సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, June 11, 2016

హనుమoతుడు వాయుపుత్రుడు


 హనుమoతుడు వాయుపుత్రుడు,
 శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు......!!
పూర్వకాలం లో పుంజికస్తల అనే అప్సరస ఒకసారి భూలోకానికి వచ్చి తిరుగుతుండగా ఒక కోతి ధ్యానమగ్నమై ఉండగా చూసి అతని తపస్సు కు భంగం కలిగే విధంగా ప్రవర్తించినది(పెద్దగా నవ్వుతూ అతని మీద రాళ్ళు వేసినది). అప్పుడు తపస్సు నుండి లేచిన ఆ తపస్వి ఆమెను మరు జన్మలో వానరo గా పుట్టమని శపించాడు. ఆమె చేసిన తప్పును గ్రహించి శాపవిమోచనం చెప్పమనగా ఇది దైవకార్య నిమిత్తమై ఆ పరమాత్మ తనతో ఈ విధమైన శాపాన్ని ఆమెకు వచ్చేలా చేసాడు అని, ఆమె వానరం గా ఉన్నపుడు అతివీరభయంకరమైన బలం కలిగిన పుత్రుడిని శివ అంశగా పొందుతావు అని ఉరడిoచాడు.
ఈ విషాదం తో స్వర్గానికి చేరిన ఆమెను తనను సంతోషింప చేయవలసినది అని ఇంద్రుడు కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు కనుక ఆమెను భూలోకం లో జన్మించమని శపించాడు.
ఆమె కుంజ అనే ఒక వానర యోదునికి కుమార్తె గా జన్మించింది. ఆమెకు అంజన అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత ఆమెను కేసరి వివాహం చేసుకున్నాడు. ఒకనాడు కేసరి దక్షిణ సముద్రం ఒడ్డున తపస్సు లో ఉండగా వారి ఇంటికి అగస్త్య మహర్షి వచ్చారు. అప్పుడు అంజన ఆ మహర్షికి సర్వ ఉపచారములు చేసింది. ఆమె అతిధి సత్కారానికి సంతోషించిన అగస్త్యుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంజన తనకు అతి బలవంతుడైన, బుధివంతుడైన పుత్రుడు, సర్వ లోకముల కు శాంతి చేకూర్చే వాడు కావలి అని కోరుకుంది. అగస్త్యుడు మహాముని కనుక తధాస్తు అని దీవించి, ఆమెకు సాక్షాత్తు ఆ మహాదేవుని అంశతో పుత్రుడు కలుగబోతున్నాడు కనుక ఆమెను అందుకు సిధం చేయాలి అని తలచి ఆమెను వృషభాద్రి పై అకాశగంగ ప్రక్కన ధ్యానం చేయవలసినది గా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పిన విధం గానే అక్కడ ధ్యానం చెస్తూ ఉంది.
ఒకరోజు ధ్యానం చేస్తున్న ఆమెను చూసి వాయుదేవుడు ఆమెను చేరాడు. ఆ సంఘటనకు ఆమె ధ్యానభంగం అయినది. అప్పుడు ఆమె "ఎవడురా దుర్మార్గుడు! నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నాడు" అని కోపించింది. అప్పుడు వాయువు అన్నాడు "అంజనా! బ్రహ్మగారు మా సర్వ దేవతల తేజస్సులను వానర స్త్రీలందు ప్రవేశపెట్టి వానారాలని సృస్టించామన్నాడు. అందువాల్ల నేను నీ పాతివ్రత్యాన్ని భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానం గా దూకగల వాడు, ఎగరగలవాడైన పుత్రుడు కేవలం నిన్ను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపు నందు జన్మిస్తాడు" అన్నాడు.
అలాగే తీర్ధయాత్రలు చెస్తూ ఉన్న కేసరి గోకర్ణం మీదుగా వెళుతున్నపుడు అక్కడ శంబసదనుడు అనే రక్షసుడి గురించి, అతను పెడుతున్న భాదలగురించి అక్కడి ఋషుల,మునుల ద్వారా విని అతనిని ఎదుర్కొన్నాడు. భీకరమైన యుధం తర్వాత అతనిని మట్టుపెట్టాడు. అతని విజయాన్ని చుసిన ఋషులు మునులు అతనికి ఒక ప్రయోజకుడిన పుత్రుడు, లోకంలో ఏ విధమైన అవినీతిని ఒప్పుకోనివాడు జన్మించాలి అని దీవించి, కేసరికి మహాదేవుని యొక్క అతి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాని కేసరి జపిస్తూ ఉండుటవల్ల అతని శరీరం దివ్య కాంతిని పొందింది.
కేసరి తీర్ధయాత్రల నుండి ఇంటికి వచ్చే సమయానికి అంజన వృషబాద్రి నుండి ఇంటికి వచ్చి ఉంది. వీరిద్దరికీ కలిగిన వరముల ప్రభావం వల్ల అంజని కొంతకాలానికి గర్భవతి అయింది. అప్పుడు ఆమెకు అతి బలవంతుడు, శివ అంశ, వాయుపుత్రుడు ఐన హనుమంతుడు జన్మించాడు.

Friday, June 10, 2016

హనుమంతుడి జన్మరహస్యాలు

హనుమంతుడి జన్మరహస్యాలు

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.

రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:)  శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం(20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం(20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది.   అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం(66-16, 18,19) . సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం(66-24).

అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

విష్ణు కథ - 16

విష్ణు కథ - 16

కృత, త్రేతా యుగాల తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి, భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టింది.

విష్ణువు, ‘‘దేవీ! కృష్ణావతారం ఎత్తి, నీ ఆర్తి తొలగిస్తాను!’’ అని అభయమిచ్చాడు.

ఆదికాలం నుంచీ విష్ణువుకు ప్రబల శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి, మధురానగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడనిపించుకున్నాడు.

దేవాసుర యుద్ధంలో, దానవ నాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడిన విప్రచిత్తి, మగథ రాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి, రాజులను తెచ్చి భైరవుడికి బలులిచ్చి అతి శ్రద్ధగా దీక్షతో అర్చిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు.

ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి, యదువంశ రాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూండగా, ఆకాశవాణి - దేవకి ఎనిమిదో సంతానంవల్ల కంసుడు చంపబడతాడు - అని పలికింది.

కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి, ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా, ఆరుగుర్ని అప్పగించాడు.

దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్యయైన రోహిణి గర్భాన చేర్చి, పిమ్మట నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగ మాయాదేవిని విష్ణువు ఆదేశించాడు.


దేవకి ఏడవగర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే, దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు.

అది శ్రావణ మాసం. కృష్ణపక్షం. అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణీ నక్షత్రంతో   ఉన్నాడు. నడి రాత్రి. కావలి భటులకు చావునిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి.

విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డడిని యమునానదిని దాటించి, అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయనిద్ర ఆవహించగా, ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి, ప్రాణం లేనట్లున్న పిల్లను సంగ్రహించుకొని తిరిగి వెళ్ళాడు.

చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగ ఆ శిశువు క్యారుమని గగ్గోలు చేసింది.

కంసుడు శిశువును వధ్యశిల పైకొట్టి చంపబోగా పైకెగసి, పకపక నవ్వుతూ, ‘‘ఓరి, కంసా! నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే!’’ అని చెపుతూ, దుర్గాదేవిగా కనిపించి అంతర్థానమైంది.

కంసుడు భయంతో, ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్నీ తెగటార్చాడు.

గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.

నారదుడు కంసుడి దగ్గిరికి వచ్చి, ‘‘కంసా! నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కావు; కాలనేమివి! నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి గదా? నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు!’’ అని హెచ్చరించి వెళ్ళాడు.

ఉగ్రసేనుడితో వివాహమై, విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణివద్దకు ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళినప్పుడు, కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడుగా పుట్టాడు.
కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు.
పసివాళ్ళను చంపమని పూతన రక్కసిని పంపాడు. ఊరూరా పసిపాపల్ని చంపుతూ, మానవకాంత రూపంతో వెళ్ళి పాలీయ వచ్చిన దాని ప్రాణాలు పీల్చి చంపాడు కృష్ణుడు.

యవనమ్లేచ్ఛులకు రాజైన కాలుయవన రాక్షసుడిని జరాసంధుడు కృష్ణుడి మీదకు ఉసిగొల్పాడు.

కృష్ణుడు కాలుయవనుడికి దొరక్కుండా పరుగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో జొరబడి దాక్కున్నాడు.

ముచికుందుడు ఇక్ష్వాకుల నాటి మాంధాత కుమారుడైన గొప్ప రాజు. యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరాడు. ద్వాపరయుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను, నిద్రాభంగం చేసినవారు తను చూడగానే భస్మం కావలెనని కోరుకున్నాడు.

కాలయవనుడు ముచికుందుణ్ణి కృష్ణుడనుకొని తన్నాడు. నిద్రాభంగమై ముచికుందుడు తీక్ష్ణంగా చూసేసరికి కాలువనుడు బూడిద అయ్యాడు.

కృష్ణుడు ముచికుందుడికి దర్శనమిచ్చి, బదరికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు. జయ, విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా పుట్టారు.
చేదిదేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో, మూడు కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను, రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాణ్ణి ఎత్తుకోమని ఇస్తుండేది.

కృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది. తన పిల్లవాణ్ణి వారికీ ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడ్యూడు.

శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచి పుచ్చమని సాత్వతి అర్థించింది. కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు.

శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలూ, అపరాధాలూ చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్త్రుడు తోడైనాడు.

జరాసంధుడు మాటిమాటికీ మధురా నగరంపై దాడి చేస్తూంటే కృష్ణుడు పలు మార్లు ఓడించి, తరిమికొట్టి, దుర్మార్గులైన రాజులెందర్నో కడతేర్చాడు.

కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్ర మధ్యంలో విశ్వకర్మచేత సురక్షతమైన ద్వారకానగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తనవారినందరినీ ద్వారకకు తరలించాడు.

జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, సాళ్వుడు మొదలైన తన అనుయాయులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు.

అంతకుముందే యాదవుల్నీ, మధురా ప్రజనూ, ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు.

జరాసంధాదులు ప్రవర్షణ గిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చారు. కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షతంగా చేరుకున్నారు.

జరాసంధుడూ, శిశుపాలుడూ కృష్ణ బలరాములు దగ్థమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే, ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లముఖాలతో ఒకర్నొకరు చూసుకున్నారు.

శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి. జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణ చూస్తూండగా, ‘‘తాతా!’’ అన్న కృష్ణుడి పిలుపు, పకపక నవ్వు వినిపించి సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీదనిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు.

‘‘జరాసంధా! ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు. నీ సమబలుడైన వాడిచేత చస్తావు. కొంతకాలం గతించాక మళ్లీ పునర్దర్శనం, వెళ్ళు!’’ అన్నాడు కృష్ణుడు.

విదర్భ రాజైన భీష్మకుడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. బాలప్రాయం నుంచీ కృష్ణుడే తన నాథుడని చెప్పుకొనేది. అటువంటి రుక్మిణిని, రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి సర్వసన్నాహాలు చేశాడు.

ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షంచమని రుక్మిణి కృష్ణుడికి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది.

పెళ్ళికి ముందు రుక్మిణి దుర్గను పూజించి, ఆలయం నుంచి వస్తూండగా, కృష్ణుడు రుక్మిణి చేయిపట్టి నాలుగు గుర్రాలు పూన్చిన తన రథం మీదకు ఎక్కించుకొన్నాడు. రుక్మి, శిశుపాల జరాసంధాదులు ఎదుర్కొన్నారు.
బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు.

కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికొట్టాడు. బలరాముడు జరాసంధుడినీ ఓడించి తరిమాడు. శత్రు రాజులందర్నీ కృష్ణ బలరాములు చిందర వందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టూ, మీసమూ గొరిగి పరాభవించి విడిచి పెట్టాడు. రుక్మి మరెప్పుడూ కృష్ణుడి జోలికి పోలేదు.

క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణీ కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది.

తరువాత కృష్ణుడు నీలాపనింద తొల గించుకోడానికి అరణ్యం పట్టి, గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి, శ్యమంతక మణిని తెచ్చి, సత్రాజిత్తుకి ఇచ్చి, భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకొన్నాడు. తరువాత జాంబవతి, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితిలను వివాహం చేసుకొని అష్ట మహిషులతో అష్ట సిద్ధులుగల యోగపురుషుడిలాగ, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ, ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతున్నాడు.

విష్ణు కథ -15

విష్ణు కథ -15

రాముడు పట్టాభిషిక్తుడై, లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూండగా, ప్రజలు అన్నివిధాలా ఆనందిస్తున్నారు.
ఒకనాడు పల్లెటూరి బ్రాహ్మణుడు ఒకడు తన అయిదేళ్ళ కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గిర నిలబడి ఏడవటం మొదలు పెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాలమరణం పొందినందుకు ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు "రాజు సరిగా పాలిస్తే ఇలాటి అకాలమరణాలుండవనీ, ఇన్నాళ్ళకు ఇక్ష్వాకుల పరిపాలనలో, రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయింద"నీ అన్నాడు.

రాముడీ సంగతి తెలుసుకుని చాలా చింతించి, తన మంత్రులనూ, వసిష్ఠుడు మొదలైన బ్రాహ్మణులనూ పిలిపించి, వారితో బ్రాహ్మణ బాలుడి అకాలమరణం గురించి చెప్పాడు. శంబూకుడనే ఒక శూద్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడనీ, అది యుగధర్మానికి విరుద్ధమనీ, అందుకే ఆ బాలుడు చనిపోయాడనీ, నారదుడు రాముడితో అన్నాడు.

రాముడు లక్ష్మణుడితో, ‘‘నీవు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి ఓదార్చి, ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా వుంచు," అన్నాడు. తరవాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి పడమరా, ఉత్తరమూ, తూర్పూ గాలించి, చివరకు దక్షణదిక్కున ఒక సరస్సులో తలకిందుగా తపస్సు చేస్తున్న మనిషి నొకణ్ణి చూశాడు.

రాముడు పుష్పకం దిగి, తన కత్తి దూసి శంబూకుడి తల నరికాడు. శంబూకుని తల కళ్ళు విప్పి ఆనందంగా రాముణ్ణి చూసి ‘‘రాఘవా! మరణమన్నది ఏదో ఒకలాగ తప్పనిది. నీవు నిమిత్తమాత్రుడివి.


వివిధవర్గాలతో కూడిన ప్రజలకు నీవు రాజువి; రాజు ప్రజాసేవకుడు, ఆ ధర్మాన్ని నిర్వర్తించావు. నీవు విచారించవలసిన పనిలేదు. నిన్నెటువంటి పాతకమూ అంటదు; నేను కులానికీ, వృత్తికీ అతీతుడైన యోగిని; విష్ణుసాయుజ్యాన్ని పొందుతున్నాను!’’ అని చెప్పి కళ్ళు మూసింది.

శంబూకుని భార్య కపిల రాముడితో, ‘‘సీతాపతీ! రాజధర్మ నిర్వహణలో మున్ముందు నీవు ఎదుర్కొనవలసి ఉన్న కఠోర పరీక్షకు ఇది నాంది! నేను నా భర్తతో సంతోషంగా వెళ్తున్నాను, దృఢచిత్తుడవై కర్తవ్యపాలన చెయ్యి!’’ అని చెప్పి భర్తతో చితిపై సహగమనం చేసింది.

రాముడు తిరిగి వస్తున్న దారిలో, ఒక గుడ్లగూబకు చెందిన చెట్టు తొరన్రు దురాక్రమణ చేసిన గ్రద్దను శిక్షస్తున్నట్లుగా దాని తలమీద చేత్తో తట్టాడు. ఆ వెంటనే గ్రద్ద రూపం పోయి బ్రహ్మదత్తుడనే రాజు శాపవిమోచనం పొంది వెళ్ళాడు. విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చి, తనను అవమానించిన శకుంతుడు అనే రాజును వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు.

అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలుదేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది. హనుమంతుడు తల్లి మాట నిలపడానికి, రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది.

ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం  విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు.

ఒక అర్ధరాత్రి రాముడి శయన మందిరం ముందు ఒక కుక్క న్యా…యం కోసం ఆర్తనాదం చేసింది. రాముడు దిగ్గున వచ్చి రక్తం కారుతూన్న దాని గాయాన్ని అదిమిపట్టాడు.
కుక్క తాను కిందటిజన్మలో పూజారిగా ఉన్నందువల్లే కుక్కగా పుట్టాననీ, నిష్కారణంగా తన్ను కొట్టినవాడిని పూజారిగా నియమించవలసిందనీ, అదే తగిన శిక్ష అనీ చెప్పింది. దాని గా…యం మాయమై సుఖంగా వెళ్ళింది.

ఏ ప్రాణికీ నొప్పి కలగకుండా చక్కగా రాజ్యపాలన జరుగుతున్న రామరాజ్యంలో - ‘‘పరాయివాడి ఇంట ఉన్న భార్యను తెచ్చి పెట్టుకొనేలాంటి సిగ్గుచేటు పని చేయడానికి, రాజ్యమేలే రాముడిని కాను-!’’ అనే మాట ఒక అల్పుడి నోట వెలువడింది.

 సీతను అరణ్యంలో వదిలి రమ్మని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. లక్ష్మణుడు ఆక్రోశంతో ఆవేశపడుతూంటే, ‘‘లక్ష్మణా! ఒక అల్పుడు ఆడంబరంగా పలికిన మాట ఎంతోమంది మనస్సుల్లోనో దాగి ఉండవచ్చును గదా! రాజ్యమంటే నేలకాదు, మనుషులు! భిన్నవర్గాలతో నిండిన ఆ ప్రజల్ని పాలించడం అనేది కత్తి పదును మీద నడక! స్వార్థానికి ఏ మాత్రం తావు లేదు. జనవాక్యాన్ని కర్తవ్యంగా ఎంచి, గుండెను రాయి చేసుకొనవలసిన రాజును నేను!’’ అని రాముడు అన్నాడు.

మునిపత్నులతో ఆశ్రమాల్లో ముచ్చటగా గడపాలన్న నిండు చూలాలైన సీత కోరిక చెల్లించే నెపంతో, లక్ష్మణుడు రథం మీద సీతను తీసుకెళ్ళి కీకారణ్యంలో దిగవిడిచి వచ్చి, ‘‘అయ్యో! ఆనాడు హనుమంతుడు  సంజీవిని తెచ్చి నన్ను బ్రతికించింది ఇందుకా!’’ అని గుండెలవిసేలాగ రోదించాడు. వాల్మీకి మహర్షి సీతను తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. సీత కుశుడు, లవుడు అనే అందమైన కవల కుమాళ్ళను కన్నది.

అయోధ్యా రాజ్యంలో అనావృష్టి ఏర్పడింది. వర్షాలు సరిగ్గా కురవక భూమి బీటలు బారింది. సీతావియోగంతో కుమిలి పోతున్న రాముడితో అశ్వమేధయాగం చే…యమని పెద్దలు ఆదేశించారు. బంగారంతో సీత విగ్రహాన్ని చేయించి పక్క నుంచుకొని రాముడు యాగదీక్ష పట్టాడు. లవకుశులు వాల్మీకి రచించిన రామా…యణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వచ్చారు. ముని బాలకులమని చెప్పుకొన్న వారిని చూసి రాముడు ముచ్చటపడి కౌగలించుకొని కానుకలిచ్చి పంపాడు.

