష్ణువు అంతమొందించడం చూసి అసహనంగా కనుబొమలు ముడిచాడు. ఆ బొమముడి నుండి సహస్రకవచుడు అనే ఘోరాకారుడు ఉద్భవించాడు. పొరలు పొరలుగా వెయ్యి కవచాలు, అజేయ ప్రభావంగల అద్భుత కుండలాలుగల సహస్రకవచుడు ప్రళయ భీకర గర్జన
చేసి, ‘‘నేను తెలివిమాలిన రాక్షస మాత్రుణ్ణికాను, రుద్రాంశ సంభూతుణ్ణి! చేవగలవాడైతే ఆ విష్ణు నన్నేం చేగలడో చెయ్యమనండి!’’ అని లోకాలు దద్దరిల్లేలాగ అరిచి విజృంభించాడు.

విష్ణువు నర, నారాయణులనే జంట ఋషులుగా అవతరించాడు. నరనారాయణులు దురహంకారి అయిన సహస్రకవచుడిని జయించగల శక్తిసాధనకు తపస్సు ప్రారంభించారు. ఇంద్రుడు వారి తపోభంగానికి అప్సరసల్ని పంపాడు. నారా…యణుడు తన తొడ నుండి అద్భుత సౌందర్య రాశి అయిన ఊర్వశిని పుట్టించాడు. ఊర్వశి ముందు రంభాది అప్సరసలు వెలవెలపోయారు. ఇంద్రుడు నరనారాయణులకు క్షమాపణ చెప్పుకొని ప్రణమిల్లాడు. నారాయణుడు ఊర్వశిని తీసుకుపొమ్మన్నాడు.

అప్సరసలతో కలిసి ఊర్వశి సంతోషంగా స్వర్గలోకం చేరింది. నారాయణుడు, నరుడు ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు విల్లమ్ములు ధరించి సహస్రకవచుడితో పోరాటంచేస్తూ, అలాగ వేలసంవత్సరాల పొడుగున సాగిన …యుద్ధంలో, తొమ్మిదివందల తొంభైతొమ్మిది సహస్రకవచుడి కవచాలను ఛేదించారు. సహస్రకవచుడు ఒకే కవచంతో పారిపోయి సూర్యుడిలో దాక్కున్నాడు. ‘‘ప్రగల్భాలు పలికి చివరికి పారిపోయి దాక్కున్నాడు, పిరికిపంద! వీడి పని కృష్ణావతారంలో పట్టించాలి!’’ అని విష్ణువు నిశ్చయించుకున్నాడు.

విష్ణు కథ - 14

విష్ణు కథ - 14
విభీషణుడిలాగే రావణుడి పట్టమహిషి మందోదరి కూడా భర్తకు హితవు చెప్పింది. ‘‘నాథా! ముక్కు చెవులు కోసినందుకో, వరించమంటే వరించనందుకో, నీ చెల్లెలు అవమానం భరించలేకపోయినప్పుడు; ఒంటరిదాన్ని, అసహా…యురాల్ని, బంగారాన్నో, పశువునో, పక్షనోలాగ ఎత్తుకు వచ్చినందుకు, సీత ఎంత బాధపడుతుందో ఊహించావా? శూర్పణఖ ప్రతీకారంతో సీతను ఎత్తుకు రమ్మన్నట్లే, సీతకు జరిగిన అవమానానికి ఆమెకు ఇంకెంత కసి ఉంటుందో ఆలోచించు!’’ అన్నది.

రావణుడు, ‘‘ఔను మందోదరీ, ఇప్పుడు తెలుస్తున్నదిగానీ, కానీ-ఏమైనా కానీ, రావణుడు తల వంచడం అనేది లేదు! నీ భర్త భీరువుకాడు. పిరికిమందు నూరి పోయకు! కేవలం మానవుడైన ఆ రాముడు ఏం చేయగలడో నేనూ చూస్తాను,’’ అన్నాడు.

ఎక్కడెక్కడి వనాల్లోని వానరులంతా చేరుకొని రాముడి సేనగా తయారయ్యారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, సుషేణుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులంతా సేనానాయకులై రాముడికి అండదండలుగా నిల్చారు. హనుమంతుడు రాముడి కార్యకర్తగా, అంగరక్షకుడిగా లంకపై దాడికి సర్వసన్నాహాలు ప్రారంభమయ్యాయి.

హనుమంతుడు పర్వతాలు, కొండలు తెచ్చి సముద్రంలో వేశాడు. వానరులు పెద్ద బండలు, శిలలు తెస్తున్నారు. చిన్న కోతులు రాళ్ళు మోసుకొస్తున్నారు.

నూరు యోజనాల పొడవునా లంకకు సముద్రం మీద సేతు నిర్మాణం అతి వేగంగా ఎంతో ఉత్సాహంతో ప్రారంభమైంది.

 నీలుడు సేతు నిర్మాణపర్యవేక్షణాబాధ్యత తీసుకున్నాడు. విభీషణుడు ఆకాశమార్గాన రాముడి శరణాగతుడై వచ్చాడు. రాముడతనికి అభ…ుమిచ్చి లంకకు రాజును చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడు సముద్ర జలాలతో అతణ్ణి లంకకు రాజుగా అభిషేకించాడు.

రాముడు వారధికట్టించి, కోదండాన్ని, రామబాణాన్ని రెండు చేతులతో పట్టుకొని, వానరసేనలు వెంటరాగా, ఇరుపక్కల లక్ష్మణుడు, హనుమంతుడు నడుస్తూండగా,  లంకను ముట్టడించడానికి బ…ులుదేరాడు. విభీషణుడు వారిని అనుసరించాడు. వేగులు రాముడు వానరసేనలతో సముద్రం దాటి వస్తున్న వార్త తెచ్చారు. రావణుడు చకితుడ…్యూడు. ఒక నరుడు వానరులను కూడగట్టుకొని, సముద్రం మీద నూరు ెూజనాల పొడవు వంతెన కట్టి, ముల్లోకాలను గడగడలాడించే రావణాసురు డంతటివాడిని కొట్టి తన సొత్తయిన భార్యను తెచ్చుకున్నాడు అని అనిపించుకోవడమే! ఏమిటిది? ఇది జరుగుతుందా? కట్టడం మాత్రమే జరిగినంత మాత్రాన మిగతా రెండూ జరుగుతా…ుని భ…ుపడ్డం దేనికి? అని అనుకుంటూన్న రావణుడితో, మంత్రి ప్రహస్తుడు, ‘‘శత్రువును దారిలోనే ఎదుర్కొని తుద ముట్టించడం మంచిది!’’ అన్నాడు.

రావణుడు నవ్వి, ‘‘మన కుంభకర్ణుడికి తగినంత ఆహారం దొరకడం లేదు. వాళ్ళు లంకకు రానీ! సాలెగూటిలో చిక్కుకున్న ఈగల్లాగ, నా తమ్ముడి ఆకలికి పనికొస్తారు!’’ అన్నాడు. రాముడు వానరసేనలతో వారధిని దాటి లంకా తీరాన్ని చేరాడు. లంకానగరం ఎత్తయిన పర్వతం చివరంటా నిర్మించబడింది. పర్వతాగ్రం మీది సౌధంలో రావణుడు ఉంటాడు.

