సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, August 5, 2014

ఓమ్ నమశివహోః

ఓమ్ నమశివహోః on Make A Gif
make animated gifs like this at MakeAGif
ఓమ్ నమశివహోః
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః 

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే) సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు.

శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు.

Monday, August 4, 2014

అన్నపూర్ణాస్తుతిః

http://tvramudu.blogspot.com/పంచామృతo

అన్నపూర్ణాస్తుతిః 
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ| 
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧|| 
నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨||
వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

యొగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ|
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౩||
యొగముచే పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు, మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ
కౌ మారీ నిగమార్థగొచకరీ హ్యొంకారబీజాక్షరీ|
మొక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౪||
కైలాస పర్వత గుహయందుడు దానవు, తేల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును భొధించు దానవు, ఒంకార బీజాక్షరస్వరూపము కలదానవు, మొక్షద్వారపు తలుపులను తేరచేడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౫||
కనబడీ కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు, లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౬||
’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ|
సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౭||
భూమియందలి సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు, స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మొక్షమునిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయొధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౮||
దేవివి, విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తేవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము.

చన్ద్రార్కానలకొటికొటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ
చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|
మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౯||
కొట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే ఏర్రనైన క్రింది పేదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలే ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧౦||
వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ ఆనందము కల్గించు దానవు, ఏల్లప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు రాణివి, శొభిల్లు దానవు, దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపేట్టుము.

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||౧౧||
ఒ అన్నపూర్ణా| ఏల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపేట్టుము.

మాతా చ పార్వతీ దేవి పితా దేవొ మహేశ్వరః|
బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశొ భువనత్రయమ్||
తల్లి పర్వతీ దేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, మూడులొకములు స్వదేశము.

శ్రీకాళహస్తీశ్వర శతకము.

http://tvramudu.blogspot.com/పంచామృతo

శ్రీకాళహస్తీశ్వర శతకము. 
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివే / కుల్ జీవనభ్రాంతులై! 
కొడుకుల పుట్టరె కౌరవేంధ్రునకనే / కుల్,వారిచే నేగతుల్
పడసెన్? పుత్రులులేని యా శకునకున / వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ / శ్రీకాళహస్తీశ్వరా!

ధూర్జటీ

#శ్రీకాళహస్తీశ్వర శతకము.
శ్రీకాళహస్తీశ్వరా!లోకంలో కొందఱు కొడుకుఅను కనలేక పోతిమి అని భాదపడెదరు.దృతరాష్ట్రునికి వందమంది పుత్రులు పుట్టలేదా?వారివలన యే సద్గతులు ఆయనకు కల్గినవి?పుత్రులులేని శుక మహర్షికి దుర్గతులు కల్గలేదు గదా!పుత్రులు లేని వారికి మోక్షము లభ్యము కాదా?అనగా పుత్రులు లేకపోయినను ముక్తిని పొందవచ్చును అని భావమ

  1. #ఓం నమః శివాయ
    నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
    జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
    కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
    చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!
    ...
    #శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును.
    || తన్మే మనః శివ సంకల్పమస్తు ||
    ''లింగ్యతే జ్ఞాయతే అనేన ఇతి లింగం'. లింగం అంటే చిహ్నం, గుర్తు, ప్రతిరూపం అని అర్దం''.

    మనకు లింగార్చనలో వివిధ రకాల లింగాలున్నాయి. వాటిలో రెండూ స్థావర లింగం, జంగం లింగం. #స్థావరములంటే కదలనివి, చెట్లు, లతతలు తీగలు వంటివి. ఇవి కూడా శివలింగానికి ప్రతిరూపాలు.#జంగమాలంటే కదిలేవి. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, చీమలు మొదలైనవి.అలాగే ప్రతి మనిషి కూడా 7 చక్రాలు కలిగి ఉన్న ఓక #శివలింగం. ఆత్మశక్తి కూడా లింగాకారంలో ఉంటుంది. ఇవన్నీ శివ లింగాలు అంటే #శివుడు ప్రతిరూపాలు.