రఘు వంశీ…యులకు తప్ప అన్యులకు పట్ట శక్యం కాని అశ్వమేధయాగాశ్వాన్ని లవకుశులు పట్టి కట్టేశారు. యాగాశ్వాన్ని విడిపించడానికి వచ్చిన శత్రుఘ్న, భరత, లక్ష్మణులతో …యుద్ధం చేసి, వాళ్ళను మూర్ఛపోయేలా చేసిన లవకుశులను రాముడు ఎదుర్కొన్నాడు. లవకుశులు తల్లి మీద ఆనపెట్టి బాణాలు వదిలారు. రాముడు మూర్ఛపోగా సీత వచ్చి పాదాలుపట్టి మేల్కొలిపింది. రాముడితోబాటు అంతా మూర్ఛ నుండి లేచారు. వాల్మీకి రాముడికి కుమాళ్ళనూ, సీతనూ అప్పగించాడు.

రాముడు సీతతో సింహాసనంపై కూర్చొని లవకుశులను తొడలపై కూర్చుండబెట్టుకొని వారిని …యువరాజులుగా ప్రకటించాడు. తరువాత రాముడు సీత తన ఔచిత్యానికి తగ్గట్టుగా అయోధ్యా ప్రజలముందు శపథం చే…యవలసిందని చెప్పాడు.

సీత అయోధ్యానగర మధ్యంలో నిలబడి ఆకాశాన్ని చూసి, అయోధ్యా రాజ్యంపై వర్షం కురవాలని పలికింది. మరుక్షణంలో ఆకాశం మబ్బులతో నిండి అమృత జలధారలతో రాజ్యమంతటా వాన కురిసింది. ఆ తరువాత సీత నేలను చూస్తూ, ‘‘అమ్మా! రఘువంశదీపకులైన కుమాళ్లు తండ్రి అండ చేరుకున్నారు. నాకు కావలసిందింకేమీలేదు, కరుణతో నన్ను స్వీక రించు!’’ అన్నది.

భూమి కంపించింది. భూమి రెండు పాయలుగా చీలింది. దివ్యకాంతులు వెలువడ్డాయి. రత్నసింహాసనంపై భూదేవి మీదకువచ్చి సీతను తన ఒడిలోకి తీసుకొని భూమిలోకి వెళ్ళిపోయింది. పుష్పవృష్టి కురిసింది. భూమి వెంటనే మూసుకుంది. రాముడు భూమిని చీలుస్తానని విల్లెక్కు పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి, ‘‘రామా! భూదేవిపై ఆగ్రహించడం పాడి కాదు. సీత భూజాత. భూమిలోకి వెళ్ళి నిజనివాసం చేరింది!’’ అని పలికింది.

 రాముడు కుమాళ్ళను చూసుకొంటూ చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, దేవ రహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కాపుంచమనీ, ఎవరినైనా రానిచ్చితే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో అవతరించిన పని తీరిందనీ, వైకుంఠానికి విష్ణువుగా చేరవలసిందనీ చెప్పాడు.

అదే సమయంలో దుర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడటానికి వెళ్ళ నివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోనికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపో…యాడు.

రాముడు లవకుశులను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. అది శ్రావణమాసం. సర…యూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తూన్నది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణపర్వదినం. మంగళ తూర్యనాదాలు మ్రోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటి పెట్టుకొని నడుస్తూండగా, రాముడు సరయూనదికి బ…యలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు.

రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. సామ,దేవగాంధార, హిందోళ, సురట రాగాల మేళవింపుతో వీణాధ్వనులు దిక్కులు మారుమ్రోగుతూండగా వినిపించాయి.

అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తున్నది, పూలవాన కురుస్తున్నది; క్షీరసాగరంలాగ సర…యూనది పూల రాసులతో నిండిన ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగింది!
అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురుచూస్తున్నారు. భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుకాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మిపాదాలొత్తగా శేషతల్పం అలంకరించాడు.

మాయామానుష విగ్రహుడై ఉత్తమ మానవతామూర్తిగా పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడైన మానవ మాత్రుడిగా వానరులను కూడగట్టుకొని వారధినికట్టి, అజేయుడనని విరవ్రీగిన రావణుడినికొట్టి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రాముడి అవతారం విష్ణువు దశావతారాల్లో చాలా విశేష మైనదిగా కీర్తింపబడింది.

కీర్తింపబడింది. రామరాజ్యం ఆచంద్రార్కం పేర్కొన బడుతుంది-అని సూతమహర్షి రామావతారం ముగించి, కృష్ణావతారం గురించి చెప్పడం ప్రారంభించాడు: ఒకానొకప్పుడు శివుడు తన భక్తులైన దానవప్రముఖుల్ని అవలీలగా విష్ణువు అంతమొందించడం చూసి అసహనంగా కనుబొమలు ముడిచాడు. ఆ బొమముడి నుండి సహస్రకవచుడు అనే ఘోరాకారుడు ఉద్భవించాడు. పొరలు పొరలుగా వెయ్యి కవచాలు, అజేయ ప్రభావంగల అద్భుత కుండలాలుగల సహస్రకవచుడు ప్రళయ భీకర గర్జన
చేసి, ‘‘నేను తెలివిమాలిన రాక్షస మాత్రుణ్ణికాను, రుద్రాంశ సంభూతుణ్ణి! చేవగలవాడైతే ఆ విష్ణు నన్నేం చేగలడో చెయ్యమనండి!’’ అని లోకాలు దద్దరిల్లేలాగ అరిచి విజృంభించాడు.

విష్ణువు నర, నారాయణులనే జంట ఋషులుగా అవతరించాడు. నరనారాయణులు దురహంకారి అయిన సహస్రకవచుడిని జయించగల శక్తిసాధనకు తపస్సు ప్రారంభించారు. ఇంద్రుడు వారి తపోభంగానికి అప్సరసల్ని పంపాడు. నారా…యణుడు తన తొడ నుండి అద్భుత సౌందర్య రాశి అయిన ఊర్వశిని పుట్టించాడు. ఊర్వశి ముందు రంభాది అప్సరసలు వెలవెలపోయారు. ఇంద్రుడు నరనారాయణులకు క్షమాపణ చెప్పుకొని ప్రణమిల్లాడు. నారాయణుడు ఊర్వశిని తీసుకుపొమ్మన్నాడు.

అప్సరసలతో కలిసి ఊర్వశి సంతోషంగా స్వర్గలోకం చేరింది. నారాయణుడు, నరుడు ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు విల్లమ్ములు ధరించి సహస్రకవచుడితో పోరాటంచేస్తూ, అలాగ వేలసంవత్సరాల పొడుగున సాగిన …యుద్ధంలో, తొమ్మిదివందల తొంభైతొమ్మిది సహస్రకవచుడి కవచాలను ఛేదించారు. సహస్రకవచుడు ఒకే కవచంతో పారిపోయి సూర్యుడిలో దాక్కున్నాడు. ‘‘ప్రగల్భాలు పలికి చివరికి పారిపోయి దాక్కున్నాడు, పిరికిపంద! వీడి పని కృష్ణావతారంలో పట్టించాలి!’’ అని విష్ణువు నిశ్చయించుకున్నాడు.

విష్ణు కథ - 14

విష్ణు కథ - 14
విభీషణుడిలాగే రావణుడి పట్టమహిషి మందోదరి కూడా భర్తకు హితవు చెప్పింది. ‘‘నాథా! ముక్కు చెవులు కోసినందుకో, వరించమంటే వరించనందుకో, నీ చెల్లెలు అవమానం భరించలేకపోయినప్పుడు; ఒంటరిదాన్ని, అసహా…యురాల్ని, బంగారాన్నో, పశువునో, పక్షనోలాగ ఎత్తుకు వచ్చినందుకు, సీత ఎంత బాధపడుతుందో ఊహించావా? శూర్పణఖ ప్రతీకారంతో సీతను ఎత్తుకు రమ్మన్నట్లే, సీతకు జరిగిన అవమానానికి ఆమెకు ఇంకెంత కసి ఉంటుందో ఆలోచించు!’’ అన్నది.

రావణుడు, ‘‘ఔను మందోదరీ, ఇప్పుడు తెలుస్తున్నదిగానీ, కానీ-ఏమైనా కానీ, రావణుడు తల వంచడం అనేది లేదు! నీ భర్త భీరువుకాడు. పిరికిమందు నూరి పోయకు! కేవలం మానవుడైన ఆ రాముడు ఏం చేయగలడో నేనూ చూస్తాను,’’ అన్నాడు.

ఎక్కడెక్కడి వనాల్లోని వానరులంతా చేరుకొని రాముడి సేనగా తయారయ్యారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, సుషేణుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులంతా సేనానాయకులై రాముడికి అండదండలుగా నిల్చారు. హనుమంతుడు రాముడి కార్యకర్తగా, అంగరక్షకుడిగా లంకపై దాడికి సర్వసన్నాహాలు ప్రారంభమయ్యాయి.

హనుమంతుడు పర్వతాలు, కొండలు తెచ్చి సముద్రంలో వేశాడు. వానరులు పెద్ద బండలు, శిలలు తెస్తున్నారు. చిన్న కోతులు రాళ్ళు మోసుకొస్తున్నారు.

నూరు యోజనాల పొడవునా లంకకు సముద్రం మీద సేతు నిర్మాణం అతి వేగంగా ఎంతో ఉత్సాహంతో ప్రారంభమైంది.

 నీలుడు సేతు నిర్మాణపర్యవేక్షణాబాధ్యత తీసుకున్నాడు. విభీషణుడు ఆకాశమార్గాన రాముడి శరణాగతుడై వచ్చాడు. రాముడతనికి అభ…ుమిచ్చి లంకకు రాజును చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడు సముద్ర జలాలతో అతణ్ణి లంకకు రాజుగా అభిషేకించాడు.

రాముడు వారధికట్టించి, కోదండాన్ని, రామబాణాన్ని రెండు చేతులతో పట్టుకొని, వానరసేనలు వెంటరాగా, ఇరుపక్కల లక్ష్మణుడు, హనుమంతుడు నడుస్తూండగా,  లంకను ముట్టడించడానికి బ…ులుదేరాడు. విభీషణుడు వారిని అనుసరించాడు. వేగులు రాముడు వానరసేనలతో సముద్రం దాటి వస్తున్న వార్త తెచ్చారు. రావణుడు చకితుడ…్యూడు. ఒక నరుడు వానరులను కూడగట్టుకొని, సముద్రం మీద నూరు ెూజనాల పొడవు వంతెన కట్టి, ముల్లోకాలను గడగడలాడించే రావణాసురు డంతటివాడిని కొట్టి తన సొత్తయిన భార్యను తెచ్చుకున్నాడు అని అనిపించుకోవడమే! ఏమిటిది? ఇది జరుగుతుందా? కట్టడం మాత్రమే జరిగినంత మాత్రాన మిగతా రెండూ జరుగుతా…ుని భ…ుపడ్డం దేనికి? అని అనుకుంటూన్న రావణుడితో, మంత్రి ప్రహస్తుడు, ‘‘శత్రువును దారిలోనే ఎదుర్కొని తుద ముట్టించడం మంచిది!’’ అన్నాడు.

రావణుడు నవ్వి, ‘‘మన కుంభకర్ణుడికి తగినంత ఆహారం దొరకడం లేదు. వాళ్ళు లంకకు రానీ! సాలెగూటిలో చిక్కుకున్న ఈగల్లాగ, నా తమ్ముడి ఆకలికి పనికొస్తారు!’’ అన్నాడు. రాముడు వానరసేనలతో వారధిని దాటి లంకా తీరాన్ని చేరాడు. లంకానగరం ఎత్తయిన పర్వతం చివరంటా నిర్మించబడింది. పర్వతాగ్రం మీది సౌధంలో రావణుడు ఉంటాడు.

ఆ సౌధాగ్రం నుంచి రావణుడు రామదండు విడిసిన తీరాన్ని చూశాడు. తీరం పొడవునా చీమలబారుల్లాగ వానర సేనలు వ్యూహాలు పన్నుతున్నారు. అంగదుడికి వీరావేశం వచ్చింది. రివ్వున ఎగిరి వెళ్ళి రావణాసురుడి సౌధం మీద వాలాడు. ‘‘ఓ, రావణా! ఒకప్పుడు నిన్ను తోకతో చుట్టి విసిరేసిన వాలి కుమారుణ్ణి నేను, అంగదుణ్ణి! అప్పటి నుంచి నువ్వు, మా తండ్రిపట్ల గౌరవమర్యాదలతో మిత్రుడిగా ఉన్నావు గనుక, చెబుతున్నాను.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముడితో వైరం మాను. శరణు వేడు. వానరమూకతో రాముడేం చేయగలడన్న ధీమాతో వుండకు. వానరులెంతటి వారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు!’’ అన్నాడు.

రావణుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు. అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడద్రోసి, తిరిగి వానరసైన్యం వున్న చోటుకు ఎగిరి వెళ్ళాడు. వానరసేన విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకు పరుస్తూంటే, రావణుడు కుంభకర్ణుడి నిద్ర చెడగొట్టించి, అతణ్ణి వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు.

కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ సరస్వతి చేత అతని కోరికలు తారుమారు చేయించాడు. ఆరు నెలలు తిండి, ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు, ఆరు నెలల నిద్ర, ఒకరోజు తిండి కోరుకున్నాడు. బ్రహ్మ అతడికి అలాగే వరమిచ్చాడు. ఆరు నెలల నిద్ర పూర్తిగా తీరకపోతే, కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది. అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు, అన్నకు వినయంగా హితబోధ కూడాచేశాడు. రావణుడు, ‘‘చేస్తే యుద్ధం చెయ్యి, లేదా వెళ్ళి పడుకో!’’ అన్నాడు.

నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకు తినసాగాడు. రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ …యుద్ధంలో రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు.
ఆ తరవాత యోధానుయోధులైన రాక్షస ప్రముఖులందరూ కూలిపోయారు. రావణుడి పెద్దకొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికొచ్చాడు.

రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకొని ఉన్నాడు. మేఘాల్లోంచి యుద్ధం చేసే వాడవడంవల్ల మేఘనాథుడు అని పేరొంది, ఇంద్రుణ్ణి జయించి కట్టి తెచ్చి, ఇంద్రజిత్తు అనిపించుకొన్న మహావీరుడు. మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తులమారి, మహామాయావి. పధ్నాలుగేళ్ళు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోరదీక్ష గడిపిన వాడివల్లనేగాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి,గాని, మరెవ్వరివల్లా అతనికి ప్రాణభయం లేదు.

ఇంద్రజిత్తు మాయ సీతను కల్పించి, రాముడికి కనిపించేలాగ ముక్క ముక్కలుగా నరికాడు. లక్ష్మణుడు అది అంతా మాయాజాల మని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు. అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనే వాడి చేత రాముడి తలను తయారు చేయించి, శూలానికి గుచ్చి సీతకు చూపమని పంపాడు.

దానిని చూసిన సీత, ‘‘ఇలాంటి చేతి పనివి కాకుండా, రావణుడి అసలు తలలు తెగి నేల దొర్లేరోజు వచ్చిందిలే,’’ అని చెప్పింది ఆవేశంగా. ఇంద్రజిత్తు  మేఘాల్లో దాగి రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు. గరుత్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు.

సీతారాముల సేవలో పధ్నాలుగేళ్ళు కఠోరదీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు. లక్ష్మణుడూ, విభీషణ, హనుమంతులూ వెళ్ళి నల్లటి మేకపోతులను బలిచేస్తూ, ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రామలక్ష్మణులను కాళికి బలి వేయమని రావణుడు పాతాళ లంకాధిపతియైన మైరావణుడిని కోరాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి, పాతాళ లంకకు ఎత్తుకుపోయి, కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు.

హనుమంతుడు పాతాళ లంక చేరి, ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూండగా, సువర్చలాదేవి వారిద్దరూ తండ్రీ కొడుకులౌతారని చెప్పి పోరు మాన్పించింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో కాళికాలయం ప్రవేశించి, రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని ఇవతలకు తెచ్చాడు. రామలక్ష్మణులు మైరావణుడితో యుద్ధం చేశారు.

రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు చెరతెచ్చాడు. ఆమెవల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు. మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు.

రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి, మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు. పాతాళలంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి, హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు.

మాయోపాయాలన్నీ విఫలం కాగా, రావణుడు ఉక్కుయోధుల్నీ, చతురంగ బలాల్నీ పుట్టించే పాతాళలంకాయాగాన్ని ప్రారంభించాడు. విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపుచ్చే ఉపాయం చెప్పాడు. అంగదుడు అదృశ్యకరణి విద్యాప్రభావంతో వెళ్లి మందోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుటికి ఈడ్చుకెళ్లాడు. రావణుడి దీక్షభగ్నమై …యాగధ్వంసం అయింది. రావణుడు హతాశుడై చివరకు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితవు చెప్పింది. ‘‘రావణుడు రావణుడే!’’ అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూన్చిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు.

 ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహావేశం ముంచుకొచ్చింది. ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహా…యుధాస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు. లక్ష్మణుడు పడిపోయాడు.

హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతానికెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి, మూర్ఛ నుండి లక్ష్మణుడిని కాపాడాడు. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, దేవలోకం నుండి ఇంద్రుడు రాముడికి మాతలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు.

రామరావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేలమీద దొర్లుతూంటే తిరిగి తలలు మొలుచుకొస్తున్నాయి. అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృతభాండం ఊడిపడేలాగ భేదించమని చెప్పాడు. రాముడు బ్రహ్మాస్ర్తంతో ఆ పని చేశాడు. రావణుడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు.

ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడివల్ల, ‘‘ఇంటిగుట్టు లంకకు చేటు!’’ అనే సామెత వచ్చింది. రావణ సంహారంతో లంకాసామ్రాజ్యం పతనమై రాక్షస రాజ్యం అంతరించింది. విభీషణుడు లంకకు రాజయ్యాడు. రావణ కుంభకర్ణుల చావుతో జ…య విజ…యుల రెండో జన్మ ముగిసింది. అశోకవనం నుండి సీత వచ్చింది.

రాముడు, ‘‘సీతా! దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు. నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు  తీసుకెళ్ళగలను? ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చును!’’ అని చెప్పాడు. సీత అక్కడున్నవారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తనకోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమని చెప్పింది.

సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి, అగ్నిలోకి దూకింది. అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతను నవవికసిత పద్మంలాగ దోసిట ఎత్తివచ్చి, ‘‘రామా! సీత నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు. నిప్పులాంటిది! పావని! స్వీకరించు!’’ అని చెప్పాడు.

అదే సమయంలో స్వర్గంనుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి, ‘‘నాయనా! రామచంద్రా! అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది. సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి!’’ అని కుమారుని ప్రేమతో ఆదేశించాడు. రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో అయోధ్యకు చేరాడు.