ఆ సౌధాగ్రం నుంచి రావణుడు రామదండు విడిసిన తీరాన్ని చూశాడు. తీరం పొడవునా చీమలబారుల్లాగ వానర సేనలు వ్యూహాలు పన్నుతున్నారు. అంగదుడికి వీరావేశం వచ్చింది. రివ్వున ఎగిరి వెళ్ళి రావణాసురుడి సౌధం మీద వాలాడు. ‘‘ఓ, రావణా! ఒకప్పుడు నిన్ను తోకతో చుట్టి విసిరేసిన వాలి కుమారుణ్ణి నేను, అంగదుణ్ణి! అప్పటి నుంచి నువ్వు, మా తండ్రిపట్ల గౌరవమర్యాదలతో మిత్రుడిగా ఉన్నావు గనుక, చెబుతున్నాను.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముడితో వైరం మాను. శరణు వేడు. వానరమూకతో రాముడేం చేయగలడన్న ధీమాతో వుండకు. వానరులెంతటి వారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు!’’ అన్నాడు.

రావణుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు. అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడద్రోసి, తిరిగి వానరసైన్యం వున్న చోటుకు ఎగిరి వెళ్ళాడు. వానరసేన విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకు పరుస్తూంటే, రావణుడు కుంభకర్ణుడి నిద్ర చెడగొట్టించి, అతణ్ణి వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు.

కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సరస్వతి చేత అతని కోరికలు తారుమారు చేయించాడు. ఆరు నెలలు తిండి, ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు, ఆరు నెలల నిద్ర, ఒకరోజు తిండి కోరుకున్నాడు. బ్రహ్మ అతడికి అలాగే వరమిచ్చాడు. ఆరు నెలల నిద్ర పూర్తిగా తీరకపోతే, కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది. అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు, అన్నకు వినయంగా హితబోధ కూడాచేశాడు. రావణుడు, ‘‘చేస్తే యుద్ధం చెయ్యి, లేదా వెళ్ళి పడుకో!’’ అన్నాడు.

నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకు తినసాగాడు. రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ …యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు.
ఆ తరవాత యోధానుయోధులైన రాక్షస ప్రముఖులందరూ కూలిపోయారు. రావణుడి పెద్దకొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికొచ్చాడు.

రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నాడు. మేఘాల్లోంచి యుద్ధం చేసే వాడవడంవల్ల మేఘనాథుడు అని పేరొంది, ఇంద్రుణ్ణి జయించి కట్టి తెచ్చి, ఇంద్రజిత్తు అనిపించుకొన్న మహావీరుడు. మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తులమారి, మహామాయావి. పధ్నాలుగేళ్ళు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోరదీక్ష గడిపిన వాడివల్లనేగాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి,గాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి, ‘‘రామా! సీత నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు. నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు.

విష్ణు కథ - 13

విష్ణు కథ - 13
సుగ్రీవుడు కిష్కింధకు రాజై, వాలి కుమారుడు అంగదుణ్ణి యువరాజును చేసి, రాచకార్యాలన్నీ అప్పజెప్పి, తాను సుఖాల్లో తేలుతూ రాముడి సంగతే మరిచాడు. లక్ష్మణుడు విల్లెక్కుపెట్టి కిష్కింధకు వెళ్ళాడు. హనుమంతుడు రామకార్యం నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా సుగ్రీవుడికి బుద్ధిచెప్పాడు.

వానరులను నాలుగు దిక్కులకూ వెళ్ళి సీత జాడ తెలుసుకురమ్మని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారంతా దక్షణ దిశకు బయలుదేరుతున్నప్పుడు, రాముడు తన వేలిఉంగరాన్ని తీసి హనుమంతుడికి సీతకు ఆనవాలుగా ఇమ్మని ఇచ్చాడు.

దక్షణ సముద్రతీర ప్రాంతం చేరుకొని వానరులు, ‘‘జటాయువు రావణుడు సీతనెత్తుకొని దక్షణంగా వెళ్ళాడని చెప్పాడేగాని, ఎటు మళ్ళాడో, ఎక్కడ దాచాడో, ఏం చేశాడో ఎవరికి తెలుసు?’’ అని అనుకుంటూండగా, వానరులను ఆహారంగా కబళిద్దామను కుంటున్న జటాయువు అన్న సంపాతి అనే పర్వతాకారంగల రెక్కలులేని పక్షి మెల్లగా నడుస్తూ వచ్చింది.

ఒకప్పుడు సంపాతీ, జటాయువూ సూర్యమండలానికి ఎగురుపందెం వేసుకున్నారు. జటాయువు ఎగరలేక విరమించాడు. సంపాతి ఎగిరి రెక్కలు కాల్చుకున్నాడు. దక్షణ సముద్ర తీరాన అవిటివాడై పడిపోయి, దొరికిన ప్రాణుల్ని తిని బ్రతుకుతున్నాడు. సంపాతి వానరుల వలన జరిగినదంతా తెలుసుకొని, అంగదుణ్ణి వీపున ఎక్కించుకొని ఆకాశంలోకి నిటారుగా లేచి దూర దూరాల్లో సముద్రానికి ఆవల ఉన్న లంకను చూపించాడు.

శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించి లంకను చేరగలవాడెవడు? అనుకున్నారు వానరులు.

హనుమంతుడికి అతని శక్తిసామర్థ్యాలు అతనికి తెలియకుండా, బాల్యంలో అల్లరి చేయగా ఋషులు శాపం పెట్టారు. అది తెలిసిన జాంబవంతుడు, ‘‘హనుమంతా! నువ్వు అవలీలగా సముద్రాన్ని లంఘించి రామకార్యం నెరవేరుస్తావు!’’ అని ఎరుక చేశాడు.

అప్పుడు హనుమంతుడు రాముణ్ణి ధ్యానించి నేలను తన్ని ఆకాశానికి ఎగిరాడు. మారుతి సముద్రాన్ని లంఘిస్తూండగా, అతడి శక్తియుక్తుల్ని పరీక్షించడానికి దేవతలు సురసను పంపారు. దేవతాస్త్రీ అయిన సురస భయంకర రాక్షసాకారంతో నోరావులించి హనుమంతుణ్ణి ఎదుర్కొంది. హనుమ శరీరాన్ని పెంచాడు. సురస కూడా పెరిగింది. హనుమంతుడు ఇంకా పెరిగాడు.


సురస మరింత, మరింత పెరిగి మ్రింగవచ్చింది. హనుమంతుడు చప్పున సూక్ష్మాతి సూక్ష్మంగా తగ్గిపోయి, సురస నోట్లో దూరి, పెరిగిపోయి దాన్ని చీల్చుకొని బయటపడి ఎగిరి వెళ్ళాడు. సురస దేవతాస్ర్తీ రూపంతో వెళ్ళిపోయింది. దేవతలు హనుమంతుణ్ణి శ్లాఘించారు.

హనుమంతుడు అలా ఎగురుతూండగా సముద్రంలో పడిన అతని నీడను రాహువు తల్లి సింహిక అనే జలరాక్షసి పట్టుకొని లాగసాగింది. హనుమంతుడు తన్నేదో కిందినుంచి వెనక్కు లాగుతున్నదనిపించి కిందికి చూసి, సింహికను పిడిగుద్దులతో చంపేశాడు.

