సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, March 18, 2014

శ్రీ దత్తాత్రేయ స్వామి

 దత్తాత్రేయ స్వామి స్తొతం

శ్రీ దత్తాత్రేయ స్వామి
త్రిమూర్తుల {బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు}స్వరూపం.గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది.సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి,అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు,దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.]

అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.

ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి.
కాలాగ్ని శమనుడు
యోగిరాజ వల్లభుడు
దత్తయోగిరాజు
జ్ఞానసాగరుడు
శ్యామకమలలోచనుడు
శ్యామకమలాలోచనుడు
అత్రివర్ధుడు
సంస్కారహీన శివరూపుడు
ఆదిగురువు
దిగంబరదత్తుడు
విశ్వాంబరావధూత
దేవదేవుడు
దత్తావధూత
దిగంబరదేవుడు
కాలాగ్ని శమనుడు
సిద్ధరాజు
మాయాముక్తావధూత
లీలా విశ్వంభరుడు
తత్వము.

 దత్తాత్రేయ స్వామి స్తొత్రం

దత్తాత్రేయస్వామి స్తోత్రం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు!!1!!
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు!!2!!
శరణ గతదీనార్తపరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు!!3!!
సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు!!4!!
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు!!5!!
శోషణం పాపపంకస్య దీపనంజ్ఞానచేతసః
తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు!!6!!
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం
ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు!!7!!
జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు!!8!!
జయలాభయసః కామదాతు ర్దత్తస్య హః స్తవం
భోగమోక్షప్రస్యేమం య పఠేత్ సుకృతీ భవేత్!!9!!

 శ్రీ దత్త స్తవం

శ్రీ దత్త స్తవం 
''ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః
శ్రీ పాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః!!
ధ్యానం-జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.

ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.

"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.

దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.
మాలాం కుండీచఢమరుం శూలం శంఖం
సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం!!

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలం
ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామీ సనోవతు!!1!!

దీన బంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వ రక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు!!2!!

శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు!!3!!

సర్వానర్ధ హరం దేవం సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు!!4!!

బ్రహ్మణ్యం ధర్మతత్వఙ్ఞం భక్తకీర్తి వివర్ధనం
భక్తాభీష్ట ప్రదం వందే స్మర్తృగామీ సనోవతు!!5!!

శోషణం పాపపంకస్య దీపనం ఙ్ఞానతేజసః
తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు!!6!!

సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
విపదుద్దరణం వందే స్మర్తృగామీ సనోవతు!!7!!

జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామీ సనోవతు!!8!!

జయలాభ యశః కామదాతుర్దత్తస్య యస్తవం
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సకృతీభవేత్!!9!!
!!దత్తోహం అనుచు స్మరించువారల అహం నిర్మూలింపుమో గురుదేవదత్త!!



దత్తాత్రేయ వజ్రకవచ మహత్మ్యాన్ని "శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర"లో కూడా తెలియజేశారు. లలితాదేవికి మంత్రానికి తోడుగా ఎన్నిరకాల స్తోత్రాలు ఉన్నా సహస్రనామాల మహిమ ఏవిధంగా అత్యున్నతమో, చండీ మంత్రానికి తోడుగా ఎన్ని ఉన్నా సప్తశతికి మిగిలినవేవీ ఎలా సాటిరావో, అదేవిధ‌ంగా దత్తమంత్రానికి దత్తాత్రేయ వజ్రకవచమని మనం అర్థం చేసుకోవచ్చు.

గురుచరిత్ర
"స్మర్తృగామి అనేది స్వామికి సార్థకమైన బిరుదు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానం ఒకటి ఉంది. దీనిని దత్తకవచమంటారు. బహిరంతశ్శుద్ధుడైన భక్తుడు దత్తనామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ళకొనల వరకూ ఒక్కొక్క అంగాన్ని అంగసంధినీ స్పృశించాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్తాహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. హృదయస్థానంలో అయిదు నామాలను స్థిరపరచాలి (హరి, కాదిఠాంత ద్వాదశారపద్మగో, మరుదాత్మకః, యోగీశ్వరేశ్వరః, హృదయస్థితః). గురువును ఆశ్రయించి ఈ కవచాన్ని ధరించాలి. దత్తకవచధారులకు ఏ రంగంలోనూ అపజయమంటూ ఉండదు. శత్రుభయాలూ దుష్టగ్రహపీడలూ భూతప్రేతపిశాచాల హింసలూ దరిదాపులకైనా రావు. భక్తరక్షణలో ఇది వజ్రకవచం."

శ్రీ గణేశాయ నమః | శ్రీ దత్తాత్రేయాయ నమః ||
ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.

కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.

విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.

"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.

దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"

"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."

"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."

"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."

"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."

"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."

"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."

అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.

పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.

హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.

ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.

ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.

అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.

శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.        

కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌ యుగే | ధర్మార్థకామ మోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ||

వ్యాస ఉవాచ

శృణ్వంతు ఋషయ స్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ | సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ||
గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ | దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ||
రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ | మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ||

శ్రీ దేవి ఉవాచ
దేవదేవ మహాదేవ లోకశంకర శంకర | మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ||
తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శృతాని వై | ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ||
ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః | కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ||
మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే | ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ||

యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ | క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ||
తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ | వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ||
అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ | అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ||
పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః | ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ ||

శ్రీ దేవి ఉవాచ
కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ | ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ ||

శ్రీ శంకర ఉవాచ
గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మనసగోచరమ్ | అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ ||
మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి | అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః ||
సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ | ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ||
ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి | తేऽపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః ||

దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే | కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ ||
దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ | తత్ క్షణాత్ సోऽపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః ||
తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః | సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ ||
మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే | స్మర్తృగామీ త్వమిత్యేతత్ కింవదంతీం పరీక్షితుమ్ ||
మయాద్య సంస్మృతోऽపి త్వమపరాధం క్షమస్వ మే | దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ ||
అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మామనన్యధీః | తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ ||
దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ | యదిష్టం తద్ వృణీష్వ త్వం యత్ ప్రాప్తోऽహం త్వయాస్మృతః ||
దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే | త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ ||

శ్రీ దత్తాత్రేయ ఉవాచ
మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ | తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః ||
స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ | న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః ||

అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్,

ఓం ఆత్మనే నమః
ఓం ద్రీం మనసే నమః
ఓం ఆం ద్రీం శ్రీం సౌః
ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః
శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

కరన్యాసః
ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః
ఓం ద్రైం అనామికాభ్యాం నమః
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః

హృదయాది న్యాసః
ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః

ధ్యానమ్
జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః ||
వారాణసీపురస్నాయీ కొల్హాపుర జపాదరః | మాహురీపురభిక్షాశీ సహ్యశాయీ దిగంబరః ||
ఇంద్రనీలసమాకారశ్చంద్రకాంతిసమద్యుతిః | వైదూర్యసదృశస్ఫూర్తిశ్చలత్కించిజ్జటాధరః ||
స్నిగ్ధధావల్య యుక్తాక్షోऽత్యంతనీలకనీనికః | భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః ||
హాసనిర్జితనీహారః కంఠనిర్జితకంబుకః | మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః ||
విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః | పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః ||
రంభాస్తంభోపమానోరుర్జానుపూర్వైకజంఘకః | గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః ||
రక్తారవిందసదృశరమణీయపదాధరః | చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణే క్షణే ||
జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః | సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః ||
వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః | బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః ||
త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః | సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః ||
భస్మోద్ధూలితసర్వాంగో మహాపాతకనాశనః | భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః ||
ఏవం ధ్యాత్వాऽనన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ | మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ ||

దిగంబరం భస్మసుగంధ లేపనం
చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం
దత్తేతినామస్మరణేన నిత్యమ్ ||

పంచోపచార పూజా
ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, గంధం పరికల్పయామి
ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, పుష్పం పరికల్పయామి
ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, ధూపం పరికల్పయామి
ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, దీపం పరికల్పయామి
ఓం వం అమృతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, అమృతనైవేద్యం పరికల్పయామి
ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి

అనంతరం "ఓం ద్రాం" ఇతి మూలమంత్రం 108 వారం జపేత్


ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం

అథ వజ్రకవచమ్
ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||
కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||
నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||
కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||
స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||
కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||
పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||
డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||
వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||
బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||
సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||
మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||
జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||
చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||
అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||
మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||
బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||
భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||
సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||
ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||
వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||
ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||

హృదయాది న్యాసః
ఓం ద్రాం హృదయాయ నమః
ఓం ద్రీం శిరసే స్వాహా
ఓం ద్రూం శిఖాయై వషట్
ఓం ద్రైం కవచాయ హుం
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం ద్రః అస్త్రాయ ఫట్
ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః

ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి | వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోऽహమబ్రువమ్ ||
త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖ వివర్జితః | సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోऽద్య వర్తతే ||
ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః | దలాదనోऽపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే ||
భిల్లో దూరశ్రవా నామ తదానీం శృతవానిదమ్ | సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోऽభవదప్యసౌ ||
ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః | శృత్వా శేషం శంభు ముఖాత్ పునరప్యాహ పార్వతీ ||