    #శివం అంటే శుభం, ప్రాణం, ఆత్మ. రుద్ర నమక-చమకాలు ఈ సమస్త బ్రహ్మాండమంతా శివుడే అని, సర్వం శివ మయం జగత్ అని వర్ణిస్తోంది.

    స్వయంగా #శివమహాపురాణంలో పరమశివుడే చెప్పాడు, చెట్లు, లతలు, మొక్కలు స్థావరలింగాలు కనుక వాటికి నిత్యం నీరు పెడితే అది తన అర్చనగా భావిస్తానన్నాడు. జంతువులు, పక్షులు, క్రిమికీటకములకు #నిత్యం ఆహారం, నీరు అందిచడం కూడా తనకు చేసే #ఆరాధనగా స్వీకరిస్తానని చెప్తాడు.

    ఈ #వేసవి కాలంలో ఆహారం, నీరు లేక అనేక జంతువులు, పక్షులు మరణిస్తుంటాయి. చెట్లు ఎండిపోతుంటాయి. కనీసం మన ఇంటి చుట్టు ఉండే చెట్లకు నీరు పోయండి. పక్షుల కోసం మీ ఇంటి ముందు గోడల మీద, ఇంటి పైకప్పు మీద మట్టిముంతలో ప్రతి రోజు శుభ్రమైన త్రాగు నీరు పెట్టండి. కుక్క #కాలభైరవుడికి ప్రతీక. శివగణాల్లో ఒకటి. వీధిలో ఏ దిక్కులేని కుక్కలకు వీలైతే ఆహారం పెట్టండి. కనీసం నీరైన అందుబాటులో ఉంచండి.

    అనేక మంది వేసవికి దాహంతో అల్లాడిపోతారు. వీలైతే చలిచేంద్రాలు ఏర్పాటు చేసి, వారి దాహం తీర్చండి. ప్రచారం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు, #పరమేశ్వరుని సేవకు ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రతి ఒక్కరిలోనున్న పరమశివుడు, అవి తనకు సమర్పించినవిగా, వాటిని పరమ సంతోషంగా స్వీకరిస్తాడు. తప్పక అనుగ్రహిస్తాడు.

    #పరమాత్ముడు ఈ సమస్త సృష్టిలో ప్రతి అణువులో ఉన్నాడు. మనం మన తోటి జీవుల జీవనం కోసం చేసే ప్రతి చిన్న సహాయాన్ని ఆయన అర్చనగా భావిస్తాడు. #శివతత్వాన్ని అర్దం చేసుకోండి. పరమేశ్వరుడి సృష్టిని గౌరవించండి. సర్వజీవుల యందున్న #పరమేశ్వరుడిని గుర్తించి ఆరాధించండి.
    || తన్మే మనః శివ సంకల్పమస్తు ||
     










ఓం నమశ్శివాయ


ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ భవ్య యోగదాయకాయతే
నం నమశ్శివాయ దేవనాథ సంస్తుతాయతే
మం నమశ్శివాయ సర్వమంగళాన్వితాయతే
శిం నమశ్శివాయ శైల శృంగమందిరాయతే
వం నమశ్శివాయ లోక భద్రకారణాయతే
యం నమశ్శివాయ సంతతాభయప్రదాయతే
నమో నమో నమశ్శివాయ నాదనందితాయతే
నమో నమో నమశ్శివాయ నాగభూషణాయతే
నమో నమో నమశ్శివాయ నందివాహనాయతే
నమో నమో నమశ్శివాయ నారదస్తుతాయతే

మహీధరేంద్ర రమ్య శృంగ మందిరాయ తేనమః
మహీధరేంద్రజాన్వితాయ మద్ధితాయ తేనమః
మహేశ్వరాయ దివ్యరూప మండితాయ తేనమః
మహాద్భుతార్థ దాయకాయ మంత్రనూర్తయే నమః
శివాయ సర్వలోకనాథ సేవితాయ తేనమః
శివాయ శీత శైలరాజ శృంగ వాసినే నమః
శివాయ చిత్ప్రభాకరాయ శ్రీకరాయ తేనమః
శివాయ శంకరాయ యోగ సిద్ధిదాయ తేనమః