హనుమంతుడు అవరోధాలన్నీ జయించి, అలా ఆకాశాన వెళ్తూండగా సువర్చల అనే సాగరకన్య చేపరూపంతో నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూండగా హనుమంతుడి చెమట బిందువొకటి పడింది. చేప మింగింది. అందువల్ల సువర్చల గర్భం ధరించి మత్స్యవల్లభుడు అనే కుమారుణ్ణి కన్నది.

ఒకప్పుడు ఇంద్రుడు పర్వతాలకు ఉండే రెక్కలను వజ్రాయుధంతో నరుకుతూండగా,  హిమవంతుడి కుమారుడైన మైనాకుడు భయపడి సముద్రంలో దాక్కున్నాడు.

హనుమంతుడిని చూసి మీదకు వచ్చి, ‘‘అంజనేయా, కాస్త నాపై వాలి సేదదేరమని అభ్యర్థిస్తున్నాను,’’ అన్నాడు.

మైనాకుడి మాట కాదనకుండా హనుమంతుడు, కొద్దిక్షణాలు మైనాక పర్వతం మీద కాలుమోపి తిరిగి రివ్వున ఎగిరాడు. హనుమంతుడు మెరుపు లాగ లంకను చేరాడు.
లంకానగరాన్ని పరిరక్షంచే లంకానగర దేవత లంకిణి, హనుమంతుడి ఆగమనాన్ని గుర్తించి, భీకరాకృతితో శూలాన్నెత్తి పొడవబోయింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో తప్పించుకొని, లంకాద్వారాన్ని దాటబోయాడు. లంకిణి హనుమంతుణ్ణి ఈగను పట్టినట్లు గుప్పెట్లో పట్టింది. హనుమంతుడు లంకిణి అరచేతిని కరిచాడు. లంకిణి వదిలేసింది. దాని అరచేయి రక్తం కారుతూన్నది.

హనుమంతుడు ఒక్క ఉదుటున లంఘించి పిడికిలితో లంకిణి గుండె మీద గుద్దాడు. ఆ ముష్టిఘాతంతో లంకిణి దిమ్మరపోయి పడిపోయింది. తరవాత తేరుకొని ఆంజనేయుడికి మస్కరించి, ‘‘ఎప్పుడైతే నేను ఇలా కూలి పడతానో, ఆనాటితో లంకకు వినాశకాలం పడుతుందని నాకు, బ్రహ్మ చెప్పాడు. శాపంవల్ల నేను క్షుద్రదేవతగా ఇలా లంకా నగరాన్ని ఇన్నాళ్ళూ కాపలా కాస్తూ వచ్చాను. నేను వెళ్ళి పోతున్నాను, ఇక నీవు వెళ్ళు!’’ అని చెప్పి గంధర్వస్త్రీ రూపంతో ఆకాశానికి ఎగిరి అంతర్థానమైంది.

హనుమంతుడు లంకా నగరం ప్రవేశించాడు. మణిదీపాలతో, ఎత్తయిన సౌధాలతో కన్నులు మిరుమిట్లు గొలుపుతున్న లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు సూక్ష్మరూపంతో సీత కోసం నగరమంతా వెతికాడు. రావణాసురుడి అంతఃపుర భవనాలన్నీ వెతికాడు. మందోదరిని సీత అనుకొని భ్రమపడి పొరపాటు గ్రహించాడు.
సీత జాడ ఎక్కడా లేదు. అలా నగరంలోని వివిధ ప్రదేశాలను వెతుకుతూ అశోకవనం చేరుకున్నాడు. అక్కడ రామనామ స్మరణ విన్నాడు.

ఒక చంద్రశిలా నిర్మిత మంటపంలో సీత రాముణ్ణి తలంచుతూ శోకిస్తూన్నది. ఆ మంటపం చుట్టూరా పెద్ద బళ్లేలు, కత్తులు మొదలైన ఆయుధాలు పట్టుకొని రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు.మంటపం చేరువనే ఉన్న శింశుపా వృక్షం ఎక్కి హనుమంతుడు కొమ్మల మాటున కూర్చుని చూస్తున్నాడు.

సీత మంటపం నుండి వచ్చి, పక్కనున్న అశోక చెట్టుకింద కూర్చున్నది. రావణుడు పటాటోపంగా అశోకవనం లోకి వస్తున్నాడు. అతని వెనక దేవ, గంధర్వ, నాగ, …యక్ష, రాక్షస, మానవ సుందరీమణులు గుంపులు, గుంపులుగా అతడి వైభవాన్ని కీర్తిస్తున్నారు.

రావణుడు అశోకవృక్షం దగ్గరికి వచ్చి, ‘‘ఓ, సీతా! ఇప్పటికైనా, నా మాట విను! క్షుద్ర మానవుడైన రాముణ్ణి నమ్ముకోకు. రాముడు లంక చేరగలడనేది కల్ల!’’ అన్నాడు.
సీత ఒక గడ్డిపరకను పెరికి దానితోనే, ‘‘ఓ, రావణా! నీ ప్రగల్భానికీ, బలవైభవాలకీ నేను లొంగుతాననేది కల్ల! నీవు దొంగవు! నిన్ను శిక్షంచడం రాజైన రాముడికి కర్తవ్యధర్మం. దశకంఠశోషగా వాగకు. రాముడు నిన్ను పరిమార్చక ముందే, నీ ముచ్చటలన్నీ తీర్చుకో! అంతఃపురానికి వెళ్ళు, త్వరలోనే నీకు అంత్యకాలం!’’ అన్నది. రావణుడా మాటలకు పెద్ద గండ్రకత్తి తీసి, ‘‘నిన్ను ముక్కలుగా నరుకుతాను!’’ అన్నాడు.

‘‘అలా చేయవు! నా అంతట నేను, నీకు లొంగిపోతానని అనుకుంటున్నావు. రాముడి భార్య, రావణుడి ప్రతాప వైభవాలను చూసి లోబడిపోయింది అనిపించుకోవాలని, నీ దురహంకార దురాకాంక్ష!’’ అన్నది సీత. ‘‘ఔను! మా రాక్షస వనితకు జరిగిన పరాభవానికి, అదే సరైన ప్రతీకారం! అదే నా పట్టుదల!’’ అన్నాడు రావణుడు. ‘‘కాదు! నువ్వు రాముడిని ఎదుర్కొని జయించి, నన్ను తీసుకుపోవలసింది. నువ్వు పిరికివాడవు. మాయలు పన్ని చోరవృత్తిని అవలంబించావు. రాముడు నిన్ను సంహరించాలి! ఇది నా పట్టుదల!!’’ అన్నది సీత. రావణుడు రుసరుసలాడుతూ వెళ్లాడు.

హనుమంతుడు రాక్షస స్త్రీలు లేని సమయం చూసి, చెట్టు దిగి, సీతకు రాముడి  ఉంగరాన్ని ఇచ్చాడు. చుక్కలు తల పూవులుగా పెరిగిన తన విశ్వరూపం చూపించి, తన వీపున కూర్చుంటే రాముడి దగ్గరకు చేరుస్తానన్నాడు. ‘‘అది సక్రమం కాదు; రాముడు రావణుడిని సంహరించి నన్ను విడిపించాలి! అంతవరకు సీత అశోకవనంలో శోకంలోనే ఉంటుందని రాముడితో చెప్పు!’’ అని చెప్పి సీత తన పాపిట నున్న చూడామణిని తీసి, రాముడికి ఇమ్మని హనుమంతుడికి ఇచ్చింది.