శ్రీ దేవి ఉవాచ
ఏతత్ కవచమాహాత్మ్యం వద విస్తరతో మమ | కుత్ర కేన కదా జాప్యం కియజ్జాప్యం కథం కథమ్ ||
ఉవాచ శంభుస్తత్ సర్వం పార్వత్యా వినయోదితమ్ | శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ ||
ధర్మార్థకామమోక్షాణామిదమేవ పరాయణమ్ | హస్త్యశ్వరథపాదాతిసర్వైశ్వర్యప్రదాయకమ్ ||
పుత్రమిత్ర కలత్రాది సర్వసంతోషసాధనమ్ | వేదశాస్త్రాది విద్యానాం విధానం పరమం హి తత్ ||
సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వ విధాయకమ్ | బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ ||
సర్వసంతోషకరణం సర్వదుఃఖనివారణమ్ | శత్రుసంహారకం శీఘ్రం యశః కీర్తి వివర్ధనమ్ ||
అష్టసంఖ్యా మహారోగాః సన్నిపాతాస్త్రయోదశః | షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతి ర్మేహరోగకాః ||
అష్టాదశ తు కుష్ఠాని గుల్మాన్యష్టవిధాన్యపి | అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః ||
వింశతి శ్లేష్మరోగాశ్చ క్షయ చాతుర్థికాదయః | మంత్ర యంత్ర కుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః ||
బ్రహ్మరాక్షస వేతాల కూష్మాండాది గ్రహోద్భవాః | సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః ||
నవగ్రహసముద్భూతా మహాపాతక సంభవాః | సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ ||
అయుతావృతిమాత్రేణ వంధ్యాపుత్రవతీ భవేత్ | అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ ||
అయుతత్రితయాచ్చైవ ఖేచరత్వం ప్రజాయతే | సహస్రాదయుతాదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ ||
లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యే న సంశయః ||

విషవృక్షస్య మూలేషు తిష్ఠన్ వై దక్షిణాముఖః | కురుతే మాసమాత్రేణ వైరిణం వికలేంద్రియమ్ ||
ఔదుంబరతరోర్మూలే వృద్ధికామేన జాప్యతే | శ్రీ వృక్షమూలే శ్రీకామీ తింత్రిణీ శాంతికర్మణి ||
ఓజస్కామోऽశ్వత్థమూలే స్త్రీకామైః సహకారకే | జ్ఞానార్థీ తులసీమూలే గర్భగేహే సుతార్థిభిః ||
ధనార్థిభి స్తు సుక్షేత్రే పశుకామైస్తు గోష్ఠకే | దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ ||
నాభిమాత్ర జలే స్థిత్వా భానుమాలోక్య యో జపేత్ | యుద్ధే వా శాస్త్రవాదే వా సహస్రేణ జయో భవేత్ ||
కంఠమాత్రే జలే స్థిత్వా యో రాత్రౌ కవచం పఠేత్ | జ్వరాపస్మారకుష్ఠాదితాపజ్వరనివారణమ్ ||
యత్ర యత్ స్యాత్ స్థిరం యద్యత్ ప్రసక్తం తన్నివర్తతే | తేన తత్ర హి జప్తవ్యం తతః సిద్ధిర్భవేద్ధృవమ్ ||
ఇత్యుక్తవాన్ శివో గౌర్యై రహస్యం పరమం శుభమ్ | యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమో భవేత్ ||

ఏవం శివేన కథితం హిమవత్సుతాయై
ప్రోక్తం దలాదమునయేऽత్రిసుతేన పూర్వమ్ |
యః కోऽపి వజ్రకవచం పఠతీహలోకే
దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః ||
ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దత్తాత్రేయవజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్



Sunday, March 2, 2014

ముక్కంటి

  1. భక్తి అనేది చాలా విచిత్రమైనది. అది మనిషిని పూర్తిగా పరవశుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తిలో ఆర్తి, వేదన, తపన, అమితమైన అనురాగమూ - యిలా ఎన్నెన్నో భావాలు పెనవేసుకుపోయి ఉంటాయి.ఉత్తర భారతదేశంలోనూ ... దక్షిణ భారతదేశంలోను అనేక ప్రాంతాల్లో విశిష్టమైన శైవక్షేత్రాలు దర్శనమిస్తూ వుంటాయి. కొన్ని ఆలయాలు నదీ తీరాలలోను ... మరికొన్ని ఆలయాలు కొండ గుహలుగా కొలువై కనిపిస్తుంటాయి.ఎంతో మంది మహర్షులు ఈశ్వర కటాక్షం కోసం వివిధ ప్రాంతాల్లో పరమశివుడిని ప్రతిష్ఠించి పూజించారు. సాక్షాత్తు సదాశివుడే ఆ ప్రదేశంలో కొలువై ఉండేలా మాట తీసుకున్నారు.అలా ఆయా ప్రాంతాల్లో ఆవిర్భవించిన మహాదేవుడు కోరిన వారికి కొంగుబంగారమై అలరారుతున్నాడు.పూర్వకాలంలోని భక్తుల కథలు చదివినా విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది! గాఢభక్తికీ, మూఢభక్తికీ తేడా చెప్పడం కష్టమే! అయినా భక్తికుండే శక్తి చాలా గొప్పదని అనిపిస్తుంది,అలాంటి ఒక వీర భక్తాగ్రేసరుడు.  ముక్కంటి.రుద్రపశుపతి. ఇతనిది చాలా ఆసక్తికరమైన కథ!
    తన పేరుకు తగ్గట్టే, రుద్రపశుపతి శివునికి పరమభక్తుడు. ఇతనొక రోజు పురాణం వింటూ ఉంటే అందులో క్షీరసాగర మథనం కథ వచ్చింది. అది చెపుతున్న పౌరాణికుడు ఆ పాలసంద్రంనుండి పుట్టిన కాలకూటవిషాన్ని శివుడు మింగాడని చెప్పాడట. అంతే!
     ముక్కంటి.పంచామృతంhttp://tvramudu.blogspot.com/
                                                            ఆ రుద్రపశుపతి యాలించి, "భర్గు
    డారగించుట నిక్కమా విషం" బనుడు

    "ఏమిటి? శివుడు నిజంగా విషం తిన్నాడా!" అని అడిగాడట రుద్రపశుపతి. దానికా కథకుడు, "అవును నిజంగానే మింగాడు. అందులో అనుమానమేముంది?" అన్నాడట. అప్పుడు,                                             ముక్కంటిhttp://tvramudu.blogspot.com/విని యుల్కిపడి వీపు విఱిగి "హా! చెడితి!"
    నని, నేలబడి పొర్లి "యక్కటా! నిన్ను
    వెఱ్ఱి జేసిరిగాక విశ్వేశ! యెట్టి
    వెఱ్ఱివారైనను విషము ద్రావుదురె?
    బ్రదుకుదురె? విషమ్ము పాలైన వార?
    లిది యెట్టు వినవచ్చు ; నేమి సేయుదును?
    నిక్క మెవ్విధమునె నిన్నెకా కెఱుగ;
    ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?
    నా కొఱకైన బినాకి ! యివ్విషము
    చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను;
    గటకటా ! మేన సగంబున నుండి
    యెట వోయితవ్వ ! నీ వెఱు గవే గౌరి !

    శివుడు విషం తాగాడన్న వార్త విని తట్టుకోలేకపోయాడు వెఱ్ఱి భక్తుడైన రుద్రపశుపతి. నేలపై పడిపోయి పొర్లుతూ శోకాలందుకున్నాడు. పైగా "అందరూ కలిపి నిన్ను వెఱ్ఱివాణ్ణి చేసేశారయ్యా శివయ్యా!" అని కూడా అన్నాడు! "ఇంక నేనేమి చేసేదిరా దేవుడా! నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదే! అలాంటి నువ్వు విషం పుచ్చుకుంటే, నేనేమైపోవాలి. నీకు దండంపెడతాను, నాకోసమైనా ఆ తాగిన విషాన్ని కక్కెయ్యి!" అని విలపించాడు. "అవ్వా! నువ్వతని మేనిలో సగమున్నావే. అతను విషం తాగుతూంటే నువ్వేం చేస్తున్నావు తల్లీ" అని రోదించాడు. ప్రమథ గణాలనూ, ఇతర శివగణాలు.[లై]న శతరుద్రులనూ, అసంఖ్యాతులనూ, వీరభద్రుణ్ణీ, అందరినీ నిలదీసి అడిగాడు. ఆఖరుకి ఇలా అంటాడు:

    తల్లిలేని ప్రజల దలతురే యొరులు?
    తల్లి యున్న విషము ద్రావ నేలిచ్చు !

    తల్లిలేని వాడు కాబట్టి అతని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. శివునికే ఒక తల్లంటూ ఉంటే అతడిని విషం తాగనిచ్చేదా అని వాపోతాడు! చివరకు, ఆ ఘోరాన్ని భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడి సముద్రంలోకి దూకేస్తాడు. అప్పుడా రుద్రపతిని కాపాడి, శంకరుడు.పార్వతీ సమేతుడై ప్రత్యక్షమవుతాడు. అతని భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటాడు. ముగ్ధభక్తి మూర్తీభవించిన ఆ రుద్రపశుపతి, "నాకేమీ వద్దు. నీకేం ప్రమాదం ముంచుకొస్తుందో! నువ్వు మింగిన ఆ కాలకూటాన్ని గబుక్కున బయటకు ఉమ్మేయ్. అదే చాలు" అని కోరుకుంటాడు. అతని మాటలకు శివుడు నవ్వి, "ఆ కాలకూటం నా కంఠంలో అణుమాత్రంగా చిక్కుకొని ఉంది. దానికోసం నువ్వింత దుఃఖపడనక్కరలేదు. అది నన్నేమీ చెయ్యదు" అని భరోసా పలుకుతాడు. అయినా రుద్రపశుపతి.నమ్మడు. "అయితే నన్ను చావనీయి. లేకపోతే నువ్వు మింగిన విషం బయటకి కక్కు" అని పంతం పడతాడు! అప్పుడు:

    "నుమియ కుండిన జచ్చునో ముగ్ఢ" యనుచు
    నుమబోటి యాత్మలో నుత్తలపడగ
    "నుమిసిన గొని కాల్చునో తమ్ము" ననుచు
    గమలాక్ష ముఖ్యులు గడగడ వడక
    బ్రమధు లాతని ముగ్ధభక్తికి మెచ్చి
    యమిత మహోత్సవులై చూచుచుండ
    నొక్కింత నవ్వుచు నుడురాజధరుడు
    గ్రక్కున లేనెత్తి కౌగిట జేర్చి,
    "ప్రమధుల యాన నీ పాదంబులాన
    సమయ నివ్విషమున సత్య మిట్లనిన
    నమ్మవే వలపలి నాతొడ యెక్కి
    నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు"
    నని యూరుపీఠంబునందు ధరించె
    మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
    నదిగాక కుత్తుక హాలాహలంబు
    కదలినంతటనే చచ్చెద గాక ! యనుచు
    దనకరవాలు ఱొమ్మున దూసి మోపి
    కొని కుత్తుకయ చూచుచును ఱెప్ప లిడక
    పశుపతి తొడమీద బాయక రుద్ర
    పశుపతి నేడును బాయకున్నాడు.