విష్ణు కథ - 13

విష్ణు కథ - 13
సుగ్రీవుడు కిష్కింధకు రాజై, వాలి కుమారుడు అంగదుణ్ణి యువరాజును చేసి, రాచకార్యాలన్నీ అప్పజెప్పి, తాను సుఖాల్లో తేలుతూ రాముడి సంగతే మరిచాడు. లక్ష్మణుడు విల్లెక్కుపెట్టి కిష్కింధకు వెళ్ళాడు. హనుమంతుడు రామకార్యం నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా సుగ్రీవుడికి బుద్ధిచెప్పాడు.

వానరులను నాలుగు దిక్కులకూ వెళ్ళి సీత జాడ తెలుసుకురమ్మని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనవారంతా దక్షణ దిశకు బయలుదేరుతున్నప్పుడు, రాముడు తన వేలిఉంగరాన్ని తీసి హనుమంతుడికి సీతకు ఆనవాలుగా ఇమ్మని ఇచ్చాడు.

దక్షణ సముద్రతీర ప్రాంతం చేరుకొని వానరులు, ‘‘జటాయువు రావణుడు సీతనెత్తుకొని దక్షణంగా వెళ్ళాడని చెప్పాడేగాని, ఎటు మళ్ళాడో, ఎక్కడ దాచాడో, ఏం చేశాడో ఎవరికి తెలుసు?’’ అని అనుకుంటూండగా, వానరులను ఆహారంగా కబళిద్దామను కుంటున్న జటాయువు అన్న సంపాతి అనే పర్వతాకారంగల రెక్కలులేని పక్షి మెల్లగా నడుస్తూ వచ్చింది.

ఒకప్పుడు సంపాతీ, జటాయువూ సూర్యమండలానికి ఎగురుపందెం వేసుకున్నారు. జటాయువు ఎగరలేక విరమించాడు. సంపాతి ఎగిరి రెక్కలు కాల్చుకున్నాడు. దక్షణ సముద్ర తీరాన అవిటివాడై పడిపోయి, దొరికిన ప్రాణుల్ని తిని బ్రతుకుతున్నాడు. సంపాతి వానరుల వలన జరిగినదంతా తెలుసుకొని, అంగదుణ్ణి వీపున ఎక్కించుకొని ఆకాశంలోకి నిటారుగా లేచి దూర దూరాల్లో సముద్రానికి ఆవల ఉన్న లంకను చూపించాడు.

శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించి లంకను చేరగలవాడెవడు? అనుకున్నారు వానరులు.

హనుమంతుడికి అతని శక్తిసామర్థ్యాలు అతనికి తెలియకుండా, బాల్యంలో అల్లరి చేయగా ఋషులు శాపం పెట్టారు. అది తెలిసిన జాంబవంతుడు, ‘‘హనుమంతా! నువ్వు అవలీలగా సముద్రాన్ని లంఘించి రామకార్యం నెరవేరుస్తావు!’’ అని ఎరుక చేశాడు.

అప్పుడు హనుమంతుడు రాముణ్ణి ధ్యానించి నేలను తన్ని ఆకాశానికి ఎగిరాడు. మారుతి సముద్రాన్ని లంఘిస్తూండగా, అతడి శక్తియుక్తుల్ని పరీక్షించడానికి దేవతలు సురసను పంపారు. దేవతాస్త్రీ అయిన సురస భయంకర రాక్షసాకారంతో నోరావులించి హనుమంతుణ్ణి ఎదుర్కొంది. హనుమ శరీరాన్ని పెంచాడు. సురస కూడా పెరిగింది. హనుమంతుడు ఇంకా పెరిగాడు.


సురస మరింత, మరింత పెరిగి మ్రింగవచ్చింది. హనుమంతుడు చప్పున సూక్ష్మాతి సూక్ష్మంగా తగ్గిపోయి, సురస నోట్లో దూరి, పెరిగిపోయి దాన్ని చీల్చుకొని బయటపడి ఎగిరి వెళ్ళాడు. సురస దేవతాస్ర్తీ రూపంతో వెళ్ళిపోయింది. దేవతలు హనుమంతుణ్ణి శ్లాఘించారు.

హనుమంతుడు అలా ఎగురుతూండగా సముద్రంలో పడిన అతని నీడను రాహువు తల్లి సింహిక అనే జలరాక్షసి పట్టుకొని లాగసాగింది. హనుమంతుడు తన్నేదో కిందినుంచి వెనక్కు లాగుతున్నదనిపించి కిందికి చూసి, సింహికను పిడిగుద్దులతో చంపేశాడు.

హనుమంతుడు అవరోధాలన్నీ జయించి, అలా ఆకాశాన వెళ్తూండగా సువర్చల అనే సాగరకన్య చేపరూపంతో నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూండగా హనుమంతుడి చెమట బిందువొకటి పడింది. చేప మింగింది. అందువల్ల సువర్చల గర్భం ధరించి మత్స్యవల్లభుడు అనే కుమారుణ్ణి కన్నది.

ఒకప్పుడు ఇంద్రుడు పర్వతాలకు ఉండే రెక్కలను వజ్రాయుధంతో నరుకుతూండగా,  హిమవంతుడి కుమారుడైన మైనాకుడు భయపడి సముద్రంలో దాక్కున్నాడు.

హనుమంతుడిని చూసి మీదకు వచ్చి, ‘‘అంజనేయా, కాస్త నాపై వాలి సేదదేరమని అభ్యర్థిస్తున్నాను,’’ అన్నాడు.

మైనాకుడి మాట కాదనకుండా హనుమంతుడు, కొద్దిక్షణాలు మైనాక పర్వతం మీద కాలుమోపి తిరిగి రివ్వున ఎగిరాడు. హనుమంతుడు మెరుపు లాగ లంకను చేరాడు.
లంకానగరాన్ని పరిరక్షంచే లంకానగర దేవత లంకిణి, హనుమంతుడి ఆగమనాన్ని గుర్తించి, భీకరాకృతితో శూలాన్నెత్తి పొడవబోయింది.

హనుమంతుడు సూక్ష్మరూపంతో తప్పించుకొని, లంకాద్వారాన్ని దాటబోయాడు. లంకిణి హనుమంతుణ్ణి ఈగను పట్టినట్లు గుప్పెట్లో పట్టింది. హనుమంతుడు లంకిణి అరచేతిని కరిచాడు. లంకిణి వదిలేసింది. దాని అరచేయి రక్తం కారుతూన్నది.

హనుమంతుడు ఒక్క ఉదుటున లంఘించి పిడికిలితో లంకిణి గుండె మీద గుద్దాడు. ఆ ముష్టిఘాతంతో లంకిణి దిమ్మరపోయి పడిపోయింది. తరవాత తేరుకొని ఆంజనేయుడికి మస్కరించి, ‘‘ఎప్పుడైతే నేను ఇలా కూలి పడతానో, ఆనాటితో లంకకు వినాశకాలం పడుతుందని నాకు, బ్రహ్మ చెప్పాడు. శాపంవల్ల నేను క్షుద్రదేవతగా ఇలా లంకా నగరాన్ని ఇన్నాళ్ళూ కాపలా కాస్తూ వచ్చాను. నేను వెళ్ళి పోతున్నాను, ఇక నీవు వెళ్ళు!’’ అని చెప్పి గంధర్వస్త్రీ రూపంతో ఆకాశానికి ఎగిరి అంతర్థానమైంది.

హనుమంతుడు లంకా నగరం ప్రవేశించాడు. మణిదీపాలతో, ఎత్తయిన సౌధాలతో కన్నులు మిరుమిట్లు గొలుపుతున్న లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు సూక్ష్మరూపంతో సీత కోసం నగరమంతా వెతికాడు. రావణాసురుడి అంతఃపుర భవనాలన్నీ వెతికాడు. మందోదరిని సీత అనుకొని భ్రమపడి పొరపాటు గ్రహించాడు.
సీత జాడ ఎక్కడా లేదు. అలా నగరంలోని వివిధ ప్రదేశాలను వెతుకుతూ అశోకవనం చేరుకున్నాడు. అక్కడ రామనామ స్మరణ విన్నాడు.

ఒక చంద్రశిలా నిర్మిత మంటపంలో సీత రాముణ్ణి తలంచుతూ శోకిస్తూన్నది. ఆ మంటపం చుట్టూరా పెద్ద బళ్లేలు, కత్తులు మొదలైన ఆయుధాలు పట్టుకొని రాక్షస స్త్రీలు కాపలా ఉన్నారు.మంటపం చేరువనే ఉన్న శింశుపా వృక్షం ఎక్కి హనుమంతుడు కొమ్మల మాటున కూర్చుని చూస్తున్నాడు.

సీత మంటపం నుండి వచ్చి, పక్కనున్న అశోక చెట్టుకింద కూర్చున్నది. రావణుడు పటాటోపంగా అశోకవనం లోకి వస్తున్నాడు. అతని వెనక దేవ, గంధర్వ, నాగ, …యక్ష, రాక్షస, మానవ సుందరీమణులు గుంపులు, గుంపులుగా అతడి వైభవాన్ని కీర్తిస్తున్నారు.

రావణుడు అశోకవృక్షం దగ్గరికి వచ్చి, ‘‘ఓ, సీతా! ఇప్పటికైనా, నా మాట విను! క్షుద్ర మానవుడైన రాముణ్ణి నమ్ముకోకు. రాముడు లంక చేరగలడనేది కల్ల!’’ అన్నాడు.
సీత ఒక గడ్డిపరకను పెరికి దానితోనే, ‘‘ఓ, రావణా! నీ ప్రగల్భానికీ, బలవైభవాలకీ నేను లొంగుతాననేది కల్ల! నీవు దొంగవు! నిన్ను శిక్షంచడం రాజైన రాముడికి కర్తవ్యధర్మం. దశకంఠశోషగా వాగకు. రాముడు నిన్ను పరిమార్చక ముందే, నీ ముచ్చటలన్నీ తీర్చుకో! అంతఃపురానికి వెళ్ళు, త్వరలోనే నీకు అంత్యకాలం!’’ అన్నది. రావణుడా మాటలకు పెద్ద గండ్రకత్తి తీసి, ‘‘నిన్ను ముక్కలుగా నరుకుతాను!’’ అన్నాడు.

‘‘అలా చేయవు! నా అంతట నేను, నీకు లొంగిపోతానని అనుకుంటున్నావు. రాముడి భార్య, రావణుడి ప్రతాప వైభవాలను చూసి లోబడిపోయింది అనిపించుకోవాలని, నీ దురహంకార దురాకాంక్ష!’’ అన్నది సీత. ‘‘ఔను! మా రాక్షస వనితకు జరిగిన పరాభవానికి, అదే సరైన ప్రతీకారం! అదే నా పట్టుదల!’’ అన్నాడు రావణుడు. ‘‘కాదు! నువ్వు రాముడిని ఎదుర్కొని జయించి, నన్ను తీసుకుపోవలసింది. నువ్వు పిరికివాడవు. మాయలు పన్ని చోరవృత్తిని అవలంబించావు. రాముడు నిన్ను సంహరించాలి! ఇది నా పట్టుదల!!’’ అన్నది సీత. రావణుడు రుసరుసలాడుతూ వెళ్లాడు.

హనుమంతుడు రాక్షస స్త్రీలు లేని సమయం చూసి, చెట్టు దిగి, సీతకు రాముడి  ఉంగరాన్ని ఇచ్చాడు. చుక్కలు తల పూవులుగా పెరిగిన తన విశ్వరూపం చూపించి, తన వీపున కూర్చుంటే రాముడి దగ్గరకు చేరుస్తానన్నాడు. ‘‘అది సక్రమం కాదు; రాముడు రావణుడిని సంహరించి నన్ను విడిపించాలి! అంతవరకు సీత అశోకవనంలో శోకంలోనే ఉంటుందని రాముడితో చెప్పు!’’ అని చెప్పి సీత తన పాపిట నున్న చూడామణిని తీసి, రాముడికి ఇమ్మని హనుమంతుడికి ఇచ్చింది.

 హనుమంతుడు తన రాక తెలియాలని సుందరమైన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చంపవచ్చిన జంబుమాలిని, అక్షయుడిని, వేలాది రాక్షసుల్ని చంపాడు. రావణుడి పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మపట్ల గౌరవంగా క్షణకాలం హనుమంతుడు అస్త్రానికి బద్ధుడై, రావణుడికి ముఖాముఖి బుద్ధి చెప్పాలని కట్టుబడి రావణ సభకు వెళ్ళాడు.

హనుమంతుడు మేను పెంచి గొలుసులు తెంచుకొని, రావణుడి తల తన్నే ఎత్తున తన తోకను పెంచి, చుట్ట చుట్టుకొని దానిపై కూర్చున్నాడు.

హనుమంతుడు, ‘‘ఓయి, రావణ రాక్షసరాజా! నేను రాముడి దూతను. రాముడు కోతులనే మహావీరులుగా నడిపించి, నీ లంకను ముట్టడించగల సమర్థుడైన మానవశ్రేష్ఠుడు. లమున్నదని గర్వించకు. బలవంతమైన సర్పము చలిచీమల చేత ఏ విధంగా చస్తుందో, నీకు చెప్పనవసరం లేదు. సీతను రాముడికి అప్పగించి మన్నించమని వేడు!’’ అని చెప్పాడు.

రావణుడు పట్టరాని ఆగ్రహంతో కత్తి తీశాడు. విభీషణుడు రావణుడితో, ‘‘దూతను చంపకూడదు, అది పౌరుషం అనిపించుకోదు!’’ అన్నాడు.

రావణుడు, ‘‘అలాగైతే, ఈ వానరుడి తోక పొగరు అణిగేలా గుడ్డలు చుట్టి చమురుపోసి కాల్చండి!’’ అని ఆజ్ఞాపించాడు. రాక్షసభటులు హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టినకొద్దీ తోక పెరిగిపోతూనే ఉంది. చమురు చాలలేదు. నిప్పంటించారు.

 హనుమంతుడు శరీరం పెంచి సింహనాదం చేసి ఛెంగున ఎగిరాడు. కాలుతున్న తోకను గిరగిరా తిప్పుతూ, సౌధాల మీంచి దూకుతూ, లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. అతనికి అగ్ని చల్లగా తోచింది ఆర్పడానికి వీలు కాకుండా లంకాదహనం జరిగింది. రావణుడి అంతఃపుర సౌధాలు కాలిపోయాయి. మంటల్లో చాలామంది రాక్షసులు చచ్చారు. విభీషణుడి మందిరం మాత్రం చెక్కుచెదరలేదు.

హనుమంతుడు అశోకవనంలో సీత క్షేమంగా ఉండడం చూసి, రివ్వున ఎగిరి సముద్రంలో తోకను ముంచి మంటలార్పుకొని, చూడామణిని పట్టుకొని రాముడి ముందు వాలాడు.

రాముడు చూడామణిని చూసి, సీతను చూసినట్లుగా గుండెలకు హత్తుకొన్నాడు. హనుమంతుడు అంతా చెప్పాడు. రాముడు హనుమను ఆలింగనం చేసుకొని, ‘‘హనుమా! చూసి రమ్మంటే కాల్చి వచ్చావన్నమాట! నీవంటివాడు అండగా ఉండగా, నేను సాధించలేనిదంటూ ఉండదు. సీతకూ, నాకూ సంధానకర్తవై, ఆనందం చేకూర్చిన నీవు బుద్ధిమంతుడవు, ఆనంద సంధాతవు, కీర్తిమంతుడవు ఔతావు!’’ అన్నాడు.

రాముడు కోదండాన్ని ఎత్తి పట్టుకొని, సీత చెప్పినట్టుగా రావణసంహారానికి దీక్షా కంకణం కట్టుకున్నాడు. విభీషణుడు రావణుడికి సవతి తమ్ముడు, రాముడితో వైరం పెట్టుకోవద్దనీ, సీతను సగౌరవంగా తీసుకెళ్ళి, రాముడికి అప్పగించి, లంకానగరాన్నీ, లంకావాసుల్నీ కాపాడమనీ చెప్పాడు. ‘‘నీ ఒక్కడి పట్టుదల, మూర్ఖతవల్ల రాక్షసకులానికే ముప్పుతేవడం అన్యాయం!’’ అని విభీషణుడు చెప్పిన దానికి, రావణుడు మండిపడి, ‘‘ఓరీ, పిరికిపందా! నువ్వు రాక్షసకులంలో తప్ప పుట్టావు! శూర్పణఖకు చేసిన పరాభవం రాక్షస జాతికంతటికీ పరాభవం అని తెలుసుకో! నువ్వు కులద్రోహివి! వెంటనే లంక వదలి వెళ్ళిపో!
మళ్ళీ కనిపించావో, నిన్ను చిత్రవధ చేస్తాను!’’ అన్నాడు. విభీషణుడు తన అనుచరులతో లంక వదిలి పెట్టాడు

విష్ణు కథ - 12

విష్ణు కథ - 12

రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే, పరశురాముడు, ‘‘రఘురామా! ఇకనుండి క్షత్రియులపె పగ విడిచి ప్రశాంతంగా త…పస్సు చేసుకొంటాను. నేనిచ్చిన కోదండం నీదే! నీవు కోదండరాముడివి!’’ అని చెప్పి వెళ్ళాడు.

అయోధ్యానగరం నూతన వధూవరుల ఆగమనంతో కళకళలాడింది. సీతారాములు ఒకే ఒక్క పరిపూర్ణ స్వరూపంగా అనురాగ సామ్రాజ్య సింహాసనం అలంకరించారు. ఒకనాడు రాముడు, ‘‘సీతా! ఈ రాజ ప్రాసాదంలోకంటే, మనం సుందరవనాల్లో విహరిస్తూంటే ఇంకెం…తఆనందంగా ఉంటుందో! వనలక్ష్మి లాగ నువ్వు కనిపిస్తూంటే ...’’ అని అంటూంటే సీ… బుగ్గలు ఎరు పెక్కాయి.

వారికి రోజులు మధురంగా గడుస్తున్నాయి. కొంత కాలానికి దశరథుడికి దుశ్సకునాలు తోచాయి. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అ…నికి మునిదంపతుల శాపం గుర్తు వచ్చింది. ప్రాణభ…యం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించి వసిష్ఠుడిచే… మూహూర్తం పెట్టించాడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా ఉన్నాడు.

సరస్వతి వీణపె రాగమాలిక ఆలపిస్తున్నది. నారదుడు, అ…ని వెనక దేవ…తలు వచ్చారు. నారదుడు, ‘‘రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలనం ఎలా జరుగుతుంది? అని దేవ…తలంతా త…ల్లడిల్లు…తూన్నారు!’’ అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి మందహాసంతో, ‘‘జరగవలసింది జరగక మానదుకదా, నారదా! త్రికాల వేత్తవు! అదుగో అటు చూడు! నీకు వారసురాలు మంధర కెకేయి మందిరానికి వెళ్తున్నది!’’ అన్నది.