వారిజాక్ష సేవితాయ భద్రమూర్తయేనమః
వారిజాసనాదిదేవ వందితాయ తేనమః
వాహినీధరాయ భక్తవత్సలాయ తేనమః
వాగ్విశేష సంస్తుతాయ భాగ్యదాయ తేనమః
యజ్ఞ పూరుషాయ పావనాలయాయ తేనమః
యక్షరాట్సఖాయ సంశ్రితార్తిహాయ తేనమః
యామినీశ శేఖరాయ హర్షదాయ తేనమః
యత్నసిద్ధిదాయ వాసవర్చితాయ తేనమః!!

మహా మృత్యుంజయ మంత్రం:

 మహా మృత్యుంజయ మంత్రం:


మహా మృత్యుంజయ మంత్రం:
''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్!!
#ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.

#తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు#బంధనము నుండి విడిపించు గాక!

#ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది.#క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని#పారాయణం చేస్తారు.

ఈ మహా #మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మంత్రాన్ని #త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “#మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

#ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ #జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం.#యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.#ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి,#పరబ్రహ్మస్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

#త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు #త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి #మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.
#యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి.#సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ,#హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

#సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత #ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన#లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
#పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు.#చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న #శివలింగంపైపడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో,#శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
#ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

#మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం.#మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను #సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.
#అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
#శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.
~~~~~~~~~~~~~~~!!ఓం నమః శివాయ!!~~~~~~~~~~~~~~~~~

ఉమామహేశ్వర స్తోత్రం

ఉమామహేశ్వర స్తోత్రంhttp://tvramudu.blogspot.com/పంచామృతo
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

 ఉమామహేశ్వర స్తోత్రం

శంకరా నాథ శరీరాపరా

 శంకరా నాథ శరీరాపరా
శంకరా నాథ శరీరాపరా..వేదవిహరాహర జీవేశ్వరా||శంకరా||

ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని
మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ రాగమే యోగమని||
నాదో పాసన చేసిన వాడను నీవాడను నేనైతే
||శంకరా||
రిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర శిఖ కందరా నీలకంఠరా
క్షుద్రులెరుగని రుద్ర వీణ నిర్నిద్ర గానమిది
అవతరించరా.. విని తరించరా..
||శంకరా||
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివగంగ
నా గానలహరి నువు మునగంగ ఆనంద వృష్టి నే తడవంగ
ఆ....ఆ
||శంకరా||

శ్రీశివప్రాతః స్మరణమ్

 శ్రీశివప్రాతః స్మరణమ్
శ్రీశివప్రాతః స్మరణమ్
స్మరామి భవభీతిహారం సురేశం
గంగాధరం వృషభవాహనం మంబికేశం /

ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 1

ప్రాతర్నమామి గిరిశం గిరిజార్ధదేహం
సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం /

విశ్వేశ్వరం విజిత విశ్వమనో భిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 2

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాన్తవేద్య మనఘం పురుషం మహన్తం /

నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 3

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే నుదినం పఠంతి /

తే దుఃఖజాతం బహుజన్మసంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో // 4
!!ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్!!

Wednesday, April 9, 2014

కైలాసం

 కైలాసం
సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
 కైలాసం
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.

మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.
సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి ( గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.

మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం.

కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది

Tuesday, April 1, 2014

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ
 ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ భవ్య యోగదాయకాయతే
నం నమశ్శివాయ దేవనాథ సంస్తుతాయతే
మం నమశ్శివాయ సర్వమంగళాన్వితాయతే
శిం నమశ్శివాయ శైల శృంగమందిరాయతే
వం నమశ్శివాయ లోక భద్రకారణాయతే
యం నమశ్శివాయ సంతతాభయప్రదాయతే
నమో నమో నమశ్శివాయ నాదనందితాయతే
నమో నమో నమశ్శివాయ నాగభూషణాయతే
నమో నమో నమశ్శివాయ నందివాహనాయతే
నమో నమో నమశ్శివాయ నారదస్తుతాయతే

మహీధరేంద్ర రమ్య శృంగ మందిరాయ తేనమః
మహీధరేంద్రజాన్వితాయ మద్ధితాయ తేనమః
మహేశ్వరాయ దివ్యరూప మండితాయ తేనమః
మహాద్భుతార్థ దాయకాయ మంత్రనూర్తయే నమః
శివాయ సర్వలోకనాథ సేవితాయ తేనమః
శివాయ శీత శైలరాజ శృంగ వాసినే నమః
శివాయ చిత్ప్రభాకరాయ శ్రీకరాయ తేనమః
శివాయ శంకరాయ యోగ సిద్ధిదాయ తేనమః

వారిజాక్ష సేవితాయ భద్రమూర్తయేనమః
వారిజాసనాదిదేవ వందితాయ తేనమః
వాహినీధరాయ భక్తవత్సలాయ తేనమః
వాగ్విశేష సంస్తుతాయ భాగ్యదాయ తేనమః
యజ్ఞ పూరుషాయ పావనాలయాయ తేనమః
యక్షరాట్సఖాయ సంశ్రితార్తిహాయ తేనమః
యామినీశ శేఖరాయ హర్షదాయ తేనమః
యత్నసిద్ధిదాయ వాసవర్చితాయ తేనమః!!

Monday, March 31, 2014

ఓంకారం

ఓంకారం 
 ఓంకారం

"ఓం" బ్రహ్మ స్వరూపత్వం. "ఓం" పదం శబ్ద బ్రహ్మం. "ఓం"కారం అక్షర పరబ్రహ్మ స్వరూపం.
ప్రణవోహి పరబ్రహ్మ పణవః పరమం పదం
ప్రణవం సర్వవేదాధ్యం సర్వదేవమాయం విద్దు:!!
ప్రణవమే - పరబ్రహ్మం, ముక్తి, వేదాలకు మూలం, సకలదేవతలమయమైంది.