    విషం ఉమ్మకపోతే పాపం ఆ వెఱ్ఱివాడు చస్తాడు కాబోలని పార్వతీదేవి లోపల కలత చెందుతోంది. ఎక్కడ బయటకి ఉమ్మేస్తే తమనందరినీ కాల్చేస్తుందోనని విష్ణుమూర్తి మొదలైన దేవతలందరూ గడగడా వణుకుతున్నారు. రుద్రపశుపతి ముగ్ధభక్తికి మెచ్చి ప్రమథులు మహోత్సాహులై చూస్తున్నారు! అప్పుడు శివుడు నవ్వి, రుద్రపతిని తన తొడమీదకి ఎక్కించుకొని, "చూడు, గరళం.నా కంఠంలోనే ఉంది. నీ పాదాలమీద ఒట్టు, ప్రమథగణాలమీద ఒట్టు. అది నన్నేమీ చెయ్యదు. కావలిస్తే అలాగే చూస్తూ ఉండు" అన్నాడట. "సరే చూస్తాను, అది కాని నీ గొంతు దిగిందా! నేను కత్తితో పొడుచుకు చస్తాను" అని రుద్రపశుపతి కత్తి తన ఱొమ్మున మోపి రెప్ప వెయ్యకుండా ఆ గరళకంఠుని కంఠాన్నే చూస్తూ కూర్చున్నాడట... ఇప్పటికీ కూడా!

    ముగ్ధభక్తికి ఇంతకన్నా తార్కాణం మరొకటి ఉంటుందా! ఈ కథ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం లోనిది. దేశి ఛందస్సయిన ద్విపదలో, తేలిక భాషలో చేసిన రచన యిది. పదకొండు పన్నెండు శతాబ్దాల కాలంలో, ప్రధానంగా కన్నడ దేశంలో, వీరశైవం.విజృంభించింది. దీనికి మూలకారకుడు బసవేశ్వరుడు.ఇతడు మహాభక్తుడు, ప్రవక్త, సంస్కర్త. బిజ్జల మహారాజుకి ప్రధానిగా కూడా ఉన్నాడు. ఇతడు సాక్షాత్తూ నంది అవతారమేనని వీరశైవులు భావిస్తారు. ఇతని కథనే పాల్కురికి సోమనాథుడు బసవపురాణంగా రచించాడు. ఈ పురాణంలో ఒక్క బసవునిదే కాక అనేకమంది శివభక్తుల కథలున్నాయి. ఆ కథలన్నీ ఇంచుమించు అద్భుత రసపోషకాలే!

    ఈ కథ మొదట్లో బసవుని భక్తి గురించి, నాలుగు వాక్యాలాలో, గొప్ప కవితాత్మకంగా చెపుతాడు పాల్కురికి సోమన:

    వడిబాఱు జలమున కొడలెల్ల గాళ్ళు
    వడిగాలు చిచ్చున కొడలెల్ల నోళ్ళు
    వడివీచు గాడ్పున కొడలెల్ల దలలు
    వడిజేయు బసవన కొడలెల్ల భక్తి!

Friday, January 24, 2014

హరుడు • చంద్రమౌళి

హారుడు









































































శివుడు హరుడు మహేశ్వరుడు..పరమేశ్వరుడు.. కైలాస నాధుడు .
సౌరేస్త్ర సోమనాధం చ శ్రీ శైల మల్లికార్జునం
త్రయంబకం యజా మహె సుగంధం పుస్తివర్ధనం
ఉర్వా తుమివ వందనం మృత్యు మొక్షేన ఆమ్రుతా!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
‘’హర నేత్రాగ్ని సందగ్ధ కామసంజీవ నౌషధిహ్ ‘’
పరమేశ్వరి నామాలలో ప్రతిదీ ప్రాణ శక్తితో  ఉంటుంది కామ దేవుడిని బూడిద రాసి చేసిన కామేశ్వరుడిని ‘’హర ‘’శబ్దం చక్కగా వ్యక్తం చేసింది .అంతటినీ హరించే వాడు హరుడు ప్రజాపతి చేసిన సృష్టిలో ఆహితమైంది ,అనవసర మైంది ,అశోభన మైంది అంతా నశింప జేయటమే శంకరుని పని .అందుకే హర శబ్దం వాడారు .హరుని మూడవ కన్ను మంట కాముడిని కాల్చింది .ఈ మూడో కన్ను మనందరి లోను ఉంటుందని గ్రహించాలి .లలాటం లో ఉన్న ఈ మూడో కన్ను లోపలి చూపును కలిగి ఆనందాన్ని పొందుతుంది .ఈ కన్ను తెరుచుకొంటే అంధకారం అంతా పటా పంచలై వెలుగు పరచుకొంటుంది .అజ్ఞానం స్తానాన్ని జ్ఞానం ఆక్రమిస్తుంది .ఆత్మ తత్త్వం బోధ పడుతుంది .అప్పుడు జ్ఞాని జీన్ముముక్తుడౌతాడు .ఈ జీవన్ముక్త దశ వైపు ఈ నామం సూచిస్తుందని భావం .పరమేశ్వరుడు ముక్తి దాత .పరమేశ్వరి ఈ ముక్తి ప్రయోజనాన్ని సమస్త ప్రపంచానికి అందిస్తుంది .’’వినాశం లోనే వికాస బీజం ఉంది ‘’అని గ్రహించాలి .కామ వాసన కామిని వినాశనం వైపు లాక్కేడుతుంది .అమ్మ వాడిని కామేశుని వికాసం వైపుకు తీసుకొని వెడుతుంది ఇదే పరమేశ్వరి నామం లో ఉన్న రహస్యార్ధం అని  మహా వ్యాఖ్యాన కర్త స్వర్గీయ ఇల పావులూరి పాండురంగా రావు గారు వ్యాఖ్యానించి చెప్పిన దానినే మీకు అంద జేశాను .అందరికి ఆ పరమేశ్వరీ కటాక్షం లభించాలని  కోరుతున్నాను.

ఈతడే హరుడు
యీతడే యజుడు
ఈతనికి నీ చేతలెoత
ఘనమటుగాన

కడుపెక్కుబ్రహ్మాoడ
కతకములు సుడివడిన
కడుపులొ నిడుకొన్న ఘనుడు
వెడలి పూతకిచంటి
విషము తాగిన యoత
వడి తనకు నేమాయ వట్టిబూమెలుగాక

ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు~
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుడవని నిన్ను పరిణమిoతురు గాన

తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతుడభవుడు
శరణాగతుల రక్షసేయు వాడనుమాట
గురుతుగా తలపోసి కొనియాడాగా వలసె!!






