దేవతలూ, నారదుడూ క్రిందికి భూమ్మీదకు చూశారు. గూని మోసుకొంటూ మంధర గొణుక్కొంటూ వెళ్తూన్నది. నారదుడు, ‘‘అమ్మా, వాగ్దేవీ! లోక కల్యాణార్థం వాళ్ళ నోట ఎలాంటి వాక్కులు పలికిస్తావో మరి! అంతా నీ దయ!’’ అని వెళ్ళాడు. గూనిమంధర కెకేయికి అరణంగా వచ్చిన నమ్మిన ముసలిదాసి. అప్పుడే నిద్రలేస్తున్న కెకేయిని జాలిగా చూస్తూ నిలబడ్డది. కెకేయి, ‘‘ఏమిటి, మంధరా, అలా దిగాలుగా నిల్చున్నావు?!’’ అనడిగింది.
‘‘ఏం చెప్పమంటావు, …తల్లీ! రేపు రాముడికి పట్టాభిషేకమట! పట్టాభిషేకం!!’’ అంది మంధర. కెకేయి తన మెడలోని ముత్యాల హారం తీసి మంధర మెడలో వేస్తూ, ‘‘ఎంత మంచి వార్త తెచ్చావే, మంధరా!’’ అంటూ ఆనందం పట్టలేకపోయింది. మంధర పెదవి విరుస్తూ, ‘‘అయ్యో, కెకేయి! ఎంత అమాయకురాలివి పాపం! ఒఠ్ఠి వెర్రిబాగులదానివి!’’ అన్నది. ‘‘ఏమిటి నువ్వనేది?’’ అన్నది కెకేయి.

‘‘రాముడు రాజైతే, ఆ కౌసల్య ముందు నేనూ, నువ్వూ దాసీలమే! బాగా ఆలోచించు, ఆలసించకు. కోపగృహం లోకి వెళ్ళు! నీ రెండు వరాలు ఇప్పుడు కోరుకో! భరతుణ్ణి దేనికి కన్నావు? రాముడి వెనక ఛత్రచామరాలు పట్టడానికేనా?’’ అని మంధర చురకలు పెట్టినట్టు అన్నది. తన రెండు వరాలు ఇప్పుడు కావాలని కెకేయి కోరింది, ‘‘ఏవి కావాలో అవి తీసుకో!’’ అన్నాడు దశరథుడు. ‘పధ్నాలుగేళ్ళు రాముడు వనవాసం చెయ్యాలి! భరతుడికి పట్టాభిషేకం కట్టాలి!’’ అన్నది కైక.

ఆ మాటలు వింటూనే దశరథుడు జుట్టు పీక్కొంటూ అలాగే శయ్య మీద మూర్ఛపడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. ‘‘పితృవాక్య పరిపాలన కర్తవ్యం! దశరథుడు ఆడి తప్పినవాడనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు!’’ అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు చెట్టు బెరడులో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యడానికి సిద్ధమయ్యాడు.

 లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లు వచ్చాడు. కెకేయినీ, దశరథుడినీ నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు …తమ్ముడిని శాం…తపరిచాడు. రాముడితో సీత…, లక్ష్మణుడు బయలు దేరారు.

అయోధ్యా పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానదిని దాటి అరణ్య మార్గం పట్టి, భరద్వాజాశ్రమం చేరుకున్నాడు.
మర్రిపాలు తలకు పట్టించి, రామలక్ష్మణులు మునులకుమల్లే జుట్టుముళ్ళు వేసుకున్నారు. దశరథుడు మూర్ఛనుండి తేరుకొని, రాముడు వనవాసం వెళ్ళిన సంగతి తెలుసుకొని, ‘‘రామా! రామా!’’ అంటూనే ప్రాణాలు విడిచాడు.

అప్పుడు భర…తశత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నందిగ్రామం నుండి భర…శత్రుఘ్నులు వచ్చాక, భర…తుడు తండ్రికి ఉత్తరరక్రియలు జరిపాడు.
భరతుడు…తల్లి ముఖం చూడలేదు. శత్రుఘ్నుడు మంధర గూనిపోయేలాగ…తన్నాలనుకున్నాడు, కాని దాని జాడ కనిపించలేదు. భర…తుడు రాముణ్ణి తీసుకురాడానికి సపరివారంగా శ్వే…త ఛత్రాలు పట్టించుకుని వెళ్ళాడు.

భరతుడితో రాముడు, ‘‘మన …తండ్రి మాట నిలపడంలో మన ఇద్దరివంతూ ఉంది. నీవు నా …తమ్ముడివి, నా మాట విను. పట్టాభిషిక్తుడివై రాజ్యపాలన చెయ్యి!’’ అన్నాడు.
భరతుడు …తల అడ్డంగా తిప్పి, ‘‘నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను. నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను!’’ అని చెప్పి రాముడి పావుకోళ్ళను …తలపై పెట్టుకొని తీసుకెళ్ళాడు. రాముడు సీతాలక్ష్మణ సమే…తంగా అరణ్యం లోలోపలికి చొచ్చుకువెళ్ళాడు.ఖరుడు, దూషణుడు అనేవాళ్ళు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు, వాళ్ళు వింధ్యపర్వాలకు దిగువనున్న భూమి అంతా ఆక్రమించారు. వాళ్ళు రాక్షస గుంపులో తిరుగుతూ, అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూర మృగాల్లాగ సీతా రామలక్ష్మణుల్ని చంపడానికి, పెద్ద పెద్ద బండ కత్తులూ, శూలాల్తో చుట్టు ముట్టారు రాక్షసులు.

రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి రాక్షసమూకలను చెల్లాచెదరుగా చేశారు. రాముడు ఖరదూషణుల్ని చంపాడు. రాక్షసులు చాలామంది చచ్చారు. హతశేషులైనవారు పారిపోయారు. నివాస యోగ్యమెన ప్రదేశంకోసం వెదుకుతూ వెళ్తూండగా, తాటిచెట్టును మించిన ప్రమాణంలో భయంకరాకారుడెన విరాధుడు సీతను అరచేత ఎత్తి భుజాన పెట్టుకొని పారిపోతూంటే, రాముడు ఒక మహాస్తాన్ని వేసి రాక్షసుణ్ణి చంపాడు. హత…శేషులెన రాక్షసులు శూర్పణఖ, ఖరదూషణుల చావుకబురు చెప్పారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఖరుడు, దూషణుడు, శూర్పణఖ సొంత తమ్ముళ్ళు.

దండకారణ్యాల్లో గ్రుమ్మరుతూండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు, రామలక్ష్మణుల్ని చీల్చి చెండాడాలని బయలుదేరింది. ఊడలే మానులైన ఐదు మర్రిచెట్లతో నిండిన పంచవటికి రాముడు, సీతా లక్ష్మణులతో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నది. పర్ణశాలను నిర్మించుకొని, రాముడు సీతా వనవిహారం చేస్తూ వనవాసం గడుపుతున్నాడు. లక్ష్మణుడు అన్నను, వదినను సేవిస్తూ, పర్ణశాలను దివారాత్రులు కాపలా కాస్తున్నాడు.

శూర్పణఖ అట్టహాసంగా విరుచుక పడింది. రాముణ్ణి చూసి నన్ను వరించమంది, వేడింది, బెదిరించింది. సీతను చంపడానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు, చెవులు కోసి తరిమాడు. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణాసురుడితో తనకు జరిగిన పరాభవాన్ని మొరపెట్టుకొంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరగొని తేవడానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపాడు.

 సీత…మాయలేడిని చూసి ముచ్చట పడింది. రాముడు వెళ్ళి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయలేడి మారీచుడై, ‘‘హా, సీతా! హా, లక్ష్మణా!’’ అని రాముడు చేసినట్టు ఆర్తనాదం పెద్ద పెట్టున చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ, రాముడికెటువంటి హానీ జరగదని లక్ష్మణుడు ఎంత…చెప్పినా సీత వినలేదు. నిష్ఠురోక్తులు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు మూడు గీతలు గీచి వెళ్ళాడు.

సీత ఒంటరిగా ఉంది. రావణుడు వృద్దతాపసి వేషంలో భిక్షకు వచ్చాడు. సీత… భిక్ష వేయడానికి మూడు గీత…లూ దాటింది. రావణుడు నిజరూపుతో సీ…ను ఎ…త్తుకుపోయాడు.
రామలక్ష్మణులు సీ…తను వెదుకుతూ వెళ్ళారు. రాముడు సామాన్య పామర మానవుడిలాగే విలపించాడు. వారలా వెళ్ళగా వెళ్ళగా, రెక్కలు తెగి పడి ఉన్న జటాయు పక్షి, ‘‘సీత…ను విడిపించడానికి పోరాడాను, నా రెక్కలు నరికి రావణుడు దక్షణ దిశగా సీ…ను ఎ…త్తుకుపోయాడు,’’ అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి ఆప్తమిత్రుడైన జటాయువుకు దహన సంస్కారం చేసి, రామలక్ష్మణులు వెళ్తుండగా, కబంధుడు వన్యమృగాల్తో బాటు వారిని దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైనవాడు.

    పర్వత మంతటి కడుపు, దానికే కోరలో ఆవులించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పు లాంటి కన్ను, యోజనాల పొడవునా చాచుకునే చే…తులు ఉన్నాయి. తలఅంటూ వేరే లేదు, కాళ్ళుగాని మరే అంగాలు గాని లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడెన గంధర్వుడు. శాపవిమోచనం పొంది ఆ గంధర్వుడు, గంధర్వలోకానికి పోతూ, ‘‘నీకు మునుముందు వానరులతో మెత్రికుదురుతుంది, ప్రయోజనకారి అవు…తుంది,’’ అని రాముడికి చెప్పాడు.

ఋష్యమూక పర్వతం మీద వానర వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకు హనుమంతుణ్ణి పంపాడు.

ముక్కోటి దేవ…తలు వానరుల…య్యారు. హనుమం…తుడు శివుడి అంశన పుట్టినవాడు. అంజనాదేవి, వా…యుదేవుడి అనుగ్రహంతో హనుమం…తుణ్ణి కన్నది. ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి అని పిలువబడ్డాడు. పసిత…నంలో ఆంజనే…యుడు ఉద…య సూర్య బింబాన్ని పండు అని  భావించి ఎగిరి కబళించబోగా, ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛిల్లాడు. వా…యుదేవుడికి కోపం వచ్చి స్తంభించాడు. అప్పుడు దేవ…తలు హనుమం…తుణ్ణి చిరంజీవిగా దీవించి, అనేక వరాలు ఇచ్చారు.
బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్ర… ప్రభావంగల కుండలాలు …తగిలించి, అవి ఎవరికి కనపడి మెచ్చుకుంటే అ…తడే విష్ణువుగా గుర్తించి, ఆరాధ్యదైవంగా సేవించమని హనుమకు చెప్పాడు.

హనుమంతుడు సుగ్రీవుడి పంపున రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు అ…తడిని చూసి లక్ష్మణుడితో, ‘‘సుందరుడైన ఇ…తని కర్ణకుండలాలు ఎంత… ముచ్చటగా ఉన్నాయో, చూడు!’’ అంటూ మెచ్చుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, రాముడు విష్ణువు అవతారమని గుర్తించి, బంటు అయ్యాడు. రాముడిచే… సుందరుడు అనిపించుకొన్న హనుమం…తుడు, ‘సుందరుడు’ అని పేరు పొందాడు. హనుమంతుడి మూలంగా రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షగా మిత్రులయ్యారు.
సుగ్రీవుడి అన్న వాలి, కిష్కింధకు రాజు. …తమ్ముడిని ద్రోహిగా అపోహపడి చంపబోగా సుగ్రీవుడు …తప్పించుకుని పోయి ఋష్యమూక పర్వతం మీద …తల దాచుకున్నాడు. వాలి …తమ్ముడి భార్యను నిర్బంధంలో ఉంచాడు.
ఆపదలో ఉన్న మిత్రుణ్ణి కాపాడడం …తన ధర్మంగా రాముడు ఎంచి, వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి రాజును చేయడానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచినవాడి బలం వాలిని చేరేలా వరం ఉంది. ఆ కారణంగా వాలి సుగ్రీవులు పోరాడుతుండగా చెట్ల చాటునుండి రాముడు బాణంకొట్టి వాలిని కడతేర్చాడు.

Thursday, June 9, 2016

విష్ణు కథ - 11

విష్ణు కథ - 11

లక్ష్మీదేవి వేదవతిగా అవతరించి తపస్సు చేస్తున్నప్పుడు రావణుడు కొప్పు పట్టుకున్న కారణంగా యోగాగ్నితో ఆమె దహించుకు పోయి లంకలో పుట్టింది.
లంకా పట్టణాన్ని అనుసరించుకొని అందమైన గొప్ప సరోవరం ఉన్నది. ఎప్పటిలాగే ప్రాతఃకాలాన్నే రావణుడు ఆ సరోవరంలో స్నాన సంధ్యలువార్చి శివార్చనకు తామరపువ్వుల్ని ఏరుతూండగా, ఒక పెద్ద తామర పువ్వు సరోవర మధ్యంలో ధవళకాంతుల్ని ప్రసరిస్తూ కనిపించింది. దాని దగ్గరికి చేరుతూండగా ఆ పువ్వులో బంగారంలాగ మెరిసి పోతున్న అందమైన స్ర్తీశిశువు క్యారుమంటూ కనిపించింది.

ఆపసిపిల్లను చూసి రావణుడు ముచ్చట పడుతూండగా అశరీరవాణి, ‘‘ఓ రావణా! ఆ బిడ్డ నీకూ, నీ లంకకూ చేటుగా పుట్టిన బిడ్డ!’’ అని వినిపించింది.రావణుడు రాక్షస వీరభటులకు ఆ పసి పాపను చంపిరండని ఉత్తరువు చేశాడు.ఆ పసిపాప ఏం చేసినా చావలేదు. కత్తులు అదృశ్యమైనాయి. అగ్ని ఆరిపోయింది.

రాతిబండలు పూలకుప్పలైనాయి. క్రూరమృగాలు పారిపోయాయి. రాక్షసులు విసిగి ఆ పిల్లను పంచలోహాలతో చేసిన పెట్టెలో పెట్టి గట్టిగా బంధించి సముద్ర మధ్యంలో పడవేశారు.ఆ పెట్టె సముద్రాన్ని దాటి భూమిని చీల్చుకొని భూగర్భంలోకి అలా వెళ్ళింది. మిథిలా రాజ్యాన్నేలే జనకమహారాజు గొప్పజ్ఞాని, రాజర్షి. యజ్ఞం కోసం చదును చేయడానికి భూమిని దున్నిస్తున్నాడు. నాగలి చాలుకు ఖణేల్మని పెట్టె తగిలింది.

 పెట్టెను తీసి అందులో ముద్దులు మూటగట్టే బంగారుపాపను జనకుడు తనకు భూదేవి ప్రసాదించిన కుమార్తెగా ఎత్తుకొన్నాడు. నాగేటిచాలుకు సీత అని పేరు. నాగలిచాలుకు దొరికినందువల్ల ఆ పిల్ల ‘సీత’ అనీ, జనకుని కుమార్తె కనుక ‘జానకి’ అనీ భూమిలో దొరికినందువల్ల ‘భూజాత’ అనీ పిలువబడుతూ అల్లారుముద్దుగా పెరిగింది.
సీత తోటి పిల్ల న్నేహితురాండ్రతో ఆడుతూ, బంతిని వెతుకుతూ పూలతో పూజింపబడి ఉన్న పెద్ద ధనుస్సును బెండు ఎత్తినట్లుగా ఎడమచేత్తో ఎత్తి దాని చాటున వున్న బంతిని తీసుకుంది. తర్వాత ఆ ధనుస్సు ఆటకు బాగుందని అవలీలగా తీసుకువచ్చి బొమ్మరింటి గోడలాగ పెట్టి, సంతోషంగా ఆట సాగించింది. జనకుడు కళ్ళారా అదంతా చూసినిర్వణ్ణుడైపోయాడు.

ఆ ధనుస్సును జనకుడి పూర్వీకులు శివుడి దగ్గర్నుంచి పుచ్చుకొని పూజిస్తూ వచ్చారు. త్రిపురాసుర సంహారంలో శివుడు ఆ వింటితోనే యుద్దంచేశాడు. ఆ శివధనువును ఎత్తాలంటే బలాఢ్యులైన వారు మూడు వందలమంది ఉంటేనే గాని సాధ్యపడదు. అలాంటి వింటిని ఎత్తిన సీత సామాన్యురాలు కాదనీ, ఆ శివధనుస్సును ఎత్తి ఎక్కు పెట్టగలవాడు మాత్రమే సీతకు తగ్గ వరుడనీ జనకుడు అనుకున్నాడు.

సీతకు స్యయంవరం జరిపినప్పుడు ముందు ఆ విషయాన్నే చాటిచెప్పి, అటువంటి వాడికే ఇచ్చి కళ్యాణం జరపాలని నిశ్చయం చేసుకున్నాడు. సీత మిథిలానగరంలో అలాగే పెరిగి పెద్దదైంది. విశ్వామిత్రుడు యాగరక్షణకు, రామ లక్ష్మణులను పంపమని దశరథుణ్ణి అడిగాడు. అందుకు దశరథుడు, ‘‘రాక్షసుల నుండి యాగరక్షణకు పసివాళ్ళను ఎలాగ పంపమంటావు, మహర్షీ! వాళ్ళు, అస్ర్తవిద్యలు ఇంకా నేర్చుకోవలసిన వాళ్ళు!’’ అన్నాడు.

‘‘అందుకేగదా నేను వచ్చినది! రాచబిడ్డలకు ఏ విద్య కావాలో నాకు తెలుసు. ఆ విద్య నేను నేర్పుతాను!’’ అంటూ విశ్వామిత్రుడు వసిష్ఠుడిని సగర్వంగా చూశాడు. వసిష్ఠుడు చిరునవ్వుతో విశ్వామిత్రుణ్ణి మెచ్చుకొని, రామలక్ష్మణుల్ని, అతనితో పంపమని దశరథుడితో చెప్పాడు.

రామలక్ష్మణులు మునులకు మల్లే జుత్తు ముళ్ళు వేసుకొని విశ్వామిత్రుడి వెంట ధనుర్బాణాలు ధరించి బయలుదేరారు. దారిపొడవునా విశ్వామిత్రుడు వారికి ధనుర్విద్యా విశేషాలు బోధిస్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు.

రామలక్ష్మణులు విశ్వామిత్రుడి సునిశిత శిక్షణలో ధనుర్విద్యాపారంగతుల…య్యారు. విశ్వామిత్రుడు ఋషులతో కలిసి యాగం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తూండగా భ…యంకరంగా అరుచుకుంటూ తాటకి పిడుగులాగ ఆశ్రమం మీద పడింది. విశ్వామిత్రుడు తాటకను చంపమని రాముడికి ఆనతిచ్చాడు. రాముడు తాటకపై శరపరంపర కురిపించాడు. ఒంటి నిండా దట్టంగా బాణాలు గుచ్చుకొని తాటకి పెద్ద పర్వతంలాగ భూమిమీద పడి విల విలా తన్నుకొని ప్రాణాలు విడిచింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి, అతని బాణప్రయోగ కౌశలానికి మెచ్చుకొన్నాడు. యాగం ప్రారంభమయింది. విశ్వామిత్రుడు రాముడికి అస్తాల్ని ఉపదేశించాడు. రామలక్ష్మణులు ధనుర్ధరులై తిరుగుతూ యాగరక్షణ చేస్తూన్నారు. మారీచుడు, సుబాహుడు ఒక్కుమ్మడిగా విరుచుకు పడ్డారు. రాముడు రెండే బాణాలు విడిచాడు. సుబాహుడు చచ్చాడు. మారీచుడు బాణం దెబ్బతిని కొసప్రాణాలతో సముద్రంలో పడి కొట్టుకు పోతూ ఎలాగో లంక చేరాడు.