 హనుమంతుడు తన రాక తెలియాలని సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చంపవచ్చిన జంబుమాలిని, అక్షయుడిని, వేలాది రాక్షసుల్ని చంపాడు. రావణుడి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మపట్ల గౌరవంగా క్షణకాలం హనుమంతుడు అస్త్రానికి బద్ధుడై, రావణుడికి ముఖాముఖి బుద్ధి చెప్పాలని కట్టుబడి రావణ సభకు వెళ్ళాడు.

హనుమంతుడు మేను పెంచి గొలుసులు తెంచుకొని, రావణుడి తల తన్నే ఎత్తున తన తోకను పెంచి, చుట్ట చుట్టుకొని దానిపై కూర్చున్నాడు.

హనుమంతుడు, ‘‘ఓయి, రావణ రాక్షసరాజా! నేను రాముడి దూతను. రాముడు కోతులనే మహావీరులుగా నడిపించి, నీ లంకను ముట్టడించగల సమర్థుడైన మానవశ్రేష్ఠుడు. లమున్నదని గర్వించకు. బలవంతమైన సర్పము చలిచీమల చేత ఏ విధంగా చస్తుందో, నీకు చెప్పనవసరం లేదు. సీతను రాముడికి అప్పగించి మన్నించమని వేడు!’’ అని చెప్పాడు.

రావణుడు పట్టరాని ఆగ్రహంతో కత్తి తీశాడు. విభీషణుడు రావణుడితో, ‘‘దూతను చంపకూడదు, అది పౌరుషం అనిపించుకోదు!’’ అన్నాడు.

రావణుడు, ‘‘అలాగైతే, ఈ వానరుడి తోక పొగరు అణిగేలా గుడ్డలు చుట్టి చమురుపోసి కాల్చండి!’’ అని ఆజ్ఞాపించాడు. రాక్షసభటులు హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టినకొద్దీ తోక పెరిగిపోతూనే ఉంది. చమురు చాలలేదు. నిప్పంటించారు.

 హనుమంతుడు శరీరం పెంచి సింహనాదం చేసి ఛెంగున ఎగిరాడు. కాలుతున్న తోకను గిరగిరా తిప్పుతూ, సౌధాల మీంచి దూకుతూ, లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. అతనికి అగ్ని చల్లగా తోచింది ఆర్పడానికి వీలు కాకుండా లంకాదహనం జరిగింది. రావణుడి అంతఃపుర సౌధాలు కాలిపోయాయి. మంటల్లో చాలామంది రాక్షసులు చచ్చారు. విభీషణుడి మందిరం మాత్రం చెక్కుచెదరలేదు.

హనుమంతుడు అశోకవనంలో సీత క్షేమంగా ఉండడం చూసి, రివ్వున ఎగిరి సముద్రంలో తోకను ముంచి మంటలార్పుకొని, చూడామణిని పట్టుకొని రాముడి ముందు వాలాడు.

రాముడు చూడామణిని చూసి, సీతను చూసినట్లుగా గుండెలకు హత్తుకొన్నాడు. హనుమంతుడు అంతా చెప్పాడు. రాముడు హనుమను ఆలింగనం చేసుకొని, ‘‘హనుమా! చూసి రమ్మంటే కాల్చి వచ్చావన్నమాట! నీవంటివాడు అండగా ఉండగా, నేను సాధించలేనిదంటూ ఉండదు. సీతకూ, నాకూ సంధానకర్తవై, ఆనందం చేకూర్చిన నీవు బుద్ధిమంతుడవు, ఆనంద సంధాతవు, కీర్తిమంతుడవు ఔతావు!’’ అన్నాడు.

రాముడు కోదండాన్ని ఎత్తి పట్టుకొని, సీత చెప్పినట్టుగా రావణసంహారానికి దీక్షా కంకణం కట్టుకున్నాడు. విభీషణుడు రావణుడికి సవతి తమ్ముడు, రాముడితో వైరం పెట్టుకోవద్దనీ, సీతను సగౌరవంగా తీసుకెళ్ళి, రాముడికి అప్పగించి, లంకానగరాన్నీ, లంకావాసుల్నీ కాపాడమనీ చెప్పాడు. ‘‘నీ ఒక్కడి పట్టుదల, మూర్ఖతవల్ల రాక్షసకులానికే ముప్పుతేవడం అన్యాయం!’’ అని విభీషణుడు చెప్పిన దానికి, రావణుడు మండిపడి, ‘‘ఓరీ, పిరికిపందా! నువ్వు రాక్షసకులంలో తప్ప పుట్టావు! శూర్పణఖకు చేసిన పరాభవం రాక్షస జాతికంతటికీ పరాభవం అని తెలుసుకో! నువ్వు కులద్రోహివి! వెంటనే లంక వదలి వెళ్ళిపో!
మళ్ళీ కనిపించావో, నిన్ను చిత్రవధ చేస్తాను!’’ అన్నాడు. విభీషణుడు తన అనుచరులతో లంక వదిలి పెట్టాడు

విష్ణు కథ - 12

విష్ణు కథ - 12

రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే, పరశురాముడు, ‘‘రఘురామా! ఇకనుండి క్షత్రియులపె పగ విడిచి ప్రశాంతంగా త…పస్సు చేసుకొంటాను. నేనిచ్చిన కోదండం నీదే! నీవు కోదండరాముడివి!’’ అని చెప్పి వెళ్ళాడు.

అయోధ్యానగరం నూతన వధూవరుల ఆగమనంతో కళకళలాడింది. సీతారాములు ఒకే ఒక్క పరిపూర్ణ స్వరూపంగా అనురాగ సామ్రాజ్య సింహాసనం అలంకరించారు. ఒకనాడు రాముడు, ‘‘సీతా! ఈ రాజ ప్రాసాదంలోకంటే, మనం సుందరవనాల్లో విహరిస్తూంటే ఇంకెం…తఆనందంగా ఉంటుందో! వనలక్ష్మి లాగ నువ్వు కనిపిస్తూంటే ...’’ అని అంటూంటే సీ… బుగ్గలు ఎరు పెక్కాయి.

వారికి రోజులు మధురంగా గడుస్తున్నాయి. కొంత కాలానికి దశరథుడికి దుశ్సకునాలు తోచాయి. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అ…నికి మునిదంపతుల శాపం గుర్తు వచ్చింది. ప్రాణభ…యం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించి వసిష్ఠుడిచే… మూహూర్తం పెట్టించాడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా ఉన్నాడు.

సరస్వతి వీణపె రాగమాలిక ఆలపిస్తున్నది. నారదుడు, అ…ని వెనక దేవ…తలు వచ్చారు. నారదుడు, ‘‘రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలనం ఎలా జరుగుతుంది? అని దేవ…తలంతా త…ల్లడిల్లు…తూన్నారు!’’ అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి మందహాసంతో, ‘‘జరగవలసింది జరగక మానదుకదా, నారదా! త్రికాల వేత్తవు! అదుగో అటు చూడు! నీకు వారసురాలు మంధర కెకేయి మందిరానికి వెళ్తున్నది!’’ అన్నది.