గరళకంఠుడు

  1. www.panchaamrutam.tvramudu.blogspot.com గరళకంఠుడు సృష్టి మేలుకోసం తానే సర్వమూ అయ్యే సర్వాత్ముడు శివుడు. అమృతోత్పత్తి కోసం దేవతలు, దానవులు అత్యంత ఉత్సాహంతో క్షీరసాగర మథనంలో పాలు పంచుకున్నప్పుడు ముందుగా ఆవిర్భవించింది 'హాలాహలం'.గరళాన్ని సేవించి స్థిరంగా తనలో నిలుపుకోగల మహితమైన మహిమాన్మాతుడు దైవం ఆ పరమశివుడే అని తలచిన దేవదానవులు పాపహరుడైన హరుని ప్రార్థించగానె చిరునవ్వుతో ఆ కాలకూట విషాన్ని తన గొంతులో నింపుకుని గారలకంఠుడయ్యాడు. పరమశివుడు ఈ మహత్తర కార్యంతో లోకాలలో ఎటువంటి కీడు వాటిల్లకుండా చేసిన వాత్సల్య సింధువు ఈ నీలకoధరుడు ఈ గరళకంఠుడు. సముద్రం తరువగా హాలాహలం పుట్టినప్పుడు తక్కినవారు పారిపోగా విషం మింగి జగత్తును రక్షించింది గరళకంఠుడు. అందరి పాపాలనూ ఆయనే భరించాడు. ""మనలను చేసినవాడు మన అందర పాపాలూ హరిస్తాడు. విషం మింగిన గరళకంఠుడు జీవచరాలను రక్షించాడు ప్రకృతి మింగిన హేరళకంఠుడు నేలతల్లినీ కబళించాడు.గరళం శివుని లో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం ఈశ్వరుడు శిరమున దాల్చిన అర్ధ చంద్రుడు జీవకోటికి చల్లదనాన్ని ప్రసాదించి, తాపాలను హరించే తేజోమయుడు. జటాజూటమునందున్న గంగాదేవి సర్వప్రాణులకు దాహార్తిని తీర్చి,జీవాన్ని ప్రసాదించే భక్తి, ముక్తి ప్రదాయిని. శివుడి లలాటంలో వున్న త్రినేత్రం జ్ఞానచక్షువు కాగా ఇరు నేత్రాలు సూర్యచంద్రులుగా వెలుగొందుతుంటాయి.
  2. మహర్షి శాప ఫలితంగా ఇంద్రుని వైభవం అంతా అంతరించింది. సామ్రాజ్య లక్ష్మితో సహా సమస్త సంపదలూ చేజారిపోయాయి. ఇంద్ర సింహాసనాన్ని రాక్షసులు ఆక్రమించుకున్నారు. ఇంద్రునితోపాటు అష్టదిక్పాలుర గణాలన్నిటికీ అథోగతి పట్టింది. అందరూ కలసికట్టుగా వెళ్లి బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. బ్రహ్మకూడా ఏం చెయ్యడానికీ పాలుబోక, మనకీ దుస్థితి నుంచి నారాయణుడు రక్షించాలి తప్ప అన్యులెవరకీ సాధ్యం కాదని చెప్పి, అందరితోనూ కలసి వైకుంఠుని శరణువేడాడు. మధుసూదనుని పరిపరి విధాలా స్తుతించాడు. ‘‘అతి సనాతనుడవు, ఆరాధ్యుడవు, యజ్ఞరూపుడవు. ఏ పోలికలకూ అందనివాడువు. బ్రహ్మను కూడా నీవే సృష్టించినవాడవు. మమ్ము కటాక్షించి మాకు దర్శనం ఇవ్వవలసిందిగా కోరుతూన్నాం’’ అని ఋష్యాదులు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమయ్యాడు. తిరిగి యావన్మందీ స్తోత్రం చేయగా, జనార్దనుడు సంతసించి ఇట్లా పలికాడు.

    మథనానికి శ్రీకారం...
    ‘‘దేవతలారా! ఇంద్రునితో కూడి, మీరంతా రాక్షసుల వద్దకు వెళ్ళి వారిని సముద్ర మథనా నికి ఒప్పిస్తే, తదుపరి కార్యం నేను నిర్వహి స్తాను. ఇంతవరకు మీకు అమరత్వ లబ్ధిచేకూ రని కారణంగా యద్ధంలో రాక్షసుల ధాటికి మీరు నిలువజాలకున్నారు. సముద్ర మథనం వల్ల జనించే అమృతం గ్రోలి మీరు అమరులు కండి! జాగ్రత్త! ఈ అమృతం రాక్షసులకు దక్క కుండా నేను పథకం రచిస్తాను-’’ అంటూ ఆన తిచ్చాడు. శ్రీమాన్నారయణుని ఆదేశానుసారం వాసుకిని కవ్వంత్రాడుగా - మంథర పర్వతా న్ని కవ్వంగా మలచి దేవదానవుల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. హాలాహలమే మొదట వెలవడింది. వెయ్యి సంవత్సరాలకు వాసుకి తలలు భయంకరమైన విషమును క్రక్కాయి. నిప్పుతో సమానమైన ఆ విషం వలన దేవాసురులు, మనుషులతో కూడిన ఈ ప్రపంచం దహించబడింది.

    దేవతలు ఈశ్వ రుని వద్దకు వెళ్లి రక్షింపుమని కోరారు. శంఖ చక్రధారి అయిన విష్ణువు కూడా అక్కడకు వచ్చాడు. ‘‘సురశ్రేష్ఠా! నీవు దేవలందరిలోనూ అగ్రగణ్యుడువు. కావున సముద్ర మధనము నందు మొదట పుట్టినది నీ భాగము. పుట్టిన ఈ విషం లోకాలన్నింటిని దహించివేస్తోంది. ఈ భయంకరమైన విషాగ్నిని ఉపసంహరించి భూత కోటిని సంరక్షించడానికి నీవే సమర్ధుడ వు. ఇతరులవల్ల ఆ మహకార్యము కాజాలదు. దీనిని అగ్రపూజగా ఎంచి విషమును గ్రహింపు ము అని విష్ణువు అంతర్థానం చెందాడు. ప్రజా పతులందరూ ముక్తకంఠంలో పరమేశ్వరుని స్తోత్రం చేశారు. అపుడు దయా సముద్రుడైన శంకరుడు భక్తవశంకరుడై పరమేశ్వరి ముఖం చూచి ఇలా అన్నాడు. ‘‘ఓ దేవీ! లోకాలకు కల్గిన ఈ ఉపద్రవం చూశావా! ఈ హాలాహలా న్ని అదుపు చేసి మధుర ఫలంలాగా భక్షిస్తాను. ప్రాణుల్ని రక్షిస్తాను’’ అన్నాడు.

    ఆ మాటలు వి ని భవాని నిర్భయంగా ‘‘మహాత్మా! మీ అభీష్టం ప్రకారం జరుగుతుంది’’ అని చెప్పింది. అప్పు డు సమస్త దేవదానవులు జయజయ ధ్వానము లు పలుకుతూండగా పరమేశ్వరుడు హాలాహ లానికి ఎదురునిలచి ఆ మహావిషాన్ని ఆకర్షించి పట్టుకొని దగ్గరకు చేర్చి ఒక ముద్దగా చేసి అల్లనేరేడు పండులా మెల్లగా నిగనిగలాడుతూ ఉన్న దానిని ఆ పరమశివు డు కంఠంలోనే నిలిపివేశాడు. అలా ఘోరవి షాగ్నిని కంఠంలో నిలుపుకోవడం వల్ల ఆ విషతీక్షణతకు ఆయన కంఠం నల్లబడింది. కంఠంలోనే నిక్షిప్తం చేసి గరళకంఠుడయ్యాడు.కాని ఆ నలుపు కూడా ఆ తెల్లని పరమేశ్వ రుని ఒడలుకి ఒక అలంకారంగానే భాసిం చింది. ఇలా హాలాహలం విషం వల్ల కలిగి న విఘ్నాన్ని పరమేశ్వరుడు తొలగించ గానే దేవాసురులు క్షీరసాగర మధనం పునఃప్రారంభించారు. కవ్వముగా వున్న మందర పర్వతం పాతాళలోకానికి కుం గింది. దేవ గంధర్వులు విష్ణువును ప్రస్తుతించారు. సమస్త ప్రాణులకు ప్రత్యేకించి దేవలకు దిక్కువు నీవే. మందర పర్వతం సముద్రములో మునిగిపోయింది. దానిని పైకి లేవనె త్తుము అని ప్రార్థించారు.

    దేవతల ప్రార్థన విని మహానిష్ణువు తాబేలు రూపము వహించి మందర పర్వత మును వీపుపై ధరించి సముద్రం లో శయనించాడు. శ్రీ విష్ణుదేవు డు చేతులు పైకి చాపి మందర పర్వత శిఖరమును పట్టుకున్నా డు. దేవతలతో కలిసి తానునున సముద్ర మధనంలో పాల్గొన్నా డు. వెయ్యి సంవత్సకాలు గడి చాయి. దండ కమండలములు ధరించి ధరించి ధన్వంతరి పాలసముద్రం నుండి ఉద యించాడు. పాలను చిలుకు ట వలన పాలనుండి ఒక రసము ఉద్భవించింది. ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి, చంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం వగైరాలన్నీ ఉద్భవించాయి. వాటితో పాటే నిప్పులు చిమ్ముతూ హాలాహలం కూడా ఎగసిపడింది. ఆ రసము నుండి కొందరు స్త్రీలు జనించారు. వారు ఆ రసం నుండి జన్మించారు కనుక వారిని అప్సరసలు అని అన్నారు.చిట్టచివరిగా అమృతం పుట్టింది. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారమెత్తి, రాక్షసులతో అచ్చిక బుచ్చికలాడుతూ వారిని ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచిపెట్టడంతో క్షీరసాగర మథనం పూర్తయింది.
    జగన్నాటక సూత్రధారి స్వీయ పర్యవేక్షణలో ఆద్యంతం ‘సుర’సవత్తరంగా సాగిన ఈ మహానాటకాన్ని నారదుడు కనులారా వీక్షించి ఉప్పొంగిపోయి, విష్ణుమూర్తిని అడిగాడు.
    “స్వామీ! కడు నేత్రపర్వంగా జరిగిన క్షీరసాగర మథనాన్ని సాధారణ ప్రజలు సైతం తిలకించి, పులకించే భాగ్యం కల్పించవచ్చు కదా!”
    విష్ణుమూర్తి మందహాసం చేసి చెప్పాడు “నారదా! నీ కోర్కె తప్పకుండా సిద్ధిస్తుంది.

Saturday, January 18, 2014

పశుపతి

పశుపతినాథ్ దేవాలయం

 పశుపతి
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..అని కొలుస్తారాయన భక్తులు. అసలే బోళా శంకరుడు ఆ పైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా  వెలిసాడు? శివుడంటే పిలిస్తే పలికే దైవం. శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే

 నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.
గోవు ఇతిహాసం
information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.
మరో ఇతిహాసం
ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

ఆలయ చరిత్ర

 పశుపతి

ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

ఆలయ నిర్మాణ శైలి

information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.

ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. మహాశివరాత్రి పూట ఆ జనసందోహం అనంతం. శంభో శంకర అంటూ భక్తజనులు పరమేశ్వర దర్శనం చేస్తారు.
 పశుపతి

information about pashupatinath temple details pashupatinath temple is one of the most famous temple in Kathmandu. Dedicated to Lord Shiva
అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మదేవాలయం, ఆర్యఘాట్. గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు స్మశాన సంచారి. ఆర్యఘాట్ లో స్మశానం కూడా వుంది.
కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని  వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు.