యాగం నిర్వఘ్నంగా సాగింది. విశ్వామిత్రుడు …యాగసమాప్తిలో రాముడి చేత హవిస్సులు వేయించి హోమం చేయించాడు. …యజ్ఞకుండం జ్వాలలపై తేలుతూ అర్ధచంద్రాకారం మొనగల ఒక బాణం దివ్యకాంతులీనుతూ వచ్చింది. విశ్వామిత్రుడు, ‘‘రామా! అది నీ బాణం. ‘రామబాణం’ అని పేరొందుతుంది. శత్రువు కంఠం నరికి తిరిగి నీ చేతికి వస్తుంది!’’ అని చెప్పి బాణాన్ని రాముడికి అందించాడు.  రాముడు బాణాన్ని కళ్ళకు అద్దుకొని పొదిలో పెట్టుకొని విశ్వామిత్రుడి పాదాలకు ప్రణమిల్లాడు. యాగం చాలా కాలంగా సాగింది. ఆ కాలంలోనే విశ్వామిత్రుడు రాముడికి మహాస్త్రాలన్నీ ఉపదేశించాడు. ‘‘రామా! నేనూ, నువ్వూ సూర్యవంశంవాళ్ళం. నాకు తెలిసిన అస్ర్తవిద్యనంతా నీకు ఉపదేశించి నందుకు నా కెంతో తృప్తిగా ఉంది.

నీలాంటి వాడికి గురువునని అనిపించుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది!’’ అన్నాడు విశ్వామిత్రుడు. ‘‘గురుదేవా! నీ కృపకు పాత్రుడనైన నేను ధన్యుణ్ణి!’’ అన్నాడు రాముడు. విశ్వామిత్రుడి సిద్ధాశ్రమంలోనే రాముడు, లక్ష్మణుడు అస్ర్తవిద్యలను నేర్చుకుంటూ యౌవనవంతులయ్యారు. ఒకనాడు అస్ర్తాల ప్రయోగ విశేషాంశాలు చెప్తూ విశ్వామిత్రుడు, రాముణ్ణి తనివితీరా చూస్తూ, ‘‘రామా!

నీ విశాల నయనారవిందాలు శాంతిచంద్రికలు వెదజల్లుతూ, నా ఆశ్రమాన్ని శాంతినిలయంగా చేయగా నీవు శాంతరాముడివి; సుందర రాముడివి!’’ అన్నాడు. తన వెంట రమ్మన్నట్లుగా విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. విశ్వామిత్రుడు మిథిలానగరం దారి పట్టాడు. దారిలో గౌతమాశ్రమం మీదుగా వెళ్తూండగా, రాముడి పాదం తగిలి ఒక బండరాయి అహల్యగా మారి రాముడి పాదాలకు ప్రణమిల్లింది.

రాముడు ఆశ్చర్యంతో వెనక్కుజరిగాడు. అదే సమయానికి చిరకాలంగా చేస్తూన్న తపస్సు చాలించి గౌతమ మహర్షి వచ్చాడు. రాముణ్ణి భక్తిగా చూస్తూ, ‘‘రామచంద్రా! నా భార్య శాపం తీరింది. నీవు పావనరాముడివి!’’ అన్నాడు. గడువు తీరి అహల్య శాపవిమోచనం జరిగింది, తనలో ఏముందని? అన్నట్లుగా రాముడు అయోమయంగా చూశాడు. గౌతముడు తదేకంగా రాముణ్ణి చూసి, ‘‘ఔను, రామా!

నీవు నివురుగప్పిన నిప్పువు! మాయా మానుషవిగ్రహుడివి!’’ అన్నాడు. విశ్వామిత్రుడు ఔను! అన్నట్టుగా తలపంకించాడు. ‘‘విష్ణువు అవతారాల్లో రామావతారం తర్వాత కృష్ణావతారంలో, కృష్ణుడు తాను అవతారమూర్తిగా తెలిసే లీలలు చేసి, మాయామానుష విగ్రహుడు అనిపించుకున్నాడు.

రాముడు పరిపూర్ణ మానవుడిగా కర్తవ్యపాలన చేశాడు. మనిషిలాగే సాధించాడు. అదే రామావతార విశేషం!’’ అని సూతుడు వివరించి రామకథను సాగించాడు. గౌతముడు అందర్నీ ఆశ్రమంలోకి తీసుకెళ్ళి, అతిథిసత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు గౌతమాశ్రమం నుండి రామ లక్ష్మణులతో బ…యలుదేరాడు. దూరంగా కోలాహలం వినిపించింది.

జనక మహారాజు సీతాస్వయంవర మహోత్సవానికి మహర్షులందరికీ భక్తి పూర్వకమైన తన ఆహ్వానం అందించి రమ్మని, తన పురోహితుడైన శతానందుణ్ణి పంపించాడు. శతానందుడు అహల్యా గౌతముల కుమారుడు. శతానందుడి పల్లకి వెనక మిథిలారాజ్య లాంఛనాలతో పరివారం వస్తున్నారు. శతానందుడు విశ్వామిత్రుణ్ణి దర్శించడానికి సిద్ధాశ్రమానికి వెళ్తున్నాడు.

దారిలోనే ఎదురైన విశ్వామిత్రుణ్ణి చూసి, శతానందుడు దిగి ప్రణామం చేసి జనకుడి ఆహ్వానం విన్నవించాడు. విశ్వామిత్రుడి వలన అహల్యా శాపవిమోచన వృత్తాంతం విని శతానందుడు మహదానందంతో రాముణ్ణి శతవిధాల కీర్తించి, జననీజనకుల దగ్గిరికి వెళ్ళాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలకు చేరారు. సీత, ఉద్యానవనంలో విహరిస్తున్నది. ఆమెతో చెల్లెలైన ఊర్మిళ ఉన్నది. ఆ ఉద్యానవనంలోనుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెళ్తున్నారు. 
సీత, రాముడు ఒకర్నొకరు చూసుకున్నారు. ‘తనవాడు వచ్చాడు!’ అనే ఆనందంతో అడుగులు తడబడుతూండగా, సీత అంతఃపుర మందిరంలోకి పరుగుతీసింది. ఊర్మిళ మనస్సు లక్ష్మణుడిపై లగ్నమైంది. రాజాధిరాజులు, బలసంపన్నులు ఎవ్వరూ శివధనుస్సును ఎత్తలేక పోయారు. జనకుడు నిరాశపడుతూంటే, తండ్రి చెంత ఉన్న సీత, దూరాన ఉన్న రాముడిని ఓరచూపులతో చూస్తూ, ఉత్సాహంగా తండ్రి వంక రాముణ్ణి చూడమన్నట్లుగా చూసింది.

విశ్వామిత్రుడు రాముణ్ణి ముందుకు పంపాడు. ఆచార్యదేవుడి ఆదేశం శిరసావహించి తాను నిమిత్తమాత్రుణ్ణి అన్నట్లుగా వెళ్ళి, శివధనుస్సుకు నమస్కరించి, రాముడు గున్నటేనుగు చెరుకుగడను లాగినట్లు శివధనుస్సును అవలీలగా ఎత్తి పట్టి, నారిని బలంగాలాగి ఎక్కుపెట్టే సరికి, గొప్ప ధ్వనితో భూనభోంతరాళాలు దద్దరిల్లగా, శివధనుస్సు విరిగిపోయింది.

మహాధ్వని తరంగాలు దిగంతాలు వ్యాపించి, దక్షణ మహాసముద్రంలో మహేంద్ర పర్వతం మీద తపస్సులో ఉన్న పరశురాముడి చెవిని సోకాయి. పరుశురాముడు విష్ణువు మారురూపమైన గోలోకవాసియైన కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఇచ్చిన కోదండాన్ని, విష్ణు అంశను రాముడికి అప్పగించడానికి బ…యల్దేరాడు. సీత రాముడి మెడలో మాలవేసి సిగ్గు దొంతరలతో చరచరా తండ్రి చెంత చేరింది. సీతారాముల వివాహానికి దశరుథుడు సకుటుంబ సపరివారంగా మిథిలకు చేరాడు.

పెళ్ళిపీటలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, సీత కమలం వంటి దోసిట్లో ముత్యాలు పద్మరాగాల్లా ప్రకాశించాయి. రాముడి తలపై జాజిమల్లెల్లాగ తెల్లగా విరిశాయి. రాముడి శ్యామలశరీరంపై జారుతూ, వింతకాంతులతో ఇంద్రనీలాల్లాగ కనిపించాయి. సీతకు చెల్లెళ్ళయిన ఊర్మిళను లక్ష్మణుడికీ, మాండవిని భరతుడికీ, శతరూపను శత్రుఘ్నుడికీ ఇచ్చి వివాహం సీతారామ కళ్యాణ మహోత్సవంలోనే జరిపించారు.

దశరథుడు కొడుకులు కోడళ్ళతో అయోధ్యకు తిరుగుప్రయాణమయ్యాడు   హుటాహుటిగా వస్తున్న పరశురాముణ్ణి చూస్తూనే రథం దిగి ప్రణమిల్లి రాముడికి బదులుగా తన తల నరకమని ప్రాథేయపడ్డాడు. పరశురాముడు, ‘‘ఓ,రామా! ఆ హరవిల్లు విరిచావుట, ఈ వింటిని ఎక్కుపెట్టు!’’ అని తన చేతనున్న కోదండాన్ని అందించాడు. దాన్ని అందుకుంటున్నప్పుడే పరశురాముడిలోని విష్ణు అంశ రాముడికి చేరింది. కోదండాన్ని రాముడు ఎక్కుపెట్టాడు.

విష్ణు కథ - 10

విష్ణు కథ - 10

శ్రీమతి స్యయంవరానికి దేశదేశాల రాజులు, ముల్లోకాల్లోని ప్రముఖులు అంతా వచ్చారు. విష్ణు వేషంతో నారదుడు స్వయంవర మంటపం ప్రవేశించగానే అంతా ఘొల్లున నవ్వారు. తన ముఖం కోతి ముఖంగా మారిందని తెలుసుకొని నారదుడు అవమానంతో ఉడికిపోయాడు.

శ్రీమతి విష్ణువును ధ్యానించింది. విష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. శ్రీమతి మాలవేసి విష్ణువును వరించి, అతనితో వైకుంఠానికి వెళ్ళింది. అది చూసి నారదుడు మరింత కోపంతో పర్వతుణ్ణి కూడగట్టుకొని అంబరీషుడిపై మండిపడ్డాడు. అడిగినప్పుడు తమకు ఇవ్వకుండా శ్రీమతిని విష్ణువుకు అప్పగించినందుకు అంబరీషుణ్ణి నాశనం చేయదలచి, శపించడానికి సిద్ధపడ్డారు.

అప్పుడు విష్ణుచక్రం వచ్చి వారిని వెంట తరిమింది. పర్వత నారదులిద్దరూ వైకుంఠానికి పరుగెత్తారు. అక్కడ శ్రీమతితో ఉన్న విష్ణువును చూసి నారదుడు మరింత ఉడుకుమోత్తనంతో, ‘‘నువ్వు కూడా నీ శ్రీమతిని - అంటే నీ భార్యామణిని పోగొట్టుకొని విలపిస్తావు! నన్ను కోతిముఖంవాడిని చేసి మోసగించావు. వానరులే నీ సహచరులై సహాయపడతారు గాక!’’ అని విష్ణువును శపించాడు. నారదుడి శాపానికి విష్ణువు మందహాసం  చేశాడు. శ్రీమతి లక్ష్మీదేవిగా నిజరూపం పొందింది. మునులను ఆవరించిన మాయ. తొలగింది. జరిగినదానికి సిగ్గుపడుతూ నారద పర్వతులు విష్ణు పాదాల మీద పడ్డారు. నారదుడు విష్ణు పాదాన్ని కన్నీటితో తడుపుతూ, శపించినందుకు నొచ్చుకొంటూంటే విష్ణువు నెమ్మదిగా మందహాసం చేస్తూ, నార దుడి తల నిమిరి, ‘‘నారదా! త్రికాలవేత్తవైన నువ్వు విచారించడమేమిటి! నీ నోటిమాట అమోఘం.

నువ్వు శపించింది కూడా నా సంకల్పమే! నా రామావతార సమయంలో అలాగే జరుగుతుందిలే! అదీ లోకకల్యాణం కోసమే!’’ అని చెప్పాడు. అప్పటినుంచీ అంబరీషుడికి ఎవరివల్లా ఎటువంటి హానీ జరగకుండా, తన చక్రం అతనికి రక్షణగా ఉండేలాగ విష్ణువు అనుగ్రహించాడు. దుర్వాసుడికి తపోబల గర్వంతో బాటు తామసం ఎక్కువ. ఒకనాడు తన ఆశ్రమం నుండి బయలుదేరబోతూండగా, ఆనంద పారవశ్యంతో కన్నులు మూసి విష్ణుసంకీర్తన పాడుతూ వస్తున్న నారదుడు ఎదురయ్యాడు. ‘‘ఓహో, నారదా!

కలహ భోజనంతో కడుపు నిండినట్టుందే! చాలా ఆనంద పారవశ్యంలో మునిగి ఉన్నావు!’’ అంటూ దుర్వాసుడు నారదుణ్ణి పలకరించాడు. నారదుడు కళ్ళుతెరిచి వంగి వంగి  నమస్కరిస్తూ, ‘‘దుర్వాసుల వారికి ప్రణామాలు! అలాంటి దేమీ పడక నకనకలాడుతున్నది గాని, మహర్షీ! విష్ణుభక్తి తత్పరులైన వారిని చూసినపుడల్లా నాకు పరమానందం పొంగుతూనే  ఉంటుందాయె. అంబరీషుణ్ణి చూసి ఇలా వస్తున్నాగదా మరి...’’ అన్నాడు మరొకసారి వంగి ప్రణామం చేస్తూ.

‘‘అంతటివాడా, అంబరీషుడు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘ఔను, మహర్షీ! విష్ణువు అనుగ్రహం పొందిన రాజర్షిసత్తముడు, ద్వాదశీ వ్రతం అతని ప్రాణం!’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమిటి నారదా! ఆ రాజును తెగపొగిడేస్తున్నావు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘అతణ్ణి చూస్తే తెలుస్తుంది, పొగడ్తకాదని! నీలాంటి మహర్షీశ్వరుడు అతని సదనాన్ని పావనం చేయడం వల్ల, అతని జన్మ ధన్యమౌతుంది. చరితార్థుడై మరింత వినుతికెక్కుతాడు!’’

అని చెప్పి నారదుడు నారాయణ నామజపం చేస్తూ వెళ్ళాడు. నారదుడి మాటలు దుర్వాసుణ్ణి రెచ్చ గొట్టాయి. అంబరీషుడి దగ్గిరికి బయలుదేరాడు. ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశీవ్రత  సమాప్తిగా అప్పుడే భుజించడానికి అంబరీషుడు సిద్ధమౌతున్నాడు. దుర్వాసుడి రాకకు పరమానంద భరితుడై, అర్ఘ్యపాద్యాదులతో పూజించి, భోజనానికి ఆహ్వానించాడు.

దుర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకూ తిరిగి రాలేదు. ద్వాదశఘడి…ులు మించిపోతున్నవి; ద్వాదశి దాటకుండా భోజనం చే…ుకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథి రాకుండా తింటే దోషమౌతుంది! అప్పుడు విజ్ఞులైన పెద్దలు అంబరీషుడితో కొంచెం నీరు చప్పరించితే వ్రతభంగమూ కాదు, అతిథి రాకుండా భుజించిన దోషమూ అంటదు అని చెప్పగా అలాగే అతను జలపారణం చేశాడు.

ద్వాదశి పోయి త్రెూదశి వచ్చినటే్ల హుటా హుటిగా ఆగ్రహావేశంతో పట పట పళ్ళు కొరుకుతూ, జటాజూటాన్ని విప్పి విదలిస్తూ దుర్వాసుడు వచ్చాడు. ‘‘ఓ రాజాధమా! విష్ణుభక్తుడి నంటూ గర్వించి ఆతిథ్యధర్మానికి అపచారం చేస్తావా? నాకే అవమానం తలపెట్టడానికి నీ కెన్ని గుండెలు? నేనెవర్నో తెలుసా? నా పేరు వింటే ముల్లోకాలూ, ముమ్మూర్తులూ గడగడలాడ వలిసిందే! నా శాపానికి తిరుగులేదు, దుర్మరణం పాలౌతావు గాక!’’

అని హుంకరిస్తూన్న దుర్వాసుడి పాదాల మీద తలవాల్చి అంబరీషుడు, ‘‘ఋషీశ్వరా! వ్రతభంగం కాకుండా వుండేందుకు జలపారణం మాత్రమే చేశాను. మన్నించమని వేడుకొంటున్నాను!’’ అన్నాడు విన…ుంగా. దుర్వాసుడు అంబరీషుని తలను తన్ని, ‘‘దుర్వాసుడి కోశంలో మన్నించడం అనేది లేదు! భక్తీ, తపశ్శక్తుల్లో ఏది గొప్పదో నువ్వు స్వ…ుంగా చూద్దువుగాని!’’ అని అంటూ అమిత ఆగ్రహంతో జటాజూటాన్ని సింహంలాగ విదిల్చాడు.

దుర్వాసుడి తపోమహిమ అంతా అతని జడల్లో అనేక శక్తులుగా నిక్షప్తమై వుంది. పొడవైన ఒక జడను తీసి పట్టుకొని మరో చేత్తో ెూగదండాన్ని ఎత్తి ఆడిస్తూ జడను ఝళిపించాడు. జడ నుంచి నిప్పురవ్వలు విరజిమ్ముతూ దట్టమైన నల్లని పొగలు సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచాయి ఆ పొగల్లో భ…ుంకరాకారంతో పర్వతంలా కృత్య అనే మహా భూతం ఆవిర్భవించింది. కృత్య ప్రళ…ుభీకరంగా గర్జిస్తూ అంబరీషుడిని చంపడానికి ఉరకబోతున్న మరుక్షƒణంలో అతనికి రక్షణగా విష్ణువు అనుగ్రహించిన చక్రం జ్వాలలు కక్కుతూ రివ్వునవచ్చి కృత్యను ముక్కలు ముక్కలుగా నరికి మటుమా…ుం చేసింది.

అదిచూసి దుర్వాసుడికి ముచ్చెమటలు పోశాయి. కృత్యను నాశనం చేసిన విష్ణుచక్రం అంతటితో ఆగక, అమిత వేగంతో దుర్వాసుడి మీదకు వెళ్ళింది. దుర్వాసుడు మరొక జడను పెరికి విసిరాడు. పర్వతమంత వజ్రపాషాణం అడ్డునిలిచింది. చక్రం దాన్ని తుక్కు తుక్కుగా తూలగొట్టి దుర్వాసుణ్ణి వెంబడించింది. ఇంకొక జడను ఋషి విసిరాడు! ఆకాశమంత మంచు మేఘం ఏర్పడి వెనువెంటనే చక్రజ్వాలల్లో ఆవిర్లు గక్కుతూ హరించిపోయింది.

దుర్వాసుడు పరుగెత్తుతూంటే అతని జటాజూట మంతా వెంట తరిమే చక్ర జ్వాలలు తగిలి మసి మసి అయింది. ఈ విధంగా అతడి తపశ్శక్తి అంతా ఆహుతి అయిపోయింది. చెట్టనక పుట్టనక, అడవులు నదులు పర్వతాలు దాటుతూ, దుర్వాసుడు పరుగెత్తుతున్నాడు. చక్రం తరుముకొంటూ వస్తోంది; మునిని ముల్లోకాలు తిప్పింది. దుర్వాసుడు బ్రహ్మలోకానికి పరుగు తీస్తుంటే నారదుడు ఎదురుపడి ముసి ముసి నవ్వు లతో, ‘‘హా! తపో సంపన్నులు దుర్వాసులవారేనా! ఏమిటా పరుగు?’’ అని అంటూంటే మారు మాటరాక వెన్నెంటి వస్తోన్న చక్రాన్ని చూపిస్తూ దుర్వాసుడు అదే పరుగున బ్రహ్మముందు పడ్డాడు.