దేవతలూ, నారదుడూ క్రిందికి భూమ్మీదకు చూశారు. గూని మోసుకొంటూ మంధర గొణుక్కొంటూ వెళ్తూన్నది. నారదుడు, ‘‘అమ్మా, వాగ్దేవీ! లోక కల్యాణార్థం వాళ్ళ నోట ఎలాంటి వాక్కులు పలికిస్తావో మరి! అంతా నీ దయ!’’ అని వెళ్ళాడు. గూనిమంధర కెకేయికి అరణంగా వచ్చిన నమ్మిన ముసలిదాసి. అప్పుడే నిద్రలేస్తున్న కెకేయిని జాలిగా చూస్తూ నిలబడ్డది. కెకేయి, ‘‘ఏమిటి, మంధరా, అలా దిగాలుగా నిల్చున్నావు?!’’ అనడిగింది.
‘‘ఏం చెప్పమంటావు, …తల్లీ! రేపు రాముడికి పట్టాభిషేకమట! పట్టాభిషేకం!!’’ అంది మంధర. కెకేయి తన మెడలోని ముత్యాల హారం తీసి మంధర మెడలో వేస్తూ, ‘‘ఎంత మంచి వార్త తెచ్చావే, మంధరా!’’ అంటూ ఆనందం పట్టలేకపోయింది. మంధర పెదవి విరుస్తూ, ‘‘అయ్యో, కెకేయి! ఎంత అమాయకురాలివి పాపం! ఒఠ్ఠి వెర్రిబాగులదానివి!’’ అన్నది. ‘‘ఏమిటి నువ్వనేది?’’ అన్నది కెకేయి.

‘‘రాముడు రాజైతే, ఆ కౌసల్య ముందు నేనూ, నువ్వూ దాసీలమే! బాగా ఆలోచించు, ఆలసించకు. కోపగృహం లోకి వెళ్ళు! నీ రెండు వరాలు ఇప్పుడు కోరుకో! భరతుణ్ణి దేనికి కన్నావు? రాముడి వెనక ఛత్రచామరాలు పట్టడానికేనా?’’ అని మంధర చురకలు పెట్టినట్టు అన్నది. తన రెండు వరాలు ఇప్పుడు కావాలని కెకేయి కోరింది, ‘‘ఏవి కావాలో అవి తీసుకో!’’ అన్నాడు దశరథుడు. ‘పధ్నాలుగేళ్ళు రాముడు వనవాసం చెయ్యాలి! భరతుడికి పట్టాభిషేకం కట్టాలి!’’ అన్నది కైక.

ఆ మాటలు వింటూనే దశరథుడు జుట్టు పీక్కొంటూ అలాగే శయ్య మీద మూర్ఛపడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. ‘‘పితృవాక్య పరిపాలన కర్తవ్యం! దశరథుడు ఆడి తప్పినవాడనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు!’’ అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు చెట్టు బెరడులో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యడానికి సిద్ధమయ్యాడు.

 లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లు వచ్చాడు. కెకేయినీ, దశరథుడినీ నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు …తమ్ముడిని శాం…తపరిచాడు. రాముడితో సీత…, లక్ష్మణుడు బయలు దేరారు.

అయోధ్యా పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానదిని దాటి అరణ్య మార్గం పట్టి, భరద్వాజాశ్రమం చేరుకున్నాడు.
మర్రిపాలు తలకు పట్టించి, రామలక్ష్మణులు మునులకుమల్లే జుట్టుముళ్ళు వేసుకున్నారు. దశరథుడు మూర్ఛనుండి తేరుకొని, రాముడు వనవాసం వెళ్ళిన సంగతి తెలుసుకొని, ‘‘రామా! రామా!’’ అంటూనే ప్రాణాలు విడిచాడు.

అప్పుడు భర…తశత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నందిగ్రామం నుండి భర…శత్రుఘ్నులు వచ్చాక, భర…తుడు తండ్రికి ఉత్తరరక్రియలు జరిపాడు.
భరతుడు…తల్లి ముఖం చూడలేదు. శత్రుఘ్నుడు మంధర గూనిపోయేలాగ…తన్నాలనుకున్నాడు, కాని దాని జాడ కనిపించలేదు. భర…తుడు రాముణ్ణి తీసుకురాడానికి సపరివారంగా శ్వే…త ఛత్రాలు పట్టించుకుని వెళ్ళాడు.

భరతుడితో రాముడు, ‘‘మన …తండ్రి మాట నిలపడంలో మన ఇద్దరివంతూ ఉంది. నీవు నా …తమ్ముడివి, నా మాట విను. పట్టాభిషిక్తుడివై రాజ్యపాలన చెయ్యి!’’ అన్నాడు.
భరతుడు …తల అడ్డంగా తిప్పి, ‘‘నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను. నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను!’’ అని చెప్పి రాముడి పావుకోళ్ళను …తలపై పెట్టుకొని తీసుకెళ్ళాడు. రాముడు సీతాలక్ష్మణ సమే…తంగా అరణ్యం లోలోపలికి చొచ్చుకువెళ్ళాడు.ఖరుడు, దూషణుడు అనేవాళ్ళు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు, వాళ్ళు వింధ్యపర్వాలకు దిగువనున్న భూమి అంతా ఆక్రమించారు. వాళ్ళు రాక్షస గుంపులో తిరుగుతూ, అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూర మృగాల్లాగ సీతా రామలక్ష్మణుల్ని చంపడానికి, పెద్ద పెద్ద బండ కత్తులూ, శూలాల్తో చుట్టు ముట్టారు రాక్షసులు.

రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి రాక్షసమూకలను చెల్లాచెదరుగా చేశారు. రాముడు ఖరదూషణుల్ని చంపాడు. రాక్షసులు చాలామంది చచ్చారు. హతశేషులైనవారు పారిపోయారు. నివాస యోగ్యమెన ప్రదేశంకోసం వెదుకుతూ వెళ్తూండగా, తాటిచెట్టును మించిన ప్రమాణంలో భయంకరాకారుడెన విరాధుడు సీతను అరచేత ఎత్తి భుజాన పెట్టుకొని పారిపోతూంటే, రాముడు ఒక మహాస్తాన్ని వేసి రాక్షసుణ్ణి చంపాడు. హత…శేషులెన రాక్షసులు శూర్పణఖ, ఖరదూషణుల చావుకబురు చెప్పారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఖరుడు, దూషణుడు, శూర్పణఖ సొంత తమ్ముళ్ళు.

దండకారణ్యాల్లో గ్రుమ్మరుతూండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు, రామలక్ష్మణుల్ని చీల్చి చెండాడాలని బయలుదేరింది. ఊడలే మానులైన ఐదు మర్రిచెట్లతో నిండిన పంచవటికి రాముడు, సీతా లక్ష్మణులతో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నది. పర్ణశాలను నిర్మించుకొని, రాముడు సీతా వనవిహారం చేస్తూ వనవాసం గడుపుతున్నాడు. లక్ష్మణుడు అన్నను, వదినను సేవిస్తూ, పర్ణశాలను దివారాత్రులు కాపలా కాస్తున్నాడు.