Wednesday, January 15, 2014

కైలాసాధిపతి

  1.  పంచామృతo
    ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మానవ మేథస్సుకు అర్థంకాని విషయాలు దాగి ఉంటాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.విరోచనుడు, స్కందుడు, శాస్త, సూర్యపుత్రుడగు యముడు,యుక్తిస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, ప్రేమ గలవాడు, త్రిపురాసురసంహర్త, కైలాసాధిపతి, సుందరమైన వాడు, జగత్తునకు తండ్రి, సూర్యుడే కన్నుగా గలవాడు , సర్వోత్తముడు,సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాస పంచామృతo.కైలాసాధిపతి.ఉంది .అంతే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే. అంతే కాకుండా మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎన్నో పర్వతాలను వీక్షించడం మాటలకందని మధురానుభూతి.
కైలాస పర్వత యాత్ర
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.

మానస సరోవరం
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. హర హర మహాదేవ శంభో శంకర. 
 కైలాసాధిపతి
 పంచామృతo.కైలాసాధిపతిwww.tvramudu.blogspot.com

సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.

మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.

కైలాస పర్వత దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. సాక్షాత్తు ఆ పరమశివుని అనుమతి ఉన్నవారికే ఆ పరమ పవిత్రమైన క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుందని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ భూమీదున్న అత్యంత కష్టమైన, సాహసోపేతమైన యాత్రలలో ‘కైలాస మానస సరోవర యాత్ర’ ఒకటి. మహాదేవుని ఆశీస్సులున్నవారు మాత్రమే ఈ యాత్రను విజయవంతంగా పూర్తిచేస్తారని పురాణాల చెప్తున్నాయ. హిందూ పురాణ గ్రంథాల ననుసరించి కైలాస పర్వతం దాదాపు ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా తెలుస్తోంది. కరకురం పర్వత శ్రేణి, నాగపర్వతాల మధ్యలో ఉందీ కైలాస పర్వతం. దీనిని ‘క్వాంగ్‌రింపోచి’ అని పిలుస్తారు. దక్షిణ-పడమర దిశలో టిబెట్‌లో ఉండి, ఆసియా వాసులచే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నీరాజనాలందుకుంటోంది. కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి నాలుగు మార్గాలున్నాయి. రెండు నేపాల్ ద్వారా, ఒకటి ఇండియా ద్వారా, ఇంకొకటి పాకిస్థాన్ ద్వారా ఈ పుణ్యప్రదేశానికి చేరుకోవచ్చు.
ఈ భూమీదున్న అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పరమ పవిత్ర దివ్యక్షేత్రం కైలాస పర్వతం. సముద్ర మట్టానికి 6,714 మీటర్ల ఎత్తులో మానస సరోవర సమీపంలో కైలాసగిరి శిఖరాన్ని ప్రదక్షిణ మార్గంలో చేరుకోవాలే తప్ప అడ్డదారులేవీ లేవు. ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన పుణ్యప్రదేశాలలో మానస సరోవర కైలాస యాత్ర ప్రత్యేకమైంది. సాక్షాత్తు పరమశివుడి నివాస స్థలమైన కైలాస పర్వత దర్శనం అత్యద్భుతం. కైలాస మానస సరోవర యాత్ర వల్ల సమస్త దుఃఖాలనుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని వందల జన్మలలో చేసిన పుణ్యఫలాల వల్ల కైలాస మానస సరోవర దర్శన భాగ్యం కలుగుతుందంటారు. జైనులు కైలాస పర్వతాన్ని అష్టపాద పర్వతంగా, 24వ తీర్థంకరుడైన రిషభదేవుడి నివాస స్థలంగా నమ్ముతారు. బౌద్ధులు కైలాస పర్వతాన్ని అమూల్యమైన మంచు పర్వతంగా, దేవతలు చక్రసంహర, డోర్సఫాణ్మోల నివాస స్థలంగా కొలవడం జరుగుతుంది. కైలాస పర్వత పాదాల వద్దకు చేరే యాత్ర అతి క్లిష్టమైనది. కైలాస పర్వతాన్ని చుట్టి వచ్చే యాత్రని ‘కోర’ లేదా పరిక్రమంగా చెబుతారు. హిందువులు ఈ పర్వత ప్రదక్షిణాన్ని ఆరోహణ క్రమంలో చేస్తే బోన్ మతస్థులు అవరోహణ క్రమంలో చేస్తారు.
మానస సరోవరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘రాక్షసతాల్’ ఉంటుంది. మానస సరోవరం నుంచి కైలాసగిరికి ట్రెక్కింగ్ ప్రారంభమయ్యే ప్రాంతం ‘షిషాంగ్’. ఇక్కడ నుంచే కైలాస పర్వతం పరిక్రమ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం నుంచి భక్తులు పర్వతాలను అధిరోహించాల్సిందే. అది చేయలేనివారు గుర్రాల మీద కైలాస పర్వతానికి చేరుకోవాలి. షిషాంగ్ నుంచి దాదాపు పది గంటలు గుర్రంమీద ప్రయాణం చేస్తే ‘డేరాపుక్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ బస చేయడానికి ఓ వసతి గృహం కూడా ఉంది. డేరాపుక్ నుంచి కొంచెం ఎత్తుకి వెళితే ‘దార్చెన్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ నుంచి కైలాస పర్వతాన్ని ఉత్తరం వైపుగా దర్శించుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తున్నంత సేపూ, పక్కగా బ్రహ్మపుత్రానది దర్శనమిస్తుంది. కైలాస యాత్రలో భక్తులకు అటు ఆధ్యాత్మికానందంతోపాటు, మానసికానందం కూడా సొంతమవుతుంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు; భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఓ పక్క విపరీతమైన చలి, ఇంకోపక్క అద్భుత ప్రకృతి సౌందర్యం వీక్షిస్తున్నామన్న భావన, ఇంకోపక్క సాక్షాత్తు ఆ మహాదేవుని ఆవాస స్థలం చూశామన్న ఆత్మసంతృప్తి మనల్ని అవ్యక్తమైన ఆనందానికి గురిచేస్తాయి. కైలాస పర్వతం ఒక్కొక్క సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంది. ఇదంతా సాక్షాత్తు ఆ మహాదేవుని లీలావిశేషంగా చెబుతారు.
  పంచామృతo.కైలాసాధిపతి

వెండికొండగా, బంగారు పర్వతంగా, ఇలా రకరకాల ఆకారాలలో ఇది కనిపిస్తుంది. భూమికి దాదాపు 6,714 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని దర్శించుకోవడం నిజంగా అదృష్టమే. కైలాస పర్వతం ఇతర పర్వతాలకన్నా భిన్నంగా ఉంటుంది. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో ఉంటుంది. ఈ పర్వతం మీద అస్పష్టంగా కొన్ని రూపాలుంటాయి. ఇవన్నీ మనిషిలో అంతర్గతంగా ఉండే గుణాలకు ప్రతీకలుగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతంలో మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత చలిని తట్టుకోవడం సామాన్య విషయమేమీ కాదు. అందుకనే ఈ యాత్ర చేసే వారంతా ఆరోగ్యవంతులై ఉండాలి. అలాగే ‘హైఆల్టిట్యూడ్’ సమస్యలు కూడా ఇక్కడ యాత్రికులను బాధిస్తాయి. వీటినుంచి తట్టుకోవాలంటే మహదేవుని మీద విశ్వాసం, యాత్ర చేసి తిరిగి రాగలమన్న నమ్మకం ఉండాలి. టిబెట్ భాషలో కైలాస పర్వతాన్ని ‘గ్యాంగ్ రింపోచి’ (వెండి ఆభరణం)గా పిలుస్తారు. కైలాస పర్వతాన్ని మొత్తం చుట్టడాన్ని అంటే ప్రదక్షిణ చేయడాన్ని ‘కోరా’ అని పిలుస్తారు. అంటే 52 కిలోమీటర్ల వ్యాసంలో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలన్నమాట. అసాధారణమైన వాతావరణ పరిస్థితులలో ఈ పరిక్రమ చేయాలి. నిరంతరం హై ఆల్టిట్యూడ్ సమస్యలు వేధించి, ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఓ దశాబ్దం క్రితం వరకూ సాహసప్రియులకు సైతం ఈ పర్వతారోహణం ఒక సవాలుగా ఉండేది. అయితే చైనా-నేపాల్ సంబంధాలు మెరుగుపడడంతో, ఖాట్మండును టిబెట్‌ను కలుపుతూ ‘్భటెకోసి’ మీద ‘ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి’ నిర్మాణం కావడంతో మానస సరోవరానికి స్నేహవారధి ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని ‘కొడారి’ అని పిలుస్తారు.

మరో కైలాసం
మహా దేవుడికి మరో కైలాసం.. దేవభూమిలో దివ్యధామం.. లింగరూపుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు.. త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనం.. అపురూపం.. అపూర్వం.. భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభువుగా అవతరించి భక్తుల మనోరథాలు ఈడేరుస్తున్నాడు. మన భూమిపైన.. మనకు అందుబాటులో  సాక్షాత్కరిస్తున్నాడు. ఇది వింత కాదు.. విడ్డూరం అంతకంటే కాదు.. పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు. నిజం.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్న వాస్తవం.