‘‘నేను విష్ణునాభికమలంనుంచి వచ్చినవాణ్ణి, నేనేం చె…్యుగలను? చక్రాన్ని ఎలా వారించగలను?’’ అన్నాడు బహ్మ. ‘‘బ్రహ్మవని వస్తే ఇంతేనా నీ పస! నన్ను రక్షంచగల ఆ మహేశ్వరుడున్నాడులే!’’ అన్నాడు ఋషి. ‘‘ఔను, ఔను, దుర్వాసా! ఆ మాటా నిజమే. ఎంత త్వరగా వెళ్తావో కైలాసానికి, వెళ్ళు వెళ్ళు!’’ అన్నాడు బ్రహ్మ చేతులు దులుపుకొంటూ. కైలాసానికి వెళ్ళి దుర్వాసుడు శివుణ్ణి రక్షంచమని మొరపెట్టాడు. ‘‘చక్రం విష్ణువుది. కోరి విరోధం తెచ్చుకో మన్నావా? వెళ్ళు. నీ దురహంకారానికి ఫలితం అనుభవించక తప్పుతుందా మరి! వెళ్ళు, వెళ్ళు!’’ అన్నాడు శివుడు. దుర్వాసుడు వైకుంఠానికి పరుగెత్తి విష్ణువు ముందు పడి, దీనాతి దీనంగా చక్రాన్నినివారించమంటూ శరణు వేడాడు.

‘‘అంబరీషుడికి రక్షగా నా చక్రాన్ని ఎప్పుడో అనుగ్రహించాను. అందువల్ల, ఇప్పుడు నేనేం చేసేది మహర్షీ? అంబరీషుణ్ణే చక్రాన్ని వారించమని అర్థించు!’’ అన్నాడు విష్ణువు.
దుర్వాసుడు హతాశుడై లేచాడు. అతని అహంకారం నశించింది. అతని తల బోసి పోయివుంది. తపశ్శక్తి అంతా తుడుచుకు పోయింది, భక్తిముందు తపశ్శక్తి ఎందుకూ పనికిరాదని తెలిసింది. అంబరీషుడి దగ్గిరకు బ…ులుదేరాడు. చక్రం శాంతంగా వెంట వెళ్తున్నది.

దుర్వాసుడు పాదాలు పట్టుకోబోతూంటే అంబరీషుడు వారించి, లేవనెత్తి చక్రాన్ని ఆగమన్నాడు. చక్రం వెనక్కి మళ్ళి కొంతసేపటికి అదృశ్యమైంది. అగ్రగణ్యులైన విష్ణువు భక్తుల్లో అంబరీషుడుపేరుపడ్డాడు. సూర్యవంశ రాజుల్లో గాధి ఒక ప్రముఖుడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు, కృతాశ్వుడి దగ్గిర ధనుర్విద్య నేర్చాడు. అనేక అస్త్రాల్ని పొందాడు. అస్ర్తవేత్తగా పేరు పొందాడు.

 విశ్వామిత్రుడు రాజ్యపాలనకు వచ్చాక ఒకనాడు సపరివారంగా వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్ఠ మహర్షి తన హోమధేనువు మహిమ వల్ల అందరికీ సాదరంగా గొప్ప విందు చేశాడు. పదిలక్షల గోవులను తీసుకొని హోమ ధేనువును ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు; వసిష్ఠుడు ఇవ్వనన్నాడు. విశ్వామిత్రుడు బలాత్కారంగా గోవును పరివారంచేత తోలించుకొని వెళ్ళబోతూంటే, వశిష్ఠుడు తన తపోబలంతో హోమధేనువు నుండి అనేక మంది శబరెూధుల్ని పుట్టించాడు.

విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్ని ధేనువు నుండి వచ్చిన ెూధులు చిత్తు చిత్తుగా తరిమికొట్టారు. రాజరికం కంటే తపోబలం మిన్న అని తెలుసుకొని విశ్వామిత్రుడు రాజ్యం విసర్జించి అనేక సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తపస్సు సాధించి వసిష్ఠుడితో సమానుడనిపించుకున్నాడు. అప్పటినుంచి విశ్వామిత్రుడు వసిష్ఠుడితో పోటిగా వుంటూ వచ్చాడు.

రావణుడి అనుచరులైన రాక్షసులు తమ తమ బలాలతో ఆర్యావర్తం మీద విరుచుకుపడి ధ్వంసం చేస్తూ, మునులను ఋషులను బాధించి, ఆశ్రమాలు తగలబెట్టసాగారు. విశ్వామిత్రుడు గొప్ప తలపెట్టాడు. అది జరగకుండా మారీచుడు, సుబాహుడు అనే రాక్షస ప్రముఖులూ, తాటక అనే రాక్షసీ పట్టుదలతో ధ్వంసం చేస్తున్నారు. విశ్వామిత్రుడు చింతాక్రాంతుడై, హిమాల…ు ప్రాంతంలో ఉన్న తన సిద్ధాశ్రమంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ఆ ధ్యానసమాధిలో అతనికి మహావిష్ణువు అవతారంగా సూర్యవంశంలో రఘువు సంతతిలో పుట్టి పెరుగుతూన్న రాముడు కనిపించాడు!

లోకకల్యాణం కోసం రాక్షసనిర్మూలన చే…ువలసి ఉన్న రాముడికి వసిష్ఠుడు నేర్పిన శాస్ర్తవిద్యలెందుకూ అక్కరకు రావు! అందుకు అద్భుతమైన అస్ర్త, శస్ర్తవిద్య, ధనుర్విద్యాపాటవంకావాలి! వాటిని అందించగల గురువు అతనికిప్పుడు కావాలి! రాముడికి అస్త్రాలు ఉపదేశించగల సమర్థుడు విశ్వామిత్రుడు ఒక్కడే!

విశ్వామిత్రుడికి ధ్యానసమాధిలో లక్ష్మీదేవి సీతగా జనకుని కూతురుగా పెరుగుతున్నది కూడా కనిపించింది.సీతారాముల కల్యాణం కూడా త్వరలో జరగాలి. రాముడి వల్లనే తన కూడా జరగాలి! తనకు తెలిసిన అస్ర్తవిద్య నంతా రాముడికి ఉపదేశించి, ఆ…ున్ను అస్ర్తవిద్యాకోవిదుణ్ణిగా చే…ువలసిన బాధ్యత తనదిగా గుర్తించి విశ్వామిత్రుడు అెూధ్యకు బ…ుల్దేరాడు.

విష్ణు కథ - 9

విష్ణు కథ - 9

దశరథమహారాజు పుత్రకామేష్ఠియాగం చేసి,  అగ్నిదేవుడిచ్చిన పాయసపాత్ర అందుకుని, ఆనందపారవశ్యంతో కౌసల్యకు, కైకేయికి ఆ పాయసాన్ని పంచి ఇచ్చాడు.
అతినికి కౌసల్య, సుమిత్ర, కైకేయి - ముగ్గురు రాణులు.

కౌసల్యాదేవి, సుమిత్రకుగాను తన కిచ్చినదాంట్లోంచి  కొంత పాయసాన్ని వేరొక పాత్రలోకి తీసింది. అలాగే కైకేయి కూడా ఆ పాత్రలో తనకిచ్చిన పాయసం నుంచి తీసి కొంతవేసింది.

చైత్రశుక్ల నవమినాడు కౌసల్యకు విష్ణువు రాముడుగా నీలమేఘం ఛాయగల శరీరకాంతితో పుట్టాడు. తర్వాత కైకేయికి శంఖపద్మాల అంశతో ముత్యపు తెలుపుగల భరతుడు పుట్టాడు. శేషుని అంశతో నిగనిగలాడే బంగారువన్నెగల లక్ష్మణుడూ, చక్ర గదల అంశతో పగడపు ఎరజ్రీరతో శత్రుఘ్నుడూ, సుమిత్రకు పుట్టారు. చైత్రశుక్లనవమి రామనవమిగా పేరొంది కోసల రాజ్యమంతటా ఆనందోత్సవాలు జరుగుతూండగా మూడో చైత్రం వచ్చింది. అయోధ్యానగరంలో చక్రవర్తి పెద్దకుమారుడి పుట్టినరోజు వేడుకలు, దానధర్మాలు ఘనంగా జరిగాయి.

చైత్రపౌర్ణమినాడు రాజసౌధం మీద విరిసిన వెన్నెట్లో నలుగురు చిరంజీవులతో, ముగ్గురు రాణులతో దశరథుడూ, మంత్రి సుమంత్రుడూ, రాముణ్ణి ఎత్తుకొని తిప్పి ఆడించే రాజబంధువూ, ఆంతరంగికుడూ అయిన భద్రుడూ చిత్రాన్నాలతో విందు చేసుకున్నారు. కౌసల్య రాముణ్ణి ఎత్తుకొని చంద్రుణ్ణి చూపి ఆడిస్తూంటే రాముడు చందమామ కావాలని ఒకటే మారాం పెట్టాడు. ఎవరు  ఎన్ని విధాల బుజ్జగించినా ఏడుపు అసలు  మానలేదు.


అప్పుడు సుమంత్రుడు ఒక అద్దాన్ని తెప్పించి రాముడి ముందుంచి, అందులో చంద్రబింబాన్ని చూపించాడు. రాముడు సంతోషంతో తననూ, చంద్రుణ్ణీ అద్దంలో చూసుకుంటూ, ‘రామచంద్రుడు’ అని ముద్దు ముద్దుగా అంటూ చిరుచేతులతో చప్పట్లు కొట్టాడు. అది మొదలు రామచంద్రుడు అనిపించుకున్నాడు.

తర్వాత భద్రుడు రాముడిని ఎత్తుకొని అద్దంలోకి చూపిస్తూ, ‘‘మరి ఇప్పుడో?’’ అన్నాడు. రాముడు, ‘‘రామభద్రుడు!’’ అన్నాడు. ఆ విధంగా రామభద్రుడు అని కూడా అనిపించుకున్నాడు. పిమ్మట లక్ష్మణ భరత శత్రుఘు్నలు రాముడి పక్కల చేరి అద్దంలో కనిపించారు. పైన నిండు చంద్రబింబం గొడుగులాగ కనిపించింది. అందరికీ ఆ దృశ్యం రామ పట్టాభిషేకాన్ని స్ఫురింపజేసింది. దశరథుడి ఆనందానికి మేరలేదు.

ముగ్గురమ్మలూ మురిసిపోయారు. రాకుమారులు పెరుగుతున్నారు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెన్నంటి వుండేవాడు. ఆ వెనుక, భరత శత్రుఘ్నులిద్దరూ జంటగా వుంటూ ఆడుకుంటూ ఒకే ప్రాణంగా వుండేవారు. అన్న, తమ్ములు నలుగురైనా అంతా ఒకే పరిపూర్ణరూపంగా కనిపిస్తూండేవారు. రాకుమారులు కులగురువైన వసిష్ఠ మహర్షి దగ్గిర విద్యావంతులైనారు.

రాముడు వ…యసుకి పిన్న అయినా పెద్దచదువులే చదివాడు; సర్వశాస్ర్తాలూ, వేద వేదాంగాలూ, ధర్మసూక్ష్మాలు, యోగ రహస్యాలూ తెలుసుకున్నాడు. వసిష్ఠుడు, ‘‘రామచంద్రా! మీ వంశకర్త సూర్యుడు, నీవు రవి రాముడివి! ఇక్ష్వాక కుల తిలకానివి! నీ ముత్తాత రఘుమహారాజూ గొప్ప కీర్తిగాంచిన వాడు. నీవు రఘువంశ సుధాంబుధి చంద్రుడివి!

రఘు రాముడివి!’’ అని పేర్కొంటూ రాముణ్ణి ఆశీర్వదించాడు-అని సూతుడు చెప్పగా, నైమిశారణ్య  మునులు, ‘‘సూత మునీంద్రా! సూర్యవంశ రాజుల చరిత్రలను విపులంగా వినగోరుతున్నాము!’’ అని కోరారు. సూతుడు చెప్పసాగాడు: మహాకల్పారంభంతో వివస్వంతుడు అనే పేరున ప్రకాశించిన సూర్యుడికి కుమారుడైన వైవస్వతుడు మనువు అ…్యూడు.

వైవస్వతమనువుకి ఇక్ష్వాకుడు మొదలైనవారు పదిమంది కుమాళ్ళు. వారందరూ గొప్ప రాజులై ధరణిని ఏలారు. వారి సంతతి బాగా పెరిగింది. ఆ విధంగా సూర్యవంశం శాఖోపశాఖలై విస్తరించింది. ఇక్ష్వాకుడి సంతతివారైన ఇక్ష్వాకుల్లో దిలీపుడు, రఘువు గొప్ప ధర్మపరులైన చక్రవర్తులుగా పేరుపొందారు. దిలీపమహారాజు సంతాన ప్రాప్తికోసం కులగురువైన వసిష్ఠుని ఆదేశానుసారంగా కామధేనువు అంశ అయిన నందినీ ధేనువును భక్తిశ్రద్ధలతో అర్చిస్తూ, అడవుల్లో మేపుతూండగా, ఆవు ఒక గుహలోకి వెళ్ళింది.

ఆ గుహలో ఒక భ…ుంకరమైన సింహం ఆవును పట్టుకొంది. దిలీపుడు సింహాన్ని చంపడానికి ధనుస్సుకు బాణం సంధించబోతే, అతని  యిస్తంభించి అలాగే ఉండిపోయింది. అప్పుడు సింహం అతనితో, ‘‘ఓ రాజా! ఆవు నాకు లభించిన ఆహారం! నన్ను చంపబోవటం అధర్మం కనుకనే, నీ చేయి అలా వుండిపోయింది!’’ అన్నది. అది విన్న దిలీపుడు, ‘‘నన్ను ఆహారంగా తీసుకొని ఆవును విడిచిపుచ్చు,’’ అని ప్రార్థించాడు. సింహం అదృశ్యమైంది.నందినీ ధేనువు అతని భక్తికి సంతసించి, ఆ దృశ్యమంతా తాను కల్పించినదే అని చెప్పి సంతానప్రాప్తి కలిగేలా దిలీపుడికి వరమిచ్చి అనుగ్రహించింది.

దిలీపుడి కుమారుడే రఘుమహారాజు. రఘువు గొప్పదానపరుడుగా కీర్తిగాంచాడు. అతిథిగా వచ్చిన తపస్వి మనోవాంఛితాన్ని గ్రహించి, రఘువు తన రాణిని తపస్వి ఆశ్రమానికి తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చాడు.

తపస్వి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొంది, ఆమెకు సగౌరవంగా మ్రొక్కి రాజమందిరానికి పంపించాడు. దానమిచ్చినదాన్ని తిరిగి పరిగ్రహించడానికి రఘువు సమ్మతించలేదు. రాణి తన్ను నరికి చంపమని భర్తను వేడుకొన్నది. రఘువు ఎత్తిన కత్తి ఆమె మెడ మీద పూలరాశిగా పడింది.

రాజదంపతుల మీద దేవతలు పూలవాన కురిపించారు. రఘు మహారాజు తనది అంటూ ఏదీ మిగుల్చుకోకుండా సంపదనంతనూ దానం చేసినా చాలకపోగా, కుబేరుడి దగ్గరి ధనరాసులు తేవడానికి వెళ్ళాడు.

 యక్షులు రఘువు అలకానగరాన్ని చేరకుండా, …యక్ష మాయలన్నీ అతనిపై ప్రయోగించి విఫలులయ్యారు. కుబేరుడు రఘు మహారాజుకు సాదరంగా అనేక సంపదలనిచ్చి పంపాడు. రఘువు ఆ ధనాన్నంతనూ అర్థించేవారు మిగలకుండా పంచాడు. రఘువు కుమారుడు అజుడు. అజ మహారాజు గొప్ప శూరుడు. స్వయంవరంలో అజుణ్ణి భోజరాజ పుత్రిక ఇందుమతి వరించింది. అజుడు ఇందుమతితో బయలుదేరుతుండగా స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు.

అజుడు వారినందర్నీ ఎదుర్కొని యుద్ధం చేసి గెల్చాడు. అజుడు ఇందుమతితో ముచ్చటగా ఉద్యానవనంలో విహరిస్తూండగా, ఆకాశ మార్గాన దేవలోకపు పుష్పమాల జారి గాలితో ఎగిరి వచ్చి ఇందుమతి మెడలో పడింది. వెంటనే ఆమె మరణించింది. అజుడు ప్రియసతి వియోగానికి పరితపిస్తూండగా, నారదుడు వచ్చి అతణ్ణి ఓదార్చి ఇందుమతి పూర్వవృత్తాంతాన్ని చెప్పాడు: హరిణి అనే దివ్యాంగన, తృణబిందుడు చేస్తూన్న తపస్సు భంగపుచ్చడానికి ఇంద్రుడు పంపగా ఋషిశాపంవల్ల మనిషిగా పుట్టింది.

శాపవిమోచనం కూడా ఋషి చెప్పాడు. సుర పుష్పమాల పడడంతో ఆమెకు తాను సురకాంతను అనే స్ఫురణ కలిగి మానవ శరీరాన్ని విడిచి, దేవలోకానికి వెళ్ళిపోయింది. అజుని కుమారుడు దశరథుడు. ఇక్ష్వాకు వంశీయులైన రాజులు దేవతలకు, రాక్షసులకు జరిగే యుద్ధాల్లో దేవతలకు సహాయంగా వెళ్ళేవారు. అలాగే దశరథుడు కూడా ఇంద్రుడికి సహాయంగా శంబరాసురుడి మీదకు వెళ్ళాడు. దశరథుడితో కైకేయి కూడా రణరంగానికి వెళ్ళింది. ఆ యుద్ధంలో రథచక్రం ఊడిపడకుండా కైకేయి కాపాడింది.

దశరథుడు సంతోషించి రెండు వరాలు కోరుకోమన్నాడు. తనకు కావలసినప్పుడు ఆ రెండు వరాలు కోరుకుంటాననీ, అప్పుడు ఇవ్వమనీ కైకేయి చెప్పింది. దశరథుడు ఒకనాటి చీకటి రాత్రి, పంటపొలాలు పాడుచేసే ఏనుగులను వేటాడ్డానికి వెళ్ళాడు. ఆ చీకటిలో కమండలంతో నీరు ముంచుకొంటున్న శబ్దాన్ని ఏనుగు నీరు పల్చుతున్నదని భావించి మునిబాలకుణ్ణి బాణంతో చంపాడు.

ఆ బాలుడు పెట్టిన కేకతో నిజం తెలుసుకొని దశరథుడు నీరు తీసుకెళ్ళి, అంధులైన బాలుడి తలిదండ్రుల దప్పిక తీర్చాక జరిగింది చెప్పాడు. ఆ మునిదంపతులు పుత్రశోకంతో, ‘‘నువ్వూ, మాలాగే కుమారుణ్ణి తలంచుకొంటునే ప్రాణాలు విడిచెదవు గాక!’’ అని దశరథుణ్ణి శపించి ప్రాణాలు విడిచారు. సూర్యవంశపు రాజుల్లో శరణాగత రక్షణకు శిబిచక్రవర్తి కీర్తిగాంచాడు.