శూర్పణఖ అట్టహాసంగా విరుచుక పడింది. రాముణ్ణి చూసి నన్ను వరించమంది, వేడింది, బెదిరించింది. సీతను చంపడానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు, చెవులు కోసి తరిమాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసురుడితో తనకు జరిగిన పరాభవాన్ని మొరపెట్టుకొంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరగొని తేవడానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపాడు.

 సీత…మాయలేడిని చూసి ముచ్చట పడింది. రాముడు వెళ్ళి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయలేడి మారీచుడై, ‘‘హా, సీతా! హా, లక్ష్మణా!’’ అని రాముడు చేసినట్టు ఆర్తనాదం పెద్ద పెట్టున చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ, రాముడికెటువంటి హానీ జరగదని లక్ష్మణుడు ఎంత…చెప్పినా సీత వినలేదు. నిష్ఠురోక్తులు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు మూడు గీతలు గీచి వెళ్ళాడు.

సీత ఒంటరిగా ఉంది. రావణుడు వృద్దతాపసి వేషంలో భిక్షకు వచ్చాడు. సీత… భిక్ష వేయడానికి మూడు గీత…లూ దాటింది. రావణుడు నిజరూపుతో సీ…ను ఎ…త్తుకుపోయాడు.
రామలక్ష్మణులు సీ…తను వెదుకుతూ వెళ్ళారు. రాముడు సామాన్య పామర మానవుడిలాగే విలపించాడు. వారలా వెళ్ళగా వెళ్ళగా, రెక్కలు తెగి పడి ఉన్న జటాయు పక్షి, ‘‘సీత…ను విడిపించడానికి పోరాడాను, నా రెక్కలు నరికి రావణుడు దక్షణ దిశగా సీ…ను ఎ…త్తుకుపోయాడు,’’ అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి ఆప్తమిత్రుడైన జటాయువుకు దహన సంస్కారం చేసి, రామలక్ష్మణులు వెళ్తుండగా, కబంధుడు వన్యమృగాల్తో బాటు వారిని దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైనవాడు.

    పర్వత మంతటి కడుపు, దానికే కోరలో ఆవులించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పు లాంటి కన్ను, యోజనాల పొడవునా చాచుకునే చే…తులు ఉన్నాయి. తలఅంటూ వేరే లేదు, కాళ్ళుగాని మరే అంగాలు గాని లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడెన గంధర్వుడు. శాపవిమోచనం పొంది ఆ గంధర్వుడు, గంధర్వలోకానికి పోతూ, ‘‘నీకు మునుముందు వానరులతో మెత్రికుదురుతుంది, ప్రయోజనకారి అవు…తుంది,’’ అని రాముడికి చెప్పాడు.

ఋష్యమూక పర్వతం మీద వానర వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకు హనుమంతుణ్ణి పంపాడు.

ముక్కోటి దేవ…తలు వానరుల…య్యారు. హనుమం…తుడు శివుడి అంశన పుట్టినవాడు. అంజనాదేవి, వా…యుదేవుడి అనుగ్రహంతో హనుమం…తుణ్ణి కన్నది. ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి అని పిలువబడ్డాడు. పసిత…నంలో ఆంజనే…యుడు ఉద…య సూర్య బింబాన్ని పండు అని  భావించి ఎగిరి కబళించబోగా, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛిల్లాడు. వా…యుదేవుడికి కోపం వచ్చి స్తంభించాడు. అప్పుడు దేవ…తలు హనుమం…తుణ్ణి చిరంజీవిగా దీవించి, అనేక వరాలు ఇచ్చారు.
బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్ర… ప్రభావంగల కుండలాలు …తగిలించి, అవి ఎవరికి కనపడి మెచ్చుకుంటే అ…తడే విష్ణువుగా గుర్తించి, ఆరాధ్యదైవంగా సేవించమని హనుమకు చెప్పాడు.

హనుమంతుడు సుగ్రీవుడి పంపున రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు అ…తడిని చూసి లక్ష్మణుడితో, ‘‘సుందరుడైన ఇ…తని కర్ణకుండలాలు ఎంత… ముచ్చటగా ఉన్నాయో, చూడు!’’ అంటూ మెచ్చుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, రాముడు విష్ణువు అవతారమని గుర్తించి, బంటు అయ్యాడు. రాముడిచే… సుందరుడు అనిపించుకొన్న హనుమం…తుడు, ‘సుందరుడు’ అని పేరు పొందాడు. హనుమంతుడి మూలంగా రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షగా మిత్రులయ్యారు.
సుగ్రీవుడి అన్న వాలి, కిష్కింధకు రాజు. …తమ్ముడిని ద్రోహిగా అపోహపడి చంపబోగా సుగ్రీవుడు …తప్పించుకుని పోయి ఋష్యమూక పర్వతం మీద …తల దాచుకున్నాడు. వాలి …తమ్ముడి భార్యను నిర్బంధంలో ఉంచాడు.
ఆపదలో ఉన్న మిత్రుణ్ణి కాపాడడం …తన ధర్మంగా రాముడు ఎంచి, వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి రాజును చేయడానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచినవాడి బలం వాలిని చేరేలా వరం ఉంది. ఆ కారణంగా వాలి సుగ్రీవులు పోరాడుతుండగా చెట్ల చాటునుండి రాముడు బాణంకొట్టి వాలిని కడతేర్చాడు.

Thursday, June 9, 2016

విష్ణు కథ - 11

విష్ణు కథ - 11

లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేస్తున్నప్పుడు రావణుడు కొప్పు పట్టుకున్న కారణంగా యోగాగ్నితో ఆమె దహించుకు పోయి లంకలో పుట్టింది.
లంకా పట్టణాన్ని అనుసరించుకొని అందమైన గొప్ప సరోవరం ఉన్నది. ఎప్పటిలాగే ప్రాతఃకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నాన సంధ్యలువార్చి శివార్చనకు తామరపువ్వుల్ని ఏరుతూండగా, ఒక పెద్ద తామర పువ్వు సరోవర మధ్యంలో ధవళకాంతుల్ని ప్రసరిస్తూ కనిపించింది. దాని దగ్గరికి చేరుతూండగా ఆ పువ్వులో బంగారంలాగ మెరిసి పోతున్న అందమైన స్ర్తీశిశువు క్యారుమంటూ కనిపించింది.

ఆపసిపిల్లను చూసి రావణుడు ముచ్చట పడుతూండగా అశరీరవాణి, ‘‘ఓ రావణా! ఆ బిడ్డ నీకూ, నీ లంకకూ చేటుగా పుట్టిన బిడ్డ!’’ అని వినిపించింది.రావణుడు రాక్షస వీరభటులకు ఆ పసి పాపను చంపిరండని ఉత్తరువు చేశాడు.ఆ పసిపాప ఏం చేసినా చావలేదు. కత్తులు అదృశ్యమైనాయి. అగ్ని ఆరిపోయింది.

రాతిబండలు పూలకుప్పలైనాయి. క్రూరమృగాలు పారిపోయాయి. రాక్షసులు విసిగి ఆ పిల్లను పంచలోహాలతో చేసిన పెట్టెలో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యంలో పడవేశారు.ఆ పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోకి అలా వెళ్ళింది. మిథిలా రాజ్యాన్నేలే జనకమహారాజు గొప్పజ్ఞాని, రాజర్షి. యజ్ఞం కోసం చదును చేయడానికి భూమిని దున్నిస్తున్నాడు. నాగలి చాలుకు ఖణేల్మని పెట్టె తగిలింది.