సృష్టాదిన #బ్రహ్మదేవుని కంఠంనుండి వెలువడిన శబ్దములు రెండు. మొదటిది 'ఓం'కారం. రెండవది 'అధః'. కావున ఈ రెండును పరమ పవిత్రమైన మంగళశబ్దములు. విధాత ప్రప్రధమమున ఓంకారమునే ఉచ్చరించెను. ఏ యొక్క పరమాత్మ శక్తి చేత తాను సృష్టికి శక్తిమంతుడయ్యనో, అట్టి పరబ్రహ్మం యొక్క స్వరూపం ఓంకారమనియు, అది దేవతలకు, సర్వజనులకు ధ్యేయమనియు తెలిపెను.

భగవన్ కిం తదాదౌ ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం
కిం తద్ధ్యానం కో వా ధ్యాతా కశ్చ ధ్యేయః!!

అథర్వశిఖోపనిషత్తు
భావం_ ఓ భగవంతుడా! ఆదికాలమునందు బ్రహ్మాది దేవతలు ఉపయోగించినది ఏది? ధ్యానము ఏది? ధ్యానింపదగినది ఏది? ధ్యానమునకు సాధనమయ్యేది ఏది? ధ్యాత ఎవడు? ధ్యేయం (మంత్రముచే తెలుసుకొనదగినది) ఏది?

సఏభ్యో థర్వా ప్రత్యువాచ ఓ మిత్యక్షరమేతదాదౌ
ప్రయుక్తం ధ్యానం ధ్యాయితవ్యం!!

#అథర్వశిఖోపనిషత్తు
భావం_ ప్రణవాక్షరమే ఆదియందు ఉపదేశింపబడింది. అదియే ధ్యానం. దానినే ధ్యానింపవలయును.

సకృదుచ్ఛరిత మాత్ర ఊర్ధ్వమున్నామయతీత్యోంకారః!!

#అథర్వశిఖోపనిషత్తు
ఒక్కమారు ప్రణవం (ఓం) ఉచ్చరించినమాత్రముననే శ్రేష్టగతిని (పరమపదంను) చేర్పించుటంబట్టి ఓంకారమనబడును.

ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయితీ త్యేతస్మాత్ ప్రణవః
ప్రణవం అంటే సర్వప్రాణములను పరమాత్మునియందు లగ్నం చేయునది అని అర్ధం.

సర్వేవేదా యత్పదమామనన్తి తపాగ్మ్ సి సర్వాణి చ యద్వదంతి
యదిచ్చంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తే పదగ్మ్ సంగ్రహేణ బ్రవీమ్యో మిత్యేతత్!!
కఠోపనిషత్తు
#భావం_ వేదములన్నియు ఏ వస్తువును పొందదగినదానినిగా చెప్పుచున్నవో, తపస్సులన్నియు దేనిని ఆచరింపమని చెప్పుచున్నవో, దేనిని కోరుచున్నవారై బ్రహ్మప్రాప్త్యర్ధం అగు బ్రహ్మచర్యం ఆచరించుచున్నారో ఆ వస్తువును గూర్చి నీకు సంగ్రహముగా భోదించుచున్నాను - అదే "ఓం".
"ఓం" అనే పదమే అవినాశి అయిన పరబ్రహ్మం. అదే ఈ బ్రహ్మాండం-విశ్వం. ఇప్పటివరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇకపై ఉండబోయేది అంతా ఓం అనే పదమే.
ఓంకార వివరణ_
అకార, ఉకార, మకారములతో కూడినది ఓంకారం.
అక్షరములలో అకారం మొదటిది. ఈ శబ్దం కంఠంనుండి పుట్టుచున్నది. ఇది ప్రణవం యొక్క ప్రధమమాత్రయు, బ్రహ్మయు,బ్రహ్మశక్తి సృష్టియు అగుచున్నది.
ఉకారశబ్దం దవడల మధ్యనుండి ఉద్భవించుచున్నది. ఇది #ఓంకారం యొక్క ద్వితీయమాత్రయు, విష్ణువై ఉన్నది. విష్ణుశక్తి స్థితియు అయివున్నది.
మకారశబ్దం పెదవుల కొసనుండి జనించును. ఇది ప్రణవం యొక్క తృతీయమాత్రయు, మహేశ్వరుడును, శివశక్తి లయ మగుచున్నది.
కంఠంనుండి అకారధ్వని ఆరంభించి ఓష్టాన్తమున అంతమగుటచే(లయమగుటచే) అన్ని అక్షరములు(శబ్దములు) ఈ మూడింటి ఆదిమధ్యాన్తములలో ఉద్భవించుట చేత వేదములన్నియు ఈ ఓంకారమునుండియే ఏర్పడినవని శ్రుతివాక్యం. కావున ఈ #ఓంకారం ఒకదానిని పఠించినచో వేదములన్నింటిని చదివినవారగుదురని ఋషులు చెప్పెదరు.

ప్రణవం హీశ్వరం విద్యాత్సర్వస్య హృది సంస్థితం
సర్వవ్యాపినమోంకారం మత్వా ధీరో న శోచతి!!
జనుడు స్మరణజ్ఞానమునకు స్థానమైన హృదయమునందున్నఈశ్వరుని ఓంకారముగా తెలుసుకోవలెను. ఇట్లు సర్వవ్యాపకమైన ఓంకారమును తెలుసుకొన్న జ్ఞాని శోకనిమిత్తమైన అజ్ఞానాది నాశమగుటవలన దుఃఖింపడు.
'ఓంకార ఆత్మేవ' ఓంకారం ఆత్మయేనని నిర్వచింపబడింది.
'తస్య వాచకః ప్రణవః' నిర్గుణ పరమాత్మ స్వరూపమును తెలుపునట్టి సమర్ధమైన శబ్దం ఒక్క ఓంకారం మాత్రమే.
'అక్షరమంబరాన్త ధృతే:!! (బ్ర.సూ). పృధివి మొదలు ఆకాశం వరకు గల పంచభూతములను ధరించుటవలన అక్షరశబ్దముచే (ఓంకారముచే) చెప్పబడునది పరబ్రహ్మమే.

ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసానిశితం సందదీత!
ఆయమ్య తద్భావగతేనా చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి!!

ముండకోపనిషత్తు
#భావం_ ఉపనిషత్తులలో ప్రసిద్ధమగు, గొప్పఅస్త్రంవంటింది అగు (ప్రణవమగు) ధనస్సును గ్రహించి ఉపాసనంచేత పదునుపెట్టబడిన (ఆత్మయను) బాణమును ఎక్కుపెట్టవలయును. ఆ అక్షరబ్రహ్మమునందు (ధ్యానంను పొందిన చిత్తంచేత లాగి ఆ పూర్వం చెప్పియుండెడి) లక్ష్యమునుకొట్టవలయునని తెలుసుకొనుము.

ప్రణవో ధనుశ్శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే!
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్!!
భావం_ ఓంకారం ధనుస్సు, జీవాత్మయే బాణం,అక్షర పరబ్రహ్మమే ఆ బాణమునకు గురికావల్సిందిగా చెప్పబడెను. సావధానమగు (ఏకాగ్రత) మనస్సు కలవానిచేత కొట్టబడవలెను. ఆ బాణమువలనే జీవుడు లక్ష్యమగు బ్రహ్మముతో పరమసామ్యము పొందెను.