శిబిని పరీక్షంచడానికి ఇంద్రుడు పావురంగానూ, అగ్ని డేగగానూ వెంట తరుముతూ వచ్చారు. పావురం శిబి తొడమీద వాలింది. పావురం బరువు మాంసాన్ని తన శరీరం నుంచి తీసుకోమని శిబి డేగకు చెప్పాడు. శిబి తన శరీరాన్ని ఎంత కోసి త్రాసులో వేసినా పావురంతో సరితూగలేదు. అప్పుడు శిబి తన్ను పూర్తిగా తీసుకోమని త్రాసు సిబ్బెలో కూర్చున్నాడు. ఇంద్రుడూ, అగ్నీ నిజరూపాలతో కనిపించి శిబికి అనేక వరాలిచ్చి మెచ్చుకొన్నారు.

వసిష్ఠుడితో పోటీపడి గొప్ప తపోబలంతో, వసిష్ఠుడితో సమానంగా మహర్షిగా గుర్తింపు పొందిన విశ్వామిత్రుడు కూడా సూర్యవంశపు రాజే! సూర్యవంశజుడు, ఇక్ష్వాకులకు చెందినవాడే అయిన అంబరీషుడు రాజర్షి. పరమ విష్ణుభక్తుడైన రాజు. అంబరీషుడికి లక్ష్మి తన అంశతో కుమార్తెగా పుట్టింది. ఆమె పేరు శ్రీమతి. ఆమె చిన్నతనం నుంచే విష్ణువును తన భర్తగా భావించి ఆరాధిస్తూ వచ్చింది.

శ్రీమతి సౌందర్యం ముల్లోకాల్లో చెప్పుకోబడింది. నారదుడు తాను మాయాతీతుడననే అహంతో పర్వతుడనే మహామునితో ప్రగల్భాలు పలికాడు. పర్వతుడు కూడా నారదుడితో కలిసి త్రిలోక సంచారం చేస్తూండేవాడు. నారదుడు, పర్వతుడు కలిసి అంబరీషుడి దగ్గరకు వెళ్ళారు. అంబరీషుడు వారిని భక్తితో పూజించి, కుమార్తె శ్రీమతి చేత మునులిద్దరి పాదాలకు మ్రొక్కించి ఆశీర్వదించమన్నాడు. విష్ణుమాయా ప్రభావం నారద, పర్వతుల్ని ఆవరించింది.

శ్రీమతిని చూసి మైమరచి నాకంటే నాకు శ్రీమతితో వివాహం జరిపించమని అంబరీషుణ్ణి కోరారు. శ్రీమతి నాది అంటే నాది అని ఇద్దరూ తమలో తాము వాదులాడుకోసాగారు. వెంటనే తమతో వివాహం నిశ్చయం చేయమని అంబరీషుణ్ణి ఒత్తిడి చేశారు. అంబరీషుడు మునుల వాలకానికి దిగ్భ్రాంతుడై నోటమాట రాకుండా ఉండి పోయాడు. శ్రీమతి తనకు స్వయంవరం ఏర్పాటు చేయమని తండ్రితో చెప్పింది. అంబరీషుడు నారద, పర్వతులతో, ‘‘మీ ఇద్దరికిద్దరూ మహర్షిశ్రేష్ఠులే!

మీ ఇద్దరూ నన్ను ఇరుకులో పెట్టడం భావ్యంకాదు గనుక, నా కుమార్తెకు స్వయంవరం చాటిస్తున్నాను. స్వయంవరానికి మీరిద్దరూ రావలసిందిగా ప్రార్థిస్తున్నాను!’’ అని చెప్పాడు. బిక్కముఖాలు వేసుకొని మునులిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీమతిని ఎలాగైనా తనదిగా చేసుకోవాలని నారదుడికి ఊహలమీద ఊహలు, ఉపాయాలమీద ఉపాయాలు తోచాయి.

నారదుడిని శ్రీమతి వరించకుండా ఉంటే చాలు అని పర్వతుడు ఆలోచించసాగాడు. నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మణికిరీటము, కౌస్తుభమణి, వైజయంతీ మాల మొదలైన విష్ణువేషాన్ని తనకు ఇవ్వమని అడిగాడు. విష్ణువు తన రూపాన్ని అలాగే నారదుడికి ఇచ్చాడు. నారదుడు వెళ్ళాక పర్వతుడు వచ్చి విష్ణువును స్తుతించి, స్వ…యంవరంలో నారదుడి ముఖం కోతిముఖంగా మారేలాగ చే…యమని కోరాడు. విష్ణువు సరే అని చెప్పాడు.

విష్ణు కథ - 8

విష్ణు కథ - 8

పడిపోయిన జమదగ్ని మరణించినట్లే ఉండిపోయాడు. రేణుకాదేవి భర్తమీద పడి ఏడుస్తున్నది. అప్పుడే అరణ్యాల నుండి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది తెలుసుకొని పరశువును ఎత్తి ఝుళిపిస్తూ, మాహిష్మతీ నగరానికి పరుగెత్తాడు. అంతలో భృగుమహర్షి ఎక్కణ్ణించో వస్తూ జమదగ్ని ఆశ్రమం చేరాడు. రేణుకను ఓదార్చి, జమదగ్నిలోంచి పోతున్న ప్రాణాన్ని తన యోగశక్తితో నిలబెట్టి బ్రతికించాడు.

అక్కడ మాహిష్మతీనగరానికి తోలుకుపోయిన ధేనువును కోరిన వాటిని ఆశ్రమంలో ఇచ్చినట్లుగా రాజధానిలో ఇవ్వలేదని సైనికులు కొడుతున్నారు. సరిగా ఆ సమయానికి పరశురాముడు ప్రళయరుద్రుడై వచ్చాడు. సైనికులు పారిపోయారు. ఆవును పరశురాముడు దువ్వి ఆశ్రమానికి వెళ్ళు అన్నట్లుగా తట్టాడు. ధేనువు ఉరకలువేస్తూ వెళ్ళింది. ‘‘ఓ రాజాధమా! సంరక్షకుడై ఉండవలసిన రాజు దుర్మార్గుడైనప్పుడు శిక్షంచక తప్పదు. మేడదిగి ఇవతలికి రా!’’

అని పరశురాముడు రాజప్రాసాదం ముందు కేకవేశాడు. కార్తవీర్యుడు మొదట పరశురాముణ్ణి సాధారణ మునికుమారుడనుకున్నాడు గాని, అతని ధాటి తెలిశాక వెయ్యి చేతులతో ఎదుర్కొన్నాడు. కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్ర్తాలను, శస్త్రాలను పరశురాముడు గొడ్డలితో తుత్తునియలు చేశాడు. అతని వెయ్యి చేతులను చెట్టుకొమ్మలు నరికి నట్లుగా తెగ్గొట్టాడు. కార్తవీర్యుడు మొండి బోదెగా కూలిపోయాడు. అప్పుడు అతనికి తాను శాపవశంతో పుట్టిన చక్రపురుషుడనని గుర్తుకొచ్చింది.

పరశురాముడు విష్ణువే అని తెలిసి మనస్సులోనే దండం పెట్టి దేహం చాలించి వెళ్ళి సుదర్శన చక్రంలో లీనమయ్యాడు. పరశురాముడు ఇంటికివచ్చి తన తండ్రి క్షేమంగా ఉండడం చూసి తాను చేసినది చెప్పాడు. జమదగ్ని, ‘‘నాయనా! నువ్వు చేసినది మునులమైన మనకు తగని పని. అందుకు పరిహారంగా నువ్వు తపస్సు చేయాలి!’’ అన్నాడు.

పరశురాముడు, ‘‘తండ్రీ! రాజు అధర్మ పరుడైనప్పుడు శిక్షంచ వలసిన అర్హత అందరికీ ఉంది! నీ ఆనతి గనుక నేను తపస్సు చేస్తాను. కాని, ప్రాయశ్చిత్తంగా కాదు,’’ అని చెప్పి అరణ్యానికి పోయి తపస్సులోని మగ్నుడయ్యాడు.

కార్తవీర్యుడి వెయ్యిమంది కుమాళ్ళు హైహయ క్షత్రియులందర్నీ కూడగట్టుకొని జమదగ్ని ఆశ్రమం మీదకు విరుచుకు పడ్డారు. అప్పుడు జమదగ్ని నిశ్చలంగా తపస్సమాధిలో ఉన్నాడు. రేణుకాదేవి, ‘‘రామా! రా!’’ అంటూ ఎలుగెత్తి ఇరవై ఒక్కసార్లు పిలిచింది. హైహయులు జమదగ్ని తలను నరికేశారు. రేణుక ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకొంటూ భర్త మొండెం మీద పడి విలవిలా విలపించి సొమ్మసిల్లింది. జమదగ్ని తల దొర్లుకుంటూ దూరంగా పోయి రాళ్ళ మధ్య చిక్కుకుంది. రాజపుత్రులు ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఆ మంటల్లో రేణుక, భర్త కళేబరంతో కలిసి కాలిపోయింది. అరణ్యంలో తపస్సు చేస్తున్న పరశురాముడికి ధ్యానభంగం అయింది. తల్లి పిలుపు ఇరవై ఒక్కసార్లు చెవుల్లో మర్మరంగా వినిపించింది. మనస్సు కీడు శంకించింది. అక్కడి నుంచి ఒక్క అంగలో ఆశ్రమం చేరుకున్నాడు.

ఆశ్రమం తగలబడుతున్నది. తల్లీ, తండ్రీ మసి అయ్యారు. హైహయ సైనికులు ఆశ్రమవాసుల్నీ, వారించ వచ్చిన పరిసర జానపద జనుల్నీ అమానుషంగా చిత్రవధ చేస్తున్నారు.

పరశువును ప్రసాదించిన శివుణ్ణి స్మరించి, పరశురాముడు గొడ్డలిని తీసి జ్వాలలాగ లేచాడు. ముళ్ళపొదల్ని నరికినట్లుగా అందినవారినందర్నీ హతమార్చాడు.

రాళ్ళమధ్య పడి ఉన్న జమదగ్ని తలను తీసి రొమ్ముకు అదుముకొని, ‘‘తండ్రీ! కన్నీరు కూడా రాకుండా నా గుండె జ్వలించి పోతున్నది. క్షత్రియుల రక్తంతో నీకు తర్పణం చేస్తాను.

నీ తలను ఆ రక్తపు మడుగుల్లో ముంచి అంత్యక్రియలు చేస్తాను!’’ అని అంటూ పరశురాముడు ఉన్నత శిలాగ్రం మీదకు ఎక్కి పరశువును ఎత్తి, ‘‘ఈ గొడ్డలితో భూమ్మీద రాజన్నవాడు లేకుండా నరుకుతాను!’’ అని ఇరవై ఒక్కసార్లు గర్జిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. దిక్కులు ప్రతిధ్వనించాయి. అతని భీషణ ప్రతిజ్ఞ విని బ్రహ్మ, మహర్షులు వచ్చి శాంత వచనాలు పలికారు. భృగుమహర్షి, ‘‘నాయనా! దుర్మార్గుల్ని ఆ భగవంతుడే శిక్షస్తాడు. సాధుసజ్జనుల్ని రక్షస్తాడు! నువ్వు శాంతించు!’’ అన్నాడు.

పరశురాముడు, ‘‘ఆ భగవంతుడు ఆకాశంనుంచి ఊడిపడడు; మనిషిగా పుట్టి మనుషుల మధ్యే ఉంటాడు. అలాంటి వాడినే నేను అని పితామహులు గ్రహించాలి. శాంతవచనాలతో నాకు పనిలేదు!’’ అంటూ అదే పరుగున హిమాలయానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై పరశురాముణ్ణి శాంతపరచబోయాడు. పరశురాముడు, ‘‘శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదుగదా! లయమూర్తివైన నీకు చెప్పవలసింది లేదు. నా ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కావలసిన బలాన్నిఇవ్వు!’’ అన్నాడు. శివుడు అతనికి అన్ని అస్ర్తాలను ఇచ్చి ప్రత్యేకమైన దివ్యాస్ర్తాన్ని ఇస్తూ, ‘‘ఇది భార్గవాస్త్రంగా నీ పేరున నిలుస్తుంది! నీవు కారణజన్ముడివైన అవతార మూర్తివి! వెళ్ళు,  నీకు అడ్డులేదు!’’ అని ఆమోదంతో ఆశీర్వదించాడు.
పరశురాముడు గోలోకంలో విష్ణువు మరొక రూపంగా ఉండే కృష్ణుణ్ణి ధ్యానించి, కృష్ణ కవచాన్ని పొందాడు. కృష్ణుడు అతనికి తన అంశను గొప్ప ధనుస్సుతో కలిపి ప్రసాదించి, రామావతారంలో తిరిగి తీసుకుంటానని చెప్పాడు. పరశురాముడు క్షత్రియులపై విజృంభించాడు. రాజుల దుష్పరిపాలనలో అగచాట్లు పడుతున్న జనానీకం అతని అండ చేరారు. కార్తవీర్యుడి కుమాళ్ళతో సహా హైహయులందరూ నగరం విడిచి పారిపోయారు.  పరశురాముడు ఆగ్నేయాస్త్రాన్ని నగరంపై వేశాడు. పరశురామ ప్రీతిగా మాహిష్మతీ రాజధాని ఇరవై ఒక్క రోజులపాటు జ్వాలల్లో నామరూపాల్లేకుండా దగ్ధమైపోయింది. కార్తవీర్యుడి వెయ్యిమంది కుమాళ్ళూ, హైహయవంశ క్షత్రియులూ, దేశ దేశాల రాజులందరూ కూడగట్టుకొని పరశురాముణ్ణి ఎదుర్కొన్నారు.

బలిపశువుల్ని నరికినట్లుగా పరశురాముడు అందర్నీ తెగటార్చి, వాళ్ళ రక్తాన్ని ఐదు మడుగుల నిండా నింపి, జమదగ్ని తలను వాటిలో ముంచి, ముంచి పితృతర్పణం చేశాక శాంతించి అగ్ని సంస్కారం జరిపాడు. శమంత పంచకం అనబడే ఆ అయిదు రక్తపు మడుగుల ప్రదేశమే తరువాతి కాలంలో కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మరొకసారి బలికోరింది. మహాభారత సంగ్రామంలో అక్కడే రక్తం వరదలై పారింది. పరశురాముడు యజ్ఞం చేసి శుచి చేసుకొని తండ్రికి ఉత్తరక్రియలు జరిపాడు. తరవాత క్షత్రియ.

సంహారానికి బయలుదేరాడు. వెతికి, వెతికి క్షత్రియుల్ని గండ్రగొడ్డలికి ఆహుతి చేశాడు. క్షత్రియ మాతలు వంశాంకురాలైన పిల్లల్ని బ్రాహ్మణుల ఇళ్ళల్లో దాచారు. తాము కూడా బ్రాహ్మణ కాంతలుగా వేషాలు మార్చుకొని, పసివాళ్ళను బ్రాహ్మణ బాలలుగా చేసి తలదాచుకొన్నారు. ఆ విధంగా పరశురాముడు ఇరవైఒక్క సార్లు దేశాలు గాలించి క్షత్రియులనిపించుకోనేవారు కనిపించకుండా దండయాత్రలు చేశాడు.

అతని ప్రతిజ్ఞ తీరింది. క్షత్రియ సంహారం చేశాక తన ఆధీనమైన భూమినంతటినీ కశ్యపుడికి దానంచేసి, వెళ్ళి దక్షణ సముద్రంలో ఉన్న మహేంద్ర పర్వతం మీద తపస్సులో నిమగ్నుడయ్యాడు. బ్రాహ్మణుల ఇళ్ళల్లో, మునుల ఆశ్రమాల్లో పెరిగి పెద్దవారైన క్షత్రియకుమారులందరికీ కశ్యప ప్రజాపతి పరశురాముడిచ్చిన రాజ్యాల భూముల్ని పంచి ఇచ్చాడు. రాజ్యాలు ఏర్పడ్డాయి.

రాజ వంశాలు తలలెత్తాయి. అటువంటి రాజవంశాల్లో ఇక్ష్వాకు సంతతికి చెందిన రఘుమహారాజు గొప్ప కీర్తిగాంచి, రఘువంశానికి మూలపురుషుడయ్యాడు.
రఘువంశంలో విష్ణువు దశరథమహారాజు పెద్ద కుమారుడుగా రామావతారం ఎత్తి, ఆదర్శ మానవత్వాన్ని ఆచరణలో చూపించాడు. రాక్షస సంహారం చేశాడు. రామరాజ్యంగా పేరు పొందేలాగ రాజ్య పాలన చేశాడు. రాజుగా ప్రజాభిమతాన్ని బట్టి ఎలాంటి త్యాగాన్నైనా చేయక తప్పదని నిరూపించాడు.

‘‘దశావతారాల్లో ఏడవది అయిన రామావతారం వాల్మీకిమహర్షి రచనలో రామాయణ మహాకావ్యంగా విశేషవ్యాప్తి పొందింది,’’ అని చెప్పి సూతమహర్షి రామకథను ప్రారంభించాడు. హిరణ్యకశిపుడూ, హిరణ్యాక్షుడూ, విష్ణువుచేత హతులై, రెండో రాక్షస జన్మగా రావణుడూ, కుంభకర్ణుడుగా పుట్టి అడ్డూ అదుపూ లేకుండా, లోకభ…యంకరులై విజృంభించారు. రావణాసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మవలన దేవ, …యక్ష, గంధర్వాదులెవ్వరిచేతా హానిలేని వరాన్ని పొందాడు. మానవమాత్రులు తన్నేం చే…యగలరనే నిర్లక్ష్యంతో నరులను కలపలేదు.

కుంభకర్ణుడు పర్వతాకారుడు. తపస్సు చేసి ఆరు నెలలు నిద్ర, ఆరు నెలలు జాగృతిగా వరం పొంది, మనుషుల్ని చంపి తింటూండేవాడు. రావణుడు, కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొని అతణ్ణి లంకనుంచి వెళ్ళగొట్టి, లంకానగరాన్ని స్వాధీనం చేసుకొని లంకేశ్వరుడై రాక్షసులైన వారినందర్నీ కూడగట్టుకుని, లోకాలు జయించి వీర విహారం చేశాడు. రావణుడు పదితలలవాడు.

కైలాసం వెళ్ళి మితి మించిన అహంకారంతో నందీశ్వరుడి ముఖాన్ని కోతిముఖమని వెక్కిరించి, కోతులవల్లనే లంకకు ముప్పు వాటిల్లుతుందని నందీశ్వరుడి శాపం పొందాడు. ఇరవైభుజాల తీటతీరేలాగ కైలాసాన్ని ఎత్తి, శివుడు కాలి బొటనవ్రేలితో నొక్కే సరికి పర్వతం కింద నలిగి పెద్ద పెట్టున ఆర్తారావం చేసి రావణుడు అనిపించుకున్నాడు. అంతకు ముందు దశకంఠుడని పిలువబడుతూండే రావణుడు ఒక్కొక్క తలను ఖండించుకొని శివుణ్ణి అనేక విధాలుగా స్తోత్రగానాలు చేసి, శివుడి అపార అనుగ్రహం పొందగలిగాడు.

