- గంగను ధరించిన వాడు..... శివుడు.
- గంగ + ధరుడు=గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.
- గంగాదేవి హిమవంతుని పెద్దకూతురు. (చిన్న కూతురు - పార్వతి). భగీరథుడు గంగను భువికి తరలించే ప్రయత్నంలో శివుని జటలలో చిక్కుకొనుటవలన, శివున్ని గంగాధరుడు అంటారు. కొందరు కవులు, గంగా-శంకరుల సమాగముగా వర్ణిస్తారు. ఈవిధంగా గంగ, శివుని రెండవ ఇల్లాలు అని ఒక భావం.
- శివుని జటాజూటములలో చిక్కుబడినపిమ్మట, భగీరథుని ప్రార్థనమేరకు గంగను బిందు సరోవరంలోనికి విడుస్తాడు. అక్కడనుంచి గంగ 7 అంశలతో (పాయలతో) ప్రవహిస్తుంది. హ్లాదిని, పావని, నళిని (బ్రహ్మపుత్ర) పాయలు తూర్పు ముఖముగా; సుచక్షు, సీత, సింధు పశ్చిమాభిముఖముగా; ఏడవపాయ భగీరథున్ని అనుసరిస్తాయి. భగీరథున్ని అనుసరించిన సప్తమి మార్గమధ్యమున జహ్నుమహర్షి యఙ్ఞశాలను ముంచేస్తుంది. కృద్ధుడైన మహర్షి భాగీరథీ జలమంతటినీ మ్రింగేస్తాడు. భగిరథుని, దేవతల ప్రార్థన మేరకు చెవుల ద్వారా గంగని విడుస్తాడు. ఈ విధంగా గంగ, జాహ్నవిగా సరికొత్త అవతారము ఎత్తినది.
ఈ విధంగా భూమ్మీద నదీ జలాలన్నీ గంగా దేవి స్వరూపాలే.
1.మేన-హిమవంతుల జ్యేష్ట పుత్రిక - శివుని రెండవ ఇల్లాలు.
2.బిందుసరోవరమున పుట్టిన ఏడుగురు అక్కచెల్లెళ్ళు: హ్లాదిని, పావని, నళిని, సుచక్షు, సీత, సింధు, సప్తమి.
3.భగీరథుని పుత్రిక - భాగీరథి (సప్తమి).
4.జహ్ను మహర్షి పుత్రిక - జాహ్నవి.
మహాభారతమున ప్రతీపుని కోడలు, శంతనుని భార్య అయిన గంగ జాహ్నవి. అష్టవసువులను భూమ్మీద జన్మించమని వశిష్టమహర్షి శపించగా, వారు హిమవంతుని పుత్రిక అయిన గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగాపుత్రులుగా జన్మించిన వెనువెంటనే దేహవిముక్తిని కోరతారు. ఎనిమిదవ వసువు ప్రభాసుడు -శాపానికి మూలకారణమైనవాడు కావున, గంగా పుత్రునిగా చిరకాలం జీవిస్తాడు. గంగ జాహ్నవిగా అవతరించిన పిమ్మట, అష్ట వసువులు జాహ్నవీ-శంతనుల పుత్రులుగా జన్మిస్తారు. ప్రభాసుడు దేవవ్రతునిగా (భీష్ముడు) పెరుగుతాడు. - గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథంతాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
Thursday, January 9, 2014
గంగాధరుడు
Subscribe to:
Post Comments (Atom)
స్వాగతం
ReplyDeleteఆసక్తికరమైన బ్లాగ్.
పోస్ట్ ధన్యవాదాలు మరియు బ్లాగ్ సందర్శించండి.
నేను రాసిన మెయిల్ తనిఖీ.
మంచి ఆరోగ్యం మరియు సాధనల పూర్తి ఒక సంవత్సరం.
Vilhelm
Animated Gif Free
Coltisor de Rai