 పెట్టెను తీసి అందులో ముద్దులు మూటగట్టే బంగారుపాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఎత్తుకొన్నాడు. నాగేటిచాలుకు సీత అని పేరు. నాగలిచాలుకు దొరికినందువల్ల ఆ పిల్ల ‘సీత’ అనీ, జనకుని కుమార్తె కనుక ‘జానకి’ అనీ భూమిలో దొరికినందువల్ల ‘భూజాత’ అనీ పిలువబడుతూ అల్లారుముద్దుగా పెరిగింది.
సీత తోటి పిల్ల న్నేహితురాండ్రతో ఆడుతూ, బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనుస్సును బెండు ఎత్తినట్లుగా ఎడమచేత్తో ఎత్తి దాని చాటున వున్న బంతిని తీసుకుంది. తర్వాత ఆ ధనుస్సు ఆటకు బాగుందని అవలీలగా తీసుకువచ్చి బొమ్మరింటి గోడలాగ పెట్టి, సంతోషంగా ఆట సాగించింది. జనకుడు కళ్ళారా అదంతా చూసినిర్వణ్ణుడైపోయాడు.

ఆ ధనుస్సును జనకుడి పూర్వీకులు శివుడి దగ్గర్నుంచి పుచ్చుకొని పూజిస్తూ వచ్చారు. త్రిపురాసుర సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్దంచేశాడు. ఆ శివధనువును ఎత్తాలంటే బలాఢ్యులైన వారు మూడు వందలమంది ఉంటేనే గాని సాధ్యపడదు. అలాంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదనీ, ఆ శివధనుస్సును ఎత్తి ఎక్కు పెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడనీ జనకుడు అనుకున్నాడు.

సీతకు స్యయంవరం జరిపినప్పుడు ముందు ఆ విషయాన్నే చాటిచెప్పి, అటువంటి వాడికే ఇచ్చి కళ్యాణం జరపాలని నిశ్చయం చేసుకున్నాడు. సీత మిథిలానగరంలో అలాగే పెరిగి పెద్దదైంది. విశ్వామిత్రుడు యాగరక్షణకు, రామ లక్ష్మణులను పంపమని దశరథుణ్ణి అడిగాడు. అందుకు దశరథుడు, ‘‘రాక్షసుల నుండి యాగరక్షణకు పసివాళ్ళను ఎలాగ పంపమంటావు, మహర్షీ! వాళ్ళు, అస్ర్తవిద్యలు ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళు!’’ అన్నాడు.

‘‘అందుకేగదా నేను వచ్చినది! రాచబిడ్డలకు ఏ విద్య కావాలో నాకు తెలుసు. ఆ విద్య నేను నేర్పుతాను!’’ అంటూ విశ్వామిత్రుడు వసిష్ఠుడిని సగర్వంగా చూశాడు. వసిష్ఠుడు చిరునవ్వుతో విశ్వామిత్రుణ్ణి మెచ్చుకొని, రామలక్ష్మణుల్ని, అతనితో పంపమని దశరథుడితో చెప్పాడు.

రామలక్ష్మణులు మునులకు మల్లే జుత్తు ముళ్ళు వేసుకొని విశ్వామిత్రుడి వెంట ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు. దారిపొడవునా విశ్వామిత్రుడు వారికి ధనుర్విద్యా విశేషాలు బోధిస్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు.

రామలక్ష్మణులు విశ్వామిత్రుడి సునిశిత శిక్షణలో ధనుర్విద్యాపారంగతుల…య్యారు. విశ్వామిత్రుడు ఋషులతో కలిసి యాగం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూండగా భ…యంకరంగా అరుచుకుంటూ తాటకి పిడుగులాగ ఆశ్రమం మీద పడింది. విశ్వామిత్రుడు తాటకను చంపమని రాముడికి ఆనతిచ్చాడు. రాముడు తాటకపై శరపరంపర కురిపించాడు. ఒంటి నిండా దట్టంగా బాణాలు గుచ్చుకొని తాటకి పెద్ద పర్వతంలాగ భూమిమీద పడి విల విలా తన్నుకొని ప్రాణాలు విడిచింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి, అతని బాణప్రయోగ కౌశలానికి మెచ్చుకొన్నాడు. యాగం ప్రారంభమయింది. విశ్వామిత్రుడు రాముడికి అస్తాల్ని ఉపదేశించాడు. రామలక్ష్మణులు ధనుర్ధరులై తిరుగుతూ యాగరక్షణ చేస్తూన్నారు. మారీచుడు, సుబాహుడు ఒక్కుమ్మడిగా విరుచుకు పడ్డారు. రాముడు రెండే బాణాలు విడిచాడు. సుబాహుడు చచ్చాడు. మారీచుడు బాణం దెబ్బతిని కొసప్రాణాలతో సముద్రంలో పడి కొట్టుకు పోతూ ఎలాగో లంక చేరాడు.

యాగం నిర్వఘ్నంగా సాగింది. విశ్వామిత్రుడు …యాగసమాప్తిలో రాముడి చేత హవిస్సులు వేయించి హోమం చేయించాడు. …యజ్ఞకుండం జ్వాలలపై తేలుతూ అర్ధచంద్రాకారం మొనగల ఒక బాణం దివ్యకాంతులీనుతూ వచ్చింది. విశ్వామిత్రుడు, ‘‘రామా! అది నీ బాణం. ‘రామబాణం’ అని పేరొందుతుంది. శత్రువు కంఠం నరికి తిరిగి నీ చేతికి వస్తుంది!’’ అని చెప్పి బాణాన్ని రాముడికి అందించాడు.  రాముడు బాణాన్ని కళ్ళకు అద్దుకొని పొదిలో పెట్టుకొని విశ్వామిత్రుడి పాదాలకు ప్రణమిల్లాడు. యాగం చాలా కాలంగా సాగింది. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు రాముడికి మహాస్త్రాలన్నీ ఉపదేశించాడు. ‘‘రామా! నేనూ, నువ్వూ సూర్యవంశంవాళ్ళం. నాకు తెలిసిన అస్ర్తవిద్యనంతా నీకు ఉపదేశించి నందుకు నా కెంతో తృప్తిగా ఉంది.

నీలాంటి వాడికి గురువునని అనిపించుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది!’’ అన్నాడు విశ్వామిత్రుడు. ‘‘గురుదేవా! నీ కృపకు పాత్రుడనైన నేను ధన్యుణ్ణి!’’ అన్నాడు రాముడు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలోనే రాముడు, లక్ష్మణుడు అస్ర్తవిద్యలను నేర్చుకుంటూ యౌవనవంతులయ్యారు. ఒకనాడు అస్ర్తాల ప్రయోగ విశేషాంశాలు చెప్తూ విశ్వామిత్రుడు, రాముణ్ణి తనివితీరా చూస్తూ, ‘‘రామా!