భూమిపై కైలాసాలు ఎన్ని ఉన్నాయి. మహాదేవుడి నిజనివాసం ఎక్కడ.. టిబెట్‌లోని మానస సరోవరం పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా, మరో కైలాసం ఉందా? అవును.. దేవదేవుడు హిమాలయ శ్రేణుల నిండా విస్తరించి ఉన్నాడు. హిమాలయాలకు అన్ని వైపులా కైలాస పర్వతాలు నెలకొని ఉన్నాయి. ప్రతిచోటా పలు రూపాల్లో పరమేష్టి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.. మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న వైనం తొలిసారి టెలివిజన్‌ కెమెరాకు చిక్కింది..
హిమాలయాల్లో శివుడు మరో కైలాసంలో దర్శనమిస్తున్నాడు. మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎతె్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తున్నాడు.. ఒక రోజులో మూడు వర్ణాలు మారే శివలింగం.. దేవభూమిలో మహాద్భుత దృశ్యం ఆవిష్కారమైంది.. అత్యంత ఎతె్తైన మంచు కొండల పైన, నిటారుగా, నిరాకారంగా వెలసిన మహాద్భుత అవతారం..
17, 500 అడుగుల చుట్టు కొలత
18వేల అడుగుల ఎత్తున మహా శివలింగం
రంగులు మారే మహాదేవుడు
ఉదయం రజతం
మధ్యాహ్నం సువర్ణం
సాయంత్రం నీలమేఘం
మూడు వర్ణాల్లో ముక్కంటి
ఆధ్యాత్మిక క్షేత్రంలో అపురూప సన్నివేశం

బోళా శంకరుడికి రెండో  కైలాసం ఏమిటని ఆశ్చర్యపోకండి.. ఇది వాస్తవం.. ఆయన నిజంగానే బోళా శంకరుడు.. అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా సులభసాధ్యుడయ్యాడు.. కోరుకున్న చోటనే దర్శనమిస్తున్నాడు.. అదే ఈ రెండో కైలాసం.. మౌంట్‌ కైలాస పర్వతం మాత్రమే కాదు.. అది ఆయన నిజనివాసం కావచ్చు. కానీ, శివుడికి రెండో కైలాసం హిమాచలంలోనే ఉంది. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున ఉంది. భక్తులను పలు వర్ణాల్లో అలరిస్తోంది. వారికి అందుబాటులో ఉంది. కొంచెం కష్టపడితే లయకారుడి దివ్యదర్శనం లభ్యమవుతోంది..

కిన్నెర కైలాసం. పరమేశ్వరుడి నిజకైలాసాన్ని మరిపించే కైలాసం..చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసం.. అణువణువునా ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశం.. అక్కడ శివలింగం రంగులు మారటం విశేషం.. ఒకే ప్రాంతంలో.. ఒకే చోట.. నిశ్చలంగా ఉన్న శివలింగం ఏ విధంగా రంగులు మారుతోంది.. ఇదెలా సాధ్యపడుతోంది?

శివలింగం రంగులు మారటం ఏమిటి? శివుడి మహత్యమా? మాయా? నిజంగా ఈశ్వరుడి లీలలు అక్కడ కనిపిస్తున్నాయా? దీని వెనుక సైంటిఫిక్‌ రీజన్‌ మరేదైనా ఉందా? ఇందులో రహస్యం దాగున్నదా? సముద్ర మట్టానికి దాదాపు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న త్రివర్ణాలలో కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కటం నిజంగా విశేషం.. ఇంతకీ ఈ అద్భుత ఆవిష్కారం ఎక్కడ దాగి ఉంది? వాస్తవం ఏమిటి?

హిమాచల ప్రదేశ్‌లో కిన్నౌర్‌  ప్రాంతం.. టిబెట్‌కు తూర్పున హిమాచల్‌ ప్రదేశ్‌ దాకా కొనసాగే హిమాలయ శ్రేణి అంతా దేవ భూమి.. ఒక అద్భుతమైన వాతావరణం.. మౌనంగా ఉన్నా, గాలిలో ఈశ్వరుడి పేరు ప్రతిధ్వనించే ప్రాంతం. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది..

కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో.. నిజంగా అందాల కోన.. మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి. జన్‌స్కర్‌, గ్రేటర్‌ హిమాలయ, దౌలంధర్‌ శ్రేణులు సట్లెజ్‌, స్పిటి, బాస్పా వంటి జీవనదులకు పుట్టినిళు్ల.. వీటి మధ్యలోనే అన్నింటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస్‌ పర్వతం కొలువుదీరి ఉంది.

సట్లెజ్‌ నదీతీరంలో అందమైన జలపాతాల నడుమ 18వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడటానికి వేయి కన్నులున్నా సరిపోవు.. ఈ కొండపైనే సహజసిద్ధమైన శివలింగం ఆవిర్భవించి ఉంది. యోగులకు, సిద్ధులకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం.. తొంభై అడుగుల ఎతె్తైన శివలింగం..

ఇది అలాంటిలాంటి శివలింగం కాదు.. మనం సాధారణంగా చూసే మాదిరిలో దీని ఆకారం ఉండదు.. కిన్నెర కైలాసం పీక్‌ స్టేజ్‌లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు.. కేవలం రాయిని శివలింగంగా ఎందుకు భావించారు.? అదే ఇక్కడి ప్రత్యేకత.. ఇది కేవలం రాయి కాదు.. ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ శివలింగం రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. నిర్దిష్ట సమయానికి శివలింగం రంగు మారుతుంది.
అత్యంత ఎతె్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో  మిలమిలా మెరిసిపోతుంది.. వెండి రాశి పోతపోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేసరికి పసిడి వన్నెలోకి మారిపోతుంది.. ఇదే మహాలింగం సాయంత్రం అయ్యేవేళకు నీలిరంగులో ధగధగలాడుతుంది.. ప్రపంచంలో అతి గొప్ప పరిణామ క్రమం ఇది. శివలింగం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతున్నాయి. ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు.. ఇది ఆయన లీలా విలాసమేనా? మరేదైనా మర్మముందా?

ప్రపంచంలో కిన్నెర కైలాసంలో  మాత్రమే ఈ అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. అదీ ఈ శివలింగం నెలకొని ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా రంగులు మారుతాయి. ఈ పరిణామం దేనికి సంకేతం? శివలింగం మాత్రమే కాదు. కిన్నెర కైలాస పర్వతానిదే ఒక ప్రత్యేకత. మౌంట్‌ కైలాసాన్ని మరిపించే ఈ కిన్నెర కైలాసం మర్మం ఏమిటి?   ..లుక్‌

కిన్నెర కైలాసంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మూడు వర్ణాల్లో కనిపించేందుకు ఇక్కడ ఉపాసకులు ఆసక్తికరమైన కథనాలను వినిపిస్తారు.. ఉదయం వెండి రంగులో  శివలింగం కనిపిస్తుంది.. సూర్యుని కిరణాలు శివుడి తలపె ఉన్న జాబిల్లిని తాకుతాయి.  జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణం.. ఈ వెన్నెలకు భూతనాథుడి ఒంటిపై ఉండే విభూతి తోడై అద్భుతంగా విరాజిల్లుతుందని శివభక్తులు చెప్తారు..

మధ్యాహ్నానికి కిన్నెర శివలింగం పసిడి వన్నెలోకి మారిపోతుంది. శివుడు ధరించిన పులిచర్మం, పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందిట.. ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది.

సాయంకాలానికి ఈశ్వరుడి లయవిన్యాసం విశ్వరూపం దాలుస్తుంది. ఆయన కంఠంలో ఉన్న గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి. ఇదొక అద్భుత సన్నివేశం.. అపురూప ప్రకృతి స్వరూపం.

పురాణాలు చెప్పే కథనాలు  ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి. ఈ కథలు, కథనాలు సైన్‌‌సకు అంతుపట్టవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో, సూర్యుడి ప్రస్థానంలో, వాతావరణంలో, హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళ్తాయి. అందువల్లే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు ఒకరకమైన అంచనా వేస్తుంటారు..

సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్‌ లేకపోలేదు. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఎలాంటి జవాబుకూ చిక్కడం లేదు. ఎందుకంటే నిజంగా ప్రకృతిలో, వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదే విధంగా రంగులు మారుతూ ఉండాలి.. కానీ, ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది.. కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతోంది.. దీనికి మాత్రం ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు.. మరి ఇది నిజంగా ఈశ్వరుడి మాయా? ఏమో..

సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది.. సైన్‌‌సకు ఎంతమాత్రం అందని, అంతుపట్టని ప్రకృతి విన్యాసం ఇది. కేవలం శివలింగం మాత్రమే కాదు.. మొత్తం కిన్నెర కైలాస్‌ పర్వతం అంతా శివుడి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆయన తేజస్సును విరజిము్మతున్నది.. అక్కడికి వెళ్లే భక్తులందరికీ ఇదే అనుభూతి కలుగుతోంది.. హేతువాదులకు సైతం ఆధ్యాత్మిక భావనను కల్పించే వాతావరణం అక్కడిది.                   
కైలాసాలు ఒకటి కంటే ఎక్కువ ఉండటం ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి ఇవి..? వీటికి స్థానిక కథనాలు చాలానే ఉన్నాయి. రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాలకోసం ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేశాడు.. అందులో కిన్నెరుల కోసం ఏర్పాటు చేసిన ఆవాస స్థలమే కిన్నెర కైలాసం.. ఇక్కడ కిన్నెరులు తనను ఆరాధించటం కోసం స్వయంభువుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం..

