సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 29, 2014

శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః

Ramudu Thota Venkataramana's photo.
నమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః |1|
నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరిమాత్మనే |2|
నమస్సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ |3|
మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ |
యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ |4|
యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో థిపమ్ |5|
శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రహ్మణ ప్రియమ్ |
కపర్దినం కళాముర్తి మమూర్తి మమరేశ్వరమ్ |6|
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగరిమ్ |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ |7|
కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |
నమామి గిరిశం దేవం చంద్రావ్యవభూషణమ్ |8|
త్రిలోచనం లేలిహాన మాదిత్యం పరమేష్టినమ్ |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ |9|
ఇతి శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః సంపూర్ణమ్..

Ramudu Thota Venkataramana's photo.
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
తత్పురుష‬ ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)...

No comments:

Post a Comment