నీ విశాల నయనారవిందాలు శాంతిచంద్రికలు వెదజల్లుతూ, నా ఆశ్రమాన్ని శాంతినిలయంగా చేయగా నీవు శాంతరాముడివి; సుందర రాముడివి!’’ అన్నాడు. తన వెంట రమ్మన్నట్లుగా విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. విశ్వామిత్రుడు మిథిలానగరం దారి పట్టాడు. దారిలో గౌతమాశ్రమం మీదుగా వెళ్తూండగా, రాముడి పాదం తగిలి ఒక బండరాయి అహల్యగా మారి రాముడి పాదాలకు ప్రణమిల్లింది.

రాముడు ఆశ్చర్యంతో వెనక్కుజరిగాడు. అదే సమయానికి చిరకాలంగా చేస్తూన్న తపస్సు చాలించి గౌతమ మహర్షి వచ్చాడు. రాముణ్ణి భక్తిగా చూస్తూ, ‘‘రామచంద్రా! నా భార్య శాపం తీరింది. నీవు పావనరాముడివి!’’ అన్నాడు. గడువు తీరి అహల్య శాపవిమోచనం జరిగింది, తనలో ఏముందని? అన్నట్లుగా రాముడు అయోమయంగా చూశాడు. గౌతముడు తదేకంగా రాముణ్ణి చూసి, ‘‘ఔను, రామా!

నీవు నివురుగప్పిన నిప్పువు! మాయా మానుషవిగ్రహుడివి!’’ అన్నాడు. విశ్వామిత్రుడు ఔను! అన్నట్టుగా తలపంకించాడు. ‘‘విష్ణువు అవతారాల్లో రామావతారం తర్వాత కృష్ణావతారంలో, కృష్ణుడు తాను అవతారమూర్తిగా తెలిసే లీలలు చేసి, మాయామానుష విగ్రహుడు అనిపించుకున్నాడు.

రాముడు పరిపూర్ణ మానవుడిగా కర్తవ్యపాలన చేశాడు. మనిషిలాగే సాధించాడు. అదే రామావతార విశేషం!’’ అని సూతుడు వివరించి రామకథను సాగించాడు. గౌతముడు అందర్నీ ఆశ్రమంలోకి తీసుకెళ్ళి, అతిథిసత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు గౌతమాశ్రమం నుండి రామ లక్ష్మణులతో బ…యలుదేరాడు. దూరంగా కోలాహలం వినిపించింది.

జనక మహారాజు సీతాస్వయంవర మహోత్సవానికి మహర్షులందరికీ భక్తి పూర్వకమైన తన ఆహ్వానం అందించి రమ్మని, తన పురోహితుడైన శతానందుణ్ణి పంపించాడు. శతానందుడు అహల్యా గౌతముల కుమారుడు. శతానందుడి పల్లకి వెనక మిథిలారాజ్య లాంఛనాలతో పరివారం వస్తున్నారు. శతానందుడు విశ్వామిత్రుణ్ణి దర్శించడానికి సిద్ధాశ్రమానికి వెళ్తున్నాడు.

దారిలోనే ఎదురైన విశ్వామిత్రుణ్ణి చూసి, శతానందుడు దిగి ప్రణామం చేసి జనకుడి ఆహ్వానం విన్నవించాడు. విశ్వామిత్రుడి వలన అహల్యా శాపవిమోచన వృత్తాంతం విని శతానందుడు మహదానందంతో రాముణ్ణి శతవిధాల కీర్తించి, జననీజనకుల దగ్గిరికి వెళ్ళాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలకు చేరారు. సీత, ఉద్యానవనంలో విహరిస్తున్నది. ఆమెతో చెల్లెలైన ఊర్మిళ ఉన్నది. ఆ ఉద్యానవనంలోనుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్తున్నారు. 
సీత, రాముడు ఒకర్నొకరు చూసుకున్నారు. ‘తనవాడు వచ్చాడు!’ అనే ఆనందంతో అడుగులు తడబడుతూండగా, సీత అంతఃపుర మందిరంలోకి పరుగుతీసింది. ఊర్మిళ మనస్సు లక్ష్మణుడిపై లగ్నమైంది. రాజాధిరాజులు, బలసంపన్నులు ఎవ్వరూ శివధనుస్సును ఎత్తలేక పోయారు. జనకుడు నిరాశపడుతూంటే, తండ్రి చెంత ఉన్న సీత, దూరాన ఉన్న రాముడిని ఓరచూపులతో చూస్తూ, ఉత్సాహంగా తండ్రి వంక రాముణ్ణి చూడమన్నట్లుగా చూసింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి ముందుకు పంపాడు. ఆచార్యదేవుడి ఆదేశం శిరసావహించి తాను నిమిత్తమాత్రుణ్ణి అన్నట్లుగా వెళ్ళి, శివధనుస్సుకు నమస్కరించి, రాముడు గున్నటేనుగు చెరుకుగడను లాగినట్లు శివధనుస్సును అవలీలగా ఎత్తి పట్టి, నారిని బలంగాలాగి ఎక్కుపెట్టే సరికి, గొప్ప ధ్వనితో భూనభోంతరాళాలు దద్దరిల్లగా, శివధనుస్సు విరిగిపోయింది.

మహాధ్వని తరంగాలు దిగంతాలు వ్యాపించి, దక్షణ మహాసముద్రంలో మహేంద్ర పర్వతం మీద తపస్సులో ఉన్న పరశురాముడి చెవిని సోకాయి. పరుశురాముడు విష్ణువు మారురూపమైన గోలోకవాసియైన కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఇచ్చిన కోదండాన్ని, విష్ణు అంశను రాముడికి అప్పగించడానికి బ…యల్దేరాడు. సీత రాముడి మెడలో మాలవేసి సిగ్గు దొంతరలతో చరచరా తండ్రి చెంత చేరింది. సీతారాముల వివాహానికి దశరుథుడు సకుటుంబ సపరివారంగా మిథిలకు చేరాడు.

పెళ్ళిపీటలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, సీత కమలం వంటి దోసిట్లో ముత్యాలు పద్మరాగాల్లా ప్రకాశించాయి. రాముడి తలపై జాజిమల్లెల్లాగ తెల్లగా విరిశాయి. రాముడి శ్యామలశరీరంపై జారుతూ, వింతకాంతులతో ఇంద్రనీలాల్లాగ కనిపించాయి. సీతకు చెల్లెళ్ళయిన ఊర్మిళను లక్ష్మణుడికీ, మాండవిని భరతుడికీ, శతరూపను శత్రుఘ్నుడికీ ఇచ్చి వివాహం సీతారామ కళ్యాణ మహోత్సవంలోనే జరిపించారు.

దశరథుడు కొడుకులు కోడళ్ళతో అయోధ్యకు తిరుగుప్రయాణమయ్యాడు   హుటాహుటిగా వస్తున్న పరశురాముణ్ణి చూస్తూనే రథం దిగి ప్రణమిల్లి రాముడికి బదులుగా తన తల నరకమని ప్రాథేయపడ్డాడు. పరశురాముడు, ‘‘ఓ,రామా! ఆ హరవిల్లు విరిచావుట, ఈ వింటిని ఎక్కుపెట్టు!’’ అని తన చేతనున్న కోదండాన్ని అందించాడు. దాన్ని అందుకుంటున్నప్పుడే పరశురాముడిలోని విష్ణు అంశ రాముడికి చేరింది. కోదండాన్ని రాముడు ఎక్కుపెట్టాడు.