 ఓంకారం

యోగాలలో ఓంకారము ఎంతో ప్రముఖమైనది.
వేదాలయందు తాను 'ఓం'కారము అయినట్లు గీతలో భగవానుడు తెలిపాడు.
వేదాల యందు సారము ఓంకారము అని తెలియుచున్నది.
'సర్వదేదేషు' అని తెలపటం వల్ల సమస్త వేదముల యొక్క సారము ఓంకారమే అని స్పష్టమగుచున్నది. కావున ప్రణవము జపించునపుడు, ప్రణవార్థవమును చింతించుచు, ప్రణవ వాద్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన, పరమ శ్రేయస్సు లభించగలదు.
ప్రాణాయామము చేయు యోగ సాధకులు, శరీరం, కంఠం, శిరస్సు తిన్నగా నిలిపి, తమ కళ్ళు మూసుకొని, యోగనిష్ఠలో ఓంకారాన్ని ఉచ్ఛరించాలి.
ఓంకారమును శక్తివంతముగాను, దీర్ఘముగా, నిదానముగా ఉచ్ఛరించి, ఆ శబ్ధాన్ని నిశ్శబ్ధంలో లయం చేయాలి.
హృదయమే ఆకాశము,నేత్రములు సూర్యచంద్రులు,శోత్రములు దిక్కులు,పాదములు భూమి,ప్రాణము వాయువు,రక్తము జలము,పరమాత్మ యొక్క శక్తి మూలకముగా ఇవి ప్రకాశవంతమవుతున్నాయి.దేవుడు అంటే ఒక శక్తి అని, ఆ శక్తియే సృష్టిని సృష్టించింది అని, సృష్టిని సృష్టించిన దేవుడు మనిషిని కూడా సృష్టించాడు అని, సృష్టికి కావలసిన పంచభూతాలు, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి (పృధ్వి) మనిషిలో కూడా ఉన్నాయి. అవి సృష్టి నడవటానికి కారణములు అయినట్లు, మనిషి కూడా ఆ కారణముల వల్లనే జీవిస్తున్నాడు అని, పంచభూతముల లోను, దేవుని శక్తి మూలకంగానే (ఆయన శక్తి వాటిలో ఉండటం వల్లనే) అవి పనిచేస్తున్నాయి. అదే విధంగా అణువు కన్నా చిన్న ఆకారంలో ఓంకార రూపంలో ఉన్న పరమాత్మ యొక్క శక్తి మూలకంగానే మనిషి జీవితం, చావు పుట్టుకలు జరుగుతున్నాయి.




శ్రీశివప్రాతః స్మరణమ్

శ్రీశివప్రాతః స్మరణమ్
 శ్రీశివప్రాతః స్మరణమ్

స్మరామి భవభీతిహారం సురేశం
గంగాధరం వృషభవాహనం మంబికేశం /

ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 1

ప్రాతర్నమామి గిరిశం గిరిజార్ధదేహం
సర్గ స్థితి ప్రళయకారణ మాదిదేవం /

విశ్వేశ్వరం విజిత విశ్వమనో భిరామం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 2

ప్రాతర్భజామి శివమేక మనంతమాద్యం
వేదాన్తవేద్య మనఘం పురుషం మహన్తం /

నామాది భేదరహితం షడ్భావశూన్యం
సంసార రోగహర మౌషధ మద్వితీయం // 3

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యే నుదినం పఠంతి /

తే దుఃఖజాతం బహుజన్మసంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో // 4
!!ఇతి శ్రీ శివ ప్రాతఃస్మరణమ్!!

మృతసంజీవన స్తోత్రం.

మృతసంజీవన స్తోత్రం
 మృతసంజీవన స్తోత్రం

ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || 1 ||

సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ |
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || 2 ||

సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || 3 ||

వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః |
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || 4 ||

దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |
సదాశివోzగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || 5 ||

అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః |
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాzవతు || 6 ||

ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః |
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాzవతు || 7 ||

పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః |
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || 8 ||

గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |
వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || 9 ||

శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః |
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || 10 ||

శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః |
ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః || 11 ||

ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాzధః సదాzవతు |
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః || 12 ||

భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేzవతు |
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః || 13 ||

నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోzవతు || 14 ||

మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ || 15 ||

పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః || 16 ||

కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః || 17 ||

జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః || 18 ||

గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః || 19 ||

సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ || 20 ||

మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ || 21 ||

యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః |
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే || 22 ||

హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన || 23 ||

కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః || 24 ||

యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్ |
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే || 25 ||

న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా || 26 ||

ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ || 27 ||

సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః |
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః || 28 ||

విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ || 29 ||

మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || 30 ||

గంగాష్టకం

  1.  · Promote · 

  2. భగవతి తవ తీరే నీరమత్రసనోహమ్
    విగతవిషయతృష్ణ కృష్ణమారధాయమి |
    సకలకలుషభంగే స్వర్గసోపనసంగే
    తరలతరతరంగే దేవి గంగే ప్రసీద || 1 ||
    భగవతి భవలీలామౌలిమాలే తవాంభః
    కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి |
    అమరనగరనారీచామరగ్రాహిణీనాం
    విగతకలికలంకాతంకమంకే లుఠంతి || 2 ||

    బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
    స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్‍స్ఖలంతీ |
    క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూనిర్భరం భర్త్సయంతీ
    పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు || 3 ||

    మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
    స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగలత్కుంకుమాసంగపింగమ్ |
    సాయంప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
    పాయన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరం హస్తరంగమ్ || 4 ||

    ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
    పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్ |
    భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
    కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే || 5 ||

    శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
    పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ |
    శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
    కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ || 6 ||

    కుతో వీచీర్వీచిస్తవ యది గతా లోచనపథం
    త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి |
    త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
    తదా మాతః శాంతక్రతవపదలాభోzప్యతిలఘుః || 7 ||

    గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
    పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే |
    ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకాణికా బ్రహ్మహత్యాదిపాపే
    కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద || 8 ||

    మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
    త్వత్తీరే వపుషోzవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్ |
    సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
    భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ || 9 ||

    గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః |
    సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || 10 ||