సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 26, 2014

శ్రీవారి‬ పచ్చకర్పూరoయోక్క మహిమ!

శ్రీవారి‬ పచ్చకర్పూరoయోక్క మహిమ!
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కలియుగ ‪‎వైకుంఠంశ్రీవేంకటేశ్వరస్వామికి‬ ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుది.
ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న‬ పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.
వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర‬ కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అనుకున్న కార్యాలు‪ దిగ్విజయంగా‬ పూర్తవుతాయి.
స్వామివారి‬ పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.
అలాగే స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా‬ పెట్టి దానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో ‪‎గౌరవమర్యాదలు‬ లభిస్తాయి.
స్వామివారి పచ్చకర్పూరం, పాలతో మంగళవారం ‪‎సుబ్రహ్మణ్యస్వామికి‬ అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది.

No comments:

Post a Comment