రావణుడు ఎంత గొప్ప శివభక్తుడో, అంత దురహంకారి, ఎంతటి పరాక్రమ వంతుడో అంత దుర్మార్గుడు. పరస్ర్తీలను అపహరించుకు రావడం సాటిలేని ఘనత, ఎదురులేని వీరత్వంగా భావించి స్ర్తీలను చెరపట్టడం అతనికొక పరిపాటి అయింది. ఇష్టపడని కాంతను బలాత్కరించితే పదితలలు వెయ్యిచెక్కలౌతాయని శాపం కూడా సంపాదించుకున్నాడు.
రావణాసురుడి భార్య మండోదరి మయుని కూతురు. భర్త హితవు కోరి తరచూ హితవు చెబుతూండేది. అతని సవతి తమ్ముడు విభీషణుడు ఉత్తముడు.

అవకాశం వచ్చినప్పుడల్లా రావణుడికి మంచి చెబుతూండేవాడు. కాని, రావణుడు ఒకరు చెబితే వినేలాంటి వాడు కాదు. వింధ్యపర్వతానికి దక్షణాన వున్న భూభాగమూ, సముద్రమూ, ద్వీపాలూ రావణరాజ్యంగా, లంకా మహాసామ్రాజ్యంగా రాక్షస సమూహాలు స్థావరంగా చేసుకొని, నరభక్షకులై, ఆర్యావర్తంలో యజ్ఞయాగాదులు జరక్కుండా ధ్వంసం చేస్తూ, ఋషులను చిత్రహింసలు పెట్టి వినోదిస్తూ, ఊళ్ళూ ఆశ్రమాలూ తగలబెడుతూ చెలరేగుతూండేవారుకృశధ్వజుడు అనే రాజర్షి వేదం చదువుతూండగా పుట్టిన వేదవతి అనే కన్య విష్ణువును భర్తగా కోరుతూ తపస్సు చేస్తూండగా రావణుడామెతో విష్ణువు కంటే తానే అధికుడననీ, తనతో వచ్చేయమనీ ఆమె కొప్పు పట్టుకొన్నాడు. వేదవతి, ‘‘దురాత్మా! నీవు తాకిన శరీరం ఇప్పుడే విడుస్తున్నాను.

నీ లంకలోనే నా అంతట నేను పుట్టి నీ సర్వనాశనానికే కారణం ఔతాను! విష్ణువే నన్ను వరిస్తాడు!’’ అని చెప్పి తపోశక్తితో యోగాగ్ని రగుల్చుకొని ఆ క్షణమే దగ్థమైపోయింది. రాక్షస నిర్మూలనం చేసి లోకకల్యాణం చేకూర్చడం కోసం విష్ణువు భూలోకంలో అవతరించవలసిన తరుణం వచ్చింది. విష్ణువు మానవుడుగా, దేవతలు అసంఖ్యాకులైన వానరులుగా జన్మించారు.

విష్ణు కథ - 7

విష్ణు కథ - 7

బలిచక్రవర్తి సుతల లోకానికి చేరుకొని పాతాళసామ్రాట్టుగా ప్రతినిత్యం విష్ణు పాదాలను అర్చిస్తూ ఉన్నాడు. దేవతలకు స్వర్గమూ, దేవేంద్రుడికి స్వర్గాధిపత్యమూ తిరిగిలభించాయి. బలి వుండే సుతలలోక ద్వారాన్ని వేత్ర దండాన్ని పట్టుకొని వామన రూపుడైన విష్ణువు కాపలా కాస్తుండగా, ఒకప్పుడు రావణుడు సుతలాన్ని జయించాలని వెళ్ళాడు. ఈ పొట్టివాడు నన్నేం చే…ుగలడు అని ప్రవేశించబోగా, విష్ణువు మహెూన్నత ప్రమాణానికి భ…ుంకర రూపంతో పెరిగి కాలిగోటితో రావణుణ్ణి చిమ్మాడు.

ఆ విసురుకు రావణుడు లంకలో సొమ్మసిల్లి పడ్డాడు. తాను సుభిక్షంగా పాలించిన భూమ్మీద పంటలూ అవీ ఎలా ఉనాెూ్న పరివేక్షంచ డానికి సంవత్సరానికొకసారి బలిచక్రవర్తి అదృశ్యంగా వస్తాడు. సస్యాలకు పుష్ఠినీ, జీర్ణకారిత్వాన్నీ, బలాన్నీ కలుగజేస్తాడు. కీటక, క్రిమి బాధలు లేకుండా కాపాడు తాడు. అతని రాకకు స్వాగతంగా దీపావళి పండుగ అతి వైభవంగా జరుగుతుంది. మర్నాడు బలి పాడ్యమిగా బలిని భక్తితో పూజిస్తారు.

వామనుడి త్రివిక్రమాకాశ విజ…ూనికి గుర్తుగా ఆనందంతో ఆకాశదీపాన్ని పెడతారు. దక్షణమహాసముద్రంలో బలిచక్రవర్తి భూమ్మీదకు వచ్చే ద్వారంగా ఒక ద్వీపం ఏర్పడింది. అది బలిద్వీపంగా పేరొందింది. బలిచక్రవర్తి వంశీకులైన పల్లవచక్రవర్తులు అతనిపేరున మహాబలిపురాన్ని అత్యద్భుత శిల్ప సంపదలతో నిర్మించారు. కాంచీపురంలో ఉన్నతమైన త్రివిక్రమవామనావతార శిల్పాన్ని నెలకొల్పారు.

బలిచక్రవర్తి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. బలిచక్రవర్తి పాలనలో అణిగి మణిగి ఉండిన క్షత్రి…ుులు క్రమంగా తలలెత్తి విజృంభించారు. బలంగల వాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపో…ూరు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరోది అయిన పరశురామావతారం ఎత్తి అడవుల్ని  నరికినట్టుగా ఇరవై ఒక్కసార్లు క్షత్రి…ుుల్ని గండ్రగొడ్డలితో నిర్మూలించి, ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తూంటాడని నిరూపించాడు.

నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటీ, నా…ుకుడూ, సామ్రాట్టూ అయిన హైహ…ుచక్రవర్తి కార్తవీర్యార్జునుడు సుదర్శచక్రం అంశతో పుట్టాడు. ఒకానొక సమ…ుంలో విష్ణువు పాలకడలిలో శేషశ…్యుపై ెూగనిద్ర తీస్తూండగా శంఖచక్రాలు తమ తమ గొప్పలు చెప్పుకుని గర్వంతో వాదులాడుకున్నాయి. ‘‘సహస్రకిరణుడైన సూర్యుణ్ణి తరిణ బట్టిన రజంతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు. వెయ్యి కోణాలతో గిర్రున తిరుగుతూ బలవంతులైన అనేకమంది రాక్షసుల్ని నేనే కదా ఖండించింది! నన్ను ధరించి విష్ణువు ‘చక్రి’  అని ఖ్యాతి పొందాడు! నీకు వఠ్ఠి ధ్వని తప్పితే మరేదీ చేతకాదు!’’ అని చక్రం పలికింది.

పాంచజన్య శంఖం, ‘‘ఔరా, చక్ర పురుషా! ఎంత పొగరుగా మాట్లాడావు! భూమ్మీద పొగరుబోతైన రాజుగా పుట్టు! విష్ణువు మునికూమారుడై కటె్టలుకొటే్ట గొడ్డలి మాత్రంతో, నీ పొగరు అంత మొందిస్తాడు!’’ అని శాపం పలికింది. శాపం పొందిన చక్రపురుషుడు కార్త వీర్యార్జునుడై పుట్టి హైహ…ుసామ్రాజ్యాన్ని నాలుగు చెరగులా విస్తరింపజేశాడు. అతడు భగవంతుని అవతారమైన దత్తాత్రే…ుుడి భక్తుడు, శిష్యుడు. అతని అనుగ్రహంతో అణిమాది సిద్ధుల్నీ,అనేక శక్తుల్నీ పొందాడు.

అవసరమైనప్పుడు అనేక ఆ…ుుధాలతో వెయ్యి చేతులు వస్తూండేవి ... అని సూతమహర్షి చెప్పగా, నైమిశారణ్య మునులు, ‘‘సూత మునీంద్రా! దత్తాత్రే…ు చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాము!’’ అని అన్నారు. సూతుడు మునులకు దత్తాత్రే…ుకథ చెప్పడం ప్రారంభించాడు: అత్రిమహర్షికుమారుడికోసం విష్ణువును తలంచుతూ గొప్ప తపస్సు చేశాడు.

ఇటు అటు బ్రహ్మ, మహేశ్వరులతో కలిసి విష్ణువు ప్రత్యక్షమై, ‘‘అత్రిమహర్షీ! నేను నీకు దత్తుడిని అ…్యూను! మేము ముగ్గురమూ ఒక్కటే కనుక త్రిమూర్తుల అంశలతో నేను నీకు కొడుకునౌతాను! దత్తాత్రే…ుుడిగా పిలువబడతాను!’’ అని చెప్పి బ్రహ్మమహేశ్వర సహితంగా అంతర్థానమ…్యూడు. అదే సమ…ుంలో నారదుడు త్రిమూర్తుల అర్ధాంగులమని గర్విస్తూన్న సరస్వతి, లక్ష్మి, పార్వతుల ముందు అత్రిమహాముని భార్య అనసూ…ు పాతివ్రత్య మహిమ సాటిలేనిదని సహేతుకంగా నిరూపించాడు.

త్రిదేవీమూర్తులకు సాధ్యం కాని పనులు చేసింది ఆమె. అనసూ…ు గంగను పీడిస్తున్న పాప పిశాచాలను నిర్మూలించింది. నారదుడిచ్చిన ఇనుప గుగ్గిళ్ళను కమ్మగా పచనం చేసి ఇచ్చింది. సూర్యుణ్ణి ఉదయించకుండా చేసిన సుమతిని ఒప్పించి, సూర్యోద…ుమైతే చనిపోయిన ఆమె భర్తను అనసూ…ు తిరిగి బ్రతికించింది. దేవీమూర్తులు ముగ్గురికీ అనసూ…ుపై పట్టరాని ఈర్ష్యపుట్టింది.

భర్తలు రాగానే అనసూ…ును భంగపుచ్చి రమ్మని పంపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు  వేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీభిక్షాందేహి  అని నిలబడ్డారు. అప్పటికింకా అత్రిమహాముని తపస్సు ముగించి ఆశ్రమానికి చేరలేదు. అతిథి సత్కార బాధ్యతలన్నీ అనసూ…ు మీదనే పెట్టి వెళ్ళాడు. అనసూ…ు అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు అతిథి మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది.

అప్పుడు కపట…ుతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘ఓ సాధ్వీ! మాకొక విడువరాని ని…ుమమున్నది - అది అది ...’’ అని నసుగుతూ, ‘‘నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేదిలేదు!’’ అని అన్నారు. అనసూ…ు, ‘‘అలాగా! సరే!’’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే ముగ్గురు పసిపాపలైపో…ూరు. అనసూ…ుకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది.

ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూ…ు ఒడిలో కమ్మగా నిద్రలోకి జారిపో…ూరు. అనసూ…ు ముగ్గుర్నీ ఉ…్యూలతొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. అదృష్టం అంటే నాదే! బ్రహ్మాండమే వీళ్ళకు ఉ…్యూలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’  అంటూ అత్యంత మధురంగా జోలపాడింది.

అప్పుడే ఆశ్రమంలోకి ఒక తెల్లని లేగ ఎద్దు ప్రవేశించి ద్వారం ముందు నిలబడి తలాడిస్తూ మువ్వల సవ్వడి చేసింది. పెద్ద గరుడపక్ష రెక్కలల్లార్చుతూ ఆశ్రమం మీద తిరగసాగింది. ఒక రాజహంస వికసిత పద్మాన్ని కరుచుకొని ఎగురుతూ వచ్చి గుమ్మం ముందు వాలింది. ముద్దొచ్చే నాలుగు రంగుల కుక్క పిల్లలు తోకలాడిస్తూ, ఇంట్లోకి చొరబడ్డాయి. వాటికి తోడు ఒక నాగుపడగ విప్పి ఆడుతూ వచ్చింది.

అంతలో మహతి వీణపై నీలాంబరి రాగాన్ని పలికిస్తూ నారదుడూ, అతని వెనుక లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చారు. నారదుడు అనసూ…ుతో, ‘‘అమ్మా, ఈ ముగ్గురమ్మల భర్తలకు చెందిన ప్రాణులు గుమ్మంలో కనిపిస్తూంటే, వాళ్ళిక్కడే ఉంటారని ఇలా వచ్చారు. ఇప్పటికే భర్తల ఎడబాటు వల్ల విరహంతో తల్లడిల్లిపోతున్నారు. వారి భర్తల్ని వారి కిప్పించు!’’ అన్నాడు. అనసూ…ు ముగ్గురమ్మలకూ నమస్కరించి సవిన…ుంగా, ‘‘తల్లులూ! ఆ ఊ…ులలో పసివారే మీ వారైతే తీసుకెళ్ళండమ్మా!’’ అన్నది. దేవీమూర్తులు ముగ్గురూ నివ్వెరబోయి చూశారు. పసివారు ముగ్గురూ ఒక్కలాగే ఉన్నారు. ఒకటిగా నిద్రపోతున్నారు. లక్ష్మి పార్వతి సరస్వతులు తట పటా ఇస్తూంటే, నారదుడు, ‘‘ఎవరి భర్తను వారు ఎరక్కపోవడమేమిటి? సిగ్గుపడకండమ్మా

త్వరగా తీసుకోండమ్మా!’’ అంటూ తొందరచే…ుగా, ఒక్కొక్కరొక పిల్లవాణ్ణి తీసుకున్నారు. పిల్లవాళ్ళు ముగ్గురూ ఒక్కసారిగా త్రిమూర్తులుగా నిలబడ్డారు. సరస్వతి శివుణ్ణి, లక్ష్మి బ్రహ్మను, పార్వతి విష్ణువును తీసుకున్నట్లు అప్పుడు తెలిసింది. ముగ్గురమ్మలూ సిగ్గుపడుతూ దూరంగా వెళ్ళి నిల్చున్నారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరసగా కలిసిపోేులాగ అంటి పెట్టుకొని నిల్చున్నారు.

అదేసమ…ూనికి అత్రి ఇంటికి చేరుకున్నాడు. తన ఇంట త్రిమూర్తులను చూసి చేతులు జోడిస్తున్నంతలో, బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రే…ుుడు రూపొందాడు. మధ్య విష్ణువు, ఇటు అటు బ్రహ్మమహేశ్వరుల ముఖాలతో, ఆరు చేతులతో శంఖ, చక్ర, గదా పద్మాలు, త్రిశూలం కమండలంతో, భుజాన వ్రేలాడే జోలెలో భిక్షాపాత్రతో, త్రిమూర్తుల సమ్మేళన మూర్తిగా విష్ణువు దత్తాత్రే…ూవతారంతో అత్రి, అనసూ…ుల కుమారుడైనాడు. నారదుడు నాదనామక్రి…ూ రాగంతో వీణమ్రోగిస్తూ దత్తాత్రే…ుుణ్ణి స్తుతించాడు. శివుని వాహనమైన నంది దూడ ఎద్దుగా అతని వెనుక ఉంటుంది.

నాలుగు వేదాలు నాలుగు కుక్కలరూపుతో వెంట ఉంటాయి. సర్పము, గ్రద్ద, హంస పరిసరాల్లో అనుసరిస్తూంటాయి. దత్తాత్రే…ుుడు మహర్షిగా సదా వనాల్లో తిరుగుతూ ఏకాంతంగా ఆత్మానుసంధానంలో ఉంటాడు. అనేక దివ్యశక్తులను, సిద్ధులను ప్రసాదించే దత్తాత్రే…ుుణ్ణి మునులు, సిద్ధులు, జ్ఞానులు సదా ఆరాధిస్తూంటారు. హైహ…ు రాజవంశానికి ఆరాధ్యదైవంగా పూజింపబడ్డాడు.

కార్తవీర్యార్జునుడు దత్తాత్రే…ుుణ్ణి అర్చించి మహాబలసంపన్నుడై, సైన్యాలతో విజ…ు…ూత్ర బ…ులుదేరాడు. జమదగ్ని మహర్షి కుమాళ్ళలో రాముడు చివరివాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలూ, జనపదాలూ నిర్మించడానికీ, భూమిని సాగుచే…ుడానికీ అనుకూలంగా అరణ్యాలు నరుకుతూండడమే అతని పని. హిమాల…ూల్లో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు అతనికి గొప్ప ప్రభావంగల పరశువును ప్రసాదించాడు. ఆ గొడ్డలిని ధరించి పరశురాముడు అని పేరుపొందాడు.

భృగుసంతతి వాడవడం వల్ల భార్గవరాముడు అని కూడా పిలువబడ్డాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి  రేణుకాదేవి నదికి వెళ్ళి ఎంతసేపటికీ రాలేదు. జమదగ్ని దివ్యదృష్టితో భార్య ఏం చేస్తూందో చూశాడు. చిత్రరథుడనే ఒక గంధర్వుడు అప్సరసలతో జలక్రీడ చేస్తూంటే, రేణుక ఆ విలాసాన్ని మైమరచి చూస్తూ ఉండిపోయింది. జమదగ్నికి కోపం వచ్చింది. భార్య వచ్చాక కుమాళ్ళను పిలిచి తల్లి తల  నరకమన్నాడు.

పరశురాముని అన్నలు అంత పని చే…ులేక పో…ూరు. అడవి నుంచి వచ్చిన పరశురాముడితో జమదగ్ని, ‘‘నీ అన్నల తలలనూ, మీ అమ్మ తలనూ నరుకు!’’ అని అన్నాడు. పరశురాముడు మారాడకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి, ఒక వేటున అన్నలనూ, తల్లినీ తెగటార్చాడు. జమదగ్ని పరశురాముణ్ణి మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘‘అన్నల్నీ, అమ్మనూ బ్రతికించు!’’

అన్నాడు పరశురాముడు. జమదగ్ని అలాగే వాళ్ళను బ్రతికించాడు. తన తపోమహిమ పట్ల పరశురాముడికి గల విశ్వాసానికీ, సూక్ష్మబుద్ధికీ జమదగ్ని ఎంతగానో  సంతసించి, ‘‘పరశురామా! నీవు కారణజన్ముడివి. చిరంజీవిగా ఉంటావు!’’ అని ఆశీర్వదించాడు. కార్తవీర్యార్జునుడు విజ…ు…ూత్ర ముగించి తన రాజధాని మాహిష్మతీ నగరానికి వెళ్తున్న దారిలో, జమదగ్ని ఆశ్రమం తగిలింది.

అప్పుడు రాజూ, పరివారమూ, సైన్యాలూ ఆకలితో ఉన్నారు. జమదగ్ని కామధేనువు అంశగల తన హెూమధేనువు మూలంగా వారందరికీ గొప్ప విందుచేశాడు. ఆ ఆవు ఏది కావలిస్తే అది ఎంత మందికైనా ఇస్తుంది. కార్తవీర్యుడు అలాంటిది తన దగ్గర ఉంటే సైన్యాలకు తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకో వచ్చుననే దురాశతో సైనికులకు ఆవును మాహిష్మతి నగరానికి తోలుకురమ్మని ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరులైన సైనికులు నేలకు త్రోసి ఆవును ఈడ్చుకెళ్ళారు.