శివుడి నిజనివాసం టిబెట్‌లోని కైలాస పర్వతం.. దీని చుట్టూ బయటి నుంచి ప్రదిక్షణ  చేయటమే గొప్ప సాహసం.. కిన్నెర కైలాసం అలాంటిది కాదు.. ఇక్కడికి శివలింగం వరకు వెళ్లి స్పృశించి వచ్చే అవకాశం ఉంది.. కాకపోతే కిన్నెర కైలాసం ఒక్కోసారి మౌంట్‌  కైలాస్‌నే తలపిస్తుంది. కొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే, మౌంట్‌ కైలాస్‌కు, దీనికి అస్సలు తేడా కనిపించదు.. కైలాస పర్వతం, కిన్నెరకు వచ్చేసిందా? అన్నంత కన్ఫూ్యజన్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ ప్రకృతి వింతను చూసి తీరాల్సిందే..

శివుడికి కైలాసాలు కేవలం రెండే కాదు.. మొత్తం అయిదు కైలాసాలు ఉన్నాయని చెప్తారు.. వీటిలో మొదటిది మౌంట్‌ కైలాస్‌..ఇది టిబెట్‌లో ఉంది. రెండవది కిన్నెర కైలాస్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉన్న గొప్ప పర్వతం ఇది. ఇక మూడవది మౌంట్‌ ఆది కైలాస్‌.. ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో ఉంది. దీన్ని చోటా కైలాస్‌ అని కూడా పిలుస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనే రాంపూర్‌ జిల్లాలో శ్రీఖండ్‌ కైలాసం ఉంది. ఇది నాలుగో కైలాసం. ఇదే రాష్ర్టంలో చంబా జిల్లాలో మణి మహేశ్‌ కైలాసం ఉంది.. మొత్తం అయిదు కైలాసాల్లో శివుడు ఆదిపురుషుడిగా, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నాడు.
భారత దేశ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో  హిమాలయాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మన దేశానికి సంబంధించి భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాలనుంచే ప్రారంభం అవుతుంది.. అక్కడే ముగుస్తుంది కూడా.. హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతం అంతా దేవతల భూమిగా, దేవ లోకంగా భారతీయులు గట్టిగా నము్మతారు.. అక్కడి వాతావరణం కూడా అదే విధంగా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతుంటుంది.. కిన్నెర కైలాసం అందులో పీక్‌ లెవల్‌లో ఉంది. దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది.

Friday, January 10, 2014

గౌరీపతి{నటరాజు}శివతాండవం,మంకణ మహర్షి కథ-శ్రీ శివ మహాపురాణము,అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు{పాణిని మహర్షి}

 గౌరీపతి{నటరాజు}

శివతాండవం

ఏమానందము భుమీతలమున !
శివతాండవమట ! శివలాస్యంబట !
అలలై , బంగారు
కలలై ,పగడపు( బులు(గులవలె మ
బులు విరిసినయవి
శివతాండవమట ! శివలాస్యంబట !
వచ్చిరొయేమొ! వి
యచ్చర కాంతలు
జలదాంగనలై విలోకించుటకు
శివలాస్యంబట !
యేమానందము భుమీతలమున !
పలికెడునవె ప
క్షులు ప్రా(బలుకులొ !
కల హైమావతీ
విలసన్నూపుర
నినాదములకు
న్నునుకరణంబులొ !
కొమ్మల కానం
దొత్సాహమ్ములు
మమ్మరముగ మన
ముల(గదలించెనొ!
తలనూచుచు గు
త్తులుగుత్తులుగా
నిలరాల్చును బూ
వులనికరమ్ములు
రాలెడు బ్రతి సుమ
మేలా నవ్వును !
హైమావతీ కుసు
మాలంకారము లందున ( దానొక
టౌదు నటించునొ !
లలితా మృదు మం
జులమగు కాయము
పూవుల తాకుల
తో వసివాడెదో ! భారతియుట పా
ర్వతికి నలంకా
రము(దీర్చెడునది!
రమణీయాస్మిత ముల( గావించెనొ
యలరులు మృదువులు !
చతురానును(డే
సవదరించునట శర్వనకుత్తమ
సర్పవిభూషులు !
వీచె విశబ్దిత
కీచకములు మృదు
వీచులు గా( ద
ర్పితలోకమ్ములు
మారుతములు గో
టీరి తాబ్జు(డగు
శివునకు సేవలు
జెల్లించుటకై

తకఝుం తకఝుం
తకదిరికిట నా
దమ్ములతో లో
కమ్ముల వేలుపు
నెమ్మిగ వెల(బడి
నృత్యమాడు నెడ
లయానుగతి(గ
మ్రమ్ముగా శ్రుతి(బ
టుటకో! గొంతులు
సవదరించు ను
త్కటభృంగమ్ములు
ఈ సెలకన్నెల కెవ్వరు జెప్పిరొ!
యా సర్వేశ్వరు
నభినయమహమును
కుచ్చెళ్లులెల్లెడ
విచ్చలవిడిగా
దుసికిళ్లాడ(గ
నసమున (బరుగిడు
ఓ హో హో హో !
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున !
సంధ్యాసతి ! యీ
సంభ్రమ మేమిటె !
నవకుసుంభరా
గవసనమేమిటె !
ఆకుంచిత తి
ర్యక్రపసారి ల
జ్జామధుర కటా
క్షపాతమేమిటె !
విలాసవక్రిత
విచలన్మధ్యం
బునహ్రీమతి ! నీ
వునువలెనే చిఱు
పలుకని మేఖిల
వాలక మేమిటె !
యెవ్వరికోసర మీబిబ్బోకము !
శివపూజకో ! యో
చెలువా ! యీ కధ
లెవ్వరు జెప్పిరె ?
యిలాతలంబే
ఆడెడునట నా
ర్యాప్రాణేశ్వరు(
డో దినమణి !నిలు
రా ! దినమింతయు(
బడమటీ దేశపు
వారలకీ కధ
నెఱిగించుటకై
పరుగెత్తెదవో !
అల మృగములు క
న్నుల బాష్పమ్ములు
విడిచెడు నెందుకు !
విశ్వేశ్వరునకు
అడుగులుగడుగుట
కై పాద్యంబో !!!
గుసగుసమని యీ
కిసలయములు స
మందపూరముగా
మాటలాదునెదొ!!!
యేమున్నది! లో కేశ్వరునాత్యమే
ఓ హో హో హో
ఊహాతీతం
బీయానందం
బిలాతలంబున!!!
  1. నటరాజు నామవాచకం. వ్యుత్పత్తి. నాట్యములో రాజు-- శివుడు
నటరాజు పరమ శివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి.కుడి వైపున వెనుక ఉండే చేయి ఢమరుకాన్ని కలిగి ఉంటుంది. ముందుకు ఉండే కుడి చేయి అభయ ముద్రను సూచిస్తుంటుంది. వెనుక వైపునున్న వామ హస్తం అగ్ని ని కలిగి ఉంటుంది. ముందువైపు ఉండే ఎడమచేయి గజహస్తం ముద్రలో ఉంటుంది. జులపాలు నలువైపులకు విసిరివేసినట్లు ఉంటాయి. ఝటాజూటంలో గంగాదేవి, అర్థ చంద్రాకారం ఇమిడి ఉంటాయి. ఆయన ఆకారం మొత్తం గుండ్రటి ప్రభామండలంలో అమర్చబడి ఉంటుంది.

శివాలయాలలో "వ్యాకరణ దాన మండప మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :

 నటరాజు

                                       "నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం"
"అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. 
నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది.
నర్తనమాడే శివుని పేరు నటరాజు. ఆయనను మించిన నర్తకుడు లేడు. తాండవాధినేత ఆయన. మహానటుడాయన. నటరాజు ప్రతిమని చూస్తే ఆ తలనుండి ఏదో బయటకు వస్తున్నట్టు కనబడుతుంది - అది గంగతో, నెలవంకతో - అలంకృతం, అవే శివుని జడలు. శివుడు నాట్యమాడుతూన్నంతసేపూ ఆ జడలు కూడ తిరుగుతూంటాయి. నర్తనమాగిపోగానే ఆ జడలు రెండువైపులా పరచుకుంటాయి. ఆ క్షణాన్నే శిల్పి ఊహించి రాతి ప్రతిమగా, లోహపు ప్రతిమగా చెక్కుతాడు.
నటరాజు చేతిలో డమరుకముంటుంది. మామూలుగా జోస్యం చెప్తూండేవాళ్ల చేతులలో ఉండేదాని కన్నా పెద్దదిగా ఉంటుంది. నర్తనం చేసేటప్పుడు శివుడు ఆ డమరుకాన్ని కూడ లయబద్ధంగా ఆడిస్తాడు. పై శ్లోకంలో ""ననాదఢక్కాం అన్న మాటకిదే అర్థం.
వాద్యాలనన్నిటినీ మూడు విధాలుగా విభజించ వచ్చు. అవి (1) చర్మవాద్యాలు - అంటే చర్మాన్ని ఉపయోగించేవి - ఢక్క, మృదంగం, మద్దెల, చెండ (కేరళలో) వంటివి (2) తంత్రీవాద్యాలు - వీణ, వయోలిన్‌ వంటివి - తంత్రులనుపయోగించేవి (3) వాయురంధ్ర వాద్యాలు - వీటిలో గాలిని కొన్ని రంధ్రాల ద్వారా బయటకు ఊదుతారు - వేణువు వంటివి.
చర్మవాద్యాలను పలికించటానికి చేతివేళ్లనిగాని, కఱ్ఱలనిగాని ఉపయోగిస్తారు. వాద్యం అంతం కావస్తున్నప్పుడు వేగంగా వాయిస్తారు. ""చోపు అంటారు దీనిని. ఆ విధంగానే నృత్యం చివరికి వస్తున్నపుడు (""నృత్తావసానే) చోపు ధ్వని వినబడింది.
నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనక, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థా్యన్ని ""దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు వన్నారు.
సనకాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులనీ సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకాది బుుషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనత్‌ కుమార,సనత్సుజాతులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ బుుషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే ""శివభక్తి సూత్రాలంటారు. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.
నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ""అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ""అష్టాధ్యాయి  అంటారు.
అ పధ్నాలుగు సూత్రాలనీ ""మహేశ్వర సూత్రాలు అంటారు.
    సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

 శివ మహాపురాణము

శౌనకాది మహర్షులు కోరికమేరకు, శివుడు నటరాజు మూర్తిగా మారుటకు ప్రేరకుడైన మంకణ మహర్షిలవారి కథ చెప్పాడు సూత పౌరాణికుడు.

"ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్తసారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే, శివజ్ఞానం తపస్సిద్ధిగా కలుగుతుంది. అది తెలుసుకున్న పరమశివభక్తుడు మంకణ మహాముని మహర్షుల ఉపదేశానుసారం, అతీర్థాన్ని చేరి, స్నానమాచరించి, ఆవొడ్డునే తపోనిష్ఠలో మునిగి పోయాడు. పంచాక్షరీజపం (ఓం నమశ్శివాయః)తో అతని శరీరం సూర్యసమాన తేజోవిరాజితం కాసాగింది. క్రమంగా భక్తిపారవశ్యంలో తాండవంచేయ సాగాడా మహర్షి. అంతటి భక్తికి మెచ్చి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ - మంకణుడు తాండవం ఆపడే!? శివుడు ఆమహర్షిని ఆపడానికి ప్రయత్నించి, ప్రశ్నలవర్షం కురిపించాడు ఎవరికోసం నీతపం? ఈ తాండవం ఏమిటి? నీ కోరిక లేమిటి? దేనికీ జవాబు చెప్పడాయె ముని. తాండవం ఆపడు.

దాంతో శివుడు ఉగ్రుడై - సహస్రశిర, కర, చరణ, సహస్రనేత్రాది విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభించాడు. ఆయనతో బాటూ ఒక స్త్రీమూర్తి కూడా ఉన్నది. ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దాంతో అతడికి జ్ఞానోదయం కలిగి "మహా నటరాజమూర్తి! శరణు! శరణు!" అంటూ సాష్టాంగ దండప్రణామం ఆచరించాడు. అంతట శివుడు శాంతించి, విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీమూర్తి కూడా అంతర్హితురాలైంది.

మంకణుడు ఆయనకు నమస్కరించి, "దేవాధిదేవా! మహాశివా! ఈ మహాతాండవమేమిటి? ఇంతవరకు మీ పక్కన నిలిచిన ఆ దేవీమూర్తి ఎవరు?" అని ప్రార్ధించగా "ఇది పరమేశ్వరుని దివ్యరూపం ! ఆ దివ్య మూర్తిని నేనే! నాతో ఉన్న దేవి ప్రకృతిరూపిణి. బ్రహ్మరూపుడనై నేను సకల చరాచరాలను పంచవింశతి (ఇరవైఐదు) తత్త్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణుల యందూ నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈతత్త్వం గ్రహించి, భక్తితో నన్ను ఉపాసించి శివ సాయుజ్యంపొందు" అని ఆనతిచ్చాడు పరమశివుడు.

కనుక - లింగరూపుడైనా, అర్థనారీశ్వరుడయినా, నటరాజు అయినా అంతా శివమయమే!" అని వివరించాడు రోమహర్షణ పుత్రుడు.

బ్రహ్మ, తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరితుడై తన దేహాన్ని అర్థనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా (మధనం లోంచి) స్వాయం భువ మనువు పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంధానం గావించాడు బ్రహ్మ. వీరివల్ల వరుసగా వారికి ముగ్గురు పురుషులు, ముగ్గురు స్త్రీలు సంతానమై జన్మించారు. వీరిలో మూడవస్త్రీ సంతానమైన ప్రసూతిని దక్షప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. 'సతీ'దేవిగా - జ్యేష్ఠురాలిగా పార్వతి జన్మించింది - ఈ దక్షునికే. అయితే ఈయన మరొకభార్య అయిన వీరిణి (అసిక్నీ) యందు సతీదేవిగా పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది.


మన్మధుణ్ణి ప్రేరేపించి, రెండుసార్లు తపోనిష్ఠా గరిష్ఠుడై వున్న శివునిమీదికి దండయాత్ర చేయించి పరాభూతుడైవున్న బ్రహ్మ, ఏం చెయ్యాలాఅని చతుర్ముఖాలతోనూ ఎన్నెన్నో చతురోపాయాలు వెతికాడు. ఏవీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక, నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచినదే తడువుగా ప్రత్యక్షమై "కుమారా! ఏమిటి నీకొచ్చిన కష్టం?" అని అరాతీశాడు - ఎంతో వాత్సల్యంగా.

జరిగిందంతా వివరంగా చెప్పి "ఏది ఏమైనా సరే! అ కాలకంఠుని కాంతాదాసునిగా చెయ్యాలి. కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి" అని వేడుకున్నాడు.

"ఇంతేకదా! ఇదేమంత గొప్పసంగతి? గతంలో ఓసారి రుద్రుడు తన పుర్ణావతారం అనీ, తనతోపాటు చరించే మాయను 'సతీ' భావంతో గ్రహించి రుద్రాణిని చేస్తానని అన్నాడు కదా! ఇదంతా మన సంకల్పం కాదు! ఆ పరమమాహేశుని సంకల్పమే! నువ్వు ఆ పరాంబికను వేడుకుని, సతిగా అవతరించమని కోరు. అలాగే - దక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు!" అంటూ ఉపదేశించి అంతర్థానమయ్యాడు శ్రీహరి.


దక్షుడిని రప్పించాడు పరమేష్టి. "జగన్మాతయైనట్టి మహామాయ గూర్చి తపస్సు చేసి, నీ కుమార్తెగా అవతరించమని కోరుకో!" అని అదేశించి, తానుకూడా ఆ జగజ్జననిని ప్రార్థించాడు - ప్రజాపతి.

అమ్మవారు ప్రత్యక్షమై, శివసంకల్పాన్ని ఆకళింపు చేసుకుని బ్రహ్మ కోరిన విధంగా - శివదీక్షకు మంగళాంతం చెప్పించి, తాను అతని పత్నిగా అవతరించ నిర్ణయించుకుంది సర్వమంగళ. బ్రహ్మకు అభయ ప్రదానం చేసి, అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందనీ - అదే తనకు మహాభాగ్యమనీ బ్రహ్మాదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తథాస్తు! అని ఆమె అంతర్హితురలైంది.

యక్ష రాక్షస గరుడ దంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాలూ ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అని శరణువేడుతాయో, ఆ మహాదేవి పాపగా అవతరించి, దక్షునికిచ్చిన వరం ప్రకారం, 'ఉమ' అనే నామధేయంతో పెరగసాగింది.

ఆమెకు యుక్తవయస్స రాగా, బ్రహ్మాదులందరూ, ఇక శివునిచేత గృహస్థాశ్రమం స్వీకరింపజేసే తరుణం వచ్చిందని తలపోసి - ఉమను శివపంచాక్షరీ మంత్రస్మరణ ద్వారా, సర్వకాల సర్వావస్థల యందూ శివాయత్త చిత్తతతో ఉండమని వేడుకుని, శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు.

దేవతలంతా తమ మానసాన్ని అ పరమశివుని ఎదుటపరిచి, పరిపరి విధాల ప్రార్థించగా, ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారందరూ.

కానీ, శివుడు ఒక షరతు విధించాడు -

తాను నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాననీ; తనను వరించబోయే లలనామణి, ఏనాడూ తన సాధనకు అడ్డుకారాదనీ; తాను కాముకుడిగా సంచరించువేళ మాత్రమే ఆమె కాముకి కావాలనీ; తనకు సానుకూలంగా వర్తిల్లగలిగే పిల్లనే పెళ్లాడగలననీ పరమశివుని వాక్యసారాంశం. సరే నన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయణి విషయాన్ని, శివుని చెవిన వేసి - ఔననిపించుకున్నాక గాని, వారి హృదయాలు తేలికపడలేదు.
 అష్టాధ్యాయి

3.అష్టాధ్యాయి మహేశ్వర సూత్రాలు

అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అనెదరు. ఆ గ్రంధమున ఎనిమిది (8)అధ్యాయములు కలవు. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు కలవు.

 4.పాణిని మహర్షి:

సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు            
పాణిని అనే మహర్షి వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణం గ్రంథం. ఈయన క్రీ.పూ. 7వ శతాబ్దికి చెందినవాడు. మాహుర్ అనే పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతమిది పాకిస్థాన్లో ఉంది. ఇతడు పుట్టుకతోనే తెలివైన వాడు కాదట. మందమతిగా ఉండేవాడు. తండ్రి ఇతనిని విద్యాభ్యాస నిమిత్తం గురుకులంలో చేర్పించాడు. మందమతి కావడం వల్ల చదువొచ్చేది కాదు. అతనిని భరించలేక, అతడి వల్ల మిగతా పిల్లలు కూడా పాడవుతారని గురువుగారు అతడిని ఆశ్రమం నుండి పంపిచేశారు. అతడు బాధతో ఇంటికి వెళ్ళక హిమాలయాలకు పోయి శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శివ దర్శనం అయి ఆయన 14సార్లు మ్రోగించిన ఢమరుక నాదము అతడికి 14 సూత్రాలుగా వినిపించాయి. దానితో అతడు కావ్య రచన చేశాడు. అలా అతడు వ్రాసినదే అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణ గ్రంథం.